నేల తల్లి బిడ్డలపై నిలువెల్లా విషం
వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని 2014 ఎన్నికల్లో హామీ
తొలి సంతకం దానిపైనే అంటూ ప్రగల్భాలు
తీరా రుణాలన్నీ మాఫీ అనలేదంటూ బుకాయింపు
బంగారం తాకట్టు, పంట రుణాలు మాఫీ చేయబోనని మాట మార్పు తప్పని స్థితిలో కోటయ్య కమిటీ ఏర్పాటు
2014 ఏప్రిల్ 11 నాటికి రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు
మాఫీ మొత్తం రూ.25 వేల కోట్లకు కుదింపు
కంటితుడుపుగా కొందరికి చిల్లర విదిలింపు
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానంతో రైతుల గందరగోళం
అన్నదాతల ఆశలకు ఘోరీ కట్టిన చంద్రబాబు
రైతాంగానికి చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. అసలు వ్యవసాయమే దండగ అని చెప్పిన ఘనుడు. నేల తల్లిని నమ్ముకున్న రైతుల్ని నిట్టనిలువునా ముంచేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. చివరికి అధికారంలోకి రావడానికి వక్రమార్గాలన్నీ ఎంచుకుని అబద్ధాలతో ఐదేళ్లపాటు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఆయన జీవితమంతా అబద్ధాలతోనే గడిచిపోయింది.
‘పులి–బంగారు కడియం’ కథలో మాదిరిగా బాబు గద్దెనెక్కడానికి చేయని వాగ్దానం లేదు. కుర్చీ ఎక్కగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రూ.87,612 కోట్ల రుణాలను రూ.25 వేల కోట్లకు కుదించి, చివరికి రూ.15 వేల కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తులమారి ‘నారా’ కపట నాటకానికి రైతులు ఆత్మార్పణం చేసుకోవలసి వచి్చంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. అలాంటాయన ఇప్పుడు మళ్లీ మన ముందుకు సరికొత్త కపట హామీలతో వస్తున్నారు.
సాక్షి, అమరావతి: వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తాను చెప్పలేదన్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న చంద్రబాబు తీరా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఫైలుపై సంతకం చేయకపోగా, రుణ మాఫీలో ఎలా కోతలు పెట్టాలనే అలోచనతో కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అదీ పంట రుణాల మాఫీకి మా త్రమే లబ్ధిని పరిమితం చేశారు.
కోటయ్య కమిటీ లో చంద్రబాబు తనకు అత్యంత ఇషు్టడైన కుటుంబరావును చేర్చారు. అప్పటి నుంచి వ్యవసాయ రు ణాల మాఫీని ఎలా కుదించాలనే దానిపై కసరత్తు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త విధానా న్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు.
షరతులతో కత్తెరలు
రైతులకు బ్యాంకులు నిర్ధారించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ పంట రుణాలిస్తే ఆ రుణాలు మాఫీ పరిధిలోకి రావంటూ కత్తెర పెట్టారు. ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఎంత రుణం తీసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి రూ.1.50 లక్షల వరకే మాఫీ అని షరతు విధించారు.
బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సమయంలో పంట రుణాలని రాయకపోతే వాటిని రుణ మాఫీ నుంచి తొలగించేశారు. రైతులు ఆధార్, రేషన్ కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. తొలుత 2014 మార్చి వరకు ఉన్న రుణాలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి తరువాత 2013 డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణాలు, వడ్డీ మా త్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకే సారి రుణ మాఫీ సాధ్యం కాదని, దశల వారీగా చేస్తామ ని ఎక్కువ మంది రైతుల ఖాతాలను తప్పించేశారు.
మాట మార్చి.. రైతులను ఏమార్చి
2014 జూన్ 29న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కో ట్లు, డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయ ని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. ఒకే సారి రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తే అభ్యంతరం లేదని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వానికి తెలిపారు.
అయితే రుణాల మాఫీ తరువాత చూద్దమని ముందుగా గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావం గల 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్‌పై ఆర్‌బీఐతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్‌బీఐ మొత్తం మండలాల్లో రైతు ల రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది.
వడపోతలు, ఏరివేతలు తరువాత మొత్తం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో కేవలం 25 వేల కోట్లకు రుణ మాఫీని కుదించేసి నాలుగు దశల్లో చెల్లిస్తామని షరతులు విధించింది. తొలుత రూ.50 వేలలోపు చెల్లిస్తామని, రూ.50 వేలు దాటిన రుణాలకు రైతు ధ్రువీకరణ పత్రాలను చెల్లిస్తామని మోసం చేశారు.
నమ్మక ద్రోహానికి ఫలితంగా ఆత్మహత్యలు
2019 ఎన్నికల ముందు నాటికి కేవలం రూ.15 వేల కోట్ల లోపు మాత్రమే రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. అరకొర రుణ మాఫీతో రైతులు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయారు. వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది.
మరో పక్క 2015 ఏడాది నుంచి 2016 వరకు వ్యవసాయ రుణాల కోసం బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి 35,24,549 మంది రైతులు రూ.26,055.18 కోట్లు పంట రుణాలు తీసుకుంటే అందులో సవాలక్ష షరతులు విధించి కేవలం రూ.3,366.80 కోట్లకు మాఫీని కుదించారు.
దీంతో బంగారంపై రుణాల తీసుకున్న రైతుల పేర్లతో బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిపై పత్రికల్లో ప్రకటనలు వేశాయి. దీంతో చాలా మంది రైతుల ఆత్మాభిమానం కోల్పోయి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment