crop loans
-
రబీ సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్ కలిసి రాలేదు. వరుస వైపరీత్యాలకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఖరీఫ్‌లో రైతులు దెబ్బ తిన్నారు. అతి కష్టం మీద లక్ష్యానికంటే తక్కువగా 69.70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా, పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ముందస్తుగా రబీ సాగుకు సన్నద్ధమయ్యారు. ఆ మేరకు రబీ 2024–25 ప్రణాళికను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రబీ సాధారణ విస్తీర్ణం 56.58 లక్షల ఎకరాలు. ఈ ఏడాది సాగు లక్ష్యం 57.65 లక్షల ఎకరాలుగా నిర్దేశించారు. 19.87 లక్షల ఎకరాల్లో వరి, 11.17 లక్షల ఎకరాల్లో శనగ, 8.44 లక్షల ఎకరాల్లో మినుము, 5.23 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 2.74 లక్షల ఎకరాల్లో జొన్న, 2.51 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.46లక్షల ఎకరాల్లో పెసలు, 1.77లక్షల ఎకరాల్లో పొగాకు పంటలు సాగు చేయనున్నారు. కాగా ఈ ఏడాది 94.69 లక్షల టన్నుల దిగుబడులు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్దేశించింది. రబీకి 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనం రబీ కోసం 8.88 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. రూ.94.96 కోట్ల సబ్సిడీతో 3.85 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు. సీజన్లో 2.64 లక్షల క్వింటాళ్ల శనగ విత్తనం అవసరం కాగా, ఇప్పటివరకు 26 వేల క్వింటాళ్లను సిద్ధం చేశారు. వరి, ఇతర విత్తనాలను ఈ నెల 25వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 50,076 క్వింటాళ్ల వరి, 45,647 క్వింటాళ్ల వేరుశనగ, 16,249 క్వింటాళ్ల మినుము విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఎరువుల సరఫరాలో ఆర్బీకేలకు కోత ఈ ఏడాది 20.05లక్షల టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 6.95 లక్షల టన్నుల ఎరువులు ఉండగా, కేంద్రం నుంచి ఈ నెలలో 1.47 లక్షల టన్నులు వచ్చాయి. ప్రస్తుతం 8.42 లక్షల టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. గత నాలుగేళ్లుగా సబ్సిడీ విత్తనం, ఎరువుల పంపిణీలో రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అధిక ప్రాధాన్యతనిచ్చారు. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆర్బీకేలకు ప్రాధాన్యత లేకుండా చేసింది. గడిచిన ఖరీఫ్‌లో అతికష్టమ్మీద 1.50 లక్షల టన్నుల ఎరువులను మాత్రమే ఆర్బీకేల ద్వారా సరఫరా చేశారు. రబీలో కూడా ఆర్బీకేలకు సరఫరాలో భారీగా కోత పెడుతున్నారు. రబీలో రూ.68వేల కోట్లు పంట రుణాలు ప్రస్తుత రబీలో రైతులకు లక్ష కోట్ల రుణ పరపతి కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించారు. దాంట్లో రూ.68,060 కోట్లు పంట రుణాలు, 32,390 కోట్లు టర్మ్ రుణాలు ఇవ్వనున్నారు. గతేడాది 3.60 లక్షల మంది కౌలుదారులకు రూ.4,100 కోట్లు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం 5 లక్షల మందికి రూ.5 వేల కోట్లు రుణాలివ్వాలని నిర్ణయించారు. -
తప్పుడు వివరాలిస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: పంటరుణాలకు సంబంధించి తప్పుడు సమాచారమిచ్చే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల వారీగా క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పిస్తున్నామని, ఒక సొసైటీ పరిధిలో ఒకే రోజు ఐదువందల మందికి రుణాలు ఇచ్చినట్లు సమాచారం వచి్చందని, ఇదే తరహాలో 7 బ్యాంకులు సమాచారం ఇచ్చాయన్నారు.వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని, ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో రుణ మంజూరుకు కారణాలను పరిశీలించి నిర్ధారించుకుంటామన్నారు. తప్పుడు సమాచా రం ఇచ్చినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం సచివాలయంలో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్‌రావుతో కలిసి తుమ్మల మీడియాతో మాట్లాడారు.రుణమాఫీకి 25 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తా యని ప్రాథమికంగా భావించామని, అయితే, రాష్ట్రవ్యాప్తంగా 32 బ్యాంకుల ద్వారా రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి సంఖ్య 44 లక్షలు ఉందన్నారు. కుటుంబం యూనిట్‌గా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తామని, ఈ కా ర్డు లేని వారిని పాస్‌బుక్ ఆధారంగా గుర్తిస్తామన్నారు.రుణమాఫీ చేయకుంటే ఉరితీయండి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంటరుణ మాఫీ చారిత్రక నిర్ణయమని తుమ్మల చెప్పారు. అన్నదాతకు లబ్ధి చేకూరే ఈ పథకంపై రాజకీయ నేతలు తప్పుగా మాట్లాడొద్దని, అర్హత ఉన్న ప్రతి రైతుకూ పంటరుణాన్ని మాఫీ చేస్తామన్నారు. నెలరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏవైనా అనుమానాలు ఉంటే రైతు వేదికల వద్ద వ్యవసాయాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఇంకా నాలుగున్నరేళ్లపాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని, రుణమాఫీ చేయకుంటే తమను ఉరితీయాలని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రూ.లక్షలోపు రుణమాఫీ చేశామని, త్వరలో రూ.1.5 లక్షలలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, ఆ తర్వాత రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామన్నారు. రూ.1.50 లక్షలు, రూ.2 లక్షల రుణమాఫీ లబి్ధదారులు ఎంతమంది ఉన్నారో ఇప్పుడు చెప్పలేమని, నిధులు విడుదల సమయంలో వెల్లడిస్తామని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.మొత్తంగా రూ.31 వేల కోట్ల మేర రుణమాఫీ జరుగుతుందని, ఇప్పటివరకు చేసిన రూ.లక్ష లోపు మాఫీ ద్వారా 11 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని వివరించారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత కలెక్టరేట్లో లేదా వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి కారణాలు తెలుసుకోవచ్చన్నారు. -
'రేషన్' ఉంటేనే మాఫీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాల మాఫీ రేషన్‌కార్డు ఉన్నవారికే అమలుకానుంది. ఆహార భద్రత కార్డుల ఆధారంగానే రైతు కుటుంబాలను గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులను తేల్చడానికి.. బ్యాంకుల్లో రైతుల రుణఖాతాలోని ఆధార్‌ను.. పట్టాదారు పాస్‌బుక్ డేటాబేస్‌లో ఉన్న ఆధార్‌తో, పీడీఎస్ (రేషన్) డేటాబేస్‌లోని ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్టు పేర్కొంది. అర్హులుగా తేల్చిన ఒక్కో రైతు కుటుంబానికి 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్య ఉన్న పంట రుణాల బకాయిల్లో రూ.2 లక్షల వరకు మాఫీ చేయనున్నట్టు ప్రకటించింది. తప్పుడు పత్రాలతో రుణమాఫీ పొందినట్టు తేలితే ఆ మొత్తాన్ని రికవరీ చేస్తామని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు సోమవారం ‘పంట రుణ మాఫీ పథకం–2024’ మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను తెలుగులో విడుదల చేయడం విశేషం. పథకం అమలు ప్రక్రియ, ఏర్పాట్లు చేసేదిలా.. ⇒ వ్యవసాయ శాఖ డైరెక్టర్ పంటల రుణమాఫీ పథకాన్ని అమలు చేసే అధికారిగా ఉంటారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ పథకానికి ఐటీ భాగస్వామిగా ఉంటుంది. ⇒ వ్యవసాయశాఖ డైరెక్టర్, ఎన్ఐసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్‌ను నిర్వహిస్తాయి. ఈ పోర్టల్‌లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ ఐటీ పోర్టల్‌లోనే.. ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్‌కు బిల్లులు సమర్పించడానికి, రుణమాఫీ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా మాడ్యూల్స్ ఉంటాయి. ⇒ ఈ పథకం అమలుకోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (బీఎస్ఐ) నియమించాలి. ఆ నోడల్ అధికారులు తమ బ్యాంక్ పంట రుణాల డేటాపై డిజిటల్ సంతకం చేయాలి. ⇒ ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) నుంచి.. రిఫరెన్స్–1 మెమో, ప్రొఫార్మా– 1లో డిజిటల్ సంతకం చేసిన టేబుల్‌ను ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సీబీఎస్‌లో లేవు కాబట్టి.. ప్యాక్స్‌కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్, రిఫరెన్స్–2వ మెమో, ప్రొఫార్మా–2లో డేటాను డిజిటల్‌గా సంతకం చేసి సమర్పించాలి. ⇒ ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడమే.. అవసరమైతే వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఎన్ఐసీ డేటా వ్యాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి. ⇒ అర్హతగల రుణమాఫీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో (డీబీటీ పద్ధతిలో) జమ చేస్తారు. ప్యాక్స్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డీసీసీబీ, బ్యాంకు బ్రాంచికి విడుదల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణమాఫీ మొత్తాన్ని ప్యాక్స్‌లో ఉన్న రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ⇒ ప్రతి రైతు కుటుంబానికి రుణమొత్తం ఆధారంగా ఆరోహణ క్రమంలో మాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ⇒ కటాఫ్ తేదీ నాటికి ఉన్న మొత్తం రుణం, లేదా రూ.2 లక్షలు.. వీటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది. ⇒ ఏదైనా రైతు కుటుంబానికి రూ.2 లక్షలకుపైగా రుణం ఉంటే.. రైతులు అదనంగా ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తర్వాతే రూ.2లక్షల మొత్తాన్ని రైతు కుటుంబ సభ్యుల రుణ ఖాతాలకు బదిలీచేస్తారు. ⇒ రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణమున్న పరిస్థితులలో.. కుటుంబంలో మహిళల పేరిట ఉన్న రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగతా మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలోని పురుషుల పేరిట ఉన్న రుణాలను మాఫీ చేస్తారు. వీరికి రుణమాఫీ వర్తించదు ⇒ పంట రుణమాఫీ పథకం ఎస్‌హెచ్‌జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్‌ఈసీఎస్‌లు తీసుకున్న రుణాలకు వర్తించదు. ⇒ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తించదు. ⇒ కంపెనీలు, సంస్థలు తీసుకున్న పంట రుణాలకు వర్తించదు. అయితే ప్యాక్స్‌ల ద్వారా తీసుకున్న పంట రుణాలకు వర్తిస్తుంది. ⇒ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం మినహాయింపుల నిబంధనలను.. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఆచరణాత్మకంగా అమలు చేయడం కోసం వీలైనంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు. మార్గదర్శకాల మేరకు బ్యాంకులు, రైతుల బాధ్యతలివీ.. ⇒ ప్రతి బ్యాంకు ప్రభుత్వం ఇచ్చిన ప్రొఫార్మాలో డేటాను ప్రభుత్వానికి సమర్పించాలి. ⇒ పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంటుపై, రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బీఎన్‌వో డిజిటల్ సంతకం చేయాలి. నిర్ణీత మార్గదర్శకాలను ఉల్లంఘించి డేటాను సమర్పించినట్టు భవిష్యత్తులో గుర్తిస్తే చట్టప్రకారం బ్యాంకులపై చర్యలు ఉంటాయి. ⇒ ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు గుర్తించినా, లేదా మోసపూరితంగా పంటరుణం పొందినట్టుగానీ, అసలు పంట రుణమాఫీకి అర్హులుకారని తేలినా.. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్‌కు అధికారం ఉంటుంది. ⇒ రైతుల రుణఖాతాల్లోని డేటా యదార్థతను నిర్ధారించేందుకు... సహకార శాఖ డైరెక్టర్, సహకార సంఘాల రిజి్రస్టార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ముందస్తు శాంపిల్ ప్రీఆడిట్‌ను చేపట్టాలి. అమలు అధికారికి ఆ వివరాలను అందజేయాలి. ⇒ రుణమాఫీ పథకంపై రైతుల సందేహాలను, ఇబ్బందులను పరిష్కరించడానికి వ్యవసాయశాఖ డైరెక్టర్ ఒక పరిష్కార విభాగాన్ని ఏర్పాటు చేయాలి. రైతులు తమ ఇబ్బందులపై ఐటీ పోర్టల్ ద్వారా లేదా మండల స్థాయిలో నెలకొల్పే సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి అభ్యర్ధనను సంబంధిత అధికారులు 30 రోజుల్లోపు పరిష్కరించి, దరఖాస్తుదారుకు వివరాలు తెలపాలి. -
రుణమాఫీపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణమాఫీపై తాజాగా ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ప్రతీ కుటుంబం, రేషన్ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.కాగా, రైతుల రుణమాఫీపై తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలను సోమవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ప్రతీ యూనిట్లో మొదట మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఆ తర్వాత ప్రాధాన్యత ప్రకారం రుణాలను మాఫీ చేయనున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అయితే, రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక, చిన్న మొత్తంలో రుణమాఫీలను చేసిన తర్వాతే పెద్ద అమౌంట్‌ను మాఫీ చేయనున్నారు. స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు. అలాగే.. రెండు లక్షల పైబడి ఉన్నా రుణాలకు రైతులే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు. పీఎం కిసాన్ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది. ఇక, 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు. ఇక, ఒకవేళ తప్పుగా ఎవరైనా రుణమాఫీ తీసుకుని ఉంటే వారికి డబ్బులు చెల్లించినట్టు అయితే, మళ్లీ డబ్బులను వారి వద్ద నుంచి ప్రభుత్వం తీసుకోనుంది. -
కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ!
సాక్షి, హైదరాబాద్: కుటుంబం యూనిట్‌గా పంటల రుణమాఫీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒక కుటుంబంలోని వారి పేరిట బ్యాంకుల్లో పంట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కసరత్తు పూర్తయిందని.. నేడో, రేపో మార్గదర్శకాలు విడుదల కావొచ్చని తెలిపాయి. ఒక కుటుంబాన్ని ఎలా లెక్కలోకి తీసుకోవాలన్న దానిపై అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికి వచి్చనట్టు తెలిసింది. రేషన్‌కార్డుగానీ, గ్రామ పంచాయతీ రికార్డుగానీ, వ్యవసాయశాఖ వద్ద ఇప్పటికే ఉన్న డేటాను ఆధారం చేసుకొనిగానీ కుటుంబాలను అంచనా వేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అనంతరం ఒక రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంకు ఖాతాలు, వాటిలో ఎన్ని పంట రుణాలు ఉన్నప్పటికీ.. మొత్తం రూ.2 లక్షల వరకే మాఫీ చేయనున్నారు. రుణాలు ఉన్న కుటుంబ సభ్యుల మధ్య దామాషా ప్రకారం ఈ మాఫీ సొమ్మును విభజిస్తారు. ఒక కుటుంబం అంటే.. భర్త, భార్య, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మార్గదర్శకాలు విడుదలైన వెంటనే గ్రామాల వారీగా రైతుల జాబితా తయారు చేస్తారు. బ్యాంకుల అధికారులతో కలసి రుణాలున్న వారి జాబితా తయారు చేస్తారు. చివరగా గ్రామసభలో చర్చించి తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. పీఎం కిసాన్ నిబంధనల అమలు యోచన! వచ్చే నెల 15వ తేదీ నాటికి పంట రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేశారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఐదేళ్లలో రాష్ట్ర రైతులు తీసుకున్న రూ.2 లక్షల మేరకు పంట రుణాలను మాఫీ చేయనున్నారు. దాదాపు 47 లక్షల మంది రైతులకు దీనితో లబ్ధి జరుగుతుందని అంచనా. అయితే రుణమాఫీ కోసం పీఎం కిసాన్ పథకంలోని మార్గదర్శకాలను అమలు చేసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. పీఎం కిసాన్ పథకంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ పన్ను చెల్లించేవారిని మినహాయించారు. అదే తరహాలో ఇప్పుడు రుణమాఫీని మినహాయించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఆదాయ పన్ను చెల్లించే అందరినీ కాకుండా అధిక ఆదాయం ఉన్నవారిని మాత్రమే మినహాయించే ఆలోచన ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరినీ మినహాయించకుండా.. అటెండర్లు వంటి చిన్నస్థాయి ఉద్యోగులకు రైతు రుణమాఫీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని.. మిగిలే మొత్తం ఎక్కువగా ఉంటేనే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేయాలని, లేకుంటే ఉదారంగానే రుణమాఫీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా పంటలు పండించే ప్రతి రైతుకు ప్రయోజనం కలిగించేలా పథకం అమలు జరుగుతుందని అధికారులు అంటున్నారు. బంగారం పెట్టి తీసుకున్న రుణాలు కూడా..! బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్‌బుక్‌ను జతచేసి, పంటల కోసం తీసుకున్న బంగారం రుణాలకు మాత్రమే రుణమాఫీ చేయాలని భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలను మాఫీ నుంచి మినహాయించాలనే యోచన ఉన్నట్టు సమాచారం. గతంలోనూ ఇదే తరహా నిబంధనలు అమలు చేశారు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లు, కో–ఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు (అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకులు సహా), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. -
రుణమాఫీ ‘లెక్క’ తీయండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి అవసరమైన లెక్క అంతా సిద్ధం చేయాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. మాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించాలని సూచించారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో రేవంత్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయిలో రైతుల వివరాలను సేకరించి, అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్పష్టమైన ప్రణాళికతో రండి.. బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్‌ల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. రూ.2 లక్షల వరకు రుణాల మాఫీకి సంబంధించిన డేటా, అవసరమైన నిధుల అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాలని తేలి్చచెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒకేసారి మాఫీతో ఇబ్బంది అంటూ..! రుణమాఫీకి నిధుల జమ విషయంలో ఇబ్బందులను కొందరు అధికారులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచి్చనట్టు తెలిసింది. సుమారు రూ.35 వేల కోట్ల వరకు నిధులను జమ చేయడం అంత సులువైన విషయం కాదని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ చేసి తీరాల్సిందేనని, అందుకు మార్గాలను అన్వేషించాలని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. రుణాలున్న ప్రతీ రైతుకు లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు తయారు చేయాలని కూడా సూచించినట్టు సమాచారం. ఇప్పటివరకు కొన్ని బ్యాంకుల నుంచి రైతు రుణాల సమాచారం వచి్చందని, మిగతావాటి నుంచి కూడా డేటా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అయితే రుణమాఫీకి అర్హులైన రైతులు ఎంతమంది ఉంటారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు అంటున్నారు. -
రైతుల ‘వేలం’వర్రీ!
సాక్షి, హైదరాబాద్: పాడి గేదెల పెంపకం కోసమో, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, ఇతరత్రా అవసరాల కోసమో తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను సహకార బ్యాంకులు రైతుల ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. కొన్నిచోట్ల వారు తాకట్టు పెట్టిన భూముల్ని వేలం వేసి మరీ బకాయిలను రాబట్టుకుంటున్నాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలు, పంట రుణాలు తిరిగి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తున్న వివిధ జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీలు).. నిస్సహాయ పరిస్థితుల్లో రుణాలు చెల్లించని వారి భూములు, ఇతర ఆస్తులను వేలం వేస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతాంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలానా రోజు ఫలానా రైతు భూమిని వేలం వేస్తున్నామంటూ గ్రామాల్లో చాటింపు వేయిస్తుండటంతో పరువు పోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెల్లించాల్సిన రుణం తక్కువగా ఉన్నా మొత్తం భూమిని డీసీసీబీలు వేలం వేస్తుండటంతో తమకు భూమి లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల విషయంలోనే కఠిన వైఖరి? రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్) ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. దాని పరిధిలో జిల్లా స్థాయిలో డీసీసీబీలు ఉంటాయి. వాటి కింద ప్యాక్స్ పని చేస్తుంటాయి. ఇవి ప్రధానంగా రైతుల కోసమే పనిచేయాల్సి ఉంటుంది. వీటి చైర్మన్లను, డైరెక్టర్లను రైతులే ఎన్నుకుంటారు. డీసీసీబీల చైర్మన్లు టెస్కాబ్ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఈ బ్యాంకులు రైతులకు అవసరమైన పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే డీసీసీబీలు ప్రతి ఏటా వేలాది కోట్లు రైతులకు రుణాలు అందిస్తుంటాయి. రైతులతోపాటు ఇతరులకు కూడా గృహ, విద్య రుణాలు కూడా ఇస్తుంటాయి. రైతులకైతే ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు కొనేందుకు, భూములను చదును చేసుకునేందుకు, వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, చేపలు, గొర్రెల పెంపకం తదితరాల ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు దీర్ఘకాలిక రుణాలు ఇస్తుంటారు. అయితే పలుకుబడి కలిగి కోట్ల రూపాయలు తీసుకునే వారిపై, రాజకీయ నాయకుల విషయంలో మెతక వైఖరి అవలంభించే డీసీసీబీలు రైతుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్దల విషయంలో కోట్లు రికవరీ చేయలేక నష్టాలను చవిచూస్తున్న అనేక సహకార సంఘాలు, రైతులను మాత్రం ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఎలాగోలా చెల్లిస్తామని రైతులు వేడుకుంటున్నా కనికరించడం లేదు. భూములను వేలం వేస్తున్నాయి. వేలం పాటలో ఆయా గ్రామాల ఇతర రైతులు ఎవరూ పాల్గొనకపోతే డీసీసీబీలే స్వాదీనం చేసుకుంటున్నాయి. మరోవైపు చెల్లించాల్సిన రుణం కంటే ఎక్కువ విలువున్న భూములను వేలం వేయడంపై రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా వచ్చే డబ్బును రైతులకే ఇస్తున్నామని అధికారులు అంటున్నా, కొద్దిపాటి భూమిని కూడా తమకు ఉంచడం లేదని రైతులు అంటున్నారు. అప్పుకు మించి భూమిని అమ్మే హక్కు సహకార బ్యాంకులకు ఎక్కడ ఉందని నిలదీస్తున్నారు. మరీ విచిత్రంగా కేవలం రూ.50 వేల రుణం ఉన్న రైతుల ఆస్తులను కూడా వేలం వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో 202 మందికి నోటీసులు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీసీసీబీ పరిధిలో 78 ప్యాక్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 డీసీసీబీ బ్రాంచీలు ఉన్నాయి. గత ఏడాది (2023–24) పంట రుణాల కింద 62 వేల మంది రైతులకు రూ. 672 కోట్లు, దీర్ఘకాలిక రుణాల కింద 1,100 మందికి రూ.70 కోట్లు, గృహ రుణాల కింద 200 మందికి రూ.18 కోట్లు, విద్యా రుణాల కింద 180 మందికి రూ.14 కోట్లు అందజేశాయి. ఇందులో దీర్ఘకాలిక రుణాలు పెండింగ్‌లో ఉన్న 202 మందికి బ్యాంక్ అధికారులు లీగల్ నోటీసులు జారీ చేసి రూ.8 కోట్లు రికవరీ చేశారు. ఈ క్రమంలో కొందరు రైతుల భూములు, ఆస్తులను కూడా వేలం వేయడం గమనార్హం. నిజామాబాద్‌లో 71 మందికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో డీసీసీబీలో ఇళ్లు, వ్యవసాయ భూములు, ఇతరత్రా ఆస్తులు తాకట్టు పెట్టి కొందరు రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 71 మందికి డీసీసీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. అయినా అప్పులు చెల్లించని రైతుల ఆస్తులను వేలం వేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో డీసీసీబీలు పంట రుణాలు ఇస్తాయి. గడిచిన వానాకాలంలో రూ.469.82 కోట్లు, యాసంగి సీజన్లో రూ.126.68 కోట్లు పంట రుణాలుగా ఇచ్చాయి. అలాగే రూ. 236.38 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో రుణాలు తిరిగి చెల్లించని రైతులకు నోటీసులు జారీ అయ్యాయి. రైతులు రుణాలు చెల్లించకుంటే ఆస్తులను వేలం వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. డీసీసీబీలు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు, పేరుకు పోయిన ఇతరత్రా రుణాలను రికవరీ చేయాల్సిన బాధ్యత డీసీసీబీలపై ఉంటుంది. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం అవి పనిచేయాలి. రైతులు తమ భూములు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులను తనఖా పెట్టి దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. అయితే ఏళ్లుగా పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసే క్రమంలో రైతులకు నోటీసులు ఇస్తున్నారు. పలు జిల్లాల్లో భూములు, ఇతర ఆస్తులు వేలం వేస్తున్నారు. నిబంధనల ప్రకారమే డీసీసీబీలు వ్యవహరిస్తున్నాయి. – నేతి మురళీధర్‌రావు, ఎండీ, టెస్కాబ్ – నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఐనోలు గ్రామానికి చెందిన ఓ రైతు పాల వ్యాపారం చేసేందుకు గాను గేదెలను కొనుగోలు చేయాలని భావించి 2017 డిసెంబర్లో తనకున్న 2.30 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో రూ.7.20 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. మూడు కిస్తీలు కట్టాడు. ఆ తర్వాత గేదెలు చనిపోవడంతో నష్టం వాటిల్లింది. కిస్తీలు చెల్లించకపోవడంతో అసలు, వడ్డీ కలిపి రూ.9.68 లక్షలు బకాయి చెల్లించాల్సి ఉండగా.. రైతు తాకట్టు పెట్టిన భూమిని బ్యాంకు అధికారులు వేలం వేసి నగదు జమ చేసుకున్నారు. – జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) పరిధిలోని పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చంద్రకాంత్‌రెడ్డి తండ్రి సంజీవరెడ్డి కొన్నేళ్ల క్రితం ట్రాక్టర్ కోసం మూడెకరాలు తాకట్టు పెట్టి రూ.1,66,000 రుణం తీసుకున్నాడు. మూడేళ్ల అనంతరం లోన్ సరిగా చెల్లించడంలేదని ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. దీంతో చంద్రకాంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా కేసు నడుస్తోంది. ఇలావుండగా పొలం వేస్తున్నామంటూ ఇటీవల ప్యాక్స్ అధికారులు నోటీసులు పంపించారు. దీంతో చంద్రకాంత్ తమ ట్రాక్టర్ సీజ్ చేశారని, పొలం ఎలా వేలం వేస్తారని నిలదీసినా ఫలితం లేకపోయింది. ఎకరం రూ.12.10 లక్షల చొప్పున మరో రైతుకు విక్రయించారు. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఆ సర్వే నంబర్లో ఉన్న మొత్తం 4.12 ఎకరాలు రెడ్‌మార్క్‌లో పెట్టడంతో రైతు లబోదిబోమంటున్నారు. -
మళ్లీ రెడీ.. మోసం గ్యారంటీ
రైతాంగానికి చంద్రబాబు చేసిన దగా అంతా ఇంతా కాదు. అసలు వ్యవసాయమే దండగ అని చెప్పిన ఘనుడు. నేల తల్లిని నమ్ముకున్న రైతుల్ని నిట్టనిలువునా ముంచేశారు. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని పీఠంపైకి ఎక్కిన తర్వాత అన్నదాతల పీక నులిమేశారు. చివరికి అధికారంలోకి రావడానికి వక్రమార్గాలన్నీ ఎంచుకుని అబద్ధాలతో ఐదేళ్లపాటు రైతుల జీవితాలతో ఆడుకున్నారు. ఆయన జీవితమంతా అబద్ధాలతోనే గడిచిపోయింది. ‘పులి–బంగారు కడియం’ కథలో మాదిరిగా బాబు గద్దెనెక్కడానికి చేయని వాగ్దానం లేదు. కుర్చీ ఎక్కగానే వ్యవసాయ రుణాల మాఫీలో కోతలకు కోటయ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఫలితంగా రూ.87,612 కోట్ల రుణాలను రూ.25 వేల కోట్లకు కుదించి, చివరికి రూ.15 వేల కోట్ల లోపే మాఫీ చేసిన జిత్తులమారి ‘నారా’ కపట నాటకానికి రైతులు ఆత్మార్పణం చేసుకోవలసి వచి్చంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా కూడా ఎగ్గొట్టిన మోసకారి చంద్రబాబు. అలాంటాయన ఇప్పుడు మళ్లీ మన ముందుకు సరికొత్త కపట హామీలతో వస్తున్నారు. సాక్షి, అమరావతి: వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ 2014 ఎన్నికల సభల్లో హామీలు గుప్పించిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చేశారు. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని తాను చెప్పలేదన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వ్యవసాయ రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం చేస్తానని పేర్కొన్న చంద్రబాబు తీరా ప్రమాణం స్వీకారం చేసిన తరువాత ఫైలుపై సంతకం చేయకపోగా, రుణ మాఫీలో ఎలా కోతలు పెట్టాలనే అలోచనతో కోటయ్య కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి సంతకం చేశారు. అదీ పంట రుణాల మాఫీకి మా త్రమే లబ్ధిని పరిమితం చేశారు. కోటయ్య కమిటీ లో చంద్రబాబు తనకు అత్యంత ఇషు్టడైన కుటుంబరావును చేర్చారు. అప్పటి నుంచి వ్యవసాయ రు ణాల మాఫీని ఎలా కుదించాలనే దానిపై కసరత్తు చేశారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటూ కొత్త విధానా న్ని తీసుకువచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టారు. షరతులతో కత్తెరలు రైతులకు బ్యాంకులు నిర్ధారించిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కన్నా ఎక్కువ పంట రుణాలిస్తే ఆ రుణాలు మాఫీ పరిధిలోకి రావంటూ కత్తెర పెట్టారు. ఆ తరువాత వ్యవసాయ అవసరాలకు రైతులు బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలపై ఆంక్షలు విధించారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఎంత రుణం తీసుకున్నా ఆ కుటుంబం మొత్తానికి రూ.1.50 లక్షల వరకే మాఫీ అని షరతు విధించారు. బ్యాంకుల్లో బంగారాన్ని తాకట్టు పెట్టుకునే సమయంలో పంట రుణాలని రాయకపోతే వాటిని రుణ మాఫీ నుంచి తొలగించేశారు. రైతులు ఆధార్, రేషన్ కార్డులు ఇస్తేనే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. తొలుత 2014 మార్చి వరకు ఉన్న రుణాలు, వడ్డీ మాఫీ చేస్తామని చెప్పి తరువాత 2013 డిసెంబర్ నెలాఖరు వరకు ఉన్న రుణాలు, వడ్డీ మా త్రమే మాఫీ చేస్తామని ప్రకటించారు. ఒకే సారి రుణ మాఫీ సాధ్యం కాదని, దశల వారీగా చేస్తామ ని ఎక్కువ మంది రైతుల ఖాతాలను తప్పించేశారు. మాట మార్చి.. రైతులను ఏమార్చి 2014 జూన్ 29న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో వ్యవసాయ రుణాలు రూ.87,612 కో ట్లు, డ్వాక్రా సంఘాల రుణాలు రూ.14,204 కోట్లు ఉన్నాయ ని బ్యాంకర్ల కమిటీ స్పష్టం చేసింది. ఒకే సారి రైతులు, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తే అభ్యంతరం లేదని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభుత్వానికి తెలిపారు. అయితే రుణాల మాఫీ తరువాత చూద్దమని ముందుగా గత ఖరీఫ్‌లో కరువు, తుఫాను ప్రభావం గల 575 మండలాల్లో రైతుల రుణాలను రీ షెడ్యూల్‌పై ఆర్బీఐతో మాట్లాడాల్సిందిగా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆర్బీఐ మొత్తం మండలాల్లో రైతు ల రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని స్పష్టం చేసింది. వడపోతలు, ఏరివేతలు తరువాత మొత్తం రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాల్లో కేవలం 25 వేల కోట్లకు రుణ మాఫీని కుదించేసి నాలుగు దశల్లో చెల్లిస్తామని షరతులు విధించింది. తొలుత రూ.50 వేలలోపు చెల్లిస్తామని, రూ.50 వేలు దాటిన రుణాలకు రైతు ధ్రువీకరణ పత్రాలను చెల్లిస్తామని మోసం చేశారు. నమ్మక ద్రోహానికి ఫలితంగా ఆత్మహత్యలు 2019 ఎన్నికల ముందు నాటికి కేవలం రూ.15 వేల కోట్ల లోపు మాత్రమే రుణ మాఫీకి చంద్రబాబు సర్కారు హామీ ఇచ్చింది. అరకొర రుణ మాఫీతో రైతులు మరింత అప్పులు ఊబిలోకి కూరుకుపోయారు. వడ్డీ భారం అమాంతం పెరిగిపోయింది. మరో పక్క 2015 ఏడాది నుంచి 2016 వరకు వ్యవసాయ రుణాల కోసం బంగారం బ్యాంకుల్లో కుదువ పెట్టి 35,24,549 మంది రైతులు రూ.26,055.18 కోట్లు పంట రుణాలు తీసుకుంటే అందులో సవాలక్ష షరతులు విధించి కేవలం రూ.3,366.80 కోట్లకు మాఫీని కుదించారు. దీంతో బంగారంపై రుణాల తీసుకున్న రైతుల పేర్లతో బ్యాంకులు వేలం నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిపై పత్రికల్లో ప్రకటనలు వేశాయి. దీంతో చాలా మంది రైతుల ఆత్మాభిమానం కోల్పోయి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. -
కౌలు రైతులకు భరోసానిస్తున్నా బాధేనా రామోజీ?
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేనివిధంగా కౌలురైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా వారికి మేలు జరుగుతుంటే విషపురాతలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారు. గత ప్రభుత్వాలు ఆలోచన కూడా చేయని పంట సాగు హక్కుదారుల చట్టం–2019 తీసుకురావడమే కాదు.. సీసీఆర్సీల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, పంట రుణాలు, సున్నా వడ్డీ రాయితీతో పాటు వివిధ కారణాలతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం అందిస్తున్నారు. అంతేకాదు కౌలురైతులకు ఈక్రాప్ నమోదు ప్రామాణికంగా సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), ఉచిత పంటల బీమా వంటి పథకాలు అందిస్తున్నారు. ఈ క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా అమ్ముకోగలుగుతున్నారు. చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు మేలు చేసే ఊసేలేదు. వాస్తవాలకు ముసుగేసి తప్పుడు కథనాలతో రామోజీరావు నిత్యం బురదజల్లడమే పనిగాపెట్టుకున్నారు. వ్యవసాయాన్ని పండుగలామార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ‘కౌలురైతు నోట్లో మట్టి’ అంటూ ఈనాడు పత్రికలో రోతరాతలు రాశారు. ఆరోపణ: కౌలు రైతులను ఆదుకోవడంలో 100 శాతం విఫలం వాస్తవం: భూయజమాని హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, వారి హక్కుల రక్షణకల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు రెవెన్యూ శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు 25.82 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు మంజూరు చేశారు. ఆరోపణ: కౌలురైతులకు పంట రుణాలేవి వాస్తవం: వాస్తవ సాగు దారులందరికి పంట రుణాలివ్వాలన్న సంకల్పంతో పీఏసీఎస్‌లను ఆర్బీకేలతో అనుసంధానం చేశారు. సీసీఆర్సీ కార్డులున్న వారికి రుణాలు అందిస్తున్నారు. సీసీఆర్సీ లేని కౌలు రైతులతో జాయింట్ లయబిలిటీ గ్రూపు (జేఎల్‌జీ)లను ఏర్పాటు చేసి ఈ గ్రూపుల ద్వారా వారికి రుణాలు అందేలా చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటివరకు 13.49 లక్షల మంది కౌలుదారులకు రూ. 7,959.49 కోట్ల రుణాలు అందించారు. ఆరోపణ: రైతు భరోసాకు మొండిచేయి వాస్తవం: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నారు. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులతో పాటు అటవీ, దేవదాయ భూమి సాగుదారులకు కూడా రూ. 13,500 చొప్పున మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అందిస్తోంది. కౌలుదారుల్లో 6 శాతం మందికి మాత్రమే రైతు భరోసా అందుతుందనడంలో వాస్తవంలేదు. మెజార్టీ కౌలు దారులు సొంత భూమి కూడా కలిగి ఉన్నారు. వీరందరికీ భూ యజమానిగా వైఎస్సార్ రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందుతోంది. సీసీఆర్సీ కార్డుల ఆధారంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ఈ 50 నెలల్లోనే దాదాపు 5.38 లక్షల మంది కౌలు రైతులకు రూ. 697.32 కోట్లు, 3.99 లక్షల అటవీ భూములు (ఆర్వోఎఫ్ఆర్) సాగు చేసే గిరిజనులకు రూ. 522.36 కోట్లు కలిపి మొత్తం 9.38 లక్షల మందికి రూ. 1,219.68 కోట్లు పెట్టుబడి సహాయంగా అందించారు. ఆరోపణ: కౌలురైతులకు అందని సంక్షేమ ఫలాలు వాస్తవం: కౌలుదారులకు సంక్షేమ ఫలాలు అందడం లేదనడంలో ఎంతమాత్రం వాస్తవం లేదు. వైఎస్సార్ రైతు భరోసాతో సహా భూయజమానులకు వర్తింçప చేసే సంక్షేమ ఫలాలన్నీ భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులకు కూడా వర్తింప చేస్తున్నారు. సీసీఆర్సీ కార్డు ఉన్నా లేకున్నా కూడా అందిస్తున్నారు. ఈ క్రాప్ ఆధారంగా లక్ష లోపు పంటరుణాలు పొందిన కౌలుదారులకు వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీ కూడా అందేలా చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 30 వేల మందికి రూ.6.26 కోట్ల సున్నా వడ్డీ రాయితీని అందించారు. అలాగే 3.55లక్షల మందికి రూ.731.08 కోట్ల పంటల బీమా పరిహారం, 2.41లక్షల మందికి 253.56 కోట్ల పంట నష్ట పరిహారం బాబు హయాంలో కౌలురైతులను ఆదుకున్నదేది? చంద్రబాబు హయాంలో కౌలు రైతులకు కనీసంగా అంటే కనీసంగా కూడా ఆదుకున్న దాఖలాలు లేవు. ఏటా అరకొరగా తమకు అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే ఎల్ఈసీ కార్డులు జారీ చేయడం తప్ప ప్రభుత్వ పరంగా ఏ ఒక్క సంక్షేమ ఫలాలు అందించిన జాడే లేదు. కౌలుదారుల్లో 80 శాతం మందికి పైగా భూయజమానులతో ఎలాంటి లిఖిత పూర్వక ఒప్పందం లేకుండా భూమిని కౌలుకు తీసుకుంటారు. అధీకృత ఒప్పందాల్లేక పోవడం వలన ప్రభుత్వ పథకాలు, ప్రోత్సహాకాలు, రాయితీలే కాదు కనీసం పంట రుణాలు కూడా దక్కేవి కావు. టీడీపీ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిన రైతులకు రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. కానీ దీన్లో రూ.1.5 లక్షల్ని అప్పులకు జమ చేసుకుని, మిగిలిన 3.5 లక్షలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీని మాత్రమే వాడుకునే పరిస్థితి కల్పించేవారు. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిహారాన్ని రూ.5 లక్షలనుంచి రూ.7 లక్షలకు పెంచడమే కాదు. ఆ మొత్తాన్ని నేరుగా ఆత్మహత్యలకు పాల్పడే రైతు కుటుంబాల ఖాతాలకు జమ చేస్తోంది. కౌలు రైతు అయినా వ్యవసాయ కారణాలతో చనిపోతే దేశంలో రూ.7 లక్షల పరిహారం ఇస్తున్నది ఒక్క మన రాష్ట్రంలోనే. కౌలుదారుల కుటుంబాలకునేరుగా పరిహారం వ్యవసాయాధారిత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలుదారులకు సీసీఆర్సీ కార్డు ఉంటే రూ. 7 లక్షలు, లేకుంటే వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష పరిహారం నేరుగా బాధిత కౌలురైతు కుటుంబ సభ్యుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఇలా 2019 నుంచి ఇప్పటి వరకు 1,270 కేసులకు సంబంధించి రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలురైతులుండగా, ఆ కుటుంబాలకు రూ. 33.95 కోట్ల ఆర్థిక సాయం అందించారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ. 23.70 కోట్ల పరిహారం చెల్లించగా, వీరిలో కూడా 212 మంది కౌలురైతులున్నారు. వీరికి రూ. 10.60 కోట్ల పరిహారం చెల్లించారు. -
రైతు పంట రుణాలపై ఆర్థిక సాయం
-
బంగారు రుణాలపై గురి
సాక్షి, అమరావతి: రైతుల వ్యవసాయ, కుటుంబ అవసరాలను తీర్చడంలో సహకార బ్యాంకులు వాణిజ్య బ్యాంకులతో పోటీ పడుతున్నాయి. పంట రుణాలకే పరిమితం కాకుండా ఇతర రుణాల మంజూరులోనూ ముందుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో బంగారంపై రికార్డు స్థాయిలో రూ.15,076 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. ఈ ఏడాది కనీసం రూ.10 వేల కోట్ల విలువైన గోల్డ్ లోన్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే విషయంలో వాణిజ్య బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్ ఫైనాన్స్ వ్యాపార సంస్థలు ముందుంటున్నాయి. మెజార్టీ జాతీయ బ్యాంకులు తమకు నిర్ధేశించిన పంట రుణ లక్ష్యాలను అధిగమించేందుకు పెద్దఎత్తున బంగారంపై రుణాలు ఇస్తూ వాటిని పంట రుణాలుగా చూపిస్తున్నాయి. కార్పొరేట్ ఫైనాన్స్ సంస్థలు రెండు నిమిషాల్లోనే బంగారు రుణాలంటూ భారీ వ్యాపారం చేస్తున్నాయి. ఇవి డిమాండ్‌ను బట్టి ఏకంగా 15 నుంచి నుంచి 36 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. నెల రోజులకు ఒకలా.. రెండు నెలలకు మరోలా.. ఆరు నెలలు, ఏడాది కాల పరిమితితో ఒక్కో రీతిలో వడ్డీ వసూలు చేస్తున్నాయి. నాలుగేళ్లలో రూ.15,076 కోట్ల రుణాలు నాలుగేళ్ల క్రితం ఏటా రూ.500 కోట్లకు మించి బంగారు రుణాలిచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం ఏటా రూ.3,769 కోట్లకుపైగా రుణాలు ఇస్తున్నారు. 2018–19 వరకు ఏటా వెయ్యి కోట్లకు మించి బంగారు రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఉండేది కాదు. బంగారు రుణాలపై వసూలు చేసే వడ్డీ శాతాన్ని తగ్గించడంతో పాటు పీఏసీఎస్ స్థాయి వరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడంతో పాటు నాలుగేళ్లలో రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేస్తున్నారు. సీఎం ఆదేశాలతో బంగారు రుణాలకు ప్రాధాన్యత సహకార బ్యాంకులు బలోపేతం అయ్యేందుకు బంగారు ఆభరణాలపై రుణాల మంజూరుకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆప్కాబ్ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులు పంట రుణాలతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున గోల్డ్ లోన్స్‌ను సైతం ప్రోత్సహిస్తున్నాయి. ఇందుకోసం మూడేళ్ల క్రితం వడ్డీ రేట్లను సవరించడం కలిసొచ్చింది. గతంలో 2 లక్షలకు పైబడిన గోల్డ్ లోన్లపై 10.6 శాతం ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి.. రూ.2 లక్షల లోపు రుణాలపై 10.1 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8 శాతానికి తగ్గించాయి. ఆరు నెలలకే తిరగరాసేలా మార్పు చేశారు. ఫలితంగా బంగారు రుణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రత్యేక దృష్టి పెట్టాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు అండగా నిలిచేలా పంట రుణాలతో పాటు వ్యవసాయ, కుటుంబ అవసరాల కోసం మంజూరు చేసే బంగారు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. రైతుల అవసరాలకు తగినట్టుగా తక్కువ వడ్డీకే బంగారు రుణాలు మంజూరు చేస్తున్నాం. ఏటా లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్తున్నాం. – మల్లెల ఝాన్సీ, చైర్పర్సన్, ఆప్కాబ్ -
రూ. 2 లక్షల పంట రుణాలు తీసుకోండి.. మాఫీ చేస్తాం
సాక్షి, హైదరాబాద్: రైతులు బ్యాంకుల నుంచి రెండు లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆ విధంగా తీసుకున్న రుణాలను తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. రైతు సంక్షేమం కోసం తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. చేవేళ్ల నియోజకవర్గంలోని శంకర్‌పల్లికి చెందిన పలువురు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహా్వనించారు. వచ్చే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని పునరుద్ఘాటించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, బీడి కారి్మకులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, పైలేరియా, డయాలిసిస్ పేషంట్లకు నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామన్నారు. ఒక్క హామీ నెరవేర్చని కేసీఆర్ తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని చెప్పిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక పేదల సంక్షేమాన్ని విస్మరించారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రైతు వ్యతిరేకి అయిన కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో 88 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర సంపదను తన కుటుంబసభ్యులకు దోచి పెడుతున్నారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. వేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే పోలీసులను పంపి కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తామని, ఇల్లు కట్టుకునే ప్రతి పేదవాడికి రూ.5 లక్షల సాయం చేస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
కౌలు రైతులకూ భరోసా
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని ప్రభుత్వం సంకలి్పంచింది. గడచిన నాలుగేళ్ల కంటే మిన్నగా ఈ ఏడాది కౌలు కార్డులు (పంట హక్కు సాగు పత్రాలు–సీసీఆర్సీ) జారీ చేసింది. అర్హులైన ప్రతి కౌలు రైతుకూ పంట రుణాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా నిర్వహించిన ప్రత్యేక మేళాల్లో రికార్డు స్థాయిలో కౌలుదారులకు సీసీఆర్సీలు జారీ చేసింది. గతంలో కౌలు రైతులకు సంక్షేమ ఫలాలు అందేవి కాదు. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.1.60 లక్షల వరకు పంట రుణం అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆంక్షల పేరిట బ్యాంకులు మొండిచేయి చూపడంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.3, రూ.5 వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసేవారు. కౌలు, వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో తీసుకొచి్చన పంట సాగుదారుల హక్కుపత్రాల (సీసీఆర్సీ) చట్టం కింద 11 నెలల కాల పరిమితితో కౌలు కార్డులు జారీ చేస్తున్నారు. సీసీఆర్సీల ద్వారా సంక్షేమ ఫలాలు సీసీఆర్సీల ద్వారా నాలుగేళ్లుగా పంట రుణాలతో పాటు అన్ని రకాల సంక్షేమ ఫలాలను కౌలు రైతులకు ప్రభుత్వం అందిస్తోంది. 2019–20 సీజన్లో 2,72,720 మందికి, 2020–21లో 4,14,770 మందికి, 2021–22 సీజన్లో 5,24,203 మందికి, 2022–23లో 5,49,513 మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. నాలుగేళ్లలో 9 లక్షల మంది కౌలుదారులకు రూ.6,668.64 కోట్ల పంట రుణాలు మంజూరు చేసింది. 3.92 లక్షల మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.529.07 కోట్ల పెట్టుబడి సాయం అందించింది. పంటలు దెబ్బతిన్న 2.34 లక్షల మంది కౌలుదారులకు రూ.246.22 కోట్ల ఇన్పుట్ సబ్సిడీతో పాటు 1.73 లక్షల మందికి రూ.487.14 కోట్ల ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించింది. రికార్డు స్థాయిలో సీసీఆర్సీలు జారీ 2023–24లో కనీసం 8.81 లక్షల మందికి సీసీఆర్సీల జారీ చేయాలనే లక్ష్యంతో ఆర్బీకేల ద్వారా సీసీఆర్సీ మేళాలు నిర్వహించారు. ఈ మేళాల ద్వారా రికార్డు స్థాయిలో 7,77,417 మందికి సీసీఆర్సీలు జారీ చేశామని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు 4,51,545 మంది ఉండగా.. ఇతర వర్గాలకు చెందిన 3,25,872 మంది ఉన్నారు. ఈ ఏడాది కూడా రైతు భరోసా సాయం అందించేందుకు సీసీఆర్సీలు పొందిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారి వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. సెప్టెంబర్‌లో వీరికి వైఎస్సార్ రైతు భరోసా కింద తొలి విడత సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కనీసం రూ.4 వేల కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు వేస్తున్నా. ఈ ఏడాది మినుము, వరి వేశా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఏటా కౌలు కార్డు ఇస్తున్నారు. గతేడాది రైతు భరోసా కింద రూ.13,500 జమయ్యాయి. ఈ ఏడాది కూడా కౌలుకార్డు తీసుకున్నా. రైతు భరోసా పోర్టల్‌లో అప్లోడ్ చేశామని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. – కంపమళ్ల రమీజ, రుద్రవరం, కర్నూలు జిల్లా కౌలు కార్డు ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నా నేను రెండెకరాలు కౌలుకు చేస్తున్నా. ఈ ఏడాది వరి, మొక్కజొన్న వేశాను. కౌలు కార్డు కోసందరఖాస్తు చేశా. ఎలాంటి సిఫార్సులు లేకుండా సీసీఆర్సీ కార్డు ఇచ్చారు. ఈ కార్డు ద్వారా రూ.లక్ష పంట రుణం తీసుకున్నా. రైతు భరోసా సాయం కోసం అప్లోడ్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. – వీరంకి గోపీకృష్ణ, మోరంపూడి, దుగ్గిరాల మండలం, గుంటూరు జిల్లా -
అన్నదాత.. అప్పు గోస!
► వికారాబాద్ జిల్లా ‘దోమ’కు చెందిన రైతు బాయిని వెంకటయ్య ఆరు నెలల క్రితం పంట రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఇతర బ్యాంకుల నుంచి నోడ్యూస్ సర్టిఫికెట్ తేవాలన్నారు. వెంకటయ్య ఇతర బ్యాంకుల చుట్టూ తిరిగి నోడ్యూస్ సర్టిఫికెట్ తీసుకువచ్చి దరఖాస్తు చేసుకున్నారు. యాసంగి సాగు మొదలైనా ఇంకా రుణం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు. ► సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన సావిత్రమ్మ.. యాసంగిలో పంట రుణం కోసం బ్యాంకును ఆశ్రయించారు. కానీ బ్యాంకు అధికారులు కొర్రీలు పెట్టారు. ఇతర బ్యాంకుల్లో పంట రుణం తీసుకోనట్టు/ఎలాంటి బాకీ లేనట్టుగా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని.. లేకుంటే రుణం ఇచ్చే మాటే లేదని చెప్పారు. దీనితో ఆమె ఆ మండలంలోని ప్రధాన బ్యాంకుల చుట్టూ తిరిగి నో డ్యూస్ సర్టిఫికెట్‌పై సంతకాలు చేయించుకొచ్చారు. ఆ తర్వాతే పంట రుణం అందింది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పంట రుణాల కోసం రైతులు గోసపడుతున్నారు. బ్యాంకర్లు ఏదో ఓ కొర్రీ పెడుతూ రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. సదరు మండలంలోని ఇతర బ్యాంకులకు వెళ్లి నోడ్యూస్ సర్టిఫికెట్లు తేవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరికొన్నిచోట్ల ఇప్పటికే ఉన్న పంట రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వబోమని తేల్చి చెప్తున్నారు. దీనితో రైతులు బ్యాంకుల చుట్టూ తిరగలేక అవస్థ పడుతున్నారు. చివరికి పంట పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. లక్ష్యం ఘనం.. ఇచ్చేది కొంచెం.. పంటరుణాల మంజూరుకు బ్యాంకులు, ప్రభుత్వం ఘనంగానే లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు మాత్రం పంట రుణాల కోసం వస్తున్న రైతులకు చుక్కలు చూపుతున్నారు. ఏదో ఒక కొర్రీ పెడుతూ తిప్పుకొంటున్నారు. ఈ విషయంలో రైతులకు బాసటగా నిలవాల్సిన వ్యవసాయ శాఖ ఏమీపట్టనట్టుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. యాసంగి మొదలై రెండు నెలలైనా రైతులకు ఇప్పటివరకు అరకొరగానే రుణాలు అందుతున్నాయి. 2022–23 వానాకాలం సీజన్లో పంటరుణాల మంజూరు లక్ష్యం రూ.40,718 కోట్లుకాగా.. సీజన్ పూర్తయ్యే నాటికి బ్యాంకులు రూ. 21,272 కోట్లు మాత్రమే ఇచ్చాయి. అంటే లక్ష్యంలో 52 శాతమే రుణాలు అందించాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌కు లక్ష్యం రూ.27,146 కోట్లుకాగా.. ఇప్పటివరకు ఇచ్చింది రూ.5వేల కోట్లలోపేనని వ్యవసాయ వర్గాలు చెప్తుండటం గమనార్హం. ధరణితో సాంకేతిక సమస్యలంటూ.. గతంలో రైతుల పట్టాదారు పాస్‌బుక్కులు తనఖాగా పెట్టుకుని బ్యాంకర్లు రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు కొత్త విధానం తీసుకువచ్చారు. ప్రతి జాతీయ బ్యాంకుకు ధరణి పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించారు. బ్యాంకర్లు ధరణి పోర్టల్‌లోకి లాగిన్ అయి సర్వే నంబర్లు, ఇతర వివరాలు సరిచూసుకుని పంట రుణాలు ఇస్తున్నారు. కానీ ధరణిలో సాంకేతిక సమస్యలతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటీవల నాలుగైదు సార్లు వ్యవసాయ శాఖతో జరిగిన సమావేశాల్లో బ్యాంకర్లు ధరణి సమస్యల వల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పినట్టు తెలిసింది. ధరణి పోర్టల్‌లో సాంకేతిక సమస్యల వల్ల రైతుల సర్వే నంబర్లు నమోదు కావడం లేదు. పాస్‌బుక్‌లు ఉన్నా బ్యాంకర్ల లాగిన్‌లో కనిపించడం లేదు. కొన్నింట్లో బ్యాంకర్లు ఎంట్రీ చేయడానికి ప్రయత్నించినా నమోదు కావడం లేదు. పలు గ్రామాలు ఇంకా ధరణిలో నమోదుగాకపోవడం, కొన్ని గ్రామాల్లో సర్వే నంబర్లలో ఉన్న భూమికి, ధరణిలో నమోదైన భూమికి తేడాలు ఉండటం వంటి సమస్యలు నెలకొన్నాయి. ఇలాంటి ఇబ్బందులున్న రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీనితో లక్షల మంది రైతులకు పంట రుణం అందకుండా పోతోంది. రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగక.. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతోనూ రైతులకు రుణాలు అందని పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇప్పటివరకు రూ.37 వేల వరకు బకాయిలున్న రైతులకే రుణమాఫీ చేసింది. ఆపై రుణాలున్న వారికి మాఫీ కావాల్సి ఉంది. రైతులు బ్యాంకు రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, ప్రభుత్వం తర్వాత చెల్లిస్తుందని మంత్రులు ప్రకటించినా.. కొందరే అలా రెన్యువల్ చేసుకున్నారు. చాలా మంది రైతులు ప్రభుత్వం నుంచి రుణమాఫీ సొమ్ము వచ్చిన తర్వాతే రెన్యువల్ చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. దీనివల్ల లక్షలాది మంది రైతులు డిఫాల్టర్లుగా మారిపోయారు. వారికి బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. మరోవైపు 2018నాటికి ఉన్న బకాయిలపై వడ్డీ, చక్రవడ్డీ కలిసి తడిసి మోపెడవుతోంది. కొన్నిచోట్ల బ్యాంకు అధికారులు రైతుబంధు సొమ్మును బకాయిల కింద జమ చేసుకుంటున్నారని.. అలా చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినా బ్యాంకర్ల తీరు మారడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోడ్యూస్ సర్టిఫికెట్ తెస్తేనే.. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన రాజు పంటరుణం కోసం ఏపీజీవీబీని సంప్రదించారు. కానీ బ్యాంకు అధికారులు ఆయనను దొమ్మాట, చేగుంట, నార్లాపూర్లలోని ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల నుంచి ‘నోడ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. ఆయన పది రోజులు తిరిగి అన్ని బ్యాంకుల్లో సంతకాలు తీసుకొచ్చిన తర్వాతే రుణం మంజూరు చేశారు. -
సాగుకు భరోసా.. విరివిగా పంట రుణాలు
వ్యవసాయరంగానికి జగన్ సర్కార్ అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల ద్వారా రైతులకు విరివిగా రుణాలు ఇస్తోంది. అందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో అంచనాకు మించి పంట రుణాలు మంజూరు చేసింది. రూ.11,957 కోట్ల వార్షిక రుణప్రణాళిక లక్ష్యంలో రెండో త్రైమాసికం ముగిసేలోపు అంటే సెప్టెంబర్ నెలాఖరుకే రూ.9,077 కోట్లతో 76 శాతం సాధించిన బ్యాంకర్లు గడువులోగా వంద శాతం సాధించే దిశగా అడుగులేస్తున్నారు. అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తోంది. విత్తు నుంచి పంట విక్రయం వరకు తోడుగా ఉంటోంది. పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా రుణాలు సకాలంలో ఇప్పించి వ్యవసాయం సాఫీగా సాగేలా చూస్తోంది. ఖరీఫ్‌లో సాగుకు వీలుగా ఏటా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.3,204.24 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఏకంగా 127 శాతంతో రూ.4,068.62 కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం రూ.2,226.68 కోట్లు లక్ష్యంగా రబీ రైతులకు పంట రుణాల మంజూరు కొనసాగుతోంది. వ్యవసాయ టర్మ్ లోన్ల లక్ష్యం రూ.1,545.32 కోట్లు కాగా.. 121 శాతంతో రూ.1,869.81 కోట్లు మంజూరు చేశారు. ఇక అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.16.61 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాల కింద రూ.92.18 కోట్లు ఇచ్చారు. ఇలా... మొత్తంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కింద రైతులు, ఇతర లబ్ధిదారులకు రూ.6,047.22 కోట్లు ఇవ్వడం గమనార్హం. ఇతరత్రా రంగాలకూ విరివిగా రుణాలు వ్యవసాయంతో పాటు ఇతర రంగాలకూ విరివిగా రుణాలు అందించారు. అందులో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహం కింద రూ.795.15 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాల కింద రూ.97.61 కోట్లు, నాన్ ప్రయారిటీ సెక్టార్ కింద రూ.1,780.72 కోట్లకు గానూ 116 శాతంతో ఏకంగా రూ.2,081.90 కోట్లు మంజూరు చేశారు. ఇలా రూ.11,957.94 కోట్ల వార్షిక రుణప్రణాళిక (లోన్ క్రెడిట్‌ప్లాన్–2022–23) అమలులో భాగంగా రెండో త్రైమాసికం ముగిసేనాటికే 76 శాతంతో రూ.9,077.42 కోట్లు పూర్తయింది. 2023 మార్చి 31 వరకు గడువు ఉన్నందున ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పెరిగిన బ్యాంకింగ్ నెట్వర్క్ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇటీవల జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ నెట్వర్క్ బాగా పెరిగింది. ప్రభుత్వ రంగ, ప్రైవేట్ బ్యాంకులతో పాటు సహకార, గ్రామీణ బ్యాంకులు దాదాపు 43 ప్రిన్సిపల్ బ్యాంకులు వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల రుణాల మంజూరులో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) రూ.1,567 కోట్లు, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.1,429 కోట్లతో పోటీపడుతూ మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత యూనియన్ బ్యాంకు, కెనరాబ్యాంకు, ఇండియన్ బ్యాంకు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), బ్యాంకు ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, కరూర్ వైశ్యాబ్యాంకు, ఐడీబీఐ తదితర ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి. మొత్తమ్మీద చూస్తే... ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా రూ.4,453 కోట్లు, ప్రైవేట్ వాణిజ్య బ్యాంకుల ద్వారా రూ.4,201 కోట్లు ఇవ్వగా తర్వాత గ్రామీణ, సహకార బ్యాంకుల ద్వారా రైతులు, అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాయి. రుణాల మంజూరుకు పోటీ రైతులతో పాటు అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల పురోభివృద్ధికి ఇటీవల కాలంలో బ్యాంకర్లు పోటీ పడి రుణాలు మంజూరు చేస్తుండటం మంచి పరిణామం. దీంతో వార్షిక లక్ష్యంలో గణనీయమైన పురోగతి సాధించి గడువులోగా వంద శాతం చేరుకునే దిశగా రుణాల మంజూరు కొనసాగుతోంది. రైతులతో పాటు మహిళా సంఘాలు, విద్యా, వాహన, గృహ, పరిశ్రమలు, వ్యక్తిగత రుణాలు... ఇలా అన్నింటికీ అవసరమైన రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు మొగ్గుచూపుతున్నారు. – బి.నాగరాజారెడ్డి, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) రూ.85 వేల పంట రుణం నాకు 2.75 ఎకరాల పొలం ఉంది. బొమ్మగానిపల్లి కెనరా బ్యాంకులో రూ.85 వేల పంట రుణం ఇచ్చారు. దీని వల్ల సకాలంలో పంట పెట్టుబడికి ఉపయోగపడింది. 2021లో తీసుకున్న పంట రుణాలకు వైఎస్సార్ పంట రుణాల సున్నావడ్డీ కింద ఇటీవల రూ.3 వేల వడ్డీ రాయితీ కూడా జమ కావడం సంతోషంగా ఉంది. – విరుపాక్షి, రైతు, ముప్పాలకుంట, బ్రహ్మసముద్రం మండలం -
ఏది నిజం ?: ‘సున్నా వడ్డీ’లోనూ వక్రమార్కుడు.. రామోజీ విషపు రాతలు
బురదజల్లుడు, అబద్ధాలు అచ్చేయడం, అర్థంపర్థంలేని వార్తలు వండి వార్చడంలో తన రికార్డులను తానే బద్దలుకొట్టుకుంటున్న ఎల్లో జర్నలిస్ట్ రామోజీరావు ఎప్పటిలాగే టీడీపీ వైపు తన చేతివాటాన్ని మరోసారి ప్రదర్శించారు. ఈసారి ఆయన రూటు సాగువైపు మళ్లింది. ‘వడ్డీ రాయితీ పెద్ద సున్నా’ అంటూ ఆయన తాజాగా అచ్చోసిన అసత్యాల కథనం నిజంగానే నిజాల్ని దాచి వండిన వంటకం. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ఈనాడు పత్రిక కూడా ఆ పాఠకులకు అంతే హానికరం. ఎందుకంటే.. రాష్ట్రంలో చిన్న, సన్నకారు, వాస్తవ సాగుదారులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ‘వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి’ 2019లో శ్రీకారం చుట్టింది. రూ.లక్షలోపు తీసుకున్న పంట రుణాలను ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు మరుసటి సీజన్ రాకముందే వారు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తూ వారికి అండగా నిలుస్తోంది. కానీ, టీడీపీ ఐదేళ్లలో 40.61 లక్షల మందికి కేవలం రూ.685.46 కోట్లు చెల్లిస్తే, గడిచిన 3.5 ఏళ్లలో 73.88 లక్షల మంది వాస్తవ సాగుదారులకు ప్రస్తుత వైఎస్ జగన్ సర్కారు రూ.1,838.61 కోట్లు చెల్లించింది. వీటిలో రూ.1,180.66 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలే. ఇలా బాబు ఎగ్గొట్టిన బకాయిలతో సహా ఏటా క్రమం తప్పకుండా అర్హతగల ప్రతీ రైతుకు అణా పైసలతో సహా వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంటే చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే ఈనాడు రామోజీరావు కళ్లున్న కబోదిలా ప్రవర్తిస్తూ ఆ పత్రికల పాఠకులపై చిమ్ముతున్న విషానికి అంతులేకుండా పోతోంది. నిజానికి.. గతంలో ఇంతపెద్ద ఎత్తున, ఇంత పారదర్శకంగా డీబీటీ విధానంలో నేరుగా రైతుల ఖాతాల్లో జమయ్యేలా వడ్డీ రాయితీ పథకాన్ని అమలుచేసిన దాఖలాల్లేవు. అయినా ఇవేమీ ఎల్లో జర్నల్ అయిన ఈనాడుకు కన్పించవు. అర్హుల జాబితా ప్రదర్శించినా అక్కసే.. మరోవైపు.. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకానికి మరింత మెరుగులద్ది పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. వడ్డీ రాయితీ చెల్లింపుల్లో జాప్యానికి తావులేకుండా ఉండేందుకు ఏడాదిలోపు రుణం చెల్లించిన లబ్ధిదారుల డేటా బ్యాంకుల ద్వారా ఎస్వీపీఆర్ పోర్టల్‌లో అప్లోడ్ చేసేలా ఏర్పాటుచేశారు. ఈ డేటా ఈ–క్రాప్ డేటాతో ధ్రువీకరించి అర్హులైన రైతుల జాబితాను గుర్తించి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు.. మొబైల్ ద్వారా ఎస్వీపీఆర్ (సున్నా వడ్డీ పంట రుణాల) పోర్టల్ https://karshak. ap. gov. in/ ysrsvpr/లోకి వెళ్లి హోంపేజీలో ‘know your status‘ అనే విండో ఓపెన్ చేసి తమ ఆధార్ నంబరుతో చెక్ చేసుకునే వెసులుబాటు రైతులకు కల్పించారు. ఒకవేళ ఏడాదిలోగా రూ.లక్షలోపు రుణాలు తిరిగి చెల్లించి వడ్డీ రాయితీకి అర్హత పొంది, జాబితాలో తమ పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కూడా కల్పించారు. ఇలా అర్హత పొందిన రైతుల ఖాతాల్లో వారు చెల్లించిన నాలుగు శాతం వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా జమచేస్తున్నా ఈనాడు తట్టుకోలేకపోతోంది. అంతేకదా.. రామోజీ. ఎక్కువమంది లబ్ధి పొందేలా విస్తృత ప్రచారం ఇక రూ.లక్ష లోపు రుణం సకాలంలో చెల్లించడం ద్వారా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని వడ్డీ భారం నుంచి రైతులు విముక్తి పొందేందుకు వీలుగా రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత నెల 28న రబీ 2020–21, ఖరీఫ్ 2021 సీజన్లలో అర్హత పొందిన 8.22 లక్షల మంది రైతులకు రూ.160.55 కోట్ల వడ్డీ రాయితీని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల పొదుపు ఖాతాలకు జమచేశారు. ఇలా గడిచిన మూడున్నరేళ్లలో పాత బకాయిలు కలిపి 73.88 లక్షల మందికి రూ.1,838.61 కోట్లు చెల్లించారు. పాత బకాయిలకు సంబంధించే కాదు గడిచిన మూడేళ్లకు సంబంధించి కూడా ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేకుండా అర్హుల ఖాతాల్లోకి సున్నా వడ్డీ రాయితీ జమచేశారు. అయినా ఇవన్నీ విస్మరించి ఎందుకు రామోజీ ఈ వయస్సులో అబద్ధాల సాగుకు అంత ఆయాసం..? రూ.1,180.66 కోట్ల బకాయిలు ఈనాడుకు కన్పించవు కానీ, ఈ పరిస్థితులకు వైఎస్ జగన్ సర్కార్ చెక్ పెట్టింది. వడ్డీ రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ (డీబీటీ) చేసేలా మార్పుచేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. టీడీపీ హయాంలోని బకాయిల చెల్లింపునకూ ముందుకొచ్చి రైతులపట్ల తనకున్న చిత్తశుద్ధిని ఆయన చాటుకున్నారు. ఇలా 2014–15లో రూ.3.46 కోట్లు, 2015–16లో రూ.1.91 కోట్లు, 2016–17లో రూ.212.33 కోట్లు, 2017–18లో రూ.345.18 కోట్లు, 2018–19లో రూ.617.78 కోట్లు కలిపి మొత్తం 39.08 లక్షల మంది రైతులకు రూ.1,180.66 కోట్ల బకాయిలను చెల్లించారు. బాబు ఎగ్గొట్టిన ఈ బకాయిలపై ‘ఘనత వహించిన’ ఈనాడు ఏనాడు దీనిపై వార్త రాసిన పాపానపోలేదు. అలాగే, ఐదేళ్లలో కేవలం 40.61 లక్షల మందికి రూ.685.46 కోట్లే చెల్లిస్తే ఎందుకింత తక్కువ చెల్లించారని కూడా ప్రశ్నించడానికి రామోజీకి పెన్ను పెగలలేదు. రామోజీ.. అప్పట్లో అప్పులకు జమచేసుకోలేదా? వాస్తవానికి ప్రతీ సీజన్లో వ్యవసాయ అవసరాల కోసం రైతులు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుంటారు. రూ.లక్షలోపు రుణాన్ని ఏడాదిలోపు చెల్లిస్తే బ్యాంకులు వసూలుచేసే ఏడు శాతం వడ్డీలో 3 శాతం కేంద్రం రాయితీ ఇస్తుంది. మిగిలిన 4 శాతం రైతులు భరించేవారు. గతంలో ‘వడ్డీలేని రుణ పథకం’ కింద రైతులు చెల్లించిన వడ్డీ రాయితీని బడ్జెట్ కేటాయింపులను బట్టి ఏడాదికో.. రెండేళ్లకో వీలునుబట్టి బ్యాంకులకు అరకొరగా జమచేసేవారు. ఈ మొత్తం జమకాగానే బ్యాంకులు వెంటనే రైతులు చెల్లించాల్సిన అప్పు ఖాతాలకు సర్దుబాటు చేసేసేవారు. అలాగే, గతంలో క్లెయిమ్స్ డేటాను అప్లోడ్ చేయడానికి నోడల్ బ్రాంచీలకు మాత్రమే వీలుండేది. దీంతో ఎంతమంది అర్హత పొందారు.. వారికి ఎంత వడ్డీ రాయితీ జమైందో రైతులకే కాదు.. సంబంధిత బ్యాంకు శాఖలకు కూడా తెలిసేది కాదు. సామాజిక తనిఖీ కోసం బ్యాంకుల వద్ద కానీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద కానీ జాబితాలు ప్రదర్శించే పరిస్థితులు ఉండేవి కాదు. -
రైతులకు మరింత ధీమా
కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్‌కు సంబంధించి, 2021 ఖరీఫ్ కాలానికి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్‌లో ఇన్పుట్ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్ సురేష్‌బాబు, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్‌వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్‌యార్డు చైర్మన్ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్ విజయరామరాజు ఈ సందర్భంగా కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్ సీజన్‌కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్ కాలానికి ఇన్పుట్ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు. మెగా చెక్కు అందజేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ►ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్‌బాబు, నగర మేయర్ అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్ సురేష్‌బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : మల్లెల ఝాన్సీరాణి, ఆప్కాబ్ చైర్ పర్సన్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు. రైతు బాంధవుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను. – భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను. – పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష. – ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప -
రుణాలు బడా వ్యాపారులకేనా.. రైతులకు ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: బడా పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రూపాయలను నిరర్ధక ఆస్తుల(ఎన్పీఏ) కింద రద్దు చేసే పాలకులు, ఆరుగాలం కష్టపడే రైతుకు రుణమాఫీ చేయమంటే మాత్రం వెనకాడుతారెందుకని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అంబానీ, అదానీ, ఇతర సంపన్నులు బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.12 లక్షల కోట్ల రుణాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. గురువారం ఇక్కడి సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ రైతు ప్రభుత్వమా? లేక కార్పొరేట్ల ప్రభుత్వమా? అని నిలదీశారు. తెలంగాణ పర్యటనకు వచ్చి వెళ్లిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రైతు రుణమాఫీ గురించి చొరవ చూపితే బాగుండేదని హితవు పలికారు. బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రైతులకు రుణాలు ఇప్పించి ఉంటే బాగుండేదన్నారు. కానీ, కేంద్రమంత్రి పర్యటన ఉపన్యాసాలకే పరిమితం కావడం విచారకరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకకాలంలో రైతు రుణమాఫీ అమలు చేయకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదని, దీంతో రైతులు ఎక్కువ వడ్డీకి ప్రైవేట్ అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక ప్రైవేటు అప్పులు తీర్చలేని పరిస్థితిల్లో రైతులు ఉన్నారని, ఈ దుస్థితి వారి ఆత్మహత్యలకు దారితీస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు బ్యాంకర్ల నుంచి కొత్త రుణాలు ఇప్పించాలని భట్టి డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై గవర్నర్ తమిళిసై ఫైర్ -
అన్నదాతకు ఆలంబన
సాక్షి, అమరావతి: సన్న, చిన్నకారు రైతులతో పాటు వాస్తవ సాగుదారులకు పంట రుణాలపై వడ్డీ భారాన్ని తగ్గించే వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని మరింత మంది అన్నదాతలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21 రబీలో రూ.లక్ష లోపు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వచ్చే నెలలో వడ్డీ రాయితీని జమ చేయనుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7.20 లక్షల మంది అర్హులున్నట్టుగా గుర్తించారు. వడ్డీతో సహా రుణాలు చెల్లించేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువున్నందున మరింత మందికి పథకం కింద లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 31 లోగా రుణాలు చెల్లించేందుకు ఆర్బీకేల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తోంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న పంట రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో 3 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. మిగతా 4 శాతం వడ్డీని అర్హులైన రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం కింద 2019 ఖరీఫ్‌లో 14.27 లక్షల మంది రైతులకు రూ.289.42 కోట్లు, 2019–20 రబీలో 5.61లక్షల మందికి రూ.92.39 కోట్లు, 2020 ఖరీఫ్‌లో 6.67 లక్షల మందికి రూ.112.70 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా 2014–15 నుంచి 2018–19 మధ్య 42.32 లక్షల మంది రైతులకు గత ప్రభుత్వం చెల్లించని రూ.1180.66 కోట్ల బకాయిల్లో ఇప్పటివరకు 38.42 లక్షల మంది రైతులకు రూ.688.25 కోట్లు జమ చేసింది. 2020–21 రబీలో రికార్డు స్థాయిలో 38.76 లక్షల మంది రైతులకు రూ.72,724 కోట్ల వ్యవసాయ రుణాలు ఇచ్చారు. వీటిలో 12.70 లక్షల మందికి రూ.19 వేల కోట్లు పంట రుణాలుగా ఇచ్చారు. వీరిలో లక్ష లోపు రుణాలు తీసుకుని ఇప్పటికే తిరిగి చెల్లించిన వారు 7.20 లక్షల మంది. మిగతా వారు కూడా రుణాలు చెల్లించి, ఈ పథకానికి అర్హత పొందేలా ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఈ పథకం కింద రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు రైతులకు లబ్ధి కలుగుతుంది. అర్హత పొందాలంటే.. ఏ పంటపై రుణం తీసుకున్నారో ఆ పంటే సాగు చెయ్యాలి. పంట వివరాలను తప్పనిసరిగా ఈ క్రా‹ప్లో నమోదు చేయించాలి. రుణాన్ని వడ్డీతో సహా ఏడాదిలోగా (మార్చి 31వ తేదీ) చెల్లించాలి. దీనిపై ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ ఒక ఆధార్ నంబరుపై ఒక అకౌంట్ నంబర్‌ను మాత్రమే మ్యాప్ అయ్యేలా డేటాను అప్డేట్ చేస్తున్నారు. గడువులోగా రుణాలు చెల్లించిన రైతుల జాబితాను సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల వద్ద ప్రదర్శిస్తారు. అర్హులైన రైతుల వివరాలను బ్యాంకుల ద్వారా వైఎస్సార్ ఎస్వీపీఆర్ పోర్టల్‌లో ఏప్రిల్ 7వ తేదీలోగా అప్లోడ్ చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ పథకం కింద రైతులకు 4 శాతం వడ్డీ రాయితీ లభిస్తుంది, రూ.లక్ష లోపు పంట రుణాలు తీసుకొని, మార్చి 31 లోపు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని చెల్లించిన వారు బ్యాంక్‌ను సంప్రదించి పోర్టల్‌లో నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, వ్యవసాయ శాఖ కమిషనర్ -
అసలైన సాగుదారులకు దన్నుగా..
సాక్షి, అమరావతి: భూ యజమాని హక్కులకు భంగం వాటిల్లకుండా వాస్తవ సాగుదారులకు మరింత మేలు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. గడిచిన ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ నమోదు పగడ్బందీగా చేపట్టారు. రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఆర్బీయూడీపీ) ద్వారా తొలిసారిగా సర్వే నెంబర్ల వారీగా సాగు వివరాలను నమోదు చేశారు. కానీ, చాలాచోట్ల వాస్తవ సాగుదారుల స్థానంలో భూ యజమానుల పేర్లు నమోదైనట్లుగా గుర్తించారు. దీంతో ప్రస్తుత రబీ సీజన్లో సాగుచేసే ప్రతీ అసలైన రైతు వివరాలు ఈ–క్రాప్‌లో నమోదుకు చర్యలు చేపట్టారు. నిజానికి.. ఈ–క్రాప్ విధానం అమలులోకి వచ్చాక ఖరీఫ్–2020 సీజన్లో 124.92 లక్షల ఎకరాల్లో 49.72 లక్షల మంది రైతులు సాగుచేస్తున్నట్లుగా నమోదు కాగా.. రబీ 2020–21లో 34.65 లక్షల మంది రైతులు 86.77లక్షల ఎకరాలు సాగుచేస్తున్నట్లుగా నమోదయ్యాయి. అలాగే, ఖరీఫ్–2021లో 45.02 లక్షల మంది రైతులు సాగుచేస్తున్న 102.23 లక్షల ఎకరాలు నమోదు చేశారు. వీరిలో కౌలురైతులు 2.92 లక్షల మంది ఉన్నారు. కానీ, వాస్తవంగా రాష్ట్రంలో 16.56 లక్షల మంది కౌలుదారులున్నారు. వారిలో 60–70 శాతానికి పైగా సెంటు భూమి కూడా లేనివారే. సాగువేళ వీరిలో ప్రభుత్వ ప్రయోజనాలందుకుంటున్న వారు 10–20 శాతం లోపే ఉంటున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ప్రతీ వాస్తవసాగుదారుడు లబ్ధిపొందేలా ప్రభుత్వం ప్రస్తుత రబీ సీజన్లో ఈ–క్రాప్ నమోదులో మార్పులు తీసుకొచ్చింది. వీటిపై వాస్తవ సాగుదారులు–భూ యజమానులకు అర్ధమయ్యే రీతిలో ఆర్బీకే స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. సాగుదారుల గుర్తింపు ఇలా.. ► విత్తిన వారంలోపు ఆర్బీకేల్లో ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్లతో సహా క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డు (సీసీఆర్సీ) నకళ్లను అందజేయాలి. ► ఒకవేళ సీసీఆర్సీ లేకున్నా, భూ యజమాని అంగీకరించకపోయినా సరే తాము ఏ సర్వే నెంబర్, ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటల సాగుచేస్తున్నామో ఆ వివరాలను ఆర్బీకేలో తెలియజేసి ఈకేవైసీ (వేలిముద్రలు) చేయించుకుంటే రెండు వారాల్లోపు ఆర్బీకే సిబ్బంది పొలానికి వెళ్లి చుట్టుపక్కల రైతులను విచారించి వాస్తవ సాగుదారుడెవరో గుర్తిస్తారు. ► ఇలా నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా ఆర్బీకేల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తారు. తప్పులుంటే సవరిస్తారు. ► అభ్యంతరాలొస్తే మరోసారి క్షేత్రస్థాయి పరిశీలన చేసి వాస్తవ సాగుదారులను గుర్తిస్తారు. సీసీఆర్సీ అంటే.. సీసీఆర్సీ పత్రం అంటే భూ యజమానికి, సాగుదారునికి మధ్య అవగాహనా ఒప్పంద పత్రం. వలంటీర్/వీఆర్ఓ వద్ద ఉండే దరఖాస్తులో వివరాలు నింపి భూ యజమాని లేదా వారి ప్రతినిధి, సాగుదారు–గ్రామ వీఆర్వోలు సంతకం చేస్తే సరిపోతుంది. పంట కాలంలో ఎప్పుడైనా ఈ పత్రాన్ని పొందవచ్చు. దరఖాస్తు చేసుకున్న 3 రోజుల్లోనే ఈ పత్రం జారీచేస్తారు. దీని కాలపరిమితి జారీచేసిన తేదీ నుంచి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ కార్డుపొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల రైతులు వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.13,500 పెట్టుబడి సాయం పొందేందుకు అర్హులు. ఈ–క్రాప్‌తో ప్రయోజనాలు.. ► దీని ఆధారంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణం పొందవచ్చు. ► రూ.లక్షలోపు పంట రుణం ఏడాదిలోపు చెల్లిస్తే సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 4 శాతం వడ్డీ రాయితీ పొందవచ్చు. ► ఉచిత పంటల బీమా సౌకర్యం వర్తిస్తుంది. ► వైపరీత్యాల్లో పంట నష్టానికి పెట్టుబడి రాయితీ పొందొచ్చు. ► అలాగే, పంటలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరలకు అమ్ముకోవచ్చు. భూ యజమానులకు పూర్తి రక్షణ ఈ–క్రాప్‌లో వాస్తవ సాగుదారుల వివరాలు నమోదు ద్వారా భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లదు. ఈ వివరాలేవీ రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయరు. కోర్టులో సాక్షులుగా కూడా చెల్లవు. ఈ–క్రాప్ ఆధారంగా పొందిన పంట రుణం కట్టకపోయినా, ఎగ్గొట్టినా భూ యజమాని/భూమిపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. కేవలం బకాయి వసూలు సందర్భంగా ఫలసాయంపై మాత్రమే బ్యాంకులకు హక్కు ఉంటుంది. -
TS: మొండిచెయ్యి.. సగం రుణాలూ ఇవ్వలేదు..
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్ లక్ష్యంలో సగం రుణాలు కూడా ఇవ్వకపోడం విచారకరం. ఈ సీజన్లో రూ.35,665 కోట్లు ఇవ్వా లనేది లక్ష్యం కాగా, ఇప్పటివరకు కేవలం రూ. 15,500 వేల కోట్ల మేరకే రుణాలు మంజూరు అయ్యాయి. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందుగానే రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలి. ఆ ప్రకారం జూన్‌లో ప్రారంభమయ్యే వానాకాలం సీజన్‌కు మే నెల నుంచే రుణాలు ఇవ్వాలి. కానీ రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్ ఐదు రోజుల క్రితం ముగిసింది. పంటల సాగు 111 శాతం ఉండగా రుణాల మంజూరు మాత్రం మరీ నిరాశాజనకంగా ఉంది. 1.19 కోట్ల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో నీటి వనరులు గణనీయంగా పెరిగాయి. సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో రెండు మూడేళ్లుగా వ్యవసాయ పంటల విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులున్నారు. వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగైంది. వాస్తవంగా వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారు. అయితే వరి సాగైనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ ఈ పంటలకు కూడా రుణాలు ఆ స్థాయిలో అందలేదు. (2021–22కు సంబంధించిన మొత్తాలు వానాకాలం సీజన్వే) రూ. 5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు! 2021–22 రెండు సీజన్లలో రూ. 59,440 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందులో ఈ సీజన్‌కు రూ. 35,665 కోట్లు ఇవ్వాలనుకున్నారు. కానీ ఇప్పటివరకు అందులో 43.45% మేరకే రుణాలు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. బ్యాంకుల తీరు కారణంగానే రైతులు రుణాలు పొందలేక పోయారనే విమర్శలున్నాయి. కొద్దిపాటి రుణాలు తీసుకోవడానికి రైతులు ఎలాం టి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పా సు పుస్తకాలు తీసుకొని పంట రుణాలు ఇచ్చా యి. నిస్సహాయ పరిస్థితుల్లో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారు. ఒక అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్ అప్పులు చేసినట్లు అంచనా. మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. వీరికి ప్రైవేట్ రుణాలు తప్ప మరో ఆధారం లేదని రైతు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదికేడాదికీ తగ్గుతున్న రుణాలు 2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా, రూ. 11,787 కోట్లు ఇచ్చాయి. ఇక 2012–13లో ఏకంగా 121 శాతం, 2013–14లో 103 శాతం ఇచ్చాయి. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక 2014–15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే ఇచ్చాయి. అలా క్రమంగా రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నాయి. -
వ్యవసాయం.. గ్రామీణాభివృద్ధికి పెద్దపీట
సాక్షి, అమరావతి: వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డ్) పెద్దపీట వేస్తోందని బ్యాంక్ రాష్ట్ర చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్‌కుమార్ జన్నావర్ చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయ రంగంలో పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలు కూడా సహకార బ్యాంకుల ద్వారా ఇప్పించేందుకు చొరవ తీసుకుంటున్నామని తెలిపారు. అతి తక్కువ వడ్డీ రేటుతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి నుంచి రుణాలు తీసుకుని పంట కోతల అనంతర పనులకు, గిడ్డంగుల నిర్మాణాలకు వినియోగించుకోవచ్చని రైతులకు సూచించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు రుణాలు వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగానికి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు వెనుకబడ్డాయి. ఈ రంగంలో మౌలిక వసతులు ఏర్పడాలంటే దీర్ఘకాలిక రుణాలు అవసరం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల బ్యాంకర్ల సమావేశంలో అదే విషయం చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నాబార్డ్ ఏం చేయగలుగుతుందనే దానిపై చర్చిస్తున్నాం. నాబార్డ్ ఆధ్వర్యంలో రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల నిధి (ఏఐఎఫ్) ఏర్పాటైంది. దీని నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిధిని పంట కోతల అనంతర కార్యకలాపాలు అంటే ధాన్యం నిల్వ కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్‌లు, అదనపు విలువ జోడింపు గదులు వంటి వాటి కోసమే ఇస్తారు. 324 ఎఫ్‌పీవోలకు ప్రోత్సాహం... రాష్ట్రంలో ప్రస్తుతం 324 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవోలు) ప్రోత్సహిస్తోంది. వీటిలో 259 సంఘాలు రిజిస్టర్ అయ్యాయి. ఇవి చాలా పురోగతిని సాధిస్తున్నాయి. ఆ సంఘాలు తమ ఉత్పత్తులను తామే అమ్ముకునే దశకు వచ్చాయి. వీటికి పరపతి సౌకర్యం కూడా బాగుంది. భవిష్యత్ అంతా ఎఫ్‌పీవోల పైనే ఆధారపడే పరిస్థితి రావొచ్చు. వర్షాధారిత ప్రాంతాల్లో వాటర్ షెడ్ పథకాలకు నాబార్డ్ అండగా నిలుస్తుంది. 200 వాటర్ షెడ్ పథకాలను ప్రోత్సహిస్తున్నాం. -
మాఫీ.. వారంతా హ్యాపీ
సాక్షి, చేవెళ్ల( రంగారెడ్డి): రుణమాఫీ రెండో విడతకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 16వ తేదీ నుంచి రూ.50వేల రుణాలు ఉన్నవారికి మాఫీ వర్తింపచేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన మంత్రల కేబినెట్ సమాశంలో రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. జిల్లాలో అర్హత సాధించిన రైతుల్లో 30–40 శాతానికిపైగా రెండో విడతలో లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా ఊరిస్తున్న రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ► ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 నాటికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులకు కుటుంబానికి రూ.లక్ష వడ్డీతో కలుపుకొని నాలుగు విడుతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. ► దీని ప్రకారం గత ఏడాది తొలివిడత రూ.25వేల లోపు రుణం ఉన్న రైతులకు వర్తింపచేశారు. ► ఇది జిల్లాలోని 10 శాతం మంది రైతులకు మాత్రమే వర్తించింది. కొంతమంది అర్హులైన వారికి పలు కారణాలతో వర్తించ లేదు. ► రుణాలు పొందిన రైతులు మాఫీ వస్తుందని బ్యాంకులకు బాకీలు కట్టడం మానేశారు. ► ప్రభుత్వం రుణమాఫీ ఎప్పుడిస్తోందో తెలియక బ్యాంకర్లు బాకీలు కట్టాలని రైతులపై ఒత్తిడి చేయడం పరిపాటిగా మారింది. ► రెండో విడత రుణమాఫీపై ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ► ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతుండటంతో వెంటనే రెండో విడత రుణమాఫీ విడుదలపై నిర్ణయం తీసుకుంది. ► ఈ నెల 16నుంచి రైతుల ఖాతాల్లోకి పంట రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత.. ► జిల్లాలో మొత్తం 1,46,417 మంది రైతులు రుణమాఫీ పొందేందుకు అర్హులని అధికారులు గుర్తించారు. ► ఇందులో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న పది శాతం మందికి మాత్రమే వర్తించింది. ► ఇప్పుడు రెండో విడతలో రూ.50వేల లోపు రుణాలున్న రైతులకు మాఫీ చేసేందుకు నిర్ణయించడంతో 30 నుంచి 40 శాతం మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరనుందని అంచనా వేస్తున్నారు. ► రూ.50 వేల లోపు ఉన్న రైతులకు సంబంధించి రెండో విడతలో అమలు చేసేందుకు బ్యాంకర్ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు. ► ఒకటి, రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా పక్కా సమాచారం అందుతుందని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. ► జిల్లాలో మొదటి విడతలో రూ.25వేల లోపు రుణాలున్న వారిని 17,943 మందిగా గుర్తించగా ఇందులో 10,928 మందికిగాను రూ.16.73కోట్లు విడుదల చేసింది. ► మిగతావారికి వివిధ కారణాలతో రుణమాఫీ వర్తించలేదు. వారికి ఇప్పుడు రెండో విడతలో వడ్డీతో కలుపుకొని రూ.50వేలలోపు రుణమాఫీ కానుందని అధికారులు చెబుతున్నారు. -
నేడు రైతుల ఖాతాల్లోకి ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’
సాక్షి, అమరావతి: రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా వడ్డీలేని రుణాలు ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన మాట మేరకు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం అమలు చేస్తున్నారు. లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాది లోపు ఆ రుణం తిరిగి చెల్లించిన రైతులందరికీ సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేస్తున్నారు. రైతులకు ఇప్పటివరకు రూ.1,132.54 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం అందజేసింది. ఇప్పుడు రెండో ఏడాది కూడా.. అంటే 2019–20 రబీ సీజన్లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ కింద రూ.128.47 కోట్లు చెల్లిస్తున్నారు. సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే సున్నా వడ్డీ పంట రుణాల పథకం వర్తింపజేయాలని తొలుత నిర్ణయించారు. అయితే ఈ–క్రాప్‌లో 2,50,550 మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు. మిగిలిన రైతులలో బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన వారందరికీ ఇప్పుడు సీఎం జగన్ ఉదారంగా ఈ పథకాన్ని వర్తింజేసి వడ్డీ రాయితీ చెల్లిస్తున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ చెల్లింపుల కోసం సోమవారం ఆర్థికశాఖ నిధులు విడుదల చేయగా వ్యవసాయశాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. గత ప్రభుత్వం 2014–15 నుంచి 2018–19 వరకు పెట్టిన రూ.1,180 కోట్లు వడ్డీ లేని రుణాల బకాయిలను కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఆ మేరకు ఇప్పటి వరకు అర్హులైన రైతులకు రూ.850.68 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2019 ఖరీఫ్‌కి సంబంధించి 14.27 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.281.86 కోట్లు జమచేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతన్నల సంక్షేమమే ధ్యేయంగా ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా అన్నదాతలకు రూ.61,400 కోట్ల సాయం చేసింది. (చదవండి: ప్రతి ‘పార్లమెంట్’ పరిధిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్) -
అర్జీ ఇవ్వండి.. రుణం తీసుకెళ్లండి
యాచారం: రైతులకు వ్యవసాయ పంట రుణాలు ఇవ్వడానికి యాచారం పీఏసీఎస్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉండి ఏ బ్యాంకులో రుణం పొందని రైతులకు రుణాలు ఇచ్చేందుకు పీఏసీఎస్ పాలకవర్గం కృషిచేస్తుంది. కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా రైతులకు పీఏసీఎస్ సేవలు అందేలా చూస్తున్నారు. యాచారం పీఏసీఎస్‌లో దాదాపు 7 వేలకు పైగా సభ్యులు ఉన్నారు. ఇందులో 4,985 మంది రైతులు దీర్ఘకాలిక, స్వల్పకాలిక, వ్యవసాయ తదితర పద్దుల కింద రూ.40 కోట్లకు పైగా రుణాలు పొందారు. ప్రస్తుతం దీర్ఘకాలిక రుణాల కోసం 200 మందికి పైగా అర్జీలు పెట్టుకున్నారు. గ్రామాల్లో ముమ్మర ప్రచారం.. ఈ ఏడాది యాచారం పీఏసీఎస్‌లో రూ.2 కోట్లకు పైగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు సంఘం నిర్ణయించింది. మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతి రైతును పీఏసీఎస్‌లో భాగాస్వామ్యం(రుణాలు కల్పించి సభ్యత్వం ఇవ్వడం) చేసే విధంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయా గ్రామాల్లో పీఏసీఎస్ డైరెక్టర్ల ద్వారా రైతుల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. అప్పు పరిమితి పట్టిక(క్రెడిట్ లిమిట్) తయారు చేసి డీసీసీబీకి ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇప్పటికే డీసీసీబీ నుంచి యాచారం పీఏసీఎస్‌కు రూ.50 లక్షలు మంజూరయ్యాయి. మరో రూ.1.50 కోట్ల నిధుల మంజూరుకు పీఏసీఎస్ అధికారులు అర్జీలు స్వీకరిస్తున్నారు. వ్యవసాయ పంట రుణాలు ఇలా..(ఎకరాకు) వరి, పత్తి తదితర మెట్ట పంటలకు రూ.30 వేలు కూరగాయల పంటలకు రూ.38 వేలు ప్రతి రైతుకు రుణం ఇస్తాం మండలంలోని 24 గ్రామాల్లో వ్యవసాయ భూమి కలిగి ఉండి పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న ప్రతి రైతుకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో భాగంగా వ్యవసాయ పంట రుణాలు ఇచ్చేందుకు అర్జీలు స్వీకరిస్తున్నాం. ప్రతి రైతుకు సభ్యత్వం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, యాచారం -
అధికారుల చేతివాటం.. ఓ మహిళా రైతు రూపంలో..
చెన్నై : పంట రుణమాఫీలో సహకార సంఘాల్లోని సిబ్బంది మాయాజాలం ప్రదర్శించి ఉండడం వెలుగుచూసింది. రశీదు కోసం వచ్చే రైతుల వద్ద లంచం పుచ్చుకోవడమే కాదు, మాయాజాలం రూపంలో రూ. 25 లక్షల మేరకు మోసాలకు పాల్పడినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తూ సీఎం పళనిస్వామి ప్రకటించడమే కాదు, తక్షణంలో అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. రుణాల మాఫీకి సంబంధించిన రశీదులను రైతులకు అందించే పనిలో సాగుతోంది. అయితే సహకార సంఘాలు, బ్యాంకుల్లో పనిచేస్తున్న కొందరు సిబ్బంది మాయాజాలం, అవినీతి రూపంలో రుణమాఫీపై విమర్శలు బయలుదేరాయి. రశీదుల కోసం వచ్చే రైతుల వద్ద లంచం కోరడం, అధిక మొత్తంలో రుణాల్ని మాఫీ చేయాల్సి ఉంటే, అందులో మాయాజాలం ద్వారా లక్షలు దండుకునే పనిలో కొందరు సిబ్బంది ఉండడం వెలుగులోకి వచ్చింది. ఈ మాయాజాలం వ్యవహారంలో ఓ మహిళా రైతు రూపంలో వెలుగులోకి వచ్చింది. తిరువణ్ణామలై జిల్లా వందవాసి సమీపంలోని తీర్చుర్ సహకార బ్యాంక్‌లో రూ. 50 వేలు రుణమాఫీకి సంబంధించిన రశీదు కోసం మహిళా రైతు శ్రీదేవి ప్రయతి్నంచారు. అయితే, అక్కడి కార్యదర్శి అన్నాదురై చేతులు తడపాల్సిందేనని పట్టుబట్టారు. తనకు రూ.5 వేలు ఇస్తేనే, రశీదు అని స్పష్టం చేయడంతో ఆ మహిళా రైతు విజిలెన్స్ వర్గాల్ని ఆశ్రయించారు. పథకం ప్రకారం శుక్రవారం సాయంత్రం అన్నాదురైను పట్టుకునేందుకు విజిలెన్స్ వర్గాలు సిద్ధమయ్యాయి. ఆయన ఆమె ఇచ్చిన డబ్బును చేతిలో తీసుకోకుండా, బల్లపై పెట్టి వెళ్లి పోవాలని సూచించడంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోలేని పరిస్థితి. శనివారం సియామంగంలోని ఆ కార్యదర్శి ఇళ్లు, తీర్చుర్ కార్యాలయంలో సోదాల్లో నిమగ్నం కావడం గమనార్హం. ఒక్క తిరువణ్ణామలై జిల్లాలోనే రూ. 25 లక్షల మేరకు రుణమాఫీ పేరిట మాయ సాగినట్టు తేలడంతోనే విజిలెన్స్ విచారణ, సోదాలు ముమ్మరంగా సాగుతుండడం గమనార్హం. కోవైలో ఓ రైతు వద్ద లంచం పుచ్చుకుంటూ పొల్లాచ్చి మహాలింగపురం సహకార బ్యాంక్‌లో పనిచేస్తున్న సెల్వరాజ్, ఆర్ముగంలో విజిలెన్స్‌కు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో సహకార సంఘాలు, బ్యాంక్‌లపై విజిలెన్స్ పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. -
అన్నదాతకు 'ఆర్థిక దన్ను'
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉండటంతో వారికి మరింత చేయూత లభిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నదాతకు రుణాల మంజూరుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. రైతులతోపాటు కౌలుదారులకు కూడా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. సీజన్ ఆరంభం కాగానే పెట్టుబడికి అవసరమైన రుణాల కోసం అన్నదాతల అగచాట్లు వర్ణనాతీతంగా ఉండేవి. చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగినా అదునుకు రుణాలందేవి కావు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, దళారుల వద్ద ఎక్కువ వడ్డీకి డబ్బు తీసుకోవాల్సి వచ్చేది. వచ్చిన పంటను అప్పు ఇచ్చినవాళ్ల చేతిలో పెట్టగా మిగిలిందే రైతులకు దిక్కయ్యేది. ఒకవేళ పంట విపత్తు బారిన పడితే ఆ అప్పులు తీర్చేదారి కనిపించేదికాదు. రెండేళ్లుగా ఈ పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సీజన్ ప్రారంభానికి ముందే చేతికందుతున్న వైఎస్సార్ రైతుభరోసాతో నారుమళ్లు పోసుకునేందుకు ఇబ్బందిలేకుండా ఉంది. 2019–20లో 94.47 లక్షల మందికి రూ.1.14 లక్షల కోట్ల రుణాలు ప్రభుత్వం రైతుకు దన్నుగా ఉండటంతో వారికి రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. 2019–20 వ్యవసాయ సీజన్లో రూ.1.15 లక్షల కోట్ల రుణాలివ్వాలన్నది లక్ష్యం కాగా.. 94,47,103 మంది రైతులకు రూ.1,13,998 కోట్ల రుణాలిచ్చాయి. ఖరీఫ్‌లో పంట రుణాలు 48.60 లక్షల మందికి రూ.52,669 కోట్లు, టర్మ్ రుణాలు 6,36,266 మందికి రూ.12,908 కోట్లు ఇవ్వగా.. రబీలో పంటరుణాలు 34,48,181 మందికి రూ.36,604 కోట్లు, టర్మ్ రుణాలు 5,02,656 మందికి రూ.11,817 కోట్లు ఇచ్చాయి. 2020–21లో రూ.1.28 లక్షల కోట్ల రుణవితరణ లక్ష్యం 2020–21 వ్యవసాయ సీజన్లో రూ.1,28,659 కోట్ల రుణాలు మంజూరు చేయాలని బ్యాంకులకు లక్ష్యంగా నిర్దేశించారు. బ్యాంకులు జనవరి 20 నాటికి 69,87,298 మంది రైతులకు రూ.90,558 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. గడిచిన ఖరీఫ్‌లో రూ.75,237 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, 56,74,500 మంది రైతులకు రూ.74,155 కోట్లు (99శాతం) ఇచ్చాయి. దీన్లో 48,19,306 మంది రైతులకు రూ.57,575 కోట్ల పంటరుణాలు, 8,55,194 మందికి రూ.16,580 కోట్ల టర్మ్ రుణాలు ఉన్నాయి. 2019 ఖరీఫ్‌తో పోలిస్తే గడిచిన ఖరీఫ్‌లో పంటరుణాలు రూ.4,906 కోట్లు, టర్మ్‌రుణాలు రూ.3,672 కోట్లు అదనంగా ఇచ్చాయి. రబీలోను అదే జోరు ప్రస్తుత రబీ సీజన్లో రూ.53,422 కోట్లు రుణాలు ఇవ్వాలన్నది బ్యాంకులకు లక్ష్యంకాగా.. ఇప్పటివరకు 13,12,798 మంది రైతులకు రూ.16,403 కోట్లు ఇచ్చాయి. పంటరుణాలు రూ.36,407 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 11,33,185 మంది రైతులకు రూ.12,584 కోట్లు అందజేశాయి. టర్మ్‌రుణాలు రూ.17,015 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 1,79,613 మంది రైతులకు రూ.3819 కోట్లు ఇచ్చాయి. సీసీఆర్సీపై రూ.లక్ష రుణమిచ్చారు. నాకు సొంతంగా ఎకరం ఉంది. ఆరెకరాలు కౌలుకు తీసుకున్నా. దాళ్వాలో కంద, క్యాబేజీ, మినుము సాగుచేస్తున్నా. కౌలుకార్డు (సీసీఆర్సీ) ఇచ్చారు. ఆ కార్డుపైనే మా గ్రామంలో సహకార బ్యాంకులో అప్పు కోసం దరఖాస్తు చేశా. రూ.లక్ష మంజూరు చేశారు. గతంలో ఇలా కార్డుపై ఎప్పుడూ రుణం పొందలేదు. చాలా సంతోషంగా ఉంది. – పావులూరి మురళీకృష్ణ, కౌలురైతు, పెద ఓగిరాల, కృష్ణాజిల్లా లక్ష్యానికి మించే రుణాలిస్తాం గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా లక్ష్యానికి మించే రుణాలిస్తాం. ఖరీఫ్‌లో 99 శాతం రుణాలిచ్చాం. రబీలో ఇప్పటికే రూ.16 వేల కోట్ల రుణాలిచ్చాం. వచ్చే రెండు నెలల్లో లక్ష్యానికి అనుగుణంగా రైతులకు రుణాలిస్తాం. – బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ కౌలురైతులకు విరివిగా రుణాలు 2020–21 వ్యవసాయ సీజన్లో బ్యాంకులు 1,81,102 మంది కౌలుదారులకు రూ.760 కోట్ల రుణాలు మంజూరు చేశాయి. 4,13,278 మంది సాగుదారులకు క్రాప్ కల్టివేటర్స్ రైట్ కార్డు (సీసీఆర్సీ) జారీచేయగా, వారిలో 58,772 మందికి వ్యక్తిగతంగా రూ.318 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఈ కార్డుదారులతో ఏర్పాటైన 16,387 జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (జేఎల్‌జీ), రైతుమిత్ర గ్రూపు (ఆర్ఎంజీ)ల్లోని 1,22,330 మందికి రూ.442 కోట్ల రుణాలు మంజూరు చేశారు. -
రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది..
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం. ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి 90 శాతం హామీలు అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ధర్నాలు చేసినా పరిహారం వచ్చేది కాదు గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది. – శ్రీధర్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా సాక్షి, అమరావతి : ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతుల్లో కలిగించామన్నారు. 2019 ఖరీఫ్‌కు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్లో బటన్ నొక్కి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్పుట్ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ఈ రోజు నిజంగా మరో ఘట్టం అన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదని, మొదటిసారిగా ఆ నమ్మకం కలిగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా అందుతోందని వివరించారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ సున్నా వడ్డీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు గతంలో ఏం జరిగింది? ► గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015–16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. ► 2015–18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. మనం ఏం చేస్తున్నాం? ► ఏ సీజన్లో పంట నష్టాన్ని అదే సీజన్లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం. ► అక్టోబర్‌లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు రూ.132 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది. ఎవరికైనా ఈ పథకాలు మిస్ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి. ► వైఎస్సార్ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. పేద రైతులకు మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. రైతుల కోసం బకాయిలు చెల్లించాం ► గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8,655 కోట్లు ఉచిత విద్యుత్ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1,180 కోట్లు ఇస్తున్నాం. ► రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్ ► పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్ డిసెంబర్లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది. అన్నదాతల కోసం ఎన్నెన్నో చేస్తున్నాం ► 13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. ► పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం. ► 2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్ సమయంలోనూ రూ.3,200 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం. ఎంతో ఆశ్చర్యపోతున్నాం సీఎంగా జగన్మోహన్రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్ జగన్) వచ్చాక చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి మీ హయాంలో సాగు సులభమైంది మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ.3,218 వడ్డీ మాఫీ వచ్చింది. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా మీరే కడుతున్నారు. వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది. – ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గుంటూరు జిల్లా నంబూరు రైతులు మీ పట్ల నమ్మకం పెరిగింది మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది. మీ పనితీరు పట్ల ప్రజల్లో పూర్తిగా నమ్మకం కలిగింది. సెప్టెంబర్‌లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే. – విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా -
ఆ అవినీతి మూట.. రూ.23 కోట్లపై మాటే
ఓ సారి అధికారం ఇస్తే పది కాలాలపాటు ప్రజల సేవలో తరించాలనుకోవాలి...ప్రజల మన్ననలు పొందుతూ వారి మదిలో పదిలంగా స్థానం సంపాదించాలని ప్రజాప్రతినిధి తపన పడాలి. కానీ టీడీపీ హయాంలో ప్రజాప్రతినిధులంటే నిధుల స్వాహాకే వచ్చినట్టుగా...అందుకే పదవిని చేపట్టినట్టుగా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. ఆ ఐదేళ్లే కాకుండా రానున్న ఐదేళ్లలో కూడా దోపిడీకి స్కెచ్ వేసుకొని మరీ స్వాహాకు ఉపక్రమించడం మరీ విడ్డూరం. అదృష్టవశాత్తూ వారు అధికారానికి దూరమయ్యారు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే నిలువు దోపిడీ జరిగేది. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పచ్చ నేతల ముందు చూపుతో సహకార సంఘాల్లో కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. జిల్లాలోని ఏ సహకార సంఘాన్ని కదిలించినా గత టీడీపీ ఏలుబడిలో ఎటు చూసినా అవినీతి కుంభకోణాలు బట్టబయలవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అండాదండా చూసుకుని తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోయారు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమనే ధీమాతో టీడీపీ నేతలు సహకార సంఘాల్లో దొంగలు పడ్డట్టుగా చొరబడి దొరికినంత దోచుకున్నారు. చంద్రబాబు మరోసారి సీఎం అవుతారు, పంట రుణాలు మాఫీ చేస్తారని ఆ పార్టీ ఏలుబడిలోని సహకార సంఘాల పాలక వర్గాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు గట్టి నమ్మకంతో ఉన్నారు. అతి విశ్వాసంతోనే బినామీ పేర్లతో కోట్లు రుణాలు లాగేశారు. తీరా ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి ఘోర పరాభవాన్ని రుచి చూపించారు. ఈ పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. ప్రభుత్వం వచ్చేస్తుంది, చంద్రబాబు రుణ మాఫీ అమలవుతుందనే గుడ్డి నమ్మకంతో జిల్లాలోని పలు సహకార సంఘాల ప్రతినిధులు నకిలీ పాస్ పుస్తకాలు, బినామీ పేర్లతో రూ.కోట్లకు పడగలెత్తారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా అనంత ఉదయభాస్కర్ బాధ్యతలు స్వీకరించాక ఈ కుంభకోణాలను ఒకటొకటిగా ఛేదిస్తున్నారు. గతం దొంగల దోబూచులాట కొన్ని సంఘాలు, బ్రాంచీల్లో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కుంభకోణాలు బయటకు రాకుండా సంఘాల్లో పనిచేస్తున్న అధికారులు దాచిపెడుతున్నారు. గత పాలకవర్గాల్లో సంఘాలపై పడి నిలువునా దోచుకున్న వారే కావడం గమనార్హం. గత టీడీపీలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ వరుపుల రాజా, సీఈఓల హయాంలో డీసీసీబీ, సహకార సంఘాలు కుంభకోణాలమయంగా మారిపోయాయి. ఈ కుంభకోణాల గుట్టును ‘సాక్షి’ వరుస కథనాలతో రట్టు చేస్తున్న సంగతి పాఠకులకు విదితమే. ఇలా ఏజెన్సీలోని మొల్లేరు, మెట్ట ప్రాంతంలో లంపకలోవ, కోనసీమలో వద్దిపర్రు...తదితర సొసైటీలపై పడి రూ.కోట్లు కొట్టేసిన వైనాన్ని సాక్షి’ వెలుగులోకి తేవడం, డీసీసీబీ చైర్మన్ అనంతబాబు విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకుంటున్నారు. గండేపల్లిలో తాజాగా... ఈ వరుసలోనే తాజాగా మెట్ట ప్రాంతంలోని గండేపల్లి సహకార సంఘం, గండేపల్లి డీసీసీ బ్రాంచీలో రూ.కోట్లు కొల్లగొట్టిన కుంభకోణం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 2017 నవంబరు నెల నుంచి గండేపల్లి బ్రాంచి పరిధిలోని గండేపల్లి పీఏసీఎస్‌లో నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్లు, బినామీ రైతుల పేరుతో స్వాహా బాగోతమిదీ. గండేపల్లి డీసీసీబీ బ్రాంచి సూపర్వైజర్గా నేదూరి వాసుదేవరెడ్డి గతేడాది అక్టోబరు 28న జాయినయ్యారు. 2020 జనవరి 30న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం, చైర్మన్ ఆదేశాల మేరకు గండేపల్లి సొసైటీ రికార్డులను బ్యాంకులో పరిశీలించేందుకు సూపర్వైజర్ ప్రయత్నించారు. అందుకు సొసైటీ, బ్రాంచిల నుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ క్రమంలో 2017 నవంబరు 28 నుంచి ఇచ్చిన రుణాలకు సంబంధించి రికార్డులు బ్యాంక్‌కు ఇవ్వలేదనే విషయం గుర్తించారు. గండేపల్లి బ్రాంచిలో సైతం రికార్డులను దాచిపెట్టారు. లోతుగా పరిశీలించే క్రమంలో బ్యాంకులో ఉన్న షాడో రిజిస్టర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా కొంత సమాచారాన్ని సూపర్వైజర్ సేకరించడంతో విషయం డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లిందని విశ్వసనీయ సమాచారం. సూపర్వైజర్ సంతకం లేకుండానే.. సూపర్వైజర్ సంతకం లేకుండా పది మంది సభ్యుల రుణాలు రెన్యువల్ చేసిన వైనం ఆ సందర్భంలోనే బయటపడింది. తన ప్రమేయం లేకుండా రుణాలు రెన్యువల్ చేయడంతో ఇందులో పెద్ద కుంభకోణమే దాగి ఉందనే అనుమానం, ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందనే భయం వెరసి సూపర్వైజర్ డీసీసీబీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఈ క్రమంలోనే రికార్డులు పరిశీలించే సరికి తీగ లాగితే డొంక కదిలినట్టు గండేపల్లి సొసైటీలో కోటి రూపాయల బినామీ రుణాల బాగోతం బయటకు వచ్చిందంటున్నారు. 10 మంది సభ్యుల రుణాలకు సంబంధించి అడ్వాన్సు స్టేట్మెంట్, రికవరీ స్టేట్మెంట్పై సొసైటీ సూపర్వైజర్ సంతకాలు లేకపోవడం గమనార్హం. మేనేజర్ ఒక్క కలం పోటుతో రూ.99,93,000 లక్షలు స్వల్పకాలిక, దీర్ఘకాలిక పంట రుణాలను 2020, ఫిబ్రవరి 17న రెన్యువల్ చేయడం విశేషం. మొదట గుర్తించిన పది మంది సభ్యుల బినామీ రుణాలు రెన్యువల్ చేయడంతో మరిన్ని రుణాలు ఇదే రీతిన రెన్యువల్ చేశారని తెలియవచ్చింది. అలా గండేపల్లి సొసైటీలో మొత్తం 156 మంది సభ్యుల పేరుతో బినామీ పాస్‌పుస్తకాలు, నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ బాండ్ పేపర్లతో సుమారు రూ.23 కోట్లు రుణాలు అప్పటి పాలకవర్గం హయాంలో విడుదలయ్యాయి. ఈ 156లో మొత్తం 50 మంది సభ్యుల(బినామీలు) రుణాలను రెన్యువల్ చేయగా, మిగిలిన 106 మంది రెన్యువల్ చేసే క్రమంలోనే విషయం బయటకు పొక్కడంతో బ్రేక్ పడిందంటున్నారు. ఈ నకిలీ పాస్‌పుస్తకాలు, డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా ఒక ప్రింటింగ్ మెషీన్‌ను గండేపల్లిలో ఏర్పాటు చేశారని, చివరకు బాండు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ సీల్‌ను కూడా టేంపరింగ్ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ బినామీ రుణాలకు సంబంధించిన మొత్తం జాబితా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు కూడా చేరినట్టు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా డీసీసీబీ నిష్పక్షపాతమైన విచారణ జరిపితే కుంభకోణం వెలుగులోకి రానుంది. ఇంకా మా దృష్టికి రాలేదు గండేపల్లి బ్రాంచ్ పరిధిలో రుణాల అవకతవకల విషయం నా దృష్టికి రాలేదు. జిల్లాలో ఏ సొసైటీ, బ్రాంచ్‌లో అవకతవకలు జరిగినట్టు మా దృష్టికి వచ్చినా వెంటనే చైర్మన్ అనంతబాబు ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుని రికవరీ కూడా చేస్తున్నాం. గండేపల్లి సొసైటీ విషయం చైర్మన్‌తో మాట్లాడతాను. – ప్రవీణ్‌కుమార్, డిసీసీబీ ఇన్చార్జ్ సీఈవో -
గత ఏడాది లక్ష్యానికి మించి పంట రుణాలు
సాక్షి, అమరావతి: గత ఆర్థిక సంవత్సరం (2019–20)లో ఖరీఫ్, రబీతో కలిపి బ్యాంకర్లు రైతులకు లక్ష్యాన్ని మించి పంట రుణాలను అందించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించడమే కాకుండా గత ప్రభుత్వం బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్మును కూడా చెల్లిస్తామని ప్రకటించడంతో బ్యాంకులు లక్ష్యానికి మించి పంట రుణాలను మంజూరు చేశాయి. నిజానికి గత ఏడాది ఖరీఫ్ రుణాల లక్ష్యం రూ.51,240 కోట్లు కాగా.. రూ.51,511 కోట్లను అందించాయి. అలాగే.. గత రబీలో పంట రుణాలు రూ.32,760 కోట్లకుగాను రూ.37,762 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 115.27 శాతం. మొత్తం వ్యవసాయ రంగానికి గత ఆర్థిక ఏడాది రూ.1,15,000 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.1,13,997 కోట్ల రూపాయల మేర బ్యాంకులు రుణాలను మంజూరు చేశాయి. ఇది లక్ష్యంలో 99.13 శాతం. సర్కారు దన్నుతో రుణాలకు బ్యాంకుల ఆసక్తి ఇదిలా ఉంటే.. ఈ ఆర్థిక ఏడాది ఇప్పటికే మంచి వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ఈ సంవత్సరం ఖరీఫ్, రబీ కలిపి రూ.94,524 కోట్లు పంట రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.18,323 కోట్లను బ్యాంకులు మంజూరు చేశాయి. అలాగే, ఖరీఫ్, రబీ కలిపి వ్యవసాయ టర్మ్ రుణాల కింద రూ.34,036 కోట్లను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఇప్పటికే రూ.1,639 కోట్లను మంజూరు చేశాయి. సకాలంలో పంట రుణాలను చెల్లించే రైతులకు సున్నా వడ్డీని వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో బ్యాంకులు కూడా పంట రుణాలను మంజూరు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. -
కౌలు రైతులకూ పంట రుణాలు
సాక్షి, అమరావతి: రైతులకు అన్నివిధాలా అండదండలు అందిస్తూనే.. కౌలు రైతులకూ పంట రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు పంట రుణాల పక్షోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. ఈ సందర్భంగా కిసాన్ క్రెడిట్ కార్డులపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కౌలు రైతులందరికీ పంట సాగు హక్కు పత్రాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారంటే.. రైతుల హక్కులకు భంగం కలగదు: పిల్లి సుభాష్‌చంద్రబోస్ ► వ్యవసాయ రంగం అభివృద్ధిపై సీఎం వైఎస్ జగన్ దృష్టి సారించారు. ► రైతులతో పాటు కౌలుదారులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో నూతన సాగుదారుల చట్టాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ► ఈ చట్టం వల్ల భూ యజమానులైన రైతుల హక్కులకు ఎటువంటి భంగం కలగదు. ► 11 నెలల సాగు అనంతరం కౌలు హక్కులు వీడిపోయేలా చట్టం రూపొందించాం. ► కౌలుదారుల వివరాలను అధికారులకు చెప్పాల్సిన నైతిక బాధ్యత రైతులపై ఉంది. ► కేంద్ర ప్రభుత్వం కేవలం రైతులకు మాత్రమే పంట రుణాలిస్తోంది. ఏపీలో రైతులతో పాటు కౌలుదారులకూ రుణాలు అందించాలని సీఎం నిర్ణయించారు. కౌలు రైతులకు రూ.8,500 కోట్ల రుణాలు : కురసాల కన్నబాబు ► రుణ పక్షోత్సవాల్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ సమావేశాలు నిర్వహించి పంట సాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కార్డులు పొందిన కౌలు రైతులందరికీ పంట రుణాలు అందిస్తాం. ► రాష్ట్రంలో ఇప్పటివరకు 4,02,229 మందికి సీసీఆర్సీ కార్డులు అందజేశాం. మరో లక్షన్నర వరకూ కార్డులు అందిస్తాం. రూ.8,500 కోట్లను కౌలుదారులకు పంట రుణాలుగా అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా నిర్దేశించారు. ► త్వరలో జిల్లాలు, మండల స్థాయిలో వ్యవసాయ సలహా బోర్డులు ఏర్పాటు చేయబోతున్నాం. అభ్యుదయ రైతు అధ్యక్షతన ఏర్పాటయ్యే ఈ బోర్డులు పంటల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తాయి. ► రైతులకు వడ్డీ లేని రుణ బకాయిల కింద రూ.1,150 కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసింది. ► ఈ విషయంలో బ్యాంకర్లు సైతం హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఇది మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. రూ.200 కోట్లతో పొగాకు కొనుగోళ్లు ► పొగాకు కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అన్ని ప్లాట్‌ఫారాల్లో కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ► రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కంటే 55.5 శాతం అధికంగా కురవటం శుభసూచకం. ఖరీఫ్ పనులు ఆశాజనకంగా ఉన్నాయి. ఇప్పటికే 32 శాతం వరి నాట్లు పూర్తయ్యాయి. ► సీఎం జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో తీసుకున్న చర్యల కారణంగా ఈ ఏడాది మే నాటికే 12.61 లక్షల మంది రైతులకు 8.43 లక్షల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు అందజేశాం. ఇప్పటికే రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందజేశాం. ► ప్రస్తుత వర్షాల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల నారుమడులు ముంపునకు గురైనట్టు సమాచారం అందుతోంది. వివరాలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించాం. సంబంధిత రైతులను ఆదుకుంటాం. -
రుణ ప్రణాళికేదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో వానాకాలం సీజన్ రుణ ప్రణాళిక ఖరారు కాలేదు. పంట రుణాల పంపిణీపై ఇంకా సందిగ్ధత నెలకొంది. వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు విత్తనాలు విత్తుతున్నారు. సీజన్ ఆరంభంలోనే రుణ ప్రణాళిక విడుదల చేసి వ్యవసాయ అవసరాలకు విరివిగా పంట రుణాలు ఇవ్వాల్సి ఉండగా.. ఆ దిశగా అడుగులు పడడం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్డౌన్ నేపథ్యంలో పంటల సాగుకు కర్షకుల వద్ద డబ్బులు లేవు. రైతుబంధు సొమ్ము ఇంకా అందలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పంట రుణాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. వర్షాలు కురుస్తుండడంతో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో విత్తనాలు విత్తారు. మరికొన్ని రోజుల్లో పంటల సాగు మరింత ఊపందుకోనుంది. వీలైనంత త్వరంగా ప్రణాళిక ఖరారు చేసి రుణ వితరణ చేపడితేనే రైతుకు అండ లభిస్తుంది. గతేడాది రూ.1,050.55 కోట్లతో ఖరీఫ్ రుణ ప్రణాళిక ఖరారు చేయగా.. ఇందులో రూ.486.34 కోట్లను మాత్రమే రైతులకు రుణంగా ఇచ్చారు. జిల్లాలో వానాకాలం సాగే కీలకమైనది. ముఖ్యంగా ఈ సీజన్లో పంట మార్పిడి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా నియంత్రిత సాగు విధానాన్ని జిల్లా వ్యవసాయ శాఖ రూపొందించింది. రికార్డు స్థాయిలో పంటలు సాగవుతాయని అంచనా వేసింది. దాదాపు 4 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారని ప్రణాళికలో పేర్కొన్నారు. ప్రధానంగా పత్తి రెండు లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రస్తావించారు. ఇప్పటికే వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలో 70వేల ఎకరాల్లో విత్తనాలు విత్తినట్లు వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇందులో 60వేల ఎకరాల్లో పత్తికాగా.. మరో పది వేల ఎకరాల విస్తీర్ణంలో కంది, జొన్న, పెసర తదితర పంటలు వేశారు. అంటే.. సాగు ప్రారంభమైనా రుణ ప్రణాళిక ఖరారు కాకపోవడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా మే నెలలోనే ప్రణాళికకు తుదిరూపు ఇచ్చి రుణ వితరణ మొదలు పెట్టాల్సి ఉంది. కోవిడ్ నేపథ్యలో విధించిన లాక్డౌన్ వల్ల ఆలస్యం జరిగిందని బ్యాంకర్లు వెల్లడిస్తున్నారు. బ్యాంకుల మెలిక..: జిల్లా వ్యాప్తంగా 2.70 లక్షల మంది రైతులు ఉండగా ఇందులో సుమారు 1.60 లక్షల మంది పంట రుణాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. రుణ ప్రణాళికతో సంబంధం లేకుండా కొన్ని బ్యాంకులు రైతులకు పంట రుణాలు పంపిణీ చేస్తున్నాయి. మిగిలిన బ్యాంకర్లు మెలిక పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వం తాజాగా పంట మార్పిడి విధానాన్ని తెరపైకి తేవడంతో వ్యవసాయ శాఖ దానిపైనే ప్రధానదృష్టి కేంద్రీకరిస్తున్న నేపథ్యంలో బ్యాంకులు విరివిగా రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐ నుంచి నిబంధనలు రాకపోవడం వల్లనే రుణ ప్రణాళిక ఖరారులో జాప్యం జరిగిందని లీడ్‌బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరులోగా ప్రణాళిక ఖరారవుతుందని చెప్పారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులు రుణ వితరణ చేపట్టాయన్నారు. -
వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1.46 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతుండటంతో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2020–21)లో వ్యవసాయ రుణ ప్రణాళిక రూ.1,46,302 కోట్లుగా అధికారులు తాత్కాలిక అంచనా వేశారు. ఇందులో పంట రుణాలు రూ.1,05,034 కోట్లు కాగా వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.41,268 కోట్లున్నాయి. ఎక్కడా విత్తనాల కొరత లేకపోవడం, రైతు భరోసా ద్వారా అన్నదాతలకు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందుతుండటం, పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున గత ఖరీఫ్‌లో అంచనాలను మించి అదనంగా 17.85 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం నమోదైంది. ఈసారి ఖరీఫ్‌లో 90.15 లక్షల ఎకరాలు సాగు కావచ్చని అంచనా వేస్తున్నా రైతన్నలకు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో సాగు విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే సర్టిఫైడ్ విత్తనాలు అందుబాటులోకి రావడం, ఎరువుల దగ్గర నుంచి రైతులకు ఏది కావాలన్నా ప్రభుత్వం సమకూరుస్తుండటంతో ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. రికార్డు స్థాయిలో సాగు, దిగుబడులు.. అధికారం చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో 172 లక్షల మెట్రిక్ టన్నులు నమోదైంది. గత ఖరీఫ్‌లో 87.80 లక్షల ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేయగా అంచనాలను మించి 105.65 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం నమోదు కావడం విశేషం. గత ఏడాది వైఎస్సార్ రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయంగా రూ.6,594 కోట్లను 46.69 లక్షల మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందచేసింది. నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చొరవ చూపి కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చారు. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో పాటు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడి నమోదైంది. అంతే కాకుండా కరోనా కష్ట కాలంలో రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏకంగా రూ.2,200 కోట్లను ధరల స్ధిరీకరణ నిధి నుంచి ప్రభుత్వం వ్యయం చేసింది. ఆర్బీకేలతో విత్తనాలకూ ‘భరోసా’ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో భారీ, మధ్య తరహా ప్రాజెక్టులు, చిన్న తరహా ప్రాజెక్టులు, ఏపీఎస్ఐడీసీ కింద రాష్ట్రంలో 90.15 లక్షల ఎకరాల్లో సాగు కావచ్చని అధికారులు ముందస్తు అంచనా వేశారు. అయితే గతేడాది లెక్కలను బట్టి చూస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా రైతు భరోసా ద్వారా ఈ సంవత్సరం తొలి విడతగా ఇప్పటికే రూ.3,675 కోట్లను నేరుగా 49.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో మే 15వ తేదీనే నగదు జమ చేసింది. అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్నదాతలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాల సరఫరాను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 8.43 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై గ్రామాల్లో పంపిణీ చేశారు. ఎరువులు బఫర్ స్టాక్ రైతులందరికీ నూటికి నూరు శాతం కిసాన్ క్రెడిట్ కార్డులను అందచేయడమే కాకుండా పంట రుణాలను అందజేయాలని ప్రభుత్వం బ్యాంకర్లను ఆదేశించింది. ఈ–పంట పోర్టల్‌లో నమోదైన రైతులందరికీ బ్యాంకులు పంట రుణాలను అందజేయనున్నాయి. రైతులకు ఎరువులు కొరత లేకుండా సరఫరా చేసేందుకు అవసరానికి మించి బఫర్ స్టాక్ సిద్ధం చేయాలని మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 17.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులకుగానూ ఇప్పటికే 11 లక్షల మెట్రిక్ టన్నులను సిద్ధంగా ఉంచారు. 1.39 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కూడా అందుబాటులో ఉంది. ఖరీఫ్‌లో రైతులకు ఎలాంటి లోటు లేకుండా ముందస్తు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. రుణాలకూ ఇబ్బంది లేదు.. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం కావడంతో ఇక రైతులకు అవసరమైన అన్ని సదుపాయాలు గ్రామంలోనే అందనున్నాయి. గతంలో రైతులు విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా మండల కేంద్రాలకు, నియోజకవర్గ కేంద్రాలకు వెళ్లి రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. అదునులో విత్తనాలు లభ్యం కాక అవస్థలు ఎదుర్కొనేవారు. ఇప్పుడు రైతులకు ఏది కావాలన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ అసిస్టెంట్లు, ఉద్యాన అసిస్టెంట్లు, సెరికల్చర్ అసిస్టెంట్లు రైతులకు చేదోడువాదోడుగా ఉంటారు. సాగు చేస్తూ ఇప్పటివరకు రుణాలు పొందని రైతులను గుర్తించి దగ్గరలోని బ్యాంకుల్లో నమోదు చేయిస్తారు. -
రైతులకు 'కరోనా' రుణం
సాక్షి, హైదరాబాద్: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా వైరస్ వణికిస్తున్నవేళ వారికి అండగా నిలవనుంది. రానున్న వానాకాలానికి రైతులు తీసుకునే పంట రుణాలకు అదనంగా 10 శాతం కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంకర్లకు విన్నవించింది. రైతులు ఏ పంటలు వేస్తారో, ఆ ప్రకారం జిల్లాల వారీగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. రైతులకు వారికున్న భూమి, పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగా రుణ పరిమితి ఉంటుంది. ఆ నిర్ణీత సొమ్ముకు అదనంగా 10 శాతం ఇస్తారు. ఉదాహరణకు ఒక రైతుకు రూ.50వేల పంట రుణ అర్హత ఉందనుకుంటే, దానికి పది శాతం కలిపి రూ.55 వేలు ఇస్తారు. అలాగే రూ.లక్ష తీసుకునే రైతులకు రూ.1.10 లక్షలు ఇస్తారు. దీని ప్రకారం వానాకాలంలో పంట రుణ లక్ష్యం కూడా ఆ మేరకు పెరుగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తం రూ. 33,713 కోట్ల రుణం... రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయం మేరకు 2020–21 రుణ ప్రణాళికలో వానాకాలానికి రూ.30,649 కోట్ల రుణ లక్ష్యం ఉంది. కేంద్ర ప్రభు త్వ ఆదేశాల మేరకు ఈ రుణ లక్ష్యానికి అదనంగా 10 శాతం అంటే రూ.3,064 కోట్లు అవుతుంది. అది కలిపితే రూ.33,713 కోట్లు అవుతుందని అంటున్నా రు. ఇది ఈ వానాకాలం సీజన్‌కే వర్తిస్తుందని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. కాగా, గతేడాది వానాకాలం సీజన్లో రూ.29,244 కోట్ల రు ణ లక్ష్యం ఉంటే.. రూ.18,711 కోట్లు మాత్రమే రైతులకు బ్యాంకులు పంపిణీ చేశాయి. అలాగే యాసంగి సీజన్లో రూ.19,496 కోట్ల లక్ష్యం పెట్టుకోగా.. రూ.14,622 కోట్లు మాత్రమే ఇచ్చాయి. ప్రతి సీజన్లోనూ ఏదో కారణంతో పూర్తిస్థాయిలో రుణాలివ్వకుండా బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. రుణమాఫీ లబ్ధిదారుల స్క్రీనింగ్... రుణమాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మొదటి విడతగా రూ.25 వేల లోపున్న రైతులకు రూ.1,200 కోట్లు జమ చేస్తారు. లబ్ధిదారుల జాబితా స్క్రీనింగ్ ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. రైతులు కొందరు రెండు మూడు బ్యాంకుల్లోనూ పంట రుణాలు తీసుకొని ఉంటారన్న భావనతో స్క్రీనింగ్ జరుపుతున్నారు. ఇది పూర్తయ్యాక తుది జాబితా తయారుచేసి రుణమాఫీ సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఇక పంట రుణాల మాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) పోర్టల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ప్రయోగాత్మకంగా రూ.11 కోట్లు ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసి చూశారు. అది సక్సెస్ అయినట్లు అధికారులు తెలిపారు. -
4 విడతల్లో రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్: వడ్డీతో సహా రూ.లక్ష వరకు ఉన్న వ్యవసాయ పంటల రుణాలను ప్రభుత్వం మాఫీ చేయనుంది. గతంలోలాగే ఈసారి కూడా నాలుగు విడతల్లో రుణమాఫీ అమలు చేయనుంది. వ్యవసాయ రుణమాఫీ పథకం–2018 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్వల్పకాలిక పంట రుణాలు, బంగారం తాకట్టుపై గ్రామీణ ప్రాంతా ల్లో తీసుకున్న పంట రుణాలకు రుణమాఫీని వర్తింపజేసింది. కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ చేయనున్నారు. దీని ప్రకారం 2014 ఏప్రిల్ 1 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా అర్హులైన వారందరికీ రుణమాఫీ వర్తింపజేయనున్నారు. రైతులు పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం అధిక వడ్డీకి అప్పులు తీసుకుని కొనుగోలు చేసే విధానానికి స్వస్తి చెప్పేందుకు సీఎం కేసీఆర్ హామీకి అనుగుణం గా సంస్థాగత రుణాలను మాఫీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకున్న వారికి ఇది వర్తించదు. రైతు కుటుంబం అంటే భర్త, భార్య వారి మీద ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణనలోకి తీసుకుంటారు. రూ.లక్షలో ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ చార్జీలు, ఇన్సూరెన్స్ వంటివి ఉండవు. ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రూ.25 వేల వరకు ఉన్న పంట రుణాలు తీసుకున్న రైతులకు ఒకే దశలో మాఫీ చేస్తారు. మిగతా రైతులకు మిగిలిన మొత్తాన్ని 4 దశలుగా మాఫీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో చెల్లించనున్నారు. రైతుల జాబితాల తయారీ ఇలా.. - 2018 డిసెంబర్ 11 నాటికి స్వల్పకాలిక పంట రుణా లు బకాయిపడిన రైతుల జాబితాల (ఏ–లిస్టు)ను గ్రామాల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో ప్రతి రుణ సంస్థ (బ్యాంకు) బ్రాంచీ తయారు చేయాలి. - బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాల మాఫీ గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే వర్తించనుంది. 2018 డిసెంబర్ 11 నాటికి ఇలాంటి రుణ బకాయిలు కలిగిన రైతుల జాబితాల (బీ–లిస్టు)ను ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో గ్రామాల వారీగా ప్రతి బ్యాంకు తయారు చేయాలి. - బంగారం తాకట్టుపెట్టి అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులు/బ్యాంకు బ్రాంచీల నుంచి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించదు. అయితే అర్బన్, మెట్రోపాలిటన్ బ్యాంకులకు సంబంధించిన గ్రామీణ బ్రాంచీల నుంచి బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తించనుంది. - స్వల్పకాలిక పంట రుణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బంగారంపై తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన రైతుల జాబితాలను బ్యాంకు బ్రాంచీల మేనేజర్లు పోల్చి చూసి రూ.లక్ష వరకు రుణ బకాయిలు కలిగిన రైతు తుది జాబితాల (సి–లిస్టు)ను నిర్దేశిత నమూనాలో రూపొందించాలి. స్వల్ప కాలిక పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాలు, గ్రామీణ ప్రాంతాల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాలు, తుది రైతుల జాబితాలను లీడ్ బ్యాంక్ మేనేజర్‌తో పాటు జిల్లా కలెక్టర్లకు బ్రాంచీ మేనేజర్లు పంపాలి. - కొందరు ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీల నుంచి పంట రుణాలు పొంది ఉంటారు. ఒక బ్యాంకుకు చెందిన వేర్వేరు బ్రాంచీలు లేదా ఇతర బ్యాంకుల బ్రాంచీల నుంచి రుణాలు పొంది ఉండొచ్చు. ఒక కుటుంబానికి గరిష్టంగా రూ.లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ వర్తించేలా నియంత్రించడంతో పాటు డూప్లికేషన్/మల్టీపుల్ ఫైనాన్సింగ్ నియంత్రణకు మండల స్థాయి బ్యాంకర్ల కమిటీ (జేఎంఎల్‌బీసీ) సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో బ్యాంకర్లందరూ తమ బ్యాంకుల ఏ, బీ, సీ జాబితాలను తీసుకొచ్చి ఇతర బ్యాంకుల జాబితాలతో పోల్చి చూడాలి. అన్ని బ్రాం చీల తుది జాబితాలను మండల తహసీల్దార్ పరిశీలించి చూడాలి. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉన్నారా? లేదా రుణ గ్రహీతలంతా వ్యవసాయ భూములు కలిగి ఉన్నారా? అన్న విషయాన్ని తహసీ ల్దార్ పరిశీలించి చూడాలి. పరిశీలన తర్వాత ఏవైనా తప్పుడు క్లెయిమ్స్ ఉంటే తొలగించాలి. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు బ్రాంచీల నుంచి రుణా లు పొందిన రైతు కుటుంబ సభ్యులను జేఎంఎల్‌బీసీ కమిటీ సభ్యులు గుర్తించాలి. వారి జాబి తాల (డీ–లిస్టు)ను నిర్దేశిత నమూనాలో తయారు చేయాలి. జిల్లా సహకార ఆడిట్ అధికారి పర్యవేక్షణలో సహకార శాఖ ఆడిటర్లు ప్రాథమిక సహకార సంఘాలు, డీసీసీబీల ఏ, బీ, సీ జాబితాలను డీ జాబితాలతో పోల్చి చూడాలి. జిల్లా సహకార ఆడిట్ అధికారి తన పరిధిలోని మండలాలకు ఆడిటర్లను కేటాయించాలి. జిల్లాస్థాయి ఆడిట్ నివేదిక ఇవ్వాలి. జేఎంఎల్‌బీసీ రూపొందించిన డీ–జాబితాలను మండల స్థాయిలో అన్ని బ్యాంకుల బ్రాంచీలకు అందుబాటులో ఉంచాలి. - కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీల నుంచి రుణాలు తీసుకుని ఉంటే ఐటీ ఆధారంగా గుర్తించేందుకు బ్యాంకులు సమర్పించే తుది రైతుల జాబితా (సి–లిస్టు)ను విశ్లేషించి తుది డీ–జాబితాలను తయారు చేస్తారు. - రైతులకు ఎన్ని బ్యాంకుల్లో ఎన్ని అప్పు ఖాతాలున్నా ఒక కుటుంబానికి ఒక లక్ష మేరకే రుణం మాఫీ చేయాలని నిర్ణయించారు. - కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పంట రుణానికి అర్హులైతే రూ. లక్ష మొత్తంలో ఉన్నవారందరికీ సమానంగా ఇస్తారు. - స్వల్పకాలిక పంట రుణాలు 18 నెలల చెల్లింపు కాల వ్యవధి ఉన్న వాటికే మాఫీ వర్తిస్తుంది. ఉద్యాన పంటల కోసం పొందిన స్వల్పకాల రుణాలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. - రైతు కుటుంబాలను గుర్తించేందుకు ఏఈవో, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీల సాయం తీసుకుంటారు. వీరికి మండల తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయాధికారి పర్యవేక్షకులుగా ఉంటారు. - తాత్కాలిక తుది జాబితా (జాబితా–ఈ)ను సంబంధిత గ్రామాలలో గ్రామసభ నిర్వహించి ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా సామాజిక ఆడిట్ నిర్వహిస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత బ్రాంచ్‌ల వారీగా అర్హు్హలైన రైతుల తుది జాబితాను లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా కలెక్టర్‌కు పంపుతారు. - రైతుల వారీగా అర్హులైన వారి జాబితాను జిల్లాల్లో బ్యాంకర్ల మీటింగ్‌లో సమీక్షించి, రికార్డు చేసి దాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి పంపిస్తారు. అదే ఐటీ పోర్టల్‌లో ఆప్‌లోడ్ చేస్తారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తిరిగి బ్యాంకుల వారీగా రైతుల వారీగా చెల్లించాల్సిన మొత్తం వివరాలను, ప్రభుత్వం మంజూరు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయిస్తుంది. అర్హుల గుర్తింపు ఇలా.. - మొదటి సారి మాఫీ చేసినప్పుడు తీసుకున్న కటాఫ్ తేదీ తర్వాత 2014 ఏప్రిల్ 01 నుంచి 2018 డిసెంబర్ 11 వరకు రైతులు తీసుకున్న, రెన్యువల్ పంట రుణాలు, వడ్డీలు కలుపుకొని రూ.లక్ష మించకుండా మాఫీ చేస్తారు. వీటికి వర్తించదు.. - భాగస్వామ్య (టై అప్) రుణాలు - మూసేసిన పంట రుణాలు/రైటాఫ్ చేసిన రుణాలు - జాయింట్ లయబిలిటీ గ్రూప్ (జేఎల్‌జీ)/రైతు మిత్ర గ్రూప్ (ఆర్ఎంజీ)/లోన్ ఎలిజిబిలిటీ కార్డు (ఎల్ఈసీ)లకు ఇచ్చిన రుణాలు - రీస్ట్రక్చర్డ్/రీషెడ్యూల్డ్ రుణాలు - రుణమాఫీ ప్రయోజనం రైతులకు అందించేందుకు ఐటీ వ్యవస్థ లేదా పోర్టల్‌ను వ్యవసాయ శాఖ తయారు చేయాలి. రైతుల సమాచారం కోసం, వారి రుణాల మొత్తం వంటివి ఫైనల్ చేసేందుకు దీన్ని వినియోగించాలి. -
‘రైతు బంధు’పై స్పష్టత లేదు..
సాక్షి, హైదరాబాద్: పంట రుణాల మాఫీపై తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. లక్ష రూపాయల వరకు మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని.. తెలంగాణ వచ్చిన తర్వాత ఆరువేల మంది రైతులు అప్పులు బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. రైతు బీమా 59 ఏళ్ల లోపు వారికి మాత్రమే వర్తింపుచేస్తున్నారని.. ఆత్మహత్య చేసుకున్న రైతుకు 6 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఉత్తర్వులు అమలు చేయడం లేదని మండిపడ్డారు. రైతు బంధును నిర్వీరం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఎకరాల లోపు ఉన్నవారికే రైతు బంధు ఇస్తున్నారన్నారు. వడ్డీ రాయితీ కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చిన రాయితీలు నిలిపివేయడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఆంక్షలు లేకుండా రైతు బంధు అమలు చేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. కిసాన్ సెల్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై చర్చించామని.. రాబోయే బడ్జెట్లో సమావేశాల్లో కూడా చర్చిస్తామని వెల్లడించారు. ఎకరానికి రెండు క్వింటాలు కందులు కొనుగోలు చేస్తామని చెప్పడం భావ్యం కాదన్నారు. పసుపు క్వింటాలు కు 10వేల రూపాయలు మద్దతు ధర ఇవ్వాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. -
రైతులకు వడ్డీ లేని రుణాలు
చండీగఢ్: మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు తనఖా లేకుండా రూ. 3 లక్షల వరకు వడ్డీలేని పంట రుణం, షెడ్యూల్ కులాల వారికి రూ. 3 లక్షల వరకు షరతుల్లేని రుణం ఇస్తామని బీజేపీ ప్రకటించింది. త్వరలో జరగనున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకోసం ఆ పార్టీ ఆదివారం మేనిఫెస్టో విడుదల చేసింది. ‘ఇది పూర్తి నిబద్ధతలో రూపొందించిన పత్రం. సమాజంలోని అన్ని వర్గాలు ప్రయోజనం పొందేలా మేనిఫెస్టోను తయారు చేశాం’అని బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చండీగఢ్‌లో ప్రకటించారు. సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ మాట్లాడుతూ, అవినీతి రహిత పాలన ఇవ్వాలన్న వాగ్దానాన్ని తాము నెరవేర్చామని, భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని అన్నారు. మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు.. ► రైతులకు 3 లక్షల వరకు వడ్డీ లేని పంట రుణం ► కర్షకుపంటలకు కనీస మద్దతు ధర. కిసాన్ కళ్యాణ్ ప్రధీకరణకోసం వెయ్యి కోట్ల బడ్జెట్ ► యువజన అభివృద్ధి, స్వయం ఉపాధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు. రూ. 500 కోట్లతో 25 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ► ఐదెకరాల లోపు ఉన్న 14 లక్షల మంది రైతులకు రూ. 3 వేల వృద్ధాప్య పెన్షన్. ► విద్యార్థులకు ఉన్నత విద్యకోసం షరతులు లేని రుణాలు ► విద్యార్థినుల కోసం పింక్ బస్సు సేవలు. వారి ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణ. -
క‘రుణ’ చూపని బ్యాంకులు
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): కొద్దిరోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడింది. అయితే అన్నదాతలకు బ్యాంకుల నుంచి చేయూత కరువైంది. రబీ పంట రుణాల పంపిణీని ఇంతవరకు చేపట్టలేదు. ఖరీఫ్‌లో అంతంత మాత్రంగానే రుణాలు పంపిణీ చేశాయి. బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రబీలో ప్రధానంగా శనగ, జొన్న, ధనియాలు, మినుము, వేరుశనగ, వరి సాగుచేస్తారు. శనగ 1.90 లక్షల హెక్టార్లలో, వరి 25,119, జొన్న 56,397, మొక్కజొన్న 8,248, మినుము 14294 హెక్టార్లలో సాగు కానున్నాయి. ఖరీఫ్ సాధారణ సాగు 6.27 లక్షల హెక్టార్లు ఉండగా, ఇప్పటి వరకు 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌కు వాతావరణం అనుకూలించడంతో ఉత్సాహంగా విత్తనం పనులకు శ్రీకారం చుడుతున్నారు. ప్రభుత్వం కూడా రబీ రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేస్తోంది. రుణాలకు తప్పని తిప్పలు రైతులకు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశాల్లో పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ బ్యాంకర్లలో మార్పు రాలేదు. ఖరీఫ్ పంట రుణాల పంపిణీ లక్ష్యం రూ.4,360.42 కోట్లు ఉండగా, బ్యాంకులు మాత్రం రూ.3136.07 కోట్లు పంపిణీ చేసినట్లు స్పష్టం అవుతోంది. జిల్లాలో రైతుల ఖాతాలు 6.92 లక్షలు ఉన్నాయి. వీరందరూ పంట రుణాలకు అర్హులే. ఖరీప్‌లో కేవలం 3,53,212 మంది రైతులకు మాత్రమే పంట రుణాల పంపిణీ చేశాయి. ఎస్బీఐ, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులు లక్ష్యాలను అధిగమించినా.. ఆంధ్రా, కెనరా , కేడీసీసీ బ్యాంకు లు నిర్లక్ష్యం వహించాయి. ఖరీఫ్‌లో ఈ నెల 10వ తేదీ నాటికి 71.92 శాతం మాత్రమే పం టరుణాల పంపిణీలో లక్ష్యాన్ని సాధించారు. రబీలో అంతులేని నిర్లక్ష్యం.. రబీలో 3 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. పంట రుణాల లక్ష్యం రూ.2749.58 కోట్లు. జిల్లాలోని 27 బ్యాంకులకు లక్ష్యాలు ఇచ్చారు. ఏపీజీబీ రూ.562.14 కోట్లు, ఆంధ్రబ్యాంకు రూ.416.72 కోట్లు, ఎస్బీఐ రూ.412.70 కోట్లు, జిల్లా సహకార కేంద్రబ్యాంకు రూ.419.52 కోట్లు, సిండికేట్ బ్యాంకు రూ.247.80 కోట్లు, కెనరా బ్యాంకు రూ. 114.62కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.102.89 కోట్లు ప్రకారం పంపిణీ చేసే విధంగా లక్ష్యలు ఇచ్చారు. కొన్ని మండలాల్లో ఆశాజనకంగా వర్షాలు పడటంతో కొద్ది రోజులుగా రబీ పంటల సాగు చేస్తున్నా.. పంట రుణాల పంపిణీ అతీగతీ లేదు. బ్యాంకులు మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాల్సి ఉంది. రుణం ఇవ్వడం లేదు రైతు పేరు పెద్దమద్దిలేటి. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామవాసి. ఆరు ఎకరాల పొలం ఉంది. రబీ సీజన్లో శనగ వేయడానికి విత్తనాలు సిద్ధం చేసుకున్నాడు. పంట రుణం కోసం ఆంధ్రాబ్యాంకు, పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఎన్ని సార్లు తిరిగినప్పటికీ రుణం ఇవ్వడం లేదు. -
పంట రుణాల్లో భారీ దుర్వినియోగం
సాక్షి, మహబూబాబాద్: మానుకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సుమారు 70 లక్షల రూపాయల పంట రుణాలలో దుర్వినియోగం జరిగినట్లు కొంత మంది రైతులు విలేజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మానుకోట పీఏసీఎస్ కార్యాలయంతో పాటు డీసీఓ, డీసీసీబీ బ్యాంక్‌కు వెళ్లి ఆ విషయంపై ఆరా తీశారు. దీంతో వారం రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో 18 గ్రామాలు ఉన్నాయి. దానిలో సుమారు 13000 మంది సభ్యులు ఉన్నారు. వారిలో కేవలం 1545 మంది చిన్న, సన్నకారు రైతులు మాత్రమే రుణాలు తీసుకున్నారు. వారికి లక్షలోపు రుణాలు మాత్రమే ఇవ్వడం వల్ల రుణాలు తీసుకున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉంది. 2012లో నాలుగు కోట్లు, 2014లో 7 కోట్లు ఆ తర్వాత 2019 వరకు కేవలం 6 కోట్ల రుణాలు మాత్రమే ఇవ్వడం జరిగిందని కార్యాలయం సిబ్బంది తెలిపారు. రుణ విధానం పీఏసీఎస్‌లో రైతులు పట్టాదారు పాస్‌పుస్తకం, వన్‌బీ, పహానీ వాటి జిరాక్స్‌లతో పాటు ఒరిజినల్ పరిశీలిస్తారు. అనంతరం ఆ రైతుల రుణాల విషయంపై పరిశీలించి దానిని బట్టి క్రెడిట్ లిమిట్ ప్రకారం రుణాలు ఇస్తున్నారు. ఎకరాకు 10వేల నుంచి 20,000 వరకు ఇచ్చిన రైతులే ఎక్కువగా ఉన్నారు. 50,000లోపు రుణాలు ఇచ్చిన రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎక్కువ రుణం కోసం ఇతర బ్యాంకులలో తీసుకున్నారు. డీసీసీబీ మానుకోట శాఖ బ్యాంక్‌లో సుమారు 6 కోట్లు రుణాల వరకు రైతులు తీసుకున్నారని రుణమాఫీ జరిగినప్పుడు దాని ప్రకారం కొత్త రుణాలు ఇచ్చారు. సొసైటీ నుంచి పేర్లు పంపితే బ్యాంక్ సూపర్వైజర్, మేనేజర్ వెరిఫికేషన్ చేసి వారి ఖాతాలో జమ చేయాలి. రుణాల దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు మానుకోట పీఏసీఎస్ పరిధిలో సుమారు రూ.70 లక్షల రుణాలు దుర్వినియోగం జరిగినట్లు కొంత మంది రైతులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం విలేజ్ అధికారి తిరుపతి మానుకోట పీఏసీఎస్ కార్యాలయంలో పలు రికార్డులను తనిఖీ చేసినట్లు సమాచారం. ఆ తర్వాత డీసీసీబీ మానుకోట శాఖ బ్యాంక్‌కు వెళ్లి బ్యాంక్ మేనేజర్ అశ్రితను కలిసి ఫిర్యాదుపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయగా ఆ పనిలో ఉన్నారు. ఆ రెండు కార్యాలయాలతో పాటు జిల్లా కేంద్రంలోని డీసీఓ కార్యాలయంనకు కూడా వెళ్లి ఆరా తీçశారు. మానుకోట మండలంలోని అమనగల్ గ్రామానికి చెందిన రైతులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిధుల దుర్వినియోగమా.. కాజేశారా.. రూ 70 లక్షల రుణాల డబ్బులు దుర్వినియోగం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. రైతుల పేరుతో రుణాలు కాజేశారా లేదా ఏదైనా నిధులు విషయంలో దుర్వినియోగం చేశారో తేలాల్సి ఉంది. 2012 నుంచి 2019 వరకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్ల కమీషన్ డబ్బులు రాగా వాటిని వేతనాలుగా తీసుకున్నామని సిబ్బంది చెబుతున్నారు. ఆదే నిబంధన కూడా ఉందని తెలిపారు. బ్యాంక్ మేనేజర్ సొసైటీ సీఈఓ జియామోద్దీన్కు ఉత్తర్వుల లేఖను పంపి రెండు రోజులలో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులను ఆరా తీస్తే వాస్తవాలు వెలుగులోకి.. విలేజ్ అధికారులు నివేదికతో పాటు అధికారుల నేరుగా సొసైటీ, బ్యాంక్ రికార్డులను పరిశీలించి ఆన్లైన్ నివేదికను తీసుకొని రైతులను ఆరా తీస్తే వాస్తవాలు బయటికి వస్తాయని సభ్యులు అంటున్నారు. కేవలం 1545 మాత్రమే రుణాలు తీసుకున్నారు. మిగిలిన సభ్యులు కూడా ఆందోళనకు గురి అవుతున్నారు. తమ భూములకు సంబంధించిన పత్రాలు కూడా సొసైటీలో ఉన్నాయని తమ పేరున రుణాలు తీసుకున్నారా అనే టెన్షన్ వారిలో మొదలైంది. విలేజ్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తేనే వాస్తవాలు బయటికి వస్తాయని అంటున్నారు. రుణాల విషయంతో పాటు వాటికి విడుదలైన నిధులు, ధాన్యం కొనుగోళ్ల కమీషన్ అన్ని విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరుతున్నారు. మానుకోట మండలం మల్యాల పీఏసీఎస్ విషయంలో పెద్ద ఎత్తున్న ని««ధుల దుర్వినియోగం జరిగి మూత పడింది. అందులో జరిగిన అవినీతి నేటికి పూర్తి స్థాయిలో బయట పడలేదు. -
‘రుణమాఫీ’లో తోసేద్దామని..
పథకం ప్రకారమే ఎడపల్లి సిండికేట్ బ్యాంకులోఅక్రమార్కులు రెండున్నర కోట్ల రూపాయల కుంభకోణానికి తెర తీసినట్లు స్పష్టమవుతోంది. బోగస్ పట్టాలు, నకిలీ వన్‌బీ, పహాణీలతో రైతుల పేరిట ఖాతాలు తీసి పంట రుణాలను మంజూరు చేసి లేపుకున్నారు. ఈ రుణాలను రుణమాఫీ కింద మాఫీ చేయించి తప్పించుకుందామని స్కెచ్ వేశారు. అయితే పథకం వికటించి అక్కమార్కుల గుట్టు రట్టయ్యింది. సాక్షి, నిజామాబాద్ : పంట రుణాల కుంభణంకోలో ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలోని సిండికేట్ బ్యాంక్‌లో బోగస్ పట్టాలు, నకిలీ వన్‌బీ, పహాణీలతో సుమారు రూ.2.5 కోట్ల వరకు అక్రమార్కులు పంట రుణాల పేరిట లూటీ చేసిన విషయం విధితమే ! ఈ రుణాలను ప్రభుత్వ రుణమాఫీ పథకంలో మాఫీ చేయించి, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని ముగించేసేలా పక్కా ప్రణాళికతో అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణ తేలింది. రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం కాస్త జాప్యం జరిగింది. ఈలోగా ఈ బాగోతం వెలుగులోకి రావడంతో బ్యాంకు ఉన్నతాధికారులతో పాటు, బాధితులు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే లీడ్ బ్యాంకు ఉన్నతాధికారులు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ పథకానికి అర్హులైన రైతుల జాబితాను ఆయా బ్యాంకుల బ్రాంచీల ద్వారా సేకరించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇలా తయారు చేసిన జాబితాలో ఈ బోగస్ పంటరుణాలను కూడా చేర్చేసి, చేతికి మట్టి అంటకుండా నిధులు కాజేయాలనే పక్కా ప్రణాళికతో వ్యవహారం నడిపినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అప్రమత్తమైన రెవెన్యూ శాఖ.. సిండికేట్‌బ్యాంకులో భారీ కుంభకోణం వెలుగుచూడటంతో రెవెన్యూశాఖ అప్రమత్తమైంది. నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, నకిలీ పహాణీలు, వన్‌బీలు తెరపైకి రావడంతో రెవెన్యూ అధికారులు కుంభకోణంపై దృష్టి సారించారు. ఇలా పంటరుణాలు పొందిన రైతుల పేర్లు, పాసుపుస్తకాలు, పహాణీలు, 1బీ రికార్డులు తమకు ఇవ్వాలని రెవెన్యూ అధికారులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఇందుకు బ్యాంకు ఉన్నతాధికారులు అంగీకరించకపోవడంతో స్థానిక తహశీల్దార్ అశోక్ కుమార్ వివరాల కోసం లిఖిత పూర్వకంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ఆదేశాల మేరకు స్థానిక ఆర్డీఓ కూడా ఈ వ్యవహారాన్ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పోలీసు ఉన్నతాధికారులు కూడా కుంభకోణంపై ఆరా తీస్తున్నారు. ఇంకా లిఖిత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదులు అందకపోవడంతో ముందస్తుగా వివరాలను సేకరిస్తున్నారు. దళారుల ముఠాగా మారి.. బ్యాంకు ఉన్నతాధికారులు, ఆయా గ్రామాల్లో ఉన్న దళారులు చేతులు కలిపి భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గ్రామాల్లో అమాయకులకు కాస్త డబ్బులను ఆశగా చూపి, వారి ఆధార్ కార్డులను సేకరించి వారితో ఖాతాలను తెరిపించారు. ఖాతాదారులకు భూమి ఉన్నట్లు రికార్డులు సృష్టించి రుణం మంజూరు చేశారు. ఈ రుణాన్ని సదరు బినామీ ఖాతాల్లోకి మళ్లించి ఆ ఖాతానుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఇలా ఏకంగా రూ.కోట్లలో బ్యాంకును లూటీ చేయడం జిల్లాలో చర్చనీయాశంగా మారింది. అంతర్గత విచారణ కొనసాగుతోంది : రేణుక, రీజినల్ మేనేజర్.. పంట రుణాల మంజూరులో జరిగిన లోపాలపై అంతర్గత విచారణ కొనసాగుతోంది. విచారణ పూర్తయ్యే వరకు వివరాలు బయటకు చెప్పడం కుదరదు. ఈ విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాము. -
గడువు దాటితే వడ్డింపే..
సాక్షి, సుల్తానాబాద్: కూలీల కొరత, ఎరువుల ధరలు పెరిగిపోతుండటంతో సాగు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెట్టుబడుల సమయంలో బయట అప్పులు దొరకని సందర్భంలోనే సన్న, చిన్నకారు రైతులు పంటరుణాలతో పాటు బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటున్నారు. వీటిపై వడ్డీరాయితీని ఎత్తివేస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా 60,335 మంది రైతులకు రూ.570కోట్లు పంపిణీ చేశారు. గతేడాది ఖరీఫ్‌లో 17,385మంది రూ.217 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 374 మంది రైతులు బంగారు నగలను ఆయా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి సుమారు రూ.4 కోట్ల రుణాలు తీసుకున్నారు. నవీకరణకే ప్రాధాన్యం.. బ్యాంకర్లు అయిదేళ్ల నుంచి పంట రుణాల నవీకరణకే ప్రాధాన్యమిస్తున్నారు. నిర్ధేశించిన లక్ష్యం చేరేందుకు ఈ మార్గాలు ఎంచుకున్నారు. ఇదివరకు తీసుకున్న రుణానికి చెల్లించాల్సిన వడ్డీని కలిపి కొత్తగా రుణం మంజూరు చేసినట్లు కాగితాల్లో రాసుకుంటున్నారు. ఇలా చేయడంతో రైతుల చేతికి కొత్తగా డబ్బులు రావడంలేదు. ఇక సహకార సంఘాల్లో పుస్తక సర్దుబాట్లతోనే సరిపెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెట్టుబడి సాయం పంటపొలాల్లో దుక్కులు సిద్ధం చేసేందుకే సరిపోవడం లేదు. చిన్నకమతాల రైతులు తమ వద్ద ఉన్న బంగారు నగలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి పంట రుణాలు పొందుతున్నారు. బ్యాంకర్లు ఇప్పటి వరకు వీటికి వడ్డీరాయితీని వర్తింపజేసేవారు. ఇకపై ఈ విధంగా చేసే అవకాశం లేకపోవడంతో రైతుల నెత్తిన మరింత భారం పడనుంది. అమలు ఇలా.. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు నాబార్డు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సంయుక్తంగా ఏయే పంటకు ఎంత రుణం ఇవ్వాలనేది నిర్ణయిస్తాయి. రైతులు ఎంచుకునే పంట, ప్రాంతాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు అనుగుణంగా ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు ఇస్తున్నారు. సహకార సంఘాల్లోనూ ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఏటా సక్రమంగా చెల్లించే రైతులకు ఇంకా ఎక్కువగా ఇస్తున్నారు. రూ.లక్ష దాకా తీసుకొన్న రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ లభిస్తోంది. బ్యాంకర్లు వసూలు చేస్తున్న 7శాతం వడ్డీలో రాష్ట్ర సర్కారు 4 శాతం, కేంద్ర ప్రభుత్వం 3 శాతం భరిస్తున్నాయి. రూ.లక్షకు పైగా రుణాలు తీసుకొన్న రైతులు 3 శాతం వడ్డీని చెల్లిస్తున్నారు. నూతన నిబంధనలు ఇలా.. కేంద్రం వడ్డీ రాయితీ రుణ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు పెంచింది. ఈ మొత్తం వరకు 3శాతం వడ్డీ చెల్లించాల్సిన పని ఉండదు. ఇంత వరకు బాగానే ఉన్నా ఏడాదిలోగా చెల్లించకుంటే వడ్డీరాయితీ వర్తించదంటూ నిబ ంధన పెట్టింది. నగలను తాకట్టు పెట్టి తీసుకొనే రుణాలకు వడ్డీ రాయితీ వర్తించదన్నమాట. మార్గదర్శకాలకు అనుగుణంగానే.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నుంచి విడుదలయ్యే మార్గదర్శకాలకు అనుగుణంగానే వడ్డీరాయితీని బ్యాంకులు వసూలు చేస్తాయి. ఇటీవల కేంద్రం పంట రుణాల మంజూరీలో పలు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి అమలుపై మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఈ సీజన్ నుంచి అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. – ప్రేమ్‌కుమార్ లీడ్ బ్యాంకు మేనేజర్, పెద్దపల్లి -
సాగు భళా.. రుణం వెలవెల
రైతును వరుణుడు కరుణిస్తున్నా... బ్యాంకులు మాత్రం దయ చూపడంలేదు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరుమీదున్నాయి. పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కానీ చేతిలో చిల్లిగవ్వ లేక రైతన్న లబోదిబోమంటున్నాడు. ఇటువంటి తరుణంలో బ్యాంకులు రుణాలు ఇవ్వాల్సి ఉండగా కొర్రీలు పెడుతూ రైతును ఇబ్బంది పెడుతున్నాయి. గత వారం పది రోజులుగా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఇన్నాళ్లూ వర్షాలు లేక ఆగిన వరి నాట్లు ఇక పుంజుకోనున్నాయి. వారం రోజుల క్రితం వరకు 28 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 17 జిల్లాలకే పరిమితమైంది. – సాక్షి, హైదరాబాద్ సాగు విస్తీర్ణాలిలా... - ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 75.81 లక్షల (70%) ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 41.96 లక్షల (97%) ఎకరాల్లో సాగైంది. - ఖరీఫ్‌లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 24.11 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 7.90 లక్షల (33%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. తాజా వర్షాలతో అవి ఊపందుకోనున్నాయి. - మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 12.52 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.26 లక్షల (66%) ఎకరాల్లో సాగైంది. - పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.37 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.11 లక్షల (78%) ఎకరాల్లో సాగయ్యాయి. ఇందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.20 లక్షల ఎకరాలు, ఇప్పటివరకు 6.19 లక్షల (85%) ఎకరాల్లో సాగైంది. సోయాబీన్ దాని సాధారణ సాగులో 80 శాతం వేశారు. 40 లక్షల మందికి.. పెట్టుబడి సాయం.. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈసారి రైతులకు పెట్టుబడికింద ఇచ్చే రైతుబంధు సొమ్ము సరఫరా ఆలస్యమైందని అధికారులు అంటున్నారు. ఖరీఫ్‌లో దాదాపు 50 లక్షల మందికి పైగా రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉండగా, ఇప్పటివరకు 40 లక్షల మందికి రూ. 4,400 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతుబంధు సొమ్ము వచ్చినట్లుగా తమకు మెసేజ్‌లు వచ్చాయని, కానీ బ్యాంకుల్లో సొమ్ము పడలేదని కొందరు రైతులు ఆందోళనతో వ్యవసాయశాఖకు ఫిర్యాదు చేశారు. మూడో వంతే రుణాలు.. సాగు విస్తీర్ణం 70 శాతం కాగా, పంట రుణాలు మాత్రం లక్ష్యంలో దాదాపు 34 శాతానికే పరిమితమైనట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఖరీఫ్‌లో పంట రుణాల లక్ష్యం రూ. 29 వేల కోట్లు కాగా, ఇప్పటివరకు కేవలం రూ.10 వేల కోట్లకే పరిమితమైందని తెలిపాయి. వాస్తవంగా పంటల సాగు కంటే అంటే మే నెల నుంచే బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాలి. ఇప్పటికీ సాగు శాతంలో ఇచ్చిన రుణాలు సగమే. మూడు నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి. బ్యాంకుల వాదన ఇదీ.. 2015–16 సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు పేరుకుపోయిన రూ.777 కోట్ల పావలా వడ్డీ, వడ్డీలేని రుణాల బకాయిలను ప్రభుత్వం తమకు చెల్లించలేదని బ్యాంకర్లు అంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉండటంతో రిజర్వుబ్యాంకు నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు వస్తాయని అంటున్నారు. మరోవైపు పంటల రుణమాఫీపై తమకు ప్రభుత్వం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, దీంతో రైతులు బకాయిలు చెల్లించడంలేదని చెబుతున్నారు. పాత రుణాలను రైతులు రీషెడ్యూల్ చేసుకోకపోతే నిబంధనల ప్రకారం తాము కొత్త రుణాలు ఇచ్చే ప్రసక్తే ఉండదంటున్నారు. -
గిరిజన రైతులకూ పంట రుణాలు!
సాక్షి, అమరావతి: అటవీ హక్కుల పరిరక్షణ చట్టాన్ని పునరుజ్జీవింపచేసి.. వాస్తవ ప్రయోజనాలను గిరిజన రైతులకు చేరువ చేసేలా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భూమిపై టైటిల్ పొందిన గిరిజన రైతులకు ఇతర రైతులతో సమానంగా అన్ని ప్రయోజనాలు, ప్రభుత్వపరమైన లబ్ధి చేకూరేలా గిరిజన సంక్షేమ శాఖ స్పష్టమైన కార్యాచరణను సిద్ధం చేసింది. దీనివల్ల అటవీ హక్కుల చట్టం ప్రకారం టైటిల్ పొందిన రాష్ట్రంలోని ప్రతి గిరిజనుడు మైదాన ప్రాంతాల్లోని రైతులతో సమానంగా పూర్తి హక్కులు పొందగలిగేలా వ్యవస్థ రూపుదిద్దుకోనుంది. అపహాస్యం పాలైన అటవీ హక్కుల చట్టం అటవీ హక్కుల గుర్తింపు చట్టం స్ఫూర్తిని, మౌలిక ఉద్దేశాన్ని గత ప్రభుత్వాలు కాలరాసిన ఫలితంగా ఎస్టీ, ఇతర సంప్రదాయక అటవీ నివాసుల (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 (నెం.2/2007) అపహాస్యమైంది. అడవిలో నివసించే ప్రజల హక్కులను గుర్తించాలనే ఉద్దేశంతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం 2006లో ఆమోదం పొందింది. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని అన్ని అటవీ ప్రాంతాలకు వర్తింపచేశారు. గిరిజనులను గుర్తించి వారికి భూమిపై టైటిల్ హక్కును ఇచ్చారు. అయితే, వారికి భూమి ఉన్నా దానిపై రుణం రావటం లేదు. ఏ ప్రభుత్వ పథకం కింద గిరిజన రైతులకు లబ్ధి చేకూరటం లేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో దాదాపు 96 వేల మంది గిరిజనులు భూమి పొందినా, వారిలో ఐదు శాతం మందికి కూడా సగటు రైతులకు లభించే హక్కులను పొందలేకపోతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా పోడు భూములు సాగు చేసుకునే గిరిజన రైతులకు భూమిపై అన్ని హక్కులు కల్పిస్తూ దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే.. అటవీ హక్కుల చట్టం అమలుకు కచ్చితమైన ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఫలితంగా పోడు వ్యవసాయం చేసే గిరిజనులకు మైదాన ప్రాంత రైతులతో సమానంగా హక్కులు, ప్రభుత్వ పథకాలు లభిస్తాయి. ఇకపై బ్యాంకులు సైతం గిరిజనులకు పంట రుణాలు అందిస్తాయి. -
జబర్దస్త్‌గా వడ్డీ వసూలు !
సాక్షి, జగిత్యాల: పంట రుణాల రెన్యూవల్ కోసం బ్యాంకులకు వెళ్తున్న రైతులు వడ్డీ చెల్లించాలనే బ్యాంకర్ల మాటలతో లబోదిబోమంటున్నారు.గతేడాది వరకు సహకార సంఘాల ద్వారా పొందిన రుణాలకు వడ్డీ వసూలు చేయలేదు. ప్రస్తుతం సహకార సంఘాలు, బ్యాంకులు అనే తేడా లేకుండా రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నాయి. రైతులు తీసుకుంటున్న రుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇందులో కేంద్రం వాటా 3 శాతం మాఫీ చేస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం వాటా 4 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇలా జగిత్యాల జిల్లాలోని రైతుల నుంచి దాదాపుగా రూ.40కోట్లు వసూలు చేశాయి. రుణంపై ఏడు శాతం వడ్డీ రైతులు సహకార సంఘాల ద్వారా తీసుకుంటున్న రుణాలకు బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఏటా క్రమం తప్పకుండా పంట రుణాలు చెల్లించే రైతులకు ప్రభుత్వాలు బాసటగా నిలిచేందుకు వడ్డీ చెల్లించేందుకు గతంలో ముందుకొచ్చాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4శాతం వడ్డీ చెల్లించేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం పంటల ప్రారంభ సీజన్ కావడంతో కొందరు రైతులు కొత్తగా రుణాల కోసం, మరికొందరు రెన్యూవల్ కోసం బ్యాంకులు వెళ్తున్నారు. అయితే కేంద్రం చెల్లించే 3 శాతం మాఫీ పోనూ.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే 4 శాతం వడ్డీని రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. వడ్డీ చెల్లించకుంటే రుణం రెన్యూవల్‌కు ససేమిరా అంటున్నాయి. ప్రభుత్వం చెల్లించకనే తిప్పలు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 4 శాతం వడ్డీని సకాలంలో చెల్లించకనే బ్యాంకులు రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి. రెండు, మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వడ్డీ బకాయిలు రావడం లేదని బ్యాంక్ అధికారులు పేర్కొంటున్నారు. ఒక్క ఏడాదికే దాదాపుగా రూ.40 కోట్ల వరకు రావాల్సి ఉందని చెబుతున్నారు. ఈక్రమంలో ఉన్నతాధికారుల నుంచి వడ్డీ వసూలు చేయాలనే ఆదేశాలు వస్తున్నట్లు మేనేజర్లు తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని తిరిగి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏటా రూ.43 కోట్లు వడ్డీ చెల్లిస్తున్న రైతులు జిల్లాలో గతేడాది 1,91,795 మంది రైతులకు 1,35,514 మంది పంట రుణం తీసుకున్నారు. జిల్లాలోని 19 బ్యాంకులు రూ.1,055 కోట్ల పంట రుణం ఇచ్చాయి. జిల్లా రైతులే దాదాపు రూ.40–43 కోట్ల వడ్డీని గతేడాది బ్యాంకులకు చెల్లించారు. రెండు, మూడేళ్లుగా రైతులు చెల్లిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ వడ్డీ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమకాలేదు. మళ్లీ ఈ ఏడాది కూడా రుణం చెల్లిస్తామని బ్యాంకుకు వెళ్తే వడ్డీని వసూలు చేస్తున్నారు. కొన్నేళ్లుగా సహకార సంఘాలు, లీడ్‌బ్యాంక్ ఆంధ్రాబ్యాంకు రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 4 శాతం వడ్డీని వసూలు చేయలేదు. కానీ ప్రస్తుతం ఆ బ్యాంకులు సైతం ఇతర బ్యాంకుల మాదిరిగానే నాలుగు శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. -
చెక్కులతో చిక్కులేనా!
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ సొమ్మును చెక్కుల రూపంలో కాకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తే బాగుంటుందని బ్యాంకర్లు, అధికారులు భావిస్తున్నారు. రైతులకు చెక్కులిస్తే సమస్యలు ఏర్పడతాయన్నారు. మాఫీ సొమ్మును రైతుల ఖాతాల్లో కాకుండా, చెక్కుల రూపంలో ఇవ్వాలని యోచిస్తున్నట్లు సీఎం ఇటీవల శాసనసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు బ్యాంకర్లలోనూ చర్చకు దారితీసింది. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) భేటీలో చర్చకు వచ్చినట్లు తెలి సింది. రుణమాఫీకి బడ్జెట్లో ఈ ఏడాది కి రూ.6 వేల కోట్లు కేటాయించారు. గతంలో రుణమాఫీ చేసినప్పుడు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమచేసింది. దీంతో చాలాచోట్ల బ్యాంకులు రైతుల నుంచి వడ్డీ సొమ్మును వసూలు చేసుకున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని చెక్కులు ఇవ్వాలన్న భావనలో ఉంది. ఎన్నికల కోడ్ వస్తే: 2018 ఎన్నికల హామీలో భాగంగా గత డిసెంబర్ 11వ తేదీని గడువుగా లెక్కించి రైతులకు లక్ష రూపాయలలోపు రుణా న్ని ప్రభుత్వం మాఫీ చేయనుంది. ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం 40 లక్షల మంది రైతులు రుణమాఫీకి అర్హులుగా తేల్చినట్లు చెబుతున్నారు. వారందరికీ మాఫీ చేయాల్సి వస్తే దాదాపు రూ.28 వేల కోట్ల వరకు నిధులు అవసరం కావచ్చని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో రుణ మాఫీ చేయాలనుకున్నా పార్లమెంట్ ఎన్నికల కోడ్ అడ్డుగా ఉంటుంది. బడ్జెట్లో నిధులు కేటాయించినందున కోడ్ ప్రభావం ఉండదని అధికారులు అంటున్నారు. అయితే చెక్కులను పంపిణీ చేయడానికి ఈసీ అంగీకరించదని అంటున్నారు. అవసరాలకు ఖర్చు పెట్టుకుంటారేమో! బ్యాంకర్లు కొందరు రైతులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రుణాన్ని చెక్కుల రూపంలో ఇస్తే తప్పనిసరిగా బకాయి చెల్లించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కొందరు రైతులకు ఇతరత్రా అవసరాలు, అప్పులు ఉండొచ్చు. ఈ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకునే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. కాబట్టి రైతుకు చెక్కులివ్వడం కంటే బ్యాంకులకు చెల్లిస్తేనే ప్రయోజనమని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. -
దా‘రుణం’..!
నల్లగొండ అగ్రికల్చర్ : లక్ష్యం కొండంత..ఇచ్చింది గోరంత.. ఇదీ రబీ పంట రుణాల తీరు. శాసనసభ ఎన్నికల ముందు అధికార, ప్రతిపక్ష పార్టీల హామీల పుణ్యమా అని అన్నదాతలకు పంటరుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తి చూపలేదు. అసలు బ్యాంకుల చెంతకు అన్నదాతలను చేరనివ్వని పరిస్థితి. పంటరుణం కోసం బ్యాంకుల వద్దకు వెళ్తే ఖరీఫ్‌లో తీసుకున్న రుణం వడ్డీతో సహా చెల్లించి కొత్త రుణం అడగాలని అధికారులు తిరకాసు పెట్టారు. దీంతో ఇదేమి గోల అనుకుని రైతులు వాటివైపు కన్నెత్తిచూడలేదు. జిల్లాలో గత ఖరీఫ్‌లో పంట రుణలక్ష్యం రూ.1,253.93 కోట్లు కాగా, బ్యాంకులు రైతులకు పంట రుణం ఇచ్చింది కేవలం రూ.698.22 కోట్లు. అంటే 55.68 శాతం మాత్రమే రైతులు పంటరుణాలను అందుకున్నారు. అదే విధంగా ఈ రబీలో రుణలక్ష్యం రూ.835.95 కోట్లుగా నిర్దేశించగా, రైతులకు సీజన్ ముగిసినప్పటికీ ఇచ్చింది కేవలం రూ.138.32 కోట్లు. అంటే 16.55 శాతం మాత్రమే పంటరుణాలను ఇచ్చారంటే బ్యాంకులకు రైతులపై ఏమాత్రం చిత్తుశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల హామీ ఎఫెక్టేనా? శాసనసభ ఎన్నికల ముందు అధికార టీఆర్ఎస్ పార్టీ లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని, మరోవైపు ప్రతిపక్ష కూటమి రూ.2లక్షల వరకు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీల ఎఫెక్ట్ రబీ పంట రుణాలపై స్పష్టంగా కనిపించింది. రుణమాఫీని ఎప్పటినుంచి పరిగణనలోకి తీసుకుంటారో స్పష్టం చేయకపోవడంతో బ్యాంకులు రబీ రుణాలను ఇవ్వాలంటే ఆలోచనలో పడ్డాయి. ఇచ్చినవాటిని ఎప్పుడు ప్రభుత్వం చెల్లిస్తుందోనని, మళ్లీ రుణాలిచ్చి ఎందుకు ఇబ్బందులు పడాలన్న ముందుజాగ్రత్తగా బ్యాంకర్లు రబీ రుణాలను ఇవ్వకుండా బ్రేక్ వేసినట్లు సమాచారం. ఎవరైనా రైతులు బ్యాంకులకు రుణం కోసం వెళ్తే ఖరీఫ్ రుణాలను చెల్లించాలని ఒత్తిడి తేవడంతో వారు అటువైపు వెళ్లలేదు. పెట్టుబడుల కోసం తిప్పలు రైతులు రబీ పెట్టుబడుల కోసం నానా తిప్పలు పడాల్సి వచ్చింది. బ్యాంకుల వారు దరిచేరనియకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పులు పుట్టని రైతులైతే బంగారు ఆభరణాలను కుదవపెట్టి నగదు తెచ్చుకుని రబీ పంటలను సాగు చేసుకున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎన్నడూ రాలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రబీ పంటల సాగు ఇలా రబీ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 76,531 హెక్లార్లు కాగా, ఇప్పటివరకు 47,674 హెక్టార్లలో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. వరి 45,603 హెక్టార్లు, జొన్న 10, మొక్కజొన్న 19, పెసర 60, మినుము 35, ఉలువలు 53, శనగలు 141, వేరుశనగ 1753 హెక్టార్లు సాగు చేశారు. -
దేశవ్యాప్తంగా రైతుబంధు!
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన బీజేపీ రైతులకు చేరవయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పంటకాలానికి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున నేరుగా వారి ఖాతాలోకే నగదును బదిలీచేసే కొత్త పథకానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, ఎకరానికి రూ.50 వేల వడ్డీ రహిత (రైతుకు గరిష్టంగా రూ.లక్ష) రుణాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు పథకాల వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.2.3 లక్షల కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీ పథకాన్ని కూడా వీటిలో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడుతుందని భావిస్తున్నారు. -
రుణమాఫీపై కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ కోసం వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రైతులకు రూ.లక్ష వరకున్న రుణాల మాఫీ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తుండటంతో వ్యవసాయాధికారులు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి చెందిన బ్యాంకర్లతో వ్యవసాయ శాఖ అధికారులు శనివారం సమావేశమయ్యారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో రుణమాఫీ కసరత్తు వివరాలను బయటకు వెల్లడించట్లేదని చెబుతున్నారు. గతంలో రూ.లక్ష రుణమాఫీ నాలుగు విడతల ప్రక్రియ 2017 మార్చితో ముగిసింది. ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు నాలుగు సీజన్లలో ఎంతమంది రైతులు ఎంత రుణం తీసుకున్నారన్న విషయాలను అధికారులు సేకరించారు. అలాగే లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులెంత మందో సేకరించారు. మొత్తం రుణం తీసుకున్న రైతుల్లో వీరి శాతమెంత అనే వివరాలనూ గుర్తించారు. దాదాపు 90 శాతం పైగానే లక్ష రూపాయలు తీసుకున్న రైతులున్నట్లు నిర్ధారించినట్లు సమాచారం. గతంలో లక్ష రూపాయల రుణమాఫీ సందర్భంగా తలెత్తిన పలు సమస్యలను ఈసారి జరగకుండా చూసుకోవాలని సర్కారుకు బ్యాంకర్లు సూచించినట్లు తెలిసింది. 40 నుంచి 45 లక్షల మంది రైతులు.. ఈ సమావేశానికి హాజరైన ఒక అధికారి అంచనా ప్రకారం ఈసారి రుణమాఫీ 40 లక్షల నుంచి 45 లక్షల మంది రైతులకు చేయాల్సి వస్తుందని తెలిపారు. నాలుగు సీజన్లలో తీసుకున్న పంట రుణాలన్నింటినీ కలిపితే ఒక్కో రైతు సరాసరి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు రుణం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. 2014లో ప్రభుత్వం 35.29 లక్షల మందికి లక్ష రూపాయలు మాఫీ చేయగా, ఈసారి అదనంగా 10 లక్షల మంది చేరే అవకాశముంది. అప్పుడు రూ.16,124 కోట్లు రుణమాఫీ చేయగా, ఈసారి రూ.20 వేల కోట్ల వరకు చేయాల్సి రావొచ్చని భావిస్తున్నారు. 2014లో ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేసినప్పుడు, వాటిని నాలుగు వాయిదాల్లో చెల్లించిన సంగతి తెలిసిందే. అంటే 2017 మార్చి నాటికి వాయిదాలన్నీ చెల్లించారు. ఇప్పుడు ఆ తర్వాత నుంచి రుణాలు తీసుకున్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. అందులో ఖరీఫ్‌లో 26.20 లక్షల మంది, రబీలో 12.90 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఆ ఏడాది రూ.31,410 కోట్ల రుణాలను బ్యాంకులు రైతులకు ఇచ్చాయి. 2018–19లో ఇప్పటివరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ.23,488 కోట్ల రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ.19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 4.24 లక్షల మంది రైతులు రూ. 3,816 కోట్ల రుణా లు తీసుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో జిల్లాల నుంచి బ్యాంకుల వారీగా లెక్కలు తీసుకున్నాకే స్పష్టత వస్తుందని బ్యాంకర్లు అన్నట్లు సమాచారం. మార్గదర్శకాలపై వ్యవసాయశాఖ మేధోమథనం.. ప్రభుత్వం ఈసారి కూడా రుణమాఫీకి హామీ ఇవ్వడంతో మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. సీఎం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే మేధోమథనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే 2014లోనూ రూ.లక్ష రుణమాఫీ చేశారు. ఇప్పుడూ రూ.లక్ష వరకే హామీ ఇచ్చారు. అయితే ఒకేసారి రుణమాఫీ ఉంటుందని సర్కారు చెప్పడంతో అమలు మార్గదర్శకాల తయారుపై తర్జనభర్జన మొదలైంది. ఒకేసారి రూ.20 వేల కోట్లు ఇవ్వాలంటే సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. వచ్చే బడ్జెట్లో దీనికే రూ.20 వేల కోట్లు కేటాయిస్తే, రైతుబంధుకు మరో రూ.15 వేల కోట్లు కేటాయించాల్సి వస్తుంది. అంటే రుణమాఫీ, రైతుబంధుకే రూ.35 వేల కోట్లు కేటాయించాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్గాలు పలువురు నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిసింది. -
ఉసురు తీసిన అప్పులు
గోనెగండ్ల/ నందికొట్కూరు/ గూడూరు రూరల్/ బొమ్మనహాళ్: వరుస పంట నష్టాలు వారిని అప్పుల్లోకి నెట్టాయి. ఆదుకోవాల్సిన సర్కారు చోద్యం చూస్తూ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కాల క్షేపం చేస్తోంది. దీంతో దిక్కుతోచని రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోగా.. అనంతపురంలో మరొకరు తనువు చాలించారు. అన్నదాతలపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి అద్దంపడుతున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు గ్రామానికి చెందిన బెస్త మల్లయ్యకు(58) ఐదెకరాల పొలం ఉంది. వర్షాభావంతో నాలుగేళ్లుగా పంటలు సక్రమంగా పండకపోవడంతో పాటు వాటికి గిట్టుబాటు ధర లభించలేదు. ఈ ఏడాదీ వేసిన పత్తి వర్షాల్లేక ఎండిపోయింది. దీంతో సాగుకు, కుటుంబ పోషణ నిమిత్తం చేసిన ప్రైవేట్ అప్పులు దాదాపు రూ.6లక్షలకు చేరాయి. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో వీటిని తీర్చే మార్గం కానరాక ఆదివారం రాత్రి పురుగు మంది సేవించాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మల్లయ్య మరణించాడు. పంటలు పండక.. అప్పులు తీర్చలేక.. నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామానికి చెందిన ఎద్దుల రాజేశ్వరరెడ్డి (26) నాలుగేళ్లుగా పంట నష్టాలను చవిచూశాడు. రెండేళ్ల క్రితం అప్పులు తీర్చేందుకు ఐదెకరాల సొంత భూమి అమ్మినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఈ నేపథ్యంలో 22 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రెండేళ్లుగా సాగు చేస్తున్నా పంటలు సక్రమంగా పండలేదు. దీంతో ప్రైవేట్ వ్యక్తుల వద్ద చేసిన అప్పులు రూ.8 లక్షలకు పైగా చేరాయి. బంగారు తాకట్టు పెట్టి రూ.2.50 లక్షలు కూడా తీసుకున్నాడు. అప్పులన్నీ తలకు మించిన భారం కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. కొనఊపిరితో ఉన్న రాజేశ్వరరెడ్డిని కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పొలంలోనే పురుగుమందు సేవించి.. ఇదే జిల్లా గూడూరు మండలం గుడిపాడు గ్రామానికి చెందిన చాకలి చిన్న గిడ్డన్న (45) తనకున్న 2.25 ఎకరాల భూమితో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగుచేసేవాడు. మూడేళ్లుగా ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.3 లక్షల వరకు అప్పులు చేశాడు. గత ఏడాది ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా పత్తి పంట పూర్తిగా ఎండిపోయింది. అప్పులు తీర్చే పరిస్థితి కనిపించక ఈ నెల 7న పొలంలోనే పురుగుల మందు తాగాడు. రైతులు, కూలీలు అతన్ని కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. పంటను కాపాడుకోలేక... అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన దాసరి హనుమంతప్ప కుమారుడు దాసరి నాగరాజు(24)కు 1.5 ఎకరాల పొలం ఉంది. వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు, క్యాన్సర్‌తో బాధపడుతున్న తండ్రి చికిత్సకు రూ.3.50 లక్షల దాకా అప్పు చేశాడు. బ్యాంకుల్లో పంట రుణం కింద రూ.2లక్షలు తీసుకున్నా వడ్డీలకే సరిపోయింది. దీంతో కొంతకాలం బళ్లారిలో కూలీగా, ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ఇటీవల గ్రామం చేరుకుని వరి సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఏపుగా ఉన్న పంటను కాపాడుకునేందుకు అవసరమైన డబ్బు చేతిలో లేకపోవడం.. అప్పటికే అప్పులు ఎక్కువవడంతో అప్పు దొరికే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురై పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రైతులకు అప్పులిస్తలే!
సాక్షి, హైదారాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ పంట రుణాల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో లక్ష్యానికి మించి పంట రుణాలిచ్చిన బ్యాంకులు.. నాలుగేళ్లుగా మాత్రం ఆ లక్ష్యాలు చేరుకోవడం లేదు. 2011–12 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించి 115 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 103 శాతం ఇవ్వగా.. రాష్ట్రం ఏర్పడ్డాక 2014–15లో లక్ష్యంలో 93 శాతమే రైతులకు ఇచ్చాయి. అలా తగ్గుతూ వచ్చిన రుణాలు గతేడాది 79 శాతానికి చేరుకున్నాయి. 2017–18లో పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు కాగా, రూ. 31,410 కోట్లే అందించాయి. దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల పరిస్థితి చెప్పనక్కర్లేదు. భూమి చదును చేయడం, బావులు తీయడం తదితర మౌలిక సదుపాయాల కోసం ఇచ్చే ఈ రుణాల విషయంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యం చూపాయి. 2011లో లక్ష్యానికి మించి 205 శాతం, 2012–13లో 121 శాతం, 2013–14లో 200 శాతం రుణాలిచ్చిన బ్యాంకులు.. 2014–15లో కేవలం 62 శాతమే ఇచ్చాయి. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది. కొత్త రుణమే లేదు ప్రస్తుత ఖరీఫ్‌లో రుణాల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. ఈ ఖరీఫ్‌లో 83 శాతం విస్తీర్ణంలో పంటలు సాగవగా ఇప్పటివరకు బ్యాంకులు 30 శాతానికి మించి రుణాలివ్వలేదు. ఈ ఖరీఫ్ పంట రుణాల లక్ష్యం రూ. 25,496 కోట్లు, కానీ తాజా లెక్కల ప్రకారం ఇప్పటివరకు బ్యాంకులు రూ. 7,300 కోట్లే ఇచ్చాయి. విచిత్రమేంటంటే ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రుణాలు తీసుకున్న వారంతా రెన్యువల్ చేసుకున్న వారే. అంటే పాత బాకీలు చెల్లించి రెన్యువల్ చేసుకున్నవారే. ఇతరులకు కొత్తగా రుణం ఇవ్వలేదని సర్కారుకు పంపిన బ్యాంకు నివేదికే స్పష్టం చేసింది. బ్యాంకులు సహకరించక, మరోదారి లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద రైతులు అప్పులు చేస్తున్నారు. ఈ విషయమై ప్రభు త్వం మొత్తుకుంటున్నా, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశాల్లోనూ ప్రస్తావిస్తున్నా బ్యాంకుల వైఖరిలో మార్పు రావడం లేదన్న విమర్శలున్నాయి. సర్కారు, బ్యాంకుల మధ్య దూరమే!: భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రాష్ట్రంలో రైతుల సంఖ్య 58.33 లక్షలుంది. కానీ వారిలో 46.50 లక్షల మందికే కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. అయితే రైతుల వివరాలు ధరణి వెబ్సైట్లో సరిచూసుకొని రుణాలు ఇవ్వాలన్న సర్కారు నిబంధనే రుణాల విడుదలకు శాపమైందని చెబుతున్నారు. వెబ్సైట్ ఇప్పటికీ అమలులోకి రాకపోవడంతో రెన్యువల్ చేసుకున్న వారికి తప్ప కొత్త రుణం రాలేదు. ఇలా కొందరు బ్యాంకు వర్గాలు ధరణిని సాకుగా చూపిస్తుండగా.. మరికొందరు ప్రభుత్వమే కారణమంటున్నారు. సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల రుణాలపై వడ్డీ ఎలా చెల్లిస్తారో చెప్పకుండా గాలికొదిలేశారన్న ఆరోపణలున్నాయి. పావలా వడ్డీ సొమ్ము కూడా చెల్లించలేదని చెబుతున్నారు. ఇలా ప్రభుత్వం, బ్యాంకుల మధ్య తీవ్రమైన అగాథమే పంట, దీర్ఘకాలిక రుణాల్లో సమస్యలకు కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. -
రుణాల పంపిణీలో తాత్సారం వద్దు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణాల పంపిణీలో బ్యాంకులు తాత్సారం చేయొద్దని గవర్నర్ నరసింహన్ అన్నారు. రుణాల పంపిణీ సకాలంలో జరిగితేనే పంటలసాగు ప్రక్రియ సులభతరమవుతుంద న్నారు. సూచించారు. గురువారం ఇక్కడ నాబార్డ్ కార్యాలయంలో జరిగిన 37వ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడంలో నాబార్డు కీలకపాత్ర పోషిస్తోందన్నారు. మహిళ, గిరిజన రైతులను ప్రోత్సహించాలని, ఆ మేరకు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు నీటిపారుదల ప్రాజెక్టులకు భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్నా వ్యవసాయ అభివృద్ధికి అదేస్థాయిలో ప్రోత్సాహకాల రూపంలో ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, వీటిని క్షేత్రస్థాయిలో రైతాంగానికి తెలియజేయాలని, ఆమేరకు నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వాడకాన్ని పెంచాలని, దీంతో తక్కువ సమయంలో అధిక దిగుబడి సాధించవచ్చని, ఖర్చు తగ్గి రైతులకు లాభాలు పెరుగుతాయన్నారు. నీటి గొడవలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే వ్యవసాయ పురోగతి వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ పి.రాధాకృష్ణన్, ఏపీ చీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకర్లపై అట్రాసిటీ కేసులు
సాక్షి, మహబూబ్‌నగర్ న్యూటౌన్ : పేదలకు ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న రుణాల గ్రౌండింగ్‌లో బ్యాంకర్లు అవలంబిస్తున్న తీరు ఏ మాత్రం బాగోలేదని జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రుణాలివ్వని బ్యాంకర్లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఆయా కార్పొరేషన్ల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని రెవె న్యూ సమావేశ మందిరంలో డీఎల్ఆర్సీ, డీసీసీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా 2014 నుండి 2018 వరకు ప్రభుత్వం నుండి వివిధ కార్పొరేషన్ల ద్వారా మంజూరు చేసిన రుణాలు, గ్రౌండింగ్, సబ్సిడీలు విడుదలపై బ్యాంకర్లు, అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఆయా ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన రుణాలు, వాటి గ్రౌండింగ్, అమలులో సమస్యలపై ఆరా తీశారు. బ్యాంకర్లు రుణాల మంజూరుపై అవలంభిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని, ప్రజావాణిలో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. చిన్నదర్పల్లిలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే సమావేశం లో ప్రస్తావించగా స్పందించిన కలెక్టర్ బ్యాంకర్‌పై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎస్సీ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్యాంకర్లపై కేసులను చిన్నదర్పల్లి నుండే ప్రారంభించాలని సూచించారు. బ్యాంకర్లు తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవ ని హెచ్చరించారు. యూనిట్లు లేకున్నా ఉన్నట్లు బ్యాంకర్లు సర్టిఫికేట్లు ఇవ్వడంతో ప్రభుత్వం సబ్సిడీలు విడుదల చేస్తుందని, జిల్లాలో 70 శాతం యూనిట్లు ఇలాంటివే ఉంటున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితి మారాలని, బ్యాంకర్లు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా యూనిట్లను ధ్రువీకరించాలని కలెక్టర్ సూచించారు. కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్సు బిజినెస్ వద్దు ‘ప్రభుత్వం మంజూరు చేసి యూనిట్లకు కాన్సెంట్ అవసరమే లేదు.. కాన్సెంట్ ఎందుకు అడుగుతున్నారు.. మండల స్థాయిలోని ఎంపిక కమిటీ నిర్ణయం ప్రకారం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయాల్సిందే’ అని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సమావేశంలో స్పష్టం చేశారు. ఆయా కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ మద్దతు పథకాలకు సంబందించిన అధికారులు ఈ విషయాన్ని గుర్తించుకుని మాట్లాడాలని సూచించారు. జిల్లా స్థాయి అధికారులుగా ఉండి ఈ విషయం తెలియకుంటే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో వివిధ బ్యాంకులు ప్రభుత్వం మంజూరు చేసిన రుణాల గ్రౌండింగ్‌కు డిపాజిట్లు సేకరిస్తున్నట్లు సమాచారముందని, అంతేకాకుండా రుణాలు విడుదల చేస్తూ ఇన్సూరెన్సు కోత విధిస్తున్నట్లు తెలిసిందని. ఇకనైనా కాన్సెంట్, డిపాజిట్, ఇన్సూరెన్స్‌ల పేరుతో బిజినెస్‌లు చేయొద్దని హెచ్చరించారు. లక్ష్యం మేరకు పంట రుణాలు జిల్లాలో రబీ కంటే ఖరీఫ్ సాగు ఎక్కువగా వేస్తారని, వర్షాలు కురుస్తున్నందున పంట రుణాలను మంజూరు చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. టార్గెట్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ లోపు భూ ప్రక్షాళన కార్యక్రమం తప్పొప్పుల సవరణ పూర్తి కానుందని, త్వరలో ధరణి లింక్‌ను ప్రభుత్వం బ్యాంకర్లకు ఇవ్వనుందని తెలిపారు. ఆన్లైన్లో భూ రికార్డులు పక్కాగా అందుబాటులోకి రానున్నాయని, అప్పటివరకు తాము ఇచ్చే బ్యాంకు వారీగా రైతులు, ఖాతాలు, భూ వివరాల నివేదిక ఆధారంగా రుణాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్, పరిగి ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రామ్మోహన్‌రెడ్డి, ఎల్డీఎం ప్రభాకర్ శెట్టి, నాబార్డు ఏజీఎం అమితాబ్ భార్గవ్, ఆర్బీఐ అధికారులు, కార్పొరేషన్లు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. -
బ్యాంకర్ల సేవలు భేష్
భైంసా(ముథోల్): బ్యాంకర్లు తలుచుకుంటే రైతులకు ఇబ్బందులు ఉండవని రైతుబంధు చెక్కుల పంపిణీతో వెల్లడైంది. వారం పాటు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రైతులందరికీ గ్రామాల్లో పంపిణీ బృందాలు చెక్కులు అందించారు. అన్నదాతలు వీటిని నేరుగా తీసుకువచ్చి జిల్లాలోని ఆయా బ్యాంకుల్లో అందజేయగా.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా నగదు వారికి చేతికి అందించారు అధికారులు. దీంతో జిల్లా రైతులంతా బ్యాంకర్ల సేవకు మురిసిపోయారు. తొలిసారిగా రైతులను బ్యాంకర్లు గౌరవించడం, వారిని ఆహ్వానించడం, బ్యాంకుల ఎదుట టెంట్లు ఏర్పాటు చేసి కుర్చీలు వేసి చల్లని నీరందించి చేతికి నగదు అందించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పంట రుణాలకు సైతం జిల్లాలో సాగు విస్తీర్ణం, రైతుల సంఖ్య ఎప్పుడూ దాదాపు ఒక్కటే.. బ్యాంకులు కూడా అవే. అయితే ఈ రైతులే పంటరుణం కోసం బ్యాంకులకు వెళితే అక్కడి సిబ్బంది ఇచ్చే మర్యాదలు వారు అందించే సేవలు పూర్తి విరుద్ధం. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన రైతుబంధు పథకంలో జిల్లా రైతులకు బ్యాంకుల నుంచి మర్యాద దక్కింది. గతంలో పాసుపుస్తకాలను, ఇతర ప్రతులను తీసుకువెళ్లి పంట రుణాల కోసం వెళితే నానా ఇబ్బందులు పడేవారు. బ్యాంకు అధికారులను ఏడు, ఎనిమిది సార్లు కలిస్తేగాని రుణాలు ఇచ్చేవారు కాదు. నెల రోజులు తిరిగితే గాని ఈ పని అయ్యేది కాదు. మధ్యవర్తుల ప్రమేయంతో వెళ్లే రైతుల పని మాత్రం త్వరగానే పూర్తయ్యేది. మధ్యవర్తులకే ప్రాధాన్యం... నిర్మల్, ఖానాపూర్, కడెం, నర్సాపూర్, సారంగాపూర్, దిలావర్పూర్, కుంటాల, కల్లూరు, భైంసా, కుభీర్, తానూరు, లోకేశ్వరం, దేగాం, అబ్దుల్లాపూర్, వానల్పాడ్, బాసర, మామడ, లక్ష్మణచాంద ఇలా ఏ ప్రాంతంలోని బ్యాంకుకు వెళ్లినా అక్కడ బ్యాంకర్లు మధ్యవర్తులకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారనే ఆరోపణలున్నాయి. బ్యాంకర్ల సహకారంతో పంటరుణాల రెన్యువల్ పేరిట మధ్యవర్తులు అమాయక రైతులను దోచుకుంటున్నారు. రుణాలు రెన్యువల్ చేయాలంటే తీసుకున్న మొత్తాన్ని కట్టాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. దీంతో ఏటా తాము తీసుకున్న డబ్బును రెన్యువల్ చేసేందుకు మధ్య దళారుల వద్ద రెండు రోజులకు రూ.50వేలకు రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అధికంగా కలిపి ఇస్తున్నారు. ఈ విధానం ఏటా జరుగుతూనే ఉంది. ఈ తతంగం బ్యాంకర్ల సహకారంతోనే ముందుకు సాగుతోంది. రైతులు తీసుకున్న రుణాలకు కేవలం వడ్డీ మాత్రమే తీసుకుంటే రైతులు మధ్య దళారులను కలవాల్సిన అవసరం ఉండదు. వడ్డీ తీసుకుని అసలు మళ్లీ క్రాప్‌లోన్ కింద జమ చేస్తే రైతులకు ఇబ్బందులు తలెత్తవు. దృష్టిసారిస్తే వారం రోజుల్లోనే.. ప్రభుత్వ యంత్రాంగం పాలకులు దృష్టి సారిస్తే వారం రోజుల్లోనే పంటరుణాల ఇబ్బందులను పరిష్కరించవచ్చు. రైతుబందు చెక్కుల పంపిణీలో అధికార యంత్రాంగం తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో పంటరుణాల కోసం కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఇలాంటి నిర్ణయాలనే తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. మర్యాదలు బాగున్నాయి ఇప్పుడు బ్యాంకర్లు బాగా నే మర్యాదలు ఇస్తున్నా రు. రైతులకు ఎప్పుడూ ఇలాంటి మర్యాదలే ఇవ్వాలి. బ్యాంకుకు వెళ్లిన వారందరికీ సేవలు అందిస్తున్నారు. వెంటనే నీడపట్టున కుర్చీలో కూర్చోవాలని సూచిస్తున్నారు. క్రాప్లోన్లు ఇచ్చే సమయంలోనూ జిల్లా రైతులకు ఇలాంటి సహాయ సహకారాలే అందించాలని వేడుకుంటున్నాం. బ్యాంకర్లు తలుచుకుంటే సాధ్యపడనిది ఏది ఉండదు. – సాయినాథ్, రైతు మహాగాం రుణాలపై దృష్టి సారించాలి పంటరుణాలు ఇప్పించే విషయంలోనూ ఇలాగే బ్యాంకర్లు మర్యాదలు ఇవ్వాలి. అధికారుల బృందం అంతా బ్యాంకు వద్దే ఉంచాలి. రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు బ్యాంకు వద్ద ఉంటే సమస్యలు తీరుతాయి. స్థానికంగా ఉన్న చోటే రైతులకు ధ్రువీకరణ పత్రాలు అందుతాయి. ఫలితంగా రుణాలు కూడా సకాలంలోనే దొరికే అవకాశం ఉంటుంది. రైతుబంధు చెక్కులకు నగదు ఇచ్చినట్లే క్రాప్లోన్లకు సైతం వెంటనే నగదు అందించాలి. బ్యాంకర్లు రైతులందరికీ ఇలాగే మర్యాదలు అందించాలని కోరుకుంటున్నాం. – రాజ్యం, రైతు కిర్గుల్(బి) -
రేపు ‘చలో అసెంబ్లీ’: లక్ష్మణ్
హైదరాబాద్: రైతాంగ సమస్యలపై శుక్రవారం(23న) ‘చలో అసెంబ్లీ’నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. బుధవారం ఇక్కడి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రూ.లక్షలోపు పంటరుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలు నమ్మి అనేకమంది రైతులు బ్యాంకు రుణాలు కట్టలేదని, కానీ హామీ నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రుణాలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతంలోని 1,600 మందికిపైగా రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేశాయన్నారు. రాష్ట్రంలో 80 వేల మంది రైతులు అప్పులఊబిలో చిక్కుకొని అల్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లుగా’ వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతాంగానికి దాదాపు 500 కోట్లు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని, రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ కింద కేంద్రం 3 శాతం జమ చేస్తే, రాష్ట్రం 4 శాతం ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రభుత్వ వాటా చెల్లించక పోవడంతో వడ్డీ పెరిగిపోయి దాదాపు 15 లక్షల మంది రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీంతో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఈ నెల 23న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, అధికార ప్రతినిధి రఘునందన్‌రావ్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ తదితరులు పాల్గొన్నారు. -
‘రీషెడ్యూల్ రుణాలను మాఫీ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో రీషెడ్యూల్ చేసిన పంట రుణాలను మాఫీ చేయాలని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. 2013–14 సంవత్సరానికి రీషెడ్యూల్ చేసిన రుణాలను మాఫీ చేయలేదని, వెంటనే దాన్ని చేపట్టాలని పేర్కొన్నారు. గత శాసనసభ సమావేశాల్లో బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తిందన్నారు. మూడు జిల్లాల రైతులకు నష్టం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం చేస్తామని సీఎం పేర్కొన్నప్పటికీ అమలు కాలేదన్నారు. కరువు కారణంగా పంట రుణాల రీషెడ్యూల్కు ఆర్బీఐ ఆదేశించిందన్నారు. -
రైతులపై బ్యాంకుల చిన్నచూపు!
సాక్షి, హైదరాబాద్: రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బ్యాంకులు వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోలు తదితర స్వల్పకాలిక అవసరాలకు ఇచ్చే పంట రుణాలకు మాత్రమే బ్యాంకులు పరిమితమవుతున్నాయి. భూమి చదును, బావుల తవ్వకం, బోర్లు వేయడం, పంపుసెట్లు కొనడం ఇలా రైతుకు ఉపయోగపడే అనేక అవసరాలకు అందజేయాల్సిన దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల నుంచి బ్యాంకులు పక్కకు జరుగుతున్నాయని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. స్వల్పకాలిక రుణాలతో పోలిస్తే, దీర్ఘకాలిక రుణాలకు బ్యాంకులు ఇస్తున్న ప్రాధాన్యం ఏటేటా తగ్గుతోంది. దీంతో రైతులు వ్యవసాయ పనులకు అవసరమైన డబ్బు కోసం ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కాలంలో పంట రుణాలను సకాలంలో ఇవ్వడానికే బ్యాంకులు నానా యాగీ చేస్తుండటంతో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల విషయాన్ని ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడంలేదు. భూమి చదునుకు లేదు... పోడు భూముల అభివృద్ధి లేదు వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో రైతులు దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. వివిధ పథకాల కోసం రైతులు తమ వాటాగా చెల్లించాల్సిన సొమ్మును కూడా బ్యాంకు రుణం ద్వారానే చెల్లిస్తుంటారు. ఉద్యాన, పాడి, మత్స్య, కోళ్ల పరిశ్రమ వంటి రంగాలు, అలాగే సాగుకు సంబంధించి బోర్లు వేయడానికి, సూక్ష్మసేద్యం పరి కరాలు, వ్యవసాయ యంత్రాల కొనుగోలు, భూమి చదును చేయడానికి ఎక్కువగా దీర్ఘకాలిక రుణాలు తీసుకుంటారు. పోడు భూముల అభివృద్ధికి కూడా దీర్ఘకాలిక రుణాలే తీసుకుంటారు. అయితే, దీర్ఘకాలిక రుణాలు తగ్గిపోవడంతో పోడు భూములు అభివృద్ధి చేసుకునే పరిస్థితే లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో భూమి చదును చేసుకునేందుకు ఆర్థికంగా ఆదుకునే దిక్కు లేకుండా పోయింది. సూక్ష్మసేద్యం కోసం రుణాలు తీసుకోవాలన్నా బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఏడేళ్లలో 188%నుంచి 21%వరకు పతనం పంట రుణాలను ప్రతీ ఏడాది రైతులు రెన్యూవల్ చేసుకోవాలి. ఆ రుణాలకు ఏడు శాతం వడ్డీ చెల్లించాలి. ఈ రుణాలను రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయంలో తీసుకుంటారు. దీర్ఘకాలిక రుణాలను బ్యాంకులు 11 శాతం వడ్డీతో రైతులకు ఇస్తాయి. మూడు నుంచి ఐదేళ్లలో ఈ రుణాలను తీర్చితే సరిపోతుంది. వివిధ వ్యవసాయ పథకాలకు రైతు వాటా కింద ఈ రుణాలను తీసుకోవచ్చు. రూ. 2 లక్షల నుంచి 3 లక్షలు.. ఇలా ఎంతైనా తీసుకునే వెసులుబాటుంది. అంతేగాక గ్రీన్హౌస్ వంటి ప్రభుత్వ పథకమైతే రైతు తన వాటా కింద ఎకరానికి రూ.10 లక్షలు చెల్లించాలి. ఈ నేపథ్యంలో రూ.10–20 లక్షలు కూడా ఇస్తారు. అయితే, బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలను పెద్దగా ఇవ్వడం లేదు. గతంలో 2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో దీర్ఘకాలిక రుణ లక్ష్యం రూ. 5,890 కోట్లు కాగా, బ్యాంకులు లక్ష్యానికి మించి రూ.11,112 కోట్ల వరకు ఇచ్చాయి. అంటే 188.65 శాతం రుణాలు ఇచ్చాయి. అలాంటిది 2017–18 ఆర్థిక సంవత్సరంలో దీర్ఘకాలిక పంట రుణాల లక్ష్యం రూ.14,512 కోట్లు కాగా, కేవలం రూ. 3,118 కోట్లే ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తమ నివేదికలో వెల్లడించాయి. అంటే, లక్ష్యంలో కేవలం 21.48 శాతమే అందజేశాయి. దీర్ఘకాలిక రుణాలపై బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చేపట్టే అనేక పథకాల్లో రైతులకు తమ వాటా చెల్లించేందుకు డబ్బులు అందని పరిస్థితి నెలకొంది. -
దీర్ఘకాలిక రుణాలకు ప్రాధాన్యం ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: పంట రుణాలతో పాటు రైతులకు దీర్ఘకాలిక రుణాలివ్వడంలో బ్యాంకులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దీర్ఘకాలిక రుణ లక్ష్య సాధన చాలా తక్కువగా ఉందన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలలో ఎక్కడ అవకాశం ఉందో కనిపెట్టి దానికి తగినట్టు ప్రణాళికలు వేసుకోవాలని కోరారు. జిల్లా స్థాయిలో బ్యాంకర్ల సమావేశం వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. -
సాగు 85 శాతం.. రుణాలు 45 శాతమే!
సాక్షి, హైదరాబాద్: భారీగా పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం రుణాలు అందడం లేదు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకా రం రబీ పంటల సాగు విస్తీర్ణం 85 శాతానికి చేరింది. కానీ రైతులకు బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు లక్ష్యంలో 45.66 శాతమే కావ డం గమనార్హం. అక్టోబర్‌లో ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు.. నవంబర్‌కే రైతులకు రుణాలు అందాలి. కానీ సాగు చివరి దశకు చేరుకుంటున్నా బ్యాంకులు స్పందించట్లేదు. బ్యాంకర్లపై ఒత్తిడి తేవడంలో వ్యవసాయ శాఖ విఫలమవుతుండటంతో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొం ది. గత ఖరీఫ్‌లో చేతికొచ్చిన పంటలకు తగిన ధర రాక రైతులకు నిరాశే మిగిలింది. బ్యాంకులు కూడా మొండి చెయ్యి చూపిస్తుం డటంతో రైతులు దిగులు పడుతున్నారు. లక్ష్యంలో సగం కూడా ఇవ్వలేదు.. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 31,92 లక్షల ఎకరాలు కాగా... 27.07 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాధారణ సాగు విస్తీర్ణం 15.37 లక్షల ఎకరాలుకాగా.. 15 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయని వ్యవసాయ శాఖ తాజా నివేదికలో తెలిపింది. అంటే దాదాపుగా పంటల సాగు చివరి దశకు వచ్చిన పరిస్థితుల్లో బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయడం లేదు. రబీ పంట రుణాల లక్ష్యం రూ.15,901 కోట్లు. కానీ ఇప్పటివరకు ఇచ్చింది రూ.7,261 కోట్లేనని వెల్లడైంది. లక్ష్యంలో సగం కూడా రుణాలు ఇవ్వలేదని స్పష్టమవుతోంది. రైతుల పైనే వడ్డీ భారం రైతుల రుణాలకు సంబంధించి పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకాల కింద ప్రభుత్వం బ్యాంకులకు రూ.321 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీని చెల్లింపులో సర్కారు చేస్తు న్న జాప్యం రైతులకు శాపంగా మారుతోంది. ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు జారీ చేసి నిధులు మాత్రం విడుదల చేయకపోతుండటంతో.. బ్యాంకులు వడ్డీల సొమ్మును రైతుల నుంచే వసూలు చేస్తున్నాయి. రైతుల నుంచి తీసుకోవద్దని, వడ్డీ సొమ్మును విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపినా.. నిధులు విడుదల చేయలేదు. రుణమాఫీ నిధులను కూడా ప్రభుత్వం నాలుగు విడతలుగా విడుదల చేయడంతో, బ్యాంకులు ఆ రుణాలపై వడ్డీని వసూలు చేశాయి. రూ.లక్షలోపు పంట రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయకూడదు. ప్రభుత్వమే దానిని రీయింబర్స్ చేస్తుంది. బ్యాంకులు రుణాల మంజూరు సమయంలో బుక్ అడ్జస్ట్మెంట్లు చేస్తున్నాయి. కొత్త అప్పు మంజూరు చేస్తూనే.. పాత అప్పును, వడ్డీని రికవరీ చేస్తాయి. ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ భారం తమపైనే పడుతుండటం, బ్యాం కులు రుణాలివ్వకుండా ఇబ్బందిపెట్టడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
పంట రుణ లక్ష్యం రూ.46 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రైతులకు వచ్చే ఆర్థిక సంవత్సరం (2018–19)లో రూ.46,344.61 కోట్ల మేర పంట రుణాలు అందజేయాలని నాబార్డు లక్ష్యంగా నిర్దేశించింది. మొత్తంగా అన్ని రంగాలకు కలిపి గతేడాది కంటే 17 శాతం అధికంగా రూ. 83,388.87 కోట్ల రుణాలు అందజేయాలని నిర్ణయించింది. పంట రుణాలకు అదనంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన మత్స్య, పశు సంవర్థక రంగాలకు అదనంగా రుణాలివ్వాలని.. వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 2,667 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించింది. విద్యా రుణాలకు రూ. 1,206 కోట్లు, గృహ రుణాలకు రూ.3,759 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించింది. నాబార్డు రూపొందించిన ‘2018–19 రుణ విధాన పత్రాన్ని హరీశ్‌రావు మంగళవారం విడుదల చేశారు. జూన్ నాటికే పంట రుణాలివ్వాలి. బ్యాంకులు తమ వద్ద తనఖాగా పెట్టుకున్న పాస్ పుస్తకాలను రైతులకు తిరిగి ఇచ్చేయాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ‘‘ఇక ముందు పంట రుణాలు తీసుకోవడానికి పాస్ పుస్తకాలు అవసరం లేదు. రైతుల పూర్తి సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉంది. బ్యాంకులు పరిశీలన పేరుతో పాస్ పుస్తకాలు తీసుకుని.. ఇప్పటికీ ఇవ్వలేదు. పాస్ పుస్తకాలను తిరిగి వెనక్కి ఇచ్చేలా నాబార్డు ఆదేశాలు జారీచేయాలి’’అని కోరారు. బ్యాంకర్లు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు మే– జూన్ నెలల్లోనే లక్ష్యం మేరకు పంట రుణాలు అందజేయాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోందన్నారు. కోల్డ్ స్టోరేజీలకు నాబార్డు రుణం అందజేయా లని కోరారు. ప్రభుత్వం ఎన్నికల కోసమే రైతులకు పెట్టుబడి సాయం వంటివి ఇస్తోందన్న ఆరోపణలు సరికాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. దేశంలో 73 శాతం సంపద ఒక శాతం మంది చేతిలో ఉండటం మంచి పరిణామం కాదని.. సంపద అందరికీ చేరాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ ఆర్.సుబ్రమణ్యన్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ మణికందన్ తదితరులు పాల్గొన్నారు. -
నకి‘లీలలు’..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఒకేరీతిన నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకుల్లో వ్యవసాయానికి పంట రుణాలు తీసుకున్న సంఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీంతో ఇటు పోలీసులు.. అటు బ్యాంకు అధికారులు అప్రమత్తమై విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులు విచారించేందుకు ఆయా జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి, నిందితులపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇందులో కొందరు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. కీలకమైన వ్యక్తులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ఈ ప్రాంతాల్లో కొందరు ముఠాలుగా ఏర్పడి.. పలువురిని మభ్యపెట్టి రుణం ఇప్పిస్తామని చెప్పి.. నకిలీ పాస్ పుస్తకాలను తయారు చేసి వాటిని బ్యాంకులో సమర్పించి పంట రుణాలు పొందారు. ఈ ఏడాది జూలై 27న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో దమ్మపేట, వేంసూరు, పెనుబల్లి, సత్తుపల్లి మండలాలకు చెందిన నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. రెవెన్యూ, పోలీసుశాఖల టాస్క్‌ఫోర్స్ దీనిపై నిగ్గుతేల్చేందుకు పోలీస్, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 873 అకౌంట్లకు.. 731 మంది అక్రమ రుణాలు పొందినట్టు విచారణలో తేలింది. 142 మంది రెండు, మూడు బ్యాంకుల్లో అక్రమ రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. రూ.8.90 కోట్ల కుంభకోణం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేల్చారు. మహబూబ్‌నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో గతేడాది మహబూబ్‌నగర్, హన్వాడ మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన 69 మంది రైతులకు మునిమోక్షం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ఏజెంట్ నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసి.. వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.63.79 లక్షల రుణాలు ఇప్పించారు. ఇక సిద్దిపేట జిల్లాలో నాలుగేళ్ల క్రితం నకిలీ పాస్‌పుస్తకాలతో చిన్నకోడూరు మండలం చెందలాపూర్, చెల్కలపల్లిలో నకిలీ పాస్ పుస్తకాలతో బ్యాంకు రుణాలు తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు నకిలీ పాస్‌పుస్తకాలు తయారీదారులపై, వాటిమీద రుణాలు తీసుకున్న వారిపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. రుణాలను రికవరీ కూడా చేయించారు. అలాగే, వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో నకిలీ పాస్ పుస్తకాలతో కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు తీసుకున్నట్లు తేలింది. 240 పాస్ పుస్తకాలు తయారు చేసి బ్యాంకుల్లో రూ.కోటికి పైగా పంటరుణాలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 7 వేల నకిలీ పాస్ పుస్తకాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ పాస్ పుస్తకాలతో జోగులాంబ గద్వాల జిల్లాతోపాటు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రుణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొనసాగుతున్న అరెస్ట్‌లు ఈ నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారంలో టాస్క్‌ఫోర్స్, పోలీస్‌లు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. నకిలీ పాస్‌పుస్తకాల అంశంలో కీలక సూత్రధారులు పట్టుపడాల్సి ఉంది. ఖమ్మంలో నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో ఇద్దరు బ్యాంకు మేనేజర్లు, బ్యాంకు అటెండర్, ఇద్దరు వీఆర్వోలు, ఓ వీఆర్ఏతోసహా 34 మందిని అరెస్ట్ చేశారు. 11 మందిని రెండు దఫాలుగా కోర్టు అనుమతితో మళ్లీ విచారణ చేశారు. 60 రోజుల నుంచి నిందితులు జైలు జీవితం గడుపుతున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వ్యవహారంలో బ్యాంకు మేనేజర్ మధుసూదన్ పాత్ర ఉన్నట్లు విచారణలో బయటపడింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే 71 మందిని నిందితులుగా గుర్తించారు. అసలు సూత్రధారి అయిన శ్రీనివాస్ పట్టుబడితే దోషుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో దీనిపై పోలీసులు విచారిస్తున్నారు. గద్వాల జిల్లాలో 17 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరిశీలిస్తే.. ఏ జిల్లాకు ఆ జిల్లాలో జరిగిందా.. లేకపోతే అన్ని జిల్లాల్లో జరిగిన వ్యవహారాల్లో ఎవరైనా కీలకమైన వ్యక్తులు వెనుకుండి నడిపించారా? అనే కోణంలో విచారణ చేస్తే అసలు విషయాలు బయటకు వచ్చే వీలుంది. -
పాస్‌పుస్తకం లేకుండానే రుణం!
సాక్షి, హైదరాబాద్: రైతులు పంట రుణాల కోసం ఇక నుంచి తమ పాస్‌పుస్తకాలను బ్యాం కుల్లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. వెబ్‌ల్యాండ్ డాటాలోని 1బీ రికార్డు ఆధారం గానే క్రెడిట్ ఏజెన్సీ (బ్యాంకులు) రుణాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు భూమి హక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం–1971కి సవరణలు ప్రతిపాదిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సోమవారం శాసనసభలో బిల్లు ప్రవేశపె ట్టారు. ఆ బిల్లులోని ముఖ్యాంశాలివి.. ♦ భూమి హక్కుల్లో ఎలాంటి మార్పు జరిగినా మ్యుటేషన్ వివరాలను ఆ హక్కు పొందిన 30 రోజుల్లోగా తహసీల్దారుకు సమాచారం ఇవ్వాలి. ఈ సమాచారాన్ని పొందిన వీఆర్వో ఒక్క రోజులోనే ఆ విషయాన్ని తహసీల్దారుకు తెలియపర్చాల్సి ఉంటుంది. ఈ సమాచారానికి తహసీల్దారు రసీదు ఇవ్వాలి. ♦ పాస్‌పుస్తకాల్లో మార్పు కోసం ఎవరైనా అభ్యర్థన చేసుకుంటే వాటిని సరిచేసే అధికారం తహసీల్దార్లకే ఉంటుంది. ♦ డిసెంబర్ 31, 2017 వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సాదాబైనామాలు లేకపోయినా స్థానికంగా విచారణ జరిపి గ్రామసభ ఆమోదం తీసుకుని సదరు క్లెయిమ్‌ను క్రమబద్ధీకరించవచ్చు. అయితే, ఆ భూమి ఐదెకరాలకు మించరాదు. ♦ పట్టాదారు పాస్‌పుస్తకం ప్రభుత్వ వెబ్ సైట్లో నిర్వహించే పట్టాదారు పాస్ పుస్తకంగా మారుతుంది. అందులో తాకట్టు దారు (మార్టిగేజ్), కౌలుదారు (టెనెంట్) అనే పదాలుండవు. కేవలం పట్టాదారులు అనే పదం మాత్రమే ఉంటుంది. ♦ పట్టాదారు పాస్‌పుస్తకం కోసం అడగకుండా వెబ్‌ల్యాండ్ డాటా ప్రకారం నిర్వహించే 1–బీ రెవెన్యూ రికార్డు ఆధారంగానే క్రెడిట్ ఏజెన్సీ రుణాన్ని మంజూరు చేయాలి. ♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన భూములకు రక్షణ కల్పించేందుకు గాను హైదరాబాద్ జాగీర్దార్ల రద్దు చట్టం, 1358 ఫసలీ ప్రకారం ఉన్న జాగీరు భూములన్నీ ప్రభుత్వ భూములుగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేస్తారు. ♦ ఈ బిల్లు ఆమోదంలోకి వస్తే తెలంగాణ భూమిపై హక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల సవరణ ఆర్డినెన్స్ రద్దవుతుంది. ఈ బిల్లు జూన్17, 2017 నుంచి అమల్లోకి వచ్చినట్టు అవుతుంది. ♦ ఈ బిల్లుతో పాస్‌బుక్, టైటిల్‌డీడ్ ఏకీకృతంగా మారుతాయి. మ్యుటేషన్ కాలపరిమితి 90 రోజుల నుంచి 15 రోజులకు తగ్గిపోతుంది. -
మూడో వంతు రైతులకే రుణాలు
► 36 లక్షల మందిలో 12 లక్షల మందికే పంట రుణాలు ► ఖరీఫ్ మొదలై రెండు నెలలైనా పట్టించుకోని బ్యాంకులు ► చేసేదిలేక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్న రైతన్నలు సాక్షి, హైదరాబాద్: ప్రకృతి కన్నెర్ర.. బ్యాంకర్ల చిన్న చూపు రైతులను కుంగదీస్తున్నాయి. ఓవైపు వర్షాలు రాక వేసిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటం.. మరోవైపు పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు సోకి నాశనం చేస్తుంటే కాపాడుకోలేని నిస్సహాయ దుస్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. పంటలకు పురుగు మందులు, ఎరువులు కొనాలంటే బ్యాంకులు అప్పులివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ మొదలై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మూడో వంతు మంది రైతులకే బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఖరీఫ్‌లో ప్రతీ ఏడాది సరాసరి 36 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారు. కానీ ఇప్పటివరకు కేవలం మూడో వంతు అంటే 12.42 లక్షల మంది రైతులకే బ్యాంకులు రుణాలిచ్చాయి. 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ పంట రుణ లక్ష్యం రూ.23,851 కోట్లు కాగా, జూలై 31 నాటికి బ్యాంకులు రూ.10,514 కోట్లే రుణాలిచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. సర్కారు బకాయిలు రూ.271 కోట్లు మరోవైపు బ్యాంకర్లు ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాల బకాయిలు రూ.271 కోట్లు ఇంకా విడుదల చేయలేదని మండిపడుతున్నారు. నెల రోజుల క్రితం మంజూరు చేసినా ఆ సొమ్ము ఇప్పటికీ విడుదల చేయలేదని ఆరోపిస్తున్నారు. ఇలా ప్రభుత్వ నిర్లక్ష్యం, బ్యాంకుల నిర్లిప్తత రైతుల పాలిట శాపంగా మారింది. దీంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులకు పంట రుణాలు మంజూరు చేసినా బ్యాంకుల్లో కరెన్సీ లేక డబ్బు చేతికి ఇవ్వడం లేదు. రైతు ఖాతాల్లోనే ఆ రుణ నగదును జమ చేసి వట్టి చేతులతో పంపిస్తున్నారు. దీంతో రైతులు ఆ నగదు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. 23,851 కోట్ల రూపాయలు – ఈ ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ పంట రుణ లక్ష్యం 10,514 కోట్ల రూపాయలు – జూలై 31 నాటికి బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు 80.42 లక్షల ఎకరాలు – రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగైంది వడ్డీ చెల్లించాల్సిందే.. రాష్ట్రంలో ఇప్పటివరకు 80.42 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా 43.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 3.95 లక్షల ఎకరాల్లో సోయాబీన్, 10.70 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మొత్తం ఖరీఫ్ పంటల సాగు 74 శాతం పూర్తి కాగా, అందులో పత్తి పంట విస్తీర్ణం 104 శాతానికి చేరుకుంది. అయితే ఈ స్థాయిలో పంటల సాగు జరిగితే రుణాలు మాత్రం సగానికి కూడా చేరుకోలేదు. పైగా రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకం అమలవుతున్నా బ్యాంకులు పట్టించుకోవడం లేదు. కొత్త రుణం సంగతి దేవుడెరుగు, తీసుకున్న రుణాలకు వడ్డీ వసూలు చేస్తూ పీడిస్తు న్నాయి. కొన్నిచోట్ల కొత్త రుణం ఇస్తూనే, ఆ రుణం సొమ్ము నుంచే వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఈ విషయంలో బ్యాంకులకు నచ్చజెప్పడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. -
పాస్‌బుక్ లేకుండా పంట రుణాలు
బ్యాంకర్లకు రెవెన్యూ శాఖ సూచన సాక్షి, హైదరాబాద్: పాసు పుస్తకాలు లేకుం డానే రైతులు పంట రుణాలను పొందే సదు పాయం రెవెన్యూ శాఖ కల్పించింది. రైతుల పాస్‌పుస్తకాలు, పహాణీలు సమర్పించకున్నా పంట రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా బ్యాంకర్లకు సూచించారు. భూముల వివరాలను కచ్చితంగా తెలిపేలా ప్రభుత్వం వెబ్‌ల్యాండ్ పోర్టల్‌ను అందుబా టులోకి తెచ్చిందని, ఆన్లైన్లోనే వివరాలసు సరిచూసుకుని రుణాలు ఇవ్వవచ్చని పేర్కొ న్నారు. ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ చీఫ్ జనరల్మేనేజర్ హరిదయాళ్ ప్రసాద్ అధ్యక్ష తన బ్యాంకర్ల స్టీరింగ్ కమిటీ సమావేశం గురువారం జరిగింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.ఆర్.మీనా, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి, ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా, ఎల్ఎల్బీసీ కన్వీనర్ యు.ఎన్.ఎన్.మైయా, రిజర్వు బ్యాంకు ప్రతినిధి జె.మేఘనాథ్, సుబ్బయ్య పాల్గొన్నారు. ఒకే వ్యవసాయ భూమిపై ఒకటి కంటే ఎక్కువ మంది పంట రుణాలు తీసుకోకుండా వెబ్‌ల్యాండ్ పోర్టల్ ను వినియోగించుకోవచ్చని మీనా చెప్పారు. ఇప్పటికే 21 బ్యాంకులు ఈ పోర్టల్‌ను విని యోగిస్తున్నాయన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజ నులో ఇప్పటివరకు 8,35,748 మంది రైతులకు రూ.6,056 కోట్ల పంట రుణాలను ఇచ్చినట్లు తెలిపారు. రైతులందరికీ ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన వర్తించేలా బ్యాంకర్లు రుణాలు రెన్యూవల్ చేయాలన్నా రు. వాతావరణ ఆధారిత బీమా పథకం అమలుచేస్తున్న మిరప పంటకు ప్రీమియం చెల్లింపు తేదీని జూలై 15 వరకు, పత్తి పంట కు జూలై 31 వరకు పొడిగించినట్లు తెలిపా రు. పత్తి సాగు రైతులు వాతావరణ ఆధారి త బీమా పథకాన్ని ఉపయోగించుకునేలా చూడాలన్నారు. బ్యాంకులన్నీ పంట రుణా లు, బీమా అమలు చేసేలా చర్యలు తీసుకుం టున్నాయని హరిదయాళ్ తెలిపారు. -
బ్యాంకుల్లో పైసల్లేవు..
అదనంగా నెలకు రూ. 2 వేల కోట్లివ్వండి - రిజర్వ్ బ్యాంకును కోరిన ఎస్ఎల్బీసీ - రూ. 400 కోట్లు అడిగిన ఎస్బీఐ - ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 39,752 కోట్లు సాక్షి, హైదరాబాద్: బ్యాంకుల్లో నగదు కొరత వేధిస్తోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) మొరపెట్టుకుంది. ఖరీఫ్‌లో పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామని, కాబట్టి తమ అవసరాలకు తగ్గట్లు డబ్బు అందజేయాలని కోరింది. ఎస్ఎల్బీసీ విన్నపానికి స్పందించిన ఆర్బీఐ ఎంత నగదు కావాలో బ్యాంకుల వారీగా ఇండెంట్ ఇవ్వాలని కోరింది. దీంతో వెంటనే ఎస్ఎల్బీసీ పంట రుణాలు అందజేసేందుకు ఇప్పుడున్న నగదుకు అదనంగా నెలకు రూ.2 వేల కోట్లు కావాలని ఆర్బీఐని కోరినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఉమ్మడి ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకే నెలకు రూ.400 కోట్లు అదనంగా ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో త్వరలో నగదు పంపిస్తామని చెప్పింది. అయితే ఎప్పటిలోగా అందజేయనుందో మాత్రం ప్రకటించలేదని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నగదు కొరత ఎప్పుడు తీరుతుందో రైతు చేతికి ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియకుండా ఉంది. బ్యాంకుల్లోనే వేల కోట్ల రైతు డబ్బు.. వర్షాలు పెద్ద ఎత్తున కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 12 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చు కోసం రైతులు పంట రుణాలకు వెళ్తున్నారు. బ్యాంకుల్లో ఉన్న తమ డబ్బును తీసుకుందామనుకున్నా అక్కడ డబ్బు లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కొనుగోళ్లు చివరి దశకు వచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. విక్రయించిన ఆ ధాన్యానికి ప్రభుత్వం రూ.5,500 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసింది. మొత్తం 7 లక్షల మంది రైతుల డబ్బు బ్యాంకుల్లోనే ఉంది. ఈ డబ్బులో దాదాపు రూ.1,500 కోట్లు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్నట్లు సమాచారం. మిగిలిన రూ.4 వేల కోట్ల రైతు సొమ్ము బ్యాంకుల్లోనే ఉంది. అవసరాల కోసం రైతులు తమ సొమ్మును తామే తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంలో పలు చోట్ల రైతులు బ్యాంకుల వద్ద ఆందోళనలు చేస్తున్నారు. వరి అమ్మగా వచ్చిన రూ.75 వేలను ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసిందని, దాన్ని తీసుకోవడానికి బ్యాంకులకు వెళితే నగదు లేదంటూ చెబుతున్నారని బోధన్‌కు చెందిన రైతు లచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇచ్చిన పంట రుణాలు 2,573 కోట్లు వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం ఏటా దాదాపు 40 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటారని అంచనా. అందులో బుధ వారం నాటికి 3.91 లక్షల మంది రైతులకు రూ. 2,573 కోట్ల పంట రుణాలు రైతులకు అందినట్లు అధికారులు తెలిపారు. రేపు పంట రుణాల ప్రణాళిక.. ఈ ఏడాది పంట రుణాల ప్రణాళికను ఎస్ఎల్బీసీ తయారుచేసింది. ఆ ప్రణాళికను శుక్రవారం విడుదల చేయనుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో వర్షాకాలం, యాసంగి పంటలకు రూ.39,752 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించినట్లు తెలిసింది. అందులో ఖరీఫ్‌కు రూ.23,852 కోట్లు, రబీకి రూ.15,900 కోట్లు నిర్ధారించినట్లు సమాచారం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ పంట రుణాల ప్రణాళిక రూ.30,140 కోట్లు. -
సకాలంలో చెల్లిస్తేనే 4 శాతం...లేదంటే
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. బుధవారం నాటి కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా రైతులకిచ్చే పంటరుణాల కోసం ఈ కొత్త పథకాన్ని ప్రకటించింది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనే పథకం కింద స్వల్పకాలిక (సం.రం లోపు)రుణాలపై కేవలం నాలుగు శాతం వడ్డీని వసూలు చేయనునున్నట్టు కేంద్రం ప్రకటించింది. అయితే 3 లక్షల రూపాయల స్వల్పకాలిక పంట రుణాన్ని సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే 4 శాతం వడ్డీ రేటుతో అందుబాటులో ఉంచడం కొనసాగుతుందని తెలిపింది. 2017-18 సంవత్సరం కోసం ఈ కొత్త తరహా స్కీమ్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి రూ. 20,339 కోట్ల ఖర్చుతో స్వల్పకాలిక పంట రుణాలకు వడ్డీ సబ్సిడీగా కేబినెట్ ఆమోదం తెలిపిందని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకం కింద సంవత్సరానికి 2 శాతం సబ్‌వెన్షన్‌తో చిన్న వ్యవసాయ రుణదాతకు 3,00,000 రైతులకు అందివ్వబడుతుందని చెప్పారు. మూడులక్షల లోపుతీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు మాత్రమే 4శాతం వడ్డీ రేటు అమలు చేయనున్నామన్నారు. లేదంటే 7శాతం వడ్డీ రేటు కొనసాగనుందని పేర్కొన్నారు. ఏడాది పాటు కొనసాగే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్‌ను నాబార్డ్, ఆర్బీఐలు ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ప్రైవేటు, కార్పొరేటివ్, రీజినల్ బ్యాంకుల ద్వారా రైతులకు నిధులను అందిచనున్నారు. వ్యవసాయ రుణాలు క్షేత్ర స్థాయిలో రైతులకు అందాలన్న ఉద్దేశంతోనే ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. అలాగే 2017-18 నాటికి, వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 10 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. 2016-17లో ఇది రూ. 9 లక్షల కోట్లుగా ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రైతుల ఆందోళనలు మిన్నంటడడంతో రుణమాఫీ ప్రకటించిన ముఖ్యంగా మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో కూడా వర్తించనుంది. -
మంద్సౌర్ హెచ్చరిక
గత కొంతకాలంగా దేశంలోని వివిధ ప్రాంతాల రైతుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పాలక పక్షాలకు మండుతున్న మధ్యప్రదేశ్ గట్టి హెచ్చరిక కావాలి. ఆ రాష్ట్రంలో కట్టలు తెంచుకున్న రైతన్నల ఆగ్రహాన్ని అదుపు చేసేందుకు పోలీసులు మంగళవారం జరిపిన కాల్పుల్లో ఎనిమిదిమంది మరణించారు. అయినా ఆందోళన ఆగలేదు సరిగదా బుధవారం అది కొత్త ప్రాంతాలకు విస్తరించింది. అనేకచోట్ల కర్ఫ్యూ ధిక్కరించి రాస్తారోకోలు నిర్వ హించారు. మంద్సౌర్ జిల్లా కలెక్టర్, ఇండోర్ ఎస్పీ సహా పలువురు ఉన్నతాధికారులపై దాడి చేసి కొట్టారు. బస్సులకూ, వాహనాలకూ నిప్పంటిం చారు. అన్నిటికన్నా వింత...24 గంటలు గడిచినా అన్నదాతల ఉసురు తీసిన తూటాలెవరివో సర్కారుకు తెలియదు! మధ్యప్రదేశ్ రైతుల డిమాండ్లు గొంతెమ్మ కోర్కెలేమీ కాదు. పంటలకు తగిన గిట్టుబాటు ధర కావాలంటున్నారు. సాగు రుణాలను మాఫీ చేయాలంటున్నారు. ఇందులో మొదటి డిమాండ్ మూడేళ్లనాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీయే. రెండోది–ఈమధ్యే జరిగిన యూపీ ఎన్నికల్లో అదే పార్టీ అక్కడి రైతులకు వాగ్దానం చేసి అమలుకు పూనుకుంటున్నదే. అధిక దిగుబడి సాధిస్తున్నందుకు అయిదేళ్లుగా వ్యవసాయ రంగంలో వరసబెట్టి జాతీయ స్థాయి ఉత్తమ అవార్డును సొంతం చేసుకుంటున్న రాష్ట్రంలో రైతులకు ఒరిగిందేమీ లేకపోగా... వారి డిమాండ్లు పెడ చెవిన పెట్టడం, చివరకు పోలీసు కాల్పుల వరకూ రావడం ఎంత విషాదం! నిజానికిది మధ్యప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన ధోరణి కాదు. పాలకులెవరైనా రైతుల విషయానికొచ్చేసరికి అంతటా ఈ మాదిరి ఉదాసీనతే కనిపిస్తోంది. కడు పుమండి, సహనం కోల్పోతే మాత్రం లాఠీచార్జిలు, కర్ఫ్యూలు, కాల్పులు, కేసులు వచ్చిపడుతున్నాయి. అదనపు బలగాలు దిగుతున్నాయి. మిర్చి రైతులు గిట్టు బాటు ధర కోసం ఉద్యమించిన రైతులకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరాభవం ఎదురైందో అందరూ చూశారు. రైతుల ఆందోళన అరణ్యరోదనగా మిగిలిపోగా దళారులదే పైచేయి అయింది. దేశంలో అనేకచోట్ల రైతులు ఆందోళన బాట పడుతున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా తదితర రాష్ట్రాల్లో రుణమాఫీ కావాలంటూ ఉద్యమిస్తున్నారు. వీటిని కేవలం యూపీలో రుణమాఫీ అమలు చేస్తున్న పర్యవసానంగా తలెత్తిన ఉద్యమాలుగా భావిస్తే రైతులకు అన్యాయం చేయడమే అవుతుంది. దేశ జనా భాలో 70 శాతంమంది ఆధారపడుతున్న సాగు రంగాన్ని వరస కరువులు పట్టి పీడిస్తున్నాయి. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. మరో పక్క సాగు వ్యయం అపరిమితంగా పెరిగింది. చివరకు రైతులు అప్పుల్లో కూరుకు పోయి ఆత్మహత్యే శరణ్యమనుకుంటున్నారు. పత్తి, ఉల్లి, సోయాబీన్, టొమాటా, ఎండుమిర్చి...ఇలా ఏ పంట సాగుచేస్తున్న రైతులను కదిల్చినా కన్నీటి గాథలే. ఇప్పుడు అట్టుడుకుతున్న మధ్యప్రదేశ్ విషయమే తీసుకుంటే అక్కడ నిరుడు ఫిబ్రవరి నుంచి మొన్న ఫిబ్రవరి వరకూ 1,982మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్రంలో గత పదిహేనేళ్లలో ఇలా ఉసురు తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు 20,000. నిరుడు వాతావరణం అనుకూలించి పంటలు బాగా పండినా మార్కెట్‌కొచ్చిన దిగుబడులకు గిట్టుబాటు ధరలు లేవు. ఆ రాష్ట్రంలో మాల్వా– నిమద్ ప్రాంతంలో ఇప్పుడు పోలీస్ కాల్పులు జరిగిన మంద్సౌర్ జిల్లాతో సహా 15 జిల్లాలున్నాయి. ఆ ప్రాంతంలో వరసగా రెండోసారి కూడా ఉల్లి దిగు బడులు బాగున్నాయి. మార్కెట్‌కి తీసుకొచ్చాక దాని ధర అమాంతం పడి పోయింది. కిలో రూపాయి పలకడంతో ఆగ్రహించిన రైతులు ఉల్లిని రోడ్లపై పారబోయాల్సివచ్చింది. టొమాట, ఆలుగడ్డ రైతుల స్థితి సైతం ఇదే. ఆందోళన ఉధృతమయ్యాక చాలా ఆలస్యంగా ఉల్లి కనీస మద్దతు ధర రూ. 8గా ప్రభుత్వం ప్రకటించింది. ఇంచుమించు ఇవే పరిస్థితులు పొరుగునున్న మహారాష్ట్రలో కూడా కన బడుతున్నాయి. అక్కడ ఈ ఏడాది కంది బాగా పండిందన్న సంబరం కాస్తా ఆవిరైంది. దాని ధర క్వింటాల్‌కు రూ. 12,000 నుంచి ఒక్కసారిగా రూ. 3,000కు పడిపోయింది. ఎన్నో ఒత్తిళ్లు, ఆందోళనల తర్వాత కనీస ధర రూ. 5,000గా ప్రభుత్వం ప్రకటించినా సరిగా అమలు కాలేదు. అందువల్లనే ఆగ్రహించిన రైతులు మహారాష్ట్రలోని పుణే ప్రాంతంలో పాలు, కూరగాయలు నగరాలకు వెళ్లనీయరాదని అడ్డుకున్నారు. ఈ ఉద్యమం ఇతరచోట్లకు విస్తరించిన పర్యవ సానంగా రాష్ట్రంలోని 307 వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీల్లో అధికచోట్లకు సాగు దిగుబడుల రాక పూర్తిగా నిలిచిపోయింది. పర్యవసానంగా కూరగాయల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. కొల్హాపూర్, నాసిక్, సంగ్లి, అమరావతి జిల్లాల్లో రెవెన్యూ కార్యాలయాల ముందూ, కలక్టరేట్లముందూ కూరగాయలు పారబోసి రైతులు నిరసన తెలుపుతున్నారు. జూన్ 1 నుంచి ఆందోళన చేస్తున్నా పెద్దగా పట్టించుకోని మహారాష్ట్ర సర్కారు మంద్సౌర్ ఉదంతాన్ని గమనించాక కదిలింది. రుణమాఫీ అమలు చేస్తామని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ హామీ ఇచ్చారు. అటు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ సైతం రుణమాఫీ ప్రతిపాదనను పరిశీలిస్తామంటున్నారు. రాజస్థాన్ రైతులు కూడా ఆందోళన బాటపడుతున్నారు. రైతు రుణమాఫీ అనారోగ్యకరమంటున్న రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్, స్టేట్‌బ్యాంక్ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వేలాది కోట్ల రూపాయల కార్పొరేట్ బకాయిలు ఎలా మాఫీ అవుతున్నాయో చెప్పాలి. సాగు వ్యయానికి అదనంగా 50 శాతం చేర్చి కనీస మద్దతు ధర ప్రకటించాలన్న వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫార్సును అమలు చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది. అది సాకారమైతేనే వ్యవసాయ రంగం కాస్తయినా కోలుకుంటుంది. రైతులు తెరిపిన పడతారు. పాలకుల ధోరణి మారకపోతే మాత్రం మంద్సౌర్లు అన్నిచోట్లా పునరావృత మవుతూనే ఉంటాయి. -
‘రూపే’ ఉంటేనే రుణం
రైతులకు తప్పనిసరి చేస్తూ నాబార్డు ఆదేశాలు జిల్లాకు చేరిన కార్డులు 40 వేలు.. పంపిణీ చేసినవి 22 వేలు ఖరీఫ్ ఆసన్నమవుతున్నా ప్రారంభం కాని రుణాల ప్రక్రియ ఆదిలాబాద్‌టౌన్: రూపే కిసాన్ కార్డు ఉంటేనే జిల్లా సహకార బ్యాంకుల ద్వారా రైతులకు పంట రుణాలు ఇవ్వాలని నాబార్డు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్నదాతలకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ పంట రుణాల ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈయేడాది మార్చిలోనే సహకార బ్యాంకుల పరిధిలోని రైతులందరికీ రూపే కార్డులు అందజేయాలని ఆదేశాలు జారీ చేసినా ఇప్పటివరకు సగం మందికే జారీ చేశారు. గ్రామస్థాయిలో రైతులకు అందే సేవలను డిజిటల్ చెల్లింపుల్లో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సహకార బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు రైతులందరికీ కార్డులు అందించాలని నాబార్డు బ్యాంకులకు సూచించింది. ఉమ్మడి జిల్లాలో.. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో 29 సహకార బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల పరిధిలో 76 సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సహకార బ్యాంకుల్లో 55,626 మందికి ఖా తాలు ఉన్నాయి. రూపే కార్డుల పంపిణీ ప్రక్రియ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు 22 వేల మంది రైతులకు మాత్రమే పంపిణీ చేశారు. కా గా జిల్లాకు 40వేల కార్డులు వచ్చాయని డీసీసీబీ అ ధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు వరకు ఉమ్మడి జిల్లా పరిధిలోని రైతులందరికీ రూపే కార్డుల పంపిణీ చేస్తారా అనేది అనుమానంగానే ఉంది. బోగస్ ఖాతాలకు చెక్.. రూపేకార్డులను వంద శాతం పంపిణీ చేస్తే సహకార బ్యాంకుల్లో రైతుల పేరిట తీసుకునే బడా బాబులకు చెక్ పడనుంది. రూపే కార్డు ఏటీఎం కార్డు లాగా పనిచేస్తుంది. రైతులకు పంట రుణ ఖాతా, పొదుపు బ్యాంక్ ఖాతా ఈ కార్డుకు అనుసంధానమై ఉంటాయి. రైతులకు మంజూరైన రుణాలు ఇక నగదు రూపంలో ఇవ్వకుండా రూపే కార్డును రైతు పేరుతో ముద్రించి రైతుకు అందజేస్తారు. రైతులకు కార్డులు అందించే సమయంలో ధ్రువీకరణ పత్రం ఇవ్వాలనే నిబంధన పెట్టారు. దీంతో రైతులందరి నుంచి సంతకాలు తీసుకోవడానికి మరింత జాప్యం జరగనుంది. కార్డులను రైతులకు ఇవ్వాలంటే వారి కుటుంబానికి భూమికి సంబంధించిన 17 అంశాలు ఆధార్ సంఖ్యను సేకరించి నమోదు చేయాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 76 సంఘాలకు గాను 52 సంఘాలకు మాత్రమే సేవలు అందుతున్నాయి. ఇంకా 21 సంఘాలు ఆన్లైన్లో సేవలకు సంబంధించి నమోదు కాలేదు. ఈ లావాదేవీలు పాసు పుస్తకాల్లోనే నిర్వహిస్తున్నారు. దీంతో పంట రుణాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పుస్తకంలో సర్దుబాటు విధానంతో బ్యాంకులు నెట్టుకొస్తున్నాయి. రూపే కార్డు విధానం వల్ల ఈ బోగస్ వ్యవహారానికి అడ్డుకట్ట పడనుంది. రైతులకు అందించే రుణాల మంజూరు, చెల్లింపులు ఆన్లైన్లో జరపడం వల్ల ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసిపోతుంది. ఏవైనా అక్రమాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎం–పాస్ యంత్రాలు ఇచ్చేందుకు.. జిల్లా సహకార బ్యాంకుల ద్వారా నగదు రహిత లావాదేవీలకు సంబంధించి ఎం–పాస్ యంత్రాలు ఇచ్చేందుకు అధికారులు నిమగ్నమవుతున్నట్లు తెలుస్తోంది. రైతులకు జారీ చేసే రూపే కార్డులను సంఘాల్లో ఉపయోగించేందుకు వీలుంటుంది. వీటితో స్వైపింగ్, ఏటీఎంలో వినియోగించుకోవచ్చు. లావాదేవీలు జరుపుకోవచ్చు. త్వరలో సహకార బ్యాంకులకు సంబంధించి ఏటీఎంలను జిల్లాలోని ముఖ్య ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
పెద్దలకు మాత్రమే
-
సాగుకు ముందే పంట రుణం
స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటల బీమా సాక్షి, హైదరాబాద్: సీజన్లో సాగుకు ముందే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ‘ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు’ టాస్క్‌ఫోర్స్ కమిటీ సూచించింది. అప్పుడే రైతు తనకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలుచేసి ప్రైవేటు అప్పులకు దూరంగా ఉంటారని, రెట్టింపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ చైర్మన్‌గా, ప్రొఫెసర్ రాజిరెడ్డి కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఇందులో నాబార్డు సహా వ్యవసాయ, ఉద్యాన, పశుసం వర్థక, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతు ఆదాయం రెట్టింపునకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖలు తమ నివేదికలు అందజేశాయి. ప్రస్తుతం సాగు చేశాకే పంట రుణాలు ఇస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని టాస్క్ ఫోర్స్ కమిటీ వివరించింది. పంట వేయడానికి ముందే వివిధ పంటలకు బీమా ప్రీమియం గడువులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంగా పాడి, చేపలు, గొర్రెల పెంపకం వంటి వాటిని కూడా ఎంచుకోవాలని సూచించారు. ఎరువుల వాడకాన్ని తగ్గించాలి: వచ్చే ఖరీఫ్ నుంచి ఎరువుల వాడకాన్ని కనీసం పావు శాతానికి తగ్గించేలా చూడాలని కమిటీ సూచించింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న అంశంపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు రెండు బృందాలు వెళ్లి సర్వే నిర్వహించాయి. -
పంట రుణాలపై 660 కోట్ల వడ్డీ మాఫీ
నవంబర్, డిసెంబర్లకు వర్తింపు ► గృహ రుణ వడ్డీ రాయితీ పథకానికి ఓకే ► వరిష్ట పెన్షన్ బీమా యోజనకూ ఆమోదం ► కేంద్ర కేబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: నోట్ల రద్దుతో నగదు దొరక్క ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం కాస్త ఊరట కల్పించింది. సహకార బ్యాంకుల నుంచి 2016 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య తీసుకున్న స్వల్పకాలిక పంటరుణాలపై ఆ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలలకుగాను రూ. 660.50 కోట్ల వడ్డీని మాఫీ చేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. నవంబర్, డిసెంబర్ల వడ్డీని చెల్లించిన రైతులకు ఆ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తుందని వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ చెప్పారు. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సహకార బ్యాంకులకు 4.5 శాతం వడ్డీతో రుణంగా ఇవ్వడానికి రూ. 20 వేల కోట్ల రుణాలను తీసుకునేందుకు నాబార్డ్‌కు కేబినెట్ అనుమతినిచ్చింది. 1.8 శాతం వడ్డీ రాయితీ, 0.2 శాతం పాలనా వ్యయాన్ని నాబార్డ్ భరించేందుకు రూ. 400 కోట్ల గ్రాంట్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది. గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ గ్రామీణ ప్రజలు కొత్త ఇళ్లు కట్టుకోవడానికి, లేదా ప్రస్తుత ఇళ్ల అభివృద్ధి కోసం తీసుకునే గృహ రుణాలపై 3 శాతం వడ్డీ రాయితీ ఇచ్చే పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాసయోజన(గ్రామీణ్) కిందికి రాని ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల వరకు రుణంపై ఈ రాయితీ ఇస్తారు. దీనితో పేదలకు నెల వాయిదాల(ఈఎంఐ)పై భారం తగ్గుతుందని, ఈ పథకాన్ని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అమలు చేస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రధాని మోదీ కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఈ పథకాన్ని ప్రకటించడం తెలిసిందే. సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు పదేళ్లపాటు ఏటా 8 శాతం వడ్డీ ఇచ్చే వరిష్ట పెన్షన్ బీమా యోజన–2017 పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది.. వీటిలో దేన్ని ఎంచుకుంటే దాని ప్రాతిపదికగా పెన్షన్ అందిస్తారు. ఎల్ఐసీ అమలు చేయనున్న ఈ పథకంలో 60 ఏళ్లు, ఆపై వయసున్న వారు పథకం మొదలైన నాటి నుంచి ఏడాది లోపల చేరవచ్చు. ఐఐఎంల నుంచి ఇక డిగ్రీలు దేశంలోని 20 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు ఇకపై తమ విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమా, ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్లు కాకుండా ఎంబీఏ వంటి డిగ్రీలు, పీహెచ్‌డీలు ఇవ్వనున్నాయి. ఐఐఎంలను ఇకపై జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తిస్తారు. దీనికి సంబంధించిన ఐఐఎం–2017 బిల్లును కేబినెట్ ఆమోదించింది. దీన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఐఐఎంలకు సంపూర్ణ స్వయంప్రతిపత్తిపై బిల్లు దృష్టి సారించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఐఐఎంలు సొసైటీల చట్టం కింద రిజిస్టర్ అయి ఉండడంతో వీటికి డిగ్రీలు ఇచ్చే అవకాశం లేదు. ఈ సంస్థలు ఇచ్చే డిప్లమాలు, ఫెలో ప్రోగ్రామ్‌లు.. ఎంబీఏ, పీహెచ్‌డీలకు సమానంగా భావిస్తున్నా వీటి సమానత్వంపై సార్వత్రిక ఆమోదం లేదు. కాగా, హరితవాయు ఉద్గారాల కట్టడికి కోసం క్యోటో ప్రొటోకాల్ రెండో దశ అమలుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నారైలకు ఎలక్ట్రానిక్ మాధ్యమంలోనూ, ప్రతినిధి ద్వారానూ ఓటు వేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనను వాయిదా వేసింది. -
నట్టేట ముంచారు
జంగారెడ్డిగూడెం : స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) అధికారులు తమను నట్టేముంచారని వర్జీనియా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం స్థానిక ఎస్బీఐ, ఎస్బీహెచ్ వద్ద వర్జీనియా పొగాకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దెత్తున ధర్నా నిర్వహించారు. ఏటా రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు వర్జీనియా రైతులకు బ్యాంకులు రుణాలుగా ఇచ్చేవని అయితే ఈ ఏడాది రూ.3 లక్షలు ఇచ్చి మిగిలిన రుణాన్ని తర్వాత ఇస్తామని చెప్పి పంట చేతికి వచ్చే సమయంలో మోసం చేశారని ఆరోపించారు. రెండు నెలలుగా తిరుగుతున్నా.. గతేడాది బ్యార¯ŒSకు 25 క్వింటాళ్లు పంట అనుమతి ఇవ్వగా బ్యాంకులు ఐదు నుం చి ఆరు లక్షల రూపాయలు రుణాలు ఇచ్చాయని, ఈ ఏడాది బ్యార¯ŒSకు 30 క్వింటాళ్లు అనుమతి ఉన్నా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రెండు నెలలుగా బ్యాంకు ఉన్నతాధికారులతో చర్చించినా ఫలితం లేదన్నారు. అదనపు రుణం వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు బ్యాంకు అధికారుల నిర్ణయం శరాఘాతంగా తగిలిందన్నారు. 30 ఏళ్లుగా లేని నిబంధనలు పెట్టి రైతులను నట్టేట ముంచారని ఆందోళన చెందుతున్నారు. బకాయిలకు జమ రైతులకు మంజూరు చేసిన రూ.3 లక్షలూ గత బకాయిలకు బ్యాంకులు జ మచేసుకున్నాయని, దీంతో రైతు చేతికి కనీసం రూ.25 వేలు కూడా అందలేదని అన్నారు. పంట చేతికి వచ్చే సమయం లో ఎక్కువ ఖర్చులు ఉంటాయని కూ లీలకు పండుగ అడ్వాన్సులు ఇవ్వాల్సి ఉంటుందని, ఇటువంటి సమయంలో బ్యాంకర్లు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ధర్నా అనంతరం ఎస్బీహెచ్ చీఫ్ మేనేజర్ ఎంవీ సీతారామన్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని అక్కడ ఏవో పి.సత్యనారాయణకు తమకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. పొగాకు బోర్డు సభ్యులు గడ్డమణుగు సత్యనారాయణ, గంటశాల గాంధీ, జి.రవికుమార్, చెరుకూరి సందరరావు, వేగేశ్న రాధాకృష్ణరాజు, తెల్లం వెంకటేశ్వరరావు, గద్దే వీరకృష్ణ తది తరులు పాల్గొన్నారు. మభ్యపెట్టి మోసం చేశారు ఎస్బీఐ, ఎస్బీహెచ్ బ్యాంకులు వర్జీనియా రైతులను నట్టేట ముంచాయి. రుణాలు పెంచి ఇస్తామని మభ్యపెడుతూ ఇప్పుడు అకస్మాత్తుగా రుణం పెంచేది లేదని చేతులెత్తేశాయి. వర్జీనియా తోటలు మధ్యరకంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పవు. మధ్యస్థంగా ఉన్న, చేతికి వచ్చే పంట దశలో ఉన్న రైతులు నష్టపోతారు. –గడ్డమణుగు సత్యనారాయణ, పొగాకుబోర్డు సభ్యుడు ఆత్మహత్యలే శరణ్యం వర్జీనియా రైతులకు ఆత్మహత్యలే శరణ్యం. ఇప్పటివరకు రుణాలు పెంచి ఇస్తామని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు ఇవ్వలేమని ప్రకటించారు. దీంతో వర్జీనియా రైతులంతా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. అదంతా కోల్పోవాల్సి వస్తోంది. –గంటశాల గాంధీ, వర్జీనియా పొగాకు రైతు -
రుణమాఫీకి రూ.2,019 కోట్లు
⇒ మూడో విడతలో రెండో సగం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ⇒ వచ్చే ఏడాది ఒకేసారి ఆఖరి విడత చెల్లింపునకు యోచన సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడో విడతకు సంబంధించిన రెండో సగం నిధులు రూ.2,019.19 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులకు సంబంధించి మూడు వంతుల రుణాన్ని ప్రభుత్వం తిరిగి బ్యాంకులకు చెల్లించినట్లైంది. మొత్తం 36 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాల మాఫీ పథకాన్ని టీఆ ర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. 4 విడతల్లో మాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తొలి ఏడాది రూ.4,250 కోట్లు ఒకే సారి విడుదల చేసింది. గతేడాది జూన్, సెప్టెంబ ర్లో 2 దశల్లో రూ.4,086 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది నిధుల విడుదల ఆలస్యమైంది. జూలై 1న మొదటి దఫాగా రూ.2,019 కోట్లు చెల్లిం చింది. 3 నెలల తర్వాత మిగతా రూ.2,019 కో ట్లు విడుదల చేసింది. వచ్చే ఏడాది నాలుగో విడ త చెల్లింపులతో ఈ పథకం ముగియనుంది. బ్యాంకులకు నిధులు చేరటం ఆలస్యమవటంతో కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు విమర్శలు చుట్టుముట్టారుు. అందుకే వచ్చే ఏడాది చివరి విడత నిధులను ఒకేసారి విడుదల చేయాలని ఇటీవలే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. లెక్కతేలింది రూ.16,160 కోట్లు.. రైతు రుణమాఫీకి సంబంధించిన లెక్కతేలింది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆరంభంలో ప్రకటించింది. 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ పథకం అమల్లో భాగంగా రెండో ఏడాది బోగస్ రైతులు, రెండేసి ఖాతాలున్న రైతులు కొందరిని ప్రభుత్వం ఏరివేసింది. దీంతో మాఫీ మొత్తం రూ.16,160 కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ తాజాగా అంచనాకు వచ్చింది. ఇప్పటివరకు రూ.12,375 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 35.30 లక్షల రైతుల రుణాలు మాఫీ అయ్యాయని, బ్యాంకుల బ్రాంచీల వారీగా లబ్ధిదారుల జాబితాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మిగతా రూ.3,785 కోట్లు విడుదల చేస్తే ఈ పథకం సంపూర్ణంగా విజయవంతమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు. దశలవారీగా చెల్లింపులు 2014 సెప్టెంబర్: రూ.4,250 కోట్లు 2015 జూన్: రూ.2,043 కోట్లు 2015 జూలై: రూ.2,043 కోట్లు 2016 జూలై: రూ.2,019 కోట్లు 2016 నవంబర్: రూ.2,019 కోట్లు -
విత్తుకు విత్తమేది?
► రైతన్నకు నయా పైసా అందని రబీ రుణం ► కాలం కలిసొచ్చినా కరుణించని బ్యాంకులు ► రుణ లక్ష్యం రూ.11,640 కోట్లు.. ఇచ్చింది శూన్యం ► ప్రభుత్వం ముందు సై.. రైతుల ముందు నై ► పుష్కలంగా నీళ్లున్నా సొమ్ము లేక అన్నదాత విలవిల ► పెట్టుబడుల కోసం అప్పులు.. తప్పని ‘ప్రైవేటు’ తిప్పలు ► బ్యాంకులపై ఒత్తిడి తేవడంలో వ్యవసాయ శాఖ విఫలం సాక్షి, హైదరాబాద్: కాలం కలిసొచ్చింది.. వర్షాలు దండిగా కురిశాయి.. చెరువులు, బావులు, బోర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి.. గింజ వేస్తే చాలు చేలన్నీ పైర్లతో కళకళలాడుతాయి... కానీ రైతన్న చేతిలో చిల్లిగవ్వ లేదు.. విత్తుకు విత్తం(సొమ్ము) లేదు.. రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు మొండికేస్తున్నాయి. రబీ సీజన్ మొదలై నెల కావస్తున్నా పంట రుణం కింద నయా పైసా ఇవ్వలేదు. రైతులు గత్యంతరం లేక పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మళ్లీ చేయి చాచాల్సి వస్తోంది. అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. 2016–17 ఖరీఫ్, రబీ సీజన్లకు రూ. 29,101 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నిర్ణయించింది. అందులో ఖరీఫ్‌కు రూ.17,460 కోట్లు, రబీకి రూ.11,640 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఖరీఫ్ లక్ష్యంలో బ్యాంకులు కేవలం రూ. 11,546 కోట్లే ఇచ్చాయి. రబీలో రైతులకు విరివిగా రుణాలిస్తామని ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమావేశంలో బ్యాంకర్లు హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నందున మాఫీకి సంబంధించిన సొమ్ముపై రైతులను బలవంతం చేయొద్దని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం, ఆర్థిక మంత్రి ఈటల బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. అయినా బ్యాంక్‌లు తమ వైఖరి మార్చుకోలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి రబీ సీజన్ మొదలైనా ఇప్పటివరకు రైతులకు ఒక్కపైసా పంట రుణాలు ఇవ్వలేదని వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు. మాఫీ బూచీ చూపి.. రుణమాఫీ సొమ్ము పూర్తిగా చెల్లించకపోవడం వల్లే పంట రుణాలు ఇవ్వలేకపోతున్నామంటూ బ్యాంకులు చేస్తున్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేస్తోంది. వడ్డీ సహా తామే చెల్లిస్తామని హామీ ఇచ్చినా బ్యాంకర్లు దాన్నే బూచీగా చూపడం సరికాదని కాదని మంత్రి పోచారం అన్నారు. మూడో విడత రుణమాఫీలో సగమే (రూ.2,020 కోట్లు) విడుదల చేశారని.. మిగతా రూ.2,020 కోట్ల విడుదలపై ఇప్పటికీ స్పష్టత లేదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. అయితే ఈ ఏడాది చెల్లించాల్సిన సగంతో పాటు వచ్చే ఏడాది చెల్లించాల్సిన బకాయిలను కూడా ముందుగానే చెల్లిస్తామని బ్యాంకర్లకు ఇప్పటికే సమాచారం ఇచ్చామని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. సాగు లక్ష్యం 30 లక్షల ఎకరాలు.. ఈ సెప్టెంబర్‌లో రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురిశాయి. ఆ నెలలో సాధారణంగా 129.2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా... 361.5 మి.మీ. కురిసింది. ఏకంగా 180 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రాష్ట్రంలో 30 వేల చెరువులు నిండాయి. నాగార్జునసాగర్ మినహా గోదావరి, కృష్ణా బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు 11.74 మీటర్ల లోతులో ఉండగా... ఈ ఏడాది సెప్టెంబర్‌లో 8.98 మీటర ్లలోనే అందుబాటులో ఉన్నాయి. అంటే 2.76 మీటర్లు పైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రబీలో 31 లక్షల ఎకరాలకు పక్కాగా నీరివ్వాలని నిర్ణయించింది. ఇందులో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 25 లక్షల ఎకరాలు, చిన్న నీటి వనరుల కింద మరో 6 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించింది. వాస్తవంగా రబీ సాగు లక్ష్యం 30.45 లక్షల ఎకరాలు. అందులో ఆహారధాన్యాల సాగు లక్ష్యం 27.07 లక్షల ఎకరాలు. అందులో వరి 17.33 లక్షల ఎకరాల్లో, పప్పుధాన్యాలు 3.70 లక్షల ఎకరాల్లో వేయాలని నిర్ణయించారు. అలాగే ఈ సీజన్లో 42.85 లక్షల టన్నుల ఆహారధాన్యాలను పండించాలని లక్ష్యంగా ప్రకటించారు. అందులో ధాన్యం ఒక్కటే 31.4 లక్షల టన్నులు పండించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇక పప్పుధాన్యాలు 1.73 లక్షల టన్నులు పండించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు వరకు మొత్తంగా అన్ని రకాల పంటలు కలిపి 2.27 లక్షల ఎకరాల్లో రబీ పంటలు సాగైనట్లు వ్యవసాయశాఖ తాజాగా వెల్లడించింది. రబీ లక్ష్యాల మేరకు ఏర్పాట్లు చేయడంలో బ్యాంకులు, వ్యవసాయశాఖ విఫలమయ్యాయి. వ్యవసాయశాఖ ఇప్పటికీ శనగ విత్తనాలను కూడా అందించలేని పరిస్థితి నెలకొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాత జిల్లాల వారీగా 2016–17 రబీ రుణాల లక్ష్యం (రూ.కోట్లలో..) జిల్లా లక్ష్యం ఆదిలాబాద్ 1,174.99 కరీంనగర్ 1,724.24 వరంగల్ 1,286.55 ఖమ్మం 1,100.93 నల్లగొండ 1,289.86 మహబూబ్‌నగర్ 1,874.41 రంగారెడ్డి 836.69 మెదక్ 1,123.64 నిజామాబాద్ 1,229.24 –––––––––––––––– మొత్తం 11,640.55 –––––––––––––––– -
రైతులకు రూ.13 వేల కోట్ల పంట రుణాలు
కేంద్ర మంత్రి దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోని రైతులకు పంట రుణాల రూపంలో రూ.13వేల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. తాజా రబీ సీజన్లో నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రైతులు పండించిన పంట దిగుబడులను మార్కెట్‌కు తరలించేందుకు సదుపాయాలు కల్పించడంతో పాటు కనీస మద్దతు ధరపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతుకు ప్రయోజనం కలిగించే ఫసల్ బీమా పథకం కింద రాష్ట్రంలో 25 లక్షల మందికిగాను 8 లక్షల మంది మాత్రమే నమోదు చేసుకున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ స్వస్థత కార్డులు 31 శాతం మందికే జారీ అయ్యాయని, ఈ ప్రక్రియపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో నూనెగింజలు, పప్పుధాన్యాలు ఉత్పత్తిని పెంచాలని, ప్రస్తుతం రూ.40 వేల కోట్ల నూనె, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే శిశు కేటగిరీలో లక్ష్యాలను పెంచి ఎక్కువ మందికి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. -
'పంటరుణాలను పూర్తిగా మాఫీ చేయాలి'
హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి, ఆదుకోవాల్సి బాధ్యత రాష్ట్ర సర్కారుపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు లబోదిబోమంటున్నారని పేర్కొన్నారు. బుధవారం లోటస్ పాండ్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాయలంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, జిల్లాల పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు ఖర్చు చేసే సీఎం కేసీఆర్ రైతుల విషయంలో మాత్రం మానవతా దృక్పథంతో వ్యవహరించటం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసి తిరిగి రుణాలు వచ్చేలా రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలు సకాలంలో పడనందున రైతులు విత్తిన విత్తనాలు మెలకెత్తలేదని, కొన్ని చోట్ల అరకొర మొలకెత్తిన ఆకాల వర్షాలకి నీట ముగిపోయాయని తెలిపారు. ఆకారణంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్‌ఫుట్ సబ్సిడీ కింద ఎకరాకు రూ.10 వేలు చెల్లించాలని తెలిపారు. వేలాది ఎకరాలు నీట మునిగి రైతుల కన్నీరు పెడుతున్నారని చెప్పారు. 2004 తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం దిగిరాకపోతే అతిత్వరలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రాజెక్టుల యాత్ర చేయనున్నట్లు చెప్పారు. జిల్లాల వారిగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి నెలా జిల్లాల, మండలాల కార్యవర్గ సమావేశాలు తప్పక నిర్వహించాలని చెప్పారు. పార్టీ నిర్మాణ విషయాలపై దృష్టి సారించాలి... రాష్ట్రంలోని జిల్లాల అధ్యక్షులు, పార్టీ జిల్లా పరిశీలకులు, ప్రధాన కార్యదర్శులు ఇక నుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు తీవ్రంగా కృషి చేయాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇకపై అందరూ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించాలని సూచించారు. అక్టోబర్ 15 లోగా గ్రామ స్థాయి కమిటీలు, పార్టీ అన్ని అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు పూర్తి చేయాలని కోరారు. వీర జవానులకు సలాం... సభ ప్రారంభంలో ఉరీలో సైనిక శిబిరంపై ఆదివారం జరిగిన తీవ్రవాద దాడి ఘటనలో అమరులైన జవాన్లకు సమావేశం ఘన నివాళులర్పించింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దేశం యావత్తు ఇలాంటి సమయంలో ఒకటై ముందుకు సాగాల్సి ఉందని సమావేశం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, ప్రధాన కార్యదర్శులు కొండా రాఘవరెడ్డి, కె. శివకుమార్, జి. మహేందర్ రెడ్డి, మతిన్, కె. రాంభూపాల్ రెడ్డి, జిల్లాల అధ్యక్షులు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి (మహబూబ్ నగర్), గౌరెడ్డి శ్రీధర్ రెడ్డి (మెదక్), బెంబడి శ్రీనివాసరెడ్డి( రంగారెడ్డి), బొడ్డు సాయినాథ్ రెడ్డి( గ్రేటర్ హైదరాబాద్), ఎం. శాంతకుమార్( వరంగల్), అక్కెనపల్లి కుమార్ ( కరీంనగర్), నాయుడు ప్రకాశ్ (నిజామాబాద్), తుమ్మలపల్లి భాస్కర్ (నల్లగొండ), మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు అమృత సాగర్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్ష నర్రా బిక్షపతి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. -
రుణ మాఫీ చేస్తేనే పంట రుణాలిస్తారా?
బ్యాంకుల తీరుపై పోచారం మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘రుణ మాఫీ పూర్తిస్థాయిలో అమలుచేయలేదంటూ మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని ఎస్‌బీహెచ్‌కు చెందిన రెండు బ్రాంచీల్లో పంట రుణాలు ఇవ్వబోమని చెబుతున్నారు. జహీరాబాద్ గ్రామీణ వికాస బ్యాంకులో కూడా పంట రుణాలు ఇవ్వడంలేదు’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం హామీ ఇచ్చినా... బ్యాంకు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నా కొన్ని బ్యాంకు శాఖలు రైతులకు పంట రుణాలు ఇవ్వకపోవడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) సమావేశం... ఆ తర్వాత సచివాలయంలో విలేకరులతోనూ మాట్లాడారు. ఎస్ఎల్బీసీలో ఆర్థిక మంత్రి ఈటల కూడా పాల్గొన్నారు. పోచారం మాట్లాడుతూ.. ఖరీఫ్‌లో రూ.17,460కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు బ్యాంకులు రూ.11,545 కోట్లు ఇచ్చాయన్నారు. ఈ నెలాఖరులోగా మిగిలిన ఖరీఫ్ రుణాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయ శాఖలో ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖలను విలీనం చేయబోమన్నారు. రుణమాఫీలో మూడో విడతలో మిగిలిన సగం రూ.2,020 కోట్ల నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాలని ఈటలను పోచారం కోరారు. -
సగంలోపే ఖరీఫ్ పంటరుణాలు
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్ మరో నెల రోజుల్లో పూర్తి కానుంది. కానీ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం, బ్యాంకులు విఫలమయ్యాయి. ఖరీఫ్‌లో ఇవ్వాల్సిన పంటరుణ లక్ష్యంలో సగం కూడా బ్యాంకులు పూర్తి చేయలేదు. ప్రభుత్వం మూడో విడత రుణమాఫీ బకాయి రూ. 2,020 కోట్లు విడుదల చేయకపోవడంతో బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేశాయి. ఫలితంగా అన్నదాతలు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రస్తుతం వర్షాలు పూర్తిస్థాయిలో పడక పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర ఆందోళనలో పడిపోయారు. అప్పుల భారం పెరిగి ఆత్మహత్యల వైపు వెళ్తున్న భయానక పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది. రుణమాఫీ సొమ్ముకు పంట రుణాల విడుదలకు ఏమాత్రం సంబంధం లేదని ప్రభుత్వం చెప్పినా బ్యాంకులు నమ్మలేదని అర్థమవుతోంది. ఈ ఖరీఫ్‌లో రూ. 17,489 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ బ్యాంకులు ఇప్పటివరకు రూ. 8,060 కోట్లే రైతులకు ఇచ్చాయి. రాష్ట్రంలో 81 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కాగా బ్యాంకులు మా త్రం రుణ లక్ష్యంలో కనీసం 50 శాతం కూడా ఇవ్వలేదు. సాగు విస్తీర్ణం పెరిగినా బ్యాంకులు స్పందించకపోవడంతో అన్నదాతలు ప్రైవేటు అప్పులవైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలో రైతులు రూ.10 వేల కోట్ల మేరకు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసినట్లు అంచనా. ఇన్పుట్ సబ్సిడీపై నీలినీడలు కేంద్ర ప్రభుత్వం గతేడాది కరువు నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థికసాయం చేసింది. కానీ ఆ నిధులను రైతులకు అందజేయడంలో సర్కారు నాలుగు నెలలుగా మీనమేషాలు లెక్కిస్తోంది. 2015 ఖరీఫ్‌లో కరువుదెబ్బకు 30.58 లక్షల ఎకరాలకు తీవ్రంగా నష్టం జరిగిన సంగతి తెలిసిందే. కరువు ప్రభావంతో 20.91 లక్షల మంది రైతులు నష్టపోయారు. కరువు సాయంగా కేంద్రం రాష్ట్రానికి నాలుగు నెలల కిందట రూ.712 కోట్లు, రాష్ట్ర విపత్తు నిధికి రూ.108 కోట్లు మొత్తంగా రూ.820 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో మూలుగుతోంది. ఈ సొమ్ముకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.198 కోట్లు కలిపి రూ. 1,018 కోట్లను ఇన్పుట్ సబ్సిడీగా ఖరీఫ్ ప్రారంభానికి ముందే పంపిణీ చేయాల్సి ఉం డగా రేపు మాపు అంటూ జాప్యం చేస్తోంది. -
నకిలీ పహణీ సూత్రధారుల అరెస్ట్
బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి.. వర్ధన్నపేట టౌన్ : నకిలీ పహణీలు తయారు చేసి రుణాల కోసం రైతులకు అందించిన ముగ్గురిని గురువారం అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ తెలిపారు. ఇల్లందలోని మీసేవ కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్ ఆడెపు కేశవ్, చంద్రుతండాకు చెందిన మధ్య దళారి మాలోతు వీరస్వామి, నకిలీ పహణీ తీసుకున్న మూడుగుళ్ల తండాకు చెందిన రైతు బానోతు దేసునాయక్ అరెస్ట్‌ను పోలీస్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల ఎదుట చూపారు. సీఐ కథనం ప్రకారం.. ఇల్లందలోని కేజీవీబీలో దేసునాయక్ పంట రుణం ఎక్కువగా కావాలని బ్యాంకు మేనేజర్‌ను కోరాడు. భూ విస్తీర్ణాన్ని బట్టి లోన్ ఇస్తామని మేనేజర్ చెప్పారు. గతంలో అతడికి రూ. 35 వేల రుణం ఉంది. ఇది గమనించిన మధ్యదళారి, ప్రస్తుతం రాంధన్తండా మహిళా సంఘాల సీఏగా పని చేస్తున్న వీరస్వామి.. ఎక్కువ రుణం ఇప్పిస్తానని, అందుకు కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పగా దేసునాయక్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వీరస్వామి రైతు వద్ద పహణీ కాపీలు తీసుకుని ఇల్లంద మీసేవా కేంద్రం ఆపరేటర్ కేశవ్‌ను కలిసి పహణీలో భూమి విస్తీర్ణాన్ని పెంచాలని కోరాడు. పర్వతగిరి మండలం రోళ్లకల్లు శివారులో దేసునాయక్కు 121/ఎ సర్వే నంబర్లో 0.12 ఎకరాలు ఉండగా దానిని 2.12 ఎకరాలుగా, 137/బిలో 0.16 ఎకరాలు ఉండగా దానిని 1.16 ఎకరాలుగా మార్చాడు. ఈ నకిలీ పహణీతో బ్యాంకుకు వెళ్లిన దేసునాయక్ రుణం పెంచాలని మేనేజర్‌ను కోరాడు. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ తహసీల్దార్‌ను సంప్రదించగా రికార్డులు, కంప్యూటర్ పహణీలను పరిశీలించగా నకిలీవని గుర్తించారు. దీంతో వర్ధన్నపేట రెవెన్యూ అధికారులు మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. బ్యాంకు మేనేజర్ దాసునాయక్ గత నెల 28న వర్ధన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి పై ముగ్గురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట వర్ధన్నపేట ఎస్సై రవిరాజు తదితరులు ఉన్నారు. -
పంట రుణాలు మాఫీ చేయాలి
వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్ మంచాల: రైతులకు ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాదగోని జంగయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంచాలలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం కూతల ప్రభుత్వమని విమర్శించారు. ఆచరణలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ పెద్దలు రెండేళ్లయినా మాఫీ చేయలేదని చెప్పారు. పంట రుణాల కోసం రైతులు కాళ్లకు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని తెలిపారు. పంట రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. రైతులను మోసం చేసిన ప్రభుత్వాలను భవిష్యత్‌లో పుట్టగతులు ఉండవని విమర్శించారు. పంట రుణాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్రభాకర్, నాయకులు బకున రమేష్, శ్రీకాంత్, లోంగారి యాదగిరి, సంగం భాస్కర్, దాసరమోని సురేష్, ఎన్నుదుల మహేష్ పాల్గొన్నారు. -
రైతుల నుంచి వడ్డీ వసూలు
ప్రభుత్వ ఆదేశాలను పాటించని బ్యాంకర్లు రుణాలను రెన్యూవల్ చేసుకునే సమయంలో వడ్డీని చెల్లించాలంటున్న బ్యాంకర్లు వడ్డీ మాఫీని ప్రభుత్వం నిధులు ఇచ్చిన తరువాత.. రీయింబర్స్మెంట్ రూపంలో ఖాతాల్లో జమ చేస్తామంటున్న బ్యాంకర్లు ఇబ్బందులు పడుతున్న రైతులు మోర్తాడ్ : ‘పంట రుణాలు పొందిన రైతుల నుంచి బ్యాంకర్లు ఎలాంటి వడ్డీ వసూలు చేయవద్దు, రూ. లక్షలోపు రుణం పొందిన వారికి జీరో వడ్డీ వర్తిస్తుంది. రూ. 3 లక్షల వరకు రుణం తీసుకున్న వారికి పావలా వడ్డీ వర్తిస్తుంది. బ్యాంకర్లు సహకరించి రైతుల నుంచి ఎలాంటి వడ్డీ వసూలు చేయవద్దు. వడ్డీకి సంబంధించిన నిధులను ప్రభుత్వం త్వరలో బ్యాంకులకు అందిస్తుంది. రైతులను బ్యాంకర్లు ఇబ్బంది పెట్టవద్దు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో స్పష్టం చేసిన మాట. కాని క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా బ్యాంకర్లు వ్యవహరిస్తున్నారు. పంట రుణాలను రెన్యూవల్ చేసుకునే రైతుల నుంచి వడ్డీని రైతులు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పంట రుణాలపై రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం బ్యాంకులు 7 శాతం వడ్డీని వసూలు చేస్తాయి. ఇందులో కేంద్రం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ భారాన్ని మోస్తుంది. రూ. లక్షలోపు పంట రుణం పొందిన రైతుకు జీరో వడ్డీ వర్తిస్తుంది. రూ. 3 లక్షల వరకు పంట రుణం పొందిన రైతులకు పావలా వడ్డీ వర్తిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట రుణాలకు సంబంధించిన వడ్డీ కోసం ప్రతియేటా నిధులు విడుదల చేస్తా యి. అయితే పంట రుణాల మాఫీకి ముందు రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలను చెల్లించి మళ్లీ తీసుకున్న తరువాత వడ్డీకి సంబంధించిన సొమ్ము రీయింబర్స్మెంట్ రూపంలో వాపసు వచ్చేది. రూ. లక్షలోపు పం ట రుణం మాఫీ అయిన తరువాత రైతులు బ్యాంకుల్లో రుణాలను రెన్యూవల్ చేసుకుంటున్నారు. కాగా సకాలంలో పంట రుణాలను రెన్యూవల్ చేసుకున్న వారికి మాత్రమే రుణమాఫీకి సంబంధించిన సొమ్ము ఖాతాల్లో జమ అవుతుందని బ్యాంకర్లు గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కాగా పంట రుణాలను రె న్యూవల్ చేసుకునే రైతులు వడ్డీని చెల్లించాలని బ్యాంకర్లు ఆదేశిస్తున్నారు. రూ. లక్ష వరకు ఉన్న పంట రుణానికి సంబంధించి రైతులు రెన్యూవల్ చేసుకుంటే రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు వడ్డీ భారం మోయాల్సి వస్తుం ది. రూ. లక్షకు మించిన పంట రుణం ఉంటే రూ. 10వేలకు పైగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఈ వడ్డీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ కావడానికి కొంత సమయం పడుతుంది. అయితే రా ష్ట్రంలో రెండేళ్ల నుంచి కరువు పరిస్థితులు నెల కొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా రు. బ్యాంకుల్లో రెన్యూవల్ చేసుకునే పంట రుణాలకు వడ్డీ చెల్లించలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మూడో విడత రుణ మాఫీకి సంబంధించిన నిధులను బ్యాంకులకు విడుదల చేయకపోవడంతో రైతులు వడ్డీ భారం మోయడం తప్ప చేతికి మాఫీ సొమ్మును అందుకోలేక పోతున్నారు. రుణమాఫీకి సంబంధించిన సొమ్మును విడుదల చేయడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో రైతులకు మాఫీ సొమ్ము అందలేకపోతుంది. జిల్లా వ్యాప్తంగా 4.73 లక్షల మంది పట్టాదారులు ఉండగా ఇందులో 3.79 లక్షల మంది పంట రుణాలను పొందారు. పంట రుణాలు పొందిన వారి నుం చి రెన్యూవల్ సమయంలో వడ్డీని రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వసూలు చేస్తున్నామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. వడ్డీ వసూలు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ తమకు రిజర్వు బ్యాంకు నుంచి ఆదేశాలు అందితేనే వడ్డీ వసూలు నిలిపివేస్తామని బ్యాం కర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సకాలంలో వడ్డీ సొమ్ముతోపాటు, మాఫీ నిధులు విడుదల చేస్తే రైతులకు ఇబ్బందులు తప్పుతాయని బ్యాంకర్లు చెబుతున్నారు. కాగా ప్రభుత్వం ఇ స్తున్న ఆదేశాలకు బ్యాంకుల్లో పరిస్థితికి భిన్నమైన తేడాలు ఉండడంతో రైతులు ఇక్కట్లు ప డుతున్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.