మంచాల: ప్రభుత్వం పంట రుణాలు ఇస్తుండడంతో మండల రెవెన్యూ కార్యాలయం, బ్యాంకులు రైతన్నలతో కిటకిటలాడుతున్నాయి. గత రెండు,మూడు వారాలుగా రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో కుటుంబ సమగ్ర సర్వే తదితర పనులల్లో ఉండడంతో పహాణీలు ఇవ్వలేకపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయమే అధికారులు రాక బోసిపోయింది. ఇంక బోడకొండ,లింగంపల్లి వంటి కొన్ని గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో రైతులు పహాణీల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
సర్వే పూర్తయిన రెవెన్యూ కార్యదర్శులు తహసీల్దార్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు సం బంధించిన పహాణీలు రాసి ఇస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడాన్నికి రైతులు పెద్ద సంఖ్యలో పహా ణీల కోసం వస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం సోమవారం రైతులతో కిటకిట లాడింది. రెవెన్యూ కార్యదర్శులకు తీరిక లేకుండా పోయింది.
అదే విధంగా బ్యాంకుల్లోకి కూడా రైతులు అధిక సంఖ్యలో రావడంతో బ్యాంకు అధికారులకు తీవ్ర ఇబ్బందిగా మా రింది. దీంతో బ్యాంకు అధికారులు రుణాలు తీసుకోవడానికి వస్తున్న రైతులకు వరుసక్రమంలో దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో రాకుండా రోజుకు పరిమితి సంఖ్యలో మాత్రమే దరఖాస్తు ఫారాలు ఇచ్చి ఇబ్బందులు కలుగకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు.
తప్పని తిప్పలు..
బ్యాంకు రుణాలు తీసుకోవడానికి రెవెన్యూ కార్యాలయం వచ్చే రైతులకు ఇబ్బందులు తప్పడం లేవు. రైతులు పట్టాలో ఉండి రికార్డుల్లో ఉన్నా కూడా కంఫ్యూటర్ పహణీలో మాత్రం రావడం లేదు. మరికొంత మంది పట్టాల్లో ఉండి ఆ భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో మాత్రం పేర్లు రావడం లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కంప్యూటర్ పహాణీలో కొంత మంది ఖాతా నంబర్లు సక్రమంగా రావడం లేదు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో రెవె న్యూ రికార్డులు కంప్యూటరీకరణ కాలే దు. ఇలా అనేక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారులు అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా సక్రమంగా పనులు చేయించి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పహాణీలకు పరేషన్..!
Published Mon, Nov 24 2014 11:44 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement