manchala
-
పిచ్చుకా క్షేమమా
మనిషి తన సౌకర్యం కోసం ప్రకృతి సమతుల్యతకు విఘాతం కలిగిస్తూనే ఉంటాడు. ప్రకృతి సహనంతో ఓర్చుకుంటూ, అప్పుడప్పుడూ విలయం రూపంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటుంది. మొత్తంగా తనను తాను సమతుల్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ‘మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు’... అని పిచ్చుకలు ఆవేదన చెందుతున్న సమయంలో ప్రకృతి ఓ అమ్మాయి మనసును కదిలించింది. ఆమె ఇప్పుడు పక్షి ప్రేమికురాలైంది. తన ఇంటిని పక్షులకు విలాసంగా మార్చింది. తాను పక్షి ప్రేమికురాలిగా మారిన సందర్భాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు మంచాల హరిణి. అడవికి దాహం వేసింది! ‘‘అప్పుడు నేను బీబీఏ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అమ్మా నాన్న, నేను, అక్క అందరం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మా పెద్ద నానమ్మ వాళ్ల ఊరికి వెళ్తున్నాం. నిర్మల్ దాటి కడెం మీదుగా అడవిలో ప్రయాణిస్తున్నాం. మే నెల కావడంతో ఎండ తీవ్రంగా ఉంది. చెట్ల మొదళ్లు ఎండిపోయి వానల కోసం ఎదురు చూస్తున్నాయి. ఓ పక్షి మా కళ్ల ముందే చెట్టుకొమ్మ మీద నుంచి జారి నేల మీద పడింది. కొద్ది సెకన్లపాటు రెక్కలు కొట్టుకున్నాయి. కారాపి వెళ్లి చూశాం, పక్షిని చేతుల్లోకి తీసుకుని మా దగ్గరున్న నీటిని చల్లి, తాగించడానికి ప్రయత్నించాం. కానీ ఆ పక్షి అప్పటికేప్రాణాలు వదిలేసింది. ఆ చిన్నప్రాణికి ఎన్ని నీళ్లు కావాలి, ఆ గుక్కెడు నీళ్లు లేకనే కదాప్రాణం పోయిందని చాలా బాధేసింది. ఆ దృశ్యం పదే పదే కళ్ల ముందు మెదలసాగింది. ఇలాగ ఒక్కో వేసవికి ఎన్ని పక్షులుప్రాణాలు కోల్పోతున్నాయో కదా... అనిపించింది. ఏదైనా చేయాలనిపించింది. కానీ ఏం చేయాలనేది వెంటనే స్ఫురించ లేదు. పిచ్చుకలు వచ్చాయి! పక్షులకు నీటికోసం ఇంటిముందు చిన్న పాత్రలో నీటిని పెట్టడం మొదలు పెట్టాను. పావురాలు ఇతర పక్షుల కంటే పిచ్చుకలే ఎక్కువగా రాసాగాయి. దాంతో పర్మినెంట్ సొల్యూషన్ కోసం ఆలోచించిస్తున్నప్పుడు పిచ్చుకల సైజ్‌ని కూడా దృష్టిలో పెట్టుకుని ఫీడర్ బాక్స్ డిజైన్ చేశాను. ఇందుకోసం ఇంటర్నెట్లో చాలా సెర్చ్ చేశాను. మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసే ఫ్యాక్టరీ వాళ్లతో మాట్లాడి నాక్కావలసిన డిజైన్‌ను వివరించాను. వాళ్లు రఫ్ తయారు చేసి వాట్సాప్‌లో పంపించేవారు. ప్లాస్టిక్ డబ్బాకు కిటికీల్లాగ ఓపెన్‌గా ఉంచి చిన్న ప్లాస్టిక్ రాడ్‌ను పెట్టించాను. పక్షి ఆ రాడ్ మీద నిలబడి, తెరిచి ఉన్న కిటికీలో ముక్కు పెట్టి గింజలను తింటుంది. నీటి కోసం డబ్బా కింద సాసర్ పెట్టించాను. నాకు సంతృప్తి కలిగే వరకు డిజైన్‌ను మారుస్తూ చేసిచ్చారు వాళ్లు. ఐదేళ్ల కిందట ఇదే తొలి డిజైన్. మొదట వంద పీస్‌లు చేయించి బంధువులు, స్నేహితులకిచ్చాను. తర్వాత అందరూ అడుగుతుండడంతో పెద్ద మొత్తంలో చేయిస్తున్నాం. తాతయ్య పేరుతో ‘మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్ట్’ ద్వారా అందరికీ పంచుతున్నాం. ఒక మంచి పని చేయడం, అది కూడా మా తాతయ్య పేరుతో చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి రెండువేలకు పైగా ఇలాంటి డబ్బాలను పంచాను. ఇప్పుడు నేను యూఎస్‌లో పీజీ చేస్తున్నాను. నేను మొదలు పెట్టిన పనిని మా నాన్న కొనసాగిస్తున్నారు. మా చేతిమీదుగా ఈ బర్డ్ ఫీడర్ బాక్స్‌లు అటు ఆదిలాబాద్, నాందేడ్ వరకు, ఇటు హైదరాబాద్, సూర్యాపేట, గుంటూరుకు కూడా చేరాయి. ఈ బాక్స్ కావాలని ఎవరడిగినా వాళ్ల అడ్రస్ పంపిస్తే చాలు కొరియర్ చార్జ్‌లు కూడా మేమే భరించి ఉచితంగా పంపిస్తాం. వంద మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేయడం మేలని నమ్ముతాను. ఐదేళ్ల నుంచి ఈ పని చేస్తున్నప్పటికీ నేను ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. ఐ లవ్ స్పారోస్ అనేది ఈ ఏడాది వరల్డ్ స్పారో డే (మార్చి 20)సందర్భంగా ప్రపంచం ఇచ్చిన పిలుపు. కానీ నేను పిచ్చుకలను ప్రేమించడం ఎప్పుడో మొదలైంది. నేను అందరినీ కోరుకునేది ఒక్కటే. ఆ చిన్నప్రాణుల కోసం రోజూ ఓ లీటరు నీటిని పెడదాం’’ అన్నారు మంచాల హరిణి. చుక్క నీరుంటే చాలు! గుప్పెట్లో పట్టుకుంటే నిండా గుప్పెడంత కూడా ఉండదు. పిచ్చుకంతప్రాణం, రేడియేషన్ బారిన పడి అల్లాడిపోతోంది. అభివృద్ధి పేరుతో మనిషి చేసే అరాచకానికి భయపడిపోతోంది. మనిషి కంటపడకుండా పారిపోతోంది. ఏకంగా ఈ భూమ్మీద నుంచే మాయమైపోదామనుకుంటోంది. మనసున్న మనిషి కరవైన నేల మీద తనకు మనుగడ లేదని ఊరు వదిలి పారిపోయింది. అడవుల బాట పట్టి ఏ చెట్టుకొమ్మనో తనను తాను దాచుకుంటూ నీటిచుక్క కోసం వెతుక్కుంటోంది. మనిషి మనసులో ఆర్ద్రత, గుండెలో తడి ఉందని తెలిసిన పిచ్చుక మళ్లీ రెక్కలు టపటపలాడిస్తోంది. వందలాది బంధుగణంతో నిజామాబాద్‌లో మంచాల హరిణి ఇంటి ముందు కొలువుదీరింది. ఈ మాత్రం ఆలంబన దొరికితే చాలు... కిచకిచలతో ఊరంతటికీ వీనులవిందు చేస్తానంటోంది పిచ్చుక. – వాకా మంజులారెడ్డి -
హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలు.. ఒకరి ఆచూకీ లభ్యం
సాక్షి, రంగారెడ్డి: ఐదు రోజుల క్రితం మంచాల కేజీబీవీ హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు బాలికల్లో ఒకరి ఆచూకీ లభ్యమైందని మంచాల ఎస్సై రామన్‌గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐదు రోజుల క్రితం 9వ తరగతి చదువుతున్న సమ్రీన్(14), 8వ తరగతి చదువుతున్న నుస్రాత్(13) పారిపోయారు. ఇందులో నుస్రాత్‌ను మంగళవారం శంషాబాద్‌లోని వారి బంధువుల ఇంట్లో గుర్తించినట్లు వెల్లడించారు. సమ్రీన్ ఆచూకీ లభించలేదని నల్గొండలోని వారి బంధువులకు ఇంటికి వెళ్తున్నట్లు సమాచారం లభించిందన్నారు. చదవండి: ఫోన్ మాట్లాడుతుంటే మందలించారని.. వాష్‌రూంలోకి వెళ్లి.. -
పెళ్లయిన రెండు నెలలకే అనంతలోకాలకు..
మంచాల: బైక్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో నవ దంపతులు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని బోడకొండ గ్రామానికి చెందిన జాటోత్ లక్ష్మణ్ (28)కు అదే మండలం దాద్‌పల్లి తండాకు చెందిన శైలజ(21)తో జనవరి 9న వివాహం జరిగింది. గురువారం మహా శివరాత్రి సందర్భంగా గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారు. అనంతరం బంధువుల పిలుపు మేరకు యాదాద్రి జిల్లా, కడీలబాయి తండా సమీంలోని హజ్రత్ గాలిబ్ షాహిద్ పీర్ దర్గా ఉర్సుకు బయలుదేరారు. జాపాల సమీపంలోని పోచమ్మ ఆలయ ప్రాంతం వద్ద ఉన్న మలుపులో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటలో లక్ష్మణ్, శైలజ తలలకు తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హెల్మెట్ లేనందునే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దంపతుల తలకు హెల్మెట్ లేనందునే ప్రాణాలు కోల్పోయారని మంచాల ఎస్సై సురేష్ అన్నారు. వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. చదవండి: కారుతో ఢీకొట్టి.. ఆపై గొంతు కోసి టీచర్ హత్య దారుణం: భర్తను చంపేసి, ఇంట్లోనే పూడ్చిపెట్టిన భార్య -
బోడకొండలో 'లవ్‌స్టోరీ' సందడి
-
వైరలవుతున్న సాయి పల్లవి వీడియో
సాక్షి, రంగారెడ్డి : చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ దర్శకుడు శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ‘లవ్‌స్టోరీ’ సినిమా సన్నివేశాలు బోడకొండ వాటర్ పాల్స్ వద్ద శనివారం చిత్రీకరించారు. వాటర్ ఫాల్స్‌లో నాగ చైతన్య – సాయి పల్లవీ ఆడుతున్నట్లు సన్నివేశాలను, అలాగే గుట్టల్లో వారు బైక్‌పై విహరిస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ లవ్ స్టోరీ సినిమాలో ప్రాధానమైన ప్రేమకు సంబంధించి సన్నివేశాలు ఇక్కడే తీశారు. ఈ సినిమా షూటింగ్‌తో బోడకొండ– చెన్నారెడ్డి గూడ మధ్య ఉన్న గుట్టలు జనసందడిగా మారాయి. చుట్టు పక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. -
గిరికుల పాఠశాల
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఎల్లమ్మ తండా గిరిజన మహిళలు పాఠశాల స్థాయిలో కూడా చదువుకోనప్పటికీ ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సృజనాత్మక సహకారం అందిస్తున్నారు! వీరు డిజైన్ చేస్తున్న లంబాడీల సంప్రదాయ దుస్తులు, బ్యాగులు, సెల్‌ఫోన్ ప్యాకెట్లు, చీరలు, జాకెట్లు.. అందమైన కుట్లు, అల్లికలతో ఆకట్టుకుంటూ దేశ, దేశాలలో విక్రయం అవుతుండటం విశేషం. ఒక్కరితో మొదలై ఇరవై ఏళ్ల క్రితం (1998లో) అంగన్వాడీ కేంద్రం వద్ద ఆయాగా పని చేస్తుండేది కేతావత్ లక్ష్మి. ఖాళీ సమయంలో తమ గిరిజన సంప్రదాయ దుస్తులపై అందమైన ఎంబ్రాయిడరీ కుట్టు పనిని చేస్తూ ఉండేది. అంగన్ వాడీ తనిఖీ నిమిత్తం ఓ మాతాశిశు సంక్షేమ శాఖ అధికారి అక్కడికి వచ్చారు. లక్ష్మి చేస్తున్న అందమైన అల్లికలను పరిశీలించారు. అనంతరం ఆయన లక్ష్మితో మాట్లాడి ఆమె ప్రతిభ గురించి చేనేత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. చేనేత చేతివృత్తుల అధికారి సత్యవతి ఎల్లమ్మతండాకు వచ్చి, లక్ష్మి చేస్తున్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను చూసి ఈ పనిని మరికొంత మంది కలిసి చేస్తే తమ సంస్థ నుండి ప్రత్యేక తర్ఫీదు ఇస్తామని చెప్పారు. అలా 2000 సంవత్సరంలో పది మంది జట్టుగా ఏర్పడిన గిరిజన మహిళలు సంప్రదాయ కుట్లు, అల్లికలు నేర్చుకున్నారు. వారందరికీ కేతావత్ లక్ష్మి కో–ఆర్డి్డనేటర్గా వ్యవహరించింది. ఇప్పుడు ఆ తండాలో 200 మందికి పైగా గిరిజన మహిళలు సంప్రదాయ అల్లికలు, కుట్లు నేర్చుకుని పనులను చురుగ్గా చేస్తున్నారు. వందకు చేరువై ఏమాత్రం చదువురాని అంగన్వాడీ ఆయా లక్ష్మి ఎల్లమ్మ తండా మహిళలకే కాకుండా బోడకొండ, కొర్రంతండా, లోయపల్లి, అంభోత్ తండా గ్రామాల్లో దాదాపు వంద మంది మహిళలకు అల్లికలపై తర్ఫీదు ఇస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక భవన సదుపాయం కల్పించింది. వీరి నైపుణ్యం గురించి తెలుసుకున్న రాష్ట్ర గోల్కొండ చేనేత సంస్థ 75 మంది మహిళలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు అందిస్తోంది. ఇక్కడ తయారు చేసిన వస్తువులకు హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర నగరాలలోనూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, లక్ష్మి 2006లో ఇరాన్, 2012లో లండన్ దేశాలు వెళ్లి అక్కడ తమ బృందం తయారు చేసిన డిజైనింగ్ దుస్తులను విక్రయించింది. ఎల్లమ్మ తండా మహిళల హస్తకళా నైపుణ్యం నగరంలోని ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉన్నత విద్యార్థులను తండాకు రప్పించేలా చేసింది. హైదరాబాద్ నుంచి ప్రతియేటా ఐదారు బృందాలుగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చేసే విద్యార్థులు ఎల్లమ్మతండా మహిళల వద్ద డిజైనింగ్ మెళకువలు నేర్చుకోవడానికి వస్తున్నారు! నగరంలో వివిధ ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలల నుండి విద్యార్థులు తండాకు వచ్చి ఇక్కడి మహిళల సహకారం తీసుకోవడంతో ‘‘మా తండా వాసుల ఎంబ్రాయిడరీ కళ బయటి ప్రపంచానికి తెలియడం, ఆదరణ లభించడం మాకు ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంది’ అంటున్నారు తండా మహిళలు. భరోసాతో భేషుగ్గా తండాల మహిళలు చేస్తున్న అల్లికలు, చేతి కుట్ల గురించి తెలుసుకున్న గోల్కొండ చేనేత సంస్థ రాష్ట్ర డైరెక్టర్ శైలజా రామయ్యర్ గిరిజన మహిళలతో మాట్లాడి ఢిల్లీ నుండి దారాలు, అల్లికలకు సంబంధించిన మెటీరియల్‌ను అందించారు. 2017 సెప్టెంబర్ 17న కేంద్ర చేనేత (చేతివృత్తుల) శాఖ ముఖ్య కార్యదర్శి అనంతకుమార్ సింగ్ కూడా ఎల్లమ్మతండాకు వచ్చి గిరిజనుల చేతి అల్లికల గురించి తెలుసుకున్నారు. వారికి తగినన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్వయంగా తర్ఫీదు ఇక్కడి గిరిజన మహిళలు అల్లికలు, డిజైనింగ్ పై మాకు ప్రత్యేకంగా తర్పీదు ఇస్తున్నారు. తరగతి గదుల్లో, కంఫ్యూటర్లో విని, చూసి నేర్చుకుంటున్నప్పటికీ, ఈ తండా మహిళలు నేర్పే విద్య మాకెంతో ప్రయోజనకరంగా ఉంది. – అమ్రిత, ‘నిఫ్ట్’ విద్యార్థిని, హైటెక్ సిటీ మెళకువ నేర్చుకుంటున్నాం హైదరాబాద్ నుండి ఎల్లమ్మతండాకు వచ్చి అల్లికలు, డిజైనింగ్ దుస్తులపై ఎలా చేయాలో తెలుసుకుంటున్నాం. రంగు, రంగుల దారాల మార్పులు చేయడం వంటి మెళకువలు వీళ్లు మాకు నేర్పిస్తున్నారు. మాకు ఇష్టమైన డిజైన్‌లో దుస్తులను అందంగా రూపొందించి చూపుతున్నారు. – జాహీ, ఫైనల్ ఇయర్, ‘నిఫ్ట్’ ఇక్కడ ప్రాక్టికల్‌గా చూస్తున్నాం ఒక్కోసారి ప్రొఫెసర్లు చెప్పిన ఆర్ట్‌ఫామ్ అర్ధం కాకపోవచ్చు. ఎందుకంటే కొన్ని సంప్రదాయ కళలను నేరుగా చూస్తే వాటి మూలాలను కూడా మన డిజైన్‌లో పొందుపర్చవచ్చు. ఎల్లమ్మతండాలో మహిళల ద్వారా మేం ఆ కళను నేర్చుకుంటున్నాం. – శుభం చేరీషీయా, ‘నిఫ్ట్’ మరింత సహకారం అవసరం మా తండాలో ప్రతి ఇంటిలో మహిళలు దుస్తులపై అందమైన అల్లికలు చేయడంలో నిష్ణాతులు. ఎవరికి వారే సాటి. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మా కళకు మరింత ప్రోత్సాహం అందించాలి. తండాలో తయారు చేసిన దుస్తులు, వస్తువులకు ఇక్కడి నుండే మార్కెటింగ్ కల్పించి, బ్రాండ్‌గా గుర్తించాలి. దీని వల్ల తండా మహిళల ఉపాధి మెరుగుపడుతుంది. దీంతో మరింతమంది ఈ కళను అందుకోవడానికి ఉత్సాహం చూపుతారు. – కేతావత్ లక్ష్మి, ఎల్లమ్మతండా – యాట మహేష్, సాక్షి, మంచాల -
మంత్రి కాన్వాయ్‌పై బాధిత కుటుంబాల దాడి
సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో యువకులు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహాం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు మృతదేహాలతో మంచాల రహదారిపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు ఘటనాస్థలానికి వచ్చిన మంత్రి మహేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. మృతులు కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో మంత్రి బాధిత కుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు. ఇది చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. కాగా, చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఆటో డ్రైవర్ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు. -
ఐదేళ్ల చిన్నారిపై పెదనాన్న అత్యాచారం
మంచాల (రంగారెడ్డి) : ఐదేళ్ల బాలికపై పెదనాన్న నీచ కార్యానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్ఐ యాదగిరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటి శ్రీనివాస్(45) సోమవారం సాయంత్రం కూతురు వరుసయ్యే ఐదేళ్ల బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు మంగళవారం మంచాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కాగా, శ్రీనివాస్ ఇద్దరు భార్యలు గతంలో చనిపోయారని, ఆయన మద్యానికి బానిసయ్యాడని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'విద్యతోనే గిరిజనుల అభివృద్ధి'
మంచాల (రంగారెడ్డి) : విద్యతోనే గిరిజనులు అభివృద్ధి చెందుతారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రామచంద్రుడు అన్నారు. ఆయన శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలోని ఐపీఎఫ్ స్కూల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో పలు విషయాలు మాట్లాడారు. ఓ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్కూల్‌కు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వ అధికారులతో చర్చిస్తానని తెలిపారు. -
కాలుష్య నివారణ చర్యలేవి..?
మంచాల: ఫ్లొరైడ్ పీడిత ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగు నీరును అందించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సరఫరా చేస్తున్న కృష్ణా జలాలు అడుగడుగునా కలుషితమవుతున్నాయి. వీటిని తాగాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నాగార్జునసాగర్ నుండి వచ్చే కృష్ణా జలాలను గున్గల్ రిజర్వాయర్ నుండి ఈ ప్రాం తంలోని కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం మండలాలకు సంబంధించిన 134 గ్రామాలకు ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం 2007లో రూ.18కోట్లను ఖర్చు పెట్టింది. ప్రత్యేకంగా 12 ట్యాంకులు, సంఫులను నిర్మించింది. నీటి సరఫరాకు 60మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారు. వీరు ఈ కృష్ణా జలాలు ఎక్కడా లీకేజి ,వృధా, కలుషితం గాకుండా చర్యలు తీసుకోవాలి. కాని గ్రామాలకు ఎక్కడా స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందండం లేదు. లీకేజీల మయం... కృష్ణాజలాలు అనేకచోట్ల లీకేజీల రూపంలో వృధా కావడమే కాక తాగడానికి పనికిరాని విధంగా కలుషితమవుతున్నాయి. ప్రధానంగా గున్గల్నుండి లోయపల్లివరకు పైపు లైన్ పరిధిలో ఎల్లమ్మతండ-రంగాపూర్ , గున్గల్-గడ్డమల్లాయ్యగూడెం , ఆగాపల్లి- నోముల, నోముల- లింగంపల్లి మధ్య,..అలాగే జాపాల-బండలేమూర్ పైపు లైన్ పరిధిలో జాపాల ప్రభుత్వ పాఠశాల , ఆరుట్ల సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ,.. మంచాల -తిప్పాయి గూడ పైపులైన్ పరిధిలో చిత్తాపూర్ వద్ద తరుచూ గేట్ వాల్వ్‌లు లీకేజీలు అయి నీరు నేలపాలవుతున్నాయి. నాగార్జున సాగర్- హైదారాబాద్ రహదారిపై ఏకంగా ప్రయాణికులు ఈ నీటితోనే స్నానాలు చేస్తున్నారు. ఆగాపల్లి-గురునానక్ కళాశాల మధ్య పారెస్టు సమీపంలో రెండు,మూడు చోట్ల గేట్ వాల్వ్‌ల వద్ద కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమవుతున్నాయి. ఒక చోట గేదెలు, గొర్రెలు,మేకలు వంటి జంతువులను గేట్ వాల్వ్ నుండే నీరు తాగిస్తున్నారు.మరో చోట ప్రయాణికులు గేట్‌వాల్వ్ వద్ద నీటిని లీక్ చేసి అందులో నుండే నీళ్లు తోడుకొని స్నానాలు చేస్తున్నారు. దుస్తులు ఉతుక్కుంటున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, కృష్ణా నీటి సరఫరా విభాగం సిబ్బంది కనీస పర్యవేక్షణ కూడా ఉండడంలేదు. ఇదే విషయంపై ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ విజయలక్ష్మిని వివరణ కోరగా గ్రామాల్లో గేట్ వాల్వ్‌లు ఎక్కడెక్కడ లీకేజీ అవుతున్నాయో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
పహాణీలకు పరేషన్..!
మంచాల: ప్రభుత్వం పంట రుణాలు ఇస్తుండడంతో మండల రెవెన్యూ కార్యాలయం, బ్యాంకులు రైతన్నలతో కిటకిటలాడుతున్నాయి. గత రెండు,మూడు వారాలుగా రెవెన్యూ శాఖ అధికారులు గ్రామాల్లో కుటుంబ సమగ్ర సర్వే తదితర పనులల్లో ఉండడంతో పహాణీలు ఇవ్వలేకపోతున్నారు. తహసీల్దార్ కార్యాలయమే అధికారులు రాక బోసిపోయింది. ఇంక బోడకొండ,లింగంపల్లి వంటి కొన్ని గ్రామాల్లో సర్వే పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పహాణీల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సర్వే పూర్తయిన రెవెన్యూ కార్యదర్శులు తహసీల్దార్ కార్యాలయంలో ఆయా గ్రామాలకు సం బంధించిన పహాణీలు రాసి ఇస్తున్నారు. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడాన్నికి రైతులు పెద్ద సంఖ్యలో పహా ణీల కోసం వస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం సోమవారం రైతులతో కిటకిట లాడింది. రెవెన్యూ కార్యదర్శులకు తీరిక లేకుండా పోయింది. అదే విధంగా బ్యాంకుల్లోకి కూడా రైతులు అధిక సంఖ్యలో రావడంతో బ్యాంకు అధికారులకు తీవ్ర ఇబ్బందిగా మా రింది. దీంతో బ్యాంకు అధికారులు రుణాలు తీసుకోవడానికి వస్తున్న రైతులకు వరుసక్రమంలో దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో రాకుండా రోజుకు పరిమితి సంఖ్యలో మాత్రమే దరఖాస్తు ఫారాలు ఇచ్చి ఇబ్బందులు కలుగకుండా జాగ్రతలు తీసుకుంటున్నారు. తప్పని తిప్పలు.. బ్యాంకు రుణాలు తీసుకోవడానికి రెవెన్యూ కార్యాలయం వచ్చే రైతులకు ఇబ్బందులు తప్పడం లేవు. రైతులు పట్టాలో ఉండి రికార్డుల్లో ఉన్నా కూడా కంఫ్యూటర్ పహణీలో మాత్రం రావడం లేదు. మరికొంత మంది పట్టాల్లో ఉండి ఆ భూమిని సాగు చేస్తున్నా రికార్డుల్లో మాత్రం పేర్లు రావడం లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కంప్యూటర్ పహాణీలో కొంత మంది ఖాతా నంబర్లు సక్రమంగా రావడం లేదు. గ్రామాల్లో పూర్తి స్థాయిలో రెవె న్యూ రికార్డులు కంప్యూటరీకరణ కాలే దు. ఇలా అనేక సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెవెన్యూ అధికారులు అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా సక్రమంగా పనులు చేయించి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
'చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటాం'
హైదరాబాద్: బోరుబావిలో పడ్డ చిన్నారి కుటుంబాన్ని ఆదుకుంటామని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరో కొద్ది సేపట్లో చిన్నారి మృతదేహాన్ని వెలికితీస్తామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. చిన్నారి పడిన బోరుబావి స్థల యజమానిపై కేసు నమోదు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాల్టా చట్టాన్ని అమలు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు. -
బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి
-
బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతి
రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజ మృతిచెందినట్లు అధికారులు నిర్ధారించారు. బావిలో 45 అడుగుల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించినట్లు రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి చెప్పారు. దాదాపు మరో గంట సమయంలో మృతదేహాన్ని వెలికి తీస్తామని ఆయన తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ''బోరుకు సమాంతరంగా మేం ఒక సొరంగం తవ్వేందుకు ఏర్పాట్లు చేశాం. 41 అడుగుల దగ్గర రాయి వచ్చింది. దాన్ని పగలగొట్టాం. అందుకే ఆలస్యమైంది. పాప ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా 41 అడుగుల స్థాయిలోనే పాపను గుర్తించాం. ఖమ్మానికి చెందిన సింధూర ఎలక్ట్రానిక్స్ వాళ్లు అందించిన కెమెరాను ఉపయోగించాం. పాప మృతదేహం 45 అడుగుల లోతులో ఉంది. 41 అడుగుల ప్రాంతంలో ఉన్న సొరంగం ద్వారా కెమెరా పంపించి, మరోసారి నిర్ధారించుకుని పాపను పుల్ చేయాలి. అందుకు కావల్సిన హుక్‌లు తెప్పించాం. అయితే, అక్కడ పనిచేసేందుకు సరిపోయేంతగా ప్రదేశం లేదు. అక్కడ సొరంగం తవ్వడం కూడా చాలా కష్టం అవుతోంది. అందుకే ఎక్కువ సమయం పడుతోంది. బహుశా ఒక గంట సమయంలో పాప మృతదేహాన్ని బయటకు తీస్తామని భావిస్తున్నాం'' అని ఆయన తెలిపారు. -
ఇంకా బోరుబావిలోనే గిరిజ
మంచాల : రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి గిరిజను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రిస్క్యూ ఆపరేషన్‌కు బండరాళ్లు అడ్డంకిగా మారుతున్నాయి. మంచాల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల గిరిజ ఆదివారం ఉదయం బోరు బావిలో పడిన విషయం తెలిసిందే. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ టీంలు నిర్విరామంగా పనిచేస్తున్నా మంగళవారం ఉదయం వరకూ కూడా బాలికను కనుగొనలేకపోయారు. 45 అడుగుల లోతులో చిన్నారి ఉందని భావిస్తున్న అధికారులు బోరుబావికి సమాంతరంగా జేసీబీల సాయంతో తవ్వకం చేపట్టారు. బోరుబావిలోకి ఆక్సిజన్ పంపిస్తున్నారు. మరోవైపు చిన్నారి కోసం ఆమె తల్లిదండ్రులు, బంధువులు విలపిస్తున్నారు. గిరిజ క్షేమంగా బయటకు రావలని ప్రార్థనలు చేస్తున్నారు. -
బోరు బావిలోనే బాలిక
-
బోరు బావిలోనే బాలిక
* రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న అధికారులు మంచాల: బోరుబావిలో పడిన చిన్నారిని బయటకు తీసేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి గిరిజ ఆదివారం ఉదయం బోరు బావిలో పడిన విషయం తెలిసిందే. అదే రోజు 11.30కు ప్రారంభమైన రిస్క్యూ ఆపరేషన్ సోమవారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది. ఎన్డీ ఆర్ఎఫ్, సింగరేణి మైన్స్ టీంలు నిర్విరామంగా పనిచేస్తున్నా బాలికను కనుగొనలేకపోయారు. 45 అడుగుల లోతులో చిన్నారి ఉందని భావిస్తున్న అధికారులు దాని పక్కనే జేసీబీల సాయంతో తవ్వకం చేపట్టారు. 42 అడుగుల వద్ద ఓ పెద్ద బండరాయిని గుర్తించిన అధికారులు దాన్ని తొలగించేందుకు చాలా సేపు శ్రమించాల్సి వచ్చింది. ఆ తర్వాత 48 అడుగుల వద్ద మరో బండరాయి రావడంతో తవ్వకం పనులు మరింత ఆలస్యమయ్యాయి. 50 అడుగుల వరకు తవ్వకం పూర్తయిన తర్వాత బోరు వైపు రంధ్రం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో చీకటి పడడంతో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎన్. శ్రీధర్, జేసీ ఎంవీ.రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహాయక పనులను పర్యవేక్షిస్తున్నారు. -
బోరుబావి ఘటన: 27 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
హైదరాబాద్: బోరుబావిలో పడిన బాలిక కోసం ఇబ్రహీంపట్నంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతునే ఉంది. గత 27 గంటలుగా రెస్క్యూ కొనసాగుతున్న ఆపరేషన్ నిర్వహిస్తున్న తవ్వకాల్లో బండరాయి ఒకటి బయటపడింది. బండరాయిని తొలగించే పనిలో సిబ్బంది ఉన్నారు. బండరాయిని తొలగించడానికి మరో మూడు గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ రెస్య్యూ ఆపరేషన్ లో ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి సిబ్బంది పాల్గొంటున్నారు. గిరిజ అనే అమ్మాయి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడింది. -
గిరిజ కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు
మంచాల : బోరుబావిలో పడిపోయిన చిన్నారి గిరిజను రక్షించేందకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆడుకుంటూ ఆదివారం ప్రమదవశాత్తూ చిన్నారి బోరుబావిలో పడిపోయిన విషయం తెలిసిందే. దాంతో రంగంలోకి దిగిన అధికార బృందాలు నుంచి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటివరకూ గిరిజ జాడ తెలియలేదు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పరికరాలతో డ్రిల్లింగ్ చేస్తున్నారు. అయితే సహాయక చర్యలకు బండరాళ్లు అడ్డుపడుతున్నాయి. ఇప్పటివరకూ నలభై అడుగుల మేర తవ్వకాలు జరిపారు. మరోవైపు బోరులో 40 అడుగుల వద్ద నీరు ఉన్నట్లు గుర్తించారు. -
బోరు బావిలో చిన్నారి
* రంగారెడ్డి జిల్లా మంచాలలో ఘటన * కొనసాగుతున్న సహాయక చర్యలు సాక్షి, రంగారెడ్డి జిల్లా: పొలం గట్టుపైన కేరింతలు కొడుతున్న చిన్నారి ఒక్కసారిగా పెను ప్రమాదంలో చిక్కుకుంది. అన్నయ్యతో కలసి ఆడుకుంటున్న ఆ పసిపాప అకస్మాత్తుగా ఆపద అంచున పడిపోయింది. బోరుబావి రూపంలో వచ్చిన విపత్తు చిన్నారిని లాగేసుకుంది. లోతుగా ఉన్న ఆ బావిలో చిన్నారి జాడ తెలియకపోవడంతో రంగంలోకి దిగిన అధికార బృందాలు సహాయక చర్యలు వేగిరం చేశాయి. రంగారెడ్డి జిల్లా మంచాలలో ఆదివారం ఉదయం 10.30కు చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం మండలం ఎం.పి.పటేల్‌గూడకు చెందిన గడుసు ఐలయ్య, సరితలకు చరణ్(6), గిరిజ(4) ఇద్దరు పిల్లలున్నారు. ఏడాదిన్నర క్రితం కుటుంబ కలహాలతో సరిత ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లలు మంచాల మండల కేంద్రంలోని అమ్మమ్మ ఇంటివద్దే ఉంటున్నారు. స్థానిక వివేకానంద పాఠశాలలో ఈ పిల్లలు చదువుతున్నారు. సెలవు కావడంతో ఆదివారం ఉదయం అమ్మమ్మ, తాత (మల్గ ఐలమ్మ, నాగయ్య)లతో కలసి పొలానికి వెళ్లారు. అమ్మమ్మ, తాతలు పత్తి తీసే పనిలో బిజీ కావడంతో వారు గట్టు పక్కన ఆడుకుంటున్నారు. ఇంతలో అటుగా ఉన్న మూతలేని బోరుబావివైపు వెళ్లిన గిరిజ అందులో పడిపోయింది. దీంతో గిరిజ సోదరుడు చరణ్ విషయాన్ని అమ్మమ్మ, తాతలకు వివరించడంతో హుటాహుటిన కూలీలతో కలసి వారు బోరుబావి వద్దకు చేరుకున్నారు. కానీ జాడ తెలియకపోవడంతో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. 320 అడుగుల లోతైన బోరుబావి మల్గ నాగయ్య సోదరుడు బాషయ్య వ్యవసాయ పనుల కోసం బోరు వేయించాడు. 320 అడుగుల లోతువరకు బోరు వేసినా నీరు పడక ఆ బోరును వదిలేశారు. రక్షణగా ముళ్ల కంచె వేయగా వారం క్రితం టమాటా నారు వేసేందుకు దుక్కి దున్నే క్రమంలో దాన్ని తొలగించారు. తర్వాత కంచె వేయడం మరిచిపోవడంతో ఆదివారం ఉదయం అటుగా వచ్చిన గిరిజ అందులో పడిపోయింది. నాలుగు బుల్డోజర్లు, రెండు పొక్లెయిన్లతో.. విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావికి సమాంతరంగా రెండుమీటర్ల దూరంలో తవ్వకాలు చేపట్టారు. ఇందుకోసం 4 బుల్డోజర్లను తెప్పించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు. పది ఫీట్లలోతు తర్వాత బుల్డోజర్లతో తవ్వకం కష్టం కావడంతో అధికారులు అదనంగా మరో రెండు పొక్లెయిన్లను తెప్పించి తవ్వకాన్ని ముమ్మరం చేశారు. సాయంత్రం వరకు సహాయక చర్యలు కొనసాగినా గిరిజ జాడ తెలియలేదు. దీంతో రాత్రివేళ కూడా సహాయక చర్యలను కొనసాగించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి బోరుబావిలో బాలిక చిక్కుకున్న వార్త తెలియడంతో మంత్రి మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే యం.కిషన్‌రెడ్డి, కలెక్టర్ ఎన్.శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. గిరిజ ప్రాణాలతోనే తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘ఉపాధి’ డబ్బు ఏమైంది..?
మంచాలః మంచాల మండలంలో ఉపాధిహామీ పథకం పనితీరు కంచె చేను మేసిన చందంగా తయారైంది. కూలీల కు అందాల్సిన డబ్బు మాయం కావడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకటి,రెండు కాదు...లక్షలాది రూపాయలు నేటికీ కూలీలకు అందక వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. మంచాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద 983 శ్రమ శక్తి సంఘాలు ఉన్నాయి. 20,778 మంది కూలీలు వీటిలో నమోదై ఉన్నారు. ఇందులో లోయపల్లిలో 1200 మంది కూలీలు ఉన్నారు. వారందరూ ఈ పథకం కింద పని చేశారు. పనిచేసి ఏడాదైనా కూలి డబ్బులు ఇవ్వడం లేదు. అధికారులు సైతం కూలీలకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. లోయపల్లిలోనే ఈ ఏడాది ఆగస్టు 14వరకు కోటి 19లక్షల35వేల268 రూపాయలు పని జరిగింది.వాటిలో 55శాతం మాత్రమే కూలి డబ్బులు వచ్చాయి. మిగిలిన 45శాతం కూలీలకు కూలి డబ్బులు రాలేదు. వస్తాయోరావో కూడా తెలియక కూలీ లు అల్లాడుతున్నారు. ఇదిలా ఉండగా లోయపల్లిలోనే 2013 జూన్ వరకు కూలీలకు రూ.26,07,243ల కూలి డ బ్బులు రావాల్సి ఉంది. అంతలోనే గ్రామ పంచాయితీ ఎన్నికలు వచ్చాయి. దీంతో కూలీల డబ్బును సంబంధితాధికారులు వాపసు తీసుకెళ్లారు. గ్రామా ల్లో ఎక్కడా సక్రమంగా తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ కూలీల డబ్బులు పంపిణీ వ్యవహారం యాక్సిస్ బ్యాంకు నుండి మణిపాల్ బ్యాంకుకు మారింది. ఈ క్రమంలోనే కూలీలకు ఇవ్వాల్సిన డబ్బులు మాయమయ్యాయి. ఉపాధిహామీ అధికారులు, సిబ్బంది అందినకాడికి చేజి క్కించుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఆ గ్రామస్తులు ఈ డబ్బుల వ్యవహారం లో యాక్సిస్ బ్యాంకు వారిని నిలదీ యగా తాము ఇచ్చామని 26 పే ఆర్డర్ల తో పాటు ఎఫ్టీఓ నంబర్లు కూడా ఇచ్చారు. కానీ వాటికి సంబంధించిన డ బ్బులు కూలీలకు అందలేదు. కూలీలు నేటికీ కూలి డబ్బుల కోసం మండల కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కొక్క ఇంటిలో కూలీలకు ఎనిమిది నుండి పది వేల రూపాయల వరకు కూలి డబ్బులు రావాల్సి ఉంది. అనేక సార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. చివరకు ప్లేస్ల్విప్పుల జిరాక్స్ తీసి అధికారులకు అందజేశారు. డబ్బు మాయంపై విచారణ జరిపించి కూలీ లకు రావాల్సిన కూలిని తక్షణం చెల్లిం చాలని ఆ గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఏపీఓ వీరాంజనేయులును వివరణ కోరగా రూ. 10లక్షల వ రకు కూలీలకు కూలి డబ్బు రావాల్సి ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈనెల 25న గ్రామానికి వెళ్లి పూర్తి స్థా యిలో విచారణ చేసి అందరికీ డబ్బు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
జోరుగా సారా తయారీ
మంచాల: గ్రామీణ ప్రాంతాల్లో నాటు సారా తయారీ జోరుగా సాగుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారుల దాడులు మొక్కుబడిగా మారడంతో సారా విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా మంచాల మండలం నాటు సారా తయారీ, విక్రయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాకుండా మండలం సరిహద్దులోని నారాయణపూరం, యాచారం, మర్రిగూడెం మండలాల్లో అధిక సంఖ్యలో ఉన్న గిరిజన తండాల్లో నాటుసారా ఏరులై పారుతోంది. మండలంలోని పటేల్ చెర్వు తండా, బుగ్గ తండా, ఎల్లమ్మ తండా, ఆంబోత్ తండా, సత్తితండా, సల్లిగుట్ట తండా, దాద్‌పల్లి తండా, వెంకటేశ్వర తండా, నారాయణపూరం మండలంలోని రాచ కొండ తండా, కడీలబావి తండా, దుబ ్బగడ్డ తండాల నుంచి సారాను మండలంతోపాటు ఇబ్రహీంపట్నం, నగరంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఉదయం, రాత్రి వేళ్లల్లో ఆర్టీసీ బస్సుల్లోనే ఈ సారాను తరలిస్తుండటం గమనార్హం. సమీప ప్రాంతాల్లోకి మాత్రం స్కూటర్లు, బైక్‌ల ద్వారా సారా రవాణా కొనసాగుతోంది. ఆరుట్లలో ముడిసరుకులు సారా తయారీకి వినియోగించే ముడిసరుకులకు ఆరుట్ల అడ్డాగా మారింది. ఇక్కడ కొందరు వ్యాపారులు సారా తయారీకి కావాల్సిన ముడి సరుకులను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాత్రి సమయంలో లారీల్లో పెద్ద మొత్తంలో ఒకేసారి నల్ల బెల్లం, పట్టిక వంటి సరుకులను తీసుకొచ్చి ఈ గ్రామంలో నిల్వచేస్తున్నారు. ఇక్కడినుంచి ఆయా గ్రామాల వ్యాపారులు లేదా సారా తయారీదారులు ముడిసరుకులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. గతంలో పలుమార్లు ఆరుట్లలో అధికారులు దాడులు చేసి సరుకులతోపాటు వాహనాలను కూడా సీజ్ చేశారు. ఆ తర్వాత కొంతకాలంపాటు స్తబ్దుగా ఉన్న వ్యాపారులు మళ్లీ తమ వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. ప్రాణాలు కబళిస్తున్న సారా మహమ్మారి పచ్చని పల్లెల్లో సారా మహమ్మారి చిచ్చుపెడుతోంది. సారా తాగడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీన్ని పక్కనబెడితే అనేకమంది సారాకు బానిసలుగా మారి ప్రాణాలను తీసుకుంటున్నారు. కేవలం ఆరుట్ల గ్రామంలోనే సారా మహమ్మారి బారినపడి 25 మంది మృతిచెందారు. వీరిలో కొందరు సారా తాగి చనిపోగా మరికొందరు సారా ప్రభావంతో అస్వస్థతకు గురై మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. జాపాల కూడా మూడేళ్ల వ్యవధిలో పదిమందిని సారా పొట్టనపెట్టుకుంది. మండలంలో ఈస్థాయిలో సారా తయారీ కొనసాగుతున్న అధికారులు మిన్నకుండటంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు నిద్రపోయారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఎక్సైజ్ శాఖ సీఐ తుక్యా నాయక్‌ను మాట్లాడుతూ.. సారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దాడులు మరిం త ముమ్మరం చేసి సారా తయారీని అడ్డుకుంటామన్నారు. -
ప్రభుత్వ మందులు పారేశారు
మంచాల: ప్రజారోగ్యానికి పంపిణీ చేయాలని ప్రభుత్వం మందులను సమకూరిస్తే వాటిని అటవీప్రాంతంలో పారేసిన వైనం వెలుగులోకొచ్చింది. వివరాల్లోకెళితే జూలై 28 నుండి ఆగస్టు 8 వరకు మండలంలోని పాఠశాలల్లో ఆరోగ్యం-పరిశుభ్రత వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈక్రమంలో విద్యార్థులకు బలాన్నిచ్చే ఫోలిక్ఆసిడ్ మందు బిళ్లలను ఇవ్వాలి. డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి ఇంటికి పంచాలి. కాని గ్రామాల్లో ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదు. అయితే ప్రజలకు పంచాల్సిన ఈ మందులు బుధవారం జాపాల్-రంగాపూర్ అటవీ ప్రాంతంలోని చెట్లపొదల్లో పెద్దమొత్తంలో ప్రత్యక్షమయ్యాయి. అవి ఒక్కచోటే కాకుండా అక్కడకక్కడ విసిరేసినట్లుగా కనిపించాయి. ఇవి ప్రభుత్వం మాత్రమే సరఫరా చేసే మందులు కావడంతో వైద్యారోగ్య సిబ్బ ంది పారేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్య క్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వెళితే మందు లు లేవని, బయట తీసుకోవాలని చిట్టీలు రాస్తున్నారు. ఇక్కడ చూస్తే విలువైన మందులు అటవీపాలయ్యా యి. ఘటనపై ఆరుట్ల ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ కిరణ్‌ను వివరణ కోరగా.. సదరు మందులను గ్రామా ల్లో ప్రజలకు పంచాలని ఏఎన్ఎంలు, ఆశవర్కర్లకు ఇచ్చామని, ఘటనపై విచారణ జరుపుతామని చెప్పారు. -
ఫోర్జరీ సంతకాలతో భూవిక్రయం
మంచాల: ఫోర్జరీ పత్రాలు సృష్టించి 10 ఎకరాల భూమిని విక్రయించిన నిందితులు కటకటాలపాలయ్యారు. మరికొందరు పరారీలో ఉన్నారు. మంచాల సీఐ జగదీశ్వర్ గురువారం సాయంత్రం స్థానిక ఠాణాలో కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని ఆగాపల్లి గ్రామంలోని 182,183 సర్వే నంబర్లలోని 10 ఎకరాల భూమిని గతంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన లింగాల నాగభూషణ్‌కొనుగోలు చేశాడు. ఆయనకు తెలియకుండా 2012లో ఫోర్జరీ పత్రాలు సృష్టించి ఈ భూమిని కొందరు ఇతరులకు రూ. కోటి రెండు లక్షలకు విక్రయించారు. ఈవిషయం తెలుసుకున్న నాగభూషణ్ గత జూన్ 4న మంచాల పోలీసులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. ఈ ‘అక్రమ’ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన రాయపోల్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డితో పాటు ఆగాపల్లి గ్రామస్తులు పందుగుల సత్తయ్య, పందుగుల యాదయ్య, పందుగుల వీరస్వామి, పందుగుల శ్రీకాంత్‌గౌడ్, దూసరి నాగభూషణ్‌గౌడ్, నాగన్‌పల్లి గ్రామానికి చెందిన శివకుమార్‌గౌడ్, గున్‌గల్‌కు చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు యాదయ్యతో పాటు మరో పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ముత్యంరెడ్డితో పాటు మరో ఏడు మందిని రిమాండుకు తరలించినట్లు సీఐ తెలిపారు. మిగ తా వారు పరారీలో ఉన్నారని, వారినీ త్వరలో అరెస్టు చేస్తామని సీఐ తెలిపారు. కాగా ఈ ‘అక్రమ’ వ్యవహారంలో పలువురు నాయకలు, అధికారుల హస్తం ఉందని సమాచారం. -
‘మంచాల’కు మంచికాలం!
మంచాల: పర్యాటక అభివృద్ధిలో భాగంగా మంచాల మండలానికి మహర్దశ పట్టనుంది. కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి తలపెట్టిన ప్రణాళికలో మంచాల మండలానికి చోటుదక్కింది. అంతేకాకుండా మెగా సర్క్యూట్లో భాగం గా మండల సరిహద్దు ప్రాంతాలైన రాచకొండ కోటతోపాటు గాలిషాహీద్ దర్గా, నారాయణపురం, అల్లపురం గ్రామాల్లోని దేవాలయాలు, ఆరుట్ల దేవాలయంతోపాటు వ్యాలీ ఆఫ్ బంజారా సర్క్యూట్ కింద శివన్నగూడెం రాక్ ఫార్మేషన్స్లను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపద్ యశోనాయక్ ఈ నెల 22న లోక్‌సభలో లిఖిత పూర్వకంగా పేర్కొన్నారు. దీంతో రాచకొండ కోటను చారిత్రాత్మక కట్టడంగా గుర్తించడంతోపాటు దీని సమీపంలోని గాడిపీర్లవాగు సమీపంలోని గాలిషాహీద్ దర్గాను కూడా అభివృద్ధి చేయనున్నారు. అల్లాపూర్ సమీపంలోని సరళ మైసమ్మ దేవాలయం, ఆరుట్లలోని శ్రీ బుగ్గరామ లింగేశ్వరస్వామి దేవాలయం, నారాయణపురం మండలంలోని రాచకొండగుట్టల సరిహద్దులోని పలు దేవాలయాలు కూడా అభివృద్ధి చెందనున్నాయి. భూముల కొనుగోలుపై నజర్ మంచాల మండలానికి తూర్పు భాగంలో అటు రాచకొండకోట, నల్గొండ జిల్లా నారాయణపురం మండలం, ఇటు శివన్నగూడెం ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ముందుకు వస్తోంది. దీంతో ద్వీపకల్పంగా మారిన మంచాల మండల పరి సర భూములపై పారిశ్రామికవేత్తలు దృష్టి సారించారు. సర్కారు సైతం పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు ఇక్కడి ప్రభుత్వ భూములను గుర్తించారు. నారాయణపు రం మండలంలోని రాచకొండకోట పరిస ర ప్రాంతంలోని సర్వే నంబర్ 273లో దాదాపు 8 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ఇవి అటు నాగారం నుంచి మొదలుకొని అల్లాపురం, నారాయణపురం, జనగామ, పల్లెగుట్ట తండా, కడీలబావి తండా గ్రామాల పరిసర ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇందులో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. మంచాల రెవెన్యూ పరిధిలోని ఆరుట్ల సమీపంలో 587 సర్వే నంబర్ నుంచి 619 సర్వే నంబర్లలో నాలుగు వందల ఎకరాల పట్టా భూములను బెంగళూరు- తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ఓ కంపెనీ కొనుగోలు చేసింది. ఈ భూము లు ముచ్చర్లకుంట గ్రామం నుంచి బండలేమూర్, వాయిలపల్లి, జనగామ, లోయపల్లి శివారు ప్రాంతాలను అనుసరించి ఉన్నాయి. ఇదే కంపెనీ మంచాల మండలాన్ని అనుసరించి ఉన్న నల్గొండ జిల్లా ఖుదాభక్షుపల్లి, లచ్చమ్మగూడెం, చిల్లాపురం పరిసర ప్రాంతాల్లో మరో వెయ్యి ఎకరాలు కొనుగోలు చేశారు. రాచకొండగుట్టలకు మంచి రోజులు రావడంతో మంచాల మండలం, నారాయణపురం, మర్రిగూడ మండలాలు అభివృద్ధికి నోచుకోనున్నాయి. కాగా ఇప్పటికే రియల్టర్లు, వివిధ కంపెనీల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా భూముల కొనుగొలుపై దృష్టి సారించినట్లు సమాచారం. -
ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అవకతవకలు
మంచాల, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకేమోగానీ కొంతమంది అధికారులు, నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్నారు. మండల పరిధిలోని దాద్పల్లికి దాద్పల్లితండా, వెంకటేశ్వర తండా అనుబంధ గ్రామాలుగా ఉన్నాయి. ఇక్కడ అధిక సంఖ్యలో గిరిజనులు ఉన్నారు. వీరిలో నిరక్ష్యరాస్యత, అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పంచాయతీ పరిధిలో ఇందిరా ఆవాస్ యోజన (ఐఏవై) పథకం కింద 1998 నుంచి 2006 వరకు 150 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 2008 నుంచి 2013 వరకు 330 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని కొంతమంది నాయకులు స్థాని కుల నుంచి ఫొటోలు, బ్యాంకు ఖాతానంబర్లు తీసుకున్నారు. అధికారులు, సదరు నా యకులు కుమ్మక్కై ఇళ్లు కట్టకున్నా కట్టినట్లు రికార్డుల్లోకి ఎక్కించారు. లబ్ధిదారులకు తెలి యకుండా బిల్లులు కాజేశారు. లబ్ధిదారుల సంతకాలు ఫోర్జరీ చేసి లక్షల్లో స్వాహా చేశా రు. కొంతమంది అనర్హులకు, ప్రభుత్వ ఉ ద్యోగులకు కూడా ఇళ్లు మంజూరు అయ్యేలా చూశారు. తరువాత విషయం తెలిసిన లబ్ధిదారులు అవాక్కయ్యారు. మా సంతకాలు లేకుండా మా ఖాతాలో నుంచి డబ్బులు ఎలా ఇచ్చారని బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాం కు, మండల కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. విచారణ చేపడతామని అధికారులు హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ‘పరిహారం’లోనూ అంతే... పంట నష్ట పరిహారం విషయంలోనూ ఇలాగే జరిగింది. ప్రభుత్వం 2011-2012లో పంట నష్టపోయిన 503 మంది రైతులకు పరిహారం కింద రూ.3లక్షల 60 వేలు మంజూరు చేసింది. ఇందులో 40 నుంచి 50 మందికి మాత్రమే పరిహారం అందింది. బాధితులకు తెలియకుండానే ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని వారి ఖాతాల నుంచి ఇతరుల ఖాతాలకు మళ్లించారు. గుట్టచప్పుడు కాకుండా కాజేశారు. గత నవంబర్‌లో పంటనష్ట పరిహారంపై వ్యవసాయాధికారులు విచారణ చేపట్టారు. వంద మంది ఖాతాలను విచారించగా వాటిలో 70 ఖాతాలు నకిలీవని, 30 ఖాతాలు మాత్రమే వాస్తవమని తేలింది. పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండానే అధికారులు ఈ తంతును తూతూమంత్రంగా ముగించారు. రుణాల్లోనూ అదే తంతు.. మరోవైపు గ్రామంలో నకిలీ పాసు పుస్తకాలు సృష్టించి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో పెద్దఎత్తున అవకతవకలు జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి
మంచాల, న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మంచాల శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచాల గ్రామానికి చెందిన ఏర్పుల శంకర్(45), ఆయన బంధువు ఇబ్రహీంపట్నం మండలం ముక్కునూరు గ్రామానికి చెందిన మల్లేశ్(27) శుక్రవారం సాయంత్రం మంచాల నుంచి బయటకు వెళ్లారు. రాత్రి 9:30 గంటల సమయంలో మంచాల-జాపాల రహదారిలో వారు తీవ్రగాయాలతో మృతిచెంది ఉన్నారు. వాహనదారుల సమాచారంతో మంచాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మామ,అల్లుడు దుర్మరణం చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో శంకర్, మల్లేశ్ మృతిచెందారని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది. -
తిప్పాయిగూడలో కేరళ అధికారుల పర్యటన
మంచాల, న్యూస్‌లైన్: మండలంలోని తిప్పాయిగూడలో చేపట్టిన ఉపాధి హామీ పనులను శనివారం కేరళ ఐఏఎస్ అధికారుల బృందం పరిశీలించింది. పండ్ల తోటలు, పశుగ్రాసం, పొలం గట్లపై టేకు మొక్కల పెంపకం, వాటి ఉపయోగాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అంతర్ పంటలను సాగు చేయడం వల్ల రైతులకు రెండు రకాలుగా లాభాలు కలుగుతాయని ఏపీడీ వెంకటేశ్వర్లు, టీఏ తిరుపతాచారి వారికి వివరించారు. ఉపాధి హామీ పనుల వివరాలను కంప్యూటర్లలో ఎలా నమోదు చేస్తారు. రికార్డుల నమోదు వంటి పక్రియ గురించి అధికారుల బృందం తెలుసుకున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను తమ రాష్ట్రం లోనూ అమలు చేసేందుకు కృషి చే స్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో కేరళ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. కౌశి కన్, ఈజీఎస్ మిషన్ జా యింట్ డెరైక్టర్లు ఎ.జయ కుమార్, జ యంత్, ఈజీఎస్ కమిషనర్ విజయ్, సా ంకేతిక అధికారి వి.అజిత్, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి, ఏపీడీ వెంకటేశ్వర్లు, టీఏ తిరుపతాచారి పాల్గొన్నారు. ‘ఉపాధి’ కార్యాలయం సందర్శన యాచారం: కేరళకు చెందిన ఉన్నతస్థాయి అధికారుల బృందం శనివారం స్థానిక ఈజీఎస్ కార్యాలయాన్ని సందర్శించింది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈజీఎస్ మిషన్ డెరైక్టర్ కౌషికన్, జాయింట్ డెరైక్టర్ జయకుమార్తో పాటు పలువురు అధికారులు యాచారంలోని ఈజీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులతో కూలీలు, రైతులు లబ్ధిపొందుతున్న తీరు, పనుల నమోదు, బిల్లుల చెల్లింపు తదితర విషయాలను డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. కూలీలకు సంబంధించి వివరాలను కంప్యూటర్లో నమోదు చేసే పద్ధతిని వారు అధ్యయనం చేశారు. జాబ్‌కార్డుల నమోదు, పథకం వల్ల లబ్ధిపొందిన రైతుల వివరాలు తెలుసుకున్నారు. -
అర్హులందరికీ ‘బంగారు తల్లి’
మంచాల, న్యూస్‌లైన్ : ఆడపిల్లల పట్ల వివక్ష, భ్రూణ హత్యలు, విక్రయాలు నిరోధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులందరికీ ఈ పథకాన్ని అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రాష్ట్ర సమాచార, సాంకేతిక శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ దివ్యదేవరాజన్ పేర్కొన్నారు. గురువారం బంగారు తల్లి పథకం ఆన్లైన్ విధానంపై మంచాల మండల కేంద్రంలో ఇందిర క్రాంతి పథం, వైద్య, అంగన్వాడీ శాఖల సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి దివ్యదేవరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తల్లి పథకాన్ని సమర్ధవంతంగా అమలుచేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టిందని, పైలట్ ప్రాజెక్టుగా మొదటగా రాష్ట్రంలో మంచాల మండలాన్ని ఎంచుకుందని చెప్పారు. ఈ కార్యక్రమం కింద గ్రామ సమాఖ్య ప్రతినిధుల(వీఓ)కు, ఏఎన్ఎంలకు ట్యాబ్లెట్ పీసీలు ఇవ్వనున్నట్టు తెలి పారు. ఆయా గ్రామాల్లో బంగారు తల్లి పథకానికి అర్హులైన వారితో పాటు గర్భిణులు, శిశువుల వివరాలను ఈ పీసీ ట్యాబ్లెట్లలో నమోదు చేసి, ఆన్లైన్లో పొందుపర్చి ఉన్నతాధికారులకు చేరవేయాల్సి ఉంటుందన్నారు. గర్భిణులకు ఇమ్యూనైజేషన్, వైద్య సేవల విషయాలను కూడా వీటిలో పొందుపర్చాలన్నా రు. ఇలా ప్రసవం జరిగేంతవరకు వివరాలను సేకరించి, పుట్టిన పసిపాపల వివరాలను కూడా ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భం గా 40మంది వీఓలకు, 9మంది ఏఎన్ఎంలకు ట్యాబ్లెట్ పీసీలను దివ్యదేవరాజన్ అందజేశారు. పైన తెలిపిన వివరాలను అన్లైన్లో పొందుపర్చి ఉన్నతాధికారులకు అందించాలన్నారు. శుక్రవారం కూడా శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ట్యాబ్లెట్ పీసీలో వివరాల నమోదు, ఆన్లైన్ విధానం గురించి సెర్ప్ ఐటీ డెరైక్టర్ జాకబ్ అవగాహన కల్పించారు. బంగారు తల్లి పథకం సం చాలకులు రామశాస్త్రి, సాంకేతిక సంచాలకులు సురేష్‌కుమార్, ఏరియా కో ఆర్డినేటర్ నర్సింహ, డీఆర్డీఏ ఏపీడీ ఉమాదేవి, ఎంపీడీఓ నాగమణి, తహసీల్దార్ వెంకటే శ్వర్లు, డీపీఎంలు సురేఖ, గిరిజ, కళ్యాణి, మంచాల పీహెచ్సీ వై ద్యురాలు విజయలత, ఏపీఎం సత్యనారాయణ, మండల సమాఖ్య అధ్యక్షురాలు మంజుల, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యావంతుడి విషాదాంతం
మంచాల, న్యూస్‌లైన్: ‘చదువుకున్నోడు, శాస్త్రవేత్త కావాల్సిన నా బిడ్డ శవమై వచ్చాడు..అయ్యో మాకేంటి ఈ గతి?’ అంటూ వెంకటేష్ తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. వారిని ఓదార్చడం బంధువుల తరంకాలేదు. ఆదివారం నగరంలోని సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి వెంకటేష్ బలవన్మరణంతో స్వగ్రామం మంచాల మండలం లింగంపల్లి శోకసంద్రమైంది. గ్రామానికి చెందిన మాదారి అంజయ్య, వెంకటమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అంజయ్య రిటైర్డ్ ఏఎస్ఐ. వెంకటమ్మ గృహిణి. వీరి రెండో కుమారుడు వెంకటేష్(25) చురుకైన విద్యార్థి. ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో చిన్నప్పటి నుంచే అహర్నిషలు శ్రమించేవాడు. నగరంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మీడియట్, డిగ్రీ పూర్తి చేశాడు. ఎంబీబీఎస్‌కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని కొద్ది మార్కుల తేడాతో డాక్టర్ చదవలేకపోయాడు. దీంతో ఆయన జేఎన్టీయూలో పీజీ చదివాడు. అనంతరం సెంట్రల్ యూనివర్సిటీలో బయో కెమెస్ట్రీలో పీహెచ్‌డీలో చేరి ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్నాడు. తరచూ తనను గైడ్ రవి వేధిస్తున్నాడని వెంకటేష్ కుటుంబీకులతో చెబుతుండేవాడు. కాగా గ్రామంలో ఆదివారం రాత్రి వెంకటేష్ అంత్యక్రియలు నిర్వహించారు. శోకసంద్రమైన లింగంపల్లి.. వెంకటేష్ మృతితో కుటుంబీకులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఉన్నత లక్ష్యానికి చేరుకుంటాడనుకున్న వెంకటేష్ బలవన్మరణానికి పాల్పడడం గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆదివారం ఉదయం తనకు జేఎల్(జూనియర్ లెక్చరర్) పరీక్ష ఉందని, సెంటర్ వరకు తీసుకెళ్తానని చెప్పిన తమ్ముడు వెంకటేష్ అంతలోనే విగత జీవి అయ్యాడని అక్క రాణి గుండెలుబాదుకుంది. వెంకటేష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
మంచాలలో అర్ధరాత్రి ఉద్రిక్తత
మంచాల, న్యూస్‌లైన్ : మంచాల మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఓ యువకుడిని అరెస్టు చేయబోగా అతడు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులే తమ కుమారుడిని చంపేందుకు యత్నించారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. గత జూన్ నెలలో మంచాల మండల కేంద్రానికి చెందిన ప్రైవేట్ లెక్చరర్ ఓరిగంటి నాగరాజ్‌గౌడ్(29) అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో యువతి తల్లిదండ్రులు ఆయనపై కేసు పెట్టారు. ఈక్రమంలో నాగరాజుగౌడ్‌ను శుక్రవారం రాత్రి 11 గంటల తర్వాత అరెస్టు చేసేందుకు ఆయన ఇంటికి ఎస్సై రవికుమార్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో వెళ్లారు. ఆ సమయంలో నాగరాజుగౌడ్‌తో పా టు ఇంట్లో తల్లి భారతమ్మ, తండ్రి ఉన్నారు. నాగరాజ్‌గౌడ్‌ను పోలీసులు అరెస్టు చేసే యత్నంలో తీవ్ర పెనుగులాట జరిగింది. నాగరాజ్‌గౌడ్ గుర్తుతెలియని గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు పెద్దఎత్తున కేకలు వేశారు. స్థానికులు గుమిగూడి పోలీసులను అడ్డుకొని ఓ గదిలోకి తోసి నిర్బంధించారు. సమాచారం అందుకున్న మంచాల సీఐ తివారి ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను సముదాయించి పోలీసులను విడిపించారు. నాగరాజ్‌గౌడ్‌ను చికిత్స నిమిత్తం ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలక డగా ఉంది. కాగా పోలీసులే తమ కుమారుడికి గుళికలు మింగించి చంపేందుకు యత్నించారని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా నాగరాజ్‌గౌడే అరెస్టును తప్పించుకునేందుకు గుళి కలు మింగాడని, దీనిలో తమ ప్రమేయం లేదని ఎస్ఐ రవికుమార్ చెప్పారు.