అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి | Two killed in suspicious circumstances | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి

Published Fri, Jan 10 2014 11:51 PM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

Two killed in suspicious circumstances

మంచాల, న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మంచాల  శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచాల గ్రామానికి చెందిన ఏర్పుల శంకర్(45), ఆయన బంధువు ఇబ్రహీంపట్నం మండలం ముక్కునూరు గ్రామానికి చెందిన మల్లేశ్(27) శుక్రవారం సాయంత్రం మంచాల నుంచి బయటకు వెళ్లారు. రాత్రి 9:30 గంటల సమయంలో మంచాల-జాపాల రహదారిలో వారు తీవ్రగాయాలతో మృతిచెంది ఉన్నారు. వాహనదారుల సమాచారంతో మంచాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మామ,అల్లుడు దుర్మరణం చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో శంకర్, మల్లేశ్ మృతిచెందారని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement