హైదరాబాద్: బోరుబావిలో పడిన బాలిక కోసం ఇబ్రహీంపట్నంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతునే ఉంది. గత 27 గంటలుగా రెస్క్యూ కొనసాగుతున్న ఆపరేషన్ నిర్వహిస్తున్న తవ్వకాల్లో బండరాయి ఒకటి బయటపడింది.
బండరాయిని తొలగించే పనిలో సిబ్బంది ఉన్నారు. బండరాయిని తొలగించడానికి మరో మూడు గంటలు పట్టే అవకాశం ఉంది. ఈ రెస్య్యూ ఆపరేషన్ లో ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి సిబ్బంది పాల్గొంటున్నారు.
గిరిజ అనే అమ్మాయి ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ బోరుబావిలోకి పడిపోయింది. ఈ దుర్ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంచాల వ్యవసాయ క్షేత్రంలో నాలుగేళ్ల చిన్నారి బోరు బావిలో పడింది.
బోరుబావి ఘటన: 27 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్
Published Mon, Oct 13 2014 3:49 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement