భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లాలో బోరు బావిలో పడిన 8 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం సాయత్రం 5 గంటలకు మండవి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు తన్మయ్ దియావర్ సాహూ అనే బాలుడు. ప్రస్తుతం 55 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుకు సమాంతరంగా గుంతను తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
‘బోరు బావిలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 33 అడుగల మేర లోతుకు గుంత తవ్వటం పూర్తయింది. 45 అడుగుల వరకు చేరుకోవాలి. ఆ తర్వాత బోరులోకి సొరంగం చేస్తారు. బండ రాళ్లు ఉన్నందుకు సమయం పడుతోంది. బాలుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. బహుశా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండవచ్చు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామేంద్ర జైశ్వాల్. రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్‌డీఆర్‌ఎఫ్), హోమ్ గార్డ్స్, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: హిమాచల్‌లో హోరాహోరీ.. ‘ఆపరేషన్ లోటస్’ గుబులు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు!
Comments
Please login to add a commentAdd a comment