Betul
-
38 గంటలుగా బోరు బావిలోనే బాలుడు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లాలో బోరు బావిలో పడిన 8 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం సాయత్రం 5 గంటలకు మండవి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు తన్మయ్ దియావర్ సాహూ అనే బాలుడు. ప్రస్తుతం 55 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుకు సమాంతరంగా గుంతను తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బోరు బావిలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 33 అడుగల మేర లోతుకు గుంత తవ్వటం పూర్తయింది. 45 అడుగుల వరకు చేరుకోవాలి. ఆ తర్వాత బోరులోకి సొరంగం చేస్తారు. బండ రాళ్లు ఉన్నందుకు సమయం పడుతోంది. బాలుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. బహుశా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండవచ్చు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామేంద్ర జైశ్వాల్. రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్), హోమ్ గార్డ్స్, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో హోరాహోరీ.. ‘ఆపరేషన్ లోటస్’ గుబులు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు! -
బోరు బావిలో 8 ఏళ్ల బాలుడు.. 15 గంటలుగా మృత్యువుతో పోరాటం
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి ఓ ఎనిమిదేళ్ల బాలుడు 400 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో మంగళవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మండవి గ్రామంలోని ఓ పొలంలో ఇటీవలే బోరు బావి తవ్వారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్న తన్మయ్ దియావర్(8) అనే బాలుడు ఆ బోరులో పడిపోయాడని ఆత్నేర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అనిల్ సోనీ తెలిపారు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. బోరు బావి చుట్టూ తవ్వేందుకు ప్రొక్లెయిన్ వంటి వాహనాలు చేరుకున్నాయని చెప్పారు. బోరు బావిలోని బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. Madhya Pradesh | Operation still underway to rescue the boy who fell into a 55-ft deep borewell in Mandavi village in Betul district yesterday. pic.twitter.com/si8PzNagy9 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 7, 2022 ఇదీ చదవండి: లఖీంపూర్ కేసులో 13 మందిపై అభియోగాలు -
Road Accident: బస్సును ఢీకొట్టిన ఎస్యూవీ.. 11 మంది దుర్మరణం
బెతుల్: మితిమీరిన వేగంతో వెళ్తున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ (ఎస్యూవీ) ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ఘటనలో ఎస్‌యూవీలోని మొత్తం 11 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్‌లోని బేతూల్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘోరం చోటుచేసుకుంది. బాధితులంతా కూలీలే. మహారాష్ట్రలోని అమరావతి నుంచి సొంతూరుకు వెళ్తూ మృత్యువాత పడ్డారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమన్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఎస్యూవీ నుజ్జవడంతో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్లను వాడాల్సి వచ్చింది. దీనిపై ప్రధాని మోదీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. -
దారుణం: దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురికి..
భోపాల్: పరువు కోసం కన్న కూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోతున్నారు కొంత మంది తండ్రులు. ఇతర కులం వాడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని కన్న కూతురును, లేదా ఆమె కట్టుకున్నవాడిని హతమారుస్తున్నారు. అయితే తాజాగా ఓ తండ్రి మాత్రం కూతురు తన కులం కానివాడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్(24) హాస్టల్లో ఉంటూ నర్సింగ్ చదువుతుంది. అదే కాలేజీలో తనతో పాటు చదివే అమిత్ అహిర్వాల్తో తనకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారటంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొని పట్నంలో కాపురం పెట్టారు. కాగా ఈ ఏడాది జనవరిలో సాక్షీ యాదవ్ ఇంట్లో తను వివాహం చేసుకున్న విషయం చెప్పడంతో తన తండ్రి ఒప్పుకోక పోగా కోపంతో రగిలిపోయాడు. ఆ యువతిని వేధింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడగా యువతి తండ్రి వివాహానికి ఒప్పుకుంటున్నట్లు నమ్మబలికాడు. అయితే ఇదేక్రమంలో ఇటీవల సాక్షీ యాదవ్‌ను తన హాస్టల్ నుంచి తీసుకొచ్చి వేధించసాగాడు. దళితుడిని పెళ్లి చేసుకుందని కూతురని కూడా చూడకుండా గుండు కొట్టించి, పుణ్య స్నానం చేయించాడు. ఇక తండ్రి వేధింపులు తట్టుకోలేని సాక్షీ యాదవ్ ఇంట్లో నుంచి పారిపోయి భర్తను చేరుకుంది. శుక్రవారం ఆ మహిళ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సిమల ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. 2020 మార్చిలో తాను దళిత వ్యక్తిని వివాహం చేసుకున్నానని, జనవరి 4, 2021న తన నాన్నకు తెలియజేశానని తెలిపింది. అయితే తన తండ్రి 2021 జనవరిలో తాను కనిపించడంలేదని మిస్సింగ్ కంప్లైంట్‌ను దాఖలుచేశారని తెలిపింది. తనకు తండ్రికి నుంచి ప్రాణహాని ఉందని ఆ యువతి పోలీసులకు తెలిపింది. అంతే కాక తన భర్తకు విడాకులు ఇవ్వాలని, తమ కులం వ్యక్తితో మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధిత యువతి తమకు రక్షణ కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. -
అన్నతో కలిసి బైక్‌పై వెళ్తుండగా దారుణం!
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి (18)పై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బేతుల్ జిల్లాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తన అన్నతో కలిసి యువతి బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బైక్‌పై సొంత గ్రామానికి తిరిగి వెళ్తోంది. నిందితులు వారిని అడ్డుకుని.. యువతి సోదరునిపై దాడి చేసి బావిలో నెట్టేశారు. యువతిని చెరబట్టి అఘాయిత్యానికి పూనుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. (చదవండి: కరోనా ఉనికిని అంగీకరించాల్సిందే!) వారిపై కేసు నమోదు చేసుకుని.. ఐదురుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ రాజేంద్ర ధ్రువే చెప్పారు. ఇక కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం.. రోడ్లన్నీ నిర్మానుషంగా మారడంతో అత్యవసర ప్రయాణాలు చేసేవారికి రక్షణ కరువైంది. కాగా, మధ్యప్రదేశ్‌లోని దామోలో ఏప్రిల్ 22న కూడా ఓ ఆరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. అత్యాచారం చేయటమే కాకుండా బతికుండగానే కళ్లు పీకి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు క్రూరుడు. (చదవండి: దారుణం: బ్రతికుండగానే కళ్లు పీకి..) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1331278836.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ కుటుంబం వల్ల ఊరికి ప్రత్యేక గుర్తింపు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం బేతుల్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 25 మందికి కాళ్లకు, చేతులకు దాదాపు 10కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయి. ఈ అరుదైన జన్యు క్రమరాహిత్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికి.. ఆ గ్రామానికి మాత్రం ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. కుటుంబ సభ్యులందరికీ పాలిడాక్టిలీ అనే జన్యులోపం ఉందని.. ఫలితంగా ప్రతీ ఒక్కరికీ 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయన్నారు. ఈ అరుదైన సమస్య వల్ల చదువు పూర్తి చేయలేకపోవడమే కాక.. మంచి ఉద్యోగాన్ని కూడా పొందలేకపోతున్నామని సదరు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుడైన బల్దేవ్ యావలే మాట్లాడుతూ.. ‘మా కుటుంబంలో దాదాపు 25 మంది సభ్యులున్నారు. అందరికి కాళ్లకు, చేతులకు 10 కంటే ఎక్కువ వేళ్లు ఉన్నాయి. దీని వల్ల మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. స్కూల్లో ఇతర పిల్లలు మా పిల్లలను ఎగతాళి చేస్తున్నారు. కాళ్లకు 10కంటే ఎక్కువ వేళ్లు ఉండటంతో.. సరైన చెప్పులు, షూలు దొరకడం లేదు. ఫలితంగా మాకు సరైన ఉద్యోగం లభించడం లేదు. మేం చాలా పేదవాళ్లం. మాకు భూమి కూడా లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి’ అని కోరాడు. యావలే కుమారుడు సంతోష్ మాట్లాడుతూ.. ‘నాకు చేతులకు 12, కాళ్లకు 14 మొత్తం 26 వేళ్లు ఉన్నాయి. దీనివల్ల నాకు ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. గ్రామ పంచాయతీ నుంచి కూడా నాకు ఎలాంటి సాయం లభించడం లేదు. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలని’ విజ్ఞప్తి చేశాడు. -
కాంగ్రెస్ నాయకులపై మూకదాడి!
భోపాల్ : మూకహత్యలు, జై శ్రీరాం నినాదాల పేరిట హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళన వెల్లువెత్తుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకులపై మూకదాడి కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులను కిడ్నాపర్లుగా భావించిన నవలాసిన్హా గ్రామస్తులు వారి కారు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. బేతుల్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... తమ గ్రామంలోని చిన్న పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా దిగిందని నవలాసిన్హా గ్రామంలో వదంతులు వ్యాపించాయి. ఈ క్రమంలో తమ గ్రామంలోకి వాహనాలు ప్రవేశించకుండా చెట్లు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడేశారు. అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బేతుల్ జిల్లా నాయకులు ధర్మేంద్ర శుక్లా, ధర్ము సింగ్, లలిత్ బరాస్కర్ కారులో అక్కడికి చేరుకున్నారు. వీరిని కిడ్నాపర్లుగా పొరబడ్డ గ్రామస్తులు.. కారు నుంచి వారిని బయటికి లాగి దాడి చేశారు. అనంతరం కారును కూడా ధ్వంసం చేశారు. ఈ క్రమంలో వీరిని బందిపోట్లుగా భావించిన కాంగ్రెస్ నాయకులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో చర్చించి శాంతింపజేశారు. అనంతరం కాంగ్రెస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. -
ఎక్కువ తిన్నాడని బట్టలు విప్పించి..
సాక్షి, భోపాల్: దాబాలో పనిచేసే వర్కర్‌పై యజమాని అమానుషంగా ప్రవర్తించాడు. దాబా యజమాని, అతడి పార్టనర్ ఆ పనివాడి బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బేతుల్ జిల్లా కేంద్రంలోని స్థానిక దాబాలో ఓ వ్యక్తి పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఆ పనివాడు తాను పనిచేస్తున్న దాబాలో ఆహారం ఎక్కువగా తీసుకున్నాడు. ఇది గమనించిన యజమాని, అతడి వ్యాపార భాగస్వామి వర్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవేశానికి లోనైన ఈ నిందితులు వర్కర్‌ను దుర్భాషలాడారు. అంతటితో ఆగకుండా బలవంతంగా అతడితో బట్టలు విప్పించారు. నగ్నంగా నిలబడి క్షమాపణ చెబుతున్నా బాధితుడి మాట వినకుండా అతడిని దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బేతుల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
హెచ్ఐవీ ఉందని.. భార్యాపిల్లల్ని చంపేశాడు
తనను కబళించిన ఎయిడ్స్.. కుటుంబ సభ్యులకు కూడా సోకిందని.. విషయం నలుగురికీ తెలిస్తే పరువుపోతుందని భావించి భార్యాపిల్లల్ని సజీవదహనం చేశాడో ఐఐటీ గ్రాడ్యుయేట్. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవాలనుకొని ఆస్పత్రి పాలయ్యాడు. అయితే చివరికి వైద్యుల పరీక్షల్లో అతనికి హెచ్ఐవీ లేదని తేలింది! ప్రస్తుతం చికిత్స పొందుతున్న అతను.. తాను చేసింది ఘోర తప్పిదమని విలపిస్తూ అసలేం జరిగిందో చెప్పాడు.. 'నా పేరు ప్రవీణ్ మన్వర్. ఐఐటీ గ్రాడ్యూయేట్ను. మధ్యప్రదేశ్‌లోని బెతుల్ సిటీలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం. నా భార్యపేరు శిల్ప. ఇద్దరు పిల్లలు.. శర్వాణి (9), ప్రణీతి (2) . ఆనందంగా సాగుతోన్న మా జీవితంలో అల్లకల్లోలం చెలరేగడానికి కారణం గతంలో నేను చేసిన ఓ భారీ పొరపాటు..! ఉద్యోగ నిమిత్తం అప్పుడప్పుడూ ఢిల్లీ టూర్‌కు పోయేవాణ్ణి. అలా అక్కడి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లడం అలవాటైంది. ఎంత వద్దనుకున్నా ఆ అలవాటును మానుకోలేకపోయా. రెండు నెలల కిందట నా నోటిలో చిన్న పుండైంది. రోజులు గడిచేలోగా అది పెద్ద కురుపుగా మారింది. సడన్‌గా బరువు కోల్పోయాను కూడా. గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఈ లక్షణాలన్నీ హెచ్ఐవీ పాజిటివ్వేనని అర్థమైంది. రహస్యంగా ఓ ప్రైవేటు డయాగ్నస్టిక్స్ సెంటర్‌కు వెళ్లి రక్తపరీక్ష చేయించుకున్నా. రిజల్ట్స్ 'పాజిటివ్' అని తేలింది. షాక్‌కు గురైన నేను చాలా రోజులపాటు నాలో నేనే కుమిలిపోతూ ఆత్మహత్యకు ప్రయత్నించా. కానీ వీలుకాలేదు. మరోవైపు తన అనుమానం నిజం కావద్దని భగవంతుడికి చేసిన ప్రార్థనలు ఫలించలేదు. భయపడిందే జరిగింది.. ఓ రోజు నా భార్యా పిల్లలు అనారోగ్యం పాలయ్యారు. వాళ్లకు కూడా హెచ్ఐవీ పాజిటివ్ లక్షణాలే కనిపించాయి. దీంతో ధైర్యం చేసి నా భార్య శిల్పకు విషయం మొత్తం చెప్పా. మొదట ఏడ్చి, గగ్గోలు పెట్టిన ఆమె.. రెండో రోజుకు నన్ను ఓదార్చింది. 'చస్తే అందరం కలిసే చద్దాం' అంది. నొప్పిలేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఎలాగో గూగుల్‌లో సెర్చ్ చేశాం. వివరాలు దొరకలేదు. ఫిబ్రవరి 28న పిల్లల్ని వెంటబెట్టుకొని అమరావతి వెళ్లాం. అక్కడే అందరం ఉరి వేసుకొని చావాలనేది మా పథకం. అయితే పసి పిల్లలకు ఉరివేయడానికి మా ఇద్దరి చేతులూ ముందుకు రాలేదు. దాంతో ఆ ప్లాన్ ను తాత్కాలికంగా విరమించుకున్నా ఆత్మహత్యా ప్రయత్నాల్ని మాత్రం ఆపలేదు. మార్చి 4న అమరావతి నుంచి మా సొంతూరు బెతుల్ కు బయలుదేరాం. కారులో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించా. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తూ కావాలనే ఓ చెట్టును ఢీకొట్టా. పిల్లలు, శిల్పా, నేను సృహతప్పి పడిపోయాం. కొద్ది నిమిషాలకు నాకు మెలకువొచ్చింది. పగిలిన కిటికీ అద్దంలోంచి బయటికొచ్చిన నేను.. అగ్గి పుల్ల వెలిగించి కారును తగలబెట్టాను. అప్పుడే కళ్లు తెరిచిన పిల్లలు 'అమ్మా.. మంటలు..' అంటూ ఆర్తనాదాలు చేయడం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ వాళ్లను కాపాడే ప్రయత్నం చేయలేదు. కాసేపట్లో నేనూ చనిపోవాలనుకున్నా.. కానీ ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని నన్ను ఆస్పత్రికి చేర్చారు. బయటికి వెళ్లిన తర్వాతైనా నేను చావాల్సిన వాడినే. కచ్చితంగా చనిపోతా' అంటూ తన గాథను వివరించాడు ప్రవీణ్ మన్వర్. అయితే గురువారం వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ప్రవీణ్ కు ఎయిడ్స్ లేదని తేలింది. ఈ విషయం చెప్పినప్పుడు అతని ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదని పోలీసులు చెప్పారు. ప్రవీణ్‌పై హత్యకేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఓ 'తప్పిదం' మూడు నిండు అమాయక ప్రాణాలు బలికావటం విషాదకరం. -
బండి కోసం భార్యను అమ్మేసిన ఘనుడు
మోటర్ సైకిల్ నడిపించడం అంటే అతనికి ఎంత షోకంటే ఏకంగా భార్యనే అమ్మేశాడు. అలా వచ్చిన డబ్బుతో హాయిగా బైక్ కొనుక్కుని షికార్లు చేస్తున్నాడు ఆ ప్రబుద్ధుడు. మధ్యప్రదేశ్ లోని బేతుల్ జిల్లాలోని ఆమ్లా లో రామూ అనే ఒక వ్యక్తి తన భార్య రాధను యాభై వేలకు అమ్మేసి, బండి కొనుక్కున్నాడు. ఈ సంఘటన ఏడాది కింద జరిగినా ఇప్పటి వరకూ బయటకు రాలేదు. రాధతాలూకు బంధువులు రామూ ఇంటికి వచ్చి చూస్తే కానీ ఆమె లేదన్న విషయంవారికి తెలియలేదు. దాంతో ఆమె కోసం వెతుకులాట మొదలైంది. అప్పుడు రాము జరిగిందేమిటో చెప్పాడు. దాంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఈ మధ్య కాలంలో ఆమెను ఒకరి నుంచి ఇంకొకరు, ఆ తరువాత మరొకరు కొనుక్కున్నారు. ఇలా మూడు నాలుగు చేతులు మారాక ఒక మంచి వాడి చేతిలో పడి రాధకు మళ్లీ పెళ్లైపోయిన విషయం కూడా తెలిసింది. మన రామూ మాత్రం బండిలో తిరుగుతున్నాడు. ఆ బండి వెనక సీటులో కూర్చునే వారు మాత్రం ఎవరూ లేరు. -
రోడ్డుపై దిగిన విమానం
బెతుల్: గాలిలో ఎగరాల్సిన విమానం అకస్మాత్తుగా నడిరోడ్డుపై దిగింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్‌లో మంగళవారం ఉదయం జరిగింది. దీంతో రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపేశారు. శామ్ వర్మ అనే ఎన్నారైకి చెందిన చిన్నపాటి విమానం గాలిలో ఎగురుతుండగా బలమైన గాలులు వీచాయి. వాతావరణం సరిగాలేకపోవడంతో పైలట్ నాలుగు లేన్ల రహదారిపై అత్యవసరంగా దింపేశారు. అందులో ఆయన ఒక్కరే ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలే దు. విమానం సురక్షితంగా దిగేందుకు పోలీసులు రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలిపేయడంతో పెద్ద ముప్పు తప్పింది. పైలట్ ముందుగా సప్నా డ్యామ్ వద్ద దిగేం దుకు అనుమతికోరగా భద్రతా కారణాలరీత్యా అనుమతించలేదు. ఈ ఘట నపై డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ చేపట్టింది.