భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి (18)పై ఏడుగురు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బేతుల్ జిల్లాలోని కొత్వాలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. తన అన్నతో కలిసి యువతి బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బైక్‌పై సొంత గ్రామానికి తిరిగి వెళ్తోంది. నిందితులు వారిని అడ్డుకుని.. యువతి సోదరునిపై దాడి చేసి బావిలో నెట్టేశారు. యువతిని చెరబట్టి అఘాయిత్యానికి పూనుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
(చదవండి: కరోనా ఉనికిని అంగీకరించాల్సిందే!)
వారిపై కేసు నమోదు చేసుకుని.. ఐదురుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ రాజేంద్ర ధ్రువే చెప్పారు. ఇక కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవడం.. రోడ్లన్నీ నిర్మానుషంగా మారడంతో అత్యవసర ప్రయాణాలు చేసేవారికి రక్షణ కరువైంది. కాగా, మధ్యప్రదేశ్‌లోని దామోలో ఏప్రిల్ 22న కూడా ఓ ఆరేళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. అత్యాచారం చేయటమే కాకుండా బతికుండగానే కళ్లు పీకి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు క్రూరుడు.
(చదవండి: దారుణం: బ్రతికుండగానే కళ్లు పీకి..)
అన్నను బావిలో తోసేసి.. చెల్లెలిపై అఘాయిత్యం
Published Fri, May 1 2020 8:24 AM | Last Updated on Fri, May 1 2020 2:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment