దారుణం: దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురికి.. | Father Harassment to his daughter for love marrying dalit man in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

దారుణం: దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురికి..

Published Mon, Nov 1 2021 1:25 AM | Last Updated on Mon, Nov 1 2021 1:38 AM

Father Harassment to his daughter for love marrying dalit man in Madhya Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

భోపాల్: పరువు కోసం కన్న కూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోతున్నారు కొంత మంది తండ్రులు. ఇతర కులం వాడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని కన్న కూతురును, లేదా ఆమె కట్టుకున్నవాడిని హతమారుస్తున్నారు. అయితే తాజాగా ఓ తండ్రి మాత్రం కూతురు తన కులం కానివాడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్(24) హాస్టల్లో ఉంటూ నర్సింగ్ చదువుతుంది. అదే కాలేజీలో తనతో పాటు చదివే అమిత్ అహిర్వాల్‌తో తనకు పరిచయం ఏర్పడింది.

అది కాస్తా ప్రేమగా మారటంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొని పట్నంలో కాపురం పెట్టారు. కాగా ఈ ఏడాది జనవరిలో సాక్షీ యాదవ్ ఇంట్లో తను వివాహం చేసుకున్న విషయం చెప్పడంతో తన తండ్రి ఒప్పుకోక పోగా కోపంతో రగిలిపోయాడు. ఆ యువతిని వేధింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడగా యువతి తండ్రి వివాహానికి ఒప్పుకుంటున్నట్లు నమ్మబలికాడు. అయితే ఇదేక్రమంలో ఇటీవల సాక్షీ యాదవ్‌ను తన హాస్టల్ నుంచి తీసుకొచ్చి వేధించసాగాడు. దళితుడిని పెళ్లి చేసుకుందని కూతురని కూడా చూడకుండా గుండు కొట్టించి, పుణ్య స్నానం చేయించాడు. ఇక తండ్రి వేధింపులు తట్టుకోలేని సాక్షీ యాదవ్ ఇంట్లో నుంచి పారిపోయి భర్తను చేరుకుంది. 

శుక్రవారం ఆ మహిళ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సిమల ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. 2020 మార్చిలో తాను దళిత వ్యక్తిని వివాహం చేసుకున్నానని, జనవరి 4, 2021న తన నాన్నకు తెలియజేశానని తెలిపింది. అయితే తన తండ్రి 2021 జనవరిలో తాను కనిపించడంలేదని మిస్సింగ్‌ కంప్లైంట్‌ను దాఖలుచేశారని తెలిపింది. తనకు తండ్రికి నుంచి ప్రాణహాని ఉందని ఆ యువతి పోలీసులకు తెలిపింది. అంతే కాక తన భర్తకు విడాకులు ఇవ్వాలని, తమ కులం వ్యక్తితో మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధిత యువతి తమకు రక్షణ కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement