lower caste
-
దారుణం: దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుందని కూతురికి..
భోపాల్: పరువు కోసం కన్న కూతురని కూడా చూడకుండా విచక్షణ కోల్పోతున్నారు కొంత మంది తండ్రులు. ఇతర కులం వాడిని పెళ్లి చేసుకుని పరువు తీసిందని కన్న కూతురును, లేదా ఆమె కట్టుకున్నవాడిని హతమారుస్తున్నారు. అయితే తాజాగా ఓ తండ్రి మాత్రం కూతురు తన కులం కానివాడ్ని పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురికి గుండు కొట్టించి, పుణ్యస్నానం చేయించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చోప్నాకు చెందిన సాక్షీ యాదవ్(24) హాస్టల్లో ఉంటూ నర్సింగ్ చదువుతుంది. అదే కాలేజీలో తనతో పాటు చదివే అమిత్ అహిర్వాల్తో తనకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారటంతో ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొని పట్నంలో కాపురం పెట్టారు. కాగా ఈ ఏడాది జనవరిలో సాక్షీ యాదవ్ ఇంట్లో తను వివాహం చేసుకున్న విషయం చెప్పడంతో తన తండ్రి ఒప్పుకోక పోగా కోపంతో రగిలిపోయాడు. ఆ యువతిని వేధింపులకు గురిచేశాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరు వర్గాలతో మాట్లాడగా యువతి తండ్రి వివాహానికి ఒప్పుకుంటున్నట్లు నమ్మబలికాడు. అయితే ఇదేక్రమంలో ఇటీవల సాక్షీ యాదవ్‌ను తన హాస్టల్ నుంచి తీసుకొచ్చి వేధించసాగాడు. దళితుడిని పెళ్లి చేసుకుందని కూతురని కూడా చూడకుండా గుండు కొట్టించి, పుణ్య స్నానం చేయించాడు. ఇక తండ్రి వేధింపులు తట్టుకోలేని సాక్షీ యాదవ్ ఇంట్లో నుంచి పారిపోయి భర్తను చేరుకుంది. శుక్రవారం ఆ మహిళ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సిమల ప్రసాద్‌కు ఫిర్యాదు చేసింది. 2020 మార్చిలో తాను దళిత వ్యక్తిని వివాహం చేసుకున్నానని, జనవరి 4, 2021న తన నాన్నకు తెలియజేశానని తెలిపింది. అయితే తన తండ్రి 2021 జనవరిలో తాను కనిపించడంలేదని మిస్సింగ్ కంప్లైంట్‌ను దాఖలుచేశారని తెలిపింది. తనకు తండ్రికి నుంచి ప్రాణహాని ఉందని ఆ యువతి పోలీసులకు తెలిపింది. అంతే కాక తన భర్తకు విడాకులు ఇవ్వాలని, తమ కులం వ్యక్తితో మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని బాధిత యువతి తమకు రక్షణ కావాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. -
బడగులు కావడంతోనే ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్
సాక్షి, అలంపూర్: అత్యాచారాలు, హత్యలు చేసిన నిందితులకు శిక్షల్లో వివక్ష ఎందుకు చూపుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మంగళవారం సాయంత్రం అలంపూర్ చౌరస్తా చేరుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన అలంపూర్ చౌరస్తా లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘దిశ’ నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అన్నారు. రాజ్యాంగబద్ధంగా వారికి కోర్టు ద్వారా శిక్ష వేయాల్సిన పోలీసులు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. దిశ నిందితుల తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనప్పటికీ తమ పిల్లలు తప్పు చేసి ఉంటే కోర్టు ద్వారా శిక్ష పడాలని కోరుకున్నారన్నారు.కోర్టు కంటే ముందే శిక్ష వేశారన్నారు. నిందితులు బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతోనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారన్నారు. కులం, మతం తేడా చూడొద్దు గత 15 ఏళ్లలో 3.41 లక్షల అత్యాచారాలు, హత్యల కేసులు నమోదైనా.. ఎక్కడా ఇలాంటి సంఘటన జరగలేదని మంద కృష్ణ అన్నారు. హాజీపూర్ ఘటనలో నలుగురు అమ్మాయిలను అత్యాచారం చేసి హత్య చేసిన శ్రీనివాస్‌రెడ్డిని, జడ్చర్లలో బాలికను హత్య చేసిన నిందితుడిని ఎందుకు శిక్షించలేదన్నారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన శిక్ష పడాలన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ నెల 24న బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
కుల బహిష్కరణతో మహిళ ఆత్మహత్య
మధ్యప్రదేశ్ః నిమ్న కులస్థుడ్ని ప్రేమించడమే ఆమె ప్రాణం తీసింది. తక్కువ కులానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందంటూ ఊరు... పంచాయితీ పెట్టింది. ఆమెను, ఆమె కుటుంబాన్నీ ఊరునుంచి వెలి వేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో జరిగిన ఘటనకు అవమానంగా భావించిన ఓ మహిళ ప్రాణాలు తీసుకుంది. మధ్యప్రదేశ్ తికామ్ ఘర్ కు చెందిన 25 ఏళ్ళ సాకీ పాల్ ఉదయం ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తికామ్ ఘర్ కు 12 కిలోమీటర్ల దూరంలోని కరిబజారువా లోని స్వంత ఇంట్లో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆత్మహత్యకు తగ్గ కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదని, తక్కువ కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించడంతో సాకీని, ఆమె కుటుంబాన్ని సంఘం వెలివేసిందని, దీంతో అవమాన భారాన్ని తట్టుకోలేకపోయిన ఆమె... ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోందని సబ్ ఇనస్పెక్టర్ బీ ఎస్ రాథోర్ చెప్పారు. నాయకుడు థానీ రామ్ గత నెల్లో కుల పంచాయితీ నిర్వహించారని, తక్కువ కులస్థుడితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆమెను, ఆమె కుటుంబాన్ని ఊరు వెలి వేసినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. అయితే తన ప్రవర్తన అటువంటిది కాదంటూ సాకీ పంచాయితీకి మొరపెట్టుకుందని, గ్రామంనుంచీ వెలి వేయడం అన్యాయం అంటూ వేడుకుందని గ్రామస్థుల ద్వారా తెలుస్తోంది. దీంతో చివరికి ఆమెపై వెలి నిర్ణయాన్ని ఎత్తివేసేందుకు అంగీకరించిన ఊరి పెద్దలు కొన్ని నిబంధనలు విధించారు. మత సంప్రదాయంలో భాగంగా గ్రామం మొత్తానికి సాకీ కుటుంబం రెండు పూటల భోజనాలు పెట్టించాలని షరతులు విధించారు. షరతులకు సైతం సాకీ కుటుంబ సభ్యులు అంగీకరించారు. అయితే చివరికి ఏమైందో ఏమో సాకీ ఆత్మహత్యకు పాల్పడిందని, ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసు అధికారి రాథోర్ చెప్పారు.