
పాట్నా: బిహార్‌లో బోరుబావిలో పడిన చిన్నారిని అధికారులు ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించి బాలుని ప్రాణాలను కాపాడారు. నలంద జిల్లాలోని కులు గ్రామంలో ఈ రోజు మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ 40 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. చిన్నారిని బయటకు తీయడానికి విపత్తు నిర్వహణ శాఖ(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలను చేపట్టింది. బాలున్ని శివమ్ కుమార్‍గా గుర్తించారు.
గ్రామ సమీపంలో ఓ రైతు బోరు బావి తవ్వి, అక్కడ నీరు పడకపోవడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు. అక్కడే బాలున్ని తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా బావిలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు నలంద నగర పంచాయతీ అధ్యక్షుడు నలిన్ మౌర్య తెలిపాడు.
సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని అధికారి శంభు మండల్ తెలిపారు. బాబు ఏడుపు శబ్దం తమకు వినిపిస్తున్నట్లు వెల్లడించారు. జేసీబీ మెషిన్‌ల ద్వారా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సినిమా రేంజ్‌లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్..
Comments
Please login to add a commentAdd a comment