falls into well
-
విషాదం: లోయలో పడిన బస్సు.. ఏడుగురు పర్యాటకులు మృతి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన జరిగింది. 35 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మిగిలిన 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో గంగోత్రి నుంచి వెనుదిరిగిన బస్సు.. గంజ్ఞాని వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్ఎఫ్, జాతీయ విపత్తుకు సంబంధించిన బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు సంభవించాయి. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: హాస్టల్ గదిలో మారణాయుధాలు.. బాంబులు, పిస్టళ్లతో విద్యార్థులు.. -
బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి.. చివరకు..
పాట్నా: బిహార్‌లో బోరుబావిలో పడిన చిన్నారిని అధికారులు ఎట్టకేలకు సురక్షితంగా బయటకు తీశారు. కొన్ని గంటలపాటు తీవ్రంగా శ్రమించి బాలుని ప్రాణాలను కాపాడారు. నలంద జిల్లాలోని కులు గ్రామంలో ఈ రోజు మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ 40 అడుగుల బోరుబావిలో పడిపోయాడు. చిన్నారిని బయటకు తీయడానికి విపత్తు నిర్వహణ శాఖ(ఎన్డీఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలను చేపట్టింది. బాలున్ని శివమ్ కుమార్‌గా గుర్తించారు. గ్రామ సమీపంలో ఓ రైతు బోరు బావి తవ్వి, అక్కడ నీరు పడకపోవడంతో దానిని పూడ్చకుండా అలాగే వదిలేశాడు. అక్కడే బాలున్ని తల్లి పొలంలో పనిచేస్తుండగా.. సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అకస్మాత్తుగా బావిలో పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన గ్రామస్థులు సమాచారాన్ని పోలీసులకు అందించారు. సహాయక చర్యలు చేపట్టినట్లు నలంద నగర పంచాయతీ అధ్యక్షుడు నలిన్ మౌర్య తెలిపాడు. సమాచారం అందించిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని అధికారి శంభు మండల్ తెలిపారు. బాబు ఏడుపు శబ్దం తమకు వినిపిస్తున్నట్లు వెల్లడించారు. జేసీబీ మెషిన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టామని తెలిపారు. ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: సినిమా రేంజ్లో.. దంపతుల పక్కా స్కెచ్.. టమాటా లారీ హైజాక్.. -
38 గంటలుగా బోరు బావిలోనే బాలుడు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని బైతూల్ జిల్లాలో బోరు బావిలో పడిన 8 ఏళ్ల బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంగళవారం సాయత్రం 5 గంటలకు మండవి గ్రామంలో ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు తన్మయ్ దియావర్ సాహూ అనే బాలుడు. ప్రస్తుతం 55 అడుగుల లోతులో బాలుడు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బోరుకు సమాంతరంగా గుంతను తవ్వి తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ‘బోరు బావిలో పడిపోయిన 8 ఏళ్ల బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 33 అడుగల మేర లోతుకు గుంత తవ్వటం పూర్తయింది. 45 అడుగుల వరకు చేరుకోవాలి. ఆ తర్వాత బోరులోకి సొరంగం చేస్తారు. బండ రాళ్లు ఉన్నందుకు సమయం పడుతోంది. బాలుడి నుంచి ఎలాంటి స్పందన లేదు. బహుశా అపస్మారక స్థితిలోకి వెళ్లి ఉండవచ్చు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.’ అని తెలిపారు జిల్లా అదనపు కలెక్టర్ శ్యామేంద్ర జైశ్వాల్. రాష్ట్ర విపత్తు స్పందన దళం(ఎస్డీఆర్ఎఫ్), హోమ్ గార్డ్స్, స్థానిక పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: హిమాచల్‌లో హోరాహోరీ.. ‘ఆపరేషన్ లోటస్’ గుబులు.. కొత్త ఎమ్మెల్యేల తరలింపు! -
బోరు బావిలో 8 ఏళ్ల బాలుడు.. 15 గంటలుగా మృత్యువుతో పోరాటం
భోపాల్: ఆడుకుంటూ వెళ్లి ఓ ఎనిమిదేళ్ల బాలుడు 400 అడుగుల లోతైన బోరు బావిలో పడిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని బెతుల్ జిల్లాలో మంగళవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మండవి గ్రామంలోని ఓ పొలంలో ఇటీవలే బోరు బావి తవ్వారు. మంగళవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆడుకుంటున్న తన్మయ్ దియావర్(8) అనే బాలుడు ఆ బోరులో పడిపోయాడని ఆత్నేర్ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అనిల్ సోనీ తెలిపారు. బాలుడిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. బోరు బావి చుట్టూ తవ్వేందుకు ప్రొక్లెయిన్ వంటి వాహనాలు చేరుకున్నాయని చెప్పారు. బోరు బావిలోని బాలుడికి ఆక్సిజన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రస్తుతం బాలుడు 60 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. Madhya Pradesh | Operation still underway to rescue the boy who fell into a 55-ft deep borewell in Mandavi village in Betul district yesterday. pic.twitter.com/si8PzNagy9 — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 7, 2022 ఇదీ చదవండి: లఖీంపూర్ కేసులో 13 మందిపై అభియోగాలు -
నిరుత్సాహ పరిచిన ఎయిర్టెల్, క్యూ3లో
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికరలాభం 3శాతం క్షీణించి రూ.830 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 854 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం పుంజుకుని రూ.29,867 కోట్లను తాకింది. పెట్టుబడి వ్యయాలు రూ. 6,864 కోట్ల నుంచి రూ. 6,102 కోట్లకు తగ్గాయి. కాగా.. వివిధ రుణ సాధనాల ద్వారా రూ.7,500 కోట్లను సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. వీటిని ఒకేసారి లేదా దశలవారీగా సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. గత వారం గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూ. 7,500 కోట్లతో కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
50 అడుగుల బావిలో గున్న ఏనుగు
సాక్షి, సేలం(తమిళనాడు): తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో గున్న ఏనుగు బావిలో పడిపోయింది. అటవీశాఖ సిబ్బంది 13 గంటల పాటు శ్రమించి ఏనుగును సురక్షితంగా బయటకు తీశారు. పాలక్కోడు సమీపంలోని ఏలకుండూర్ గ్రామంలో 50 అడుగుల లోతైన బావి ఉంది. గురువారం నీటి కోసం వచ్చిన ఒక ఆడ గున్న ఏనుగు ప్రమాదవశాత్తు అందులో జారి పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి బావిలో ఉన్న నీటిని మోటార్లతో బయటకి తోడేశారు. ఏనుగుకు రెండు మత్తు సూదులు ఇచ్చి క్రేన్ల సహాయంతో బావిలోంచి అతికష్టం మీద బయటకు తీశారు. అనంతరం ఏనుగుకు వెటర్నరీ వైద్యులు చికిత్స చేశారు. (ట్రాఫిక్ కానిస్టేబుల్ వైరల్ వీడియో) -
దేవుణ్ని చూపిస్తానని.. 70 అడుగుల బావిలో..
-
దేవుణ్ని చూపిస్తానని.. 70 అడుగుల బావిలో..
సాక్షి, కడప: తాగిన మైకంలో అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అని ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ కారణంగా ఓ వ్యక్తి బావిలో పడ్డాడు. ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. చింతకొమ్మ దిన్నె సమీపంలోని మద్దిమడుగుకి చెందిన కిశోర్ నాయక్, సుగాలి బిడికికి చెందిన రామాంజనేయులు బావి గట్టున కూర్చోని మద్యంగా సేవించారు. తాగిన మైకంలో వీరిద్దరూ దేవుడి గురించి చర్చించుకున్నారు. కిషోర్ నాయక్ దేవుడు ఉన్నాడని వాదించడంతో రామాంజనేయులు లేడని వాదించాడు. వీరి వాదనలు తారస్థాయికి చేరాయి. ఇక కిషోర్ నాయక్ తాగిన మైకంలో పక్కనే ఉన్న బావిలో గంగమ్మ తల్లి ఉంటుందని ఆమెను చూపిస్తాని బావిలోకి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బావిలో ఉన్న ఓ రాయిపై కిషోర్ నాయక్ కాలు వేయటంతో ఆ రాయి విరిగి సుమారు 70 అడుగుల లోతున పడిపోయాడు. దీంతో ఆందోళన చెందిన రెండో వ్యక్తి స్థానికులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బావిలో పడ్డ వ్యక్తిని రక్షించారు. అనంతరం కిషోర్ నాయక్‌ను ఆస్పత్రికి తరలించారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది దుర్మరణం
నాసిక్ : మహారాష్ట్రలోని నాసిక్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఆటో, బస్సు ఒకదానినొకటి ఢీకొని అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి. బస్సు మాలెగావ్ నుంచి కల్వాన్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మందుగా ఆటో దాని మీద నుంచి బస్సు పడడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు నలిగిపోయారు. నీటిలో మునిగి ఊపిరాడక చాలా మంది చనిపోయారు. నాసిక్‌లోని దియోలా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మంది చనిపోయారు. మరో 30 మందిని రెస్క్యూ సిబ్బంది, స్థానికులు బయటకు తీశారు. వారిలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బావి లోతు 70 అడుగులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. -
బావిలో పడ్డ బస్సు.. 7 గురు మృతి
-
బావిలో పడ్డ ఎలుగుబంటి
బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం గంగవరంలో ఓ ఎలుగుబంటి ప్రాణభయంతో పరుగెడుతూ బావిలో పడిపోయింది. అటవీ అధికారులు నిచ్చెన సాయంతో దాన్ని బయటకు తీశారు. వివరాలిలా ఉన్నాయి. ఓ ఎలుగుబంటి ఆహారం కోసం సోమవారం తెల్లవారుజామున గంగవరం గ్రామంలోకి చొరబడింది. దీన్ని గమనించిన కుక్కలు దానిపై దాడికి యత్నించాయి బెదిరిపోయిన ఎలుగుబంటి æఅకస్మాత్తుగా ఒక ఇంట్లోకి దూరి మాధవి అనే మహిళ వీపుపై గాయపరిచింది. గ్రామంలో కలకలం రేగడంతో జనం పోగయ్యారు. దాన్ని తరిమివేసేందుకు ప్రయత్నం చేశారు. బెంబేలెత్తిపోయిన ఎలుగుబంటి వారి నుంచి తప్పించుకునేందుకు పరుగు తీస్తూ గ్రామ శివారులోని నీరులేని పాడుబడిన బావిలోకి పడిపోయింది. లోతు ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు,అటవీ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బావిలోకి నిచ్చెన వేయగా..దాని సాయంతో ఎలుగుబంటి పైకి వచ్చి అటవీప్రాంతంలోకి పరుగులు తీసింది.