న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది.
కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో నికరలాభం 3శాతం క్షీణించి రూ.830 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 854 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం 13 శాతం పుంజుకుని రూ.29,867 కోట్లను తాకింది.
పెట్టుబడి వ్యయాలు రూ. 6,864 కోట్ల నుంచి రూ. 6,102 కోట్లకు తగ్గాయి. కాగా.. వివిధ రుణ సాధనాల ద్వారా రూ.7,500 కోట్లను సమీకరించే ప్రతిపాదనకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. వీటిని ఒకేసారి లేదా దశలవారీగా సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. గత వారం గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూ. 7,500 కోట్లతో కంపెనీలో 1.28 శాతం వాటా కొనుగోలుకి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment