![Bus Carrying Pilgrims Falls Into Gorge In Uttarakhand - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/20/bus_imb.jpeg.webp?itok=TGmcLNox)
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన జరిగింది. 35 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మిగిలిన 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో గంగోత్రి నుంచి వెనుదిరిగిన బస్సు.. గంజ్ఞాని వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది.
ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్‌ఎఫ్, జాతీయ విపత్తుకు సంబంధించిన బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు సంభవించాయి. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: హాస్టల్ గదిలో మారణాయుధాలు.. బాంబులు, పిస్టళ్లతో విద్యార్థులు..
Comments
Please login to add a commentAdd a comment