pilgrims
-
అంతులేని నిర్లక్ష్యం.. ఆసుపత్రుల్లో మృత్యుఘోష
-
డాల్లాస్‌లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.అత్యంత నిష్ఠతో పూజలు భజనలు అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్ తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.-సిమ్మాదిరప్పన్న. -
కేదార్‌నాథ్‌లో చిక్కుకున్న విజయనగరం యాత్రికులు
విజయనగరం క్రైమ్: చార్ధామ్ యాత్రకు వెళ్లి ప్రతికూల వాతావరణం కారణంగా కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో కొండపై విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు చిక్కుకుపోయారు. ఢిల్లీకి చెందిన సదరన్ ట్రావెల్స్ ద్వారా ఇటీవల చార్ధామ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 30 మంది వెళ్లారు. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. రెండు రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తుండడం, వాతావరణం అనుకూలించకపోవడంతో భక్తులు కొండలపైనే నిలిచిపోయారు. జిల్లాకు చెందిన నలుగురిలో గొట్టాపు త్రినాథరావు దంపతులు గురువారం హెలికాప్టర్లో కొండ కిందకు వచ్చేశారు. డిప్యూటీ తహసీల్దార్ కొట్నాన శ్రీనివాసరావు, ఆయన భార్య హేమలత ఇంకా కేదార్నాథ్ కొండపైనే ఉన్నారు. కేదార్నాథ్ ఆలయం ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేదని హెలికాప్టర్ ప్రయాణం నిలిపివేశారని, తాము కొండపైనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నట్లు స్థానిక విలేకరులకు వారు శుక్రవారం ఫోన్లో తెలిపారు. భోజన, వసతి లభించక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన అక్కడి అధికారులతో మాట్లాడారు. శుక్రవారం కొంత మేరకు వాతావరణం సహకరించడంతో రెండు హెలికాప్టర్లు మాత్రమే కేదార్నాథ్ ఆలయం వద్దకు వెళ్లగలిగాయని, అయితే వాటిలో ఏపీ వారికి అవకాశం ఇవ్వకపోవడంతో కొండపైనే ఉండిపోయారని తెలిసింది. -
కేదార్‌నాథ్‌లో సాగుతున్న సహాయక చర్యలు
రుద్రప్రయాగ్/సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తీర్థయాత్రికుల కోసం మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్నాథ్, భింబలి, గౌరీకుండ్ల్లో చిక్కుకుపోయిన మరో 1,500 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. యాత్రికులను తరలించేందుకు వైమానిక దళం చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను శుక్రవారం రంగంలోకి దించింది. పర్వత మార్గంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా పలువురు గల్లంతైనట్లు వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. శుక్రవారం లించోలిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన శుభమ్ కశ్యప్‌గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్–కేదార్నాధ్ ట్రెక్కింగ్ మార్గంలో 25 మీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. అడ్డంకులను తొలగించి, రహదారిని పునరుద్ధరించే వరకు వేచి ఉండాలని రుద్రప్రయాగ్ యంత్రాంగం యాత్రికులను కోరింది.హిమాచల్‌లో ఆ 45 మంది కోసం గాలింపుహిమాచల్ ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మండి జిల్లాల్లో వరద బీభత్సంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మండి జిల్లా రాజ్బన్ గ్రామంలో రాతి కింద చిక్కుకున్న వ్యక్తిని గుర్తించారు. కులు జిల్లా సమెజ్ గ్రామంలో గల్లంతైన పోయిన 30 మంది కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారన్నారు. శ్రీఖండ్ మహాదేవ్ ఆలయంలో చిక్కిన 300 మంది, మలానాలో చిక్కుకున్న 25 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు. -
కారుపై కన్వర్ యాత్రికుల దాడి
లక్నో: కన్వర్ యాత్రికులు హరిద్వార్-ఢిల్లీ జాతీయ రహదారి మీద ఓ కారుపై దాడి చేశారు. తమ వెంట తీసుకెళుతున్న పవిత్ర గంగాజలాలున్న కావడిని ఢీకొట్టినందుకే కారుపై యాత్రికులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.గంగాజలాలను కారు తాకడం వల్ల అవి అపవిత్రమయ్యాయని యాత్రికులు ఆరోపించినట్లు చెప్పారు. కన్వర్ యాత్రికులు కావడిలో తీసుకెళ్లే గంగా జలాలను పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తీసుకువెళ్లి వారు శివున్ని పూజిస్తారు. కన్వర్ యాత్ర సోమవారం(జులై 22) ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టులో ముగుస్తుంది. మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో తిను బండారాలు అమ్మే హోటళ్ల ఓనర్లు తమ పేర్లు ప్రదర్శించాలని యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. -
వడదెబ్బకు 14 మంది హజ్‌యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు హజ్‌యాత్రను కొనసాగిస్తున్నారు. జోర్డాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘పెట్రా’తెలిపిన వివరాల ప్రకారం హజ్ యాత్రలో పాల్గొన్న 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. మృతులను సౌదీ అరేబియాలో ఖననం చేయలా లేదా జోర్డాన్‌కు పంపించాలా అనేదానిపై సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.హజ్‌యాత్ర చివరి రోజులలో సైతానుకు గుర్తుగా ఉన్న స్థంభాలను ముస్లింలు రాళ్లతో కొడతారు. దీనిని చెడును తరిమికొట్టడానికి గుర్తుగా భావిస్తారు. ఇది ముస్లింలు హజ్‌యాత్రలో చేసే చివరి ఆచారం. ప్రపంచం నలుమూలల నుండి 18 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా హజ్ యాత్రకు ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు అటువంటి ఆంక్షలు లేకపోవడంతో హజ్ తీర్థయాత్రలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. -
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జమ్మూలోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించేందుకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో 9మంది యాత్రికులు మరణించారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎంతమందికి బుల్లెట్ గాయాలు అయ్యాయో ఇంకా తెలియరాలేదని రియాసి జిల్లా మేజిస్ట్రేట్ విశేష్ మహాజన్ తెలిపారుఉగ్రవాదుల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు,భద్రతా బలగాలు బాధితుల్ని రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గాయపడ్డ బాధితుల్ని రక్షించేందుకు స్థానికులు సహాయక చర్యల్ని ముమ్మరం చేస్తున్నాయి. -
‘చార్ధామ్’లో ఆటంకాలు.. వెనుదిరుగుతున్న భక్తులు?
చార్ధామ్ యాత్ర సాఫీగా సాగేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఆశించినంతగా ఫలించడం లేదు. దీంతో చాలా మంది భక్తులు యాత్ర చేయకుండానే వెనుదిరుగుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు రిషికేశ్ నుండి తిరుగుబాట పట్టారని సమాచారం. ఉత్తరాఖండ్‌కు చేరుకున్న తరువాత కూడా చార్ధామ్ యాత్ర చేయలేకపోవడం విచారకరమని వారు వాపోతున్నారు. యాత్రకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయడంతోనే ఈ సమస్య తలెత్తిందని వారు ఆరోపిస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ఆపివేసిన నేపధ్యంలో సుమారు 12 వేల మంది యాత్రికులకు ధామ్‌లను సందర్శించడానికి తాత్కాలిక రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించనున్నట్లు స్థానిక పరిపాలన యంత్రాంగం ప్రకటించింది. అయితే అది పూర్తి స్థాయిలో కార్యారూపం దాల్చలేదు. దీంతో పలువురు యాత్రికులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది.ట్రాన్సిట్ క్యాంప్ అడ్మినిస్ట్రేషన్ తెలిపిన వివరాల ప్రకారం కేవలం ఆరు వేల మంది యాత్రికులకు మాత్రమే తాత్కాలిక రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో మిగిలిన ఆరు వేల మందిలో దాదాపు నాలుగు వేల మంది యాత్రికులు చార్ధామ్ దర్శనం కాకుండానే వెనుదిరిగారు. దాదాపు రెండున్నర వేల మంది యాత్రికులు ఇప్పటికీ ట్రాన్సిట్ క్యాంపు ప్రాంగణం, ధర్మశాలలలో తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వేచిచూస్తున్నారు.ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను మే 31తో నిలిపివేయాలని పరిపాలన యంత్రాంగం నిర్ణయించింది. అయితే ట్రాన్సిట్ క్యాంపులో ఉన్న యాత్రికులలో సుమారు 800 మంది ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే వరకు ఇక్కడే ఉంటామని చెబుతున్నారు. కాగా ఈ యాత్రికులకు వసతి, భోజన ఏర్పాట్లను స్థానిక అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. -
చార్ధామ్ యాత్రపై సైబర్ నేరగాళ్ల కన్ను.. ఆటకట్టించిన పోలీసులు
చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యేందుకు ఇంకా కొద్ది రోజుల సమయమే ఉంది. ఇంతలో సైబర్ నేరగాళ్లు ఈ యాత్రపై కన్నువేశారు. గతంలో హెలీ సర్వీసుల బుకింగ్ పేరుతో యాత్రికులను మోసగించిన ఈ సైబర్ నేరగాళ్లు ఇప్పుడు హోటల్ బుకింగ్ పేరుతోనూ యాత్రికులను వంచించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపధ్యంలో తాజాగా పోలీసులు హోటల్ బుకింగ్ పేరుతో సృష్టించిన ఏడు నకిలీ వెబ్సైట్లను, హెలీ సర్వీస్ బుకింగ్ కోసం సృష్టించిన 12 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఏడాది కాలంలో పోలీసులు చార్ధామ్ యాత్రతో ముడిపడిన 83 నకిలీ వెబ్సైట్లను మూసివేయించారు. ఇటువంటి మోసాలను నివారించడానికి పోలీసు శాఖలోని ఇంటర్నెట్ మీడియా సెల్‌ను పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేశారు.ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)తో హెలీ సర్వీస్ బుకింగ్ కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రభుత్వ అధికారి ఆయుష్ అగర్వాల్ తెలిపారు. యాత్రికులు https://www.heliyatra.irctc.co.in/ ద్వారా చార్ధామ్ హెలీ సర్వీస్‌ను బుక్ చేసుకోవచ్చు. యాత్రికులెవరైనా నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించినప్పుడు డెహ్రాడూన్ ఎస్టీఎఫ్ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చు. లేదా 9456591505, 9412080875 మొబైల్ నంబర్లకు ఫోన్ చేసి, వివరాలు అందించవచ్చని అధికారులు తెలిపారు. -
అమర్నాథ్కు పెరిగిన భక్తుల సంఖ్య!
అమర్నాథ్ యాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. దీనికి 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించడమే కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. దీనిని తొలగించకముందు మధ్యప్రదేశ్ నుంచి ఏటా అరమ్నాథ్ యాత్రకు వెళ్లే యాత్రికుల సంఖ్య 26 నుంచి 30 వేలు కాగా, దీనిని తొలగించిన తర్వాత యాత్రికుల సంఖ్య 40 వేలకు చేరుకుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుండి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 19 న రక్షాబంధన్ వరకు కొనసాగనుంది. అమర్నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు భక్తుల ప్రయాణాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. ఈ తేదీని ప్రకటించిన వెంటనే ప్రయాణికులు రైలు రిజర్వేషన్ల కోసం ప్రయత్నించనున్నారు. అయితే కొందరు ప్రయాణ తేదీలను అంచనా వేస్తూ రిజర్వేషన్లు చేయించుకుటున్నారని సమాచారం. ఈసారి మధ్యప్రదేశ్ నుంచి అమర్నాథ్ వెళ్లే యాత్రికుల సంఖ్య 45 వేలు దాటుతుందని ఓం శివసేవా శక్తి మండల్ సంస్థ అంచనా వేసింది. ఎంపీ నుంచి 2018లో 35 వేల మంది అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. 2019లో 30 వేల మంది అమర్నాథ్ యాత్ర చేశారు. అయితే 2020, 2021లలో కరోనా కారణంగా అమర్నాథ్ యాత్ర జరగలేదు. 2022లో 35 వేల మంది, 2023లో 40 వేల మంది అమర్నాథ్ను దర్శించుకున్నారు. -
విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి!
హోలీ పర్వదినాన హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోలీ వేడుకలు జరుగుతున్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. ఉనా జిల్లా అంబ్ సబ్ డివిజన్లోని మేడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే హోలీ వేడుకల్లో భాగంగా భక్తులు గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా కొండపై నుంచి రాళ్లు పడటం మొదలైంది. దీంతో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగింది. ఈ నేపధ్యంలో తొమ్మిది మంది భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సివిల్ ఆస్పత్రికి తరలించగా, ఇద్దరు భక్తులు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఉనా ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. -
విషాదం: లోయలో పడిన బస్సు.. ఏడుగురు పర్యాటకులు మృతి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాద ఘటన జరిగింది. 35 మంది పర్యాటకులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మిగిలిన 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులతో గంగోత్రి నుంచి వెనుదిరిగిన బస్సు.. గంజ్ఞాని వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్ఎఫ్, జాతీయ విపత్తుకు సంబంధించిన బలగాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో ఇటీవల భారీ వర్షాలు సంభవించాయి. దీంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: హాస్టల్ గదిలో మారణాయుధాలు.. బాంబులు, పిస్టళ్లతో విద్యార్థులు.. -
విషాదం.. కొండ చరియలు విరిగిపడి అయిదుగురు యాత్రికులు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో విషాం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రోడ్డుపై వెళ్తున్న కారుపై కొండచరియలు విరిగిపడడంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. యాత్రికులు కేథార్‌నాథ్‌కు వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. బాధితుల్లో ఓ వ్యక్తి గుజరాత్‌కు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. రుద్రప్రయాగ జిల్లాలో ఛౌకీ ఫటాలోని టార్సిల్ ప్రాంతంలో ఈ ప్రమాదం వెలుగుచూసింది. ఉత్తరాఖండ్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగష్టు 11 నుంచి ఆగష్టు 24 వరకు కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. వర్షాలకుతోడు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రహదారిపై వెళుతున్న కారుపై కొండచరియలు విరిగిపడడంతో అందులో ఉన్న ఐదుగురు వ్యక్తులు మరణించారు. కొండచరియలు విరిగిపడడంతో గుప్తకాశి-గౌరీకుండ్ గుండా కేదార్నాథ్ దామ్‌కు వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీసులు తెలిపారు. అయితే.. కొన్ని జిల్లాలో ఇప్పటికే కొన్నిప్రాంతాల్లో రెడ్, ఆరెంజ్ జారీ అయిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వాహనదారులకు సూచనలు చేశారు. ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం -
యాత్రలో అపశ్రుతి. భక్తుల బస్సుకు హై టెన్షన్ వైర్లు తగిలి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. మతపరమైన యాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. దక్షిణ ఉత్తరప్రదేశ్‌లోని మిరట్ జిల్లా, భవాన్‌పురీ రాలీ చౌహాన్ గ్రామంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివుని భక్తులుగా పేరుగాంచిన కన్వరియాలు యాత్రకు వెళ్లారు. హరిద్వార్‌లో గంగాజలంతో తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న బస్సు.. భవాన్‌పురీ గ్రామానికి చేరుకోగానే కిందికి వంగి ఉన్న హై టెన్షన్ వైర్లకు తగిలి విద్యుదాఘాతానికి గురైంది. దీంతో బస్సులో ఉన్న యాత్రికులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ దుర్ఘటనలో ఓ భక్తుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగులు చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పలువురు గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అప్రమత్తమైన గ్రామస్తులు విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కానీ అప్పటికే ప్రమాదం తీవ్రత పెరిగిపోయింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనకు బాధ్యత వహించాలంటూ నిరసన చేపట్టారు. హై టెన్షన్ వైర్లు కిందికి ఉన్నాయని పలుమార్లు ఫిర్యాదు చేసినా సరిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. కన్వార్ యాత్ర భారతదేశంలో అతిపెద్ద మతపరమైన యాత్రల్లో ఒకటి. ప్రతీ ఏడాది ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, చంఢీగర్, ఒడిశా, జార్ఖండ్ నుంచి కోటీ ఇరవై లక్షల వరకు భక్తులు హాజరవుతారు. కన్వారియాలు కాశాయ వస్త్రాలు ధరించి చెప్పులు లేకుండా యాత్రకు వెళతారు. ఇదీ చదవండి: ఆజం ఖాన్‌కు మరో కేసులో రెండేళ్ల జైలు -
ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికులు దుర్మరణం
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్ యాత్రికులతో వెళుతున్న బస్సు సోమవారం అదుపుతప్పి వంతెనను ఢీట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడినట్లు సౌదీ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఖమీస్ ముషైత్ నుంచి అభాకు వెళ్తుండగా అసిర్ ప్రావిన్స్‌లోని అకాబత్ షార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20కు చేరింది. మరో 29 మంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా బస్సులో ప్రయాణిస్తున్న బాధితులందరూ వివిధ దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం కావడంతో వాళ్లంతా మక్కా, మదినా యాత్ర కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 2019 అక్టోబర్‌లోనూ మదీనా సమీపంలో బస్సు మరొక భారీ వాహనాన్ని ఢీకొనడంతో 35 మంది విదేశీయులు మరణించారు. చదవండి: ఇదోక జబ్బులా ఉంది! స్కూల్లో కాల్పులు ఘటనపై జోబైడెన్ ఫైర్ -
టీటీడీ మొబైల్ యాప్ ప్రారంభం
తిరుమల: భక్తులకు మరింత మెరుగైన డిజిటల్ సేవలు అందించేందుకు ప్రయోగాత్మకంగా ‘టీటీ దేవస్థానమ్స్’ పేరుతో రూపొందించిన మొబైల్ యాప్‌ను టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్ యాప్ ఉండేదని, దీన్ని మరింత ఆధునీకరించి మరిన్ని అప్లికేషన్లు పొందుపరచి నూతన యాప్‌ను రూపొందించామని తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్ చేసుకోవచ్చన్నారు. విరాళాలు కూడా ఇదే యాప్ నుంచి అందించవచ్చని చెప్పారు. ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ యాప్ ద్వారా చూడవచ్చని తెలిపారు. జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు. నూతన యాప్ సేవలపై భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని చెప్పారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ భక్తులు లాగిన్ అయ్యేందుకు యూజర్ నేమ్‌తోపాటు ఓటీపీ ఎంటర్ చేస్తే చాలని, పాస్వర్డ్ అవసరం లేదని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయ బంగారు తాపడం పనులను ఐదు నుంచి ఆరు నెలలు వాయిదా వేస్తున్నామని, త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహకిషోర్, జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనీష్ షా, ఐటీ సలహాదారు అమర్, ఐటీ జీఎం సందీప్ పాల్గొన్నారు. చదవండి: వైద్యచరిత్రలో మరో మైలురాయి.. మారేడుమిల్లి ఘటనతో చలించిపోయి.. -
అమర్నాథ్ యాత్ర..ఏపీ వాసులు సురక్షితం
-
అమర్నాథ్ యాత్ర.. కొత్త బ్యాచ్‌లకు బ్రేక్
జమ్మూ: తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్నాథ్ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్నాథ్ యాత్ర ఆగస్ట్ 11వ తేదీన రక్షా బంధన్ రోజున ముగియనుంది. -
అమర్నాథ్ యాత్రలో ఆరుగురు ఏపీ యాత్రికుల మిస్సింగ్
-
Amarnath Floods: ఆకస్మిక వరదలు.. అమర్నాథ్లో అసలేం జరుగుతోంది?
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రికులను శుక్రవారం భీకర వర్షం బెంబేలెత్తించింది. పవిత్ర గుహ సమీపంలో సాయంత్రం 5.30 గంటల సమయంలో వర్ష బీభత్సం కారణంగా వరద పోటెత్తింది. ఇప్పటిదాకా కనీసం 16 మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయారని, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మరో 40 మంది అదృశ్యమయ్యారని పేర్కొన్నారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. వరదల్లో గాయపడిన వారిని హెలికాప్టర్లలో ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ చెప్పారు. చదవండి👉🏻గుజరాత్లో వరుణ విలయం ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. వరదల వల్ల ఆహార కేంద్రాలు, టెంట్లు దెబ్బతిన్నాయి. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమర్నాథ్లో కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. 13 మంది యాత్రికులు మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన సహాయం అందజేస్తామని ప్రకటించారు. పదో బ్యాచ్ కింద శుక్రవారం ఉదయం 6,100 మందికి పైగా యాత్రికులు రెండు బేస్ క్యాంపుల నుంచి ఆమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. చదవండి👉🏻Maharashtra: శివసేనకు మరో ఎదురుదెబ్బ -
Photo Feature: బల్తాల్ మార్గంలో అమర్నాథ్ యాత్ర
మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్నాథ్’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర గురువారం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ సంక్షోభాల నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత యాత్ర ప్రారంభమవడంతో ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశముంది. -
హజ్ యాత్రకు సిద్ధం
సాక్షి, అమరావతి: పవిత్ర హజ్ యాత్రకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రానికి చెందిన వారు ఈ నెల 14 నుంచి పవిత్ర యాత్రను ప్రారంభించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ యాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఏడాది రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు 1,161 మంది వెళ్తున్నారు. పాత జిల్లాల వారీగా యాత్రికుల గుర్తింపు, మంజూరు ఏర్పాట్లు పర్యవేక్షించారు. దీని ప్రకారం అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన యాత్రికులు ఈ నెల 14న బెంగళూరు నుంచి రెండు విమానాల్లో మదీనాకు వెళ్తారు. హజ్ యాత్ర అనంతరం వారు జూలై 22న రాష్ట్రానికి తిరిగి వస్తారు. మిగిలిన 11 జిల్లాలకు చెందిన యాత్రికులు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. వీరంతా ఈ నెల 27, 28, 30 తేదీల్లో బయల్దేరి జిద్దా విమానాశ్రయానికి చేరుకుంటారు. హజ్ యాత్రకు వెళ్లేవారు నిర్దేశించిన తేదీలకు 72 గంటల ముందు కేటాయించిన విమానాశ్రయాల పరిధిలోని హజ్ హౌస్‌లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గతంలో 48 గంటల ముందుగా రిపోర్టు చేస్తే సరిపోయేది. ఈసారి కోవిడ్ కారణంగా కోవిడ్ పరీక్ష (పీసీఆర్ టెస్ట్) కోసం ముందుగా చేరుకోవాలనే నిబంధన పెట్టారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి 65 ఏళ్ల లోపు వారిని మాత్రమే హజ్ యాత్రకు అనుమతించారు. ప్రభుత్వం సాయం చేస్తోంది ఈ ఏడాది హజ్ యాత్ర కోసం మొత్తం 1,403 దరఖాస్తులు వచ్చాయి. మన రాష్ట్రానికి కోటా 1,201 మందిని ఎంపిక చేశారు. కొందరు విరమించుకోగా 1,161 మంది హజ్ యాత్రకు వెళ్తున్నారు. హజ్ యాత్రికులకు ఏడాదికి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉంటే రూ.60 వేలు, రూ.3 లక్షలకు మించి ఆదాయం ఉంటే రూ.30 వేలు చొప్పున ప్రభుత్వం సాయమందిస్తోంది. – అబ్డుల్ ఖాదర్, హజ్ కమిటీ కార్యనిర్వహణ అధికారి -
పర్యాటకులకు శుభవార్త.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీలు.. వివరాలు ఇదిగో..
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): పర్యాటకులు, తీర్థయాత్రికుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పలు ప్రత్యేక టూర్స్‌ను పరిచయం చేస్తున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ చంద్రమోహన్ ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. విశాఖ–అరకు–విశాఖ (రైల్ కం రోడ్ ) ఈ టూర్ ప్రతిరోజు విశాఖపట్నంలో ఉదయం ప్రారంభమై, రాత్రికి విశాఖపట్నంలోనే ముగుస్తుంది. ఈ టూర్లో అరకు వ్యాలీ (ట్రైబల్ మ్యూజియం, టీ తోటలు, ధింసా నృత్యం) అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రాగుహలు సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి అరకుకు ఉదయం రైలులో బయల్దేరి అదేరోజు రాత్రి విశాఖపట్నానికి చేరుస్తారు. తిరుమల దర్శన్ యాత్ర (3 రాత్రులు, 4పగళ్లు) ఈ టూర్ ప్రతిశుక్రవారం విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఈ టూర్లో కాణిపాకం, శ్రీపురం, తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం, శ్రీకాళహస్తి, తిరుచానూర్ ప్రాంతాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి తీసుకువెళ్లి, మళ్లీ అదే రైలులో విశాఖ తీసుకొస్తారు. సదరన్ డివైన్ టెంపుల్ టూర్ (ఫ్లైట్ ప్యాకేజీ) ఈ టూర్ ఆగష్టు 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మొత్తం 5రాత్రులు, 6పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో దక్షిణాదిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, త్రివేండ్రం వంటి దర్శనీయ స్థలాలను సందర్శించవచ్చు. విశాఖపట్నం నుంచి ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలకు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్రవేశద్వారం వద్ద గల ఐఆర్సీటీసీ కార్యాలయంలో గానీ, 0891–2500695, 8287932318 నంబర్లలో గానీ సంప్రదించాలని చంద్రమోహన్ సూచించారు. -
లోయలో పడ్డ బస్సు, 22 మంది మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్ధామ్ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టుగా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చార్ధామ్ యాత్రికులు యమునోత్రి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. చదవండి👉🏻 వివాదాస్పద వ్యాఖ్యలు.. నూపుర్ శర్మను సస్పెండ్ చేసిన బీజేపీ ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in the accident in Uttarakhand. The injured would be given Rs. 50,000 each. — PMO India (@PMOIndia) June 5, 2022 -
సిద్దిపేట వంట రుచి చార్ దామ్‌లో..
సాక్షి,సిద్దిపేట జోన్: ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన తీర్థయాత్ర కేదార్నాథ్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చిట్ట చివరిది కేదార్నాథ్. హిమాలయాల్లో అత్యంత భయానక, సాహసోపేత యాత్రగా పేరొందిన కేదార్నాథ్ యాత్రికులకు అమృతం లాంటి దక్షిణాది రుచులను ఉచితంగా అందిస్తూ సేవాభావంతో పనిచేస్తున్న సమితి సిద్దిపేట ప్రాంతానికి చెందింది కావడం విశేషం. గతంలో అమర్నాథ్ యాత్రికులకు భోజన వసతి కల్పించిన స్పూర్తితో నేడు కేదార్నాథ్ యాత్రికులకు దక్షిణాది వంటకాలను అందుబాటులో తీసుకొచ్చారు. దేశ చరిత్రలోనే కేదార్‌నాథ్‌లో తొలి లంగర్ ఏర్పాటు చేసి, నిత్యం వేలాది మంది యాత్రికులకు ఉచితంగా భోజనం అందిస్తూ అందరి మన్నలను పొందుతోంది కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి. సిద్దిపేట ప్రాంత వాసులతో ఏర్పాటై ఎన్నో రాష్ట్రాల సరిహద్దులు దాటి అందిస్తున్న సేవలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సరిగ్గా 11 ఏళ్ల క్రితం అమర్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేసి అక్కడ దక్షిణాది యాత్రికులకు భోజనం అందించి అమర్నాథ్ సేవా సమితి దేశ వ్యాప్తంగా అందరి మన్నలను పొందింది. ఇదే స్పూర్తితో సిద్దిపేటకు చెందిన చీకోటి మధుసూదన్, ఐత రత్నాకర్ అధ్యక్ష కార్యదర్శులుగా కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటైంది. 2019లో తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం సొన్ ప్రయాగ్ బేస్ క్యాంపు వద్ద తొలి లంగర్ ఏర్పాటు చేశారు. ఎంతో సహోసోపేతంగా సాగే కేదార్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులలో 70 శాతం దక్షిణాది వారే. వారికి అక్కడ సరైన భోజన వసతి లేక 2019 వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తినడానికి సరైన తిండి లేక యాత్రికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికుల కోసం లంగర్ ఏర్పాటు చేశారు. మే 4 తేదీ నుంచి జూన్ 15 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. పది రోజులుగా సిద్దిపేటకు చెందిన కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో దక్షిణాది యాత్రికులకు భోజనాలు అందిస్తున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 11 గంటల వరకు లంగర్లో సేవలు అందుబాటులో ఉంటాయి. అక్కడ భోజనాలతోపాటు వసతి, హెల్ప్ సెంటర్ కూడా సేవా సమితి ఏర్పాటు చేసింది. దక్షిణాది రుచులు కేదార్నాథ్ యాత్రకు అత్యధికంగా దక్షిణాది ప్రాంత వాసులు వస్తుంటారు. వారికి ఉత్తరాఖండ్ రుచులు నచ్చవు. రోజుల కొద్ది యాత్రలో ఉండే యాత్రికులకు మన వంటకాలు కొంత ఊరట అందిస్తున్నాయి. ఉదయం టీ, అల్పాహారంగా ఇడ్లీ, చపాతి, వడ, ఉప్మా, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సిద్దిపేట ప్రేమ్‌పూరీ, పానీపూరి, కట్లీస్, రాత్రి భోజనం ఉచితంగా అందిస్తున్నారు. నిత్యం మూడు నుంచి నాలుగు వేల మంది యాత్రికులకు అన్నదాన సేవా సమితి భోజనాలు అందిస్తూ సేవలందిస్తోంది. సిద్దిపేట ప్రాంతంలో విరాళాలు సేకరించి అవసరమైన సామగ్రి, పరికరాలను ముందుగానే లంగర్‌కు సరఫరా చేశారు. అన్నదానం మహాదానం అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్లే వారికి అక్కడ సరైన భోజన వసతి ఉండదు. పదేళ్ల క్రితం సిద్దిపేట తొలిసారిగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి పేరిట యాత్రికులకు భోజనాలు అందించాం. అదే స్పూర్తితో ఇప్పుడు తొలిసారిగా కేదార్నాథ్ యాత్రికులకు లంగర్ ఏర్పాటు చేశాం. అన్నదానం మహాదానం. నిత్యం వేలాది మంది యాత్రికులకు దక్షిణాది రుచులతో కూడిన వంటకాలు అందిస్తున్నాం. – చికోటిమధుసూదన్, అధ్యక్షుడు, అన్నదాన సేవా సమితి దక్షిణాది రుచులు కరువు హిమాలయాల్లో కేదార్నాథ్ యాత్రలు చేసే వారిలో 70 శాతం దక్షిణాది వారే ఉంటారు. వారికి ఉత్తారాది వంట రుచులు నచ్చవు. మన వంటలు అందుబాటులోకి తెచ్చి ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొట్ట మొదటి లంగర్ సిద్దిపేట ప్రాంత సేవా సమితి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. నిత్యం భోజనాలు అందిస్తున్నాం. యాత్రికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. – రత్నాకర్, కార్యదర్శి, అన్నదాన సేవా సమితి చదవండి: ఒక్కటైన ప్రేమజంట.. దీని వెనక పెద్ద కథే నడిచింది! -
శ్రీవారి మెట్టు మార్గాన్ని ప్రారంభించిన టీటీడీ ఛైర్మన్
సాక్షి, తిరుపతి: తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు అనుమతివ్వనున్నారు. గత నవంబర్‌లో కురిసిన వర్షానికి తిరుమల మెట్ల మార్గం, ఘాట్ రోడ్ ధ్వంసమవగా టీటీడీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తులు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. చదవండి: (పసికందును లాలించిన సీఎం వైఎస్ జగన్) -
శ్రీవారు స్వయంగా ప్రతిష్టించిన ఆలయం.. అందుకే ఆ గుడి ప్రత్యేకం
సాక్షి, చిత్తూరు: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. శ్రీ పద్మావతి అమ్మ వారు ఆలయంలోని ఉప దేవాలయంలో ఇది కూడా ఒకటి. అమ్మవారి దేవాలయం వెనుకభాగంలోని పుష్కరిణికి ఎదురుగా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు, తిరుచానూరు అమ్మవారి దర్శించుకున్న తర్వాత శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సూర్య నారాయణ స్వామి ఆలయ పురాణం తిరుచూనూరు క్ష్రేత్రం శిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి అనుగ్రహించిన పవిత్ర క్ష్రేత్రం. లక్ష్మీదేవి వ్యూగంతో భూలోకానికి విచ్చేసిన శ్రీ వేంకటేశ్వరుడు మహాలక్ష్మీ కోసం 12 ఏళ్లపాటు తపస్సు చేసినట్లు స్థల పురాణం. ఆ సమయంలోలక్ష్మీదేవి స్వరూపమైన శ్రీ పద్మావతి దేవి ఆవిర్భావానికి అనుగుణంగా పద్మ సరోవరాన్ని నిర్మించారు. శ్రీవారు దేవలోకం నుంచి తెప్పించిన పద్మాలు ఆ కొనలులో ప్రతిష్టించారు. శ్రీ హరి సరస్సులో పద్మాలను నాటారు. సరస్సు తూర్పు ఒడ్డున, శ్రీ హరి సూర్యుడిని (సూర్య నారాయణ స్వామి) ప్రతిష్టించాడు. వెయ్యి బంగారు తామర పువ్వులను సమర్పించి పూజించాడు. 12 సంవత్సరాల పాటు పూజించిన తర్వాత, కార్తీక సుధ పంచమి నాడు, మహా లక్ష్మీ దేవి బంగారు పద్మం నుంచి తామరలా ప్రకాశిస్తుంది. ఆ పద్మాల వికాసానికి మూలం సూర్య కిరణాలు. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు సరోవరానికి తూర్పు ముఖంగా ప్రతిష్టించిన లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన సూర్య నారాయణ స్వామి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకానస ఆగముక్తంగా అర్చన, పూజా కార్యాక్రమాలు నిర్వహిస్తుంటారు. సూర్య నారాయణ స్వామి ఆలయంలో ముఖ మండపం ,అర్థ మండపం, గర్భాలయంగా మూడు భాగాలుగా నిర్మించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం ఉండదు. పద్మావతి అమ్మవారు, శ్రీవారి పరిణయ సమయంలో శ్రీ సూర్య నారాయణ మూర్తి అనుసంధాన కర్తగా వ్యవహరించిన నేపధ్యంలో శ్రీనివాసుడి అవతార కధా ఘట్టంలో ఎనలేని ప్రాదాన్యత ఉంది. సూర్య నారాయణ స్వామి అభిషేక సేవలు స్వామి వారికి ప్రతి ఆదివారం పంచామ్రుత అబిషేక సేవలు నిర్వహిచండం ఆనవాయితీ. ప్రతి నెల స్వామి వారి జన్మ నక్షత్రంమైన హస్తా నక్షత్రం రోజున ఆలయంలో ఉదయం ఏకాంతంగా అభిషేకం, సాయంత్రం తిరుమాడ వీధుల్లో భక్తులు విశేషంగా పాల్గొని ఆరోగ్య ప్రధాత అనుగ్రహం పొందుతారు. ధనుర్మాసం, రథ సప్తమి రోజుల్లో విశేష పూజలు ఆలయంలో నిర్వహిస్తారు. ఆలయంలో పూజా, వేద మంత్రాలతో సూర్యనారాయణ స్వామికి అభిషేకం చేస్తారు. పూజ ముగింపులో, ఈ పూజలో పాల్గొనే భక్తులకు తీర్థం (స్వామి అభిషేకం సమయంలో సేకరించబడింది), ప్రసాదం, పువ్వులు ఇస్తారు. స్వామి వారికి సమర్చించిన అరటి పండ్లు, తులసి, ఆఫిల్, తదితర పండ్లను ఆలయం వెలుపలి భాగంలోని గోవులకు ఆహారంగా అందిస్తారు. ఆ ద్వారా గోమాతను పూజిస్తూ ,గోమూత్రాన్ని సేకరించి తమ ఇంట్లో చల్లుకుంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం . సూర్యనారాయణ స్వామి అభిషేకంతో ప్రయోజనాలు ►కుటుంబ శ్రేయస్సు కోసం, ప్రశాంతమైన మనస్సు, సూర్యుని గ్రహ స్థానం బలాన్ని మెరుగుపరచడానికి. ►వివాహం ఆలస్యం అవుతోంది అన్న భావన కలిగిన భక్తులు స్వామికి అభిషేకం చేయిస్తే వివాహాది కార్యాలు త్వరితగతిన అవుతాయి. ►జంటలు పిల్లలకు ఈ పూజ చేస్తారు. పెళ్లి అయిన స్త్రీలకు త్వరగా గర్బధారణ అవుతుందని భక్తుల విశ్వాసం. ►ఉద్యోగ,వ్యాపారం,ఆస్తుల క్రయ,విక్రయాల్లో అభివృద్ది కోసం వ్యక్తులు ఈ పూజ చేస్తారు. చదవండి: Nagari Hills: నగరికి ఆ పేరు.. దీని వెనుక ఇంత కథ ఉందా! -
శ్రీశైలం క్షేత్రంలో అదొక దర్శనీయ స్థలం.. అక్కడి జలంతో రోగ నివారణ!
సాక్షి, కర్నూలు: శ్రీశైలం మహాక్షేత్రంలోని పేరొందిన దర్శనీయ స్థలాలలో పాలధార–పంచధారలు ఒకటి. శ్రీశైల ప్రధానాలయానికి మూడు కిలోమీటర్ల దూరములో రహాదారిని అనుకొని ఎడమవైపుగల లోయ ప్రాంతమే పాలధార–పంచధార. రోడ్డుమార్గము నుంచి 146మెట్లను దిగి ఈ పాలధార–పంచధారలను చేరుకోవాల్సి ఉంటుంది. నిరంతరం వెలువడే జలధారలు: పాలధార–పంచధారల వద్ద కొండరాళ్ల మధ్య నుంచి ఒక జలధార, మరోకచోట ఐదు జలధారలు ప్రవహిస్తుంటాయి. ఎండా వానలతో సంబంధం లేకుండా నిరంతరం ప్రవహిస్తుండడం ఈ జలధారల విశేషం. క్షణకాల సందర్శనతో క్షణాలను మరిపించే ఈ దివ్యస్థల సందర్శనతో భక్తులు ముగ్దులవుతారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఈ పాలధార–పంచధారలను తప్పనిసరిగా సందర్శిస్తుంటారు. ఆదిదేవుడి నుంచి అవిర్బావం: ఆదిదేవుడైన పరమేశ్వరుడి నుంచే ఈ పాలధార–పంచధారలు ఉద్బవించాయని చెప్తుంటారు. పరమశివుని పంచముఖాలైన సద్యోజాత, వామదేవ, అఘెర, తత్పురుష, ఈశాన్య ముఖాల నుంచి ఉద్భవించినవే పంచధారలని చెబుతారు. ఈ జలధారల ప్రవాహతీరులో ఎంతో విశేషం కూడా ఉంది. నిరంతరం వెలువడే ఈ జలధారలు ముందుకు ప్రవహించకుండా అక్కడికక్కడే అంతరించి పోవడం అశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాగా ఈ జలధారలు తెల్లగా కనిపించడం వల్ల కొందరు దీన్ని పాలధార–పంచధార అని కూడా పిలుస్తారు. మన ప్రాచీన కావ్యాలు ఈ పాలధార–పంచధారలను పావనతీర్థంగా అభివర్ణించాయి. ఆ జలంతో రోగ నివారణ: ఔషధీ సమ్మిళతమైన పాలధార–పంచధారల నీటికి రోగాన్ని నివారించే శక్తి ఉందనే భావన చాలా ప్రసిద్దంగా ఉంది. ఇప్పటికే కొందరు పాలధార–పంచధార జలాలలను పవిత్ర తీర్థగంగగా భావించి రోగాల నివారణకు వాడుతుంటారు. చదవండి: రాయచోటి రాక్ గార్డెన్స్.. శిలల సొగసు చూడతరమా! -
ఏడాదిలో కేవలం ఐదు గంటలే ఆ గుడిని తెరుస్తారట!
ఛత్తీస్గడ్: భారతదేశం దేవాలయాలకు నిలయంగా పిలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల్లో...కొన్ని రహస్యాలు, కొన్ని అద్భుతాలు, మరికొన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఇక ఛార్‌ధామ్ వంటి కొన్ని పుణ్యక్షేత్రాల్లో ఏడాదిలో కొన్ని రోజులు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ప్రస్తుతం అలాంటి ప్రత్యేకత సంతరించుకున్న దేవాలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏడాదిలో కేవలం ఐదు గంటలే దర్శనం ఛతీస్‌గఢ్‌లోని నిరయ్ మాతా ఆలయాన్ని ఏడాదిలో కేవలం 5 గంటలే గంటలే తెరుస్తారట. సమయం తక్కువ ఉండడంతో ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. గరియాబంద్ జిల్లా కేంద్రానికి 12 కి.మి దూరంలో ఉన్న కొండపై ఈ గుడి ఉంటుంది. ప్రతి ఏడాది ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉ.9 గంటల వరకే భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరిగి వచ్చే ఏడాది ఛైత్ర నవరాత్రి వరకు ప్రవేశం ఉండదు. గుడి ప్రత్యేకతలు ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయంలో పూజా విధానం విషయానికొస్తే.. సాధారణంగా దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణలు లాంటి సామగ్రిని ఉపయోగించరు. కేవలం కొబ్బరికాయ, అగరబత్తులతో మాత్రమే అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఐదు గంటలు దర్శన సమయం అనంతరం తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలున్నాయి. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశం నిషేధం ఉంది. ప్రవేశిస్తే చెడు జరుగుతుందని అక్కడి ప్రజలు విశ్వాసమట. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయం
డెహ్రడూన్ : ఆరు నెలల పాటు మంచుతో కప్పబడిన కేథర్నాథ్ ఆలయం బుధవారం ఉదయం 6:10 గంటలకు తిరిగి తెరుచుకుంది. ఏటా ఆలయాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది భక్తజన సందోహం తరలివస్తారు. కానీ కరోనా కారణంగా ఈ సంవత్సరం భక్తులెవరినీ అనుమతించలేదు. తాత్కాలిక ఆలయం దర్శనం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ ప్రధాన పూజారి సహా అతికొద్దిమంది సమక్షంలో ఉదయం విగ్రహాన్ని ఆలయానికి తీసుకువచ్చారు. ( ‘కేదార్‌నాథ్‌తో నాకు ప్రత్యేక అనుబంధం’ ) చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యమైన డోలి యాత్రలో నిజానకి భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కానీ ఈసారి ఆ సందడి లేదు. చార్ధామ్ యాత్రలో యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శించేందుకు ప్రతి సంవత్సరం దేశ, విదేశాల నుంచి లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. కానీ ఈసారి భక్త జన కోలాహాలం లేకుండానే తంతు పూర్తిచేశారు ఆలయ అర్చకులు. ఐదుగురు పండితులు కేథర్నాథ్ ఆలయానికి పంచముఖీ స్వామిని పల్లకిలో తీసుకువచ్చారు. Uttarakhand: Portals of the Kedarnath temple were opened at 6:10 am today. 'Darshan' for the devotees is not allowed at the temple as of now. https://t.co/v4Cj8RQja9 pic.twitter.com/jn5vUBN42N — ANI (@ANI) April 29, 2020 అత్యంత మంచుతో నిండిన ప్రాంతం అయినప్పటికీ పండితులు చెప్పులు లేకుండానే యాత్ర కొనసాగించారు. సాధారణంగా హిందూ పంచాగం ప్రకారం తీర్థయాత్రలు తేదీలు ఫిబ్రవరిలో శివరాత్రి సందర్భంగా నిర్ణయిస్తారు. కానీ ఈ సంత్సరం కరోనా కట్టడి నేపథ్యంలో అన్ని తీర్థయాత్రలను రద్దు చేస్తూ నిర్ణయించారు. కొన్ని ప్రముఖ ఆలయాలకు అనుమతి ఉన్నా భక్తులను దర్శనానికి అనుమతించరు. -
కాశీ నుంచి ఎట్టకేలకు ఇంటికి..
సాక్షి, రాయవరం: కాశీయాత్రకు వెళ్లిన భక్తులు లాక్డౌన్లో చిక్కుకుని, 41 రోజుల అనంతరం ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేవు. మార్చి 16న రాయవరం మండలం సోమేశ్వరం నుంచి బండి మురళీకృష్ణ, రామలక్ష్మి, సబ్బెళ్ల శ్రీనివాసరెడ్డి, సూర్యకుమారి, నున్న పాపయ్యమ్మ, శాకా రామలింగేశ్వరరావు; అనపర్తి మండలం కుతుకులూరు నుంచి సత్తి శ్రీనివాసరెడ్డి, సత్తి సత్యతో పాటు ద్రాక్షారామ, రావులపాలెం తదితర గ్రామాల నుంచి 27 మంది కాశీ యాత్రకు వెళ్లారు. గత నెల 24 నుంచి లాక్డౌన్ అమలు కావడంతో వీరందరూ అక్కడే చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతితో ఈ నెల 14న సొంత ఖర్చులతో వాహనం ఏర్పాటు చేసుకున్నారు. జిల్లాకు చెందిన 27 మంది, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన ముగ్గురు కలిసి మొత్తం 30 మంది ఒకే వాహనంపై ఈ నెల 16న కృష్ణా జిల్లా నందిగామ చేరుకున్నారు. అక్కడ రెండు రోజుల క్వారంటైన్ అనంతరం జిల్లాలోని అన్నవరంలోని క్వారంటైన్ సెంటర్‌కు వారిని తరలించారు. అక్కడి నుంచి వారిని అధికారులు ఆదివారం ప్రత్యేక వాహనంలో స్వస్థలాలకు తరలించారు. వీరందరూ ఆయా మండలాల తహసీల్దార్ కార్యాలయాలకు చేరుకోగా, వారిని వారి నివాసాలకు వెళ్లేందుకు అనుమతించారు. మరో 14 రోజులు ఇళ్ల వద్దే క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. కాశీ నుంచి హైదరాబాద్ బాగానే వచ్చామని, అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే మార్గంలో ఆహారం, తాగునీరు లభించక తీవ్ర ఇబ్బందులు పడ్డామని బండి మురళి తెలిపారు. 17 మంది కాశీ యాత్రికుల రాక పెదపూడి: జి.మామిడాడ, రామేశ్వరం గ్రామాల నుంచి కాశీ యాత్రకు వెళ్లిన 17 మంది ఆదివారం స్వగ్రామాలకు చేరుకున్నారని తహసీల్దార్ కె.రాజ్యలక్ష్మి తెలిపారు. వారిని హోమ్ క్వారంటైన్లో ఉంచుతున్నామని, వారి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. -
శారదా పీఠం చొరవతో వారణాసి నుంచి 44 మంది..
సాక్షి, విశాఖ : వారణాసిలో చిక్కుకుపోయిన 44 మంది తెలుగు రాష్ట్రాల యాత్రీకులు విశాఖ శారదా పీఠం చొరవతో సొంత ప్రాంతానికి చేరుకున్నారు. గత నెలలో వారణాసి విహార యాత్రకు వెళ్లిన 44 మంది తెలుగు రాష్ట్రాల యాత్రీకులు కరోనా ఆంక్షల కారణంగా కాశీలోనే చిక్కుపోయారు. లాక్ డౌన్ విధించిన దగ్గర నుంచి గత మూడు వారాలుగా వారణాసిలోని శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమంలో వారు తలదాచుకున్నారు .ఈ నేపధ్యంలో లాక్ డౌన్ మే మూడవ తేదీ వరకు పొడిగించడంతో యాత్రీకులను సొంత ఉర్లకు చేర్చేలా చొరవ చూపాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామీలను ఆంధ్ర ఆశ్రమ నిర్వాహకులు సుందరశాస్త్రి సంప్రదించారు. ఈ విషయాన్ని విశాఖ శారదా పీఠాధిపతులు అధికారుల దృష్డికి తీసుకెళ్లగా.. శారదా పీఠాధిపతులు, ఏపీ అధికారుల చొరవతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సైతం స్పందించి యాత్రీకులకు ప్రత్యేక అనుమతి మంజూరు చేసి పాస్‌లు ఇచ్చారు. దీంతో వీరంతా ప్రత్యేక బస్సులో వారణాసి నుంచి బయలుదేరారు. యాత్రీకులకి మార్గమధ్యంలో ఆహార కొరత లేకుండా భోజన ప్యాకెట్లను విశాఖ శారదాపీఠం వారణాసి శాఖ ఆంధ్ర ఆశ్రమం అందజేసింది. ఇందులో విశాఖ జిల్లాకే చెందిన 33 మంది యాత్రీకులు అర్ధరాత్రి విశాఖ చేరుకోవడంతో వారందరినీ వైద్య పరీక్షలకి ఆసుపత్రికి తరలించారు. -
వారికి ఢిల్లీలోనే అంటిందా?
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ మత ప్రచార కార్యక్రమం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కలకలం రేపుతోంది. ఢిల్లీలో జరిగిన ఆ మత ప్రచార కార్యక్రమానికి వెళ్లి వచ్చిన వారిలో చాలామందికి ఇప్పుడు కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా కారణం గా ఓ వృద్ధుడు (74) మరణించాడు. అతడు కూడా ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమానికి హాజరయ్యాడని తెలియడం నగరవాసుల్లో ఆందోళనకు కా రణమవుతోంది. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే వేడుక కు వెళ్లి వచ్చి కరోనా లక్షణాలతో గాంధీలో చేరాడు. అతని నలుగురు కుటుంబ సభ్యులకు, పాతబస్తీలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరో నా పాజిటివ్ వచ్చింది. వీరంతా ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమానికి హాజరైనవారే. అదే కార్యక్రమానికి వెళ్లివచ్చిన నిజామాబాద్‌లోని ఖిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఈ అనుమానాలకు మరింత బలమిచ్చింది. సదరు వేడుకకు వెళ్లిన పలువురు ఏపీ పౌరులకూ కరోనా పాజిటివ్ అని తేలడం గమనార్హం. వారంతా పాజిటివే..! ఢిల్లీలో జరిగిన మత ప్రచార కార్యక్రమానికి ఇం డోనేసియా నుంచి వచ్చిన మతబోధకులు హాజ రయ్యారు. వారందరిలోనూ అప్పటికే కరోనా లక్షణాలు ఉన్నాయి. అలా ఆ కార్యక్రమానికి వెళ్లి న వారికీ వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇదే బృందానికి చెందిన కొంద రు ఇండోనేసియన్లు తెలంగాణ, తమిళనాడు రా ష్ట్రాల్లో పర్యటించారు. వారందరిలోనూ కరోనా పాజిటివ్ లక్షణాలు ఉండటంతో వారి ద్వారా స్థానికులకూ వ్యాపించింది. ఇండోనేసియాకు చెందిన పదిమందిS బృందం కరీంనగర్లో పర్యటించడం ఎంత కలకలానికి కారణమైందో తె లిసిందే. అలాగే తమిళనాడులోనూ వీరు పర్యటించడం అక్కడ కూడా కరోనా అలజడికి కారణమైంది. రైల్లోనే తెలుగు రాష్ట్రాలకు.. ఢిల్లీలో జరిగిన సదరు కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 1,500 నుంచి 2,000 వరకు హాజరైనట్లు సమాచారం. కార్యక్రమం అనంతరం కొందరు విమానాల్లో, అధికశాతం రైల్లోనే తెలుగు రాష్ట్రాలకు వచ్చారు. ఇప్పటికే వారిలో కొన్ని కుటుంబాలు కరోనా బారినపడ్డాయి. ఆ కుటుంబాలతో సఖ్యతగా ఉన్న వారు కూడా ఇప్పుడు తమలో ఏ క్షణాన వ్యాధి లక్షణాలు బయటపడతాయోనని భయపడుతున్నారు. మరోవైపు రైలు ప్రయాణం చేసిన కోవిడ్ బాధితుల ద్వారా ఆ వ్యాధి వారికి తెలియకుండానే ఎంతమందికి వ్యాపించి ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఢిల్లీకి వెళ్లి వచ్చినవారి లెక్క తేలితే గానీ ఈ విషయంలో ఒక స్పష్టతకు రావడం కష్టమంటున్నారు అధికారులు. -
మహాశివరాత్రి: కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు
-
26 నుంచి రాష్ట్ర వాసుల హజ్ యాత్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి హజ్ యాత్ర– 2019కు వెళ్లే యాత్రికుల విమాన షెడ్యూల్‌ను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ మసీవుల్లాన్ సోమవారం విడుదల చేశారు. నాంపల్లి హజ్ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బృందం ఈ నెల 18న నగరం నుంచి హజ్ యాత్రకు బయలుదేరిందని తెలిపారు. తెలంగాణ హజ్ యాత్రికుల ప్రయాణ తేదీలు ఖరారయ్యాయని వెల్లడించారు. రాష్ట్ర యాత్రికులు మొత్తం 15 విమానాల ద్వారా ఈ నెల 26 నుంచి 30 వరకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణం అవుతారని చెప్పారు. రాష్ట్ర హజ్ యాత్రికుల మొదటి బృందం ఈ నెల 26న రాత్రి 8:25కి జిద్దాకు ప్రయాణం అవుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,685 మంది యాత్రికులు ఈ ఏడాది హజ్ కమిటీ ద్వారా యాత్రకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30 నుంచి ఆగస్టు 4 వరకు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర యాత్రికులు హజ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపారు. -
తెరుచుకున్న కేదార్నాధ్ ఆలయం
-
కేధార్నాథ్కు పోటెత్తిన భక్తులు
ఉత్తరాఖండ్: ఆరు నెలల అనంతరం కేధార్నాథ్ ఆలయం గురువారం తెరుచుకుంది. దీంతో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం తరలి వచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మరోవైపు రేపటి నుంచి బద్రీనాథ్ ఆలయ దర్శనం ప్రారంభం కానుంది. కాగా చార్ధామ్ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్–నవంబర్ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఇక అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు గంగ, యమునా దేవతల విగ్రహాలను ముకాభా, కర్సాలీ నుంచి తీసుకొచ్చి పునఃప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. -
రిప్ వాన్ వింకిల్
హడ్సన్ నది మీద ఎగువకు ప్రయాణం చేసిన వారంతా కాట్స్ కిల్ పర్వతాలను చూసి ఉంటారు. హడ్సన్ నదికి పశ్చిమంగా ఎత్తుగా హుందాగా నిలబడిన ఈ పర్వతాలు ఆ పరిసర ప్రాంతాన్నంతా పరిపాలిస్తున్నట్లుగా ఉంటాయి. ఈ దేవతా పర్వతాల పాదతలం వద్ద నీలిరంగు మెరక నేలలూ, సమీపంలో కనిపించే పచ్చని బయళ్ళూ కలిసే చోట చెట్ల గుబురుల మధ్య తెల్లని ఆవిరిపొగలు కక్కే ఒక పల్లె ఉన్న సంగతి ఈ ప్రాంతాన్ని చూసి వచ్చిన యాత్రికులకు గుర్తు ఉంటుంది. ఆ పల్లె అతి ప్రాచీనమైన ఒక చిన్న వలస. అమెరికాకు యూరోపియన్లు మొట్ట మొదట వలస వచ్చిన రోజులలో డచ్ వలసదారులు ఆ పల్లెను కట్టుకున్నారు. ఆ పల్లెలోనే చాలా కాలం క్రిందట, పరమసాధువైన ఒక నిరాండబరమైన వ్యక్తి ఉంటుండేవాడు. అతని పేరు రిప్ వాన్ వింకిల్. ఇతడి వంశం కీర్తి ప్రతిష్ఠలు గలది.అయితే రిప్కి తాతముత్తాతల ప్రచండ శౌర్య సాహసాలు మాత్రం అబ్బలేదు. భార్య పట్ల భయభక్తులతో ప్రవర్తించే పరమసాధు భర్త. ఈ గుణమే అతని విశ్వవిఖ్యాతికి ముఖ్య హేతువేమో! గయ్యాళి భార్య కూడా ఒక విధంగా అదృష్టవంతులకు భగవద్దత్తంగా లభించే వరప్రసాదమనే చెప్పాలి. ఈ విషయం ఒప్పుకుంటే, రిప్‌వాన్ వింకిల్ మహా అదృష్టవంతుడన్న మాట కూడా ఒప్పుకున్నట్టే!ఆ గ్రామంలోని ఇళ్ళ వాళ్ళందరికీ అతడంటూ అమితమైన ఆదరభావం. అతని జీవితంలో ఒక లోపం ఉంది. తనకు లాభసాటి పని ఏదన్నా అతనికి ఎంతమాత్రం గిట్టేది కాదు. ఎంత కష్టమైన పనిలో అయినా సరే, ఇరుగుపొరుగు వారికి సాయపడేవాడు. తన ఇంటిపని తప్ప మరెవరి పనైనా సరే అతి శ్రద్ధగా చేసిపెట్టేవాడు.ఇక అతని బిడ్డలు: చింకి దుస్తులు కట్టుకొని గాలికి పుట్టి ధూళికి పెరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటారు. కొడుకు చిన్న రిప్ ముమ్మూర్తులా తండ్రి నోట్లోంచి ఊడి పడ్డట్టు ఉంటాడు. ఎప్పుడూ తల్లి వెంటబడి తిరుగుతూ ఉండేవాడు. రిప్ వాన్ వింకిల్ ఈ ప్రపంచంలో దేనికీ ఉబ్బితబ్బిబ్బు అయ్యే రకం కాదు. రూపాయి కోసం నానా గడ్డి కరిచే కంటే బటానీ గింజలతో కాలక్షేపం చేస్తూ నిశ్చింతగా బతకవచ్చుననే బాపతు మనిషి. లోకం అతని బతుకు అతనిని బతకనిస్తే, జీవితమంతా అంతులేని తృప్తితో ఈల వేసుకుంటూ గడిపి వేయగలడు. కాని, ఇంట్లో భార్యే అతనికి అవకాశం ఇవ్వడం లేదు. భర్త సోమరితనం, నిర్లక్ష్యం గురించీ అస్తమానం అతని చెవిలో జోరిగలాగ అరవడం ఆమెకు అలవాటైపోయింది. ఇంట్లో రిప్ని కనికరంతో చూసేది అతని కుక్క సర్దార్ ఒక్కటే! దానికి కూడా, దాని యజమానికిలాగే ఆ గృహిణి అంటే హడలు. బహుశా ఇదే ఈ స్నేహానికి కారణం అయి ఉండవచ్చు. సోమరితనంలో వీళ్ళిద్దరూ సహాధ్యాయులని ఆమె నిశ్చితాభిప్రాయం.పాపం! రిప్ జీవితం నిరాశమయమైపోయింది. పొలంలో పనినించీ, తన భార్య తిట్ల నుంచీ తప్పించుకోవడానికి ఇక అతనికి ఒక్కటే ఉపాయం మిలిగింది. తుపాకీ చేతబట్టుకుని వేటకు చల్లగా అడవికి పోవడం. అలాంటి ఒక స్వేచ్ఛా వనవిహరం సందర్భంలో రిప్ యాథాలాపంగా కాట్స్కిల్ పర్వతాలలోని ఒక అత్యున్నత ప్రదేశానికి ఎక్కి వెళ్లాడు. తిరిగి, తిరిగి, చివరికి అలసి ఆయాసపడుతూ పోయి ఒక గుట్ట మీద పచ్చగడ్డి పెరిగి ఉన్న దిమ్మ మీద కూలబడ్డాడు. రిప్ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఆలోచిస్తూ పడుకున్నాడు. చీకటి పడేలోగా తాను ఇంటికి చేరుకొనవలెననే విషయం రిప్కు చప్పున స్ఫురణకు వచ్చింది. దాంతో మళ్లీ ఇంటివద్ద తన గృహిణి చేయబోయే హంగామాను గురించి ఆలోచించుకుంటూ ఒక్కసారిగా గాఢంగా నిట్టూర్చాడు. కిందికి దిగడానికి లేచేసరికి, ఎక్కడో దూరం నించి ‘రిప్ వాన్ వింకిల్!’ అంటూ పెద్ద కేక వినిపించింది. చుట్టూ తిరిగి చూశాడు. పర్వతం మీదుగా ఒంటరిగా ఎగిరిపోతూన్న ఒక కాకి తప్ప ఎక్కడా ఎవరూ కనిపించలేదు. భ్రమ పడ్డానేమో అనుకుని, మళ్లీ కొండ దిగడం మొదలు పెట్టాడు. మళ్లీ అదే పిలుపు! ఒక విచిత్ర వ్యక్తి వీపు మీద పెద్ద బరువుతో కృంగిపోతూ తన వంకకే ఎక్కి వస్తున్నాడు. ఒత్తుగా పెరిగిన తెల్లగడ్డం అతని ముసలితనాన్ని బయట పెడుతోంది. భుజం మీద పెద్ద సారా జాడీ ఉంది. ఈ బరువు మోసుకుని పోవడానికి కొంచెం సహాయపడతావా? అన్నట్లుగా రిప్కి సంజ్ఞ చేశాడు. ఈ నూతన మిత్రుని గురించి కొంత అనుమానం ఉన్నప్పటికి అంగీకరించాడు రిప్. ఆ జాడీని చెరి కాసేపు మోస్తూ, మెల్లగా ఆ లోయ వెంట ఇంచుమించు పాకుతూ ఇద్దరూ పైకి ఎక్కారు. కొండపైకి ఎక్కిన కొద్ది ఆగి ఆగి ధణధణమంటూ పెద్ద చప్పుడు ఏదో వినబడుతూంది. ఆ కొండల్లో ఎక్కడో ఉరుములు మెరుపులతో హఠాత్తుగా కురిసే వర్షపు చప్పుడు అయి ఉండవచ్చునని సమాధానం చెప్పుకుని మళ్ళీ ముందుకు సాగాడు. సర్కస్ వలయంలాంటి పల్లపు ప్రదేశానికి చేరగానే వింత వింత దృశ్యాలు కనిపించినయి. చదునుగా ఉన్న ఒకచోట కొతమంది విచిత్రవ్యక్తులు ‘తొమ్మిది మేకుల బంతాట’ ఆడుతున్నారు. వారి నడుముకి బిగించి ఉన్న పట్టాల నించి పొడవాటి పట్టా కత్తులు వేలాడుతున్నాయి. వారి ముఖాలు అదో మాదిరి ఉన్నాయి. రంగురంగుల గడ్డాలు ఉన్నాయి. ఈ వ్యక్తులంతా కులాసాగా ఆడుకుంటున్నప్పటికీ వారి ముఖాలన్నీ అతి గంభీరంగా ఉండడం, ఎవరూ ఏమీ మాట్లాడకపోవడం రిప్కి ఆశ్చర్యంగా తోచింది. మధ్యమధ్య వాళ్లు బంతులు దొర్లించినప్పుడు అయ్యే శబ్దం మాత్రం ఉండుండి పెద్ద ఉరుములాగ ఆ లోయ అంతటా మారుమోగుతూంది. రిప్, అతని సహచరుడు వారిని సమీపించే సరికి, వాళ్లు ఆట మానేసి, ప్రతిమలాగ నిలబడి కళాకాంతులు లేని ముఖాలతో వికృతంగా చూస్తున్నారు. దాంతో రిప్ గుండెల్లో మోత ప్రారంభమైంది. ఈలోగా అతని అనుచరుడు ఆ జాడీలోని సారాను కూజాల్లో నింపాడు. గోష్ఠిలోని వ్యక్తులందరూ మాటా పలుకు లేకుండానే మస్తుగా సారా తాగేసి మళ్లీ ఆట మొదలుపెట్టారు. ఎవరూ తనవైపు చూడకుండా ఉన్నప్పుడు కొంచెం పానీయం రుచి చూశాడు రిప్. అది హాలెండ్ దేశపు అమృతంలాగ ఉంది. కొసరి కొసరి దఫాల వారీగా ఆ కూజాలను వంపి కడుపు నింపేశాడు. క్రమంగా మైకం క్రమ్మడం ఆరంభించింది. ఎన్నడూ ఎరగని గాఢనిద్రలో మునిగిపోయాడు. నిద్రలేచి చూసేసరికి, పర్వతం మీది పచ్చికతిన్నె మీద పడుకుని ఉన్నాడు. కళ్లు నులుముకొని చుట్టూ చూశాడు. వెచ్చవెచ్చగా పొద్దెక్కుతున్న ఉదయసమయం. తెల్లవార్లూ ఇక్కడే నిద్రపోయి ఉంటానా? ఉండను బహుశా అనుకున్నాడు. ‘‘ఆ కూజా మందే నా కొంప తీసింది! ఏం జవాబు చెప్పుకొని ఏడవను, మా ఇంటావిడకి?’’ అనుకున్నాడు. తుపాకి కోసం కలయ చూశాడు. ఎప్పుడూ నిగనిగలాడే తన తుపాకీకి బదులు తుప్పు పట్టిన తుపాకీ ఒకటి తన కంటపడింది. ఆ లోయలోని రాక్షసులు తనను మంత్రించి, ఆ సారాతో స్మృతి లేకుండా చేసి తన తుపాకి కాజేశారని రిప్ అనుమానం. పైగా, తన సర్దార్ కూడా కనిపించడం లేదు. ఈల వేసి పిలిచాడు. ‘సర్దార్’ అని అరిచాడు. సర్దార్ జాడలేదు. కష్టం మీద ఎల్లాగో కాళ్లూ చేతులూ స్వాధీన పరుచుకుని నిమ్మళంగా ఆ లోయలోకి దిగాడు. ఉదయం ఆహారమేమీ లేకపోవడంతో చాలా నిస్సత్తువగా ఉంది. కుక్కా, తుపాకీ పోవడం అతని మనస్సు మనస్సులో లేదు. మరొక వంక ఇంటికి పోయి, భార్య ఎదుట పడడానికి దమ్ములు లేవు. అలా అని ఇంటికి వెళ్లకుండా ఈ కొండల మధ్య ఆకలితో మాడి చచ్చిపోవడమెలాగు? తుప్పు పట్టిన తుపాకీ తీసి భుజాన పెట్టాడు. ఆందోళన, ఆవేదనతో ఇంటిదారి పట్టాడు. ఊరు సమీపిస్తున్న కొద్దీ అతనికి చాలామంది ఎదురవుతున్నారు. కాని వారిలో పరిచితుడొక్కడూ కనిపించకపోవడం ఆశ్చర్యం వేసింది. వాళ్ల దుస్తులు కూడా ఏమిటో కొత్తగా ఉన్నాయి. ఎదురైన ప్రతి వ్యక్తి తన వంక ఆశ్చర్యంగా ఎగాదిగా చూసి, తన గడ్డాన్ని నిమురుకుని చూసుకుంటున్నాడు. అందరూ అలా చూస్తూండడంతో అప్రయత్నంగా రిప్కి కూడా చెయ్యి తన గడ్డం మీదికి పోయింది. దాంతో తనకు పొడుగైన గడ్డం పెరిగిందని గ్రహించి ఆశ్చర్యపోయాడు. ఊరి పొలిమేరల్లోకి వచ్చేశాడు. వింత వింత దుస్తులు వేసుకున్న కుర్రవాళ్లంతా తెల్లగా నెరిసిన అతని పెద్ద గెడ్డాన్ని చూసి నవ్వుతూ, నానా హంగామా చేస్తూ వెంటబడ్డారు. ఎటు చూసినా, ఏది చూసినా, ఇంద్రజాలంలోలాగ మారిపోయింది. ఆ క్రిందటి రోజే తానక్కడి నించి వెళ్లాడు. ఇంతలోనే గ్రామమంతటా ఏమిటీ మార్పు! మొత్తం మీద అది తన గ్రామమే! అందులో సందేహమేమీ లేదు. కష్టం మీద దారి గుర్తు తెచ్చుకుంటూ, ఏ క్షణంలో ఎటు నుంచి తన భార్య కఠోర కంఠస్వరం వినిపిస్తుందో అని ప్రాణాలు బిగపట్టుకుని తన ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇల్లంతా పాడుపడి ఉంది. తిండి లేక మాడి చావడానికి సిద్ధంగా ఉన్న సర్దార్ పోలికలున్న కుక్క ఒకటి అక్కడ తారట్లాడుతూంది. ‘సర్దార్’ అని పిలిచాడు. కాని, ఆ కుక్క పళ్లు బిగబట్టి మూల్గుతూ ప్రక్కకు తొలిగిపోయింది. ‘‘నా కుక్క కూడా నన్ను మరిచిపోయిందా?’’ అని నిట్టూర్చాడు.స్వగృహంలోకి ప్రవేశించాడు రిప్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఎంత చాకిరీ చేసినా రిప్ భార్య ఆ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచేది. ఇప్పుడు ఇల్లు దెయ్యాలకొంపలాగ ఉంది. గొంతు సవరించుకొని భార్యాపిల్లలను పేరు పేరునా పిలిచాడు. ఆ పాడు గోడల మధ్య అతని కంఠస్వరమే వినిపించింది. మళ్ళీ ఎప్పటి నిశ్శబ్దమే! ఏమీ బోధ పడక అక్కణ్ణించి తాను మాములుగా రోజూ వెళ్లి కాలక్షేపం చేసే సత్రం దగ్గరకు వెళ్ళేసరికి, ఆ సత్రం అక్కడ లేనే లేదు. దాని స్థానంలో, కలప చెక్కలతో కట్టిన పాత ఇల్లొకటి ఉంది. ఆ ఇంటి తలుపు మీద ‘యూనియన్ హోటల్ –ప్రొప్రయిటర్: జొనాథన్’ అని రాసి ఉంది. ఆ హోటలు ద్వారం వద్ద జనం గుంపుగా మూగి ఉన్నారు. అందులో ఒక్క ముఖమూ రిప్ గుర్తు పట్టలేదు. అతిగా పెరిగిపోయి గడ్డంతో, మకిలి దుస్తులతో, వెంటబడి వస్తూన్న పిల్లమూకతోను, కొందరు ఆడవాళ్లతోను అక్కడికి రిప్ వచ్చేసరికి గ్రామీణ రాజకీయవేత్తలందరి దృష్టులు ఒక్కసారిగా అతనిపై పడ్డాయి. వాళ్లంతా ఆయన చుట్టూ మూగారు. ఆశ్చర్యంతో ఎగాదిగా చూశారు. ఉపన్యాసకుడు అతని జబ్బ పట్టుకొని కొంచెం పక్కకు తీసుకెళ్లి ‘‘ఇంతకీ తమరు ఏ పక్షానికి ఓటు చేయదలుచుకున్నారు?’’ అని రహస్యంగా అడిగాడు. రిప్ ఆ మాటలకి అర్థం తెలియక అయోమయంగా అలాగే చూస్తూ నిలబడిపోయాడు. పొట్టివాడొకడు రిప్ చెవిలో మెల్లగా ‘‘తమరిది ఫెడరల్ పక్షమా? డెమోక్రాట్ పక్షమా?’’ అని అడిగాడు. రిప్కు ఈ ప్రశ్న మరింత అయోమయంగా తోచింది. ఒక టోపీ పెద్దమనిషి జనాన్ని నెట్టి దారి చేసుకుంటూ రిప్ ఎదుటికి వచ్చి ‘‘ఎవరయ్యా నువ్వు? తుపాకి భుజాన పెట్టుకుని, అల్లరి మూకని వెంటబెట్టుకుని ఎన్నికల కేంద్రానికి రావడంలో నీ ఉద్దేశమేమిటి? ఈ గ్రామంలో తిరుగుబాటు లేవదీద్దామనా?’’ అన్నాడు. ‘‘అయ్యో! ఖర్మా! నేనో నిర్భాగ్యుణ్ణి. నాది ఈ ఊరే. నేను చక్రవర్తి ప్రభుత్వానికి పూర్తిగా విధేయుణ్ణి’’ అన్నాడు. ఈలోపు ‘‘చక్రవర్తి గూఢచారి, కాందీశికుడు. పట్టుకోండి. తన్నండి’’ అంటూ కేకలు బయలుదేరాయి. ‘‘అసలు నువ్వేం పనిమీదొచ్చావయ్యా ఇక్కడికి? ఎవరి కోసం?’’ అని మళ్ళీ రిప్ని ప్రశ్నించాడు టోపీ పెద్దమనిషి. ‘‘నేను ఎవ్వరికీ ఏ విధమైన హాని కలిగించడానికి రాలేదు. వెనక ఇక్కడ ఉండిన సత్రం అరుగు మీద రోజూ కలుసుకుంటూ ఉండిన మా ఇరుగు పొరుగు స్నేహితుల్లో ఎవరైనా కనిపిస్తారేమోనని వచ్చాను’’ అన్నాడు. ‘‘ఎవరా స్నేహితులు చెప్పు?’’ రిప్ ఒక్క నిమిషం ఆలోచించి ‘‘నికోలస్ వెడ్డర్గారు ఎక్కడ ఉన్నారు?’’ అని అడిగాడు. ‘‘ఆయన మరణించి అప్పుడే పద్దెనిమిదేళ్లయిందిగా!’’ అన్నాడు ఒక వృద్ధుడు. ‘‘పోనీ, బ్రూమ్ డచ్చర్గారు ఉన్నారా?’’ ‘‘స్టోనీపాయింట్ దగ్గిర యుద్ధంలో చచ్చిపోయాడంటారు’’ తన ఇల్లూ, స్నేహితులూ, గ్రామం ఇంతలో ఇంత దారుణంగా మారిపోయి, ప్రపంచంలో తాను ఒంటరివాడయిపోవడం రిప్కి అమిత విచారం కలిగించింది. నిస్పృహతో ‘‘పోనీ, ఇక్కడ ఎవరైనా రిప్ వాన్m వింకిల్ని ఎరుగుదురా?’’ అని అడిగాడు. ‘‘ఎరక్కేం?’’ అన్నారు వెంటనే ఇద్దరు ముగ్గురు ఒకేసారి. ‘‘అడుగో! ఆ ఎదురు గుండా ఉన్న చెట్టునానుకుని కూచున్నాడు చూడు, ఆ అవతారమే రిప్ వాన వింకిల్!’’ రిప్ అటుకేసి చూశాడు. సరిగా ముమ్మూర్తుల తనలాగే, తాను పర్వతం మీదికి వెళ్లే రోజున ఉన్నట్టే కనిపిస్తున్న ఒక వ్యక్తి ఆ చెట్టునానుకుని కూచొని ఉన్నాడు. అసలు తా నెవరు? రిప్ వాన్ వింకిల్ కాదా? ఏమిటీ మాయ? ఈ కంగారంతా చూసి, టోపీ పెద్దమనిషి మళ్లీ కలిపించుకుని, అతని ఊరూ పేరూ అడిగాడు. ‘‘ఏమో! ఆ భగవంతుడికే తెలియాలి’’ అన్నాడు పిచ్చివాడిలాగ రిప్. ‘‘వాడెవడో నా వేషం వేసుకుని బతుకున్నాడు. నిన్న రాత్రి దాకా మామూలుగానే ఉన్నాను. రాత్రి ఆ పాపిష్టి పర్వతం మీద పడుకొని నిద్రపోయాను. వాళ్లు నా తుపాకీ మార్చేశారు. అంతా మారిపోయింది. నేను మారిపోయాను. ఇప్పుడు నా పేరేమిటో, నే నెవర్నో చెప్పలేను....చెప్పలేను’’ అన్నాడు. ఒక స్త్రీ చంకలో పిల్లవాడి నెత్తుకొని ఈ పొడుగు గడ్డం ముసలాన్ని తేరిపార చూడడానికి బాగా దగ్గిరికి వచ్చింది. తెల్లగడ్డం తాతను చూసి పసివాడు ఏడవడం మొదలు పెట్టాడు. ఆ పాపడి పేరూ, ఆ తల్లి రూపం, ఆమె కంఠస్వరం రిప్ మనస్సులో మరొక తుఫాన్ కెరటాన్ని రేపినయి. ఆయనకు ఏవేవో జ్ఞాపకానికి వస్తున్నయి.‘‘తల్లీ! నీ పేరేమిటమ్మా?’’ అని అడిగాడు.‘‘జూడిత్ గార్డెనీర్’’‘‘మీ తండ్రి పేరు?’’‘‘అయ్యో! మా తండ్రా? మా నాయన పేరు రిప్ వాన్ వింకిల్. ఇరవయేళ్ళ క్రిందట తుపాకి పట్టుకుని, వేటకని ఆ పర్వతాల్లోకి వెళ్ళాడు. ఇంత వరకు తిరిగి రాలేదు. మా నాన్నతో పాటు వేటకి వెళ్లిన కుక్కమాత్రం ఇంటికి తిరిగి వచ్చేసింది. ఆ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడో, లేక ఎర్ర ఇండియన్లే ఎత్తుకు పోయారో తెలియదు. అప్పటికి నాకు బాగా చిన్నతనం’’ అంది.రిప్ అడగదలుచుకున్న ముఖ్యమైన ప్రశ్న ఒక్కటి మాత్రం మిగిలిపోయింది. నసుగుతూ, తొట్రూపడుతూ అడిగాడు ‘‘అయితే మీ అమ్మ...ఇప్పుడెక్కడుంది?’’‘‘తర్వాత కొన్నాళ్ళకి మా అమ్మ కూడా చచ్చిపోయింది. న్యూ ఇంగ్లండ్ నించి వచ్చిన ఒక వర్తకుడిపైన కోపం వచ్చి అరుస్తూ, ఆ ఉద్రేకంలో ఒక రక్తనాళం పగడలం వల్ల చనిపోయింది. ఈమాట విన్న మీదట రిప్ ముఖంలోని ఆరాటం కొంత ఉపశమించింది. ఇక నిగ్రహించుకోలేకపోయాడు. ‘‘తల్లీ! నేనే మీ నాన్ననమ్మా! గుర్తు పట్టలేవా?’’ అని అరిచాడు. దాంతో, అంతా దిగ్భ్రాంతులై నిలబడిపోయారు. ఇంతలో ఒక మూడు కాళ్ల ముసలి అవ్వ కళ్లకి చెయ్యి అడ్డుపెట్టుకొని చూస్తూ ‘‘అయ్యో! ఇంకా సందేహమేమిటి? రిప్ అన్నయ్యే! రా అన్నయ్యా! రా....ఎన్నాళ్ళకెన్నాళ్ళకి కనపడ్డావ్ అన్నయ్యా! ఇంతకీ ఎక్కడున్నావు ఇన్నాళ్లనించీ’’ అంటూ ఆయాసం వచ్చేటంత సంభ్రమంతో అనేసింది.‘‘ఆ ఇరవై సంవత్సరాలు నాకు ఒక్క రాత్రి నిద్రలో గడిచిపోయినయి’’ అంటూ రిప్ నిట్టూర్చి తన కథ అంతా చెప్పడం మొదలుపెట్టాడు. అక్కడి వాళ్లంతా, కళ్ళింతవి చేసుకుని ఆ చిత్రకథంతా విన్నారు.ఒకరి ముఖాలొకరు చూసుకునే వాళ్లు కొందరు, ఈ పారవశ్యం కొంచెం ఉపశమించిన పిమ్మట ఆ టోపీపెద్దమనిషి కొంచెం నిదానించి చూశాడు. అదే సమయానికి రోడ్డు మీదనించి పోతున్న వృద్ధుడు పీటర్వాండెర్ డాంక్ అభిప్రాయం కనుక్కొని అలా చెయ్యడానికి అంతా తీర్మానించారు. అతడు ఆ రాష్ట్ర ప్రాచీన చరిత్ర రచించిన పీటర్ వాండెర్ డాంక్ వంశస్థుడు. ప్రస్తుతం అతడే ఆ గ్రామానికి వృద్ధ పితామహుడు. ఆయన రిప్ని తేలికగా గుర్తు పట్టాడు. అతడు చెప్పిన విషయాలన్నింటిని సంతృప్తికరగా ధ్రువపరిచాడు. కాట్స్ కిల్ పర్వతాలలో చిత్రవిచిత్ర వ్యక్తులు కనిపించేవారన్నమాట తాను తన పూర్వుల దగ్గర చాలాసార్లు విన్నట్టు ఆయన చెప్పాడు. అచటి హడ్సన్ నదినీ, ఆ ప్రాంతాన్నీ మొదట కనిపెట్టిన హెండ్రిక్ హడ్సన్ అనే మహా పురుషుడు ఇరవయేళ్ళ కొకసారి ఆ ప్రాంతానికి వచ్చి పోతూ ఉంటాడనీ, వచ్చి ఆ నదినీ, ఆ నది పేరుతోనే దాని ఒడ్డున ఏర్పడిన నగరాన్నీ సందర్శించడానికి హెండ్రిక్కీ, ఆయన ‘హాఫ్ మూన్’ పరివారానికీ అనుమతి ఉన్నదని కూడా తాను విన్నాడు. ‘‘ఇదంతా ఎందుకు? ఒక వేసవి సాయంకాలం పెద్ద ఉరుముల్లా వినిపించే వాళ్ల బంతులు దొరలిన చప్పుళ్లు నేనే స్వయంగా వినడం కూడా తటస్థించింది’’ అన్నాడు. ఇక కథ క్లుప్తంగా చెప్పేస్తాను. క్రమంగా ఆ గుంపులో జనమంతా చెదరిపోయి, అంతకంటే ఎక్కువ ముఖ్యమైన తమ ఎన్నికల పని చూసుకోటానికి వెళ్లిపోయారు. రిప్ కూతురు తండ్రిని వెంట బెట్టుకొని పోయి తన ఇంట్లోనే ఉంచుకుంది. ఆమెకు సంపన్నుడూ అయినా పెనిమిటీ, సర్వ సౌకర్యాలు గల మంచి ఇల్లూ ఉన్నాయి. తన అల్లుడు చిన్నతనంలో తన భుజాల మీద ఎక్కి ఆడుకున్న పొరుగు పిల్లలలో ఒకడని తెలిసి రిప్ సంతోషించాడు. రిప్ కొడుకూ, వారసుడూ అయినా చిన్న రిప్ ముమ్మూర్తులా తండ్రికి నకలుగా తయారయ్యాడు. ఒకచోట పొలం పనికి కుదిరాడు. అయితే, పూర్తిగా తండ్రికి పోలిక రావడం వల్ల, అతడు తన పని మినహా తక్కిన పనులు మాత్రమే చేస్తున్నాడు. రిప్ యథాప్రకారం పూర్వపు షికార్లు, ఇతర దైనందిన కార్యక్రమాలు ప్రారంభించాడు. వెనకటి స్నేహితులలలో మిగిలి ఉన్న వారందరితో మళ్ళీ తన పరిచయాలు పునరుద్ధరించుకున్నాడు. కాని వాళ్లందరిలో కాలం చాలా మార్పు తెచ్చింది. అందువల్ల అంతకన్నా కొత్త తరం వాళ్ళే మేలని,. కొందరు కొత్త స్నేహితుల్ని సంపాదించాడు. ఈ ముఠా అంతటికీ రిప్ గురువు. ఇంటి దగ్గర చేసేందుకు పని ఏమీ లేక పోడవం వల్లనూ, సోమరితనం దోషం కాని సుఖమయిన వయస్పు వచ్చినందువల్లనూ ఈ తడవ నిశ్చింతగా అతడు రోజూ సత్రం అరుగు మీద కొలువు తీర్చి గోష్ఠులు నడుపుతున్నాడు. ఆ గ్రామస్థులంతా అతణ్ణి ఆ గ్రామ పితామహుల్లో ఒకడుగా గౌరవిస్తున్నారు. యుద్ధానికి పూర్వపు రోజుల్లో సంగతులు వినడం కోసం వచ్చే పనీ పాటా లేని పడుచు వాళ్ళంతా ఆయనకు నిత్యసభాసదులు. అయినా, అతని ‘నిద్రాయుగం’లో జరిగిన విచిత్ర సంఘటనలన్నీ విని గ్రహించి, ఆనాటి మానవులలో ఒకడుగా చలామణీ అవడానికి అవసరమైన ప్రాతిపదిక పరిజ్ఞానం రిప్కి అటు తరువాత కొంత కాలానికి గాని అలవడలేదు. దేశంలో చిన్న సంఘర్షణగా బయలుదేరిన విప్లవం క్రమంగా చినికి చినికి గాలివాన అయి పెద్ద యుద్ధంగా ఎలా పరిణమమించినదీ, దాని ఫలితంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు పాత ఇంగ్లండు దేశీయుల పరిపాలన ఎలా తప్పిపోయిందీ తెలుసుకున్నాడు. వెనకటిలాగ, తాను జార్జి చక్రవర్తి ప్రజలలో ఒకడు కాడనీ, అమెరికా సంయుక్త రాష్ట్రపు స్వతంత్ర పౌరుడనీ లీలగా గ్రహించాడు. రిప్ రాజకీయవేత్త కాడు.అందువల్ల రాజ్యాలు, సామ్రాజ్యాలూ తారుమారైనా ఆయనలో వచ్చే మార్పు ఏమీ లేదు. కాని, ఒక అధికార దౌర్జన్యాన్ని మాత్రం సహించలేక పోయేవాడు. అది ఎంతటి బాధాకరమో వెనక ఆయన స్వగృహంలో అనుదిన స్వానుభవ పూర్వకంగా గ్రహించినవాడు. అదృష్టవశాత్తు ఇప్పుడా దుర్దశ తప్పిపోయింది.‘పులి–మేక’ సంసారపు అగచాట్లు తప్పిపోయి, ఇప్పుడు భార్య ప్రళయ తాండవ భీతి లేకుండా స్వేచ్ఛగా బతుకుతున్నాడు. అడపాదడపా ఆమె పేరు విన్నప్పుడు మాత్రం ఇప్పటికీ ఉలిక్కిపడి, భుజాలు కుంచించుకుని, కొంతసేపు అలాగే పైకి చూస్తూ ఉండిపోతాడు. మరి, అది తన విధిని తలచుకొని విచారపడడమో! జీవితంలో తనకు విమోచనం కలిగినందుకు ఆనందించడమో మాత్రం అర్థం కాదు.‘డూ లిటిల్’గారి హోటల్ దగ్గరికి వచ్చిన కొత్తవాళ్లందరికీ రిప్ తన కథంతా పూస గుచ్చినట్లు చెప్పేవాడు. మొదటి రోజుల్లో కొత్తగా కథ చెప్పినప్పుడల్లా కొద్ది కొద్ది మార్పులు ఉండేవి. చివరికి ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రూపంలోకి వచ్చి స్థిరపడిపోయింది. ఆ చుట్టప్రక్కలు ప్రాంతంలోని ఆబాలగోపాలనికీ ఈ కథ కంఠస్థం అయిపోయింది. ఇదంతా వాస్తవంగా జగలేదేమో అనీ, రిప్కి బహుశా మతిపోయి ఉండవచ్చుననీ, అతడు వెర్రిబాగుల వాడులాగ తిరుగుతుండడానికి అదే కారణమై ఉండవచ్చుననీ భావించే సంశయాత్ములు కూడా కొందరు లేకపోలేదు. ప్రాచీన డచ్ వలసదారులు మాత్రం ఈ కథంతా పూర్తిగా నిజమని నమ్మేవారు. ఎప్పుడు ఉరుములు వినిపించినా కాట్స్ కిల్ పర్వతాలలో హెండ్రిక్ హడ్సనూ, ఆయన పరివారం ‘నైన్ పిన్స్’ బంతాట ఆడుతున్నారని వారు పిల్లలకు చెపుతూండడం మామూలు. ఆ ప్రాంతంలో గయ్యాళి భార్యలతో బాధ పడే భర్తలంతా మరీ కష్టం తోచినప్పుడు, ‘‘రిప్ వాన్ వింకిల్ తాగిన డచ్ సారా నాకో గ్లాసెడు దొరికితే బ్రతికి పోదును’’ అని విలపిస్తూ ఉండటం కూడా పరిపాటి అయింది. రెడ్ ఇండియన్ జానపద సాహిత్యం మూలం : వాషింగ్టన్ ఇర్వింగ్ అనువాదం: బీ.వి.సింగరాచార్య -
మహాశివరాత్రి: కృష్ణానదిలో భక్తుల పుణ్యస్నానాలు
-
కర్తార్‌పూర్‌కు ప్రత్యేక కారిడార్
న్యూఢిల్లీ: భారత్–పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే సిక్కు తీర్థ యాత్రికులకు సౌలభ్యంగా ఉండేందుకు గుర్దాస్పూర్ నుంచి ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ కారిడాక్కు ఈ నెల 26న రాష్ట్రపతి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి స్పందనగా.. సరిహద్దు నుంచి గురుద్వారా వరకు తామూ కారిడార్ నిర్మిస్తామని పాక్ ప్రకటించింది. గురువారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కమిటీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోగ్య సంరక్షణ అనుబంధ వృత్తుల ముసాయిదా బిల్లుకు ఆమోదం, ఆహార ధాన్యాలను ఇకపై తప్పనిసరిగా గన్నీ సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే తీర్మానం వంటివి ఇందులో ఉన్నాయి. కాగా, కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్న అనంతర పరిణామాలపై కేబినెట్ క్లుప్తంగా చర్చించింది. నానక్ 550వ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు వీలుగా కేబినెట్ నిర్ణయాల్లో కొన్ని.. ► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరాబాబా నానక్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు వరకు కేంద్రం నిధులతో ఆధునిక వసతులతో ప్రత్యేక కారిడార్ ఏర్పాటు. ∙పాక్‌లో ఉన్న కర్తార్‌పూర్‌ను భారత్ యాత్రికులు వీక్షించేందుకు వీలుగా సరిహద్దుల వద్దే శక్తివంతమైన టెలిస్కోప్ ఏర్పాటు. ∙చారిత్రక సుల్తాన్పూర్ లోధి వారసత్వ పట్టణంగా అభివృద్ధి. ‘హెరిటేజ్ కాంప్లెక్స్’ ఏర్పాటు. సుల్తాన్పూర్ లోధి రైల్వేస్టేషన్ స్థాయి పెంపు. ► భారత్–పాక్ అంతర్జాతీయ సరిహద్దులకు పాక్‌లోని పంజాబ్ రాష్ట్రంలో 3 కి.మీ.ల దూరంలోనే కర్తార్‌పూర్ సాహిబ్ ఉంది. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ తుది శ్వాస విడిచిన ఇదేచోట తొలిæ గురుద్వారా ఏర్పాటైంది. ► ఓబీసీ కులాల వర్గీకరణ అంశంపై అధ్యయనం చేస్తున్న ఓబీసీ వర్గీకరణ కమిషన్ కాలపరిమితి 2019 మే 31 వరకు పెంపు. ► ఆరోగ్య సంరక్షణ అనుబంధ సేవల ముసాయిదా బిల్లు–2018కు ఆమోదం. బిల్లు ద్వారా అత్యున్నత అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతోపాటు రాష్ట్రాల్లో స్టేట్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ కౌన్సిల్స్ ఏర్పాటవుతాయి. ఈ కౌన్సిళ్ల పరిధిలోకి ఆరోగ్య సంరక్షణ రంగానికి సంబంధించిన 15 ప్రధాన వృత్తి విభాగాలతోపాటు న్యూట్రిషనిస్ట్ వంటి 53 వృత్తులు వస్తాయి. ► అన్ని రకాలైన ఆహార ధాన్యాలను ఇకపై జనపనార సంచుల్లో మాత్రమే ప్యాక్ చేయాలనే ప్రతిపాదనకు ఓకే. ఆహార ధాన్యాలను 100 శాతం, చక్కెరను 20 శాతం వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా ప్యాక్ చేయాలి. -
మానస సరోవర యాత్రలో మెరుగైన వాతావరణం
సాక్షి, ఢిల్లీ : మానస సరోవర యాత్రలో మెరుగైన వాతావరణం ఏర్పడింది. ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు గురువారం తగ్గుముఖం పట్టడం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో అధికారులు సహాయ చర్యలను ముమ్మరం చేశారు. హెలికాఫ్టర్లు, విమానాలలో యాత్రికులు తమ బృందాలతో తిరుగు ప్రయాణమయ్యారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకోసం ఏపీ, తెలంగాణ ప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. సమికోట్ నుంచి నేపాల్ గంజ్‌కు వందలాది మంది భక్తులను తరలిస్తున్నామని, మూడు రోజుల్లో యాత్రికులంతా వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. -
ఇండియన్ ఎంబసీ సహాయ చర్యలు చేపడుతోంది
-
‘యాత్రికుల పరిస్థితి సమీక్షిస్తున్నాం’
సాక్షి, న్యూఢిల్లీ: యాత్రికుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం ఉదయం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. నిన్నటి నుంచి నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు, ఢిల్లీలోని కేంద్ర అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు మూడు క్యాంపుల్లో కలిపి సుమారు 1500మంది చిక్కుకున్నట్లు సమాచారమని వెల్లడించారు. సిమికోట్‌లో 550, హిల్సాలో 500 మంది, టిబెట్ వైపున 500 మంది చిక్కుకున్నారని, వారిలో మన తెలుగు వాళ్ళు సుమారు 100మంది ఉన్నారన్నారని తెలిపారు. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి.. యాత్రికులను సురక్షత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కోరామని ప్రవీణ్ కుమార్ తెలిపారు. బేస్ క్యాంపుల్లో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉందన్నారు. దీంతో హెలికాప్టర్ల ద్వారా మాత్రమే సహాయం అందించాల్సిన పరిస్థితి నెలకొంది. హెలీకాప్టర్ల సహాయంతో యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేశామన్నారు. అదేవిధంగా సహాక చర్యలకోసం భారత ఆర్మీని కూడా పంపించాలని విదేశాంగశాఖను కోరామని తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే తెలుగు వాళ్ళందరూ సురక్షితంగా స్వస్థలాలకు చేరుకొనేలా చూస్తామన్నారు. స్పందించిన తెలంగాణ అధికారులు కాగా, మానస్ సరోవర్ యాత్రలో చిక్కుకున్న తెలంగాణ యాత్రికులతో ఢిల్లీ తెలంగాణ భవన్ అధికారులు ఫోన్లో మాట్లాడారు. తామంతా సురక్షితంగా ఉన్నట్టు అధికారులకు యాత్రికులు తెలిపారు. యాత్రికులకు కావాల్సిన వైద్యం తక్షణమే అందించాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలంగాణ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ వేదాంతం గిరి తెలిపారు. -
తిరుమల : తప్పిన పెను ప్రమాదం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం ముందు శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బ్యాటరీలో లోపం వల్ల షాట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ డీఎస్పీ అంకయ్యా కారుగా అధికారులు గుర్తించారు. ఆయన ఉదయం అభిషేకంలో పాల్గొనడానికి వచ్చినట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సకాలంలో మంటలను అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఊపిరి తీసుకున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి క్యూలైనులో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి దాదాపుగా 22 గంటల సమయం పడుతుందని సమాచారం. కాలిబాట దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శనివారం నాడు 93,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంతేకాక స్వామివారి హుండీ రూ. 2.71 కోట్లు తెలుస్తోంది. జూన్ 7వ తేదీన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. -
హజ్ యాత్రికులకు తరగతులు
సాక్షి, హైదరాబాద్ : ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లేవారికి ఈ నెల 11న శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ వక్ఫ్ బోర్డు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ రోజు ఉదయం 10.30 నుంచి 4 గంటల వరకు అంబర్‌పేటలోని జామా మసీదులో ఈ తరగతులు జరుగుతాయని బోర్డు చైర్మన్ మహ్మద్ మసుల్లా ఖాన్ తెలిపారు. -
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..
సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు తృటిలో ప్రమాదం తప్పింది. రెండవ ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ధ్వంసం అయింది. ప్రమాద సమయంలో సెఫ్టీ బెలూన్ ఒపెన్ అవ్వడంతో భక్తులు స్వల్ప గాయాలతో సురక్షితంగా భయటపడ్డారు. క్షతగాత్రులను తిరుపతిలోని రూయ ఆసుపత్రికి తరలించారు. రెండవ ఘాట్‌లోని లింక్ రోడ్డులో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో కారులో ఐదు మంది ఉన్నారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ జామ్ అయింది. రంగంలోకి దిగిన విజిలెన్స్ సిబ్బంది కారును సైడ్‌కు మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. రెండు బస్సులు ఢీ.. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని స్థానిక ఖాలేఖాన్ పేట వద్ద రెండు బస్సులు ఒక్కదానికొక్కటి ఢీ కొట్టాయి. వివరాలివి.. మచిలీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ఆర్కే కాలేజీకి చెందిన బస్సు ఎదురుగా ఢీకొనడంతో ప్రయాణికులకు స్వల్పగాయలయ్యాయి. కాలేజీ బస్సు డ్రైవర్, మరో ఇద్దరి విద్యార్థులకు స్వల్ప గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 5 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. -
వైకుంఠ దర్శనం: తిరుమల కొండ కిటకిట
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలకు భక్తులు పోటెత్తారు. కంపార్ట్మెంట్లతో పాటు, టీటీడీ ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రేపటి వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పటికే లక్షమంది భక్తులు నిరీక్షిస్తున్నారు. సామాన్య భక్తులతో పాటు వీఐపీల తాకిడి పెరిగింది. రేపటికి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందేకాకుండా కాలిబాటలో గోవిందమాల భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాగా ఏకాదశి పర్వదినాన భక్తుల సౌకర్యార్థం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సామాన్య భక్తులు, ప్రముఖులకు వేర్వేరుగా బస, దర్శన ఏర్పాట్లు చేశారు. బుధవారం అర్థరాత్రి నుంచి దివ్యదర్శనం టికెట్ల జారీని నిలిపివేశారు. సర్వదర్శనం మినహా ఐదు రోజుల పాటు దివ్యదర్శనం సహా అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కనుమ రహదారులను 24 గంటల పాటు తెరిచే ఉంచుతారు. ధనుర్మాస పూజల తర్వాత వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఏకాదశి, ద్వాదశి రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనంను కల్పించనున్నారు. రేపు ఉదయం 5 గంటల తర్వాత వీఐపీ దర్శనాలను అనుమతిస్తారు. ఉదయం 7.30 గంటల తర్వాత సర్వదర్శనం ప్రారంభం కానుంది. రెండు రోజులు పాటు 40 గంటలకు పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు 30 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు 200 మందికిపైగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు రానున్నట్టు సమాచారం. ప్రముఖుల బస, దర్శన ఏర్పాట్లు మంత్రులు, రాజ్యాంగపరమైన హోదాల్లో ఉన్న వారు తిరుమలలోని పద్మావతి విచారణ కార్యాలయ పరిధిలోని వెంకటకళా నిలయానికి వెళ్లాల్సి ఉంది. ఇక్కడ ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, 2కు మించకుండా గదులు కేటాయిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రామరాజు నిలయం, సీతా నిలయానికి వెళ్లాలి. ఆరుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గది మంజూరు చేస్తారు. అఖిల భారత సర్వీసు అధికారులు సన్నిధానానికి, ఇతర ఉన్నతాధికారులకు గంబుల్ విశ్రాంతి గృహానికి వెళ్లాలి. నలుగురికి మించకుండా దర్శన టికెట్లు, ఒక గదిని కేటాయిస్తారు. సామాన్య భక్తులకు బస, దర్శన ఏర్పాట్లు ఏకాదశి సందర్భంగా వచ్చే సామాన్య భక్తుల కోసం కేంద్రియ విచారణ కార్యాలయంలోని అన్ని కౌంటర్లలో గదులు కేటాయించనున్నారు. ఇక్కడ ఎలాంటి సిఫారసులు స్వీకరించరు. స్వామి దర్శనం కోసం లక్షన్నర మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేసింది. ఇందులో భాగంగానే కాలిబాట దర్శనం కూడా నిలిపివేశారు. ఒకే క్యూలైనులోనే భక్తులను అనుమతించనున్నారు. సామాన్య భక్తులకు ఎండ, వాన, చలి, మంచుకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా షెడ్లు నిర్మించారు. 42 వేల మందికి సరిపడేలా నారాయణగిరి ఉద్యాన వనాల్లో 20 తాత్కాలిక షెడ్లు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2లో 16 వేల మంది, వైకుంఠం క్యూకాంప్లెక్స్–1లో 16 వేల మంది భక్తులు ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ సారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్–2 నుంచి కల్యాణవేదిక వరకు 2.3 కిలోమీటర్ల నిడివిలో కొత్తక్యూలైను నిర్మించారు. తొలుత కంపార్ట్మెంట్లలోకి భక్తులను అనుమతిస్తారు. అవి నిండిన తర్వాత ఆళ్వార్‌ట్యాంక్, నారాయణగిరి ఉద్యానవనాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్–2, కర్ణాటక సత్రాలు, అహోబిల మఠం, ఉత్తర మాడ వీధి మీదుగా ఎ టైప్ క్వార్టర్స్, బాట గంగమ్మ గుడి వద్ద రింగ్‌రోడ్డు నుంచి కల్యాణవేదిక వరకు నిర్మించిన క్యూలైన్లోకి అనుమతిస్తారు. భక్తులు 24 నుంచి 30 గంటలు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ భక్తులకు మరుగుదొడ్లతోపాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. సుమారు 2 లక్షల మందికి సరిపడేలా అన్నప్రసాదాలు, మజ్జిగ, కాఫీ, టీ తదితరాలు సిద్ధం చేయాలని టీటీడీ ఈవో అనీల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశించారు. -
పుణ్యక్షేత్రాల్లో పెరిగిన భక్తుల రద్దీ
యాదాద్రి/వేములవాడ: వరుస సెలవులు రావడంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, వేములవాడల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలపైగా సమయం పడుతున్నది. కొండపైన తగినంత పార్కింగ్ స్థలం లేకపోవడంతో భక్తుల వాహనాలను తులసి కాటేజ్ వద్ద నిలిపివేశారు. వేములవాడలో... వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతున్నది. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఆలయంలో శీఘ్ర దర్శనాన్ని అధికారులు అమలు చేశారు. -
జెరూసలెం యాత్రకు సహకారం
-
జెరూసలెం యాత్రకు సహకారం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులతో, రంజాన్ సమయంలో ముస్లింలతో, బోనాలు, బతుకమ్మ సందర్భంగా హిందువులతో ఉత్సవాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉంటేనే ప్రగతి సాధ్యమని చెప్పారు. క్రిస్మస్ పండుగ పురస్కరించుకుని శుక్రవారం నిజాం కాలేజీ మైదానంలో క్రైస్తవ మత పెద్దలు, ప్రముఖులకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవ కుటుంబాలకు వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి సభికులనుద్దేశించి మాట్లాడారు. ‘‘రాజధాని నగరంలో క్రైస్తవ భవన్ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ భవన నిర్మాణం నా కల. వచ్చే క్రిస్మస్ కల్లా ఆ భవనాన్ని కచ్చితంగా నిర్మించి తీరుతాం. ఇక్కడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచిస్తున్నా. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై స్వయంగా పరిశీలిస్తా. క్రైస్తవులకు పవిత్ర స్థలమైన జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వాలని కొందరు క్రైస్తవ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు నన్ను చాలాసార్లు అడిగారు. తప్పకుండా వారి కోరిక తీరుస్తా. అతి త్వరలో ఈ పథకానికి సంబంధించిన పాలసీ ప్రకటిస్తా. చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణానికి సంబంధించి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు నా వద్ద వందకుపైగా ప్రతిపాదనలు తెచ్చారు. వాటిని పూర్తి చేయడానికి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా. తప్పకుండా ఆ దరఖాస్తులను పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. అవేగాకుండా కొత్తగా వచ్చే దరఖాస్తులను సైతం వీలైనంత త్వరలో పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. గతంలో చర్చిలపై దాడులు జరుగుతున్నాయనే ఆందోళన ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆందోళన లేదని, మూడేళ్లుగా ఎలాంటి దాడులు జరగడం లేదని చాలామంది పాస్టర్లు, బిషప్‌లు చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది’’అంటూ సీఎం ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వికృతంగా రాజకీయాలు రాష్ట్రంలో రాజకీయాలు వికృత రూపం దాల్చాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్ష పార్టీలంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొనడం బాధగా ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులపై 196 కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. క్రైస్తవ భవన్‌పైనా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. అయినా ఆ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి వచ్చే పండుగకల్లా ప్రారంభిస్తాం. పండుగ పూట వస్త్రాలు, గిఫ్ట్‌ల పంపిణీని తక్కువగా చూడొద్దు. గిఫ్ట్ ప్యాక్‌లో ఉన్న కానుకను ఆర్థిక విలువతో చూడొద్దు. పేదవాడి కోణంలో చూడాలి. పండుగ పూట పేదవాడు సైతం ఆనందంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉందన్న భరోసా ఇవ్వడానికి వాటిని పంపిణీ చేస్తున్నాం’’అని అన్నారు. ‘‘జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ త్వరలో హైదరాబాద్‌కు రానున్నారు. పర్యాటక అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ఆమె ఉదయమే ఫోన్లో మాట్లాడారు. ‘ముస్లిం ముఖ్యమంత్రినైన నేను మా రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ప్రభుత్వం తరఫున నిర్వహించలేదు. కానీ మీరు మాత్రం తెలంగాణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’అని ఆమె అన్నారు. ఈ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల దేశమంతా ఇదే అభిప్రాయం ఉండాలని కోరుకున్నా’’అని సీఎం వివరించారు. రాష్ట్రంలోని 70 శాతం ప్రజలకు తాగునీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చాయని, ఈ సాయంత్రమే సమాచారం వచ్చిందని తెలిపారు. త్వరలో హరిత తెలంగాణను చూడనున్నారని, రాష్ట్ర ప్రజల కల సాకారం కానుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విశిష్ట సేవలందించిన క్రైస్తవులు, సంస్థలకు సీఎం అవార్డులు అందించారు. -
అయ్యప్ప భక్తులకోసం కుటుంబశ్రీ మిషన్
సాక్షి, తిరువనంతపురం : నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో శబరిమల అయ్యప్పను దర్శించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తుల వస్తుంటారు. వీరిలో 65 శాతం మంది సొంత వాహనాలతో శబరిమలకు రావడం జరుగుతుంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులు.. రోడ్లకు ఇరువైపులా వాహనాలను నిలిపి వంట చేసుకోవడం పరిపాటి. ఇలా రోడ్ల పక్కన వంట చేసుకుని.. ఆపై వాటిని ఆలాగే వదిలివేయడం వల్ల భారీగా కాలుష్యం జరుగుతోంది. దీనిని నివారించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ‘కుటుంబశ్రీ’ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ మిషన్కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా.. టీడీబీ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తుంది. అందులో విశ్రమించడంతో పాటు.. వంటకు అవసరమైన పాత్రలు, గ్యాస్, నీరు, ఇతర వస్తువులను అందించడం జరుగుతుంది. వంట చేసుకుని భోజనం చేశాక.. కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చాలా తక్కువగా ఉంటుందని టీడీబీ అధికారులు ప్రకటించారు. కుటంబశ్రీ మిషన్ కింద ఇప్పటికే పథినంతిట్ట, నీలక్కల్, శబరిమల ప్రాంతాల్లో షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు టీడీబీ ప్రకటించింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా.. జనవరి 5 లోపు ఏర్పాటు చేయడం జరుగుతుందని టీడీబీ తెలిపింది. -
గంటలు కొట్టినా.. భంభం భోలే.. అన్నా నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బుధవారం సంచలనాత్మక ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఎన్జీటీ ఆదేశాలు అశనిపాతం లాంటివే. అమర్నాథ్ యాత్రలోనూ, అమర్నాథ్ గుహలోని భక్తులు భంభం బోలే అంటూ నినదించడం, బిగ్గరగా మంత్రాలు పఠించడం, పరమేశ్వరుడి దగ్గర గంట కొట్టడాన్ని ఎన్జీటీ నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక యాత్ర చివరి చెక్‌పాయింట్ నుంచి అమర్నాథ్ గుహ వరకూ భక్తులను గుంపులుగా కాకుండా.. ఒకే వరుసలో పంపాలని అమర్నాథ్ బోర్డుకు ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అమర్నాథ్ కొండ ప్రాంతాన్ని ‘సైలెన్స్ జోన్’గా ఎన్జీటీ ప్రకటించింది. అమర్నాథ్ గుహ ఉన్న ప్రాంతం.. మంచుతో కూడుకుని సహజ ప్రకృతితో ఉండే ఈ ప్రాంతాన్ని పరిరక్షించేదుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అమర్నాథ్ బోర్డు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, మంచు లింగాన్నిదర్శించుకునే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్జీటీ ఆదేశించింది. భక్తులను వ్యాపారాత్మక దృష్టితో చూడడం అమర్నాథ్ బోర్డుకు మంచిది కాదని ఎన్జీటీ తెలిపింది. -
నకిలీ దర్శనం టిక్కెట్లు స్వాధీనం
తిరుమల: తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టిక్కెట్లను టీటీడీ విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి చెందిన 192మంది భక్తులు తిరుమల యాత్ర మండలి పేరుతో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు తీసుకుని వచ్చారు. వీరిని ప్రశాంత్ అనే దళారీ మోసగించినట్లు తెలుస్తోంది. వీరంతా దర్శనానికి వచ్చిన సమయంలో తనిఖీల్లో ఈ బాగోతం బయటపడింది. ఆలయ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
శబరిమలను కుదిపేస్తున్న ‘ఓక్కి’
సాక్షి, శబరిమల : కేరళలో ఓక్కి తుపాను విజృంభిస్తోంది. శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన వేలాదిమంది భక్తులు ఓక్కి తుపాను ధాటికి విలవిల్లాడుతున్నారు. తుపాను ప్రభావం చాలా ఎక్కువగా ఉండడంతో భక్తులను అడవి మార్గం గుండా ప్రయాణించవద్దని ట్రావెన్కోర్ బోర్డు ప్రకటించింది. ముఖ్యంగా ఎరుమేలి-పంబా, సథరం-పులిమేడు మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని టీడీబీ పేర్కొంది. సన్నిధానం చుట్టూ ఉన్న ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పెనుగాలులు వీస్తున్నాయని, అలాగే వర్షం కూడా కురుస్తోందని అధికారులు తెలిపారు. పంబానది కూడా ఉధృతంగా ప్రవహిస్తోందని.. భక్తులెవరూ నదిలోకి దిగి స్నానాలు చేయవద్దని అధికారులు ఆదేశించారు. అలాగే.. భక్తులు ఓకి తుపాను తగ్గే వరకూ రక్షణ ప్రాంతంలో ఉండాలని టీడీబీ పేర్కొంది. ఇదిలా ఉండగా ఎరుమేలి-కరిమల-సన్నిధానం మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మార్గంలో గాలుల ధాటికి పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయని వారు అంటున్నారు. పంబదగ్గరున్న త్రివేణి పార్కింగ్ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. ఇక్కడ పార్కింగ్‌లో ఉన్న వాహనాలు సైతం నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ప్రస్తుతం శబరిమలకు రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. అలాగే శబరిమల ప్రాంతంలోని నదులు, నీటి ప్రవాహాలకు, విద్యుత్ స్థంభాలకు, చెట్లకు భక్తులు దూరంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇతర సూచనలు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ భక్తులు యాత్ర సాగించరాదు పంబనుంచి సన్నిధానం వరకూ నడిచే సమయంలో విద్యుత్, చెట్లకూ దూరంగా ఉండాలి. తుపాను దృష్ట్యా ఎరేమేలి-పంబా నడకదారి నిషేధం సన్నిధానం, పంబల్లో ప్రభుత్వం ప్రత్యేక షెల్టర్లను ఏర్పాటు చేసింది. భక్తులు అందులోనే విశ్రాంతి తీసుకోవాలి. -
‘అమర్నాథ్ యాత్ర’కు ఆధునిక హంగులు
సాక్షి, న్యూఢిల్లీ : అమర్నాత్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త. మంచు లింగాన్ని దర్శించి తరించాలని వేల సంఖ్యలో భక్తులు కోరుకుకుంటారు. అయితే అమర్నాథ్ యాత్ర అంత సులువుకాదన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రధానంగా మౌలిక సదుపయాలు, రవాణ వంటి సమస్యలు ఈ యాత్రలో భక్తులను విపరీతంగా వేధిస్తాయి. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అమర్నాథ్ బోర్డును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతేకాక మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం అడిషనల్ సెక్రెటరీ హోదా కలిగిన అధికారి నేతృత్వంలో ఒక కమిటీని ఎన్జీటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అమర్నాథ్ యాత్రపై పరిశీలన చేసి.. భక్తులకు అవసరమైన వసతులు, సౌకర్యాల ఏర్పాటుపై ప్రణాళిక రూపోందిస్తుందని ఎన్జీటీ ప్రకటించింది. ఈ కమిటీ ప్రధానంగా రహదారి, దేవస్థానం సమీపంలో పరిశుభ్రత, భక్తులకు అవసరాలను పరిశీలిస్తుందని ఎన్జీటీ తెలిపింది. -
శబరిమలలో ఆధునిక సౌకర్యాలు
సాక్షి, శబరిమల : కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయం.. అయ్యప్ప భక్తుల కొరకు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఏటికేడు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ఆధునిక వసతి సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు చెబుతున్నారు. మహిళా భక్తుల కోసం పంబా నుంచి సన్నిధానం వరకూ ప్రత్యేక క్యూ లైన్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మండల పూజలు ఆరంభం కానున్న నేపథ్యంలో శబరిమల ఆయ్యప్పస్వామి ఆలయాన్ని బుధవారం అర్చకులు తెరవనున్నారు. గరురువారం నుంచి సాధారణ అనుమతి వేళల్లో స్వామి వారిని భక్తులు దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా శబరిమలలో నిత్యాన్నదాన సేవా కార్యక్రమాన్ని కేరళ ప్రభుత్వం మొదలు పెట్టింది. ప్రతిరోజూ 5 వేల మంది భక్తులు భోజనం చేసేలా వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కేరళ దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి సుందరన్ తెలిపారు. ఈ అన్నదానం జనవరి 14 మకర విళక్కు వరకూ కొసాగుతుందని ఆయన చెప్పారు. అరవణ ప్రసాదం, అప్పం అందరికీ అందేలా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వనయాత్ర (పెద్దపాదం) చేసే భక్తులకు తాగు నీటికి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడవుల్లో ప్లాస్టిక్ నిషేధించిన కారణంగా.. బక్తులు ఎవరూ ప్లాస్టిక్ బాటిల్స్ తమ వెంట తీసుకెళ్లరాదని ఆయన స్పష్టం చేశారు. -
బాసరలో యాత్రీకుల యాతన
భైంసా(ముథోల్) : బాసర క్షేత్రానికి భక్తులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. చిన్న పిల్లలతో కుటుంబమంతా రాత్రి సమయంలో రైలు దిగి ఆలయానికి వెళ్లేందుకు అటు ఇటు తిరుగుతూ కనిపిస్తారు. ఆ సమయంలో ముందరున్న ఏ వాహనమైన సరే తీసుకుని ఆలయానికి వెళ్లాల్సిన పరిస్థితి. అర్ధరాత్రి.. అప్పటికే ప్రయాణంలో అంతా అలిసిపోయి ఉంటారు. పిల్లలు తల్లిదండ్రుల ఒడిలోనే నిద్రపోతారు. పిల్లలను ఒడిలో పడుకోబెట్టుకుని పక్కనే ఉన్న ఆలయానికి చేరుకోవాలని యాత్రీకులు తపన పడుతుంటారు. అలాంటి సమయంలో వచ్చే యాత్రీకులకు రైలు దిగగానే ఉచిత బస్సు సౌకర్యం ఉందని, ఆలయంలో వసతి సౌకర్యం ఉందని చెప్పే ఏర్పాట్లు ఉండాలి. రైల్వేస్టేషన్లోనే ఆలయ సిబ్బందిని అందుబాటులో ఉంచి యాత్రీకులకు తగ్గట్లు అవసరమైతే బస్సును 2 నుంచి 3 ట్రిప్పులు అయినా సరే పంపించే ఏర్పాట్లు చేయాలి. బస్సులో వెళ్లే యాత్రీకులు రైలు దిగగానే అక్కడే సేదదీరేలా వసతి కల్పించాలి. బాసర రైల్వేస్టేషన్లోనే రైలుమార్గం ద్వారా వచ్చే యాత్రీకులకు వసతి గదులను బుక్ చేసుకునేలా ఆన్లైన్ సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే వచ్చే వారికి తక్కువ ధరకే ఆలయ వసతి గృహాలు దొరుకుతాయి. కానీ ప్రస్తుతం వచ్చిన యాత్రీకులంతా ముందు వసతి కోసం ఆలయ అతిథి గృహాలకు వెళ్లి అక్కడ గదులు లేవని చెప్పగానే ప్రైవేటు లాడ్జీలకు తిరగాల్సి వస్తోంది. ఇలా రాత్రంతా పిల్లాపాపలతో వచ్చే కుటుంబీకులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. వేకువజామునే స్నానాలు చేసి నిద్ర లేకుండానే పిల్లలకు అక్షరశ్రీకార పూజలు జరిపిస్తున్నారు. దీంతో ఒక్కసారి బాసరకు వచ్చే యాత్రీకులు అక్కడ ఏ సౌకర్యాలూ లేవంటూ పెదవి విరుస్తున్నారు. ఆలయం తరఫున ఉచిత బస్సులను నడిపితే రాత్రి సమయంలో వచ్చే యాత్రీకులకు ఇబ్బందులు దూరమవుతాయి. ఆ బస్సులోనే ఆలయ వసతిగృహాల ఖాళీ గదుల వివరాలను తెలిపే ఏర్పాట్లు చేస్తే యాత్రీకులను నేరుగా అక్కడికే వెళ్లగలుగుతారు. క్యాబ్‌లు నడిపితే.. ప్రస్తుతం బాసర రైల్వేస్టేషన్ నుంచి ఆలయం వరకు ప్రైవేటు ఆటోలు నడుపుతున్నారు. అయితే అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయానికి తగ్గట్లు ప్రభుత్వమే క్యాబ్‌లను అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాబ్‌లలో యాత్రీకులకు నిర్ధిష్టమైన అద్దె చెల్లింపునకు రశీదులు అందుతాయి. ఇప్పుడున్న ప్రైవేటు వాహనాల వారు ఇష్టారీతిన యాత్రీకుల వద్ద అద్దె డబ్బులను తీసుకుంటున్నారు. క్యాబ్‌లతో బాసర ఆలయానికి కొత్త అందం కూడా వస్తుంది. యాత్రీకులకు సౌకర్యంగా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వాహనాలు నడిపే వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చేలా ఉంటుంది. పైగా దేశవ్యాప్తంగా వచ్చే భక్తుల ప్రయాణానికి మెరుగైన సౌకర్యం ఉంటుంది. రోడ్డుపైనే పార్కింగ్ బాసర రైల్వేస్టేషన్ వద్ద ఉన్న చౌరస్తాలో ప్రైవేటు ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలను ఇష్టారీతిన పార్కింగ్ చేస్తున్నారు. భైంసా–నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎప్పుడు చూసినా ఇక్కడ చౌరస్తా సర్కిల్లో ప్రయాణికుల కోసం వాహనాలను నిలిపి ఉంచుతారు. ఆలయానికి ప్రతీరోజు వందల సంఖ్యలో యాత్రీకులు వస్తుంటారు. వారిని తీసుకువచ్చే వాహనాల రాకపోకలకు రోడ్లపై నిలిపిన ఈ వాహనాలతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. యాత్రీకుల నిరీక్షణ రైల్వేస్టేషన్ ముందు ప్రధాన రహదారి ఉంది. యాత్రీకులు రైలు దిగగానే బస్సుల కోసం వేచిచూస్తారు. అయితే రైల్వేస్టేషన్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఇప్పటి వరకు బస్టాండ్ నిర్మాణం జరుగలేదు. కిలోమీటరున్నర దూరంలో బాసర గ్రామంలో ఉన్న బస్టాండ్ ఎవరికీ ఉపయోగపడడంలేదు. రైలు దిగగానే ట్రిపుల్ఐటీకి వెళ్లే విద్యార్థులు భైంసా, మహారాష్ట్రకు వెళ్లేవారు బాసర ఆలయానికి చేరుకునే వారంతా బస్సుల కోసం ప్రధాన రోడ్డుపైకి వస్తుంటారు. వర్షాకాలంలో, వేసవిలో పక్కనే ఉన్న హోటల్ షెడ్లలోకి వెళ్లి బస్సు రాగానే పరుగెత్తుకుంటూ వెళ్తారు. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ చౌరస్తా కూడలిలో అందరికీ ఉపయోగపడేలా బస్టాండ్ నిర్మాణం చేపట్టాల్సిన అత్యవసరం ఉంది. అస్తవ్యస్తంగా ట్రాఫిక్ ఇక ఇక్కడ ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది. బాసర రైల్వేస్టేషన్, గ్రామం, భైంసా, నిజామాబాద్‌ల నుంచి నాలుగు వైపులుగా వచ్చే వాహనాలన్నీ తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని చౌరస్తా మీదుగా వెళ్తాయి. ఈ చౌరస్తా వద్ద ఇప్పటికీ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయలేదు. పుష్కరాల్లో విధులు నిర్వహించే ముథోల్‌కు చెందిన హోంగార్డు కూడా ఇక్కడే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. బాసరకు చెందిన పలువురు యువకులు సైతం ఇలా రోడ్లపై నిలిపి ఉన్న భారీ వాహనాలకు ఢీకొని మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినా ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం లేదు. ఉచిత బస్సులు నడపాలి దూరప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఆలయం నుంచి బస్టాండ్, రైల్వేస్టేషన్, గోదావరి నదికి వెళ్లేలా ఉచిత బస్సులను నడపాలి. అలా చేస్తే ఇబ్బందులు ఉండవు. భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలి. - లక్ష్మి, నిర్మల్ వసతి కల్పించాలి రైల్వేస్టేషన్‌కు రాగానే ఉచిత బస్సు వచ్చే వరకు నిరీక్షించేందుకు వసతి సౌకర్యం కల్పించాలి. రైలు ద్వారా ఒకేసారి వందలాది మంది యాత్రీకులు వస్తారు. అందరినీ ఉచిత బస్సు ద్వారానే ఆలయానికి తరలించాలి. - భాస్కర్, మహారాష్ట్ర ఆన్లైన్లో వివరాలుంచాలి ఉచిత బస్సు, ఆలయంలో వసతి వివరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు నమోదుచేయాలి. రైల్వేస్టేషన్లో దిగగానే యాత్రీకులకు ఎక్కడెక్కడ గదులు ఖాళీ ఉన్నాయో వివరాలు తెలిపేలా బోర్డులు ఏర్పాటుచేయాలి. - సురేశ్, మహారాష్ట్ర -
భద్రాద్రికి ఏడువేల మంది భక్తుల పాదయాత్ర
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఒక రోజు ముందే వేలమంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. వీరు ముందుగా పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆ తరువాత స్వామి వారి దర్శనానికి బారులుతీరారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏపీలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, రాజమండ్రి నుంచి పాదయాత్రగా దాదాపు 7000 మంది భక్తులు భద్రాచలం చేరుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం బేడా మండపంలో స్వామి వారి భజనలు చేశారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
త్వరలో తిరుమలలో కాలిబాటకు మోక్షం
-
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: కార్తీకమాసం చివరి వారం కావడంతో యాదాద్రికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో పోలీసులు కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరిస్తున్నారు. పెద్దనోట్ల రద్దుతో చిల్లర దొరక్క భక్తులు, వ్యాపారులు అవస్ధలు పడుతున్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి ప్రస్తుతం ఆరు కంపార్టమెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు, నడకదారి భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. -
ఆలయాల్లో కార్తీక శోభ
హైదరాబాద్‌సిటీ: కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల నదులలో వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: యాదాద్రికి భక్తులు పోటెత్తారు. శ్రీ లక్ష్మీనర్సింహ స్వామివారి ధర్మ దర్శనానికి ప్రస్తుతం మూడున్నర గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండున్నర గంటలు పడుతోంది. కార్తిక మాసం కావడంతో భక్తుల రద్దీ వీపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) స్వామివారిని 81,657 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 6 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న(గురువారం) స్వామివారిని 72,408మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.84కోట్లువచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
మదినిండుగ.. వరాల పండుగ
గంధం ముగిసిన రోజు భారీగా తరలివచ్చిన భక్తులు విద్యుత్ స్తంభం విరిగిపడి ఇద్దరికి స్వల్పగాయాలు సాక్షి ప్రతినిధి – నెల్లూరు: రొట్టెల పండుగకు శుక్రవారం భక్త జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. గంధం ముగిసిన మరుసటి రోజు విశిష్టమైనదిగా భావించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున దర్గాను దర్శించుకుని రొట్టెల పండుగలో పాల్గొన్నారు. 11 గంటల వరకు.. బారాషహీద్ దర్గాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన గంధం కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 11 గంటల వరకు ఈ రద్దీ కొనసాగింది. ఎండ కారణంగా సాయంత్రం 5 గంటల వరకు భక్తుల సంఖ్య తగ్గింది. 5 గంటల తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు తరలి వచ్చారు. పండుగ ప్రారంభమైన తర్వాత శుక్రవారం సాయంత్రానికి పొదలకూరు రోడ్డు వైపు నుంచి, పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ వైపు నుంచి నిండుగా జనం కనిపించారు. స్వచ్చంద సేవా సంస్థలు భక్తులకు మజ్జిగ, తాగునీరు, భోజనం ఉచితంగా అందించాయి. మంత్రి నారాయణ, మేయర్ అజీజ్, కలెక్టర్ ముత్యాలరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి నారాయణ తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, మేయర్ అజీజ్‌తో కలసి చెరువులో బోటు విహారం చేసి పర్యాటక శాఖ అందిస్తున్న సేవలను పరిశీలించారు. జనం పెద్దగా లేక పోవడంతో ఉదయం 11 గంటల నుంచి దర్గా ముఖద్వారంలో ఏర్పాటు చేసిన ఆర్చిల వరకు పాసులు లేక పోయినా పోలీసులు వాహనాలను అనుమతించారు. సాయంత్రం నుంచి రద్దీ పెరగడంతో పోలీసులు వాహనాల రాక పోకలను నియంత్రించారు. దర్గా దర్శనానికి వచ్చిన వీఐపీల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఇదిలా ఉంటే చెరువు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం మధ్యాహ్నం సమయంలో కింద పడి ఇద్దరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కృష్ణపట్నం పోర్టు, సీవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి 25 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అప్పుడే ఊడిన ఘాట్ల టైల్స్ చెరువు ఒడ్డున శాశ్వతంగా ఉండే ఉద్దేశంతో నిర్మించి ఫ్లోరింగ్ టైల్స్ శుక్రవారం నాటికే అక్కడక్కడా ఊడిపోయి కనిపించాయి. పనులు వేగంగా చేయాల్సి వచ్చినందువల్ల ఈ పరిస్థితి ఏర్పడిందా? లేక పనుల్లో నాణ్యత లేకపోవడం కారణమా? అనేది అధికారులు పరిశీలించాల్సి వుంది. -
కసుమూరు దర్గాలో భక్తుల కోలాహలం
సౌకర్యాలు కల్పనలో వక్ఫ్‌బోర్డు నిర్లక్ష్యం భక్తులకు అవస్థలు కసుమూరు (వెంకటాచలం): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్‌వలి దర్గా ప్రాంగణం బుధవారం భక్తులతో కోలాహలంగా మారింది. నెల్లూరునగరంలోని బారాషహీద్ దర్గా వద్ద జరిగే రొట్టెల పండగకు వచ్చే భక్తులు కసుమూరులోని మస్తాన్‌వలి దర్గాను దర్శించుకోవడం ఆనవాయితీ. మంగâ¶వారం రాత్రి నుంచి భక్తులు మస్తాన్‌వలి దర్గాను దర్శించుకుంటున్నారు. దర్గాలోని మస్తాన్‌వలి సమా«ధి వద్ద భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గురు, శుక్రవారాల్లో దర్గాకు వేలాది మంది భక్తులు రానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు కసుమూరు దర్గాను సందర్శించారు. భక్తులకు ఏటా తప్పని అవస్థలు కసుమూరు దర్గాకు వచ్చే భక్తులకు ఏటా అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రోడ్డుమార్గంలో ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో ఉన్న రోడ్డు కుదించుకుపోయింది. వేలాది సంఖ్యలో వచ్చిన భక్తులు ఇరుకురోడ్డుపై రాకపోకలు సాగేంచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆటోలు అటూ, ఇటూ తిరగడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఆటోలను పోలీసులు లోపల అనుమతించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వసతులేవీ? కసుమూరు దర్గాకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత వక్ఫ్‌బోర్డుపై ఉంది. వక్ఫ్‌బోర్డు బుధవారం మధ్యాహ్నం వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. వీధులను మాత్రం శుభ్రం చేయించారు. దర్గా ప్రాంగణంలో షామినాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మధ్యాహ్నం వరకు దర్గాను సందర్శించుకునే భక్తులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాగునీటి సరఫరా కేంద్రాలు కొన్ని చోట్ల మాత్రమే ఏర్పాటు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వక్ఫ్‌బోర్డు వసతులు సక్రమంగా కల్పించక పోవడంతో భక్తులు పొలాల గట్లుపై చెట్ల కింద సేదతీరారు. దర్గా సూపరింటెండెంట్‌ను వివరణ కోరగా భక్తుల సౌకర్యాల కోసం వక్ఫ్‌బోర్డు రూ.లక్ష కేటాయించారని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్య లేకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్ల నిండా భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) స్వామివారిని 77,369 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా శ్రీవారికి రూ. 2.64 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
నమో వెంకటేశ
తిరుమల వెళ్లే వెంకన్న భక్తులకు తీపి కబురు. విమానంలో వెళ్లి తక్కువ సమయంలోనే స్వామిని దర్శించి తిరిగి వచ్చేయాలని తలచే యాత్రికుల కోసం సరికొత్త విమాన ప్యాకేజీని ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు ఐఆర్సీటీసీ సన్నాహాలు చేస్తోంది. ఇక వేంకటేశుని దర్శన టికెట్ కోసం తిప్పలు పడే భక్తుల కోసం ఆర్టీసీ ఓ పథకం ప్రవేశపెడుతోంది. బస్సు టికెట్‌తోపాటు రూ.300ల దర్శనం టికెట్‌ను దీంతో అందిస్తారు. వెంకన్న దర్శనానికిఆర్టీసీ టికెట్ రోజుకు 30 మందికి ఛాన్స్ అధీకృత ఏజెంట్ల వద్ద కూడా లభ్యం విశాఖ నుంచి ప్రారంభం విశాఖపట్నం: తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ఆయన దర్శన భాగ్యానికి వారాలు, నెలలు ముందుగా బుక్ చేసుకున్నా దొరకని పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ యాజమాన్యం వెంకన్న భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. ఇందులోభాగంగా విశాఖలోనూ దీనికి శ్రీకారం చుట్టింది. ఈ సదుపాయాన్ని పొందడానికి ఏంచేయాలంటే.. విశాఖ నుంచి తిరుపతికి రోజుకు ఒక గరుడ సర్వీసును ఆర్టీసీ నడుపుతోంది. ఈ బస్సులో వెళ్లి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకోవాలనుకునే వారికి బస్సు టికెట్‌తో పాటు స్వామి టికెట్ పొందే వీలు కల్పించింది. బస్సు చార్జికి అదనంగా రూ.300 చెల్లించి దర్శన టికెట్ పొందవచ్చన్నమాట. వీటిని ముందస్తుగా రిజర్వేషన్, ఆన్లైన్లోనే కాదు.. అప్పటికప్పుడు కౌంటర్లోనూ, మొబైల్ యాప్ ద్వారా, ఆర్టీసీ అధీకృత ఏజెంట్ల వద్ద కూడా వీటి ని అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బస్సులో రోజుకు 30 మందికి తిరుమలేశుని దర్శన టికె ట్లను జారీ చేస్తారు. ఈ టికెట్లను పొందే సమయంలో వారికి ఏ రోజు, ఏ సమయంలో దర్శనం కావాలో చెప్పాల్సి ఉంటుంది. ఆ మేరకు ఆర్టీసీ నుంచి స్వామి దర్శన టికెట్ పొందిన వారికి దర్శన తేదీ, సమయాన్ని సంబంధిత భక్తుడు/ప్రయాణికుడి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం వస్తుంది. విశాఖ నుంచి తిరుపతికి గరుడ ఏసీ సర్వీసు టికెట్ రూ.1597 ఉంది. వేంకటేశ్వరస్వామి శీఘ్ర దర్శనం టికెట్ కోసం అదనంగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. తిరుపతిలో దిగాక కొండపైకి వెళ్లడానికి అక్కడ బస్సుల్లో టికెట్ తీసుకోవాల్సిందే. విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ నుంచి ఈ బస్సు రోజూ సాయంత్రం 5.30కి బయల్దేరి మర్నాడు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అంటే 12.30 గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఇటీవలే లాంఛనంగా ప్రారంభించిన ఈ సదుపాయాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారని ఆర్టీసీ విశాఖ రీజియన్ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాబిందు ‘సాక్షి’కి చెప్పారు. త్వరలో విశాఖ-తిరుపతి ఫ్లైట్ ప్యాకేజీ దసరాకు గోవా, విదేశాలకు కూడా ఐఆర్సీటీసీ సన్నాహాలు విశాఖపట్నం: త్వరలో విశాఖపట్నం-తిరుపతి మధ్య ఫ్లైట్ ప్యాకేజీ ప్రారంభం కాబోతోంది. ఐఆర్సీటీసీ ప్రస్తుతం హైదరాబాద్-తిరుపతి మధ్య ఇలాంటి ప్యాకేజీనే అమలు చేస్తోంది. దీనికి ఆదరణ లభిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బుధవారం విశాఖ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఆర్సీటీసీ (సికింద్రాబాద్) డిప్యూటి జనరల్ మేనేజర్ ఎన్.సంజీవయ్య తెలిపారు. రెండు రోజుల ఈ ప్యాకేజీలో విశాఖ నుంచి తిరుపతి విమానంలో తీసుకెళ్లి, తిరుమల దర్శనం చేయిస్తామని, కాణిపాకం, తిరుచానూరు, అలివేలు మంగాపురం తదితర ప్రాంతాల సందర్శన ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీ రూ.10 వేలు ఉంటుందన్నారు. అక్టోబర్ 8-12 మధ్య హైదరాబాద్ నుంచి హాంకాంగ్, మకావ్, షెంజియన్ దేశాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రారంభిస్తామన్నారు. నాలుగు రాత్రులు, ఐదు రోజుల ఈ ప్యాకేజీ చార్జి రూ.73419గా నిర్ణయించామన్నారు. ఇంకా గోవా-హైదరాబాద్ మధ్య 3 రాత్రులు, 4 రోజుల ఫ్లైట్ ప్యాకేజీని రూ.18 వేల చార్జి ఉంటుందని చెప్పారు. యాత్రా స్పెషల్స్.. అలాగే విశాఖ నుంచి దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలకు యాత్రా స్పెషల్ పేరిట రైలు ప్యాకేజీలను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలో విశాఖ రైల్వేస్టేషన్లో ఐఆర్సీటీసీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే హైదరాబాద్-విశాఖ మధ్య రైలు ప్యాకేజీ ఉందని, మూడు నెలల్లో ఫ్లైట్ ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పారు. -
ఉత్సాహంగా పస్క పండుగ
నర్సాపూర్:స్థానిక సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఆదివారం చేపట్టిన పస్క పండుగ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల కోసం ప్రతి ఏటా నిర్వహించే పండుగను ఆదివారం మండలంలోని పెద్దచింతకుంట శివారులోని మామిడితోటలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా సీఎస్ఐ చర్చి ఫాస్టర్ రెవరెండ్ విజయరావు మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని అందరూ ప్రార్థనలు చేయాలని భక్తులకు సూచించారు. వర్షాలు బాగా కురిస్తేనే పంటలు పండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అనంతరం మహిళలకు పాటల పోటీలు, పిల్లలకు మ్యూజికల్ చైర్ తదితర ఆటలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా చర్చిల ఫాస్టర్లు లెనిన్, న్యూటన్, ప్రభుదాస్‌లు మాట్లాడుతూ భక్తులకు పలు సూచనలు చేశారు. కాగా నర్సాపూర్ సీఎస్ఐ చర్చి సభ్యులు అరున్, వినోద్, టాగూర్, ప్రేం, తారాభాయి, మేరీ వసంత, ఇందిర, జయశీల తదితరులు పాల్గొన్నారు. - -
యాత్రా వాహనంపై భారీ వృక్షం పడి..
హిసార్(హర్యానా): దైవ దర్శనానికి వెళుతున్న వారి ప్రయాణం విషాదంగా మారింది. వారు వెళుతున్న వాహనంపై ఓ భారీ వృక్షం పడటంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలుకోల్పోగా 20మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పంజాబ్ లోని సంగరూర్ కు చెందిన కొంత 50మంది యాత్రికులు రాజస్థాన్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన గోగామేరికి బయలుదేరారు. అలా వెళుతున్న క్రమంలో వారి వాహనం హర్యానాలోని కోహ్లీ అనే గ్రామం వద్దకు చేరుకోగానే అక్కడ రోడ్డుపక్కనే ఉన్న ఓ భారీ వృక్షం అమాంతం దానిపై పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. -
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి
భక్తులకు సౌకర్యాలు కల్పించాలి మంత్రి జూపల్లి కృష్ణారావు పెద్దకొత్తపల్లి: కృష్ణ పుష్కరాలకు వచ్చే భక్తులకు పుష్కరఘాట్ల వద్ద అధికారులు ఎలాంటి అసౌకర్యం కల్పించవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం అమరగిరి పుష్కరఘాట్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో ఆయన మాట్లాడారు. పుష్కర ఘాట్ల వద్ద బ్రాహ్మణులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని భక్తులు మంత్రికి తెలిపారు. పుష్కరఘాట్ ఇన్చార్జ్ అధికారులతో మంత్రి మాట్లాడారు. సోమశిల ఘాట్ల వద్ద ఉన్న కొంత మందిని అమరగిరి ఘాట్‌కు మార్చాలని సూచించారు. పని కల్పించాలని గిరిజనుల వినతి అమరగిరి పుష్కరఘాట్ల వద్ద తమకు పనులు కల్పించాలని గిరిజన మహిళలు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి మహిళలకు పనులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మరబోటులో సోమశిల ఘాట్‌కు మంత్రి కృష్ణానదిపై వెళ్లారు. నదిలో కృష్ణానది తీరం వెంట ఉన్న అందాలను మంత్రి సెల్ఫోన్లో ఫోటోలు తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమశిల నుంచి అమరగిరి వరకు స్టీమర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. మంత్రి వెంట ఎంపీపీ వెంకటేశ్వర్రావు, నిరంజన్‌రావు, రాంమోహన్‌రావు, కొల్లాపూర్ జెడ్పీటీసీ హన్మంతునాయక్, అమరగిరి ఘాట్ అధికారి కృష్ణయ్య, నాగరాజు, తదితరులు ఉన్నారు. -
అన్నీ కోల్పోయినా... ఆపన్నులకు ఆసరాగా...
మూడేళ్ల కిందట ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి. నదుల్లో చెత్తా చెదారం పేరుకపోవడంతో వరదలు మరింత ఉధృతంగా మారి ఊరూ వాడా ముంచెత్తాయి. వరదల తాకిడికి చాలాచోట్ల ఇళ్లకు ఇళ్లే కొట్టుకుపోయాయి. పలు భారీ కట్టడాలు సైతం నేలమట్టమయ్యాయి. దేశంలో 2004 సునామీ తర్వాత 2013 జూన్‌లో ఉత్తరాదిలో సంభవించిన వరదల కారణంగా అంతటి బీభత్సం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా అప్పుడు హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు, పశ్చిమ నేపాల్, పశ్చిమ టిబెట్ రాష్ట్రాల్లోనూ వరదలు పోటెత్తినా, ఉత్తరాఖండ్‌లోనే అత్యధికంగా 95 శాతం ప్రాణనష్టం సంభవించింది. దాదాపు ఆరువేల మంది ప్రాణాలు కోల్పోగా, 4,200 గ్రామాల్లో భారీ ఆస్తినష్టం వాటిల్లింది. ఇళ్లు కొట్టుకుపోవడంతో చాలామంది నిలువనీడ కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. ఇతర ప్రాంతాల నుంచి చార్ధామ్ యాత్రకు వచ్చిన యాత్రికులు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో వరదల్లో చిక్కుకుపోయారు. సైనిక బలగాలు రంగంలోకి దిగినా, రహదారులు కొట్టుకుపోవడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అగ్నిపరీక్షగా మారింది. ఆ వరదల్లో ఉత్తరకాశీకి చెందిన పర్వతారోహకురాలు మమతా రావత్ (24) ఇల్లు కూడా కొట్టుకుపోయింది. ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయింది. అయినా ఆమె తన గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉత్తరకాశీ పరిసరాల్లో చిక్కుకుపోయిన యాత్రికులను సురక్షిత ప్రదేశాలకు తరలించడంపైనే దృష్టి పెట్టింది. ఉత్తరకాశీ చేరువలోని ద్యారా శిఖరంపై తన వద్ద శిక్షణ పొందుతున్న స్కూలు పిల్లలను తొలుత సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఉత్తరకాశీ-డెహ్రాడూన్ రహదారిని తెరిచిన వెంటనే వాళ్లందరినీ వారి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చింది. తర్వాత తాను శిక్షణ పొందిన నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ బృందంతో కలసి బాధితుల రక్షణ కోసం బయలుదేరింది. వరదల్లో చిక్కుకుపోయిన వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులను వీపు మీద మోసుకుని సురక్షిత ప్రదేశాలకు చేర్చింది. ఇంత ఘనకార్యాన్ని నిర్వహించిన మమతా రావత్ మాత్రం తాను చేసిందంత ఘనకార్యమేమీ కాదంటుంది. ‘నాకు కొండలెక్కడం తెలుసు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి చిక్కుకున్న వారు కొండలతో నిండిన ప్రదేశాల్లో వరదల్లో ముందుకు సాగడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో నాలాంటి వాళ్లు ముందుకు రాకుంటే ఇంకెవరొస్తారు?’ అని నిరాడంబరంగా ప్రశ్నిస్తుందామె. ఈ మాటలు చెబుతుంటే కర్తవ్యాన్ని నెరవేర్చానన్న తృప్తి ఆమె కళ్లలో కనిపిస్తుంది. ‘పెంటియమ్’ పితామహుడు గడచిన పాతికేళ్లలో మన దేశంలో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగింది. సమాచార విప్లవంలో కంప్యూటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్లు ఏ సైజులో కనిపించినా, వాటి పనితీరు కేవలం ఒక చిన్న ప్రాసెసర్ చిప్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లలో వాడే ‘పెంటియమ్’ ప్రాసెసర్ల రూపశిల్పి వినోద్ ధామ్. పుణేలో పుట్టి అమెరికాలో స్థిరపడ్డ వినోద్ ధామ్‌ను శాస్త్ర సాంకేతిక ప్రముఖులు ‘పెంటియమ్ పితామహుడు’గా పిలుచుకుంటారు. పెంటియమ్ ప్రాసెసర్లు వచ్చాక కంప్యూటర్ల పనితీరులో ఊహించని వేగం పెరిగింది. వీరులను సంధిస్తున్న వీరనారి ఆమె వీరనారి మాత్రమే కాదు, భారత సైన్యంలోని వీరులను యుద్ధవిద్యల్లో సుశిక్షితులుగా తీర్చిదిద్దుతున్న శిక్షకురాలు. భారత సైన్యంలో ఏకైక మహిళా కమాండో ట్రైనర్‌గా సీమారావు ఎన్నదగిన కృషి చేస్తున్నారు. సైన్యంలోనే పనిచేస్తున్న భర్త మేజర్ దీపక్‌రావు ప్రోత్సాహంతో యుద్ధవిద్యల్లో సాధన చేసిన సీమారావు అనతికాలంలోనే సైనికులకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. సీమారావు తండ్రి ప్రొఫెసర్ రమాకాంత్ సినారి స్వాతంత్య్ర సమరయోధుడు. ఎంబీఏ చదువుకున్నా, దేశానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో సీమారావు యుద్ధవిద్యల్లో శిక్షణ పొందారు. ఇప్పటి వరకు ఆమె దాదాపు 15 వేల మంది సైనికులను సుశిక్షితులుగా తీర్చిదిద్దారు. చదువు కోసం... ఎవరో వస్తారను కోలేదు. ఏదో చేస్తారు అని కూడా ఆశ పడలేదు. ‘సమస్య మనది. పరిష్కారం కూడా మన నుంచే రావాలి’ అనుకున్నారు రాజస్థాన్‌లోని హమీర్పూర్ గ్రామస్థులు. ఈ ఊరి పిల్లలు సర్కారు బడిలో చదువుకోవడానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరం నడవాలి. దీని ప్రభావం వారి చదువుపై పడింది. హాజరు శాతం తగ్గింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామస్థులంతా సమావేశమయ్యారు. పరిష్కారం కనుగొన్నారు. అందరూ కలిసి ఒక బస్ కొనుగోలు చేశారు. డ్రైవర్ జీతం, పెట్రోల్ ఖర్చులు కూడా గ్రామస్థులే చెల్లిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజూ స్కూలుకు వెళుతున్నారు. డౌరీ ఫ్రీ-ఏరియా! అన్ని ఊళ్లలాగే అదో ఊరు. అయితే ఆ ఊళ్లో ఇంటింటికో కథ. ఆ కథలన్నీ కట్నం చుట్టే ముడిపడి ఉన్నాయి. కట్న భూతం దెబ్బకు కేరళలోని నీలంబూర్ కన్నీటితో తడిసి పోయింది. కట్నం ఇవ్వలేక... పుట్టింటికే పరిమితమైన అమ్మాయిలు. అనేక కష్టాలు పడి కట్నకానుకలు ఇచ్చినా... అత్తింటివారి గొంతెమ్మ కోరికలతో పెళ్లయిన కొద్దిరోజులకే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, కట్నం కోసం శారీరక, మానసిక హింసలు మామూలై పోయాయి. ఈ నేపథ్యంలో ఊళ్లోని పెద్దలు తమ గ్రామాన్ని కట్నరహిత గ్రామంగా మార్చాలనుకున్నారు. కట్ననిషేధంపై అవగాహన కోసం తల్లిదండ్రులు, యువతీయువకులతో వర్క్‌షాప్ నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. వారి శ్రమ వృథా పోలేదు. ఇప్పుడు నీలంబూర్ ఒక గ్రామం కాదు... సరికొత్త భారతానికి బలమైన ముందడుగు. అ‘గణిత’ ప్రతిభాశాలి గణాంక శాస్త్రానికి విశేష ప్రాచుర్యంతో పాటు పలు శాస్త్రాల్లో, పలు రంగాల్లో గణాంకాలకు విస్తృత వినియోగం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన అ‘గణిత’ ప్రతిభాశాలి ప్రొఫెసర్ సి.ఆర్.రావు. కర్ణాటకలోని బళ్లారి వద్ద హడగళి గ్రామంలో పుట్టిన తెలుగువాడైన సి.ఆర్.రావును మనదేశంలో పుట్టిన టాప్-10 శాస్త్రవేత్తల్లో ఒకరిగా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రకటించిందంటే ఆయన శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోవచ్చు. సి.ఆర్.రావు సలహాల మేరకే టోక్యోలో ఆసియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటైంది. ఆర్థిక, గణాంక శాస్త్రాలను కొత్త పుంతలు తొక్కించిన పరిశోధనల ద్వారా సి.ఆర్.రావు ఆర్థిక రంగంలో దేశ పురోగతికి ఎంతగానో దోహదపడ్డారు. అగ్నిమాపక దళంలో తొలి అతివ మన దేశంలో పదేళ్ల కిందటి వరకు అగ్నిమాపక దళంలో అందరూ పురుషులే ఉండేవారు. మంటల్లోకి దూకే తెగువ మగాళ్లకే కాదు, మగువలకూ ఉంటుందని నిరూపించిన తొలి మహిళ హర్షిణి కన్హేకర్. డిగ్రీ పూర్తయ్యాక నాగపూర్‌లోనే నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజీలో చేరి, అగ్నిమాపక పద్ధతుల్లో శిక్షణ పొందారు. అప్పటి వరకు అందరూ పురుషులే ఉన్న ఆ కాలేజీలో చేరిన తొలి మహిళగా హర్షిణి అరుదైన రికార్డు సృష్టించారు. శిక్షణ తొలినాళ్లలో వివక్ష ఎదుర్కొన్నా, శిక్షణ పూర్తయిన తర్వాత తన ఆశయం మేరకు అగ్నిమాపక దళంలో చేరారు. ఆ తర్వాత చాలామంది మహిళలు ఈ రంగంలోకి వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచారు. మద్యంపై పోరాటం ‘‘మన ఊళ్లో మద్యనిషేధానికి ప్రయత్నిద్దామనుకుంటున్నాను’’ అని తన ఆలోచనను నాగభూషణ ఫ్రెండ్స్‌కు చెప్పినప్పుడు వాళ్లు పెద్దగా నవ్వారు. తమిళనాడులోని నూరుందుమలై నాగభూషణ సొంత ఊరు. ఈ ఊళ్లో పేదరికం ఎక్కువ. దీనికి తోడు విపరీతమైన మద్యపానం. సోషల్ వర్క్‌లో పీజి పూర్తి చేసుకున్న నాగభూషణ... మద్యంపై యుద్ధభేరి మోగించాడు. మొదట ఒక్కడుగా బయలుదేరినా... సామూిహకశక్తిగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇప్పుడు నూరుందుమలై ఆల్కహల్, టోబాకోఫ్రీ జోన్‌గా ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. పక్షులంటే ప్రాణం పెడతాడు... పక్షుల తీయటి కూతలను వినే తీరికే మనకు లేదు. వాటి తీయటి కళ్లలోకి తొంగిచూసే ఓపిక మనకు లేదు. అసలు వాటి ఉనికిని గుర్తించే పరిస్థితే లేదు మనకు. కానీ అందరూ అలా ఉండరు. పక్షులకు కూడా మనిషికి ఇచ్చినంత విలువే ఇచ్చి తమ మంచిమనసును చాటుకుంటారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు 15 కి.మీ దూరంలో ఉన్న గడ్మెడ్షింగి గ్రామానికి చెందిన అశోక్ సోన్లే కూలీ పని చేస్తాడు. ఈ అశోక్ ప్రత్యేకత ఏమిటంటే... తనకున్న పావు ఎకరం పొలంలో జొన్న పంట వేసి పక్షుల ఆకలిని తీర్చడమే కాదు చిన్న చిన్న పాత్రల్లో నీళ్లు పెట్టి వాటి దాహాన్ని కూడా తీర్చుతున్నాడు. జీవవైవిధ్యం, దాని విలువ తెలుసుకోవడానికి శాస్త్ర గ్రంథాలు చదవనక్కర్లేదని... మనసు ఉంటే చాలు అని నిరూపిస్తున్నాడు అశోక్. ‘ఫార్మా’ పితామహుడు ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రఫుల్లచంద్ర రాయ్ చేసిన కృషి చిరస్మరణీయమైనది. బెంగాల్లో రారులి-కాటిపురా గ్రామంలో (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉందీ గ్రామం) పుట్టిన రాయ్, కలకత్తాలోని అల్బర్ట్ స్కూల్లోను, విద్యాసాగర్ కాలేజీలోను విద్యాభ్యాసం చేశారు. రసాయన శాస్త్రంపై మక్కువతో విస్తృతంగా పరిశోధనలు సాగిస్తూనే, ప్రెసిడెన్సీ కాలేజీలో విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ బోధించారు. నైట్రేట్స్, హైపోనైట్రేట్స్పై ఆయన జరిపిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఆధునిక యోగ పితామహుడు భారతీయ యోగ శాస్త్రానికి ఆధునిక గురువుగా పేరుగాంచిన వారు తిరుమలై కృష్ణమాచార్య. భారతీయ వైదిక దర్శనాలుగా పిలిచే వైశేషిక, న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వేదాంతాలైన... ఈ ఆరింటినీ ఔపోసన పట్టారు. భారతీయ తత్వశాస్త్రంలో ఉత్తీర్ణత సాధించారు. భారతదేశమంతా పర్యటించి ఆధునిక యోగశాస్త్రాన్ని ప్రచారం చేశారాయన. యోగ మకరంద, యోగ రహస్య, యోగావళి వంటి పుస్తకాలూ, అనేక వ్యాసాలూ రాశారు. ‘ద ఫాదర్ ఆఫ్ మోడ్రన్ యోగా’గా ప్రసిద్ధి చెందిన ఆయన నూరేళ్ల పూర్ణ జీవితం గడిపి ఫిబ్రవరి 28, 1989లో కన్నుమూశారు. హెల్పింగ్ హ్యాండ్ ఒక వీల్ చైర్ ధర వేల నుంచి మొదలై కొన్ని సార్లు లక్షల్లోనూ ఉంటుంది. వికలాంగులందరూ వీల్ చైర్‌ను ఆ ధర చెల్లించి కొనలేకపోవచ్చు. అలాంటి వారికోసమే ఫల్గుణీ దోషి మదిలో ఒక ఆలోచన వచ్చింది. దాని నుంచి ఆవిర్భవించిందే ‘హెల్పింగ్ హ్యాండ్’ అనే ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కింద ఆమె వికలాంగులకు వీల్చైర్లు అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందుకు గాను రోజుకు ఒక రూపాయిని అద్దెగా వసూలు చేస్తారు. కానీ ఆ వీల్ చైర్‌ను తిరిగి ఇచ్చేస్తే... మళ్లీ ఆ రుసుమును చెల్లిస్తారు ఫల్గుణీ. ఉచితంగానే ఇస్తే ఆ సేవల దురుపయోగం జరగవచ్చనే ఈ నిబంధన. కుటుంబ నియంత్రణపై... కుటుంబ నియంత్రణను విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చిన బానూ జహంగీర్ కొయాజీ పూణేలోని కింగ్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో గైనకాలజిస్ట్‌గా కెరియర్ ప్రారంభించారు. మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మొదలుకొని ప్రచంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), వరల్డ్ బ్యాంక్, యునెటైడ్ నేషన్స్ ఫండ్ ఫర్ పాపులేషన్ యాక్టివిటీస్ (యూఎన్ఎఫ్పీఏ... ఇప్పుడు దీన్నే యునెటైడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అంటున్నారు) వంటి అంతర్జాతీయ సంస్థలకు కన్సల్టెంట్‌గా, సలహాదారుగా సేవలు అందించారు. కుటుంబ నియంత్రణ, పట్టణ-గ్రామీణ ఆరోగ్యం, చిన్నపిల్లల ఆరోగ్యం వంటి అనేక సామాజిక సేవారంగాలలో విశేష కృషి చేశారు. గాంధీమార్గంలో పచ్చటి ఉద్యమం గాంధీమార్గంలో పనిచేసే పర్యావరణవేత్తగా చండీ ప్రసాద్ భట్‌కు ప్రఖ్యాతి ఉంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాకు చెందిన ఆయన 1964లో దషోలీ గ్రామ్ స్వరాజ్య సంఘ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. గాంధేయ మార్గంలో చెట్లను కాపాడుకోవాలనే ఉద్యమానికి చండీ ప్రసాద్ భట్ ఆద్యుడు. ఆయన ప్రారంభించిన ఉద్యమం 1973లో ప్రాంతాల్లో ‘చిప్కో’గా రూపుదాల్చింది. గాంధేయ పద్ధతుల ద్వారానే పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు అటవీ ఉత్పాదనల మీద ఆధారపడే పరిశ్రమలూ వచ్చేలా చేశారు. అతడు అడవిని సృష్టించాడు కేరళరాష్ట్రంలోని పులయమ్కులమ్ ప్రాంతానికి వెళితే మనిషి సృష్టించిన అడవిని చూడవచ్చు. కేరళలోని కాసరగడ్ వాస్తవ్యుడైన అబ్దుల్ కరీం తన గ్రామానికి పాతిక కిలోమీటర్ల దూరంలో 32 ఎకరాలలో అడవిని నిర్మించాడు. ఇంకా నిర్మిస్తూనే ఉన్నాడు. పాతికేళ్ల క్రితం ఈ ప్రాంతమంతా రాతినేల. ప్రభుత్వ బంజరు భూమి. చెట్టు అన్నది లేకపోవడంతో ఇక్కడి భూగర్భజలాలు అన్నీ అడుగంటి పోయాయి. ప్రజలు నీటి కోసం మైళ్ల దూరం వెళ్లేవారు. చెట్టు అన్నదే కానిరాని ఈ నేలలో కరీం ఇక్కడ మొక్కల పెంపకం చేపట్టాడు. ముందు 5 ఎకరాలలో ప్రారంభించి ఏటికి పై యేడు మొక్కల సంఖ్య పెంచుతూ పోయాడు. మొక్కలు చెట్లు అయ్యాయి. అడుగంటిన భూగర్భజలాలు నిండుకుండలయ్యాయి. సైంటిస్టులు, ప్రకృతి ప్రేమికులు ఈ రాతినేలలో ఇంత పచ్చటి అడవి ఎలా సాధ్యమైందని పరిశోధనకు ఇక్కడకు రావడం ప్రారంభించారు. పదోతరగతి వరకే చదువుకున్న కరీం అటవీ శాస్త్రాన్ని ఔపోసన పట్టాడు. తండాలో పుట్టిపెరిగి ఐఏఎస్ స్థాయికి... బానోత్ చంద్రకళ పుట్టింది, పెరిగింది కరీంనగర్ జిల్లా, ఎల్లారెడ్డి మండలం, గర్జన పల్లి గ్రామం. ఉన్నత చదువులు చదువుకోవడానికి పెద్దగా సౌకర్యాల్లేని లంబాడా తండాలో పుట్టారామె. చదువుకోవాలనే పట్టుదల ఒక్కటే ఆమెను యూపీఎస్సీ పరీక్షలో 409వ ర్యాంకు సాధించేలా చేసింది. డిగ్రీ రెండవ సంవత్సరంలో పెళ్లయింది. భర్త రాములు ఇంజనీర్. దూరవిద్య ద్వారా ఎం.ఎ ఎకనమిక్స్ చేశారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐఎఎస్ ఆఫీసర్‌గా 2008లో ఎంపికైన చంద్రకళ మధుర జిల్లా డిఎమ్‌గా చేశారు. ప్రస్తుతం బులంద్ శహర్ డిస్ట్రిక్ట్ మేజిస్టేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఐరన్ లేడీ ఆఫ్ లడక్ ప్రభుత్వం చేయలేని పనిని ఆమె చేసి చూపించారు సామాన్య ఉపాధ్యాయురాలైన సుజాతా సాహు. కశ్మీర్‌లోని లడక్ జిల్లాలో విద్యావకాశాలు అంతంత మాత్రంగా ఉన్న 370 పాఠశాలలను దత్తత తీసుకున్నారు. మరో వంద పాఠశాలల్లోని 675 మంది టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కొండలు, లోయల నడుమ బస్సులు కూడా ప్రయాణించలేని కుగ్రామాలకు గుర్రాల మీద పుస్తకాలను తీసుకుపోయి మరీ పిల్లలకు పంపిణీ చేశారు. లడక్ జిల్లాలోని మొత్తం 963 పాఠశాలలకూ తన సేవలను విస్తరించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. చెక్కుచెదరని దృఢ సంకల్పమే ఆమెకు ‘ఐరన్ లేడీ ఆఫ్ లడక్’గా గుర్తింపు తెచ్చింది. గ్రామం కోసం... జైపూర్‌కు 60 కి.మీ. దూరంలో ఉన్న సోదా అన్న గ్రామానికి సర్పంచ్‌గా సేవలందిస్తూ ఉన్నారు ఛవి రజావత్. పూణేలో ఎంబీయే చదివాక టైమ్స్ ఆఫ్ ఇండియా, కార్ల్సన్ గ్రూప్ హోటల్స్, ఎయిర్టెల్ వంటి సంస్థల్లో పనిచేశారు. గ్రామీణ ప్రాంతాల వారికి సేవలందించడానికి కార్పొరేట్ సంస్థలను వదిలేశారు. ఎంబీఏ పూర్తయ్యాక సర్పంచ్‌గా పనిచేసిన తొలి మహిళా సర్పంచ్ ఆమె. తనదైన శైలి చూపించాలనే ఉద్దేశంతో ఛవి తన గ్రామానికి తాగునీటి వసతి, రోడ్లు వంటి సేవలు కల్పించారు. 2012 నాటి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో పాలుపంచుకున్నారామె. ప్రాణాలను కాపాడే యువహీరో చెన్నైకి చెందిన పంతొమ్మిదేళ్ల వెంకటేష్ నిత్యం సముద్ర అలలతో పోరాడుతున్నాడు. అదీ సాటి మనిషిని కాపాడటం కోసం. చెన్నైలోని మెరీనా బీచ్‌లో కనిపించే ఈ యువ హీరో ఇప్పటి వరకు వంద మందికి పైగా ప్రాణాలను కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఇదేమీ అతని వృత్తి కాదు. చింతాడ్రిపేట్వాసి అయిన వెంకటేశ్ కుటుంబ ఆర్థిక లేమి కారణంతో 9వ తరగతితోనే చదువు ఆపేశాడు. ఒకరోజు స్నేహితులతో కలిసి చేపల వేట చేస్తున్న వెంకటేష్‌కు ‘హెల్ప్ హెల్ప్’ అనే అరుపులు వినిపించాయి. అల్లంత దూరంలో నీటిలో మునిగిపోతున్న ఓ కాలేజీ విద్యార్థిని చూశాడు. అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చాడు. ప్రాణం విలువ ఎంతటిదో ఆ క్షణంలో కళ్లకు కట్టింది అంటాడు ఈ యంగ్‌స్టర్. ఇంత రిస్క్ చేసి కాపాడినందుకు కృతజ్ఞత చెబుతూ ఎవరైనా డబ్బులు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరిస్తాడు. డబ్బు కోసం ఈ పనిచేయడం లేదని చెబుతాడు. బీచ్ పెట్రోల్ అధికారులకూ వెంకటేష్ ఓ యువ హీరో! అరుదైన రికార్డ్... ఎథేన్స్లో జరిగిన స్పెషల్ ఒలింపిక్స్‌లో రెండు తామ్ర పతకాలు సాధించింది సీతా సాహూ. మెంటల్లీ ఛాలెంజెడ్ విభాగంలో జరిగిన పోటీల్లో ఆమె 200 మీటర్లు, 1600 మీటర్ల పరుగులో ఈ ఘనత సాధించింది. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్కు చెందిన సీతా కేవలం 15 ఏళ్ల వయసులో ఆ అరుదైన రికార్డును నమోదు చేసింది. దేశానికి కీర్తి తెచ్చిన ఆమె ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రస్తుతం సీతాసాహూ గోల్గప్పా (గప్‌చుప్) తయారీలో తన తల్లికి తోడ్పడుతోంది. దేశం అమ్ముల పొదిలో ఆగ్నేయాస్త్రం మన దేశం అమ్ముల పొదిలో ఆగ్నేయాస్త్రం టెస్సీ థామస్. సాదాసీదా గృహిణిలా కనిపించే టెస్సీ కేరళలోని అలప్పురలో పుట్టిపెరిగారు. త్రిసూర్ కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తయ్యాక, పుణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. హైదరాబాద్‌లోని డీఆర్డీవోలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె అగ్ని-3 క్షిపణి తయారీ ప్రాజెక్టు డెరైక్టర్‌గా పనిచేశారు. ఆమె ఆధ్వర్యంలోనే అగ్ని-4, అగ్ని-5 ప్రాజెక్టులు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు పురుషులు మాత్రమే సేవలందిస్తూ వచ్చిన క్షిపణి తయారీ రంగంలోకి ప్రవేశించిన తొలి మహిళగా టెస్సీ థామస్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గిరిబిడ్డల దేవుళ్లు గడ్చిరోలి జిల్లా మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతం. దవాఖానాను ఆ గిరిపుత్రుల దర్వాజాల ముందు తెరిచిన డాక్టర్ దేవుళ్లు అభయ్ బంగ్, రాణి బంగ్ దంపతులు. పేదరికం, శిశుమరణాలతో శోకసముద్రంలా ఉండేది ఈ ప్రాంతం. తమ వైద్యంతో శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గించారు. ఆరోగ్యవంతమైన గిరి బిడ్డలకు పురుడు పోస్తున్నారు.‘సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్, యాక్షన్ అండ్ రీసెర్చ్ ఇన్ కమ్యునిటీ హెల్త్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి దాని ద్వారా గిరిజన ప్రాంతాల్లో చదువు, ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారు డాక్టర్ అభయ్ బంగ్, డాక్టర్ రాణిబంగ్. సాగుకు వైద్యం మహారాష్ట్రలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం, రైతు ఆత్మహత్యల కేంద్రం మెల్ఘాట్. ఆ రుగ్మతకు వైద్యం కనిపెట్టారు డా. రవీంద్ర కొల్హె, డా.స్మిత కొల్హె. రైతులుగా మారి కరువును జయించే సాగుచేస్తున్నారు. పశువైద్యమూ నేర్చుకున్నారు. రోడ్లు వేయించి మెల్‌ఘాట్‌ను ప్రపంచంతో కలిపారు. కరెంటుతో వెలుగులు నింపారు. ఈ బాధ్యతను తమ వరకే పరిమితం చేసుకోకుండా తమ పిల్లలకూ పంచారు. ఆ దంపతుల సంతానం రోహిత్, రామ్‌లు తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తున్నారు. సంచారుల స్వప్నం అహ్మదాబాద్ వాస్తవ్యురాలు మిత్తల్ పటేల్. జర్నలిజం గ్రాడ్యుయేట్. ఏడేళ్లుగా సంచార జాతుల సంక్షేమం గురించి పాటుపడుతున్నారు. ప్రభుత్వ గుర్తింపు నోచుకోని దాదాపు వెయ్యి రకాల సంచార, గిరిజన జాతుల గురించి పోరాడి వాళ్లకు చట్టపరమైన గుర్తింపు తెచ్చారు. షెడ్యూల్డ్ కులాలకు, తెగలకు ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్ల కేటగిరీలోకి ఇప్పుడు వాళ్లూ చేరారు. ఈ ప్రయాణంలో ఆమె చాలా ఆటుపోటులు ఎదుర్కొన్నారు. సంచార జాతుల వాళ్ల చేతుల్లో దాడికీ గురయ్యారు. అయినా అడుగు వెనక్కి వేయలేదు. కూడు, గుడ్డ, గూడుతోపాటు రాజకీయాల్లో కూడా వాళ్లకు అవకాశం కల్పించారు మిత్తల్పటేల్. అనాథల అమ్మ మహారాష్ట్రలోని వార్ధా జిల్లా, పింప్రి మేఘే అనే ఊళ్లో పుట్టారు సింధుతాయి. 20వ యేటనే ఊళ్లో పెద్దమనుషులు చేస్తున్న గోబర్‌గ్యాస్ అక్రమ వ్యాపారాన్ని ఎండగట్టారు. భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. అప్పుడు ఆమె 9 నెలల గర్భిణి. ఓ గొర్రెల పాకలో ఆడపిల్లకు జన్మిచ్చారు. చంటిబిడ్డతో రైల్వేప్లాట్ఫార్మ్ మీద జీవితాన్ని మళ్లీ ప్రారంభించారు. అక్కడ అనాథలైన ఎంతో మంది చిన్నారులను చూసి చలించారు. తల్లిలా వాళ్లందరినీ చేరదీశారు. ఇలా ఇప్పటికి 1050 మంది అనాథలకు ఆమె అమ్మయ్యారు. సమ్మతి బాల్ నికేతన్‌ను స్థాపించారు. దీన జనబంధు నిజాయితీ, నిబద్ధతలకు నిదర్శనం ఎస్.ఆర్. శంకరన్. జన్మభూమి తమిళనాడులోని తంజావూర్. కర్మభూమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఐఏఎస్ ఆఫీసర్, సామాజిక కార్యకర్త హోదాలో దళిత, గిరిజనుల సంక్షేమం కోసం పాటుపడ్డారు. బొగ్గు గనులను జాతీయం చేయడంలో ఆయన సహకారం మరువలేనిది. సఫాయి కర్మచారి ఆందోళన్‌కు మెంటర్. ఆంధ్రప్రదేశ్‌లో కట్టు బానిసత్వ నిరోధక చట్టం సరిగ్గా అమలయ్యేలా ఒత్తిడి తెచ్చారు. చుండూరు మారణకాండ బాధితులకు పునరావాసం కల్పించడంలో ఆయన కృషి మరువలేనిది. కన్సర్న్డ్ సిజిటన్స్ కమిటీ అనే సంస్థను పెట్టి బూటకపు ఎన్కౌంటర్లను, మిలిటెంట్ల దాష్టీకాలను నిరోధించే ప్రయత్నం చేశారు. కరెక్ట్ ట్రాక్ దేశంలోనే కాదు మొత్తం ఆసియా ఖండంలోనే తొలి మహిళా ట్రైన్ డ్రైవర్ సురేఖా యాదవ్. ఆమె స్ఫూర్తిని మరో యాభై మంది మహిళలూ పంచుకున్నారు. ప్రయాణాల్లో మహిళల రక్షణ విషయంలోనూ తొలి అడుగు సురేఖా యాదవ్‌దే. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఆడవాళ్లు ఎదుర్కొంటున్న ఈవ్ టీజంగ్, వేధింపులను చూసి, బాధపడి లేడీస్ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసేందుకు కృషిచేశారు. ఆ కృషి ఫలితంగా ఏడాది నుంచి దేశంలోని నాలుగు నగరాల్లో లేడీస్ స్పెషల్ ట్రైన్స్ పరుగులు తీస్తున్నాయి. ముంబైలోని విక్టోరియా టెర్మినస్‌లో మొదలైన తొలి లేడీస్ స్పెషల్ట్రైన్ని ఆమే నడిపారు. అనాథ ఆడపిల్లలకు అమ్మ వీధులపాలైన నవజాత ఆడ శిశువులకు గూడు కల్పించి తల్లి స్థానంలో నిలిచారు ప్రకాశ్ కౌర్. పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో యునిక్ పేరుతో హోమ్ ఏర్పాటు చేసి నిలువనీడలేని అమ్మాయిలకు ఆశ్రయం కల్పించారు. అరవై ఏళ్ల క్రితం తాను ఆడపిల్ల అనే వివక్షతో వీధిపాలయ్యానని, నేటికీ ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదంటారు కౌర్. 1993లో ఏర్పాటు చేసిన యునిక్ హోమ్‌లో ఇప్పుడు 64 మంది ఆడపిల్లలకు తల్లిలా వారి మంచి చెడ్డలను చూస్తున్నారు. వీరందరికీ చదువు, సామాజికనైపుణ్యాలు, వృత్తివిద్యలు నేర్పుతూ భవిష్యత్తుకు కొత్తదారులు వేస్తున్నారు. ఈ హోమ్‌లో 4రోజుల పసిగుడ్డు నుంచి 19 ఏళ్ల యువతుల వరకు ఆశ్రయం పొందుతున్నారు. అవినీతిపై పోరులో అమరుడైన యోధుడు అవినీతిపై పోరులో అశువులు బాశారు షణ్ముగం మంజునాథ్. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన ఆయన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉన్నతోద్యోగి. పెట్రోల్ కల్తీ మాఫియాకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం సాగించారాయన. ఒక పెట్రోల్ బంకులో కల్తీ జరుగుతున్నట్లు తెలిసి 2005 నవంబర్‌లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంజునాథ్‌ను పెట్రోల్ మాఫియా దుండగులు దారుణంగా హత్య చేశారు. మంజునాథ్ కుటుంబానికి కోర్టు నష్టపరిహారం ఇప్పించింది. పరిహారం మొత్తంతో మంజునాథ్ కుటుంబం ఆయన పేరిట ట్రస్టు ఏర్పాటు చేసి, ఏటా నిజాయతీపరులైన అధికారులకు అవార్డు అందజేస్తోంది. పార్లమెంటుపై దాడిని అడ్డుకుని... దేశంలో అశోకచక్ర అవార్డు పొందిన ఏకైక మహిళ కమలేష్ కుమారి. స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని సికిందర్‌పూర్. ఐదేళ్ల క్రితం ఉగ్రవాదులు పార్లమెంట్ భవనంపై దాడి చేసినప్పుడు ఆమె చూపిన సాహసం అసాధారణమైంది. పార్లమెంట్ గేటు వద్ద డ్యూటీలో ఉన్న ఆమె మరో గేటు నుంచి ఉగ్రవాదులు రావడం గుర్తించింది. అప్పుడు ఆమె చేతిలో వైర్లెస్ తప్ప మరే ఆయుధాలు లేవు. తన రక్షణ గురించి ఆలోచించకుండా గట్టిగా అరుస్తూ... ఉగ్రవాదులు ఉన్నవైపుగా పరుగులు తీసింది. ఆమె అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ మిలిటెంట్లు కమలేష్ మీద బుల్లెట్ల వర్షం కురిపించారు. అలెర్ట్ అయిన భద్రతాసిబ్బంది మిలిటెంట్ల మీద తిరుగుదాడి చేశారు. మహిళా చేతన! మహారాష్ట్రలోని మహస్వాద్ ప్రాంతంలో మహిళలు పొలాల్లో కూలీలుగానో, సొంత పొలంలో భర్తతోపాటు సాగుపనులు చేస్తూనో ఉన్నారు. దాచుకున్న డబ్బంతా భర్తల తాగుళ్లకో, ఇంకేదో అవసరంలేని విషయానికో ఖర్చయిపోయి ఆర్థిక సమస్యలు వచ్చేటప్పటికీ ఒట్టిచేతులతో మిగలసాగారు. చేతనాసిన్హాకూ ఇది ఎదురైంది. మా ఊళ్లో మహిళా బ్యాంకు పెట్టమని ఆర్.బి.ఐ.ని కోరింది. అక్కడంతా చదువురాని మహిళలే ఉన్నారు కాబట్టి బ్యాంకు పెట్టడం అసాధ్యం అన్నారు అధికారులు. మూడు నెలల్లో చదువు నేర్చుకొని, బ్యాంకింగ్‌లో శిక్షణ తీసుకొని తమ ప్రాంతంలో మహిళా గ్రామీణ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రోడ్ డాక్టర్ రోడ్ల మీద అడుగడుగునా గుంతలు, గతుకులు.. ఈ దేశం తీరింతే అని అసహనం చూపేవారే అంతా! కానీ, 66 ఏళ్ల గంగాధర్ తిలక్ కట్నం మాత్రం ఎవరినీ నిందించకుండా దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేస్తూ ‘రోడ్ డాక్టర్’ అయ్యారు. సికింద్రాబాద్ దక్షిణమధ్య రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజినియర్గా పనిచేసి రిటైర్ అయిన గంగాధర్ నగర రోడ్ల మీద ఇప్పటి వరకు 1,124 గుంతలను పూడ్చాడు. శ్రమదానం పేరుతో వచ్చే పెన్షన్‌ను ఇందుకోసం వెచ్చిస్తున్నాడు. 8 ఏళ్ల క్రితం ఒక గుంత వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి బాధపడిన తిలక్ వీటిని పూడ్చాలనే కంకణం కట్టుకున్నాడు. ఈ రోడ్డాక్టర్తో జీహెచ్ఎమ్సీ చేతులు కలిపింది. మన సైన్యంలో తొలి మహిళ లా గ్రాడ్యుయేట్, పోలీస్ ఆఫీసర్ అయిన ప్రియా ఝింగాన్కు ఆర్మీలో చేరడం కల. ఆర్మీలో మహిళలకు ప్రవేశం ఎందుకు కల్పించడం లేదు, మహిళలకూ అవకాశం ఇవ్వండి అంటూ 1992లో ఆర్మీచీఫ్‌కి ఒక ఉత్తరం రాశారు ఆమె. ఏడాది తర్వాత ఆమె వినతికి కార్యరూపం ఇచ్చారు ఆ ఆర్మీచీఫ్. ఆమె ఉత్తరం వల్ల ఝింగాన్తోపాటు మరో 24 మంది మహిళలకు ఆర్మీలో చేరే అవకాశం కలిగింది. దేశ రక్షణ పురుషులే కాదు మహిళలు కూడా ఏమాత్రం తీసిపోకుండా ముందుంటారు అని నిరూపించారు, దేశభక్తికి స్త్రీ, పురుష బేధం లేదు అన్న సత్యాన్ని సమాజం గ్రహించేలా చేశారు ప్రియా ఝింగాన్. అర్ధరూపాయి ఆదాయం నుంచి... వ్యసనాల బారిన పడ్డ భర్త కారణంగా ఆమె వైవాహిక జీవితం దుర్భరంగా మారింది. అప్పటికే ఇద్దరు పిల్లలు. వాళ్ల పోషణ కోసం తోపుడుబండి మీద తినుబండారాలను అమ్ముకోసాగారు పాట్రీషియా నారాయణ్. చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ముప్పయ్యేళ్ల కిందట తోపుడుబండిపై వ్యాపారం చేసుకునే రోజుల్లో ఆమె రోజువారీ ఆదాయం అర్ధరూపాయి మాత్రమే. క్రమంగా ఇద్దరు సిబ్బందితో చిన్న హోటల్ ప్రారంభించిన ఆమె ఇప్పుడు రెస్టారెంట్ల చైన్‌కు యజమానిగా ఎదిగారు. ఇప్పుడామె రెస్టారెంట్ల రోజువారీ ఆదాయం రూ.2 లక్షల పైచిలుకే ఉంటుంది. అట్టడుగు స్థాయి నుంచి అపూర్వ విజయం సాధించిన పాట్రీషియా ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. పేదింట పుట్టిన పసి మేధావి లక్నోలోని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టింది సుష్మా వర్మ. ఆమె తండ్రి రోజు కూలీ. ఒకే గది ఇల్లు, కురిసే పైకప్పు. ఆ కుటుంబానికి వేరే ఆధారమే లేదు. అలాంటి పరిస్థితుల్లో అసాధారణమైన తన ధారణ శక్తిని నిరూపించుకుని మరీ ఐదేళ్ల వయసులో నేరుగా తొమ్మిదో తరగతిలో అడ్మిషన్ పొందగలిగింది. ఆడుతూ పాడుతూనే 7 ఏళ్ల వయసులో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. అప్పటి నుంచి ఆమె చదువుకు ఇతరుల సాయం అందడంతో పరిస్థితి మెరుగుపడింది. తర్వాత 13 ఏళ్ల వయసులో బోటనీలో డిగ్రీ, 15 ఏళ్ల వయసులో మైక్రోబయాలజీలో పీజీ పూర్తిచేసింది. ఇప్పుడు పీహెచ్డీ చేస్తోంది. గ్రామీణాభివృద్ధి నాయకుడు అరవై మూడేళ్ల మణిభాయ్ దేశాయ్ సామాజిక కార్యకర్త. గొప్ప గాంధేయవాది. పర్యావరణ వేత్త. అటవీ సంపద పెంపునకు కృషి చేసిన వ్యక్తి. 1946లో గాంధీజీ ప్రసంగాలకు ప్రభావితుడైన మణిభాయ్ పుణేలోని ఉర్లిలో మొట్టమొదటిసారి నేచర్ క్యూర్ ఆశ్రమాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు. పాఠశాలలను ఏర్పాటు చేశాడు. భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి ఇండో-యురోపియన్ హైబ్రీడ్ రకాలను పెంపొందించాడు. వ్యసాయరంగాన్ని, పాడిపరిశ్రమను వృద్ధిలోకి తెచ్చి దాదాపు 5 లక్షలకు పైగా కుటుంబాల ఆర్థికలేమిని తీర్చాడు. 5 రాష్ట్రాలలో 8 లక్షలకు పైగా పశు సంపదను పెంచాడు. ఈయన సేవలను గుర్తించిన భారతప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తప్పిపోయిన వారికి ఆపద్బాంధవుడు జాతరలోనో, తిరనాళలోనో చిన్నారులు తప్పిపోవడం సహజమే. కుంభమేళా వంటి భారీ జాతరలోనైతే పెద్దలు సైతం ఒకరి నుంచి ఒకరు తప్పిపోతుంటారు. అయిన వారి నుంచి తప్పిపోయిన వారిని తిరిగి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడంలో రాజారామ్ తివారీకి మరెవరూ సాటిరాలేరు. పోలీసు యంత్రాంగం చేయలేని పనిని ఈ పెద్దాయన తన ‘ఖోయా పాయా’ శిబిరం ద్వారా ఒంటిచేత్తో చేస్తూ తప్పిపోయిన వారికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు కుంభమేళాలో తప్పిపోయిన 20 వేల మంది చిన్నారులను, పది లక్షల మందికి పైగా పెద్దలను వారి వారి కుటుంబాలకు అప్పగించిన అరుదైన ఘనత ఆయన సొంతం. నిర్విరామ జలరక్షకుడు దాహార్తిని తీర్చే నీరు వృథాగా పోతుంటే ముంబైకి చెందిన ఆబిద్ సూర్తి ఏమాత్రం తట్టుకోలేరు. వృత్తిరీత్యా కార్టూనిస్టు, రచయిత అయిన సూర్తి నలభయ్యేళ్లుగా కామిక్ పుస్తకాల ద్వారా పిల్లలను అలరిస్తున్న సూర్తి, ముంబైలో జరిగే నీటి వృథాను అరికట్టడానికి తనవంతు కృషిని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. చిన్నప్పుడు తన తల్లి వీధి కుళాయి నుంచి నీరు పట్టేందుకు పడే అవస్థలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయంటారు ఆయన. అందుకే ఎక్కడ కారుతున్న కొళాయిలు కనిపించినా వెంటనే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసేస్తారు. పైపుల మరమ్మతుల కోసం ఆయన ‘డ్రాప్ డెడ్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. ముసుగును తగలేసిన మగువ లింగవివక్షకు మారుపేరైన హర్యానా గ్రామాల్లో మహిళలపై ఆంక్షలు తక్కువేమీ కాదు. ముసుగు తొలగిస్తే నేరంగా పరిగణించే పరిస్థితుల్లో తెగువ చూపిన నీలమ్ ముసుగుకు వ్యతిరేకంగా దాదాపు యుద్ధమే చేసింది. ఛప్పర్ గ్రామంలోని తన అత్తవారింట్లో ఎంత వ్యతిరేకత ఎదురైనా వెనక్కు తగ్గలేదామె. ఆమె స్ఫూర్తితో గ్రామంలోని మిగిలిన మహిళలు కూడా ముసుగు ధరించడం మానేశారు. వారి అండతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన నీలమ్ సర్పంచిగా ఎన్నికైంది. స్వయం ఉపాధి పథకాల ద్వారా గ్రామంలోని మహిళలకు స్వావలంబన కల్పించడంతో పాటు లింగ వివక్షకు తావులేని రీతిలో గ్రామాన్ని తీర్చిదిద్ది ఎందరికో స్ఫూర్తినిస్తోంది నీలమ్. పేద బతుకులకు వెలుగుప్రదాత విద్యుత్ వెలుగులకు నోచుకోని ఎందరో పేదల బతుకుల్లో వెలుగులు నింపిన వెలుగుప్రదాత హరీష్ హండే. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన ఆయన, ఒడిశాలోని రౌర్కెలాలో పెరిగారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో చదువయ్యాక అమెరికాలోని మసాచుసెట్స్ వర్సిటీ నుంచి ఎనర్జీ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. విద్యుత్తుకు నోచుకోని మారుమూల గ్రామాల్లోని పేదలకు సౌరశక్తి ద్వారా వెలుగు అందించాలనే సంకల్పంతో ‘సెల్కో’ సంస్థను స్థాపించారు. సౌరశక్తితో పనిచేసే గృహోపకరణాలను, యంత్రపరికరాలను చౌక ధరల్లో రూపొందించి పేదలకు అందుబాటులోకి తెచ్చారు. పారిశ్రామిక కాలుష్యంపై నిర్విరామ పోరాటం పారిశ్రామిక కాలుష్యం ఫలితంగా పర్యావరణానికి, మనుషులతో పాటు జీవజాలానికి వాటిల్లుతున్న నష్టం అంతా ఇంతా కాదు. పర్యావరణ ప్రేమికుడైన న్యాయవాది మహేశ్‌చంద్ర మెహతా ఈ పరిస్థితిని అరికట్టాలనే సంకల్పంతో అలుపెరుగని న్యాయపోరాటం సాగిస్తున్నారు. ఇష్టానుసారం కాలుష్యాలను వెదజల్లుతున్న పలు కర్మాగారాలను మూసివేయించడంలో ఇప్పటికే పలు విజయాలు సాధించారు. జమ్ము కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఒక కుగ్రామంలో సామాన్య కుటుంబంలో పుట్టిన మెహతా న్యాయవాదిగా అవినీతికి, లంచగొండితనానికి వ్యతిరేకంగా కూడా పోరాటం సాగిస్తున్నారు. కెమెరాతో యుద్ధరంగంలోకి.... స్వాతంత్య్రానికి మునుపటి రోజుల్లో ఫొటోగ్రఫీ సామాన్యులకు అందుబాటులో ఉండేది కాదు. పైగా ఫొటోగ్రాఫర్లు అందరూ పురుషులే. అలాంటి రోజుల్లోనే ఫొటోగ్రఫీపై మక్కువతో ఫొటో జర్నలిజంలోకి అడుగుపెట్టారు హోమాయి వ్యారావాలా. మన దేశంలో తొలి ఫొటో జర్నలిస్టుగా ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తినిచ్చారు. ఫొటో జర్నలిస్టుగా సభలు సమావేశాల వరకే పరిమితం కాలేదామె. యుద్ధరంగానికి వెళ్లి మరీ ఫొటోలు తీసిన సాహసం ఆమెది. రెండో ప్రపంచయుద్ధం జరగుతున్నప్పుడు ఆమె తీసిన ఎన్నో విలువైన ఫొటోలను అప్పట్లో ‘ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా’ ప్రముఖంగా ప్రచురించింది. మహిళలకు ‘సూక్ష్మ’స్వావలంబన మహారాష్ట్రలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన నీలిమా మిశ్రాకు ఆర్థిక ఇబ్బందులు అనుభవపూర్వకంగానే తెలుసు. పేద కుటుంబాల్లోని మహిళల స్థితిగతులూ తెలుసు. సైకాలజీలో పీజీ చేసిన నీలిమా, మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో భగినీ నివేదిత గ్రామీణ విద్యానికేతన్ నెలకొల్పి, సూక్ష్మరుణాల ద్వారా మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. నీలిమా మిశ్రా కృషి ఫలితంగా వందలాది మంది గ్రామీణ మహిళలు పేదరికం నుంచి బయటపడి, స్వావలంబన సాధించారు. నీలిమా కృషికి గుర్తింపుగా ఆమెకు ‘పద్మశ్రీ’, రామన్ మెగసెసె అవార్డులు దక్కాయి. వీల్‌చైర్ నుంచి విజయపథంలో... ‘విల్‌పవర్’ ఉండాలేగానీ వీల్‌ఛైర్‌లో కూర్చొని కూడా అద్భుతాలు సాధించవచ్చునని నిరూపిస్తున్నారు భువనేశ్వర్‌కు చెందిన శ్రుతి మహాపాత్ర. చదువుల్లో, ఆటల్లో చురుకైన శ్రుతి ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడి వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. అయినా...నిరాశనిస్పృహలను దరికి చేరనివ్వలేదు. ‘షేర్డ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రిక్రియేషన్’ నినాదంతో ‘షేర్’ అనే సంస్థను మిత్రులతో కలిసి మొదలుపెట్టారు. ‘వుమెన్స్ సెల్ ఆఫ్ డిజేబుల్డ్ పీపుల్స్ ఇంటర్నేషనల్’కు కన్వీనర్‌గా కూడా వికలాంగుల క్షేమం కోసం పాటుపడుతున్నారు. జువాలజీలో పిహెచ్డీ చేసిన శ్రుతి ‘నేషనల్ యంగ్ సైంటిస్ట్’ అవార్డ్ అందుకున్నారు. వికలాంగులకు సంబంధించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. కథలు, కవితలు రాశారు... వీటి మధ్య చైతన్యానికి తప్ప ‘నిరాశ’కు చోటెక్కడుంటుంది! ప్రజా కళాకారుడు ‘కళ కళ కోసమే’ అని నమ్మేవాళ్లు కొందరు. ‘కాదు ప్రజల కోసం’ అనేవాళ్లు కొందరు. భారతీయ నాటకరంగానికి కొత్త వెలుగైన శంభు మిత్రా కళ ప్రజల కోసమే అని నమ్మినా... ప్రయోగాలకు మాత్రం దూరంగా ఉండలేదు. 1939లో కల్కత్తాలోని ‘రంగమహల్ థియేటర్’ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. 1943లో వామపక్ష భావజాలంతో ప్రభావితమై ప్రసిద్ధ ‘ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ (ఇప్టా)లో చేరారు. నాటకరంగంలో మూసపద్ధతులకు దూరంగా కొత్తదనాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరువాత ‘బహురూపి’ పేరుతో సొంత నాటక సమాజాన్ని స్థాపించి భారతీయ నాటకరంగ మార్గదర్శుల్లో ఒకరుగా నిలిచారు. నాటకాలే కాదు హిందీ, బెంగాలీ సినిమాల ద్వారా సినీరంగంపైనా తనదైన ముద్రవేశారు. బాల్యం వీడక ముందే ఎవరెస్టు శిఖరానికి ఎవరెస్టు శిఖరంపై జాతీయ పతాకాన్ని రెపరెపలాడించిన అతి పిన్న వయస్కురాలు మలావత్ పూర్ణ. కేవలం 13 ఏళ్ల 11 నెలల వయసులోనే ఆమె సాధించిన ఈ ఘనత ప్రపంచ రికార్డులకెక్కింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామంలో పుట్టిపెరిగిన పూర్ణ తల్లిదండ్రులు సామాన్య వ్యవసాయ కూలీలు. చదివించడానికి ఆమెను తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్లో చేర్చారు. సొసైటీ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ పూర్ణ పట్టుదలను గుర్తించి, ఎవరెస్టు శిఖరారోహణ దిశగా ఆమెకు అన్ని విధాలా ఆసరాగా నిలిచారు. డార్జిలింగ్, లడక్‌లలో శిక్షణ తీసుకున్న పూర్ణ 2014 మే 25న లక్ష్యం సాధించింది. ప్రయాణికులను కాపాడటానికి ప్రాణత్యాగం ప్రయాణికులను కాపాడటానికి ప్రాణత్యాగానికి సిద్ధపడింది నీరజా భానోత్. పంజాబ్‌లో పుట్టి పెరిగిన ఆమె పాన్ అమెరికన్ విమానంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసేది. ఆమె విధుల్లో ఉన్న విమానాన్ని 1986 సెప్టెంబర్ 5న ఉగ్రవాదులు హైజాక్ చేశారు. విమానంలో 316 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి ముందుగా తాను తప్పించుకునేందుకు వీలున్నా, ఆమె అలా చేయకుండా ముందుగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపింది. అయితే, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆమె బలైపోయింది. భారత ప్రభుత్వం ఆమెకు మరణానంతరం ‘అశోక్చక్ర’ ప్రకటించింది. చీకటి నేపథ్యం... వెలుగు ప్రస్థానం చీకటి మూలల్లో నుంచి తాను వెలుగులోకి రావడమే కాదు... ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపడానికి కృషి చేస్తోంది నసీమా ఖటూన్. సెక్స్ వర్కర్ల పిల్లల కోసం ‘పర్చమ్’ అనే స్వచ్ఛంధ సంస్థను నిర్వహిస్తోంది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని సెక్స్‌వర్కర్ల కుటుంబంలో పుట్టిన నసీమా ఆ వృత్తికి దూరంగా ఉంది. ఆ ప్రాంతానికి కొత్తగా నియామకం అయిన ఐఏయస్ అధికారి రాజ్బల వర్మ సెక్స్ వర్కర్ల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు రూపొందిచారు. ఆ ప్రభావంతో సెక్స్‌వర్కర్లు తమ పిల్లలకు చదువులు చెప్పించారు. పిల్లలను వ్యభిచార కూపానికి దూరంగా ఉంచారు. అలా చదువుకున్న వారిలో నసీమా కూడా ఒకరు. సెక్స్‌వర్కర్ల సంక్షేమం, హక్కులు, పిల్లల చదువుల కోసం ‘పర్చమ్’ అనే స్వచ్ఛంధ సంస్థ కృషి చేస్తుంది నసీమా. పర్చమ్ అంటే జెండా అని అర్థం. జీవితంలో రెండో అవకాశం... పదిహేడేళ్ల వయసులో ధన్‌బాద్(జార్ఖండ్)లో సోనాలి ముఖర్జీపై యాసిడ్ దాడి జరిగింది. ఇక తనకు జీవితమే లేదు అనుకుంది ఆమె. ముఖానికి అయిన 22 సర్జరీల బాధ కంటే గుండెల్లో గూడు కట్టుకున్న మానసిక బాధ సోనాలిని ఎక్కువగా ఇబ్బంది పెట్టింది. నిందితులకు కఠిన శిక్షలు విధించడం కోసం మడమ తిప్పకుండా పోరాటం చేసింది. ఈ తొమ్మిదేళ్ల పోరాటంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తనలాంటి బాధితులు ఎదుర్కోకుండా ఉండాలనే సంకల్పంతో వారి తరపున పోరాడాలని నిర్ణయించుకుంది. కెబీసిలో ఒక ఎపిసోడ్ అయిన ‘దూస్రా మోకా’(సెకండ్ ఛాన్స్)లో పాల్గొనే అవకాశం సోనాలికి వచ్చింది. ఆ సమయంలో ఆమె మాటల్లో పోరాటస్ఫూర్తి కనిపించింది. జీవితంలో సెకండ్ ఛాన్స్‌కు ఇంతకుమించిన ఇంధనం ఏముంటుంది! డ్రగ్ అడిక్ట్స్‌కు జిమ్ కోచింగ్... చిన్న సమస్యకూ, పెద్ద సమస్యకూ ‘డ్రగ్స్’ మాత్రమే పరిష్కారం అనుకొని మృత్యుముఖంలోకి అడుగు పెట్టిన యువకులకు ఇంఫాల్(మణిపూర్)లోని తన ‘యానిమల్ జిమ్’ ద్వారా సరికొత్త శక్తిని ఇస్తున్నాడు ఆర్.కె.విశ్వజిత్. ఒకప్పటి ‘మిస్టర్ ఇండియా’ మైపాక్ శర్మ శిష్యుడైన విశ్వజిత్ ఇంటర్ కాలేజీ బాడీ బిల్టింగ్ పోటీలలో నెగ్గిన తరువాత సొంతంగా జిమ్‌ను ప్రారంభించాడు. ఆ ప్రాంతంలో డ్రగ్స్‌కు బానిసలైన కుర్రాళ్లను తన జిమ్ ద్వారా సరియైన దారిలో పెడుతున్నాడు విశ్వజిత్. ‘యానిమల్ జిమ్’ పుణ్యమా అని ఎంతో మంది డ్రగ్స్ బానిసలు ఆరోగ్యం విలువ తెలుసుకున్నారు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. పేద విద్యార్థులకు ఆశాదీపం వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని పేద విద్యార్థుల కోసం ఆనంద్ కుమార్ ప్రారంభించిన ‘సూపర్ 30’ ప్రోగ్రామ్ ఎందరో విద్యార్థులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఐఐటీ-జేఈఈ ప్రవేశ పరీక్ష కోసం పట్నా(బిహార్)లో ‘సూపర్ 30’ ప్రోగ్రాం ప్రారంభించారు ఆనంద్. ఈ ప్రోగాంలో భాగంగా ప్రతి సంవత్సరం ఆర్థికంగా వెనకబడిన ప్రతిభావంతులైన 30 మంది విద్యార్థులను ఎంపిక చేసుకొని ఐఐటి-జెయియి ఎంట్రెన్స్ కోసం శిక్షణ ఇస్తున్నారు. 2002లో ఆనంద్ ప్రారంభించిన ‘రామానుజ్ స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్’ ఇప్పుడు ‘బెస్ట్ ఇన్స్టిట్యూట్’గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. చదువుల మావయ్య సత్యనారాయణ ముండయూర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు గాని, అంకుల్ మూసా అంటే మాత్రం ఈశాన్య రాష్ట్రాల్లో అందరూ గుర్తుపడతారు. ఈశాన్య రాష్ట్రాల్లో నిరక్షరాస్యత నిర్మూలన కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారు ఆయన. ఈశాన్య రాష్ట్రాల్లో విద్యావ్యాప్తికి ముప్పయ్యేళ్లుగా తన జీవితాన్ని అంకితం చేసిన ముండయూర్ను ‘ఈశాన్య’ ప్రజలు అంకుల్ మూసా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. విద్యార్థుల్లో చదువులపై ఆసక్తి కలిగించేందుకు ఆయన తొలుత సొంత ఖర్చుతో ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు. దాతలు ముందుకు రావడంతో వారి సాయంతో మరో 13 లైబ్రరీలను నెలకొల్పారు. హిమగిరులను శుభ్రపరచిన చైతన్యం హిమాలయ శిఖరాలను అధిరోహించడమే ఘనకార్యంగా ప్రచారం పొందే పర్వతారోహకులే తప్ప, మంచుకొండలపై పేరుకుపోతున్న చెత్తను తొలగించేవారెవరు? ఆ చెత్తను అలాగే వదిలేస్తే హిమాలయాలు చెత్తదిబ్బలుగా తయారవుతాయని ఆలోచించిన ఐఎఫ్ఎస్ అధికారి జ్యోత్స్నా సిత్లింగ్, ఆ చెత్తను తొలగించే బృహత్తర కార్యక్రమానికి నడుం బిగించారు. హిమాలయాల పరిసరాల్లోని 82 గ్రామాల ప్రజలను చైతన్యపరచారు. వారి సహకారంతో ఒక్కో ట్రక్కులో 50 టన్నుల చొప్పున 15 ట్రక్కుల చెత్తను తొలగించి, హిమగిరి సొగసులను మళ్లీ మనసులను మురిపించేలా తీర్చిదిద్దారు. సృజన వేదిక మహిళల హక్కుల గురించి చైతన్యం, ప్రచారం కోసం 1984లోనే ‘జుబాన్’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేశారు ఊర్వశి బుటాలియా. ఈ ప్రచురణ సంస్థ కేవలం దేశంలోని మహిళా రచయితలకే కాదు ఆసియాలోని మహిళా రచయితలకు సైతం వేదికగా నిలుస్తోంది. తన ప్రచురణ సంస్థ ద్వారా లైంగిక వేధింపులు, వరకట్నం వంటి సమస్యల మీద మహిళలకు అవగాహన, చైతన్యం కలిగిస్తూ యావత్ స్త్రీలోకానికే ప్రేరణ, స్ఫూర్తినిస్తున్నారు ఊర్వశి బుటాలియా. ఔను! అతడు కొండను తొలిచాడు బీహార్‌లోని పుణ్యక్షేత్రం గయ సమీపంలో గెహ్లోర్ గ్రామం అది. ఎవరికి ఏ జబ్బు చేసినా ఆస్పత్రికి వెళ్లాలంటే కొండ చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వచ్చేది. తన గ్రామస్థుల దుస్థితికి చరమగీతం పాడాలనుకున్నాడు దశరథ్ మాంఝీ. అలాగని అతడేమీ సంపన్నుడు కాదు. నిరుపేద కార్మికుడు. అయితేనేం అతడి సంకల్పం గొప్పది. అనుకున్నదే తడవుగా పలుగు సుత్తి తీసుకుని కొండను తొలచడం మొదలుపెట్టాడు. ఒంటిచేత్తో కొండను పూర్తిగా తొలిచాడు. గ్రామస్థులు ఆస్పత్రికి వెళ్లడానికి వీలుగా దగ్గరి దారిని నిర్మించాడు. బృహత్తరమైన ఈ పని పూర్తి చేయడానికి మాంఝీకి ఇరవెరైండేళ్లు పట్టింది. ఈ పని పూర్తి చేసినప్పటి నుంచి అతడు ‘మౌంటెన్ మ్యాన్’గా పేరుపొందాడు. అట్టడుగు నేపథ్యం... అసామాన్య విజయం మహారాష్ట్రలోని రోపెర్ఖేడా గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి పెరిగిన కల్పనా సరోజ్‌కు తల్లిదండ్రులు పన్నెండేళ్ల వయసులోనే పెళ్లిచేశారు. అత్తింట్లో వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది. చుట్టుపక్కల జనాల సూటిపోటి మాటలు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. స్వగ్రామంలో ఉండలేక బాబాయితో ముంబై వెళ్లింది. ప్రభుత్వ రుణసాయంతో చిన్న టైలరింగ్ వ్యాపారం మొదలుపెట్టి, తోటి మహిళలకు ఉపాధి కల్పించింది. తర్వాత ఒక ఫర్నిచర్ దుకాణం ప్రారంభించి, అంచెలంచెలుగా విస్తరించింది. ఆమె వ్యాపార సామ్రాజ్యం విలువ ఇప్పుడు రూ.747 కోట్లకు పైచిలుకు ఉంటుంది. అక్షరాలా వృక్ష కోటీశ్వరుడు ఆయన అక్షరాలా వృక్ష కోటీశ్వరుడు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనేదే ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆయన ప్రచారం చేసే నినాదం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన దారిపల్లి రామయ్యను ఆయన గురించి తెలిసిన వారంతా ‘చెట్ల రామయ్య’ అని పిలుస్తారు. సామాన్య రైతు అయిన రామయ్యకు నీడనిచ్చే చెట్ల మీద తగని మక్కువ. ైఎక్కడ ఖాళీస్థలం కనిపించినా, అక్కడ మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకున్నారాయన. ఇప్పటి వరకు ఏకంగా కోటికి పైగానే మొక్కలు నాటారు. అందుకే ఆయన అక్షరాలా వృక్ష కోటీశ్వరుడు. తన కొడుకు పెళ్లికి వచ్చిన అతిథుల్లో ఒకరు కానుకగా రూ.5 వేలు చదివిస్తే, ఆ మొత్తాన్ని కూడా మొక్కలు నాటడానికే వినియోగించిన నిబద్ధత ఆయనది. మనతరం మహాదాత శిబి చక్రవర్తి, రంతిదేవుడు వంటి మహాదాతలు పురాణాల్లోనే కాదు, అత్యంత అరుదుగానైనా మన కాలంలోనూ ఉంటారనడానికి నిలువెత్తు నిదర్శనం కళ్యాణ సుందరం. చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్న ఆయన తల్లి ఇచ్చిన స్ఫూర్తితో నిరుపేదల పట్ల సేవానిరతిని పెంచుకున్నారు. తమిళనాడులో లైబ్రేరియన్‌గా పనిచేసి రిటైరైన కళ్యాణ సుందరం రిటైర్మెంట్ తర్వాత తనకు వచ్చిన డబ్బు మొత్తాన్ని అనాథ బాలల కోసం విరాళంగా ఇచ్చేశారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా పేదల కోసం ఉదారంగా ఖర్చు చేసేవారు. చివరకు అవార్డుగా లభించిన రూ.30 కోట్ల మొత్తాన్నీ విరాళంగా ఇచ్చేసి, చిన్నా చితకా ఉద్యోగాలతో కాలం వెళ్లదీస్తున్నారు. ‘స్వచ్ఛ’భారతీయుడు పట్టణాల్లోని మురికివాడల్లో, మారుమూల పల్లెల్లో నివసించే చాలామంది బహిర్భూమికి వెళ్లాలంటే ఆరుబయలునే ఆశ్రయిస్తున్నారు. మహిళలకు మరీ ఇబ్బందికరంగా ఉంటున్న ఈ పరిస్థితిని మార్చాలనుకున్నాడు స్వప్నిల్ చతుర్వేది. ‘మా బడిలో టాయిలెట్ చాలా కంపు కొడుతోంది’ అని తన కూతురు చెప్పిన మాటలు అతడిని ఆలోచనలో పడేశాయి. దేశంలోని ఆడపడుచుల ఆత్మగౌరవానికి ఎలాంటి ఇబ్బందిలేని రీతిలో కొత్త తరహా టాయిలెట్లకు రూపకల్పన చేశాడు. వీటి నుంచి విద్యుదుత్పాదనతో పాటు ఎరువు తయారయ్యేలా తయారు చేశాడు. ‘సమగ్ర’ సంస్థను నెలకొల్పి మారుమూల ప్రాంతాలకు ఈ టాయిలెట్లు చేరేలా కృషి చేస్తున్నాడు. ఉగ్రవాదుల భరతం పట్టిన వీరనారి సైనికురాలు కాదు, కనీసం పోలీసు కూడా కాదు. సాదాసీదా కశ్మీరీ అమ్మాయి రుక్సానా కౌసర్. ఇంటిపై దాడిచేసిన లష్కరే తోయిబా ఉగ్రవాదులపై గండ్రగొడ్డలి తీసుకుని అపరకాళిలా విరుచుకుపడింది. అప్పటికి ఆమె వయస్సు పట్టుమని పదిహేనేళ్లు. రాజౌరీ జిల్లా థానామండీలోని రుక్సానా ఇంటిపై 2009 సెప్టెంబర్ 27న లష్కరే ఉగ్రవాదులు దాడి చేశారు. రుక్సానాను తమకు అప్పగించమని డిమాండ్ చేశారు. నిరాకరించడంతో ఆమె కుటుంబ సభ్యులను చితకబాదడం మొదలుపెట్టారు. తట్టుకోలేక పోయిందామె. చేతికి దొరికిన గండ్రగొడ్డలి తీసుకుని లష్కరే కమాండర్ నెత్తిన ఒక్కటిచ్చుకుంది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పేదరోగుల పాలిటి ఔషధదాత ఢిల్లీలో ఎనిమిదేళ్ల కిందట ఒక వంతెన కూలిపోయినప్పుడు పలువురు నిరుపేద కార్మికులు గాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన చికిత్స లభించక, మందులు కొనుక్కొనే స్థోమత లేక వాళ్లంతా నానా ఇక్కట్లు పడ్డారు. వారి పరిస్థితికి చలించిపోయారు ఓంకార్‌నాథ్ శర్మ. అప్పుడు తలెత్తిన ఆలోచనతోనే బ్లడ్‌బ్యాంక్ టెక్నీషియన్‌గా రిటైరైన శర్మ పేద రోగుల కోసం ఇంటింటికీ వెళుతూ మందుల సేకరణ ప్రారంభించారు. ధనికుల ఇళ్లలో వాడగా మిగిలిపోయిన మందులు సేకరించి, వాటిని అవసరమైన రోగులకు ఉచితంగా అందజేయడం ప్రారంభించారు. ఈ సేవానిరతితోనే ఢిల్లీలో ఆయన ‘మెడిసిన్ బాబా’గా ప్రసిద్ధుడయ్యారు. ప్రభుత్వాన్నే దారికి తెచ్చిన వీర వనితలు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా చిప్కో ఉద్యమం చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అడ్డగోలుగా అడవుల నరికివేతకు సిద్ధపడ్డ ప్రభుత్వాధికారులకు సామాన్య మహిళల నుంచి అనుకోని ప్రతిఘటన ఎదురైంది. హిమాలయాలకు దిగువన ఉన్న కుగ్రామంలో గౌరాదేవి అనే సామాన్య మహిళ నాయకత్వంలో 1974 మార్చి 26న స్థానిక మహిళలు నరికివేతకు ఎంపిక చేసిన చెట్లను వాటేసుకుని నిరసన ప్రకటించిన ఉదంతం అప్పట్లో పతాక శీర్షికలకెక్కింది. తమ కంఠంలో ప్రాణం ఉండగా చెట్లను నరకనివ్వబోమని మహిళలంతా ముక్తకంఠంతో నినదించడంతో అప్పటి యూపీ ప్రభుత్వం దిగివచ్చింది. ‘ఉగ్ర’దాడిలో నేలకూలిన వీరులు ముంబైలోని కీలక ప్రదేశాల్లోకి చొరబడిన ఉగ్రవాదుల చెర నుంచి అమాయకులను కాపాడే క్రమంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే అశువులు బాశారు. 2008 నవంబర్ 11న జరిగిన ఆ ‘ఉగ్ర’దాడిలో గాయపడిన సహచరుడిని తప్పించి మరీ ఉగ్రవాదులను ఎదుర్కొన్న సాహసి సందీప్ ఉన్నికృష్ణన్. అదే సమయంలో ఉగ్రవాదుల చెరలో చిక్కిన అమాయకులను కాపాడేందుకు తుదిశ్వాస వరకు కర్కరే వీరోచిత పోరాటం చేశారు. వీరిద్దరితో పాటు ఆ సంఘటనలో ఏఎస్సై తుకారాం ఓంబ్లే, ఏసీపీ అశోక్ కామ్తే, ఇన్స్పెక్టర్ విజయ్ సాలస్కర్లు కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు. వీరిలో తుకారాం ఓంబ్లే తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను పట్టించడంలో కీలక పాత్ర పోషించారు. ఆమె జీవితం ‘సేవ’కు అంకితం పేదరికాన్ని మించిన హింస లేదని చెప్పే ఇళా భట్ మహిళల స్వావలంబన కోసం దశాబ్దాలుగా అవిరళ కృషి సాగిస్తున్నారు. నిరుపేద మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే సంకల్పంతో ‘సెల్ఫ్ ఎంప్లాయ్డ్ విమెన్స్ అసోసియేషన్’ (సేవ) స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. అధ్యాపకురాలిగా కెరీర్ ప్రారంభించిన ఇళా భట్ కొద్దికాలమే బోధనారంగంలో కొనసాగారు. న్యాయశాస్త్రం చదువుకున్న ఆమె కార్మికుల హక్కుల కోసం పోరాడారు. నిరుపేదలకు చేతనైన మేలు చేయాలనే ఉద్దేశంతో సేవారంగం వైపు మళ్లి, తన జీవితాన్ని నిరుపేదల సేవకే అంకితం చేశారు. ప్రాణాలను కాపాడిన పసివాడు ముక్కుపచ్చలారని పద్నాలుగేళ్ల పసిబాలుడు సాగర్ కాశ్యప్. తన ప్రాణాలకు తెగించి మరీ మూడు నిండు ప్రాణాలను కాపాడాడు. మత్స్యకారుడైన తన తండ్రి భోలానాథ్‌కు భోజనం అందించి ఇంటికి తిరిగి వెళుతుండగా, నలుగురు పిల్లలు ఆగ్నేయ ఢిల్లీ వద్ద యమునా నది కాలువలో మునిగిపోతూ కనిపించారు. మరో ఆలోచన చేయకుండా కాలువలోకి దూకేసిన సాగర్ కాశ్యప్ ముగ్గురు పిల్లలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. మరో పన్నెండేళ్ల బాలుడిని మాత్రం కాపాడలేకపోయాడు. సాగర్ సాహసానికి గుర్తింపుగా అతడికి జాతీయ సాహస బాలుర అవార్డు దక్కింది. కీచకాలపై కడదాకా పోరాడిన ధీరుడు అబలలపై సాగుతున్న కీచకాలను కడదాకా ఎదిరించిన ధీరుడు బరుణ్ బిశ్వాస్. పదహారేళ్ల కిందట పశ్చిమబెంగాల్లోని సుతియా పట్టణంలో ఒక గూండా ఆధ్వర్యంలో కీచకపర్వం రాజ్యమేలేది. స్కూల్ టీచర్ అయిన బరుణ్ బిశ్వాస్ ఈ ఘాతుకాలను సహించలేకపోయాడు. అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరచాడు. పోలీసులకు ఫిర్యాదు చేసేలా అత్యాచార బాధితులను చైతన్యపరచాడు. ప్రధాన నిందితుడితో పాటు మరికొందరు అరెస్టుకు దోహదపడ్డాడు. బరుణ్పై కక్ష పెంచుకున్న దుండగులు 2012 జూలై 5న అతడిపై వెనుక నుంచి కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. సమాచార విప్లవానికి మూలపురుషుడు ఇప్పుడంటే సమాచార రంగంలో ‘2జీ’ పాతబడిపోయి 3జీ, 4జీల కాలం నడుస్తోంది. ఇంతకీ వీటికి మూలాధారమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరు అందించారో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామందికి తెలీదు. ఫైబర్ ఆప్టిక్స్ పరిజ్ఞానం లేకుంటే ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చేవే కాదు. సామాన్యుల చేతుల్లోని స్మార్ట్ఫోన్లు కపానీ చలవే. ఆగ్రా వర్సిటీలో చదువుకుని, అమెరికాలో సొంత కంపెనీని స్థాపించి స్థిరపడ్డ నరీందర్సింగ్ కపానీ ఫైబర్ ఆప్టిక్స్ పరిజ్ఞానానికి ఆద్యుడు. భారత్‌లో చేపట్టే పలు సేవా కార్యక్రమాలకు కపానీ ఉదారంగా విరాళాలు ఇస్తూ, దేశం పట్ల తన నిబద్ధతను ఇప్పటికీ చాటుకుంటున్నారు. శత్రువుకు తలవంచని వీరసేనాని దేశ విభజన తర్వాత పాకిస్థాన్‌తో 1947-48లో జరిగిన తొలి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వీరసేనాని బ్రిగేడియర్ మహమ్మద్ ఉస్మాన్. నౌషేరా పోరులో పాక్ సేనలను ముప్పుతిప్పలను పెట్టిన బ్రిగేడియర్ ఉస్మాన్‌ను ‘నౌషేరా కా షేర్’ అని ప్రజలు తలచుకుంటారు. పాక్ ప్రభుత్వం ఆయన తలపై రూ.50 వేలు ప్రకటించింది. తమకు సానుకూలంగా మారితే ఆర్మీచీఫ్ పదవి ఇస్తామని కూడా ప్రలోభపెట్టినా తలవంచకుండా, దేశ రక్షణ కోసం తుదిశ్వాస వరకు పోరాటం సాగించారు. విజయం సాధించి వీరస్వర్గానికి... పాకిస్థాన్‌తో 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి వీరస్వర్గానికేగిన వీరజవాను మేజర్ పద్మపాణి ఆచార్య. ఆచార్య ఒడిశాలో పుట్టినా, ఆయన కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. పద్మపాణి తండ్రి జగన్నాథ ఆచార్య భారత వైమానిక దళంలో వింగ్ కమాండర్‌గా పనిచేశారు. పాకిస్థాన్‌తో జరిగిన రెండు యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఆయనది. తండ్రి బాటలోనే సైన్యంలో చేరిన పద్మపాణి ఆచార్య కార్గిల్ వద్ద పాక్ బలగాలు ఆక్రమించుకున్న టోలోలింగ్ స్థావరాన్ని కైవసం చేసుకునే బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తన బలగాలను విజయపథంలో నడిపించారు. -
కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి
జమ్మూకశ్మీర్: కొండచరియలు విరిగి పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందిన ఘటన జమ్మూలోని కాత్రా జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం ఉదయం మాతా వైష్ణోదేశి ఆలయానికి వెళ్తున్న భక్తులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులతో పాటు వారిని తీసుకెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. వీరంతా పాత మార్గం గుండా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని కత్రా జిల్లా పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన మరో 10 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అమర్ నాథ్ యాత్రకు మరో బ్యాచ్!
జమ్మూః అమర్ నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే ఈ సంవత్సరం యాత్ర మొదలైనప్పటినుంచీ ఎన్నో ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న యాత్రలో .. 265 మంది భక్తులతో కూడిన మరో బ్యాచ్.. తమ ప్రయాణాన్ని జమ్మూ నుంచీ సోమవారం సాయంత్రం ప్రారంభించింది. జమ్మూలోని భగవతి నగర్ యాత్రీనివాస్ నుంచి భక్తులను కట్టుదిట్టమైన భద్రతా చర్యలమధ్య యాత్రకు తరలిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైనప్పటినుంచీ అడుగడుగునా అడ్డంకులు ఎదురౌతూనే ఉన్నాయి. కశ్మీర్ లోయలో ఆందోళనల కారణంగా యాత్రలో పలుమార్లు బ్రేక్ లు పడుతూనే ఉన్నాయి. లోయలో కర్ఫ్యూ కారణంగా అమర్ నాథ్ యాత్రకు వెళ్ళిన భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం సాయంత్రం 265 మంది భక్తులతో కూడిన మరో బృందం... జమ్మూనుంచి యాత్రను పటిష్ట భద్రత మధ్య ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. యాత్రికులు అమర్ నాథ్ దర్శనానికి వెళ్ళేందుకు దాటాల్సిన బల్తాల్, పహల్గమ్ బేస్ క్యాంపులకు చేరేందుకు జమ్మూ కశ్మీర్ రహదారి నుంచీ ప్రయాణం సాగిస్తారు. ఈ రహదారిలో ట్రాఫిక్ ను కేవలం రాత్రి సమయంలోనే అనుమతిస్తారు. జూలై 8న హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు, నిరసనల నేపథ్యంలో పగటిపూట జమ్మూ-కశ్మీర్ రహదారిపై ప్రయాణం కొంత అస్తవ్యస్తంగానే మారింది. ఆందోళనకారులు ట్రాఫిక్ ను నిలిపివేస్తుండటంతో.. లోయకు చేరుకునే యాత్రికుల సంఖ్య జూలై 2న ప్రారంభమైనప్పటినుంచీ రోజురోజుకూ క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయినప్పటికీ ఈ సంవత్సరం యాత్ర ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ 2,20,000 మంది భక్తులు పుణ్యక్షేత్ర దర్శనం పూర్తి చేసుకోగా.. 265 మందితో కూడిన మరో భక్తుల బృందం యాత్రను సోమవారం ప్రారంభించింది. ఆగస్టు 17తో ఈసారికి అమర్ నాథ్ యాత్ర ముగుస్తుంది. కాగా ఈయేడు సుమారు 21 మంది వరకూ భక్తులు వాతావరణ ప్రతికూలత కారణంగా మృతి చెందడం యాత్రలో కొంత ఆందోళన రేపింది. -
పుష్కర క్షేత్రంలో భక్తుల సందడి
బాల్కొండ/మోర్తాడ్/రెంజల్ : అంత్య పుష్కరాల రెండో రోజు సోమవారం భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ పుష్కరక్షేత్రంలో 2, 4 ఘాట్ల వద్ద భక్తుల రద్దీ కనిపించింది. నదిలోని పురాతన శివాలయం వద్ద భక్తులు పూజలు చేశారు. మోర్తాడ్ మండలంలోని తడపాకల్, బాల్కొండ మండలంలోని ఎస్సారెస్పీ పుష్కర ఘాట్ల వద్ద కూడా సోమవారం సందడి కనిపించింది. ఎస్సారెస్పీ పుష్కర ఘాట్లకు భక్తులు తరలివచ్చారు. సమీపంలోని కోదండ రామాలయంలో పూజలు చేశారు. మహంకాళి ఆలయంలో రెండో రోజూ నవ చండీ యాగం కొనసాగింది. -
'ఈరోజు కూడా యాత్రకు నో'
జమ్ము: అమర్నాథ్ యాత్రకు వెళుతున్న యాత్రికులకు కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జమ్మూకశ్మీర్ లో అశాంతికర పరిస్థితుల నేపథ్యంలో మరోసారి యాత్రికులను అధికారులు అడుగు కూడా వేయనివ్వడం లేదు. మరోపక్క 6,679మంది యాత్రికులు ఇప్పటికే దర్శనం ముగించుకొని అక్కడి నుంచి ఇటు వచ్చే పరిస్థితి లేకుండా అయింది. అలాగే, ప్రస్తుతం భగవతి నగర్ యాత్రి నివాస్‌లో 1,700మంది ఎదురుచూస్తున్నారు. దీనిపై ఓ సీనియర్ అధికారి వివరణ ఇచ్చాడు. ఈరోజు లోయలో పరిస్థితులు గమనించిన తర్వాతే మరోసారి చర్చించుకొని యాత్రికులను అనుమతించాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. -
క్షేమంగా అమర్నాథ్ యాత్రికుల బృందం
న్యూఢిల్లీ: ఉగ్రవాది బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ వల్ల కశ్మీర్లో చెలరేగిన అల్లర్ల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రలో చిక్కుకున్న ఏపీ యాత్రికులను క్షేమంగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఢిల్లీలోని ఏపీ భవన్ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జమ్మూ-కశ్మీర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి యాత్రికుల తరలింపునకు చర్యలు తీసుకుంటున్నట్టు ఏపీ భవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ శ్రీకాంత్ అర్జా తెలిపారు. అనతంపురానికి చెందిన 15 మందితో కూడిన యాత్రికుల బృందం బుధవారం క్షేమంగా ఏపీ భవన్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీన వీరు యాత్ర పూర్తి చేసుకొని పహల్గామ చేరుకున్నారు. ఈ తరుణంలో అల్లర్లు చెలరేగడంతో వీరంతా అక్కడే చిక్కుకున్నారు. రెండురోజుపాటు స్థాకంగా హోటళ్లలో బస చేయాల్సివచ్చింది. అల్లర్ల నేపథ్యంలో దుకాణాలు అన్ని మూతపడడంతో భోజన వసతికి త్రీవ ఇబ్బందులు పడ్డారు. రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డీజీపీ రాముడు వీరిని ఫోనులో సంప్రదించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం భద్రతా దళాలు వీరందరికీ రక్షణ కల్పించి పహల్గాం నుంచి సురక్షితంగా జమ్మూ చేర్చారు. అక్కడి నుంచి రైలులో ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ భవన్లో వీరందరికీ వసతి, భోజనం ఏర్పాటు చేశారు. -
స్వస్ధలాలకు అమర్నాధ్ యాత్రికులు
-
కశ్మీర్లో కన్నడిగుల కష్టాలు
అమర్నాథ్ యాత్రకు వెళ్లి కర్ఫ్యూలో చిక్కుకున్న వైనం తిండీ తిప్పలు లేక ఇబ్బందులు మూడు రోజులుగా బస్సులోనే మకాం మందులు లేక మధుమేహ రోగుల అవస్థలు ఢిల్లీలోని కర్ణాటక భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం బెంగళూరు: అమర్నాథ్ యాత్ర కోసం కర్ణాటక నుంచి బయలుదేరిన యాత్రికులు కశ్మీర్ ప్రాంతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాశ్మీర్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కర్ఫ్యూ విధించడంతో యాత్రికులంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న బుహ్రాన్ హాని ఎన్కౌంటర్ నేపథ్యంలో కాశ్మీర్లో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కర్నాటకలోని బెంగళూరు, రాయచూరు, కొప్పళ్, యాదగిరి తదితర ప్రాంతాల నుంచి కిసాన్ యాత్రి సేవా సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ అమర్‌నాథ్‌యాత్రలో భాగంగా శ్రీనగర్ చేరుకున్న దాదాపు వందలాది మందిలో ఎక్కువ మంది పఠాన్ఛౌక్ ప్రాంతంలో ఉండిపోయారు. ప్రయాణిస్తున్న బస్సులోనే ఉండిపోయి స్థానిక పోలీసు, సైన్యం సూచనల మేరకు బయటికి రావడం లేదు. ఇదిలా ఉండగా మౌలిక సదుపాయాలు, శౌచాలయాలు లేక కన్నడిగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంట తీసుకువెళ్లిన ఆహారపదార్థాలు కూడా అయిపోయాయని తెలుస్తోంది. డబ్బులు ఉన్నా తిండి పదార్థాలను కొనుక్కోలేని పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, మదుమేహంతో బాధపడుతున్న వారు సరైన వైద్య సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమర్నాథ్ యాత్రికుల్లోని కన్నడిగుల రక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. వీరిలో కొంతమందిని శ్రీనగర్‌కు పంపించగా మరికొంతమంది ఢిల్లీలోని కర్ణాటకభవన్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో ఉంటూ యాత్రికుల వివరాలను వారి బంధువులకు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, అమర్నాథ్ యాత్రికుల విషయమై తెలుసుకోవడానికి 01942506479, 09868393952,9868393953,9868393979లలో సంప్రదించవచ్చు. -
అమర్నాథ్ యాత్రకు వెళ్లిన జిల్లావాసులు క్షేమం
చిత్తూరు (కలెక్టరేట్): అమర్నాథ్ యాత్రకు వెళ్లిన జిల్లావాసులందరూ క్షేమంగా ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్‌చందర్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక డీఆర్వో కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. యాత్రకు వెళ్లినవారి బంధువుల వివరాల కోసం హెల్ఫ్‌లైన్ నెం. 08572 240500కు ఫోన్‌చేసి వారి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహాయంతో యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. అందరినీ క్షేమంగా తీసుకువస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. -
ఇప్పటి వరకు 24 వేలమంది వెళ్లారు
జమ్ము: హిందువుల పవిత్ర స్థలం అమర్ నాథ్ కు ప్రారంభమైన యాత్ర మూడో రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మంచులింగాన్ని 24 వేల మంది దర్శించుకున్నారు. యాత్రలో భాగంగా నాల్గవ బృందాన్ని (1,842 మందిని) ఈ రోజు ఉదయం అనుమతించారు. నిన్న ఆదివారం ఒక్కరోజే 15 వేల మంది దర్శించుకున్నారు. యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 24 వేల మంది భక్తుల మంచులింగాన్ని దర్శించుకున్నారని శ్రీ అమర్ నాథ్ శ్రైన్ బోర్డు(ఎస్ఏఎస్బీ) తెలిపింది. జులై 2 నుంచి ప్రారంభమైన యాత్ర ఆగస్టు 17 వరకు 48 రోజులు సాగనుంది. పటిష్ఠ భద్రత మధ్య అమర్ నాథ్ కొనసాగుతోంది. -
అమర్నాథ్ యాత్ర ఆరంభం
జమ్మూ: పటిష్ట భద్రత నడుమ 48 రోజులపాటు సాగే అమర్నాథ్ యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో డిఫ్యూటీ సీఎం నిర్మల్‌సింగ్ మొదటి విడతగా 1,282 మంది యాత్రికులను దక్షిణ కశ్మీర హిమాలయాలకు పంపించారు. దీనికి ఉన్న రెండు దారుల్లో 20 వేల మంది భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. అంతే కాకుండా ఈ ప్రాంత పరిరక్షణ కోసం డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నా రు. మొదటి విడత యాత్రికుల్లో 900 మంది పురుషులు, 225 మంది మహిళలు, 13 మంది పిల్లలు, 144 మంది సాధువులు ఉన్నారు. వీరు 33 వాహనాల్లో ఉదయం 5 గంటలకు అక్కడికి బయలుదేరారు. వీరికి సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణగా వెళ్లాయి. ‘భం భం భోలే’ నాదాలు చేస్తూ, పాటలు పాడుతూ వీరు భగవతి నగర్ బేస్క్యాంపుకు చేరుకున్నారు. భూమికి 3,888 మీటర్ల ఎత్తులోని పహగళం, బల్తా ల్ బేస్ క్యాంపులకు బయలుదేరారు. జూన్ 25న అక్కడ జరిగిన తీవ్రవాదుల దాడిలో 8 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా 21 మంది గాయపడ్డా రు. ఇక్కడి భద్రతా ప్రమాణాలను పరీక్షించడానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. అదే సమయంలో అక్కడి ‘మంచు లింగాన్ని’ కూడా ఆయన దర్శించుకోనున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ప్రియ సేథీ, బీజేపీ ఎంపీ జంగల్ కిశోర్, నిర్మల్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు (ఎస్ఏఎస్బీ) ఈ పర్యటనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాయని తెలిపారు. -
ఏసీ టికెట్లు బుక్ చేస్తే.. నాన్ ఏసీలో పంపారు!
బోధన్ (నిజామాబాద్): ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ నిర్వాకం యాత్రికులను అవస్థల పాలు చేసింది. అటవీ ప్రాంతంలో మూడు గంటలు నడిరోడ్డుపై పడిగాపులు గాయాల్సిన అవస్థ ఎదురైంది. దీనికి సంబంధించిన హైదరాబాద్, గుంటూరు ప్రాంతాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డి సాయిబాబా ఆలయానికి వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కోసం షిర్డీలోనే ఖురానా అనే ట్రావెల్ సంస్థలో ఏసీ సర్వీసులో టికెట్లు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2వేలకు పైగా వసూలు చేశారు. శనివారం రాత్రి 8.30 గంటలకు సర్వీసు బయలుదేరింది. ఆదివారం ఉదయం 10.30 గలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన సర్వీసును నాందేడ్ జిల్లా నర్సి గ్రామం శివారులో ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిలిపి వేశాడు. అటవీ ప్రాంతంలో మూడు గంటల పాటు బస్సును నిలిపివేయడంతో పిల్లలు, మహిళలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ సర్వీసుకు తెలంగాణలో ప్రవేశానికి పర్మిట్ లేకపోవడంతో... అదే ట్రావెల్స్ సంస్థకు చెందిన మరో బస్సును హైదరాబాద్ నుంచి రప్పించి అందులోకి ఎక్కించారు. ఏసీ సర్వీసుకు టికెట్లు బుక్ చేసుకుంటే నాన్ ఏసీ బస్సులో అక్కడి నుంచి పంపించారు. దీంత ట్రావెల్స్ యాజమానిపై చర్యలు తీసుకోవాలని సాలూర అంతరాష్ట్ర ఆర్టీవో చెక్‌పోస్టులో అధికారికి ఫిర్యాదు చేశారు. -
ఆరు రోజుల పాటు గరిటే సాంబర్ అన్నమే..!
మహబూబ్‌నగర్: రోజుకు ఒక గరిటె సాంబరు.. రెండు ముద్దల అన్నం.. ఎముకలు కొరికే చలి. అర్ధాకలి, నిద్రలేని రాత్రులు.. ఇదీ మానస సరోవరం యాత్రలో పాలమూరు జిల్లా యాత్రికులు అనుభవించిన నరకయాతన. శుక్రవారం ఉదయం మహబూబ్‌నగర్‌కు చేరుకున్న యాత్రికులు.. తాము పడిన బాధలను మీడియాకు వివరించారు. వారం రోజులు పడిన కష్టాలను గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. వివరాలివీ.. జిల్లాకు చెందిన 13మంది యాత్రికులు గత నెల 16న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. అక్కడి నుంచి 17న ఉదయం ఖాట్మండ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లారు. అక్కడ ఎన్టీపీ ఏజెన్సీ ప్రతినిధులు అదేరోజు వారిని నేపాల్గంజ్కు తరలించాలి. అయితే 19న తీసుకెళ్లారు. వాతావరణం బాగోలేదని రెండు రోజులపాటు నేపాల్గంజ్లోనే నిలిచిపోయారు. 21న సెమికాట్కు, అక్కడి నుంచి 22న తక్కల్కోట్కు చేరుకున్నారు. 23న రాత్రి మానస సరోవరానికి చేరుకుని, అక్కడి నుంచి కైల పర్వతానికి వెళ్లి శివయ్యను దర్శించుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో హిల్సాకు వచ్చాక వాతావరణం అనుకూలించకపోవడంతో 24వ తేదీ నుంచి 31 వరకు అక్కడే చిక్కుకుపోయారు. వందమంది ఉండాల్సిన ప్రదేశంలో 400మంది యాత్రికులను ఉంచడంతో ఒక్కో గదిలో 20 మంది ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజులో ఒకపూట భోజనం పెట్టారు. ఆరోగ్యం బాగోలేని వారిని పట్టించుకోకపోవటంతో వారు మానసికంగా కుంగిపోయారు. చిన్న చిన్న గుడిసెల్లో.. అందులోనూ ఒక్కొక్క గదిలో 20 మందిని ఉంచారు. పడుకోవడానికి స్థలం లేక రాత్రి మొత్తం కూర్చొని ఉన్నారు. కనీసం తినడానికి సరిపడా భోజనం కూడా లేదు. ఒక్కరికి ఒక గరిటే సాంబర్తో కూడిన అన్నం ఆరు రోజుల పాటు పెట్టారు. అక్కడ తమకు ప్రత్యక్ష నరకం చూపారని యాత్రికుడు శ్రీకాంత్ రెడ్డి, బాలరాజు తెలిపారు. ఆ సమయంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో తమకు మరింత ఆందోళన కలిగిందన్నారు. ఆరు రోజుల తర్వాత స్థానికంగా మీడియాలో వచ్చిన కథనాలతో పాటు నేపాల్‌లో వచ్చిన కథనాలకు అక్కడి అధికారులు స్పందించి తమకు భరోసా కల్పించారన్నారు. వాతావారణం అనుకూలించడంతో ప్రత్యేక విమానంలో లక్నోకు పంపించారు. అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నామని తెలిపారు. -
సిమ్ కోట్ లో చిక్కుకున్నభారతీయులు!
న్యూఢిల్లీః కైలాశ్ మానస సరోవరం యాత్రకు వెళ్ళిన 500 మంది భారతీయ యాత్రికులు వాతావరణం అనుకూలించక పోవడంతో నేపాల్ లో చిక్కుకుపోయారు. నేపాల్ పర్వత ప్రాంతంలోని హిల్సా, సిమికోట్ ప్రాంతాల్లో యాత్రికులు చిక్కుకున్నారని, వారికి సహాయక చర్యలు అందించేందుకు సైతం అనేక ఇబ్బందులు ఎదురౌతున్నట్లు అధికారులు వెల్లడించారు. మానస సరోవర్ యాత్రికులకు సహాయక చర్యలను అందించేందుకు నేపాల్ విదేశాంగ శాఖ కార్యదర్శితో కాట్మాండులోని భారత దౌత్య కార్యాలయ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. భారతీయ యాత్రికులందరినీ కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల నేపాల్ లో చిక్కుకుపోయిన వారందరినీ రక్షించేందుకు హోం శాఖ కార్యదర్శి, ఆర్మీ స్టాఫ్ చీఫ్, మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ సహా ఇతర పోలీసు బలగాలు, అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్ళిన దాదాపు 50 మందిని ఇప్పటి దాకా హిల్సానుంచి సిమ్ కోట్ కు తరలించినట్లు, దాదాపు వంద మందిని సిమికోట్ నుంచి నేపాల్ గంజ్ కు తెచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. హెలికాప్లర్ల ద్వారా వారిని తరలిస్తున్నామని, ఇంకా సిమికోట్ లో 250 మంది వరకూ యాత్రికులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు చెప్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా నేపాలీ అధికారులు అన్నివిధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు స్వరూప్ వెల్లడించారు. -
తీర్ధయాత్రల పేరుతో 45మందిని మోసం చేశాడు!
సాక్షి, విజయవాడ: తీర్ధయాత్ర పేరుతో సుమారు 45మంది యాత్రికుల్ని ఒక ప్రబుద్ధుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చి వదిలివేశాడు. ఉదయం నుంచి ఆ వ్యక్తి కోసం ఎదురు చూసిన యాత్రికులు సాయంత్రానికి తాము మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. వివరాలు.. 10 పుణ్యక్షేత్రాల సందర్శనంటూ..... విజయవాడ కనకదుర్గ దేవాలయం, భద్రాచలం సీతారామాలయం, బాసర సరస్వతీ దేవాలయం, షిర్డి సాయినాథుడు దేవాలయం తదితర పది ముఖ్యమైన పుణ్య క్షేత్రాలను తొమ్మిది రోజులు పాటు చూపిస్తానంటూ ఎం.శివకుమార్ అనే వ్యక్తి నమ్మించాడు. అన్ని రకాల చార్జీల కింద ఒకొక్కరు రూ.5,500 చెల్లించాలని చెప్పాడు. దీంతో ముగ్గురు పిల్లలతోపాటు 45 మంది యాత్రికులు బయలుదేరారు. గూడూరుకు చెందిన శ్రీనివాస రాము బస్సులో శుక్రవారం రాత్రి గూడూరు నుంచి విజయవాడ తీసుకువచ్చి సీతమ్మవారి పాదాల వద్ద బస్సును ఆపాడు. సాన్నాలు ముగించుకుని అమ్మవారి దర్శనం చేసుకుని రావాలని ఈలోగా తాను టిఫెన్లు ఏర్పాటు చేస్తానని చెప్పాడు. దీంతో యాత్రికులంతా స్నానాలు చేసి అమ్మవార్ని దర్శించుకుని వచ్చారు. తిరిగి వచ్చే సరికి బస్సు వద్ద కేవలం బస్సు డైవర్, కండక్టర్‌తోపాటు వంట వాళ్లు మాత్రమే ఉన్నారు. శివకుమార్ ఇప్పుడే వస్తానని వెళ్లాడని, ఇంకా తిరిగి రాలేదని చెప్పడంతో మధ్యాహ్నం వరకు వేచిచూశారు. అయితే శివకుమార్ రాకపోవడంతో తమను మోసం చేశాడని భావించి లబోదిబోమన్నారు.యాత్ర ప్రారంభానికి ముందే ప్రతి యాత్రికుని వద్ద రూ.5,500 చొప్పున వసూలు చేశాడు. ఒకరిద్దరు వెయ్యి చొప్పున ఇవ్వాల్సి ఉండగా.. వారి వద్ద విజయవాడలో తీసుకుని పలాయనం చిత్తగించాడు. అమ్మవార్ని దర్శనం చేసుకుని వచ్చే భక్తులకు టిఫెన్లు తయారు చేసిపెట్టమని వంటవాళ్లకు సరుకులు కాని సామగ్రి కాని ఇవ్వకపోవడంతో తాము ఏమీ చేయలేమని వారు చేతులెత్తేశారు. అతను అడస్సు తెలియదు. శివకుమార్ గూడూరు, నెల్లూరుల్లో తిరుగుతూ ఉంటాడని, అతనికి భార్యబిడ్డలు, ఇల్లు లేదని, కేవలం కరపత్రాలు ద్వారా యాత్రికుల్ని రాబట్టి యాత్రలు నిర్వహిస్తూ ఉంటాడని బాధితులు చెబుతున్నారు. అతను తమకు ఇచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయడం లేదని అంటున్నారు. తీర్ధయాత్రల పేరుతో బయలుదేరి ఇప్పుడు వెనుక్కు వెళ్లాలంటే మనస్సు ఒప్పడం లేదని, షిర్డీకి టోల్గేట్ చార్జీలు సుమారు 15 వేలు అవసరం అవుతాయని వాటిని దాతలు ఎవరైనా ఇస్తే తాము షిర్డీ వెళ్లిపోతామని చెబుతున్నారు. శివ కుమార్ రాకపోవడంతో ఉదయం నుంచి పస్తులే ఉన్నామంటున్నారు. రాము ట్రావెల్స్‌కు ఎంత చెల్లించాడో తమకు తెలియదని, తమ యజమాని చెప్పిన మేరకు బస్సును షిర్డీకి తీసుకువెళుతున్నామని డైవర్, క్లీనర్ తెలిపారు. నమ్మకంగా చెప్పి మాయ చేశాడు: అరుణ తొమ్మిది రోజులు యాత్ర గురించి గొప్పగా చెప్పడంతో అందరం బయలు దేరాం. విజయవాడలో బస్సు ఆపి అమ్మవార్ని దర్శించుకుని రమ్మనాడని, దర్శనం చేసుకుని వచ్చేలోగా అందర్నీ వదిలివేసి మాయమయ్యాడు. మా అందరి వద్ద సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు వెనక్కు వెళ్లాలంటే బాధగా వుంది. ఏమీ చేయాలో పాలుపోవడం లేదు. గతంలో బాగానే తీసుకువెళ్లాడు: రత్నమ్మ గతంలో ఒకసారి శబరిమలై, మరొకసారి గోదావరి పుష్కరాలకు మమ్మల్ని బాగానే తీసుకువచ్చాడు. ఆ నమ్మకంతోనే రూ.5500 ఇచ్చి షిర్డీ టూర్‌కు బయలుదేరాం. ఈ విధంగా మోసం చేస్తాడని భావించలేదు. అతని ఇంటి అడ్రస్సు తెలియదు. భార్య, పిల్లలూ లేరు. చిన్నచిన్న యాత్రలు చేసి జీవనం సాగిస్తున్నానని మాకు చెప్పాడు. ఈ విధంగా జరగుతుందని అనుకోలేదు: శంకరయ్య, పాలవ్యాపారి పది పుణ్యక్షేత్రాలకు తీసుకువెళతానంటే నమ్మకంతో బయలుదేరామని, ఇంతలోనే ఈ విధంగా మోసం చేస్తాడని అనుకోలేదు. ప్రయాణం మొదట్లో ఆపివేయడంతో ఏమీచేయాలో తెలియడం లేదు. వెనుక్కు వెళ్లాలంటే బాధగా ఉంది. ముందుకు వెళ్లేందుకు కావాల్సిన డబ్బులు మా వద్ద లేదు. ఎవరైనా ఆదుకుంటారేమోనని చూస్తున్నాం. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, నడకదారి భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. స్వామి వారి దర్శనానికి ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గదుల వివరాలు: ఉచితగదులు - 5 ఖాళీగా ఉన్నాయి. రూ.50గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు. సహస్ర దీపాలంకరణ సేవ - 150 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - ఖాళీ లేవు. -
పక్కా ప్రణాళికతో పుష్కరాలు
ముమ్మరంగా రోడ్ల అభివృద్ధి పనులు కలెక్టర్ బాబు ఏ ఆదేశం విజయవాడ పుష్కర యాత్రికులు సులువుగా పుష్కరఘాట్లకు చేరుకునే విధంగా రహదారుల నిర్మాణానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం కృష్ణా పుష్కర ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. తొలుత రైల్వే శాఖ ద్వారా చేపట్టే పనులను సమీక్షించారు. విజయవాడ స్టేషన్‌కు అదనంగా, గుణదల, కృష్ణాకెనాల్ స్టేషన్ విస్తరణ, అలాగే పదో నంబర్ ఫ్లాట్‌ఫాం విస్తరణ అంశాలను డీఆర్ఎం ఆశోక్‌కుమార్‌తో చర్చించారు. సీసీ కెమేరాలు ఏర్పాటు, రైల్వే టికెట్ కౌంటర్లు ఏర్పాట్ల అంశాలను సమీక్షించారు. అనంతరం ముక్త్యాల, వేదాద్రి, సాగరసంగమం వరకు ఉన్న ఘాట్ల మరమ్మతులు, వాటిని చేరుకోవడానికి రోడ్లు విస్తరణ, ఘాట్లలో టాయ్ లెట్స్ ఏర్పాట్లు గురించి పంచాయతీరాజ్, ఆర్‌ఆండ్‌బీ అధికారులతో చర్చించారు. డాల్ఫిన్ హౌస్ నుంచి సాగర సంగమం వరకు రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని పంచాయతీరాజ్ ఎస్ఈని ఆదేశించారు. ముక్త్యాల, వేదాద్రి ఘాట్లకు అప్రోచ్ రోడ్లు విస్తరణ అంచనాలను పరిశీలించారు. హైదరాబాద్, ఏలూరు, గుంటూరు, బందరు వైపు నుంచి విజయవాడకు వచ్చే యాత్రికుల వాహనాలను ఏఏ రూట్లకు మళ్లించాలి, ఏఏ రోడ్లు విస్తరించాలో సూచించాలని పోలీస్, ఆర్ ఆండ్ బీ. అధికారులను ఆయన కోరారు. విజయవాడ నగరంలో దుర్గాఘాట్ చాలా ప్రాముఖ్యమైనదని సుమారు 3.5 కోట్ల భక్తులు రావచ్చునని కలెక్టర్ చెప్పారు. అలాగే పవిత్ర సంగమం, ముక్త్యాల, వేదాద్రీ సాగర సంగమం ముఖ్యమైన ప్రాంతాలుగా పేర్కొన్నారు. నగరంలో 12 నుంచి 15 పుష్కర నగర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. యాత్రికులు కోసం కేశఖండనశాల కూడా పుష్కరనగర్‌లో ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు. పుష్కరనగర్‌కు చేరుకున్న యాత్రికులు కాలకృత్యాలు తీర్చుకుని, మినీబస్‌లో పుష్కరఘాట్లకు వెళ్లి పుణ్యస్నానమాచరించి పిండప్రదానాలు పూర్తిచేసుకుని తిరిగి మినీ బస్‌లలో పుష్కర నగర్‌లకు చేరుకుంటారని తెలిపారు. పుష్కర నగర్లో ఆర్.టి.సి రైల్వే టికెట్ కౌంటర్లు ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. అక్కడనుంచి వారివారి ప్రాంతాలకు తిరిగి వెళ్లతారన్నారు. పుష్కరఘాట్లలోగాని ఇతర ప్రాంతాల్లో ఎటువంటి షాపులు ఉండవన్నారు. పుష్కర నగర్లోనే అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు వివరించారు. కృష్ణాపుష్కరాల నిర్వహణలో మూడు అంశాలు ముఖ్యమైనవన్నారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, యాత్రికులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, రవాణా(బస్, రైలు ప్రయాణ సౌకర్యాలు) కల్పనలో పూర్తిస్థాయిలో శ్రద్ధవహించాలని కలెక్టర్ కోరారు. పవిత్ర సంఘమం (ఫెర్రీ) వద్ద నమోనా దేవాలయాలు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. పవిత్ర సంగమం, ఫెర్రీ, దుర్గాఘాట్లు అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న నమోనాలను మున్సిపల్ కమిషనర్ జి. వీరపాండియన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా ఎస్పీ జి.విజయ్ కుమార్, విజయవాడ నగర డీసీపీలు అశోక్ కుమార్, నరసింహారావు, సబ్‌కలెక్టర్ డాక్టర్ జి. సృజన, డీఆర్వో సి.హెచ్.రంగయ్య, ఇరిగేషన్ ఎస్ఈ రామకృష్ణ, పంచాయతీరాజ్ ఎస్ఈ సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాకాధికారిణి ఆర్.నాగమల్లేశ్వరి పాల్గొన్నారు. -
కాసులు కావాలి
మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు అధ్వానంగా ఉన్న ఆర్ అండ్ బి రహదారులు రూ. 500 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు నిధుల కోసం అధికారుల ఎదురుచూపులు విజయవాడ : మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నాయి. కోట్లాదిమంది యాత్రికులు పుణ్యస్నానాలాచరించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలివస్తారు. వేలాది వాహనాల రాకతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు కృష్ణా తీరం వెంబడి ఉన్న రహదారులన్నీ గోతులమయంగా మారడంతో ప్రయాణికులు యాతన పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని ఆర్ అండ్ బి రోడ్లకు పుష్కరాలనాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. రోడ్ల అభివృద్ధికి ఆ శాఖ అధికారులు అంచనాలైతే సిద్ధం చేశారు కాని అక్కడ్నుంచి మరో అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో వేల కిలోమీటర్ల రహదారులున్నాయి. ప్రధానంగా జగ్గయ్యపేట నుంచి హంసలదీవి వరకు ఉన్న కృష్ణా తీరంలో దాదాపు 800 కి.మీ. మేర రహదారులు విస్తరించాయి. ప్రధాన రహదారులతోపాటు అనేక సర్వీసు రోడ్లు, గ్రామాల్లో ఉన్న ప్రధాన రహదారులన్నీ ఆర్ అండ్ బి పరిధిలోనే ఉన్నాయి. పుష్కరాలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ గత నెలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా సమీక్ష నిర్వహించారు. ఎక్కడా నిధుల కొరత లేదని, అన్ని శాఖల అధికారులు అవసరమైన ప్రతిపాదనలు పంపితే ప్రత్యేకంగా ఆయా శాఖల నుంచి నిధులు మంజూరుచేయిస్తామని ప్రకటిం చారు. ఇది జరిగి కూడా రెండు నెలలు దాటింది. మళ్లీ మంత్రి వాటి గురించి కనీసం వాకబు కూడా చేసిన దాఖ లాలు లేవు. మరోవైపు దుర్గగుడి వద్ద కనకదుర ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్‌సహా జిల్లా ఉన్నతాధికారులంతా ఆ పనులపైనే దృష్టిసారించి మిగిలిన పనులను మరిచిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల్లానే ఆర్ అండ్ బి అధికారులు కూడా భారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి గత నెలలో ఆమోదం కోసం పంపి కాసుల కోసం నిరీక్షిస్తున్నారు. 60 రహదారులకు మరమ్మతులు జిల్లాలో 2800 కిలోమీటర్ల పొడవున ఆర్ అండ్ బి రహదారులున్నాయి. అన్ని గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఇవి ఉన్నాయి. వీటికి ఏటా సాధారణ మరమ్మతులు జిల్లాలో నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీనికి కొంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే జిల్లాలోని ఆర్ అండ్ బి రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి పుష్కరఘాట్లను ప్రామాణికంగా తీసుకొని ఘాట్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను అధికారులు గత నెలలో పరిశీలించారు. దీనికి అనుగుణంగా అవసరమైన చోట నిర్వహించాల్సిన పనులను కూడా గుర్తించారు. ప్రాథమికంగా జగ్గయ్యపేటలోని వేదాద్రి నుంచి అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వరకు 90 ప్రధాన ఘాట్లు ఉన్నాయి. 60 ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయడం, కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు వీలుగా రహదారుల విస్తరణ పనులు నిర్వహిం చాల్సి ఉంది. వీటికి సుమారు రూ. 500 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేసి 60 రహదారుల పనులను ఆమోదించాలని ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా మైలవరం, తిరువూరు రోడ్డు, నూజివీడు రోడ్డు, యనమలకుదురు నుంచి చల్లపల్లి వరకు ఉన్న కరకట్ట మార్గం, గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న మార్గం, హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతాల వాహనాల రద్దీ నియంత్రణకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కీలక ఆర్ అండ్ బి రహదారులను అభివృద్ధి చేయడం, దాదాపు 15 చోట్ల రోడ్లను విస్తరించడం వంటి పనులు పూర్తిచేయాలి. పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరు విషయంపై దృష్టి సారించడంలేదు. -
తిరుమలలో భక్తుల ఆందోళన
తిరుమల : శ్రీవారి దర్శనానికి అనుమతించలేదని టీటీడీ ట్రస్టులకు విరాళాలిచ్చిన భక్తులు గురువారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు. ఆంగ్ల నూతన సంవత్సరం పురస్కరించుకుని డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. ఈ సమాచారాన్ని సంబంధిత అధికారులు టీటీడీ వెబ్సైట్, ఈ-మెయిల్ ద్వారా భక్తులకు చేరవేశారు. ఆ సమాచారం అందుకోలేని సుమారు 50 మందికిపైగా భక్తులు గురువారం శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. వీరిని అక్కడి సిబ్బంది అనుమతించలేదు. ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని విరాళాలు ఇచ్చిన దాతలకు బదులిచ్చారు. తాము రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు టీటీడీకి విరాళాలిచ్చామని, ముందస్తు సమాచారం లేకుండా దర్శనానికి అనుమతించకపోవడం సబబుకాదని ఆందోళనకు దిగారు. చేతిలో విరాళాల పాస్‌పుస్తకాలు పట్టుకుని నినాదాలు చేశారు. దీనిపై అక్కడ కొంత సమయం గందరగోళం ఏర్పడింది. ఈ సమాచారంతో టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆ భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. -
కుప్పకూలిన హెలికాప్టర్.. ఏడుగురు దుర్మరణం
-
కుప్పకూలిన హెలికాప్టర్.. ఏడుగురి దుర్మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందారు. కాట్రా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధారణంగా ప్రతి రోజూ జమ్మూ నుంచి కాట్రాకు సమీపంలోని వైష్ణోదేవి ఆలయానికి హెలికాప్టర్ సర్వీసులు తిరుగుతుంటాయి. అందులో భాగంగానే సోమవారం కూడా హెలికాప్టర్ సిబ్బందితోపాటు ఐదుగురు ప్రయాణికులు వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరగా అది కాట్రాకు సమీపంలో కుప్పకూలింది. దీంతో సిబ్బందితో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా రోజుల తర్వాత మరోసారి ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోవడానికి 24 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలి నడక భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడి ఆలయం వద్ద భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం ఉదయం శ్రీవారి దర్శనానికి 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండల వాడి సర్వదర్శనానికి 4 గంటలు, కాలి నడ కన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామివారిని 49,538 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గురువారం రాత్రి శ్రీవారి సర్వదర్శనానికి ఏడు గంటల సమయం పట్టింది. ప్రవేశద్వారా దర్శనానికి రెండు గంటలు సమయం పట్టగా, అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడకన వచ్చిన భక్తులకు దర్శనం కోసం నాలుగు గంటలు పట్టింది. -
దూసుకెళ్లిన ట్రక్: 17 మంది మృతి
మెక్సికో: సెంట్రల్ మెక్సికోలో విషాదం చోటు చేసుకుంది. ఊరేగింపుగా వెళ్తున్న ప్రజలపైకి ట్రాక్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం 16 మంది మరణించారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. మజ్జపిల్ పట్టణంలో బుధవారం సాయంత్రం మత సంబంధమైన ఊరేగింపు జరుగుతోంది. ఆ ఊరేగింపులో భారీగా ప్రజలు పాల్గొన్నారు. అయితే ఆ దే సమయంలో వేగంతో వస్తున్న ట్రక్ బ్రేకులు ఫెయిల్ అయి... ఊరేగింపు మీదకు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారైయ్యాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘ఆహ్లా’దం.. అద్భుతం
- గోదావరి అందాలకు యాత్రికుల పరవశం - చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన సాక్షి,రాజమండ్రి : పుష్కరాలకు పోటెత్తుతున్న యాత్రికులు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక , ఆధ్యాత్మిక కేంద్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్కర స్నానాలు పూర్తిచేసి పర్యాటక కేంద్రాల సందర్శనలకు బయల్దేరుతున్నారు. గోదావరి అందాలను చూసి ఆనందలో మునిగితేలుతున్నారు. కాటన్దొర గొప్పదనాన్ని కొనియాడుతున్నారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన పాపికొండలు, పట్టిసీమ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజినీ చూసేందుకు వస్తున్నారు. బ్యారేజీ పక్కనే ఉన్న కాటన్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. బొమ్మూరు మిట్టలో కాటన్దొర నివాసమున్న ఇంటిని సైతం సందర్శిస్తున్నారు. ఇక రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్న ఇస్కాన్‌టెంపుల్, కందుకూరి వీరేశలింగం పంతులు నివాస గృహాన్ని పుష్కర యాత్రికులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాల్లబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలను సైతం పుష్కర యా త్రికులు సందర్శిస్తున్నారు. మ్యూజియంలోని శిల్పకళను తిలకిస్తున్నారు. వీటితో పాటు ఉభయ గోదారిజిల్లాలలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సైతం పుష్కర భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. -
అంచనాలకు మించి..
- 2003 పుష్కరాలతో పోలిస్తే 27.25 లక్షల మంది పెరుగుదల - అప్పట్లో 10 రోజుల్లో 93.45 లక్షల మంది రాక - ఇప్పటివరకూ నమోదైన స్నానాల సంఖ్య 1.21 కోట్లు - చివరి రెండు రోజుల్లో మరో 30 లక్షల మంది వస్తారని అంచనా సాక్షి, కొవ్వూరు : గోదావరి పుష్కర యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుత పుష్కరాల నేపథ్యంలో గురువారం సాయంత్రం 6గంటల వరకు 1 కోటి 20 లక్షల 70 వేల 439 మంది పుష్కర స్నానాలు చేసినట్టు అధికారిక ప్రకటన వెలువడింది. 2003 పుష్కరాలతో పోలిస్తే జిల్లాలో ఘాట్ల సంఖ్య పెరగడంతో పాటు యాత్రికుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. 2003 పుష్కరాల సందర్భంగా మొదటి పది రోజుల్లో 93,45,730 మంది పుష్కర స్నానాలు ఆచరించగా, ప్రస్తుత పుష్కరాల్లో గురువారం సాయంత్రం 6గంటల సమయానికి 1,20,70,439 మంది పుష్కర స్నానాలు చేశారు. గత పుష్కరాలతో పోలిస్తే ఈ పుష్కరాలకు మొదటి 10 రోజుల్లో 27.25 లక్షల మంది భక్తులు పెరిగారు. 2003లో చివరి రెండు రోజుల్లో 29,49,929 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ క్రమంలో శుక్ర, శనివారాల్లో పుష్కర స్నానాలు ఆచరించే వారి సంఖ్య 30 లక్షలు దాటే అవకాశం ఉంది. ఈ పుష్కరాల్లో ఈనెల 18న రికార్డు స్థాయిలో 20,23,246 మంది స్నానాలు ఆచరించారు. రాష్ట్రం నుంచేకాక తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు రాగా, దేశంలోని పలు ప్రాంతాల నుంచి పీఠాధిపతులు, మఠాధిపతులు పుష్కర స్నానాలకు తరలివచ్చారు. ప్రధానంగా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం, నరసాపురంలోని వలంధరరేవు ఘాట్లలో రోజూ లక్ష మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. -
జన కోటి.. భక్తిని చాటి
జిల్లాలో 1.21 కోట్లకు చేరిన పుష్కర యాత్రికుల సంఖ్య మహాపర్వం ముగిసే నాటికి కోటిన్నరకు చేరుతుందని అంచనా ఆది.. అంత్య పుష్కరాలనేవి గోదావరి నదికి మాత్రమే సొంతం. పావన వాహిని మహాపర్వంలో తొలి అంకమైన ఆది పుష్కరాలు రెండు రోజుల్లో పరిసమాప్తం కానున్నాయి. పుష్కర ఏడాదిలో ఏ రోజున గోదావరి స్నానం చేసినా సంపూర్ణ ఫలం దక్కుతుందనేది పండితుల ఉవాచ. అయినా.. భక్తులు మాత్రం ఆది పుష్కర పర్వంలోనే నదీ స్నానం చేయాలనే తలంపుతో గడచిన పది రోజులుగా గోదారమ్మ చెంతకు పోటెత్తి వస్తూనే ఉన్నారు. జలజ్జననిపై తమకున్న అపార భక్తిని చాటుతున్నారు. జిల్లాలోని 97 ఘాట్లలో పుష్కర పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య గురువారం కోటి దాటింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆది పుష్కరాలు ముగింపు దశకు చేరుకోవడంతో గోదావరి చెంతకు యాత్రికులు వెల్లువలా తరలివస్తున్నారు. గురువారం రాత్రికి జిల్లాలోని 97 పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తుల సంఖ్య 1.21 కోట్లకు చేరింది. శుక్ర, శనివారాల్లో ఈ సంఖ్య కోటిన్నరకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో గురువారం పుష్కర స్నానం ఆచరిం చారు. కొవ్వూరులో మధ్యాహ్నం నుంచి యాత్రికుల రద్దీ పెరగడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. రానున్న రెండురోజుల్లో రద్దీ విపరీతం కానున్న దృష్ట్యా ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. బస్సులు తిరిగే రహదారి పక్కన ప్రత్యేకంగా ఇనుప గడ్డర్లను ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపరంగా గోష్పాద క్షేత్రం ప్రాంతాన్ని మూడంచెలుగా విభజించి రద్దీని నియంత్రిస్తున్నారు. యాత్రికులు ఐదు నిమిషాలకు మించి ఘాట్లలో ఉండకుండా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఇదిలావుండగా, గురువారం పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో పుష్కరాల ఏర్పాట్లు, యాత్రికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌ను మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్, పీతల సుజాత గురువారం పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. నరసాపురంలో రద్దీ రెట్టింపు గోదావరి పుష్కర సంబరం ముగింపు దశకు చేరుకోనుండటంతో నరసాపురంలో భక్తుల తాకిడి గంటగంటకూ పెరుగుతోంది. గడచిన నాలుగు రోజులతో పోలిస్తే గురువారం రద్దీ రెట్టింపైంది. వలంధర రేవులో స్నానాలు చేయడానికి గంటకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. పిండ ప్రదానాల షెడ్డు సరిపోక ఉదయం వచ్చిన వారు మధ్యాహ్నం వరకు వేచి ఉన్నారు. వారం రోజులుగా పిండ ప్రదాన షెడ్లు, మహిళలు దుస్తులు మార్చుకునే గదులకు సంబంధించిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నప్పటికీ సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. పారిశుధ్య పరిస్థితులు ఏమాత్రం మెరుగుపడకపోవడంతో భక్తులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ విషయంలో పోలీసులు మళ్లీ చేతులెత్తేశారు. పాలకొల్లు రహదారి మీదుగా వచ్చే వాహనాలను అదుపు చేయకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రైవేటు బస్సులలో వచ్చిన వారు పట్టణానికి చేరుకునే వీలులేక చించినాడ, యలమంచిలి ఘాట్లకు వెళ్లారు. గురువారం రాత్రి గోదావరి మాతకు హారతి ఇచ్చే కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పెనుగొండలోనూ పోటెత్తిన భక్తులు పెనుగొండలో రాత్రి పొద్దుపోయే వరకు భక్తులు పోటెత్తారు. పిండ ప్రదానాల షెడ్లు, దుస్తులు మార్చుకునే గదులకు సంబంధించి ఇబ్బందులు తప్పలేదు. పిండ ప్రదానాలు జరిగేచోట ఒక కుటుంబం గోదానం ఇచ్చే సందర్భంలో అపశృతి చోటుచేసుకుంది. గోవు జనంలోకి పరుగు తీయడంతో స్వల్పతొక్కిసలాట జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఆచంట మండలంలోని ఘాట్లకు బస్ సర్వీసులు లేక యాత్రికులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని కరుగోరుమిల్లి, భీమలాపురం, పెదమల్లం ఘాట్లకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి రావడంతో యాత్రికుల జేబులకు చిల్లు పడుతోంది. పట్టిసీమ క్షేత్ర దర్శనం లేదు గోదావరి నీటిమట్టం పెరగడంతో పట్టిసీమ క్షేత్రానికి భక్తులు చేరుకునే వీలులేకపోయింది. లాంచీల రాకపోకలను ఇంకా పునరుద్ధరించలేదు. భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఇదే సందర్భంలో సీఎం చంద్రబాబు పర్యటన పుష్కర యాత్రికులకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు కొయ్యలగూడెం, పోలవరం నుంచి వచ్చే మార్గాల్లో చంద్రబాబు పర్యటన కారణంగా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో భక్తులు ఎక్కడికక్కడ నిలిచిపోయి మూడు గంటల ఆలస్యంగా ఘాట్లకు చేరుకున్నారు. -
పుష్కర యాత్రికులూ బహుపరాక్
- కిక్కిరిసిన రైళ్లు, బస్సులు - నేడు, రేపు రద్దీ కొనసాగే అవకాశం - తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం సౌఖ్యం సాక్షి, విజయవాడ : గోదావరి పుష్కర స్నానం చేయడానికి లక్షలాది మంది యాత్రికులు ఉభయగోదావరి జిల్లాలకు తరలివెళుతున్నారు. పుష్కరాల ఆరో రోజు ఆదివారం కూడా రైళ్లు, బస్సులు ప్రయాణికులతో కిటకిటలాడాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే జాతీయ రహదారిపై వ్యాన్లు, కార్లు బారులుతీరాయి. ప్రజలంతా పుష్కర స్నానాలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సోమ, మంగళవారాలు సెలవు ప్రకటించింది. దీంతో ఈ రెండు రోజుల్లోనూ రద్దీ ఎక్కువగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పుష్కర యాత్రకు బయలుదేరేవారు వీలైనంత మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాస లేని ప్రయాణాన్ని చేయవచ్చు. బయలుదేరే ముందు.. - పుష్కర స్నానాలకు రద్దీ ఎక్కువగా ఉంటున్నందున జనం పలుచగా ఉండే ఘాట్లను ఎంపిక చేసుకోవాలి. - గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతున్నం దున తినుబండారాలు, మంచినీటి సీసాలను తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. - అనారోగ్యం సంభవిస్తే వైద్యుడి కోసం ఎదురుచూడకుండా ప్రథమ చికిత్స సామగ్రి, మందులు దగ్గర ఉంచుకోవాలి. - మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఇన్సులిన్, టాబ్లెట్లు తీసుకెళ్లడం మరవవద్దు. - ప్రయాణం ఎక్కువసేపు జరుగుతున్న నేపథ్యంలో అదనపు బ్యాటరీలు, బ్యాటరీ సెల్ చార్జర్లు తీసుకెళ్లండి. - సాధ్యమైనంత తక్కువ లగేజీతో వెళ్లండి. మీ వద్ద ఉన్న సొమ్మునంతా ఒక్కరి వద్దే కుటుంబ సభ్యులందరివద్దా ఉంచుకోండి. - మీ పేరు, ఫోన్ నంబరు, చిరునామా రాసిన స్లిప్‌ను మీ పిల్లల జేబులో ఉంచండి. - గ్రూపులుగా వెళ్లేవారికోసం.. - రెండు, మూడు కుటుంబాలు లేదా గ్రూపులుగా వెళ్లే వారు ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఒకే మాటపై వెళితే మంచిది. - మీరు ప్రయాణించిన వాహనం నంబరు రాసుకోవడంతోపాటు ఎక్కడ పార్కింగ్ చేస్తున్నారో గ్రూపులో ప్రతిఒక్కరు తెలుసుకోండి. డ్రైవర్ ఫోన్ నంబరు కూడా రాసుకోండి. - రూట్‌పై మీకు కాని, డ్రైవర్‌కి కాని అవగాహన లేకుంటే దారిలో స్థానికులను అడిగి కనుక్కోండి. - వృద్ధులు, వికలాంగులు ఉంటే వారికి మిగిలిన వారు పూర్తి సహాయ సహకారాలు అందించాలి. స్నాన ఘట్టాల వద్ద - స్నాన ఘట్టాల వద్ద అపరిచితులకు మీ సామగ్రి అప్పజెప్పవద్దు. - ఒకరి తరువాత ఒకరు స్నానాలకు వె ళుతూ మీ సామగ్రిని మీరే భద్రపరుచుకుంటే మంచిది. - నీటిలోకి దిగినప్పుడు మీ శరీరంమీద ఉన్న బంగారు ఆభరణాలను గమనిస్తుండండి. - జనసమ్మర్థం తక్కువగా ఉన్న ఘాట్లలోనే స్నానం చేయడం శ్రేయస్కరం. నదీప్రవాహం లోపల వరకు వెళ్లకూడదు. రక్షణలేని రేవుల్లోకి వెళ్లడం మంచిది కాదు. -
నా చేతుల్లోనే చనిపోయింది..
రాజమండ్రి: మహా విషాదం.. పుణ్యస్నానం కోసం వచ్చి పరలోకాలకు వెళ్లారు.. ప్రభుత్వ హత్యలు.. అంటూ గోదావరి పుష్కరాల్లో చోటుచేసుకున్న విషాద ఘటనపై పలువురు రాజకీయ నేతలు స్పదించారు. క్షత్రస్థాయిలో ఇంతకు వెయ్యిరెట్లు ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. ప్రభుత్వాన్ని ఏలుతున్నాడా? కళ్లు మూసుకుని కూర్చున్నాడా? అంటూ భక్తులు సూటిగా ప్రశ్నించారు. 'నా భార్య సొమ్మసిల్లి పడిపోయింది. అయ్యా.. అంబులెన్స్ ఒక్కసారి ఆపండి.. అయ్యా నా భార్యను ఆస్పత్నికి తీసుకెళ్లండని ఎంత అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. కొద్ది సేపటికి నా చేతుల్లోనే నా భార్య చనిపోయింది' అంటూ జీవిత భాగస్వామిని కోల్పోయిన ఓ వ్యక్తి కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కటతడి పెట్టించింది. గోదావరి పుష్కరాల మొదటి రోజైన మంగళవారం నాడు రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద చోటుచేసుకున్న విషాదంలో ఇలాంటి రోదనలు.. వేదనలు ఇంకా ఎన్నో. అన్ని వేళ్లూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నవే. '1800 కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాట్లు చేశామన్నారు. అది పచ్చి అబద్ధం. గోదారి తీరంలో గుక్కెడు మంచినీళ్లు అందించే దిక్కుకూడా లేదు. మరి డబ్బులన్నీ ఏమైనట్లు?' అంటూ ఓ యువకుడు స్పందించాడు. మరో పెద్దాయనైతే.. 'కోట్లు ఖర్చుపెట్టి ఎదవ అనౌన్సుమెంట్లు చేయిస్తారు తప్ప జనం చచ్చిపోతున్నా పట్టించుకోరా, ఆ అనౌన్సుమెంట్లు రెండు నిమిషాలు ఆపి జనం గురించి చెప్పలేరా?' అని ఆగ్రహించారు. తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఓ మహిళ.. 'చంద్రబాబు గొప్పంటారు.. ఎంటి ఆయన గొప్ప? జనం చనిపోతుంటే ఏం చేస్తున్నాడు? ప్రభుత్వాన్ని ఏలుతున్నాడా? కళ్లు మూసుకున్నాడా?' అంటూ మండిపడింది. ఇవే కాదు.. భక్తులను నెట్టివేస్తూ పోలీసులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం.. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదుల ఏర్పాట్ల లేమి.. నీడ కోసం షెల్టర్ల ఏర్పాట్లు లేకపోవడం, మరుగుదొడ్లలో నీటిచుక్క లేకపోవడం తదితర ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతున్న జనం.. ప్రభుత్వాన్ని ఛీకొడుతున్నారు. -
పుష్కర ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తి
-
ఉత్తరాఖాండ్‌లో గంగానది ఉగ్రరూపం
-
గంగోత్రిలో పాలమూరు జిల్లా యాత్రికులు క్షేమం
న్యూఢిల్లీ : చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 150మంది యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వారంతా గంగోత్రిలో ఉన్నట్లు సమాచారం అందింది. కమ్మగిరి స్వామి నేతృత్వంలో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు చార్ధాయ్ యాత్రకు వెళ్లారు. తామంతా క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుద్రప్రయాగ, చమోలీ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చార్ధాయ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం కేదార్‌లోయ, హేమ్‌కుంద్ సాహిబ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి హెలీకాప్టర్ల ద్వారా 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న దాదాపు 900 మంది యాత్రికులను ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు రక్షించాయి. ఇంకా వరదల్లో చిక్కుకున్న వారి సంఖ్య వేలల్లో ఉండటంతో ప్రభుత్వం తన కార్యచరణను ముమ్మరం చేసింది. రేపు ఉదయానికి కల్లా అన్ని రోడ్డు మార్గాలను సరి చేసి బాధితులను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హరీష్ రావత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ - కశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వర్షం కురవడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. బద్రీనాథ్, హేమకుండ్ తదితర ప్రాంతాల్లో తొమ్మిదివేల మంది యాత్రికులు చిక్కుకున్నట్లు చమోలీ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం నాటికి మరింత మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామన్నారు. ఉత్తరాఖండ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి కేదార్ నాథ్ లోయలో ఆరు బ్రిడ్జిలు కొట్టుకుపోగా, రుద్రప్రయోగ్, చమోలీ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ దారిలో చిక్కుకుపోయిన యాత్రికులను జోషిమఠ్ కు తరలించారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిలో కొంతమంది తెలుగు యాత్రికులు ఉన్నారు. అనంతపురం, కర్ణాటక కు చెందిన 130 యాత్రికులు వరదల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిలో అనంతపురం, బెళగుప్ప, కదిరి, హిందూపురం, తనకల్లు, మడకశిర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. 100 మీటర్ల రహదారి తెగిపోవడంతో నాలుగు రోజులుగా యాత్రికులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. -
వర్షానికి తడిసి ముద్ధైన శ్రీవాఅరి భక్తులు
-
తిరుమలలో పాము కలకలం
-
తిరుమలలో పాము కలకలం
తిరుపతి: తిరుమలలో ఓ పాము కలకలం రేపింది. వీఐపీలు బసచేసే వెంకటకళ అతిథిగృహం దగ్గర పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పాములు పట్టే భాస్కర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని, చాకచక్యంగా పామును పట్టేశాడు. ఈ పాము 9 అడుగుల పొడవుంది. ఇది జర్రిపోతు అని భాస్కర్ తెలిపారు. అతిధిగృహాల సమీపంలో చెత్తాచెదారం పడేయడం వల్ల... వాటిని తినేందుకు ఎలుకలు వస్తుంటాయని.. ఎలుకల కోసం పాములు వస్తుంటాయని భాస్కర్ చెప్పారు. శ్రీవారి భక్తులను విషపూరిత పాముల నుంచి కాపాడటమే కాకుండా... పట్టుకున్న పాములను సురక్షిత ప్రాంతాలలో వదిలి వాటిని కూడా కాపాడుతున్నందుకు భాస్కర్‌కు జీవ వైవిద్యమండలి అవార్డును బహూకరించింది. -
సకుటుంబ సమేతంగా సందర్శిద్దాం..చూసొద్ధాం
ఏడుకొండల మధ్య ఆనంద నిలయంలో నిత్యం భక్తుల్ని కటాక్షించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత చూడాల్సిన రమణీయ ప్రదేశాలెన్నో.. ఆ దేవదేవుని దర్శనానికి ఇతర రాష్ట్రాల నుంచే కాక దేశవిదేశాల నుంచి సగటున రోజుకి 50వేల మందికి పైగా భక్తులు తిరుపతికి వస్తారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో తిరుపతిలోనే యాత్రికులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే పర్యాటక స్థలాలు, వాటి ప్రత్యేకత మీకోసం... - తిరుపతి తుడా ప్రాంతీయ విజ్ఞాన కేంద్రం పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహనను, ఆసక్తిని పెంచేందుకు ఏర్పాటు చేసిందే తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్. ఫిజిక్స్‌కు, జియోగ్రఫీలకు సంబంధించి అరుదైన పరికరాలు, కళారూపాలు, పిల్లల ఆటస్థలం ఇక్కడ ఉన్నాయి. పార్కులు అలిపిరి టోల్గేట్ నుంచి కేవలం 500 మీటర్ల దూరంలోనే సైన్స్ సెంటర్ ఉంది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటలకు వరకు ప్రవేశం ఉంటుంది. ప్రవేశ రుసుం పిల్లలకు రూ.5 పెద్దలకు రూ.10. హస్తకళారామం ఆకర్షణీయమైన పార్కులు, ఔరా అనిపించే మైనపు బొమ్మలు, గ్రామీణ వాతావరణాన్ని తలపించే అందమైన పూరి గుడిసెలు, హస్తకళా ఖండాలు, ఫంక్షన్‌హాళ్లు ఇంకా బోటింగ్ లాంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. తిరుపతి-తిరుచానూరు మార్గంలో ఈ హస్తకళారామం ఉంది. ప్రవేశ రుసుం పిల్లలకు రూ.10 పెద్దలకు రూ.20. రామచంద్ర పుష్కరిణి తిరుపతి టౌన్‌క్లబ్ సెంటర్ నుంచి అలిపిరి మార్గంలో ఉన్న రామచంద్ర పుష్కరిణి ప్రకృతి ప్రేమికులకు చక్కటి సందర్శక ప్రాంతం. రంగురంగుల పూల తోటలు, సాయంత్రం వేళ్లలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇక్కడి ప్రత్యేకత. మున్సిపల్ పార్క్ తిరుమల బైపాస్‌రోడ్డులో ఉన్న ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ పార్క్‌లో ప్రకృతితో పాటు ఆటలకు కూడా నిలయంగా మారింది. వాటర్ ఫౌంటెయిన్, పిల్లల ఆడుకునేందకు ప్రత్యేక స్థలం, ద్యానంలో ఉండే శివుడి విగ్రహం సందర్శకులను ఆకట్టుకుంటాయి. అంతేకాక స్కేటింగ్ నేర్చుకునేందుకు ప్రత్యేక శిక్షకులు ఇక్కడ ఉన్నారు. ప్రవేశ రుసుం రూ.5. జంతు ప్రదర్శనశాల అలిపిరి నుంచి కేవలం 6కి.మీల దూరంలో ఉన్న శ్రీవేంక టేశ్వర జంతు ప్రదర్శనశాల పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు 2000 ఎకరాలకు పైగా విస్తీర్ణం, 1200 పైగా జంతుజాలం, అణువణువునా హరితవర్ణ శోభాయమానంగా కనిపించే ప్రకృతి, సేద తీర్చే పెద్ద చెట్లు ఈ జూ ప్రత్యేకత. కుటుంబ సమేతంగా వె ళ్లేందుకు ఇదొక చక్కటి పర్యాటక స్థలం. ప్రవేశ రుసం పెద్దలకు రూ.15, పిల్లలకు రూ.10. అలివేలు మంగమ్మ ఆలయం శ్రీనివాసుని పట్టపురాణి తిరుచానూరులో కొలువై ఉన్నారు. శ్రీవారిని దర్శించుకునే ముందు అమ్మవారిని దర్శించుకోవడం సంప్రదాయం. అమ్మవారి ఆలయం చారిత్రకంగా ప్రసిద్ధికెక్కింది. సుందర కపిలతీర్థం శ్రీవారి పాదాల చెంత, సప్తగిరుల శిలాతోరణం వద్ద ఏకైక శైవాలయంగా కపిలతీర్థం విరాజిల్లుతోంది. కామాక్షి సమేతంగా కపిలేశ్వరుడు ఇక్కడ దర్శనమిస్తారు. తీర్థంలో నిత్యం భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. వర్షం కురిసినపుడు ఇక్కడి జలపాతం ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. పక్కనే ఉన్న జంగిల్ బుక్ కూడా అడవి అందాలతో ఆకట్టుకుంటోంది. శ్రీగోవిందరాజస్వామి ఆలయం శ్రీనివాసుని అన్నగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరుపతి నడుబొడ్డున విశాల ప్రదేశంలో నిర్మితమయింది. ఈ ఆలయం రైల్వేస్టేషన్‌కు అతి సమీపంలో ఉంటుంది. స్వామి గోపురం తిరుపతి నగరానికే తలమానికంగా ఉంటుంది. ఇక్కడ ఆలయం ముందున్న అంగళ్లు షాపింగ్‌కు బాగా ఫేమస్. చంద్రగిరి కోట దక్షిణ భారతదేశ రాజులలో శ్రీకృష్ణదేవరాయలు సుప్రసిద్ధుడు. తిరుపతికి 12 కిమీల దూరంలో ఉన్న చంద్రగిరిలో ఆయన ఏలిన కోట ఉంది. రాజుల కాలం నాటి వస్తువులు, చారిత్రక కట్టడం, రాణి బంగ్లా, కొలను, చైనావాల్‌ను తలపించేలా కోట గోడ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అరుదైన దేవతా మూర్తుల విగ్రహాలు, వస్తువులు, నమూనాలు ఉన్నాయి. సాయంత్రం నిర్వహించే మ్యూజికల్ లైటింగ్ షో కోటలో ప్రత్యేకం. ఇందుకు ప్రవేశ రుసుం పిల్లలకు 25, పెద్దలకు రూ.35. ఎస్వీ మ్యూజియం శ్రీగోవిందరాజ స్వామి ఉత్తర మాడ వీధిలో ఎస్వీ మ్యూజియం టీటీడీ పర్యవేక్షణలో నడుస్తోంది. చారిత్రక వస్తువులు, రాజులు వినియోగించిన ఖడ్గాలు, కళా ఖండాలు, పలు నమూనాలు, విగ్రహాలు చూడవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రవేశం ఉంటుంది. శ్రీకోదండ రామాలయం శ్రీకోదండరామస్వామి సతీ సోదర సమేతంగా నిలువెత్తు దర్శమిస్తుంటారు. విశాలమైన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. తిరుమలకు నడక దారిన వెళ్లేవారు కోదండరాముణ్ణి దర్శంచుకోవడం పరిపాటి. శ్రీనివాస మంగాపురం ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి- పీలేరు మార్గంలో ఆలయం ఉంది. ఇక్కడ శ్రీకల్యాణ వెంకన్నకు నిత్యం ఉత్సవాలు జరుగుతుంటాయి. పురాతనమైన ఆలయాల్లో ఇదీ ఒకటి. ఈ పుణ్యక్షేత్రం తిరుపతికి 14 కిమీల దూరంలో ఉంది. -
ఢిల్లీ చేరిన భారత యాత్రికులు
-
పోటెత్తిన వేములవాడ
వేములవాడ: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ భక్త సంద్రమైంది. సోమవారం రాజన్నను దర్శించుకునేందుకు పలు జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో వేములవాడ చేరుకున్నారు. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరకు సోమవారం సుమారుగా 4 లక్షల మంది హాజరుకానున్నారు. స్వామి వారికి ప్రభుత్వ తరఫున జిల్లా కలెక్టర్ నితూకుమారీ పట్టువస్త్రాలను సమర్పించారు. అంతేకాకుండా, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఆలయ పూజారులు రాజన్న స్వామికి పట్టు వస్త్రాలను అందించారు. -
శబరిమల యాత్రికుల కోసం ప్రత్యేక యాప్
సాక్షి, హైదరాబాద్: అయ్యప్ప స్వామి దర్శనానికి కేరళలోని శబరిమల వెళ్లే యాత్రికుల కోసం ‘యాత్రి.కామ్’ సంస్థ దక్షిణ మధ్య రైల్వే సహకారంతో ‘రైల్ యాత్రి.డాట్ ఇన్ యాప్’ను ప్రారంభించింది. ఇందులో శబరిమలైకి సంబంధించిన అన్ని వివరాలతో పాటు రైళ్ల రాకపోకల సమాచారం అందుబాటులో ఉంటుంది. టికెట్ బుకింగ్‌తో పాటు ప్రయాణ సమయంలో ఆహార పదార్థాల సరఫరా వివరాలు కూడా ఇందులో పొందుపర్చారు. స్టేషన్ నుంచి శబరి కొండకు వెళ్లే మార్గాలు, ఇందుకు అనువైన సదుపాయాల వివరాలు కూడా ఉంటాయి. -
తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 11 కంపార్ట్మెంట్లు నిండాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 34 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 102 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 16 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - 9 ఖాళీగా ఉన్నాయి ఆర్జితసేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం - 128 ఖాళీగా ఉన్నాయి సహస్ర దీపాలంకరణసేవ - 18 ఖాళీ వసంతోత్సవం - 179 ఖాళీగా ఉన్నాయి గురువారం ప్రత్యేకసేవ - తిరుప్పావడ -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వ దర్శనానికి 5 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కొన్ని కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. అయితే నడకదారి భక్తులకు దర్శనం రద్దు చేసినట్టు టీటీడీ పేర్కొంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి. ఉచిత, రూ. 100, రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. భక్తుల ఉచిత గదులు 10 ఖాళీగా ఉన్నాయి. గదుల వివరాలు: ఉచిత గదులు - 10 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 20 ఖాళీగా ఉన్నాయి రూ.100 గదులు - 7 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీగా లేవు ఆర్జితసేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేవు, సహస్ర దీపాలంకరణసేవ - 100 ఖాళీగా ఉన్నాయి వసంతోత్సవం - 70 ఖాళీగా ఉన్నారుు, సోమవారం ప్రత్యేకసేవ - విశేషపూజ -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. అయితే నడకదారి భక్తులకు దర్శనం రద్దు చేసినట్టు టీటీడీ పేర్కొంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్ట్మెంట్లు నిండాయి. ఉచిత, రూ. 100, రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. భక్తుల ఉచిత గదులు 10 ఖాళీగా ఉన్నాయి. గదుల వివరాలు: రూ. 50 గదులు 20, రూ. 100 గదులు ఖాళీగా లేవు రూ. 500 గదులు ఖాళీగా లేవు ఆర్జిత సేవల టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - ఖాళీగా లేవు, సహస్ర దీపాంలంకరణ సేవ- 70 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం - ఖాళీగా లేవు -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి సర్వ దర్శనానికి 5 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 17 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం కేటాయించబడిన ఉచిత, రూ. 100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ. 50, రూ. 500 గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. భక్తుల ఉచిత గదులు 69 ఖాళీగా ఉన్నాయి. గదుల వివరాలు: రూ. 50 గదులు 25, రూ. 100 గదులు 78, రూ. 500 గదులు 9 ఖాళీగా ఉన్నాయి. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం, నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు సులభంగా లభిస్తున్నాయి. భక్తులకు ఉచిత గదులు 36 ఖాళీగా ఉన్నాయి. గదుల వివరాలు: రూ. 50 గదులు 17, రూ. 100 గదులు 15, రూ. 500 గదులు 14 ఖాళీగా ఉన్నాయి. శుక్రవారం ప్రత్యేక సేవ - పూర్ణాభిషేకం -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 7 గంటల సమయం, నడకదారి భక్తుల దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు సులభంగా లభిస్తున్నాయి. భక్తులకు ఉచిత గదులు 79 ఖాళీగా ఉన్నాయి. గదుల వివరాలు: రూ. 50 గదులు 54, రూ. 100 గదులు 190, రూ. 500 గదులు 5 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ -
పూరి, కోణార్క్ యాత్ర స్పెషల్ రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడుపనున్నట్లు ఐఆర్సీటీసీ ప్రకటించింది. ఆరు రాత్రులు, ఏడు పగళ్లు ఉండే ఈ యాత్రా స్పెషల్ ట్రైన్ (17016) ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 30వ తేదీ సాయంత్రం 5.40 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ (17015) డిసెంబర్ 4న ఉదయం 8.35 గంటలకు బయలుదేరి 5న ఉదయం 7.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. పర్యటనలో సుప్రసిద్ధ పూరీజగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాల సందర్శన ఉంటుంది. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 040-27702407, 9701360647 నంబర్లలో సంప్రదించవచ్చు. ధారూర్‌కు ప్రత్యేక రైళ్లు సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ధారూర్ మెథడిస్ట్ చర్చిలో జరిగే క్రిస్టియన్ జాతరకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్-ధారూర్ (07023) స్పెషల్ రైలు ఈ నెల 14, 16 తేదీ ల్లో ఉదయం 5.30 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ధారూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ధారూర్-హైదరాబాద్ (07024) స్పెషల్ రైలు ఈ నెల 14, 16 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు ధారూర్ నుంచి బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు జామున 3 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది. లింగంపల్లి, వికారాబాద్, సదాశివపేట్, కోహీర్, జహీరాబాద్, బీదర్ స్టేషన్లలో రైలు ఆగుతుంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామివారి సర్వ దర్శనానికి 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు సులభంగా లభిస్తున్నాయి. భక్తులకు ఉచిత గదులు 37 ఖాళీగా ఉన్నాయి. రూ. 50 గదులు 18, రూ. 100 గదులు 78, రూ. 500 గదులు 90 ఖాళీగా ఉన్నాయి. బుధవారం ప్రత్యేక సేవ - సహస్ర కలశాభిషేకం -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ తగ్గింది. సర్వ దర్శనానికి 5 గంటల సమయం, కాలినడక భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. 4 కాంపార్ట్మెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదిలాఉండగా, ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 14 కంపార్ట్మెంట్లు నిండాయి. భక్తుల కోసం ఉచిత, రూ. 50, రూ. 100, రూ. 500 గదులు సులభంగా లభిస్తున్నాయి. భక్తులకు ఉచిత గదులు 69 ఖాళీగా ఉన్నాయి. రూ. 50 గదులు 105, రూ. 100 గదులు 71, రూ. 500 గదులు 29 ఖాళీగా ఉన్నాయి. మంగళవారం ప్రత్యేక సేవ- అష్టదళ పాదపద్మారాధన -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
హైదరాబాద్: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పట్టనుంది. ప్రస్తుతం 18 కంపార్టమెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు. కాగా కాలినడక భక్తులకు ప్రవేశం రద్దు చేశారు. ప్రత్యేక ప్రవేశ దర్శనాన్ని కూడా రద్దు చేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
హైదరాబాద్: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగనుంది. సర్వ దర్శనానికి 8 గంటలు, కాలినడక భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పట్టనుంది.ప్రస్తుతం ఏడు కంపార్టమెంట్లలో భక్తులు వెంకన్న దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా గురువారం తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకల్యాణ వెంకన్న గరుడ వాహనంపై ఉరేగారు. నిన్న 50 వేలకు మందికిపైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఉచిత గదులు, రూ. 50, రూ. 100ల గదులు సులభంగా లభిస్తున్నాయి. అయితే రూ.500 గదులు ఖాళీ లేవు. శుక్రవారం ప్రత్యేక సేవ- పూరాభిషేకం -
కిటకిటలాడుతోన్న శ్రీశైల పుణ్యక్షేత్రం
శ్రీశైలం : కార్తీక పౌర్ణమి సందర్భంగా శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేలాది భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలో కార్తీక దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్వామివారి ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను పాలకమండలి రద్దు చేసింది. కాగా ఈరోజు సాయంత్రం పాతాళగంగ స్నానఘట్టాల వద్ద హారతి కార్యక్రమం జరగనుంది. అదేవిధంగా ఆలయ ప్రాంగణం ముందున్న గంగాధర మండపం వద్ద జరగనున్న జ్వాలాతోరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
హైదరాబాద్: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. సర్వ దర్శనానికి 6 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇతర పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీశైలం, విజయవాడ తదితర ప్రాంతాలు భక్తులతో పోటెత్తాయి. -
విజయవాడలో పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు, ఇతర దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విజయవాడ కనకదుర్గ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. గురువారం ఉదయమే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామునుంచే భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ రోజు లక్షన్నర వరకు భక్తులు రావచ్చని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం, అనంతపురం జిల్లా పెన్నహోబిళం, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. -
తిరుమలలో సర్వ దర్శనానికి 9 గంటలు
హైదరాబాద్: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 9 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. 11 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
హైదరాబాద్: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి 8 గంటలు, నడకదారి భక్తులకు 4 గంటలు, పత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. దీన్ని ప్రభోదోత్వవం, ఉత్తాన ద్వాదశి అని కూడా అంటారు. స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొలిపే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా వ్యవహరిస్తారు. ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు గాఢ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువును కైశిక ద్వాదశిన మేల్కొల్పడం రివాజు. ఈ సందర్భంగా వేకువజాము 4.30 నుంచి 5.30 గంటల మధ్యలో ఉగ్ర శ్రీనివాసమూర్తి ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనిమస్తారు. -
యాత్రికులపై బందిపోటు దాడులు
ఉత్తరప్రదేశ్‌లోని గోవర్ధన్ క్షేత్రంలో టెంట్లలో బసచేసిన యాత్రికులపై సాయుధ బందిపోట్లు దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డును చంపి, మహిళల వద్ద ఉన్న బంగారు నగలు, నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. దాంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ప్రతియేటా ఈ ప్రాంతంలో వల్లభ సంప్రదాయ ఆధ్వర్యంలో బ్రజ్ చౌరాసీ కోస్ పరిక్రమ యాత్ర జరుగుతుంది. వాళ్లు ఏర్పాటుచేసిన టెంట్లలో ఉన్నభక్తులపైనే బందిపోట్లు దాది చేశారు. ఐదారుగురు గుజరాతీ మహిళలపై వారు దాడిచేసి, నగలు, నగదు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఎదిరించిన పాప్ సింగ్ (43) అనే గార్డును కాల్చిచంపారు. -
‘మహా’ పోటీ
గణేశుని లడ్డూ కోసం పోటెత్తిన భక్తులు గంటల తరబడి బారులు ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహా గణపతి చేతిలో పూజలందుకున్న మహా లడ్డూ (5వేల కిలోలు) ప్రసాదం కోసం భక్తులు పోటెత్తారు. నగర నలు మూలల నుంచే కాకుండా నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు. కొంతమంది బుధవారం అర్థరాత్రి నుంచే పడిగాపులు కాశారు. గురువారం ఉదయం పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లలో ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు పురుషులు, మింట్ కాంపౌండ్ వైపు మహిళలు బారులు తీరారు. అంతకుముందు సైఫాబాద్ ఏసీపీ ఇస్మాయిల్, ఇన్స్పెక్టర్ పి.అశోక్, ఉత్సవ కమిటీఅధ్యక్షుడు సింగరి సుదర్శన్, లడ్డూ దాత మల్లిబాబు, శిల్పి రాజేంద్రన్‌తో పాటు కమిటీ సభ్యులు, నాయకులు పూజలు చేసి, ప్రసాద పంపిణీని ప్రారంభించారు. 5వేల కిలోలలో దాత మల్లిబాబుకు రెండు టన్ను లడ్డూను ఇచ్చారు. క్రేన్‌తో వాహనంలోకి లడ్డూను చేర్చారు. ప్రత్యేక వాహనంలో మల్లిబాబు తన స్వగ్రామం తాపేశ్వరానికి ప్రసాదాన్ని తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది మహాగణపతికి ప్రసాదం సమర్పించినా, దక్కించుకోలేకపోయామని, ఈ సంవత్సరం తిరిగి తనకు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రసాదాన్ని తమ చుట్టు పక్కల గ్రామాల వారికి ఉచితంగా అందజేస్తానని మల్లిబాబు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ప్రసాదం పంపిణీ కార్యక్రమం రెండు గంటలకు ముగిసింది. రసాబాసగా మారిన పంపిణీ మహాప్రసాదం కోసం భారీగా జనం తరలి రావడంతో అదుపు చేయడం నిర్వాహకులు, పోలీసులకు కష్టంగా మారింది. ఖైరతాబాద్ రైల్వేగేటు వైపు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుంటూ భక్తులు ముందుకు రావడంతో కొద్ది సేపు తోపులాట జరిగింది. పోలీసులు మళ్లీ బారికేడ్లు సరిచేసి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రైల్వే గేటు నుంచి శ్రీనివాస్‌నగర్ వరకు భక్తులు దాదాపు కిలోమీటర్ మేర క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తుల నిరాశ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉన్నప్పటికీ లభించకపోవడంతో భక్తులు నిరాశకు గురయ్యారు. మహిళలు చంటి పిల్లలను ఎత్తుకొని బారులు తీరారు. తీరా రెండు గంటలకే ప్రసాదం అయిపోయిందని చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటికీ భారీగా తరలివచ్చిన విద్యార్థులు ‘ఉయ్ వాంట్ లడ్డూ...’ అని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. దీంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. -
మూడు పుణ్యక్షేత్రాలకు త్వరలో సీ ప్లేన్ సేవలు
ముంబై: షిర్డీవాసులతోపాటు సాయిభక్తులకు శుభవార్త. ఈ నెల 19వ తేదీనుంచి ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి సమీపంలోని ములా డ్యాంతోపాటు శనిసింగణాపూర్, మెహరాబాద్లకు సీ ప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. మహారాష్ట్ర పర్యాటక సంస్థ సహకారంతో మారీటైమ్ ఎనర్జీ హెలీ ఎయిర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఈహెచ్‌ఏఐఆర్) సంస్థ ఈ సేవలను అందించనుంది. ఈ విషయాన్ని ఎంఈహెచ్‌ఏఐఆర్ డెరైక్టర్ సిద్ధార్థ్ వర్మ వెల్లడించారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని ములా డ్యాంవరకు ఈ సేవలను అందిస్తామని, అందువల్ల సాయి భక్తులు వీలైనంత తక్కువ సమయంలో షిర్డీకి చేరుకోగలుగుతారన్నారు. గత నెల 25వ తేదీన ముంబై నుంచి లోణావాల మధ్య తాము ప్రారంభించిన సీప్లేన్ సేవలకు విశేష స్పందన లభించిందన్నారు. తాము ములా డ్యాం వరకూ ప్రారంభించనున్న తాజా సేవల వల్ల ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తులు అత్యంత తక్కువ సమయంలోనే చేరుకుంటారన్నారు. దీంతోపాటు నాసిక్‌లోని గంగాపూర్ డ్యాం, మహాబలేశ్వర్ సమీపంలోని ధూమ్ డ్యాంలకు కూడా త్వరలోనే సీ ప్లేన్ సేవలను ప్రారంభిస్తామన్నారు. -
తీర్థయాత్రలో విషాహారం..
-
పోటెత్తిన భక్తజనం
పింప్రి, న్యూస్‌లైన్ : వేకువ జామునుంచే భక్తుల కోలాహలం మొదలయ్యింది. శ్రీ క్షేత్ర భీమా శంకర ఆలయం జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడంతో శ్రావణ మాసం మొదటి సోమవారం పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఒక్క సోమవారం రోజునే సుమారు 2 లక్షల మందికిపైగా భక్తులు తరలి వచ్చారని, ఇంత మంది తరలిరావడం ఇదే మొదటిసారి అని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం దర్శనానికి వీలుగా ప్రత్యేక బారికేడ్లను, పందిర్లను ఏర్పాటు చేశారు. భక్తులు వర్షంలో ఇబ్బందులు పడకుండా ప్లాస్టిక్ పందిర్లు ఏర్పాటు చేసినట్లు తహసిల్దార్ ప్రశాంత్ ఆవట్, ఆంబేగావ్ తహసిల్దార్ బి.జే.గోరే పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ఉదయాన్నే డాగ్ స్క్వాడ్ బృందాలు పూర్తిగా మందిరం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాయి. గర్భ మందిరం, మందిర పరిసరాలను దేవస్థాన భద్రతా సిబ్బంది, పోలీసులు తమ అధీనంలో ఉంచుకొని భక్తులను దర్శనానికి తరలించారు. దేవస్థాన ఉపకార్యనిర్వాహణాధికారి(ఈఓ) అధికారి సురేష్ కోడరే, ప్రాంతీయ అధికారి దత్తాత్రేయ కవితకే, పోలీసు అధికారులు సంజయ్ కామర్పాటిల్, కీర్తీ జమదాడే, వైద్యాధికారి డాక్టర్ సారికా కాంబ్లే తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్తంభించిన ట్రాఫిక్ చాలా వరకు భక్తులు తమ సొంత వాహనాలల్లో తరలిరావడంతో కి.లో మీటరు పొడవున ట్రాఫిక్ స్తంభించి పోయింది. మాతార్వాడి నుంచి అటవీ విభాగం చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానికుల సహాయంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రత్యేక బస్సులు : శివాజీ నగర్, రాజ్‌గురునగర్, నారాయణ్ గావ్, స్వార్గేట్తోపాటు ఇతర బస్సు డిపోల నుంచి అధిక బస్సు సర్వీసులను ఆలయానికి నడుపుతున్నారు. ఆలయప్రాంగణంలో పలు సామాజిక, స్వచ్ఛంద సంస్థలు భక్తులకు సహాయ సహకారాలు అందజేశాయి. -
టీటీడీలో ‘బ్లేడ్’బాబ్జీ
బ్లేడ్ల సరఫరా టెండర్లను ఎప్పటికప్పుడురద్దు చేస్తున్న ఉన్నతాధికారి! అస్మదీయునికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా నామినేషన్ పద్ధతిలో అప్పగింత టీటీడీలో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్‌కు పని కట్టబెట్టడం ఇదే తొలిసారి నాసిరకం బ్లేడ్లను సరఫరా చేస్తుండడంతో ఇబ్బంది పడుతున్న క్షురకులు, భక్తులు అయిన వారికి ఆకుల్లో చదివించడం అంటే ఇదే..! టీటీడీ లో ఏ వస్తువునైనా టెండర్ విధానంలోనే కొనుగోలు చేయ డం రివాజు. ఇలా అయితే అస్మదీయునికి లబ్ధి చేకూర్చలేమని గ్రహించిన ఓ ఉన్నతాధికారి.. ఏకంగా నాలుగు సార్లు టెండర్లు రద్దుచేశారు. చివరకు నామినేషన్ పద్ధతిలో అస్మదీయునికి పనిని కట్టబెట్టారు. ఇంతకూ ఆ పని ఏంటంటే.. కల్యాణకట్టకు అవసరమైన బ్లేడ్లను సరఫరా చేయడం. ఆ పనులను దొడ్డిదారిన దక్కించుకున్న కాంట్రాక్టర్ నాసిరకం బ్లేడ్లను సరఫరా చేస్తుండడంతో అటు క్షురకులు.. ఇటు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది టీటీడీలో హాట్‌టాపిక్‌గా మారింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కల్యాణకట్టల్లో రోజుకు సగటున 40 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పిస్తున్నట్టు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. భక్తుల తలనీలాలు విక్రయించడం వల్ల ఏటా టీటీడీకి రూ.200 కోట్ల ఆదాయం సమకూరుతోంది. భక్తుల తలానీలాలు తీయడానికి ఏడాదికి 70 లక్షల డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్లు అవసరం. ఆ బ్లేడ్లను ఈ-ప్రొక్యూర్మెంట్ టెండర్ విధానంలో కొనుగోలు చేస్తారు. నిబంధనలు తుంగలోకి.. బ్లేడ్ల కొనుగోలుకు సెప్టెంబర్ 18, 2013న మొదటి సారి టెండర్ పిలిచారు. బ్లేడ్ల తయారీదారులు మాత్రమే టెండర్లో పాల్గొనడానికి అర్హులని ఓ నిబంధన పెట్టారు. క్రోమియం 12.81 శాతం, 0.1 శాతం మందం, ఎలాంటి మచ్చలు, క్రాక్స్ లేకుండా ఉండే బ్లేడ్లను మాత్రమే సరఫరా చేయాలని షరతు పెట్టారు. ప్రసిద్ధిగాంచిన ఓ రెండు సంస్థలతోపాటు మరో సంస్థ డిస్ట్రిబ్యూటర్(తిరుపతి) టెండర్ షెడ్యూళ్లను దాఖలు చేశారు. ఆ డిస్ట్రిబ్యూటర్ టీటీడీ ఉన్నతాధికారికి సన్నిహితుడు. నిబంధన మేరకు అధికారులు డిస్ట్రిబ్యూటర్‌పై వేటు వేయడంతో ఉన్నతాధికారి ఆగ్రహించారు. టెండర్లో పేర్కొన్న నిబంధనల మేరకు ఓ ప్రసిద్ధిగాంచిన సంస్థ బహిరంగ మార్కెట్లో రూ.6 కు లభించే బ్లేడ్‌ను రూ.రెండుకు సరఫరా చేయడానికి అంగీకరించింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థకే టెండర్ ఖరారు చేయాలి. కానీ.. ఉన్నతాధికారి టెండర్‌ను రద్దు చేశారు. బ్లేడ్ల సరఫరాకు ఫిబ్రవరి 14న రెండోసారి టెండర్ పిలిచారు. ఏ ఒక్క సంస్థ షెడ్యూలు దాఖలు చేయకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు. మార్చి 7న ముచ్చటగా మూడోసారి టెండర్ పిలిచారు. తొలిసారి రూ.రెండుకే బ్లేడ్‌ను సరఫరా చేయడానికి ముందుకొచ్చిన ఒక సంస్థ మాత్రమే సింగిల్ షెడ్యూలు దాఖలు చేసింది. దాంతో.. టెండర్‌ను మూడోసారి రద్దు చేశారు. అస్మదీయుడికి టెండర్‌ను కట్టబెట్టాలనే లక్ష్యంతో సరికొత్త నిబంధనలు రూపొందించి నాలుగోసారి ఏప్రిల్ 9న టెండర్ పిలిచారు. ఈ టెండర్లో అస్మదీయుడుతోపాటు మరో రెండు సంస్థలు షెడ్యూళ్లను దాఖలు చేశాయి. అస్మదీయుడు సరఫరా చేసే బ్లేడ్లు నాణ్యంగా లేవని ల్యాబ్‌లో తేలడంతో ఉన్నతాధికారి మళ్లీ టెండర్‌ను రద్దు చేశారు. కుంటి సాకు చూపి.. ఈలోగా కల్యాణకట్టలో బ్లేడ్ల కొరత ఏర్పడింది. ఇదే సాకుగా చూపి తొలుత ఐదు లక్షల బ్లేడ్లను సరఫరా చేసే పనిని అస్మదీయునికి నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారు. ఓ సంస్థ ఉత్పత్తి చేసే బ్లేడ్లను ఒక్కోదానిని రూ.1.22కు సరఫరా చేసేలా టీటీడీతో అస్మదీయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రకం బ్లేడ్ బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్ దుకాణాల్లో 75 పైసలకే దొరుకుతోంది. ఉన్నతాధికారి సన్నిహితుడు కళ్యాణకట్టకు నాసిరకం బ్లేడ్లను సరఫరా చేస్తున్నారు. ఆ బ్లేడ్లతో తల నీలాలు తీసేందుకు క్షురకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలనీలాలు తీసేటపుడు గాట్లు పడి.. రక్తం వస్తుండటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అత్యవసరమైన సాకు చూపి మరో 65 లక్షల బ్లేడ్లను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టడానికి ఆ ఉన్నతాధికారి సిద్ధమయ్యారు. ఆ ఉన్నతాధికారి నిర్ణయం వల్ల టీటీడీ ఖజానాకు రూ.35 లక్షల మేర కన్నం పడుతుంది. ఇదే సాకు చూపి అన్నదానంలో వినియోగించే వస్తువులను కూడా నామినేషన్ పద్ధతిలో కొనుగోలు చేయడానికి ఉన్నతాధికారి కసరత్తు చేస్తోండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నగరం భక్త జనసంద్రం
-
యాత్రికులు సురక్షితం : కలెక్టర్
మచిలీపట్నం : జిల్లా నుంచి బదరీనాథ్, కేధార్నాథ్ వెళ్లిన యాత్రికులు సురక్షితంగానే ఉన్నారని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు శుక్రవారం తెలిపారు. బదరీనాథ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల జిల్లా వాసులు అక్కడ చిక్కుకుపోయారని ఆయన తెలిపారు. వెంటనే బదరీనాథ్ జిల్లా అధికారులతో, జిల్లాకు చెందిన యాత్రికులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నామన్నారు. అవనిగడ్డ మండలం వేకనూరుకు చెందిన 10 మంది, మచిలీపట్నంకు చెందిన ఒకరు కేధార్నాథ్ యాత్రకు 20 రోజుల క్రితం బయలుదేరి వెళ్లారన్నారు. వీరంతా ఢిల్లీలోని తమ బంధువుల ఇళ్ల నుంచి బయలుదేరి రుషికేష్, ఉత్తరాఖండ్, ముస్సోరి, కేధార్నాథ్, బదరీనాథ్ యాత్రకు వెళ్లారని, తిరుగు ప్రయాణంలో బదరీనాథ్ వద్దకు చిక్కుకుపోయారన్నారు. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారిని సరస్వతి నది ఒడ్డున ఉన్న చినజీయర్‌స్వామి ఆశ్రమానికి అక్కడి అధికారులు తరలించారని వారికి భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని చెప్పారు. యాత్రికుల వివరాలు అవనిగడ్డ వేకనూరుకు చెందిన తుంగల భవాని, తుంగల సావిత్రి, గుడివాక సాంబశివరావు, గుడివాక అరుణ, విశ్వనాధుని సుబ్బారావు, విశ్వనాధుని నాగరాజకుమారి, సనకా వెంకటశేషగిరిరావు, సనకా రాధ, సనకా ఫణీందర్, కొండవీటి కుమారి, మచిలీపట్నంకు చెందిన సిగిరేటి ఉషాకుమారి ఉన్నారు. మేము క్షేమంగానే ఉన్నాం.... వేకనూరు (అవనిగడ్డ) : కుటుంబసమేతంగా బదరీనాథ్ యాత్రకు వెళ్లిన మండల పరిధిలోని వేకనూరుని గ్రామానికి చెందిన భాస్కరరావు, భార్య సావిత్రి, అల్లుడు విశ్వనాథుని వెంకట సుబ్బారావు, కుమార్తె నగరాజకుమారి,మరో అల్లుడు గుడివాక సాంబశివరావు, కుమార్తె అరుణకుమారి క్షేమంగానే ఉన్నామని బంధువులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. బద్రీనాధుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యామని,భారీవర్షాల వల్ల రహదారులు మూసుకుపోవడంతో రాలేకపోయామని తెలిపారు. దీంతో బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. -
అంగారిక సంకష్టికి..అంతా రెడీ
సాక్షి, ముంబై : ముంబై ప్రభాదేవిలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటైన సిద్ధివినాయకుని ఆలయంలో అంగారికి సంకష్టి కోసం దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆరు నెలలకోసారి వచ్చే ఈ సంకష్టి ఈ సారి జూలె 15వ తేదీ మంగళవారం వచ్చింది. దీన్ని పురస్కరించుకుని ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాం తాల నుంచి లక్షలాది మంది భక్తులు సిద్దివినాయకున్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేం దుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శన వేళలు * సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు * మళ్లీ 3.50 నుంచి రాత్రి 8.10 వరకు * రాత్రి 10.55 నుంచి అర్ధరాత్రి 2.00 గంటల వరకు మహాపూజ, హారతి వేళలు * సోమవారం అర్ధరాత్రి 12.10 నుంచి 1.30 వరకు * మంగళవారం తెల్లవారు జాము 3.15 నుంచి 3.50 గంటల వరకు * మంగళవారం రాత్రి 8.55 నుంచి 10.55 గంటల వరకు రోజు వారి పూజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి మంగళవారం తెల్లవారుజాము 3.15 గంటల వరకు సిద్ధివినాయకుని దర్శనం కోసం ఆలయం ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. తెల్లవారుజాము 3.30 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు, అనంతరం రాత్రి 101.5 గంటల నుంచి తెల్లవారుజాము రెండు గంటల వరకు గర్భగుడిలోకి భక్తులకు అనుమతిస్తారు. ఇక కాకడ్ హారతి, మహాపూజను అర్ధరాత్రి 12.10 గంటల నుం చి అర్ధరాత్రి 1.30 గంటల వరకు, తెల్లవారుజాము 3.15 గంటల నుంచి తెల్లవారుజాము 3.30 గంటల వరకు హారతి, రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 10.15 గంటల వరకు మహాపూజతోపాటు నైవేద్యం, హారతిని అందించనున్నారు. ప్రత్యేక వసతులు ముఖ్యంగా వికలాంగులు, గర్భిణులు, సీనియర్ సిటీజన్లు, పిల్లతల్లుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీరికోసం గేట్ నెంబర్ మూడు నుంచి లోనికి అనుమతించనున్నారు. మరోవైపు భక్తుల కోసం ఏర్పాటు చేసిన మండపంలో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు అక్కడక్కడా ఫ్యాన్లు బిగించారు. అలాగే లైట్లు, తాగునీరు, టీ, అల్పాహారం, సంచార మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పించా రు. మండపంలో అగ్నిమాపక పరికాలు అందుబాటులో ఉంచారు. ఒక ఫైరిం జన్, అంబులెన్స్, వైద ్య బృందం, ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు అందులో ఉంచారు. భక్తులు సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమరాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని ట్రస్టీ విజ్ఞప్తి చేసింది. సిద్ధివినాయకుని అందరూ క్యూను పాటించి దర్శించుకోవాలని ఈఓ మంగేష్ షిందే కోరారు. ట్రాఫిక్ మళ్లింపు అంగారకి సంకష్టిని పురస్కరించుకుని జూలై 14 నుంచి ప్రభాదేవి సిద్ధివినాయకుని ఆలయం చుట్టుపక్కల పరిసరాలలోని రోడ్లపై ట్రాఫిక్‌లో పలు మార్పులు చేశారు. అంగారికి సంకష్టి జూలై 15 మంగళవారం అయినప్పటికీ సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు దర్శనం చేసు కోవాలన్న తపనతో అనేక మంది భక్తులు ఆలయం వద్దకి చేరుకుంటారు. ఆలయ పరిసరాలన్ని భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపులు, కొన్ని మార్గాల్లో రాకపోకలను నిలిపివేయనున్నారు. -
ఏడుపాయల వద్ద భక్తులపై కాల్పులు
-
మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద భక్తులపై కాల్పులు
మెదక్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం వద్ద గుర్తుతెలియని దుండగులు భక్తులపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో గాయపడ్డ ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ కుటంబమే లక్ష్యంగా దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. దుండగులు వాది వద్ద నుంచి 14 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితులు నిజామాబాద్ కు చెందినవారిగా గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. -
ఇరాక్ యాత్రికులు క్షేమం
సాక్షి, సిటీబ్యూరో: ఇరాక్‌లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లిన యాత్రికులు నగరానికి ఆదివారం క్షేమంగా చేరుకున్నారు. ఏటా షియా ముస్లింలు నాల్గుసార్లు ఇరాక్‌లోని పుణ్యక్షేత్రమైనా కర్బాలా, నజఫ్ ప్రాంతాలను సందర్శించడం ఆనవాయితీ. ఈ నెల 8 నుంచి 10 వరకు హైదరాబాద్ (పాతబస్తీ, దారుషిఫా, నూర్‌ఖాన్‌బజార్) నుంచి 350 యాత్రికులు 12 బృందాల్లో పుణ్యక్షేత్రాలకు బయల్దేరి వెళ్లారు. షబేబరాత్ రాత్రి కర్బాలా మైదానంలో జరిగే పలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని తమ పూర్వీకుల త్యాగాలను స్మరించుకున్నారు. వీరిలో 290 మంది కొన్ని రోజుల క్రితమే నగరానికి చేరుకోగా.. మిగిలిన 60 మంది ఆదివారం క్షేమంగా వచ్చారు. ప్రార్థనలు ఫలించాయి.. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల అక్కడికి వెళ్లిన తమ కుటుంబసభ్యులకు ఎటువంటి ప్రమాదం సంభవిస్తుందోనని నగరవాసులు ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు అక్కడి జరుగుతున్న పరిస్థితులను, బంధువుల యోగ క్షేమాలను ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకునేవారు. తమ వారి కోసం పార్థనలు చేశారు. వెళ్లిన వారు క్షేమంగా రావడంతో యాత్రికుల బంధువు, దారుషిఫా నివాసి మీర్ ఫిరాసత్ హలీ బాకరీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రార్థనలు ఫలించాయన్నారు. అరబ్బు దేశాలతో ప్రత్యేక అనుబంధం హైదరాబాద్ నగరానికి ఇరాక్ దేశానికి 6వ నిజాం మీర్ మహెబుబ్ అలీ కాలం నుంచే అనుబంధం ఉంది. 6వ నిజాం తన వ్యక్తిగత రక్ష, దేశ రక్షణ కోసం అరబ్బు దేశాల నుంచి పెద్ద ఎత్తున అరబ్బు దేశస్తులను సైన్యంలో నియమించారు. వారి కుటుంబాల కోసం ఇళ్లను కేటాయించారు. ఆ క్రమంలోనే నగరంలోని ఏ.సీ గార్డు, ఫస్టు లాన్సర్, సెకండ్ లాన్సర్, బార్కస్ తదితర ప్రాంతాల్లో అరబ్బు దేశస్థులు స్థిరపడ్డారు. నగరం నుంచి.. ముస్లింల అన్ని పుణ్యక్షేత్రాలు అరబ్బు దేశాల్లోనే ఉన్నాయి. ఏటా నగరం నుంచి వేల సంఖ్యలో హజ్, ఉమ్రా యాత్రకు వెళ్తుంటారు. టోలిచౌకి, షేక్‌పేట, మెహిదీపట్నం, మురాద్‌నగర్, ఆసిఫ్‌నగర్, మొగల్పురా, మలక్‌పేట, కిల్వత్, బార్కస్ తదితర ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో అరబ్బుదేశాలకు వెళ్లారు. కొందరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మరికొందరు వ్యాపారాలు చేస్తున్నారు. ఈ విధంగా భాగ్యనగారానికి, అరబ్బుదేశాలకు సంబంధం ఏర్పడింది. ఆ దేశాల్లో ఏ ప్రమాదం జరిగిన ఇక్కడి వారు విలవిలలాడుతుంటారు. ప్రస్తుతం ఇరాక్ పరిణామాలతో నగర ప్రజలు అక్కడ నివసిస్తున్న తమ వారు పడుతున్న ఇబ్బందులను తలుచుకొని కన్నీరుమున్నీరు అవుతున్నారు. పుణ్యక్షేత్రాల్లో ప్రశాంతం... నేను ప్రతిసారి షాబాన్ మాసంలో పుణ్యయాత్ర కోసం భక్తులను ఇరాక్ గత ఐదేళ్ల నుంచి తీసుకెళ్లుతున్నాను. ఈసారి ఇరాక్‌లో అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి. మేం వెళ్లిన ప్రాంతాల్లో తీవ్రవాదుల ప్రభావం లేదు. కార్బలా, నజఫ్‌లో ప్రశాంత వాతావరణం ఉంది. అన్నపానీయాలకు, రవాణ సౌకర్యలకు కొద్దిగా ఇబ్బందిపడ్డాం. అందరం క్షేమంగా నగరానికి వచ్చాం. - అలీ హుస్సేన్ జైదీ, టూర్ ఆపరేటర్ -
చేదు ఙ్ఞాపకానికి ఏడాది
-
వైభవంగా హనుమజ్జయంతి
జపాలిలో కిట కిటలాడిన భక్తులు తిరుమల, న్యూస్‌లైన్: తిరుమలలో హనుమాన్ జయంతి వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది హనుమజ్జయంతిని తిరుమల పాపవినాశనం మార్గంలోని జపాలిలో వేడుకగా నిర్వహించడం అనవాయితీ. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేకువజాము నుంచే ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. ఆంజనేయస్వామి మాలను ధరించి దీక్ష చేప్పటిన భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. జై సీతారామ్ అంటూ నామస్మరణ చేస్తూ ఆంజనీపుత్రుని సేవలో తరించారు. అంతకుముందు హథీరామ్ జీ మఠం మహంత్ అర్జున్‌దాస్ ఆధ్వర్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీఆంజనేయస్వామిని ప్రత్యేక పుష్పాలను అలంకరించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అభిషేకాలను, ఇతర పూజలను నిర్వహించారు. అలాగే శ్రీవారి ఆల యం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి ఉదయం 9గంటలకు ఆభిషేకాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం, పాలుతో అభిషేకాన్ని నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డు ఏడోమైలు వద్దనున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణాగత ప్రపత్తికి, దాసభక్తికి ప్రతీక హనుమంతుడు... దాస భక్తికి ప్రతీకైన ఆంజనేయస్వామి భక్తాగ్రేసురుల్లో అత్యంత ఉత్కృష్ణమైనవారని టీటీడీ చైర్మన్ బాపిరాజు పేర్కొన్నారు. టీటీడీ తరుపున ఆంజనేయస్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంపూర్ణ శరణాగతే జీవన పరమావధిగా చేసుకున్న భక్తాగ్రగణ్యుడు హనుమంతుడన్నారు. జీవితాంతం రామనాస్మరణే ధ్యేయంగా మలచుకుని నేటికీ చిరంజీవిగానే ఉంటూ తన భక్తుల కోరికలను తీరుస్తున్న కల్పతరువుగా ఆంజనేయస్వామి ప్రసిద్ధిగాంచినట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం జపాలిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ జపాలీ తీర్ధానికి చేరుకుని హనుమంతుడిని దర్శించుకుంటున్నారని చెప్పారు. -
భక్తులకు చేదు అనుభవం
-
రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మరణం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి పది గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఖండాలా హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుజరాత్‌లోని పోరుబందర్‌కు చెందిన యాత్రికులు జనవరి 26వ తేదీ నుంచి దక్షిణాది ప్రాంతాలను సందర్శించేందుకు యాత్రకు బయలు దేరారు. కన్యాకుమారి, తిరుపతి ప్రాంతాలకు వెళ్లి ముంబైకి బయల్దేరారు. ఇదే సమయంలో పుణేలో మార్గమధ్యలో బెంగరూట్వాడి వద్ద ‘ఎస్’ ఆకార రోడ్డు మార్గంలో ముంబైకి వెళుతున్న ఓ కంటైనర్ అదుపుతప్పి ముందుగా వ్యాగోనార్ను తర్వాత జీపు, మరో జీపును ఢీకొంది. ఈ వాహనాలు రోడ్డుపక్కన పార్క్ చేసిన అంకుర్ ట్రావెల్స్ ఏసీ బస్సును ఢీకొట్టాయి. ఈ బస్సు అదుపుతప్పి సుమారు 20 అడుగుల లోయలోకి పడిపోయింది. అయితే బస్సులో ఉన్న సుమారు 47 మంది ప్రయాణికుల్లో 10 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అయితే మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఖండాళా, శిర్వాళాలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన రక్షక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక పనులను వేగిరంగా చేపట్టారని పోలీసులు చెప్పారు. ఇదిలావుండగా ఇదే ప్రాంతంలో తరచు ప్రమాదాలు సంభవిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో ఇదే చోట జరిగిన ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించారు. -
అమర్నాథ్ యాత్రకు ‘హైసెక్యూరిటీ’ పర్మిట్
జమ్మూ: అమర్నాథ్ యాత్ర సందర్భంగా నకిలీ రిజిస్ట్రేషన్ల బెడదకు అడ్డుకట్ట వేసేం దుకు అమర్నాథ్ ఆలయ బోర్డు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి అమర్నాథ్ యాత్రికులకు హైసెక్యూరిటీ యాత్రా పర్మిట్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోరా అధ్యక్షతన ఈ నెల 20న జరిగిన అమర్నాథ్ ఆలయ బోర్డు సమావేశం.. కొత్త యాత్రా పర్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్‌కు ఆమోదముద్ర వేసింది. హిమగిరుల్లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందు కు ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వస్తారు.కొత్త పర్మిట్లను ఒక్కో రోజు ఒక్కో రంగులో.. రూట్ల వారీగా రూపొంది స్తారు. యాత్ర ఈ ఏడాది జూన్ 28న ప్రారంభమై.. ఆగస్టు 10తో ముగియనుంది. -
అదృశ్యం కాదు.. ఆత్మహత్య