
తిరుమలలో పాము కలకలం
తిరుపతి: తిరుమలలో ఓ పాము కలకలం రేపింది. వీఐపీలు బసచేసే వెంకటకళ అతిథిగృహం దగ్గర పాము కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. వెంటనే అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
పాములు పట్టే భాస్కర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని, చాకచక్యంగా పామును పట్టేశాడు. ఈ పాము 9 అడుగుల పొడవుంది. ఇది జర్రిపోతు అని భాస్కర్ తెలిపారు. అతిధిగృహాల సమీపంలో చెత్తాచెదారం పడేయడం వల్ల... వాటిని తినేందుకు ఎలుకలు వస్తుంటాయని.. ఎలుకల కోసం పాములు వస్తుంటాయని భాస్కర్ చెప్పారు. శ్రీవారి భక్తులను విషపూరిత పాముల నుంచి కాపాడటమే కాకుండా... పట్టుకున్న పాములను సురక్షిత ప్రాంతాలలో వదిలి వాటిని కూడా కాపాడుతున్నందుకు భాస్కర్‌కు జీవ వైవిద్యమండలి అవార్డును బహూకరించింది.