సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం ముందు శుక్రవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. బ్యాటరీలో లోపం వల్ల షాట్ సర్క్యూట్ జరిగినట్లు తెలుస్తోంది. విజిలెన్స్ డీఎస్పీ అంకయ్యా కారుగా అధికారులు గుర్తించారు.
ఆయన ఉదయం అభిషేకంలో పాల్గొనడానికి వచ్చినట్లు సమాచారం. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సకాలంలో మంటలను అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఊపిరి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment