సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు హజ్‌యాత్రను కొనసాగిస్తున్నారు. జోర్డాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘పెట్రా’తెలిపిన వివరాల ప్రకారం హజ్ యాత్రలో పాల్గొన్న 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. మృతులను సౌదీ అరేబియాలో ఖననం చేయలా లేదా జోర్డాన్‌కు పంపించాలా అనేదానిపై సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
హజ్‌యాత్ర చివరి రోజులలో సైతానుకు గుర్తుగా ఉన్న స్థంభాలను ముస్లింలు రాళ్లతో కొడతారు. దీనిని చెడును తరిమికొట్టడానికి గుర్తుగా భావిస్తారు. ఇది ముస్లింలు హజ్‌యాత్రలో చేసే చివరి ఆచారం. ప్రపంచం నలుమూలల నుండి 18 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా హజ్ యాత్రకు ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు అటువంటి ఆంక్షలు లేకపోవడంతో హజ్ తీర్థయాత్రలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment