Heat stroke
-
వడదెబ్బకు 14 మంది హజ్‌యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు హజ్‌యాత్రను కొనసాగిస్తున్నారు. జోర్డాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘పెట్రా’తెలిపిన వివరాల ప్రకారం హజ్ యాత్రలో పాల్గొన్న 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. మృతులను సౌదీ అరేబియాలో ఖననం చేయలా లేదా జోర్డాన్‌కు పంపించాలా అనేదానిపై సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.హజ్‌యాత్ర చివరి రోజులలో సైతానుకు గుర్తుగా ఉన్న స్థంభాలను ముస్లింలు రాళ్లతో కొడతారు. దీనిని చెడును తరిమికొట్టడానికి గుర్తుగా భావిస్తారు. ఇది ముస్లింలు హజ్‌యాత్రలో చేసే చివరి ఆచారం. ప్రపంచం నలుమూలల నుండి 18 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా హజ్ యాత్రకు ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు అటువంటి ఆంక్షలు లేకపోవడంతో హజ్ తీర్థయాత్రలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..విలవిలాడుతున్న జనం (ఫొటోలు)
-
వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!
సమ్మర్ అంటే సూర్యుడి భగభగలు మాములుగా ఉండవు. పట్టపలే చుక్కలు చూపిస్తున్నట్లుగా ఎండ దంచి కొడుతుంది. మిట్ట మధ్యాహ్నాం బయటకు వెళ్లాలంటేనే హడలిపోతారు. ఈ ఉష్ణోగ్రతలుకు ఎంతో మంది వృద్ధులు పిట్టలు రాలినట్లుగా చనిపోతారు. అందుకే ఈ వడదెబ్బకు గురికాకుండా ఉండేలా ద్రవపదార్థాలు ఎక్కువగా తాగమని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ ఎండకాలంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండకూదంటే ఏం చేయాలి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అంటే..ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన బాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు. అదీగాక భారత వాతావరణ శాఖ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో సహా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు వడదెబ్బలకు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వడదెబ్బ బారిన ఎలా పడతాం? దీని బారిన పడినట్లు ఎలా గుర్తించాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం. వడదెబ్బకు గురైన సంకేతాలు..వేడి, పొడి చర్మం: బాగా చెమటలు పట్టిన బాడీ చల్లబడకపోవడం. చర్మం వేడిగా, పొడిబారిన పడినట్లు అయిపోతేహృదయ స్పందన రేటు పెరిగినా..: శరీరం తనను తాను చల్లబరుచుకోవటానికి ప్రయత్నించినపుడు హృదయస్పందన రేటు పెరుగుతుంది.శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది: శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి కష్టపడటం, తద్వారా వేగంగా శ్వాస తీసుకోవడానికి దారితీస్తుంది. తలనొప్పి: పెరిగిన శరీర ఉష్ణోగ్రత, నిర్జలీకరణం ఫలితంగా తీవ్రమైన తలనొప్పి ఏర్పడవచ్చు.వికారం, వాంతులు: వికారం వాంతులు కారణంగా నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయడం.స్ప్రుహ కోల్పోవడం: తీవ్రమైన సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత మెదడుపై ప్రభావం చూపి స్ప్రుహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి మూర్చ వంటివి రావడం జరుగుతుంది.నివారణ చర్యలు..హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం. దాహం అనిపించకపోయినా తరుచుగా నీళ్లు తాగడం, ఆల్కహాల్, కెఫిన్ వంటి పానీయాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి. వేడి నుంచి తప్పించుకునేలా ఎయిర్ కండిషన్డ్ పరిసరాల్లో ఉండటానికి ప్రయత్నించండి. గాలి వచ్చేలా ఉండే ఫ్యాన్లు వంటివి ఉపయోగించటం వంటివి చేయాలి. ఈ వేడికి తగ్గట్టు కాటన్ లేదా నార వంటి మెత్తని తేలికైన బట్టలను ఎంచుకోండి. సూర్మరశ్మని గ్రహించకుండా ఉండేలా రంగులను ఎంచుకుని మరీ దుస్తులను ధరించండి. అలాగే ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో కాకుండా చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. చర్మాన్ని సంరక్షించుకునేలా ఎస్పీఎఫ్ సన్‌స్క్రీన్, సన్‌బర్న్ వంటివి ఉపయోగించండి. శరీరం ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా చలువ చేసే పదార్థాలను తినడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తేలికపాటి భోజనం తినాలిహైడ్రేటింగ్గా ఉండేలా చేసే పండ్లు, కూరగాయలను తినండి. (చదవండి: బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!) -
భానుడి భగ భగ: ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
మార్చి మాసం ముగియుకుండానే భానుడి భగ భగలు మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో మండే ఎండలు, వేడిగాలులు తట్టుకొని నిలబడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే వేసవిలో వడ దెబ్బ ప్రమాదం పెరుగుతుంది. మరి వడదెబ్బ, ఇతర వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో పిల్లా పెద్దా అంతా అప్రతమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా, నీరు ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ నీరు తాగాలి. వీటితోపాటు రకరకాల ద్రవపదార్థాలు, పానీయాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యాన్నిచ్చే వివిధరకాల తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పెరుగు, మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష, బొప్పాయి వంటివి ఈ సీజన్లో తీసుకోవడం మేలు చేస్తుంది. అతిగా ఆహారం తీసుకోవడం హానికరం. నీటిని ఎక్కువగా వాడాలి.దాహంగా ఉంది కదా అని రసాయన సహిత కూల్ డ్రింక్స్, శుభ్రమైన ఐస్ వాడని డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఫాస్ట్ ఫుడ్, బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలి. తప్పదు అనుకుంటే, ఎండను తట్టుకునేలా తలపై టోపీ లేదా గొడుగు వాడాలి. బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన నీళ్లు తాగితే వడదెబ్బ తగలదు. ఉల్లి పాయ రసం తాగితే వడదెబ్బ తగలకుడా చేస్తుంది. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా మంచిదే. చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. అలాగే ఎండలోంచి లోపలికి వచ్చిన వెంటనే గట గటా చల్లని నీళ్లు తాగకూడదు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా అనిపించినా, వాంతులు, కళ్లు తిరగడం, తలనొప్పి, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపించినా, వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. తక్షణమే చికిత్స తీసుకోవాలి. -
దంచికొడుతున్న ఎండలకు గబ్బిలాలు విలవిల.. చలించిపోయిన గ్రామస్తులు
భువనేశ్వర్: దంచికొడుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఇక పక్షులు, జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కబటబంధా గ్రామంలో గబ్బిలాలు ఎండ వేడికి విలవిల్లాడిపోతున్నాయి. హీట్ స్ట్రోక్ కారణంగా మృత్యువాత పడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో మూడు రోజుల్లోనే 8 గబ్బిలాలు మరణించాయి. ఈ గ్రామం సమీపంలో దాదాపు 5వేలకు పైగా గబ్బిలాలు మూడు చెట్లపై నివసిస్తున్నాయి. రోజంతా వీటి చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఎండదెబ్బకు వందల కొద్ది గబ్బిలాలు నేలపై పడిపోతున్నాయి. గ్రామస్థులు వీటిని చూసి చలించిపోతున్నారు. వాటికి ఉపశమనం కల్పించేందుకు వాటర్ స్ప్రే కొడుతున్నారు. గబ్బిలాలు పవిత్రమైనమని తాము భావిస్తామని, అందుకే వాటిని 20 ఏళ్లుగా కాపాడుకుంటున్నామని కేశవ్ చంద్ర సాహు అనే స్థానికుడు తెలిపాడు. ఎండ వేడికి తట్టుకోలేక గబ్బిలాలు కిందపడి చనిపోవడం చూస్తుంటే బాధగా ఉందన్నాడు. కాగా.. ఒడిశాలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రానున్న ఐదు రోజుల్లో ఒడిశాలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. చదవండి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు -
మహారాష్ట్రలో వడదెబ్బ తగిలి 11 మంది మృతి
-
వడదెబ్బ మరణం.. పరిహారం అందుకోండిలా..!
కడప అగ్రికల్చర్ : వేసవి తీవ్రత పెరిగింది. భానుడు భగ భగ మండుతున్నాడు. మే నెలలో వడగాల్పులు మరీ అధికంగా ఉంటున్నాయి. ఎండలతో పాటు ఊపిరాడని ఉక్కపోత మనుషులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఎండ, ఉక్కపోతను తట్టుకోవడం ప్రజలకు కష్టమైంది. అందులోనూ శ్రామికులు, రైతులు, రైతు కూలీలు, ఉపాధి కూలీలు జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వడదెబ్బ వల్ల అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే ఆ కుటుంబం కోలుకోలేని విధంగా నష్టపోతుంది. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం పొందాలంటే దీనిపై అవగాహన పెంచుకోవడం అవసరం. వడదెబ్బకు గురవుతున్న వారిలో అధికంగా పేదవారే ఉంటున్నారు. వీరిలో చాలా మందికి నష్టపరిహారం ఎలా పొందాలో అవగాహన ఉండడంలేదు. త్రిసభ్య కమిటీ సిఫార్సుతప్పని సరి... వడదెబ్బకు గురై మృతి చెందితే ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేస్తుంది. వడదెబ్బకు సంబంధించి ప్రతి మండలానికి ఒక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ వడదెబ్బకు గు రై చనిపోయిన వారి వివరాల నివేదికను త యారు చేసి కలెక్టర్ పరిశీలనకు పంపుతుం ది. ఆ నివేదికను కలెక్టర్ పరిశీలించిన తరువాత పరిహారం మంజూరు చేస్తారు. ఎండ తీవ్రతపై ఉపాధి పథకం వేతన కూలీలు, శ్రామికులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్లు ఎండలోనే తిరగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ బారినపడే ప్రమాదం ఉంది. వడదెబ్బకు గురై చనిపోతే ప్రభుత్వం నుంచి మృతుడి కుటుంబీకులు రూ.50 వేల పరిహారం పొందే అవకాశం ఉంది. కమిటీ ఏం చేస్తుందంటే... ♦ వడదెబ్బ మృతుల నిర్ధారణకు మండలంలో త్రిసభ్య కమిటీ ఉంటుంది. దీనిలో వైద్యాధికారి, తహసీల్దార్, సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) సభ్యులుగా ఉంటారు. –వడదెబ్బ కారణంగా మరణం సంభవిస్తే కమిటీ సభ్యులకు తప్పకుండా సమాచారం అందించాలి. ♦ ఆ వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు ముందుగా వైద్యాధికారి ధ్రువీకరించాలి. అనంతరం పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసి సమీపంలోని ఆస్పత్రికి మృతదేహాన్ని తరలిస్తారు. అక్కడ పోస్టుమార్టం చేస్తారు. ఆ నివేదికను వైద్యాధికారి పోలీసు స్టేషన్‌కు అందజేస్తే ఎఫ్ఐఆర్ ఆధారంగా వడదెబ్బ మృతిగా నిర్ధారిస్తారు. ♦ ఆ నివేదికను మండల తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్ పరిశీలనకు పంపిస్తారు. నివేదికను కలెక్టర్ ప రిశీలించిన తరువాత పరిహారాన్ని బాధిత కుటుంబానికి విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. -
మాట తప్పిన సర్కార్
గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన వడ్దే రామచంద్ర గొర్రెల కాపరి. గొర్రెలు మేపేందుకు వెళ్లిన అతను వడదెబ్బకు గురై 2016 ఏప్రిల్ 27 అడవిలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అప్పటికే వేరుగా వెళ్లి పోయాడు. దీంతో రామచంద్ర ఇద్దరు కూతుళ్లు, భార్య జీవనం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ యాజమాని మృతి చెందడంతో ఉన్న 30 గొర్రెలు అమ్ముకున్నారు. దీనికి తోడు రామచంద్ర భార్య శివమ్మకు అనారోగ్యం గురికావడంతో వైద్యఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తామన్న లక్షరూపాయలు కూడా అందలేదు. గార్లదిన్నె: మండే ఎండలతో వడదెబ్బ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఉపాధి కూలీలు, గొర్రెల కాపరులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకుంటామని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు నిరాశే ఎదురైంది. ఈ వేసవిలో కూడా వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు గత రెండేళ్లుగా మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జనం పిట్టల్లా రాలిపోయారు. జిల్లాలోనే శింగనమల మండలం తరిమెల గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపు 47 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వడ దెబ్బ మృతుల విషయానికి వస్తే నియోజకవర్గంలో 25 మంది దాకా మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 226 మంది వేసవిలో ఎండ తీవ్రతకు ప్రాణాలొదిలారు. ప్రతి పాదనలకే పరిమితం వడ దెబ్బతో చనిపోయిన కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ఇస్తామని చెప్పింది. జిల్లాలో వడ దెబ్బతో మృతి చెందిన వారి వివరాలు అధికారులు సేకరించారు తప్ప ఇప్పటికీ మృతుల కుటుంబాలకు ఒక్క పైసా పరిహారం అందలేదు. మరి కొంతమంది ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల వద్దకు తిరుగుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. ఒక్క రూపాయి పరిహారం రాలేదు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన చింతమాను పెద్ద నారాయణ 2016 ఏప్రిల్ 13న కట్టెల కోసం కొండకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఎండవేడిమికి వడదెబ్బ బారినపడ్డాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదుక్కుంటూ రాగా మార్గమద్యలో పెద్ద నారాయణ మృతదేహం కనిపించింది. తీవ్రమైన ఎండ వేడిమికి అతని శరీరమంతా బొబ్బలు వచ్చి మరణించాడు. వడదెబ్బకు గురై మరణించిన కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందించి ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు మాటలు నేటికీ కార్యరూపం దా ల్చలేదని మృతుడి భార్య అంకాళమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు 2017 సంవత్సరంలో నా భర్త సాకే రామన్న ఇంటి వద్ద గుడిసెకు మరమ్మతులు చేస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వడ దెబ్బ తగిలి చనిపోయాడు. అప్పట్లో వీఆర్వో మిగతా అధికారులు వచ్చి వివరాలు అన్నీ తీసుకెళ్లారు. ఇంత వరకు ప్రభుత్వం పరిహారం అందించలేదు.– ఉత్తమ్మ, బుక్కరాయసముద్రం -
ఇప్పుడే ఇలా.. మేలో ఇంకెలా?
ఎండ ప్రచండమై సెగల పొగలు కక్కుతోంది. వేడిగాలులతో కలిసి అదరగొడుతోంది. వెరసి కడప నిప్పుల కొలిమిలా మారింది. తెల్లారింది మొదలు ఉక్కపోత గుక్క తిప్పుకోనియకుండా చేస్తోంది. ఎప్పుడు లేని విధంగా ‘ఉష్ణోగ్రత’ రికార్డులు సృష్టిస్తోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రత 40కు తగ్గకుండా నమోదవుతుండడంతో.. మేలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని జనాల్లో ఆందోళన మొదలైంది. సాక్షి, కడప:సూర్యుడి ప్రతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఏటా మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సారి ఏప్రిల్‌లోనే ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నారంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద యం 8 నుంచే భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో వాతావరణం ఉదయం నుంచే వేడుక్కుతోంది. 41 నుంచి 45 డిగ్రీల నమోదు జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వారం రోజులుగా జిల్లా ప్రజలు ఉడుకుతో అల్లాడుతున్నారు. సూర్య ప్రతాపానికి కడప కాలిపోతోంది. బయటికి రావాలంటేనే ముఖం మీద చెంపలకు చేతులు అడ్డుపెట్టుకుని...తలపై బట్ట వేసుకుని బయట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా ప్రతిరోజు 40కు పైగానే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈనెల 18 నుంచి 41 నుంచి దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన వడగాలులు ఎండ ప్రభావానికి తోడు వడగాలులు జనాలను భయాం దోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా ఎప్పుడూ లేని తరహాలో ఎండలు పెరగడం.....దీనికితోడు గాలలు వీస్తుండడంతో వడగాలుల ప్రభావంతో ప్రజలు భయపడుతున్నారు. ఎండ సెగ ధాటికి మధ్యాహ్నమైతే ఇంటికే పరిమితం అవుతుండగా పల్లె ప్రాంతాల్లో చెట్ల కింద సేద తీరుతున్నారు. వడగాలుల నేపధ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్మానుష్యం ఎండలు వేడి పుట్టిస్తుండడంతో మ ధ్యాహ్న సమయంలో రోడ్లతోపాటు ప్ర ధాన ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉం డే వైవీ స్ట్రీట్ మొదలుకొని నగరంలోని వీధులు కూడా జనం లేక వెలవెలబోతున్నాయి. ఎండ దెబ్బకు భయపడి అధికా రులు కూడా మధ్యాహ్న భోజనాన్ని కార్యాలయాలకే తీసుకెళుతున్నారు. -
నిప్పుల కుండ!..నల్లగొండ
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కొద్ది రోజులుగా జిల్లాలో ఎండలు పెరిగిపోయాయి. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లగొండలోనే అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రెండేళ్ల కిందట 2016 ఏప్రిల్ 25వ తేదీన జిల్లాలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్టోగ్రత నమోదు కాగా, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి జిల్లా ప్రజలను భయానికి గురిచేస్తోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో తారు, సిమెంటు రోడ్లు వేడి తీవ్రతను మరింతపెంచుతున్నాయి. గడిచిన వారం రోజులుగా జిల్లాలో 42 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండాకాలం మరో రెండు నెలల మిగిలి ఉంది. సీజన్ మొదలైన కొద్ది రోజులకే ఎండలు తీవ్రం కావడంతో ముందు ముందు ఎలా గడుస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు, ఇతరత్రా వ్యవసాయ కూలీలు తెల్లవారు జామునే పనుల్లోకి వెళ్లి పదిగంటల కల్లా తిరుగు ముఖం పడుతున్నారు. సాయంత్రం చల్లబడితే తప్ప తిరిగి పనికి వెళ్లడం లేదు. పట్టణాల్లో భవన నిర్మాణ కార్మికులదీ అదే పరిస్థితి. ఉదయం తొమ్మిది దాటితే పనులు చేయలేకపోతున్నారు. ఇంత తీవ్రంగా ఎండలు మండిపోతుండడంతో వడదెబ్బ కొట్టే ముప్పు బాగా పెరిగినట్లేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకుని ఎండలో తిరగకుండా చల్లపూటే పనులు చేసుకోవడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కాగా, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నాలుగు లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేసింది. ఇందులో ఇప్పటికే 2 లక్షల ప్యాకెట్లను పంపిణీ కూడా చేసింది. వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ప్రజల్లో చైతన్యం కల్పించే కార్యక్రమాలు షురూ చేసింది. ఓఆర్ఎస్ ప్యాకెట్లను సైతం ప్రజలు నిత్యం వెళ్లే రేషన్ షాపులు, అంగన్వాడీ కేంద్రాలు తదితర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచింది. వారం రోజులుగా మండుతున్న ఎండ ఈ నెలారంభం నుంచే ఎండల కొద్దిగా భయపెడుతున్నా వారం రోజులుగా మరీ ఎక్కువయ్యాయి. మధ్యలో అకాల వర్షంతో ఉష్ణోగ్రతలు కొంత అదుపులోకి వచ్చి తగ్గిన ట్లు కనిపించినా, గడిచిన వారం నంచి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇవీ.. వడదెబ్బ లక్షణాలు ఎండలో తిరిగినా, పనిచేసినా శరీరంలోని ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ దెబ్బతినడంతో వడదెబ్బకు గురవుతారు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల నుంచి 110 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పెరుగుతుంది. వడదెబ్బ బాధితుల్లో 40శాతం వరకు మరణించే అవకాశాలు ఉంటాయి. వడదెబ్బకు గురైన వ్యక్తికి తలతిరగడం, తలనొప్పి, చర్మం ఎండిపోయి ఎక్కువ జ్వరం కలిగి ఉంటారు. మగతగా కలవరించడం, ఫిట్స్ రావడం, పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళతారు. వడదెబ్బ నుంచి రక్షణ ఇలా.. గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక రోగులు ఎట్టి పరిస్థితులలో ఎండలో తిరగరాదు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నీడలో ఉంటే మంచిది. ఎండ తీవ్రత ఉన్నప్పుడు వ్యాయామం చేయడం కూడా ప్రమాదకరం. సాధ్యమైనంత వరకు మిట్టమధ్యాహ్నం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. తప్పనిసరిగా బయటికి వెళ్లాల్సి వస్తే టోపీ ధరించాలి లేదంటే రుమాలు చుట్టుకోవాలి. ముక్కుకు, తలకు ఎండ తగలకుండా చూసుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, పళ్ళ రసాలు తాగి వెళ్లాలి. సాధ్యమైనంత వరకు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. లేత రంగు, కాటన్ దుస్తులను ధరించాలి. ఇంటి గదుల్లో ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. చల్లని వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని వెంటనే చల్లటి గుడ్డతో చల్లబర్చాలి. చల్లని నీడ ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి శరీరంపై ఉన్న దుస్తులను తొలగించి చల్లని నీటితో లేదా, చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తుడవాలి. చల్లని గాలి తగిలేలా ఉంచి చల్లని ఉప్పు కలిగిన నీటిని తాగించాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని ఎలాంటి ఆలస్యం చేయకుండా దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకుని ముందుస్తు జాగ్రత్తలను తీసుకున్నాం. ప్రజలు వడదెబ్బ భారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడానికి కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుతో ప్రచారం చేస్తున్నాం. ఆశా కార్యకర్తల మొదలు వైద్యాధికారులందరినీ అప్రమత్తం చేశాం. జిల్లాలో 4లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధం చేడయంతో పాటు ఇప్పటికే 2లక్షల ప్యాకెట్లను పంపిణీ చేశాం. అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలు, పనికి ఆహార పథకం పనుల వద్ద, బస్టాండ్లు, రైల్వేస్లేషన్ల వద్ద జనానికి అందుబాటులో ఉంచాం. సీజన్లో అవసరమైన మందులను అన్ని ఆస్పత్రుల్లో , పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉంచాం. ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశాం. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.– డాక్టర్ భానుప్రసాద్ నాయక్, డీఎంహెచ్ఓ -
సన్‌స్ట్రోక్..బీ కేర్ ఫుల్
జిల్లాలో నాలుగు రోజులుగా వేస్తున్న తీవ్రమైన ఎండలకు ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 గంటలకే ఎండ తీవ్రత ప్రారంభం కావడంతో బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి 9 గంటల వరకూ దాని ప్రభావం కొనసాగుతుంది. ఈ దశలో ఏమి చర్యలు తీసుకోవాలి, వడదెబ్బకు గురైనప్పుడు ఏమి చేయాలనే దానిపై సాక్షి ప్రత్యేక కథనం... లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో పగటి ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు చేరుకుంది. ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వాస్పత్రితోపాటు, ప్రవేటు ఆస్పత్రిలకు ఎంత తీవ్రతతో తలనొప్పి, ఎండ ప్రభావానికి గురైన వారికి రాత్రి నిద్రపట్టక పోవడం వంటి సమస్యలతో వస్తున్నట్లు చెపుతున్నారు. ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్నారులు సైతం హీట్‌స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరో ఐదు రోజుల్లో వేసవి సెలవులు కావడంతో పిల్లలు ఎక్కువగా అవుట్డోర్ గేమ్స్ ఆడుతుంటారని, ఉదయం 9 నుంచి సాయంత్రం 5లోపు ఎట్టిపరిస్థితుల్లో బయట ఆటలకు అనుమతించరాదని నిపుణులు సూచిస్తున్నారు. వీరిపై ఎక్కువగా ప్రభావం ఎండల ప్రభావం మధుమేహం, రక్తపోటు వ్యాధులు ఉన్న వారు, వృద్ధులు, చిన్నారులు, స్మోకర్స్, ఆల్కాహాల్ సేవించే వారిపై ఎక్కువగా చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎండలోకి కొద్దిసేపు వెళ్లినా సన్‌స్ట్రోక్‌కు గురవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలుపులన్నీ మూసి ఇంట్లో ఉన్న వృద్ధులు, చిన్నారులు సైతం హీట్‌స్ట్రోక్ ప్రభావంతో శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంటారని పేర్కొంటున్నారు. ఇలాంటి వారు వడగాలుల ప్రభావం పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వడగాలులు తగలకుండా ఏమిచేయాలి ♦ బయటకు వెళ్లే టప్పుడు తలకు టోపీలు మంచి రక్షణ కవచంలా ఉపయోగపడుతుంటాయి. ♦ కళ్లజోడుతోపాటు, చెవులు, ముక్కుల్లోకి వేడిగాలులు ప్రవేశించకుండా కర్చీఫ్ కట్టుకుంటే మంచిది. ♦ ఎక్కువ సేపు ఎండలో ఆటలు ఆడటం వలన ఆల్ట్రావైలేట్ కిరణాలు నేరుగా శరీరంపై పడినప్పుడు సన్ బరŠన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్(రాష్) రాకుండా సన్‌స్క్రీన్ లోషన్స్ రాసుకోవాలి. ♦ ప్రస్తుతం నగరంలో ఎక్కువ మంది చిన్నారులు స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ♦ ఎండలో ఆటలాడే సమయంలో తరచూ ముఖం నీటితో కడుక్కోవడం ద్వారా కళ్లకు సరిపడా తేమ లభిస్తుంది. ఆహారంలో పాటించాల్సిన నియమాలు ♦ వడగాలులకు శరీరంలోని నీరు ఆవిరై డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నందున తరచూ ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. ♦ కూల్‌డ్రింక్స్, ఐస్క్రీమ్స్ల కంటే పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ తాగితే మంచిది. ♦ పుచ్చకాయ, చీని, ద్రాక్షలో ఎక్కువ నీటి శాతం వుంటుంది. కాబట్టి వాటిని తీసుకుంటే మంచిది. ♦ రోజుకు 4 నుంచి 5 లీటర్లు నీరు తాగాలి. కాచి చల్లార్చిన నీరు తాగితే మంచిది. క్లూగోజ్, కొబ్బరినీళ్లు తీసుకుంటే తాపాన్ని తగ్గిస్తాయి. సన్‌స్ట్రోక్ లక్షణాలు తలనొప్పి, అధిక జ్వరం (107డిగ్రీల ఫారిన్‌హీట్ టెంపరేచర్), శరీరం డీహైడ్రేషన్‌కు గురికావడంతో స్పృహ కోల్పోవడం, వాంతులు, విరేచనాలు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వడదెబ్బకు గురై స్పృహ కోల్పోయిన సమయంలో శరీరంపై ఉన్న దుస్తులు తొలగించి, నీడప్రదేశంలోకి తీసుకువెళ్లాలి. శరీరాన్ని తడి వస్త్రంతో తుడిచి వీలైనంత త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వుంది. అక్కడ ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించడంతోపాటు, అవసరాన్ని బట్టి చికిత్స అందిస్తారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురైన సమయంలో అశ్రద్ధ చేస్తే, గుండె, కిడ్నీలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపి, మృతి చెందే అవకాశాలు వుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి రక్తపోటు, మధుమేహం ఉన్న వారు త్వరగా ఎండల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నందున వీలైనంత వరకూ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా రెగ్యులర్‌గా బీపీ, షుగర్ అదుపులో ఉన్నాయో లేదో పరీక్షలు చేయించుకోవడం మంచింది. వృద్ధులు, చిన్నారులు ఇంట్లో ఉన్నా హీట్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, నాన్‌వెజ్ తీసుకోక పోవడం మంచింది. ఆకుకూరలు, పప్పు వంటివి తీసుకోవాలి. ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకోవడం ద్వారా ఎండల తీవ్రతను తగించవచ్చు. వడదెబ్బకు గురైనా, లక్షణాలు కనిపించినా సత్వరమే ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందడం మంచిది.–డాక్టర్ ఎం.శ్రీకాంత్, డయాబెటాలజిస్ట్ -
నానమ్మ.. నాకు దిక్కెవరమ్మా?
► చిన్నప్పుడే అమ్మానాన్నలు.. నిన్న వడదెబ్బతో నానమ్మ మృతి ► పెద్దదిక్కును కోల్పోవడంతో అనాథలైన అక్కాతమ్ముడు ► ఇంజనీరింగ్‌లో చేరేందుకు ఆపసోపాలు పడుతున్న మునినాయక్ త్రిపురారం (నాగార్జునసాగర్) : ఆ గిరిజన విద్యార్థికి విధి వింత పరీక్ష పెట్టింది. ఓవైపు బీటెక్‌లో చేరేందుకు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఉన్న పెద్ద దిక్కును కాస్త కోల్పోయేలా చేసింది. చిన్నతనంలోనే అమ్మానాన్నలు చనిపోయినా తనను పెంచి పోషించిన నానమ్మ గురువారం వడదెబ్బతో మృతి చెందడంతో అక్కాతమ్ముడు అనాథలయ్యారు. వివరాల్లోకి వెళ్లితే.. త్రిపురారం మండలం బొర్రాయిపాలెం గ్రామ పంచాయతీ పరిధి బుడ్డితండాకు చెందిన ధనావత్ హరి, లక్ష్మి దంపతులది నిరుపేద కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. మొదటి సంతానంగా కుమార్తె సుజాత, రెండో సంతానంగా కుమారుడు మునినాయక్ జన్మించాడు. హరికి వ్యవసాయ భూమి లేకపోవడంతో రెక్కల కష్టంతోనే కుటుంబం గడిచేది. ఈ క్రమంలో ధనావత్ హరి, లక్ష్మి దంపతులు అనారోగ్యంతో మృతి చెందడంతో మునినాయక్, అతని అక్క సుజాత దిక్కులేనివారయ్యారు. ఆ సమయంలో అతని నానమ్మ ధనావత్ తీత్రీ(75) వారికి పెద్దదిక్కైంది. వృద్ధురాలైన ధనావత్ తీత్రీ కొంతకాలంగా ఉపాధి హామీ కూలి పనులకు వెళ్లి వచ్చిన డబ్బులతో తన మనుమడు, మనుమరాళ్లను సాకుతుంది. ఈ తరుణంలో తీత్రీ గత నాలుగు రో జుల క్రితం కూలి పనులకు వెళ్లి ఎండకు అస్వస్థతకు గురైంది. నానమ్మ గురువారం తెల్లవారుజామున వడదెబ్బతో మృతి చెందింది. నానమ్మ మృత దేహంపై పడి రోదిస్తున్న అక్కా తమ్ము డిని చూసి తండావాసులు కంటతడి పెట్టారు. ధనావత్ మునికి విధి పెట్టిన పరీక్ష మునినాయక్‌ను చిన్నతనం నుంచి నానమ్మ ధనావత్ తీత్రీ పెంచి పెద్దచేసింది. ఇటీవల నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో 54వ ర్యాంకు సాధించాడు. కానీ ఆర్థిక పరిస్థితి అడుగు ముందుకు పడనీయడం లేదు. బీటెక్‌లో చేరేందుకు దాతల ఆర్థికసాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ముని చదువుకు అడ్డంకులు తొలగించేందుకు ఈనెల 25వ తేదీన ‘సరస్వతీపుత్రుడికి ఆర్థిక అడ్డంకి’ శీర్షికన ‘సాక్షి’ కథనాన్ని కూడా ప్రచురించింది. తన బీటెక్ చుదువుల ఖర్చుల కోసం ఎవరైన మనసున్న మారాజులు ముందుకు వచ్చి ఆర్థికసాయం చేయాలని వేడుకున్నాడు. ఈ క్రమంలో ఉన్న పెద్దదిక్కు కాస్త కనుమరుగవడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. -
వడ దెబ్బకి 67 మంది మృతి