
ఎండకు చున్నీలు కట్టుకుని వెళుతున్న యువతులు
ఎండ ప్రచండమై సెగల పొగలు కక్కుతోంది. వేడిగాలులతో కలిసి అదరగొడుతోంది. వెరసి కడప నిప్పుల కొలిమిలా మారింది. తెల్లారింది మొదలు ఉక్కపోత గుక్క తిప్పుకోనియకుండా చేస్తోంది. ఎప్పుడు లేని విధంగా ‘ఉష్ణోగ్రత’ రికార్డులు సృష్టిస్తోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రత 40కు తగ్గకుండా నమోదవుతుండడంతో.. మేలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని జనాల్లో ఆందోళన
మొదలైంది.
సాక్షి, కడప:సూర్యుడి ప్రతాపానికి జనాలు అల్లాడిపోతున్నారు. సాధారణంగా ఏటా మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ సారి ఏప్రిల్‌లోనే ఎండలు మండుతున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నారంటే ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద యం 8 నుంచే భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. భానుడి భగభగలతో వాతావరణం ఉదయం నుంచే వేడుక్కుతోంది.
41 నుంచి 45 డిగ్రీల నమోదు
జిల్లాలో వారం రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. వారం రోజులుగా జిల్లా ప్రజలు ఉడుకుతో అల్లాడుతున్నారు. సూర్య ప్రతాపానికి కడప కాలిపోతోంది. బయటికి రావాలంటేనే ముఖం మీద చెంపలకు చేతులు అడ్డుపెట్టుకుని...తలపై బట్ట వేసుకుని బయట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. వారం రోజులుగా ప్రతిరోజు 40కు పైగానే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ఈనెల 18 నుంచి 41 నుంచి దాదాపు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పెరిగిన వడగాలులు
ఎండ ప్రభావానికి తోడు వడగాలులు జనాలను భయాం దోళనకు గురి చేస్తున్నాయి. ప్రధానంగా ఎప్పుడూ లేని తరహాలో ఎండలు పెరగడం.....దీనికితోడు గాలలు వీస్తుండడంతో వడగాలుల ప్రభావంతో ప్రజలు భయపడుతున్నారు. ఎండ సెగ ధాటికి మధ్యాహ్నమైతే ఇంటికే పరిమితం అవుతుండగా పల్లె ప్రాంతాల్లో చెట్ల కింద సేద తీరుతున్నారు. వడగాలుల నేపధ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిర్మానుష్యం
ఎండలు వేడి పుట్టిస్తుండడంతో మ ధ్యాహ్న సమయంలో రోడ్లతోపాటు ప్ర ధాన ప్రాంతాలు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉం డే వైవీ స్ట్రీట్ మొదలుకొని నగరంలోని వీధులు కూడా జనం లేక వెలవెలబోతున్నాయి. ఎండ దెబ్బకు భయపడి అధికా రులు కూడా మధ్యాహ్న భోజనాన్ని కార్యాలయాలకే తీసుకెళుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment