
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : నా భర్తకు ఏం జరిగినా అందుకు హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి భార్య కల్యాణి హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. విచారణ పేరుతో వేధిస్తోంది. తాజాగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయించింది. ఇంతవరకూ వర్రా రవీంద్రారెడ్డి ఆచూకీ లభించలేదు. పైగా విచారణ పేరుతో అతని కుటుంబసభ్యులను నిన్నంతా స్టేషన్‌లో ఉంచిన పోలీసులు వేధింపులకు గురి చేశారు.
దీంతో తన కుమారుడు ఆచూకీ చెప్పాలని వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కుమారుడికి కోసం వర్రా రవీంద్రారెడ్డి తల్లి దండ్రులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సందర్భంగా రవీంద్రారెడ్డికి ఏదైనా జరిగితే హోంమంత్రి అనితే బాధ్యత వహించాలని అతని భార్య కల్యాణి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment