సమ్మర్ అంటే సూర్యుడి భగభగలు మాములుగా ఉండవు. పట్టపలే చుక్కలు చూపిస్తున్నట్లుగా ఎండ దంచి కొడుతుంది. మిట్ట మధ్యాహ్నాం బయటకు వెళ్లాలంటేనే హడలిపోతారు. ఈ ఉష్ణోగ్రతలుకు ఎంతో మంది వృద్ధులు పిట్టలు రాలినట్లుగా చనిపోతారు. అందుకే ఈ వడదెబ్బకు గురికాకుండా ఉండేలా ద్రవపదార్థాలు ఎక్కువగా తాగమని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఈ ఎండకాలంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అసలు ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండకూదంటే ఏం చేయాలి? ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అంటే..
ఐపీఎల్ ప్లే ఆఫ్‌కు మ్యాచ్‌కు హాజరైన బాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్‌కు (వడదెబ్బ) గురైనట్లు సమాచారం. దీంతో ఆయన అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రిలో చికిత్స అందుకున్నారు. ఆ తర్వాత షారుక్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు.
అదీగాక భారత వాతావరణ శాఖ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీతో సహా అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు వడదెబ్బలకు గురయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వడదెబ్బ బారిన ఎలా పడతాం? దీని బారిన పడినట్లు ఎలా గుర్తించాలి వంటి వాటి గురించి సవివరంగా తెలుసుకుందాం.
వడదెబ్బకు గురైన సంకేతాలు..
వేడి, పొడి చర్మం: బాగా చెమటలు పట్టిన బాడీ చల్లబడకపోవడం. చర్మం వేడిగా, పొడిబారిన పడినట్లు అయిపోతే
హృదయ స్పందన రేటు పెరిగినా..: శరీరం తనను తాను చల్లబరుచుకోవటానికి ప్రయత్నించినపుడు హృదయస్పందన రేటు పెరుగుతుంది.
శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది: శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను నిర్వహించడానికి కష్టపడటం, తద్వారా వేగంగా శ్వాస తీసుకోవడానికి దారితీస్తుంది.
తలనొప్పి: పెరిగిన శరీర ఉష్ణోగ్రత, నిర్జలీకరణం ఫలితంగా తీవ్రమైన తలనొప్పి ఏర్పడవచ్చు.
వికారం, వాంతులు: వికారం వాంతులు కారణంగా నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయడం.
స్ప్రుహ కోల్పోవడం: తీవ్రమైన సందర్భాల్లో అధిక ఉష్ణోగ్రత మెదడుపై ప్రభావం చూపి స్ప్రుహ కోల్పోవడం, కోమాలోకి వెళ్లిపోవడం వంటివి జరుగుతాయి. ఒక్కోసారి మూర్చ వంటివి రావడం జరుగుతుంది.
నివారణ చర్యలు..
హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడం. దాహం అనిపించకపోయినా తరుచుగా నీళ్లు తాగడం, ఆల్కహాల్, కెఫిన్ వంటి పానీయాలకు దూరంగా ఉండటం వంటివి చేయాలి.
వేడి నుంచి తప్పించుకునేలా ఎయిర్ కండిషన్డ్ పరిసరాల్లో ఉండటానికి ప్రయత్నించండి. గాలి వచ్చేలా ఉండే ఫ్యాన్లు వంటివి ఉపయోగించటం వంటివి చేయాలి.
ఈ వేడికి తగ్గట్టు కాటన్ లేదా నార వంటి మెత్తని తేలికైన బట్టలను ఎంచుకోండి. సూర్మరశ్మని గ్రహించకుండా ఉండేలా రంగులను ఎంచుకుని మరీ దుస్తులను ధరించండి.
అలాగే ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో కాకుండా చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి.
చర్మాన్ని సంరక్షించుకునేలా ఎస్పీఎఫ్ సన్‌స్క్రీన్, సన్‌బర్న్ వంటివి ఉపయోగించండి.
శరీరం ఉష్ణోగ్రత పెరగకుండా ఉండేలా చలువ చేసే పదార్థాలను తినడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.తేలికపాటి భోజనం తినాలి
హైడ్రేటింగ్‌గా ఉండేలా చేసే పండ్లు, కూరగాయలను తినండి.
(చదవండి: బోన్ మ్యారో క్యాన్సర్..నియంత్రణ ఇలా...!)
Comments
Please login to add a commentAdd a comment