Hajj
-
వడదెబ్బకు 14 మంది హజ్‌యాత్రికులు మృతి
సౌదీ అరేబియాలో ఎండలు మండిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లోనూ ముస్లింలు హజ్‌యాత్రను కొనసాగిస్తున్నారు. జోర్డాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ‘పెట్రా’తెలిపిన వివరాల ప్రకారం హజ్ యాత్రలో పాల్గొన్న 14 మంది జోర్డాన్ యాత్రికులు వడదెబ్బ కారణంగా మృతిచెందారు. మృతులను సౌదీ అరేబియాలో ఖననం చేయలా లేదా జోర్డాన్‌కు పంపించాలా అనేదానిపై సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.హజ్‌యాత్ర చివరి రోజులలో సైతానుకు గుర్తుగా ఉన్న స్థంభాలను ముస్లింలు రాళ్లతో కొడతారు. దీనిని చెడును తరిమికొట్టడానికి గుర్తుగా భావిస్తారు. ఇది ముస్లింలు హజ్‌యాత్రలో చేసే చివరి ఆచారం. ప్రపంచం నలుమూలల నుండి 18 లక్షల మందికి పైగా హజ్ యాత్రికులు ప్రస్తుతం మక్కాలో ఉన్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్లుగా హజ్ యాత్రకు ఆంక్షలు విధించారు. అయితే ఇప్పుడు అటువంటి ఆంక్షలు లేకపోవడంతో హజ్ తీర్థయాత్రలో అత్యధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. -
హజ్‌యాత్రలో అంతిమ ఘట్టం షురూ
సౌదీ అరేబియాలో లక్షలాది మంది ముస్లిం యాత్రికులు ఆదివారం నాడు సైతానును రాళ్లతో కొట్టి చంపే ఆచారాన్ని ప్రారంభించారు. ఈ ఆచారం హజ్‌యాత్ర చివరి రోజులలో నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన ఈద్ అల్-అధా వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది.సైతాను(దుష్టశక్తి)ను రాళ్లతో కొట్టడం అనేది ఇస్లాంలోని ఐదు ప్రముఖ ఆచారాలలో ఒకటి. ఇది హజ్‌యాత్రలో చివరి ఆచారం. పవిత్ర నగరం మక్కా వెలుపల ఉన్న అరాఫత్ పర్వతం వద్ద లక్షలమంది ముస్లిం యాత్రికులు గుమిగూడి ఈ ఆచారాన్ని నెరవేరుస్తారు. ఐదు రోజుల పాటు ఈ హజ్ ఆచారం కొనసాగుతుంది.యాత్రికులు శనివారం సాయంత్రం ముజ్దలిఫా అనే ప్రదేశంలో గులకరాళ్లను సేకరించారు. వీటితో సైతానుకు ప్రతీకంగా నిలిచిన స్తంభాలను కొడతారు . ఈ స్తంభాలు మక్కాలో మీనా అనే పవిత్ర స్థలంలో ఉన్నాయి.హజ్‌కు వచ్చే యాత్రికులు మూడు రోజుల పాటు మీనాలో ఉంటారు. అక్కడ నుండి వారు భారీ స్తంభాలు కలిగిన బహుళ అంతస్తుల సముదాయానికి వెళ్తారు. యాత్రికులు ఇక్కడి మూడు స్తంభాలను ఏడు గులకరాళ్లతో కొడతారు. దీనిని వారు చెడును తరిమికొట్టడానికి చిహ్నంగా పరిగణిస్తారు. అనంతరం మీనా నుండి మక్కా చేరుకునే ముస్లింలు అక్కడ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు. -
Eid ul-Adha 2024: పరిపూర్ణ ఆరాధన హజ్జ్
ఇస్లామ్ ధర్మం ఐదు మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంది. ఇందులో ఏ ఒక్కదాన్ని విస్మరించినా విశ్వాసం పరిపూర్ణం కాదు. మొట్టమొదటిది సృష్టికర్త ఒక్కడే అన్న విశ్వాసం. రెండవది నమాజ్, మూడవది రోజా, నాల్గవది జకాత్, ఐదవది హజ్జ్. దైవ విశ్వాస ప్రకటనకు ఇవి ఆచరణాత్మక సాక్ష్యాలు. ఒక మనిషి విశ్వాసి/ ముస్లిమ్ అనడానికి రుజువులు. అన్ని ఆరాధనలకూ ‘హజ్జ్’ ఆత్మ వంటిది. ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ముస్లింపై హజ్ విధిగా నిర్ణయించడం జరిగింది. అందుకని ఆర్థిక స్థోమత కలిగినవారు జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా కాబా సందర్శన యాత్ర చేయడం తప్పనిసరి. ఈ‘హజ్’ జిల్ హజ్ మాసం పదవ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో జరుగుతుంది. ఆ రోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్ ’ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేద భావం మచ్చుకు కూడా కనిపించదు. ‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. మక్కా నగర ఆవిర్భావంమక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ్రపాంతంలో మహనీయ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హజ్రత్ హాజిరా అలైహిస్సలాంను, తనయుడు ఇస్మాయీల్ అలైహిస్సలాంను వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు, శ్రీమతి హాజిరా, ’అదేమిటీ.. నన్నూ, నాబిడ్డను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటీ.?’అని ప్రశ్నించగా..,’ఇది దైవాజ్ఞ.’ అని మాత్రమే చెప్పి, అల్లాహ్‌పై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్ళిపోతారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం.కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్క నీరులేని ఆఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడమలు రాసుకుపోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్ ’అనే పేరుగల ఆ పవిత్ర జలంతో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఆనాడు కేవలం రెండు ్రపాణాలకోసం వెలసిన ఆ జలం ఈనాడు హజ్ యాత్ర నిమిత్తం మక్కావెళ్ళే లక్షలాదిమంది ప్రజలతోపాటు, స్థానికులకూ నిరంతరం సమృద్ధి్ధగా సరఫరా అవుతూ, యాత్రికులందరూ తమ తమ స్వస్థలాలకు తీసుకు వెళుతున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు నిదర్శనం. ఆ నాటి ఆ నిర్జీవ ఎడారి ్రపాంతమే ఈనాడు అత్యద్భుత సుందర మక్కానగరంగా రూపుదిద్దుకొని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ ను నిర్మించారు. చతుస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంలు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. దీంతో కాబా దైవగృహంగా పేరు΄÷ందింది.అలౌకికానందంమక్కా చేరగానే ప్రతి హాజీ (యాత్రికుడు) కాబావైపు పరుగులు తీస్తాడు. పవిత్ర కాబాను చూడగానే భక్తులు ΄÷ందే ఆనంద పారవశ్యాలు వర్ణనాతీతం. ఒకానొక అలౌకిక ఆనందంతో, భక్తిపారవశ్యంతో కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. దీన్ని’తవాఫ్’ అంటారు. ప్రతి తవాఫ్ లోనూ హాజీలు కాబాగోడలో అమరి ఉన్న ’హజ్రె అస్వద్ ’ (నల్లనిశిల) ను ముద్దాడడానికి ప్రయత్నిస్తారు. దైవ గృహమైన కాబాకు సమీపంలో క్రీ. శ. 570 లో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు. కనుక భక్తులు ఆ జ్ఞాపకాలనూ నెమరు వేసుకుంటారు. ’జమ్ జమ్ ’బావిలోని పవిత్ర జలాన్ని తనివి తీరా సేవిస్తారు. తరువాత సఫా, మర్వా కొండల మధ్య ’సయీ’చేస్తారు. దీని తరువాత కొన్నిరోజులు ఎవరి నివాసాల్లో వారు దైవచింతన, నమాజులతో కాలం గడిపి, ’జిల్ హజ్ ’మాసం ఎనిమిదవ తేదీన ’మినా’ గ్రామం వెళ్ళి ఒక రోజంతా అక్కడ ఉంటారు. తొమ్మిదవ తేదీన ప్రపంచం నలుమూలలనుండీ వచ్చిన హాజీలంతా ‘అరఫాత్ ’మైదానంలో గుమిగూడి దైవకారుణ్యాన్ని అభిలషిస్తూ ్రపార్ధనలు చేస్తారు. ఈ సందర్భంలోనే ఆనాడు ముహమ్మద్ ప్రవక్త (స) అశేష భక్తజనాన్ని ఉద్దేశించి తమ అంతిమ సందేశం వినిపించారు. అందుకని భక్తులు ఆ మహనీయుడు నిలిచిన ప్రదేశాన్ని కూడా దర్శించి పులకించి పోతారు. సూర్యాస్తమయానికి తిరుగు ప్రయాణం ్రపారంభించి’ముజ్దలఫా’ దగ్గర రాత్రి మజిలీ చేస్తారు. అక్కడే మగ్రిబ్, ఇషా నమాజులు కలిపి సామూహికంగా చేస్తారు. మదీనాసాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త (స) మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడి లాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదె నబవిని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒకహాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్రకాబా గహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార్ల సహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశపాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలుపరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్ . ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్థం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్థం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. తఖ్వా ప్రధానందేవుని ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనా రీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనా రీతులన్నీ పరిపూర్ణతను సంతరించు కున్నాయి. యాత్ర, నిరాడంబర సాధు వస్త్రధారణ, దైవ్రపార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహ సందర్శనార్ధం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం ΄÷ందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీ పురుషులందరూ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యంకోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. – యండి. ఉస్మాన్ ఖాన్ -
హజ్ యాత్ర అదనపు భారం ప్రభుత్వమే భరిస్తుంది
సాక్షి, అమరావతి/కడప కార్పొరేషన్: పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారిపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, దీనివల్ల 1,813 మంది హజ్ యాత్రికులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. హజ్ యాత్రికుల అదనపు ఖర్చుల భారం రూ.14.51 కోట్లను ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేయడం గొప్ప విషయమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి చెందిన హజ్ యాత్రికులకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లేందుకు ఏర్పాటు చేశామన్నారు. హజ్ యాత్ర ప్యాకేజీలను కేంద్ర ప్రభుత్వ ఆ«దీనంలోని హజ్ కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే వారికంటే గన్నవరం నుంచి వెళ్లే యాత్రికులు ఒక్కొక్కరిపై రూ.80 వేల అదనపు భారం పడుతుందన్నారు. ఈ విషయంపై సీఎం వైఎస్ జగన్ కేంద్ర విమానయాన మంత్రిత్వ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రులకు లేఖలు రాశారన్నారు. సీఎం ఆదేశాలతో ఆయా శాఖల కేంద్ర మంత్రులను కలిసి తాము సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు టికెట్ ధరలతో సమానంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌కు టికెట్ ధర నిర్ణయించాలని కోరినట్టు వివరించారు. సాంకేతిక కారణాల వల్ల ఆ మంత్రిత్వ శాఖలు నిస్సహాయత వ్యక్తంచేశాయని తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించి విజయవాడ నుంచి వెళ్లే యాత్రికులపై పడే అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చి, ఉత్తర్వులు జారీ చేశారని, నిధులు కూడా విడుదల చేశారని వివరించారు. దీనిద్వారా సీఎం వైఎస్ జగన్ ముస్లిం పక్షపాతిగా మరోసారి రుజువు చేసుకున్నారని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా సెంట్రల్ హజ్ కమిటీకి చెల్లిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసు చాటుకున్నారు : ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్‌లాజమ్ హజ్ యాత్రికుల విషయంలో సానుకూలంగా స్పందించిన సీఎం వైఎస్ జగన్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారని ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హజ్ యాత్రికుల టూర్ ప్యాకేజీ కేంద్ర హజ్ కమిటీ నిర్ణయిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హజ్ కమిటీకి సంబంధం ఉండదని తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. ఏపీ హజ్ యాత్రికులపై అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. జూన్ 7 నుంచి 22వ తేదీ వరకు గన్నవరం విమానాశ్రయం నుంచి హజ్ యాత్రకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ హజ్ యాత్రికులపై పడుతున్న అదనపు భారాన్ని ప్రభుత్వమే భరించేలా నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్‌కు ముస్లిం సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వినర్ షేక్ మునీర్ అహ్మద్ చెప్పారు. ముస్లిం మైనార్టీల విషయంలో ప్రతి సందర్భంలోనూ సీఎం వైఎస్ జగన్ పెద్ద మనసుచాటుకుంటున్నారన్నారు. ఇప్పటికే కడపలో హజ్ హౌస్ ఆధునీకరణ చేపట్టిన ప్రభుత్వం తాజాగా విజయవాడ సమీపంలో రాష్ట్ర హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం ముస్లింలకు సంతోషం కలిగించే విషయమని తెలిపారు. -
కాలినడక: 10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలో మీటర్లు
లండన్: కోవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. జీవితంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేపట్టాలని ముస్లిం సోదరులు భావిస్తుంటారు. అయితే.. ఓ వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్‌కు చేరుకున్నారు. ఇరాక్‌లోని కుర్దిష్ మూలాలనున్న బ్రిటిషనర్.. అడమ్ మొహమ్మద్(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న అడమ్ మొహమ్మద్.. ఇంగ్లాండ్‌లోని వొల్వెర్‌హంప్టన్ నుంచి సుమారు 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాకు చేరుకున్నారు. 10 నెలలు.. 9 దేశాలు.. హజ్ యాత్రకు బయలుదేరిన అడమ్ మొహమ్మద్.. నెదర్లాండ్స్, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనన్, జోర్డన్ దేశాల మీదుగా సౌదీ అరేబియాకు చేరుకున్నారు. 10 నెలల 25 రోజుల్లో మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచారు. తన యత్రను గత ఏడాది 2021, ఆగస్టు 1న ప్రారంభించిన అడమ్.. ఈ ఏడాది జూన్‌లో గమ్యాన్ని చేరుకున్నారు. ఆల్ జజీరా న్యూస్ ప్రకారం.. అడమ్ రోజుకు సగటున 17.8 కిలోమీటర్లు నడిచారు. సుమారు 300 కిలోల సామగ్రితో కూడిన తోపుడు బండిని తోసుకుంటూ తన యాత్రను సాగించారు. ఆ బండికి మ్యూజిక్ స్పీకర్లు అమర్చి ఇస్లామిక్ పాటలు వింటూ నడిచినట్లు చెప్పుకొచ్చారు అడమ్. శాంతి, సమానత్వంపై ప్రజలకు సందేశం అందించాలనే తాను ఇలా కాలినడకన యాత్ర చేపట్టానన్నారు. ఆన్‌లైన్‌లోనూ గోఫన్‌మీ పేజ్‌ను ఏర్పాటు చేశారు. 'ఇది నేను డబ్బు, పేరు కోసం చేయటం లేదు. ప్రపంచంలోని మనుషులంతా సమానమనే విషయాన్ని ఎత్తిచూపాలనుకుంటున్నా. ఇస్లాం బోధిస్తున్న శాంతి, సమానత్వ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నా.' అని అందులో రాసుకొచ్చారు. కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది ముస్లింలు హజ్ సందర్శించుకునేందుకు సౌదీ అరేబియా అనుమతించింది. 2020, 2021లో కేవలం సౌదీ అరేబియా పౌరులను మాత్రమే అనుమతించారు. ఈ ఏడాది జులై 7న ఈ హజ్ యాత్ర మొదలైంది. ఇదీ చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
పొరుగింట్లో అల్లాను చూసింది
హజ్ చేయడాన్ని ముస్లింలు జీవిత పరమావధిగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఇందుకోసం కలలు కనే పెద్దలు లక్షల్లో ఉంటారు. కేరళకు చెందిన జాస్మిన్‌కు 28 సెంట్ల భూమి (1350 గజాలు) ఉంది. దాన్ని అమ్మి భర్తతో హజ్‌కు వెళ్లాలని ఏర్పాట్లు చేసుకుంటోంది. కాని ఆ సమయంలో ఆమె దృష్టి పొరుగింటిపై పడింది. ఆ ఇంట్లో ఉంటున్న నిరుపేదలు సొంతిల్లు లేక అవస్థ పడుతూ కనిపించారు. పొరుగువారికి సాయం చేయమనే కదా అల్లా కూడా చెప్పాడు అని హజ్‌ను మానుకుంది. తన స్థలం మొత్తాన్ని కేరళ ప్రభుత్వం చేపట్టిన నిరుపేదల గృహపథకానికి ఇచ్చేసింది. కొందరు పొరుగువారిలో దేవుణ్ణి చూస్తారు. మానవత్వమే దైవత్వం అని చాటి చెబుతారు. బాల సాహిత్యంలో ఈ కథ కనిపిస్తుంది. అరేబియాలోని ఒక ఊళ్లో చాలా పేద కుటుంబం ఉంటుంది. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారి ఆడపిల్లలకు ఆ వేళ చాలా ఆకలిగా ఉంటుంది. తల్లికి ఏం వండి పెట్టాలో తెలియదు. ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదు. పని వెతుక్కుంటూ దేశం మీదకు వెళ్లిన తండ్రి ఏమయ్యాడో ఏమో. ఆకలికి తాళలేని ఆ పిల్లలు ఏం చేయాలో తోచక వీధిగుండా నడుచుకుంటూ వెళుతుంటే ఒక పిట్ట చచ్చిపడి ఉంటుంది. ఇస్లాంలో చనిపోయిన దానిని తినడం ‘హరాం’ (నిషిద్ధం). కాని విపరీతమైన ఆకలితో ఉన్న ఆ పిల్లలు ఆ చనిపోయిన పిట్టను ఇంటికి తీసుకొస్తే తల్లి చూసి ‘అయ్యో... బంగారు తల్లులూ మీకెంత ఖర్మ పట్టింది’ అని వేరే గత్యంతరం లేక ఆ పిట్టనే శుభ్రం చేసి, పొయ్యి రాజేసి, సట్టిలో ఉప్పుగల్లు వేసి ఉడికించడం మొదలెడుతుంది. ఆశ్చర్యం... సట్టిలో నుంచి ఎలాంటి సువాసన రేగుతుందంటే చుట్టుపక్కల వాళ్లందరికీ ‘ఆహా.. ఎవరు ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనిపించింది. ఈ పేదవాళ్ల ఇంటి పక్కనే ఉన్న షావుకారు భార్యకు కూడా అలాగే అనిపించి, కూతురిని పిలిచి ‘పొరుగింట్లో ఏదో ఒండుతున్నారు. అదేమిటో కనుక్కునిరా’ అని పంపిస్తుంది. షావుకారు కూతురు పొరుగింటికి వచ్చి ‘ఏం వండుతున్నారు... ఇంత మంచి వాసన వస్తోంది’ అనడిగితే ‘చచ్చిన పిట్టను వండుకుని తింటున్నాం’ అని చెప్పడానికి నామోషీ వేసిన ఆ తల్లి ‘మీకు హరాం (తినకూడనిది)... మాకు హలాల్ (తినదగ్గది) వండుతున్నాం’ అంటుంది. వెనక్కు వచ్చిన షావుకారు కూతురు అదే మాట తల్లితో అంటే ఆమెకు కోపం వస్తుంది. ‘అరె... వారు తినదగ్గది మేము తినకూడనిది ఏముంటుంది’ అని భర్తకు కబురు పెట్టిస్తుంది. భర్త రాగానే పొరుగింటి అవమానాన్ని చెప్పి ‘వారేదో తినదగ్గది తింటున్నారట... మనం దానిని తినకూడదట... ఏంటది’ అని కోపం పోతుంది. భర్త ఆలోచనాపరుడు. పొరుగింటికి వెళ్లి ఆరా తీస్తే ఆ పేదతల్లి ‘అయ్యా... మీరు షావుకార్లు. చచ్చినవాటిని తినకూడదు. హరాం. మేము పేదవాళ్లం. ఆకలికి తాళలేక అలాంటివి తినొచ్చు. హలాల్. అందుకనే అలా చెప్పాను’ అని కన్నీరు కారుస్తుంది. ఆ సమయానికి ఆ షావుకారు హజ్‌కు వెళ్లడానికి సిద్ధం అవుతూ ఉంటాడు. అతడు తన హజ్ డబ్బు మొత్తాన్ని ఆ పేదరాలికి ఇచ్చి హజ్ మానుకుంటాడు. కాని ఆ సంవత్సరం హజ్‌కు వెళ్లిన ఇరుగుపొరుగు వారికి కాబా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న ఆ షావుకారు కనిపించి ఆశ్చర్యం వేస్తుంది. అంటే వెళ్లిన పుణ్యం దక్కిందని అర్థం. అదీ కథ. కేరళలో అచ్చు ఇలాగే జరిగింది. అక్కడి పత్థానంతిట్ట జిల్లాలోని అరన్మలలో 48 ఏళ్ల జాస్మిన్‌కు ఎప్పటి నుంచో హజ్‌కు వెళ్లాలని కోరిక. భర్త హనీఫా (57) కు కూడా అదే కల. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి కావలసినంత డబ్బు లేదు. జాస్మిన్‌కు తండ్రి నుంచి సంక్రమించిన 28 సెంట్ల భూమి అదే ఊళ్లో ఉంది. దానిని అమ్మి ఆ డబ్బుతో హజ్‌కు వెళ్లాలని భార్యాభర్తలు నిశ్చయించుకున్నారు. ఈలోపు కోవిడ్ వచ్చింది. చాలామంది కష్టాలు పడ్డారు. జాస్మిన్ ఇరుగుపొరుగున అద్దె ఇళ్లల్లో నివసించే మధ్యతరగతి వారు అద్దె చెల్లించలేని ఆర్థిక కష్టాలకు వెళ్లారు. తినడానికి ఉన్నా లేకపోయినా నీడ ఉంటే అదో పెద్ద ధైర్యం అని వారి మాటలు జాస్మిన్ను తాకాయి. అదే సమయంలో కేరళలో ‘లైఫ్ మిషన్’ పేరుతో పేదలకు ఇళ్లు కట్టి ఇచ్చే పథకం మొదలైంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రజలను కూడా స్థలాలు ఇమ్మని కోరింది. జాస్మిన్ భర్తతో చర్చించి ‘పేదల ఇళ్ల కోసం మన స్థలం ఇస్తే అల్లా కూడా సంతోషపడతాడు’ అని చెప్పి, హజ్ యాత్ర మానుకుని, ఆ స్థలాన్ని ప్రభుత్వ పరం చేసింది. మొన్నటి ఆదివారం కేరళ ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జి స్వయంగా జాస్మిన్ ఇంటికి వచ్చి ఆమెను అభినందించింది. జాస్మిన్, హనీఫా చూపిన ఔదార్యానికి ప్రశంసలు లభిస్తున్నాయి. అన్నట్టు హజ్‌కు వెళ్లాలని వెళ్లలేకపోయిన వృద్ధ జంట కథతో 2011లో మలయాళంలో తీసిన ‘అడమింటె మకన్ అబు’ సినిమా ప్రశంసలు అందుకుంది. అందులో ముఖ్యపాత్రలో నటించిన సలీం కుమార్‌కు జాతీయ అవార్డు దక్కింది. మన తెలుగు జరీనా వహాబ్ది మరో ముఖ్యపాత్ర. కేరళలో ఇప్పుడు ఈ సినిమాను కూడా గుర్తు చేసుకుంటున్నారు. -
Andhra Pradesh: ‘హజ్’ అరుదైన భాగ్యం
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : ఇస్లాం ఐదు మూల స్తంభాలపై ఆధారపడి ఉండగా అందులో మొదటిది విశ్వాసం. ఆతర్వాతి స్థానాలు నమాజ్, రోజా, జకాత్, హజ్‌లకు లభిస్తాయి. నమాజ్, రోజాలకు ఆర్థిక స్థోమత అవసరం ఉండదు. నాలుగోది జకాత్ (అంటే దానధర్మాలు). హజ్ అనేది ఆర్థిక స్థోమతను బట్టి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన పవిత్ర యాత్ర. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ముస్లింలు 40 రోజుల పవిత్ర హజ్‌యాత్ర చేస్తున్నారు. హజ్‌యాత్ర ఒకప్పుడు ప్రయాసతో కూడుకున్నది. సుదీర్ఘ ఓడ ప్రయాణం, ఆ తరువాత సౌదీలో ఒంటెలు, గుర్రాలపై ప్రయాణం వంటి దశలు ఉండేవి. విమాన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎంతో సులువుగా మారింది. 2019కి సంబంధించిన జిల్లా యాత్రికులు 473 మంది యాత్ర చేశారు. ఆతర్వాత కోవిడ్–19 కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో భారతీయులకు హజ్ యాత్ర అవకాశం కలగలేదు. ప్రస్తుతం 2022కి సంబంధించిన దరఖాస్తుల ప్రకియ ఈనెల 1వ తేదీనే ప్రారంభమైంది. హజ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు పూర్తి చేసిన దరఖాస్తులను జనవరి 10వ తేదీలోపు అందజేయాల్సి ఉంటుంది. (కాగా ఆన్‌లైన్‌కు ఆఖరు తేది 2022, జనవరి 31). ముస్లింలలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులు. పైగా దరఖాస్తు గడులన్నీ ఆంగ్లంలో ఉంటాయి. వాటిని అర్థం చేసుకుని పూరించాలంటే తలప్రాణం తోకకు వస్తుంటుంది. ఒక్కగడి తప్పుగా పూరించినా హజ్ యాత్రలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. లేదా సెంట్రల్ హజ్ కమిటీ తరపున హజ్‌యాత్ర చేసే అవకాశం కోల్పోవచ్చు. అన్ని అంశాలను కూలంకషంగా అర్థం చేసుకున్న తర్వాతే పూరించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియబరుస్తూ హజ్ యాత్రికులకు ‘సాక్షి’ అందించిన తోడ్పాటే ఈ కథనం.. దరఖాస్తుల్లో రెండు విధాలు.. కుటుంబంలో ఒక్కరే హజ్‌యాత్రకు వెళ్లాలనుకుంటే వ్యక్తిగత వివరాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు. అదే కుటుంబంలోని నలుగురు సభ్యులు వెళ్లాలనుకుంటే ఒకే దరఖాస్తులో అందరి వివరాలు పొందుపరచవచ్చు. ఇలాంటి దరఖాస్తును ‘కవర్’ అంటారు. కవర్లో కవర్‌హెడ్ అందరి తరపున బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. కవర్లో ఐదుగురు కుటుంబ సభ్యులు, బంధువులు వెళ్లవచ్చు. ఇందులో (09.09.2022 నాటికి) రెండేళ్లలోపు వయస్సు కలిగిన ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉండవచ్చు. (వీరికి టికెట్టులో 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది.) యాత్రికులు అందజేసిన దరఖాస్తులను హజ్ కమిటీలు, సొసైటీల ప్రతినిధులు బాధ్యత తీసుకుని ఆన్లైన్ చేస్తారు. కవర్ నెంబర్ మాత్రం ఐహెచ్‌పీఎంఎస్ సాఫ్ట్వేర్ ద్వారా జనరేట్ చేస్తారు. హజ్ యాత్రికులను ఎంపిక చేసేందుకు సెంట్రల్ హజ్ కమిటీ వారు జనవరిలో కవర్ నంబర్‌తోనే డ్రా తీస్తారు. అర్హతలు.. భారత పౌరసత్వం కల్గిన ముస్లింలు హజ్ కమిటీ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హజ్ చేయాలంటే వారు తప్పనిసరిగా ఇండియన్ పాస్‌పోర్టు కలిగి ఉండాలి. (అది మిషన్ రీడబుల్, ఇంటర్నేషన్ పాస్‌పోర్టు అయి ఉండాలి) 2022 హజ్ యాత్ర కోసం పాస్‌పోర్టు కాలపరిమితి 2022, డిసెంబరు 31వ తేదీ వరకు ఉండాలి. ఒక్కరోజు తక్కువ ఉన్నా అనుమతించరు. హజ్ దరఖాస్తుకు జత చేయాల్సినవి.. పూరించిన హజ్ దరఖాస్తుతో పాటు సెంట్రల్ హజ్ కమిటీ అకౌంటుపై బ్యాంక్‌లో (ఎస్బీఐ బ్యాంక్‌లో) చెల్లించిన రూ. 300 చలానా, పాస్‌పోర్టు జిరాక్స్, అకౌంట్ నంబర్ కనిపించే విధంగా బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్, నాలుగు ఫొటోలు (వెనక తెల్లటి బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. తెలుపు కాకుండా తలకు ఇతర రంగు టోపీ ధరిస్తే మంచిది) అందజేయాల్సి ఉంటుంది. మహిళలు చెవులు కనిపించేలా ఫొటోలు దిగాలి. ఒకవేళ పాస్‌పోర్టులో సూచించిన ఇంట్లో నివాసం ఉండకపోతే ప్రస్తుత చిరునామాను సూచించే ధ్రువపత్రం (ఆధార్ లేక రేషన్ కార్డు) కూడా జతపరచాలి. రెండు కేటగిరీల్లో యాత్ర.. హజ్ యాత్రకు వెళ్లే వారిలో చెల్లించే ఫీజును బట్టి గ్రీన్, అజీజియా అనే రెండు కేటగిరీలు ఉంటాయి. గ్రీన్ కేటగిరీ వారికి మక్కాకు సమీపంలో బస చేసే సదుపాయం కల్పిస్తారు. అయితే ప్రస్తుత సంవత్సరంలో గ్రీన్ కేటగిరీకి ‘ఎన్‌సీఎన్‌టీజడ్’ అని పేరు మార్చారు. అంటే ‘నాన్ కుకింగ్ నాన్ ట్రాన్స్పోర్ట్ జోన్’ అని అర్థం. 65 ఏళ్ల లోపు వారే అర్హులు. గతంలో డెభ్భై ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లకు హజ్‌యాత్రలో రిజర్వు కేటగిరీ కేటాయించేవారు. ప్రస్తుతం కోవిడ్–19 వచ్చాక నిబంధనలు మారాయి. 65 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారు మాత్రమే యాత్రకు వెళ్లాలి. రెండేళ్లలోపు పిల్లలను వెంట తీసుకెళితే పాస్‌పోర్టు అవసరం ఉండదు. అంతకు పైబడి వయస్సు కలిగిన పిల్లలకు ప్రత్యేక పాస్‌పోర్టు అవసరం. మహిళలకు ఒంటరిగా వెళ్లే అవకాశం ఉండదు. నిబంధనల్లో సూచించిన వ్యక్తి (మెహరం) తోడుండాలి. లేదా 31.05.2022 నాటికి వయస్సు 45 ఏళ్లు పైబడిన నలుగురు మహిళలు గ్రూప్‌గా వెళ్లవచ్చు. వ్యాక్సినేషన్ తప్పనిసరి.. హజ్ యాత్రకు వెళ్లే ముందు ప్రతి యాత్రికుడు తప్పనిసరిగా రెండు డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలనే నిబంధన ఉంది. వ్యాక్సినేషన్ చేయించుకోవడమే కాకుండా ఆ మేరకు సర్టిఫికెట్ కూడా పొందుపరచాల్సి ఉంటుంది. వీరు అనర్హులు.. గర్భిణీ మహిళలు, మానసిక రోగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, కుష్ఠు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండదు. నామినీ.. హజ్ యాత్రికుల వెంట రాకుండా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల పేరును (పూర్తి చిరునామాతో) మాత్రమే నామినీగా పొందుపరచాలి. బ్యాంక్‌లో ఖుర్బానీ ఫీజు.. హజ్‌యాత్రలో భాగంగా ఖుర్బానీ నిర్వహించడానికి సౌదీ ప్రభుత్వం గుర్తించిన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఐడీబీ)లో ‘అదాయి కూపన్’ తీసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో ఈ అంశాన్ని స్పష్టం చేయాలి. (ప్రైవేట్ వ్యక్తులకు ఖుర్బానీ సొమ్ము అప్పగిస్తే వారు మోసగించే అవకాశం ఉందని చెబుతారు). లక్కీ డ్రా.. దరఖాస్తులు అధిక సంఖ్యలో వచ్చినా సెంట్రల్ హజ్ కమిటీ నిర్ణయించిన కోటా మేరకే యాత్రికులు ఎంపికవుతారు. ముంబాయిలో డ్రా తీస్తారు. డ్రాలో వచ్చిన వారికి మాత్రమే కమిటీ తరపున హజ్‌యాత్రకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉచితంగా ఆన్లైన్ సేవలు.. హజ్ యాత్రికులకు సేవ చేస్తే పుణ్యం లభిస్తుందనే సదుద్దేశంతో జిల్లాలో అనేక సొసైటీలు ముందుకు వచ్చి వారి ప్రయాణానికి అవసరమైన సేవలు ఉచితంగా అందిస్తున్నాయి. సొసైటీల ప్రతినిధులు దరఖాస్తులను ఉచితంగా ఆన్లైన్ చేస్తున్నారు. దరఖాస్తులు మొదలు హజ్ యాత్రికులు విమానం ఎక్కే దాకా వారికి అవసరమైన శిక్షణ, సదుపాయాలు, రోగనిరోధక వాక్సినేషన్ వంటి సేవాభావంతో కల్పిస్తాయి. బుధవారపేటలోని మహబూబ్‌సుభానీ మసీదులో రాయలసీమ హజ్ సొసైటీ వారు సేవలు అందిస్తున్నారు. వీరి ఫోన్ నంబర్లు: అధ్యక్షుడు ఎం.మొహమ్మద్పాష: 76809 01952, ప్రధాన కార్యదర్శి బాషా సాహెబ్: 99633 18255. జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షుడు నాయబ్ సలీం: 99123 78586, ప్రధాన కార్యదర్శి అష్వాక్ హుసేని: 98662 86786. దరఖాస్తుకు జతపరచాల్సిన పత్రాలతో వీరిని సంప్రదిస్తే ఉచితంగా ఆన్లైన్ చేస్తారు. ఒంట్లో సత్త ఉన్నప్పుడు వెళ్లి రావడమే మేలు: ఇర్షాదుల్ హక్ ఆర్థిక స్థోమత కలిగిన వాళ్లు వృద్ధాప్యం వచ్చేంత వరకు నిరీక్షించాల్సిన అవసరం లేదు. ఎవరి ఆయుష్షు ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా.. పైగా వృద్ధాప్యంలో లేనిపోని జబ్బులు వస్తుంటాయి. వాటిని భరించి 40 రోజుల ప్రయాణంలో ఇబ్బందులు పడటం కంటే, యవ్వన ప్రాయంలోనే హజ్ యాత్రకు వెళ్లి రావడం ఉత్తమం. నేను అబ్బాస్‌నగర్‌లో ఉంటాను. నాకు ఏసీ స్పేర్‌పార్ట్స్ షాప్ ఉంది. హజ్‌కు వెళ్లేంత స్థోమత ఉంది కాబట్టి నా 50వ ఏటనే హజ్ ముగించుకువచ్చాను. నా ముగ్గురు పిల్లలను బంధువులకు అప్పగించి నేను, నాభార్య ఇద్దరు కలిసి ఓ ఐదేళ్ల క్రితమే హజ్ యాత్రకు వెళ్లొచ్చాం. యాత్రకు అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా హజ్ సొసైటీల వాళ్లే ఉచితంగా చేసి పెట్టారు. అల్లా వారికీ పుణ్యం ప్రసాదిస్తాడు. శిక్షణ తీసుకోకపోతే ఇక్కట్లే.. : జాకిర్ హుసేన్, సివిల్ ఇంజనీరు నేను సివిల్ ఇంజనీర్ని. బాలాజీనగర్‌లో ఉంటాను. హజ్‌కు వెళ్లాలంటే సాధారణ దుస్తులను వదిలేసి ఇహ్రాం అనే వస్త్రాన్ని ధరించాల్సి ఉంటుంది. దేశం వదిలి ఇతర దేశానికి వెళతాం కాబట్టి అక్కడి చట్టం, అక్కడి నియమ నిబంధనలపై అవగాహన ఉండాలి. హజ్ యాత్రలోని ప్రధాన ఘట్టాలు కూడా తెలిసి ఉండాలి. పక్కనే ఉండే వ్యక్తిని అడిగితే అతనూ మనదేశీయుడే అయి ఉంటాడు. అందువల్ల హజ్‌యాత్రకు ముందే అన్ని తెలుసుకుని ఉండాలి. ఇందుకు హజ్ సొసైటీలు నిర్వహించే శిక్షణ తరగతులు బాగా ఉపయోగపడతాయి. అప్లికేషన్ భర్తీ చేసేటప్పుడు ఒక్క గడి తప్పున్నా అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. నేను విద్యావంతుడినైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్‌ను సొసైటీ ద్వారానే భర్తీ చేయించుకున్నాను. -
ప్రవక్త దృక్కోణంలో హక్కులు... బాధ్యతలు
సమాజంలో ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ముహమ్మద్ ప్రవక్త(స), ప్రజల సామాజిక బాధ్యతలను గుర్తుచేస్తూ, ధర్మం వారికిచ్చినటువంటి హక్కులను కూడా విశద పరిచారు. ముఖ్యంగా మానవ హక్కులను గురించి, వ్యక్తిగత స్వేఛ్ఛను గురించి విడమరిచి చెప్పారు. పరుల సంపదను హరించడం గురించి ఖురాన్ ఆదేశాలను వివరిస్తూ, ‘మీలో మీరు ఒకరి ఆస్తిని మరొకరు అన్యాయంగా, అక్రమంగా కబళించకండి’. అని చెప్పారు. అల్లాహ్ ఆదేశం ఇలా ఉంది. ‘ఒకజాతి ప్రజలు మరోజాతి ప్రజలను అవహేళన చేయవద్దు. ఒకరికొకరు తమ ప్రతిష్టలకు భంగం కలిగించుకో వద్దు. మారుపేర్లతో ఒకరినొకరు పరిహసించుకోవద్దు. ఒకరి వెనుక ఒకరు చెడుగా మాట్లాడుకోవద్దు. నిందలు వేసుకోవద్దు. ప్రవక్త మహనీయులు తమ చివరి హజ్ యాత్ర సందర్భంగా చేసిన ప్రసంగం కూడా చరిత్రాత్మకమైనది:’ప్రజలారా! బాగా వినండి. అజ్జానకాలపు దురాచారాలన్నీ అంతమైపొయ్యాయి. అరబ్బు వ్యక్తికి అరబ్బేతరునిపై, అరబ్బేతరునికి అరబ్బుపై, తెల్లవారికి నల్లవారిపై, నల్లవారికి తెల్లవారిపై ఎలాంటి ఆధిక్యతా లేదు. మీ సేవకులను తక్కువ దృష్టితో చూడకండి. మీరు తినేలాంటి భోజనమే వారికి పెట్టండి. మీరు ధరించే లాంటి బట్టలే వారికీ సమకూర్చండి. మహిళలూ మీలాంటివారే. మీకు వారిపై ఏవిధంగా హక్కులున్నాయో, అదేవిధంగా వారికీ మీపై హక్కులున్నాయి. పరస్పరం హాని తలపెట్టుకోరాదు. ప్రాణాలు తీసుకోరాదు. ప్రళయకాలం వరకు కూడా..నేను మీకోసం రెండువస్తువులు వదిలి వెళుతున్నాను. మీరువాటిని దృఢంగా పట్టుకోండి. ఎన్నటికీ దారి తప్పరు. ఒకటి పవిత్రఖురాన్, రెండవది సున్నత్, అంటే నా సాంప్రదాయం’. అంతేకాదు, మీరు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో కల్పించుకోకండి. ఇతరులపై గూఢచర్యానికి పాల్పడకండి. మీ స్వగృహం తప్ప ఇతరుల ఇళ్ళలోకి వారి అనుమతి లేకుండా ప్రవేశించకండి’’ అని హితవు చేశారు. ఏవ్యక్తినైనా శిక్షించాలంటే, న్యాయస్థానంలో అతడి నేరం రుజువుకావాలి. ఇతరుల మతవిశ్వాసాలను గౌరవించాలని ఆదేశిస్తూ, వారి మతవిశ్వాసాలకు, హక్కులకు భంగం కలిగే చర్యలన్నిటినీ ఆయన నిషేధించారు. ఈ విధంగా ప్రవక్తమహనీయులు సమస్త హక్కులనూ నిర్వచించారు. మానవులు ఆ అమృత ప్రవచనాలను అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, సమాజం అన్నిరకాల అసమానతలకు, లోపాలకు అతీతంగా విశిష్ట సత్సమాజంగా రూపుదిద్దుకుంటుంది. అల్లాహ్ మనందరికీ విజ్ఞానాన్ని, సద్బుద్ధినీ ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అన్ని ఆరాధనలకూ ఆత్మ ‘హజ్జ్’
శక్తి కలిగిన ప్రతిముస్లిం విధిగా హజ్ చేయాలన్నది ఖురాన్ వాక్యం. ఈ ‘హజ్’ జిల్‌హజ్ మాసం పదవతేదీన అరేబియాదేశంలోని మక్కానగరంలో జరుగుతుంది. ఆరోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్’ ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకు కూడా కనిపించదు.‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. అందుకే సర్వం మరచి, ఆడంబరాలు త్యజించి, సాధు స్వభావంతో దైవధ్యానంలో కాలం గడపాలని ఉవ్విళ్ళూరుతూ హాజీలు యాత్రకు సన్నద్ధమవుతారు. ఎందుకంటే, సంకల్పశుద్ధితో హజ్ సాంప్రదాయాలను నియమబద్ధంగా పాటిస్తూ ఆరాధన జరిపేవారికి ఇహపరలోకాల్లో అనంతమైన శుభాలు ప్రసాదించబడతాయి. అపారమైన అల్లాహ్ కరుణాకటాక్షాలు, మన్నింపు వారికి ప్రాప్తమవుతాయి. సమస్త గుణదోషాలనుండి వారు పునీతులవుతారు. హజ్రత్ అబూహురైరా(ర)ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పారు. ‘హజ్జ్, ఉమ్రాహ్ల కోసం మక్కాకు వెళ్ళేవారు అల్లాహ్ అతిథులు. వారు అల్లాహ్‌ను ఏది కోరుకుంటే ఆయన వారికది ప్రసాదిస్తాడు. వారు మన్నింపును కోరుకుంటే ఆయన వారిని మన్నించి వేస్తాడు. (ఇబ్నెమాజ)మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ ఇబ్రాహీం దైవాజ్ఞ మేరకు తన ధర్మపత్ని హజ్రత్ హాజిరాను, తనయుడు ఇస్మాయీల్ను వదిలేసి వెళ్ళిపోతారు. కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్కనీరులేని ఆ ఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడిమెలు రాసుకు పోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది.‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్రజలంతో తల్లీతనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్‌లు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. పవిత్రఖురాన్‌లో ఇలా ఉంది: ‘మానవుల కోసం ప్రప్రథమంగా నిర్మించబడిన ఆరాధనా కేంద్రం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకలశుభాలూ ప్రసాదించబడ్డాయి. ప్రపంచ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలున్నాయి. ఇబ్రాహీం ప్రార్థనా స్థలమూ ఉంది. దానిలో ప్రవేశించినవారు రక్షణ పొందుతారు. ఈ గృహానికి వెళ్ళే శక్తి, స్థోమత కలవారు దాని హజ్ ను విధిగా నెరవేర్చాలి. ‘(3–96,97) అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనారీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనారీతులన్నీ పరిపూర్ణతను సంతరించుకున్నాయి. యాత్ర, నిరాడంబర వస్త్రధారణ, దైవప్రార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహసందర్శనార్థం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం పొందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీపురుషులందరూ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. సాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడిలాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదెనబవీని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒక హాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర కాబా గృహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార ‡్లసహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశ పాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలు పరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్. ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్ధం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్ధం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దైవానికి దగ్గర చేసే హజ్
ఇస్లామీ ధర్మ మౌలిక సూత్రాల్లో కాబా సందర్శనా యాత్ర (హజ్జ్) కూడా ఒకటి. దైవాన్ని విశ్వసించేవారు నమాజ్, రోజా, జకాత్లతో పాటు ఆర్థిక స్థోమత ఉంటే ‘హజ్’ యాత్ర చేయడం తప్పనిసరి విధి. ఇది సుమారు వేయిన్నర సంవత్సరాల నాటిమాట. ఒక వ్యకి ్తతన సేవకుడిని వెంటబెట్టుకొని హజ్ యాత్రకు బయలుదేరాడు. ఆ కాలంలో ఎంతదూరం వెళ్ళాలన్నా ఒంటెలు, గుర్రాలే ప్రధాన ప్రయాణ సాధనాలు. సేవకుడితో కలిసి అశ్వంపై బయలుదేరిన ఆ వ్యక్తి ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఓ గ్రామ పొలిమేరకు చేరుకున్నాడు. ఊరిబయట పాడుబడిన ప్రదేశంలా ఉంది ఆ ఇరుకుదారి. దారి పక్కన ఒక అమ్మాయి ఏదో వస్తువు పోగొట్టుకున్నదానిలా తచ్చాడుతూ నిలుచొని ఉంది. బహుశా పది, పన్నెండేళ్ళు ఉంటాయేమో. చింపిరి జుట్టు, పీక్కుపోయిన కళ్ళు, చిరిగిన బట్టలు.. ముఖంలో దీనత్వం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. అంతలో ఆమె దృష్టి ఏదో వస్తువుపై పడింది. పోయిందనుకున్న విలువైన వస్తువేదో దొరికినంత ఆనందంతో ఆమె కళ్ళు మెరిశాయి. ఎవరైనా చూస్తారేమో అని ఒకవైపున కంగారుపడుతూనే, రెప్పపాటులో ఆ వస్తువును తన ఒళ్ళో వేసుకుంది. సరిగ్గా అదే సమయాన అటుగా వెళుతున్న వ్యక్తి ఆ దృశ్యాన్నిచూసి నిర్ఘాంతపోయాడు. వెంటనే గుర్రం దిగి, ఆ అమ్మాయి వైపుగా నడిచాడు. ఆమె భయం భయంగా అతని వైపే చూస్తూ తప్పుచేసినదానిలా తలవంచుకొని నిలుచొంది. ‘ఏమిటమ్మా ఇదీ.. చచ్చినపక్షి కదా! దీన్ని ఏంచేస్తావు?’ అంటూ చిరునవ్వుతో పలకరించాడాయన. ఆ అమ్మాయి కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. దుఖం గుండెను మెలిపెడుతుంటే కొద్దిసేపటిదాకా మాట్లాడలేకపోయింది. ఎట్టకేలకు కట్టలు తెంచుకువస్తున్న దుఃఖాన్ని అదుపుచేసుకొని, గద్గద స్వరంతో ‘‘అయ్యా! మేము అమ్మానాన్నలు లేని అనాథలం. కొన్నాళ్ళక్రితం కొందరు దుండగులు మా కుటుంబాన్ని చంపేసి, ఉన్నదంతా దోచుకుపోయారు. చిల్లిగవ్వమిగల్లేదు...’’ ‘అయ్యయ్యో..! ఎంతఘోరం జరిగిందమ్మా..!’’ అన్నాడా వ్యక్తి ఎంతో సానుభూతితో.. ఆ అమ్మాయి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ మళ్ళీ ఇలా అంది... ‘ప్రస్తుతం మాయింట్లో నేను, మా తమ్ముడే ఉన్నాము. తినడానికి తిండి, తొడుక్కోడానికి బట్టలు లేక నానా బాధలూ పడుతున్నాం. అలానే రోజులు గడిచిపోతున్నాయి. రెండుమూడు రోజులుగా తినడానికి ఏమీ లేదు. నేనెలాగో తట్టుకోగలను కాని, తమ్ముడే మరీ తట్టుకోలేకపోతున్నాడు. ఆకలితో అలమటించి పోతున్నాడు. వాడి బాధ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఆ గోస చూడలేక ఇలా బయలుదేరాను... తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని. ఇదిగో ఇక్కడ ఈ చచ్చిన పక్షి కనబడింది. దీన్ని తీసుకెళ్ళి తమ్ముడికి కాల్చిపెడితే కనీసం వాడి ప్రాణం నిలబడుతుంది’ అన్నదా అమ్మాయి కళ్ళుతుడుచుకుంటూ. ఈ మాటలు వినగానే ఆ వ్యక్తి నిలువెల్లా చలించిపోయాడు. హృదయం మంచుముక్కలా కరిగిపోయింది. మమతా, మానవత్వం సముద్ర కెరటాల్లా ఉప్పొంగాయి. ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని ప్రేమగా తల నిమురుతూ తను ‘హజ్’ కోసం తెచ్చుకున్న పైకాన్ని ఆ అమ్మాయి చేతిలో పెట్టాడు. పుట్టెడు దుఃఖం, భయంకరమైన ఆకలితో నకనకలాడుతున్న ఆ అమ్మాయి ముఖారవిందం ఒక్కసారిగా కలువ పువ్వులా విప్పారింది. ఆనంద భాష్పాలు జలజలా రాలుతుండగా, వణుకుతున్న చేతులతో బరువైన ఆ డబ్బుల సంచిని అందుకుంది. ఆ సమయాన ఆ పాప ముఖంలో విరబూసిన ఆనంద రేఖలను చూసి, అతని మనసు సంతోషంతో పులకించిపోయింది. తరువాత, మరలా ఆ పాపను దగ్గరికి తీసుకొని, తల నిమురుతూ - ‘‘అమ్మా.. ఇకవెళ్ళు. తమ్ముడు ఎదురుచూస్తుంటాడు. ఈ డబ్బుతో నువ్వు, మీ తమ్ముడు హాయిగా ఉండండి. మీ పేదరికాన్ని దూరంచేసిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోండి. డబ్బును చాలా జాగ్రత్తగా వాడుకోండి. దేవుడు ఎప్పుడూ మీకు తోడుంటాడు. ఆయన్ని ఎప్పటికీ మరువకండి. ఆయనకే కృతజ్ఞులై ఉండండి. అమ్మా, ఇక త్వరగా వెళ్ళి తమ్ముడికి ఏమైనా వండిపెట్టు’’ అన్నాడా వ్యక్తి. వెంటనే ఆ అమ్మాయి ఒళ్ళో ఉన్న చచ్చిన పక్షిని దూరంగా విసిరేస్తూ - ‘ఇక ఇప్పుడు చచ్చినదాన్ని తినడం మాక్కూడా ధర్మసమ్మతం కాదు. సమయానికి మమ్మల్ని ఆదుకున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న మమ్మల్ని కనికరించారు. మీ మేలు ఏనాటికీ మరిచిపోలేము. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మరి వెళతానండీ’ అంటూ, ఎప్పుడు తమ్ముడి ఆకలితీర్చాలా అనుకుంటూ, సంతోషంతో ఇంటిదారిపట్టింది వడివడిగా. ఆ వ్యక్తి ఆ పాప వెళ్ళిన వైపే కొన్నిక్షణాలపాటు తదేకంగా చూస్తూ, తృప్తిగా నిట్టూర్చాడు. ఈ తతంగమంతా చాలా సేపటినుండి నిశ్చేష్టుడై గమనిస్తున్న అతని సేవకుడు - ‘‘అయ్యా.. ఉన్న డబ్బంతా దానం చేశారు. ప్రయాణం ముందుకు సాగేదెట్లా..? మరి తమరి హజ్ యాత్ర..?’’ అని ఏదో అనబోతుండగా.. ‘‘నువ్వేమీ కంగారుపడకు. ఈయేడు మనం తల పెట్టిన హజ్ యాత్ర ఇక్కడే నెరవేరింది. ఇది కాబా యాత్రకంటే గొప్పయాత్ర’’ అన్నాడు హజ్ సంకల్పంతో బయలుదేరిన ఆ వ్యక్తి. ‘నిజమేనయ్యా.. ఇంతకంటే గొప్పపుణ్య కార్యం, పుణ్యయాత్ర మనకింకేం కావాలి. దేవుడు చాలా గొప్పవాడు’ అన్నాడు సేవకుడు ఆనందంతో.. ‘సరే ఇక ఇంటికి వెళదాం పద. ఈ సంవత్సరం మనం చేయదలచిన హజ్ యాత్రను దైవం ఇక్కడే స్వీకరించాడు. దైవం తలిసే ్తవచ్చేయేడు మళ్ళీ హజ్ యాత్రకు వెళదాం’ అన్నారు హజ్ సంకల్పంతో బయలుదేరిన ఆ పుణ్యాత్ముడు హ. అబ్దుల్లాహ్ బిన్ ముబారక్ రహ్మతుల్లాహ్ ఐలైహ్! - యండి.ఉస్మాన్ ఖాన్ ఇస్లాం ధర్మ ప్రబోధకులు -
క్షేమంగా వెళ్లిరండి
నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హజ్ యాత్రికులకు వాక్సినేషన్ కాశిబుగ్గ : ముస్లిం సోదరులు హజ్ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని రావాలని నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు అన్నారు. వరంగల్ హజ్ సొసైటీ అధ్యక్షుడు సర్వర్ మోహినొద్దీన్ అధ్యక్షతన ఎల్బీనగర్లోని క్రిస్టల్ గార్డెన్లో శనివారం హజ్‌యాత్రికుల కోసం వైద్యశిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా యాత్రికులకు వ్యాక్సిన్లు వేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుధీర్‌బాబు హాజరై, మాట్లాడారు. అల్లా దయతో హజ్ యాత్ర ఆనందకరంగా జర గాలని ఆకాంక్షించారు. యాత్రికులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శిబిరంలో డాక్టర్లు యాకూబ్‌పాషా, సాజిద్, ఖాజాహసన్, సొసైటీ ప్రతినిధులు హుస్సేన్ పాషా, జి.ఫర్మా, సుగుణాదేవి, ఎస్.వాణి, జి.రమాదేవి, మసియొద్దీన్, మౌలానా సఫీయోద్దీన్, ఖాస్మి, యూసఫ్, జావిద్, మినోహజ్, సైఫోద్దీన్, మసూద్, హఫిజోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
'ఉగ్ర'వాద దంపతులు కలిసింది అక్కడే!
వాషింగ్టన్: కాలిఫోర్నియాలో కాల్పులకు పాల్పడి 14 మంది మృతికి కారణమైన ఉగ్రవాద దంపతులు మొదట కలిసింది మక్కా యాత్రలో అని విచారణ సందర్భంగా తేలింది. ఆన్లైన్ ద్వారా పరిచయం అయిన ఫరూక్, తష్ఫిన్ మాలిక్‌లు మక్కాలో కలుసుకున్నారని వారి వీసాల వివరాలను పరిశీలించడం ద్వారా న్యాయవిచారణ కమిటీ గుర్తించింది. 2013లో ఉగ్రవాద దంపతుల కుటుంబాలు సౌదీ అరేబియాలోని మక్కాను సందర్శించాయి. ఈ సందర్భంగానే ఇరుకుటుంబాల మధ్య ఫరూక్, తష్ఫిన్ల పెళ్లి ప్రతిపాదన వచ్చిందని, ఫరూక్ కాలిఫోర్నియాలో ఉద్యోగం పొందిన అనంతరం వీరి వివాహం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. -
వెయ్యి దాటిన ‘హజ్’ మృతుల సంఖ్య
- మృతుల్లో 35 మంది భారతీయులు మినా: హజ్ యాత్ర సందర్భంగా గత గురువారం మినాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందినవారి సంఖ్య 1,090కి చేరిందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతదేహాల ఫొటోలను సౌదీ అధికారులు విడుదల చేశారని ఆదివారం సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. సౌదీ అధికారులు మరో 13 మంది భారతీయుల మృతదేహాలను గుర్తించడంతో ఆ దుర్ఘటనలో చనిపోయిన భారతీయుల సంఖ్య 35కి చేరింది. తాజాగా గుర్తించిన మృతులు జార్ఖండ్, యూపీ, బిహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందినవారని అధికారవర్గాలు తెలిపాయి. హజ్ దుర్ఘటనపై విచారణ జరిపేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సౌదీ రాజు సల్మాన్ ఆదేశించారు. -
అసలైన హజ్ యాత్ర!
ఒకసారి హజరత్ అబ్దుల్లా బిన్ ముబారక్ (రహ్మ)హజ్ యాత్రకోసం మక్కాకు బయల్దేరారు. అయితే ఆయన అలా కొన్ని మైళ్లు ప్రయాణించిన తరువాత, ఒక ఊరి పొలిమేరలోకి వెళ్లేసరికి అక్కడ ఒక బాలిక దేనికోసమో వెదుకులాడుతూ కనిపించింది. కడు పేదరికంలో ఉన్నట్టు కనిపిస్తున్న ఆ పదేళ్ల బాలిక వెదుకులాట ఆయన్ను ముందుకు సాగనివ్వలేదు. అంతలో ఆ బాలిక అటూ ఇటూ చూసి, ఓ చచ్చిన పక్షిని ఒళ్లో వేసుకుంది. ఆ దృశ్యాన్ని చూసిన ముబారక్ గారు వెంటనే ఆ అమ్మాయిని సమీపించి, ‘‘పాపా! చచ్చిన ఆ పక్షి ఎందుకు పనికొస్తుంది, దీన్నేం చేసుకుంటావు?’’ అని అడిగారు. ఆ బాలిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ గద్గదస్వరంతో ఇలా చెప్పింది. ‘‘అయ్యా! నేను అనాథను. నాకో తమ్ముడున్నాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేక చాలా బాధపడుతున్నాం. రెండు రోజుల నుండి తిండి దొరకలేదు. నేనెలాగో తట్టుకోగలను కానీ, తమ్ముడు తట్టుకోలేకపోతున్నాడు. వాడి ఆకలి బాధను చూడలేక దీన్నయినా వాడికి పెడితే ప్రాణాలు నిలుస్తాయన్న ఆశతో దీన్ని ఒళ్లో వేసుకున్నా’’ అని చెప్పింది. ఈ మాటలు విన్న అబ్దుల్లా బిన్ ముబారక్ (రజి)కదిలిపోయారు. బాలికను దగ్గరకి తీసుకుని ‘‘పాపా! ఏడవకు. దైవం తప్పకుండా నీ బాధను దూరం చేస్తాడు’’ అంటూ తన హజ్‌యాత్రకోసం తెచ్చుకున్న పైకమంతా ఆమె చేతిలో పెట్టి, వీటితో మీకు కావలసిన వస్తు సామగ్రి, బట్టలు కొనుక్కుని, దిగుల్లేకుండా హాయిగా జీవించండి. ఈ ఏర్పాటు చేసిన దైవానికి కృతజ్ఞతలు తెల్పుకోండి’’అన్నారు. ఒక్కసారిగా అన్ని డబ్బులు చేతిలో పడేసరికి, ఆ బాలిక బాలిక ముఖంలో మెరిసిన ఆనందాన్ని చూసి ముబారక్ గారి మనసు పులకరించిపోయింది. ‘‘అమ్మా! ఇక వెళ్లు. తమ్ముడు ఎదురు చూస్తుంటాడు. త్వరగా అతనికి భోజనం పెట్టు’’ అంటూ అనునయించారు. బాలిక కృతజ్ఞతగా ఆయన వైపు చూస్తూ సంతోషంతో ఇంటిదారి పట్టింది. బాలిక వెళ్లిన వైపే తృప్తిగా చూస్తూన్న ముబారక్ గారితో ఆయన శిష్యుడు ‘‘అయ్యా! డబ్బంతా ఇచ్చేశారు. మరి తమరి హజ్ యాత్ర ఎలా?’’ అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా ముబారక్‌గారు ఇలా అన్నారు. ‘మన హజ్ ఇక్కడే నెరవేరింది. ప్రస్తుతం ఇది కాబా యాత్ర కన్నా గొప్ప ఆరాధన. దైవచిత్తమైతే వచ్చే యేడాది మళ్లీ హజ్ యాత్రకు వెళదాం. ఈ యేడు మాత్రం హజ్‌ను అల్లాహ్ ఇక్కడే స్వీకరించాడు’’ అని దైవానికి కృతజ్ఞతలు చెప్పుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు. తలపెట్టింది దైవకార్యమైనా, ఆయన దాసులు ఆకలితో అలమటిస్తుంటే, వస్త్రాలు లేక విలవిల్లాడుతుంటే, దైవకార్యాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టి అన్నార్తుల క్షుద్బాధను తీర్చడం, వారికి వస్త్రాలు సమకూర్చడం అన్నిటికన్నా శ్రేష్ఠతర కార్యమన్న ప్రవక్త సందేశం దీని ద్వారా మనకు అర్థమవుతోంది. అందుకే నేలపై ఉన్నవారిని కరుణించండి, నింగిపై వాడు మిమ్మల్ని కరుణిస్తాడు’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త(స). -
పెట్టుబడులతో తెలంగాణకు రండి
సౌదీ పారిశ్రామికవేత్తలకు మహమూద్ అలీ పిలుపు దుబాయ్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సౌదీ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. హజ్‌యాత్రకు వచ్చిన ఆయన ఇక్కడి పారిశ్రామికవేత్తలను ఈమేరకు ఆహ్వానించినట్టు అరబ్ మీడియా శనివారం పేర్కొంది. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు తమ సర్కార్ కృతనిశ్చయంతో ఉందన్నారు. పారిశ్రామికవేత్తలకు అనేకసదుపాయాలు కల్పించి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. ఆస్పత్రులు,కళాశాలలు, ఐటీ సేవలరంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. తెలంగాణలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. తెలంగాణ తెల్లగ్రానైట్‌కు ప్రపంచంలో మంచి పేరుందన్నారు. సౌదీ వాసుల పెట్టుబడులకు తాము రక్షణగా నిలుస్తామన్నారు. -
హజ్‌యాత్ర-14కు ఏర్పాట్లు
వచ్చేనెల 12న యాత్రికుల క్యాంప్ రుబాత్ వ్యవహారంపై సీఎంతో కలిసి సౌదీ పర్యటన డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వెల్లడి సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్ర హజ్ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌యాత్ర -2014కు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ వెల్లడించారు. గురువారం హజ్‌హౌస్‌లో యాత్రికుల క్యాంప్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అంతరం నిర్వహించే తొలి హజ్ క్యాంప్ కావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చే స్తున్నామన్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులును విడుదల చేసిందన్నారు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రితో కలిసి సౌదీ అరేబియాలో పర్యటించి అక్కడి రాజుతో రుబాత్ ఉచిత వసతి, ఇతర ఏర్పాట్లపై చర్చించనున్నట్టు చెప్పారు. నిజాం పాలనలో అక్కడ నిర్మించిన రుబాత్‌తో పాటు అన్యాక్రాంతానికి గురైన మిగితా వసతి భవనాల పునరుద్ధరణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హామీ ఇచ్చారు. మొత్తం 30 శాఖల సమన్వయంతో జరిగే ఏర్పాట్లపై ఈనెల 30 సమావేశం నిర్వహస్తామని తెలిపారు. హజ్‌హౌస్‌లో యాత్రికుల క్యాంప్ వచ్చే నెల 12న ప్రారంభమవుతుందని, సెప్టెంబర్ 14న తొలి ఫ్లైట్ బయలుదేరుతుందన్నారు. సెప్టెంబర్ 28వ తేదీ వరకు మొత్తం 18 విమానాల్లో యాత్రికులు సౌదీకి వెళతారన్నారు. యాత్రికులతో ప్రభుత్వ వలంటీర్లుగా వెళ్లేవారికి సెల్‌ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇకపై ప్రతి నెలా హజ్‌హౌస్ సంక్షేమ, అభివృద్ధి పనులపై సమీక్షించనున్నట్టు వెల్లడించారు. ఈ సమావేశంలో స్టేట్ హజ్ కమిటీ స్పెషల్ అధికారి ఎస్ఏ షుకూర్, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ మహ్మద్ జలాలుద్దీన్ అక్బర్, సీఈవో అబ్దుల్ హమీద్, మైనార్టీ సంక్షేమ శాఖ డీడీ సుభాష్ చందర్ గౌడ్ పాల్గొన్నారు. -
సౌదీలో 500 మంది హజ్ యాత్రికులను మోసగించిన భారతీయుడు
సౌదీ అరేబియాలో దాదాపు 500 మంది హజ్ యాత్రికులను ఓ భారతీయుడు దారుణంగా మోసగించాడు. అది కూడా అలా, ఇలా కాదు.. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల మేర!! నకిలీ హజ్ ప్రచారం చేసి భక్తులను బురిడీ కొట్టించిన అతడి కోసం అధికారులు గాలిస్తున్నారు. వాళ్లందరికీ మైనా ప్రాంతంలో టెంట్లు ఇస్తామని, ఉచితంగా భోజనాలు పెట్టి రవాణా కూడా ఉచితంగానే అందజేస్తామని అతగాడు సెప్టెంబర్ నెల మధ్యలో మోసగాడు చెప్పాడు. అయితే, వాళ్ల వద్ద నుంచి 15 లక్షల సౌదీ రియాళ్లకు పైగా వసూలు చేసిన తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయి, మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసేశాడు. ఈ మోసగాడు ఇంకా సౌదీలోనే ఉన్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం వదిలి పారిపోయే ప్రసక్తి లేదని సౌదీ వర్గాలు బాధితులకు తెలిపాయి. అతడిపై కేసు నమోదైనందున ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం వదిలి వెళ్లలేడని జెడ్డా పోలీసులు చెప్పారు. మోసగాడి గురించి తాము భారత రాయబార కార్యాలయానికి కూడా చెప్పామన్నారు. మక్కా, జెడ్డాలకు మధ్యలో ఎక్కడో అతడు దాక్కుని ఉంటాడని భావిస్తున్నారు. తమకు సౌదీ చట్టాల గురించి తెలియదని బాధితుల్లో ఒకరైన మహ్మద్ షరీఫ్ చెప్పారు. -
దైవం మెచ్చే ఆరాధన ‘హజ్’
దైవం తన ప్రియ ప్రవక్త హ. ఇబ్రాహీం(అ)ను ఒక పరీక్షకు గురి చేశాడు. దైవాదేశ పాలనలో ప్రేమకు, మమకారాలకు, ఆత్మీయతకు ఏమాత్రం చోటు లేదని చాటి చెప్పిన అనుపమానమైన పరీక్ష ఇది. ఒకరోజు హ.ఇబ్రాహీం(అ) ఒక కలగన్నారు. స్వహస్తాలతో తన కొడుకు గొంతు కోస్తున్నట్లు ఆయన ఆ కలలో చూశాడు. దీన్ని దైవాదేశంగా భావించిన ఆయన లేక లేక కలిగిన సంతానాన్ని త్యాగం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయం అటు భార్యతోనూ, ఇటు కొడుకుతోనూ సంప్రదించగా... వారిద్దరూ సంతోషంగా అంగీకరించారు. తరువాత ఇస్మాయీల్ను నిర్ణీత ప్రదేశానికి తీసుకెళ్లి, దైవనామ స్మరణ చేస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు ఇబ్రాహీం (అ). దీంతో తన ప్రియ ప్రవక్త పట్ల దైవప్రసన్నత పతాకస్థాయిలో ప్రసరించింది. దైవవాణి ‘నా ప్రియ ప్రవక్తా! నువ్వు కేవలం స్వప్నంలో చూసిన దాన్ని నిజం చేసి చూపించావు. నా ఆజ్ఞాపాలనలో మీరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను మీతో ప్రసన్నుడనయ్యాను. నా ఈ పరీక్షలో మీరు సంపూర్ణంగా ఉత్తీర్ణులయ్యారు. ఇక భౌతిక చర్యగా మిగిలిపోయిన బలి తతంగంతో నాకు నిమిత్తమే లేదు. మీరు నా ఆదేశాలను తు.చ. తప్పక పాలించడంలో పరిపూర్ణులయ్యారు. ఈ శుభసమయంలో మీ త్యాగనిరతికి గుర్తుగా ఒక స్వర్గ పొట్టేలును పంపుతున్నాను’ అని పలికింది. వెంటనే చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో గొర్రెజాతికి చెందిన ఒక పొట్టేలు ప్రత్యక్షమైంది. దాన్ని జిబహ్ చేశారు హ. ఇబ్రాహీం (అ). ఈ తండ్రీ తనయుల దైవాజ్ఞ పాలనాక్రమంలో షైతాన్ వీరికి మూడుసార్లు అడ్డుపడతాడు. ఈ మూడుసార్లూ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్లు ఆ దుష్ట షైతాన్పై రాళ్లు విసిరి తరిమి కొడతారు. వీరిద్దరినీ షైతాన్ లోబరచుకోవడానికి ప్రయత్నించిన మూడుచోట్లా మూడు స్తంభాలున్నాయి. ఈ షైతాన్ స్తంభాలపై హాజీలు చిన్న చిన్న రాళ్లు విసిరి దుష్టశక్తులపై ధార్మిక చింతనాపరుల ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తారు. దుష్టశక్తులు, ధర్మ విరోధులు ఎప్పుడు ఎక్కడ ఎదురైనా వారిని ఎదిరించడంలో ఎప్పుడూ ముందుంటామని ప్రకటించడమే ఈ రాళ్లు విసరడంలోని ముఖ్యోద్దేశం. ‘హజ్’ ఒక విశ్వజనీన, విశ్వ వ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకైనా ఉండదు. మానవులంతా ఒక్కటే అన్న భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. పవిత్ర హజ్ ఆరాధన జరిగే మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ, కోనల మధ్య నిర్మానుష్యంగా ఎలాంటి వనరులూ లేక నిర్జీవంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ హ. ఇబ్రహీం అలైహిస్సలాం తన ధర్మపత్ని హ.హాజిరా(అ)తోపాటు పాలబుగ్గల పసికందు, ఆ పుణ్యదంపతుల ఏకైక సంతానమైన హ. ఇస్మాయీల్ను వదిలేసి వెళ్లిపోతారు. అప్పుడు ‘నన్నూ, నా బిడ్డనూ ఈ జన సంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోతున్నారేమిటి? అని హ. హాజిరా ( అ) అడిగితే, ‘ఇది దైవాజ్ఞ. అందుకే వదిలి వెళుతున్నాను. అని చెప్పి, దైవంపై అచంచల విశ్వాసంతో కనీసం వెనుదిరిగైనా చూడకుండా వెళ్లిపోతారు హ. ఇబ్రాహీం. కనీసం నాలుక తడుపుకోవడానికి సైతం చుక్కనీరులేని ఆ ప్రదేశంలో చిన్నారి పసికందు ఇస్మాయీల్ గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో, ఆయన కాలి మడిమెలు రాసుకుపోయిన చోట దేవుని ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట వెలిసింది. ‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్ర జలంలో తల్లీ తనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆనాడు కేవలం రెండు ప్రాణాలకోసం వెలసిన ఆ నీరు ఈనాడు ‘హజ్’ యాత్రకోసం మక్కా వెళ్లే లక్షలాదిమంది ప్రజలకు సమృద్ధిగా సరఫరా అవుతూ, యాత్రికులు తమ స్వస్థలాలకు తెచ్చుకున్నా ఏమాత్రం కొరత రాకుండా తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం దేవుని మహిమకు నిదర్శనం. ఆనాడు నిర్జన ఎడారి ప్రాంతంగా ఉన్న కీకారణ్యమే ఈనాడు సుందర మక్కానగరంగా రూపుదిద్దుకుని విశ్వవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. తరువాత కొంతకాలానికి దైవాదేశం మేరకు హ. ఇబ్రాహీం (అ)మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకుని, తనయుడు ఇస్మాయీల్ సాయంతో ‘కాబా’ను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఆ రాతి కట్టడాన్ని హ.ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్లు దైవానికి సమర్పించుకోవడంతో, అది ‘కాబా’ దైవగృహంగా పేరు పొందింది. కాబాగృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనారీతులన్నీ పరిపూర్ణతను సంతరించుకున్నాయి. యాత్ర, నిరాడంబర సాధువస్త్రధారణ, దైవప్రార్థన, వ్రతనిష్ట, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతూ ఉంటాయి. అందుకని, కాబా గృహ సందర్శనార్థం చేసుకునే ‘హజ్’ వల్ల ఉపాసనా రీతులన్నింటినీ ఆచరించి దైవానుగ్రహం పొందినట్లే అవుతుంది. ఇందుకోసమే దైవవిశ్వాసులైన వారందరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా ‘హజ్’ చేయాలని... ఆ మహాభాగ్యం కోసం ఉవ్విళ్లూరుతుంటారు. హజ్ నియమాలు సాధారణంగా హజ్ చేయాలనుకునేవారు ఒక నాయకుని ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడతారు. హజ్ సంకల్పంతోనే మనస్సునూ, దేహాన్ని నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మనోవాంఛలను వదులుకుని, అసభ్య ప్రసంగాలకు దూరంగా ఉంటారు. కొంతకాలం వరకు దాంపత్య సంబంధాలను సైతం త్యజించి, నిరంతర దైవధ్యానంతో జీవితం గడుపుతారు. ఈ విధంగా హజ్ ఆరాధన మనిషిని అన్ని రకాల దుర్గుణాలకూ దూరంగా ఉంచి, పరమ పునీతుల్ని చేస్తుంది. హజ్ కోసం వచ్చే యాత్రికులంతా మక్కా మరికొన్ని మైళ్ల దూరం ఉండగానే నిరాడంబర వస్త్రధారణ చేయాలి. ధార్మిక పరిభాషలో దీన్ని ‘ఇహ్రాం’ అంటారు. అంతకుముందు రకరకాల వస్త్రధారణల్లో ఉన్న వివిధ దేశాలకు చెందిన వారంతా ‘ఇహ్రామ్’తో ఒక్కటై పోతారు. ధనికులు, పేదలు, అధికులు అధములు అన్న తేడాలేకుండా అందరూ కలసిపోతారు. ‘ఇహ్రామ్’ అంటే ఒక లుంగీ, ఒక దుప్పటి, పాదరక్షలు మాత్రమే ధరించడం. ఇహ్రాం ధరించిన తరువాత అన్ని ఆడంబరాలూ త్యజించాలి. అలంకారాలు మానుకోవాలి. కేశసంస్కారంతోపాటు కనీసం గోళ్లు కూడా కత్తిరించుకోకూడదు. ‘తఖ్వా’ అంటే దైవ భీతిని అలవరచుకుని నమాజు, జిక్ ్రతప్ప మరో ప్రాపంచిక విషయంవైపు మనస్సు మళ్లకుండా జాగ్రత్తపడాలి. నియమ నిష్ఠలతో చేసిన హజ్ యాత్ర దైవం మెచ్చే ఆరాధన. - యండీ ఉస్మాన్‌ఖాన్