సౌదీ అరేబియాలో దాదాపు 500 మంది హజ్ యాత్రికులను ఓ భారతీయుడు దారుణంగా మోసగించాడు. అది కూడా అలా, ఇలా కాదు.. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల మేర!! నకిలీ హజ్ ప్రచారం చేసి భక్తులను బురిడీ కొట్టించిన అతడి కోసం అధికారులు గాలిస్తున్నారు. వాళ్లందరికీ మైనా ప్రాంతంలో టెంట్లు ఇస్తామని, ఉచితంగా భోజనాలు పెట్టి రవాణా కూడా ఉచితంగానే అందజేస్తామని అతగాడు సెప్టెంబర్ నెల మధ్యలో మోసగాడు చెప్పాడు. అయితే, వాళ్ల వద్ద నుంచి 15 లక్షల సౌదీ రియాళ్లకు పైగా వసూలు చేసిన తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయి, మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసేశాడు.
ఈ మోసగాడు ఇంకా సౌదీలోనే ఉన్నాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం వదిలి పారిపోయే ప్రసక్తి లేదని సౌదీ వర్గాలు బాధితులకు తెలిపాయి. అతడిపై కేసు నమోదైనందున ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం వదిలి వెళ్లలేడని జెడ్డా పోలీసులు చెప్పారు. మోసగాడి గురించి తాము భారత రాయబార కార్యాలయానికి కూడా చెప్పామన్నారు. మక్కా, జెడ్డాలకు మధ్యలో ఎక్కడో అతడు దాక్కుని ఉంటాడని భావిస్తున్నారు. తమకు సౌదీ చట్టాల గురించి తెలియదని బాధితుల్లో ఒకరైన మహ్మద్ షరీఫ్ చెప్పారు.
సౌదీలో 500 మంది హజ్ యాత్రికులను మోసగించిన భారతీయుడు
Published Mon, Nov 4 2013 8:51 PM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement
Advertisement