![పెట్టుబడులతో తెలంగాణకు రండి](/styles/webp/s3/article_images/2017/09/2/71411847500_625x300.jpg.webp?itok=Zp7_4dVj)
పెట్టుబడులతో తెలంగాణకు రండి
సౌదీ పారిశ్రామికవేత్తలకు మహమూద్ అలీ పిలుపు
దుబాయ్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకురావాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ సౌదీ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. హజ్‌యాత్రకు వచ్చిన ఆయన ఇక్కడి పారిశ్రామికవేత్తలను ఈమేరకు ఆహ్వానించినట్టు అరబ్ మీడియా శనివారం పేర్కొంది. తెలంగాణను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు తమ సర్కార్ కృతనిశ్చయంతో ఉందన్నారు.
పారిశ్రామికవేత్తలకు అనేకసదుపాయాలు కల్పించి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ఆయన చెప్పారు. ఆస్పత్రులు,కళాశాలలు, ఐటీ సేవలరంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. తెలంగాణలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. తెలంగాణ తెల్లగ్రానైట్‌కు ప్రపంచంలో మంచి పేరుందన్నారు. సౌదీ వాసుల పెట్టుబడులకు తాము రక్షణగా నిలుస్తామన్నారు.