
యాత్రికులపై బందిపోటు దాడులు
ఉత్తరప్రదేశ్లోని గోవర్ధన్ క్షేత్రంలో టెంట్లలో బసచేసిన యాత్రికులపై సాయుధ బందిపోట్లు దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సెక్యూరిటీ గార్డును చంపి, మహిళల వద్ద ఉన్న బంగారు నగలు, నగదు మొత్తాన్ని దోచుకెళ్లారు. దాంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి.
ప్రతియేటా ఈ ప్రాంతంలో వల్లభ సంప్రదాయ ఆధ్వర్యంలో బ్రజ్ చౌరాసీ కోస్ పరిక్రమ యాత్ర జరుగుతుంది. వాళ్లు ఏర్పాటుచేసిన టెంట్లలో ఉన్నభక్తులపైనే బందిపోట్లు దాది చేశారు. ఐదారుగురు గుజరాతీ మహిళలపై వారు దాడిచేసి, నగలు, నగదు దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఎదిరించిన పాప్ సింగ్ (43) అనే గార్డును కాల్చిచంపారు.