లక్నో: కన్వర్ యాత్రికులు హరిద్వార్-ఢిల్లీ జాతీయ రహదారి మీద ఓ కారుపై దాడి చేశారు. తమ వెంట తీసుకెళుతున్న పవిత్ర గంగాజలాలున్న కావడిని ఢీకొట్టినందుకే కారుపై యాత్రికులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
గంగాజలాలను కారు తాకడం వల్ల అవి అపవిత్రమయ్యాయని యాత్రికులు ఆరోపించినట్లు చెప్పారు. కన్వర్ యాత్రికులు కావడిలో తీసుకెళ్లే గంగా జలాలను పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తీసుకువెళ్లి వారు శివున్ని పూజిస్తారు.
కన్వర్ యాత్ర సోమవారం(జులై 22) ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టులో ముగుస్తుంది. మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో తిను బండారాలు అమ్మే హోటళ్ల ఓనర్లు తమ పేర్లు ప్రదర్శించాలని యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.
Comments
Please login to add a commentAdd a comment