Kanwar Yatra
-
కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు.. ఏటీఎస్ బలగాల మోహరింపు
ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న కన్వర్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచివుందంటూ నిఘా వర్గాలకు సమాచారం అందిన నేపధ్యంలో యాత్ర భద్రత కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీని పర్యవేక్షణ బాధ్యతను యాంటీ టెర్రరిస్ట్ స్క్యాడ్(ఏటీఎస్)కు అప్పగించారు. ఈ నేపధ్యంలో ఏటీఎస్ బృందం భద్రతా ఏర్పాట్లను పరిశీలించింది.ఉగ్రవాదుల దాడి యత్నానికి సంబంధించిన ఇన్పుట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు అందినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో యూపీలోని ముజఫ్ఫర్‌నగర్ జిల్లాకు ఏటీఎస్ కమాండోల బృందం తరలివచ్చింది. వీరికి ఎస్ఎస్పీ అభిషేక్ సింగ్ విధులకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఈ బృందాన్ని శివచౌక్, మీనాక్షి చౌక్, హాస్పిటల్ తిరహా తదితర ముఖ్యమైన ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు యాంటీ శాబోటేజ్ టీం, బీడీడీఎస్ (బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్) కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. -
అందుకే అలాంటి నిర్ణయం.. కన్వర్ యాత్ర ఆదేశాలపై యూపీ ప్రభుత్వ వివరణ
న్యూఢిల్లీ: కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా హోటల్స్ నేమ్ ప్లేట్లపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని సుప్రీం కోర్టు కోరగా.. ఈమేరకు కోర్టుకు తాజాగా యూపీ ప్రభుత్వం తమ వివరణను తెలియజేసింది. ‘‘హోటల్స్, తినుబండారాల పేర్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని యాత్రికులు ఫిర్యాదు చేశారు. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు’’ అని వివరించింది. ఇదిలా ఉంటే.. ఉత్తరప్రదేశ్ (యూపీ) శివభక్తుల కన్వర్ యాత్ర నేమ్ ప్లేట్ల వివాదం పిటిషన్లపై ఇవాళ (జులై 26) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
Supreme Court: ఆహార బోర్డులు ప్రదర్శిస్తే చాలు
న్యూఢిల్లీ/భోపాల్: ఉత్తరాదిన వివాదం రేపుతున్న కావడి యాత్ర వివాదానికి తెర దించే దిశగా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. భక్తులు వెళ్లే మార్గాల్లో దుకాణాలు, హోటళ్ల ముందు యజమానులు, సిబ్బంది పేర్లతో బోర్డులు ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వల ఆదేశాలపై స్టే విధిస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. బదులుగా లభించేది శాకాహారమో, మాంసాహారమో తెలిపే బోర్డులు ప్రదర్శిస్తే సరిపోతుందని స్పష్టంచేసింది. శ్రావణమాసంలో గంగాజలాన్ని కావడిలో సేకరించి భక్తులు తిరిగి తమ సొంతూరిలోని శివాలయాల్లో జలాభిషేకం చేస్తారు. పుణ్యజలాలను తీసుకెళ్లే భక్తులకు శాకాహారం అందించే హోటళ్ల వివరాలు తెలియాలంటూ ఆయా రాష్ట్రాలు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించింది. తాను కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా ముస్లింలు నడిపే శాకాహార భోజనంలోనే తినేవాడినని జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఈ సందర్భంగా చెప్పారు. యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల తరఫున ఎవరూ హాజరు కాకపోవడంతో విచారణను శుక్రవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. -
కారుపై కన్వర్ యాత్రికుల దాడి
లక్నో: కన్వర్ యాత్రికులు హరిద్వార్-ఢిల్లీ జాతీయ రహదారి మీద ఓ కారుపై దాడి చేశారు. తమ వెంట తీసుకెళుతున్న పవిత్ర గంగాజలాలున్న కావడిని ఢీకొట్టినందుకే కారుపై యాత్రికులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.గంగాజలాలను కారు తాకడం వల్ల అవి అపవిత్రమయ్యాయని యాత్రికులు ఆరోపించినట్లు చెప్పారు. కన్వర్ యాత్రికులు కావడిలో తీసుకెళ్లే గంగా జలాలను పవిత్రంగా భావిస్తారు. ఈ నీటిని తీసుకువెళ్లి వారు శివున్ని పూజిస్తారు. కన్వర్ యాత్ర సోమవారం(జులై 22) ప్రారంభమైంది. ఈ యాత్ర ఆగస్టులో ముగుస్తుంది. మరోవైపు కన్వర్ యాత్ర మార్గంలో తిను బండారాలు అమ్మే హోటళ్ల ఓనర్లు తమ పేర్లు ప్రదర్శించాలని యూపీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలిచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది. -
సుప్రీంకోర్టులో యోగి ప్రభుత్వానికి షాక్
-
కన్వర్ యాత్ర నేమ్‌ప్లేట్ వ్యవహారం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టకోవాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి, ఎన్డీయే మిత్రపక్షం రాష్ట్రీయా లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ నేత జయంత్ చౌదరీ ఈ వ్యవహారంపై స్పందించారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలా అనిపిస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్డీయే మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి ఇలా వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.‘‘ కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాదుల పేర్లబోర్డులు స్పష్టంగా కనిపించేలా పెట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వటం సరికాదు. ఇది పూర్తిగా ఆలోచించి, సహేతుకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏ నిర్ణయమైనా సమజ శ్రేయస్సు, సామరస్య భావానికి హాని కలిగించదు. కన్వర్ యాత్ర చేపట్టేవారు.. వారికి సేవచేవారు అందరూ ఒక్కటే. ఇటువంటి సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. కన్వర్ యాత్ర చేపట్టినవారికి సేవ చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సేవ చేసేవారిని మతం,కులం ఆధారంగా ఎవరూ గుర్తించరు. ప్రభుత్వం ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవటం లేదా వాటి అమలుపై తప్పనిసరి చేయటంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది’’ అని అన్నారు.శనివారం యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ మిత్రపక్షనేత, కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ సమర్థించారు. ఇతర పార్టీల అభిప్రాయల గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. కానీ, యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని పేర్కొన్నారు. -
ఉజ్జయిని: షాపులపై ఓనరు పేరు తప్పనిసరి
భోపాల్: కన్వర్ యాత్ర దారిలో ఉన్న షాపుల ఓనర్లు తమ పేరు స్పష్టంగా కనిపించేలా నేమ్ ప్లేట్లు పెట్టుకోవాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి. ఇదే దారిలో తాజాగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఉజ్జయినిలో హోటళ్లు, తోపుడుబండ్లపై విక్రయాలు జరిపేవారు వాటిపై తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్‌కోడ్, ఫోన్ నంబర్‌ను కూడా నేమ్‌ప్లేట్‌లో ఉంచాలని పేర్కొంది. ఈ ఆదేశాలు పాటించని వారికి రూ.2,000 నుంచి రూ.5000 వేల వరకు ఫైన్ వేస్తామని, వారి హోటళ్లను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ తెలిపారు. ముస్లింలు తమ లక్ష్యం కాదని క్లారిటీ ఇచ్చారు.నేమ్‌ప్లేట్ల వ్యవహరాన్ని విపక్షాలు మాత్రం దీనిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కాగా కన్వర్ యాత్ర సోమవారం (జులై 22) నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
కన్వర్ యాత్ర మార్గంలో హోటళ్లకు నేమ్‌బోర్డులు ఉండాల్సిందే..
లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో అన్ని హోటళ్లు తమ యజమానుల పేర్లను తప్పక ప్రదర్శించాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.. ప్రతి హోటళ్లు.. అది రెస్టారెంట్ అయినా, రోడ్‌సైడ్ దాబా అయినా, లేదా ఫుడ్ కార్ట్ అయినా యజమాని పేరును ప్రదర్శించాల్సిందేనని పేర్కొన్నారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ వెల్లడించింది.ఇదిలా ఉండగా ఇటీవల ముజఫర్‌నగర్ పోలీసులు ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు. కన్వర్ యాత్ర మార్గాల్లోని హోటళ్లకు యజమానుల పేర్లు, మొబైల్ నెంబర్, క్యూ ఆర్ కోడ్‌ను.. బోర్డుపై ఉంచాలని ఆదేశించారు. అయితే ఈ ఆదేశాలు వివాదస్పదంగా మారాయి. వీటిపై ప్రతిపక్ష ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. భారత సంస్కృతిపై ఇదొక దాడి అని కాంగ్రెస్ విరుచుకుపడింది. ఈ ఉత్తర్వు పూర్తి వివక్షపూరితమని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. యూపీలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చేయడమే దీని ఉద్దేశమని ఆరోపించారు. సామాజిక నేరంలాంటి ఈ ఉత్తర్వుపై కోర్టులు సుమోటోగా తీసుకొని విచారణ జరపాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ డిమాండ్ చేశారు.అయితే విపక్షాలు తప్పుబడుతున్నప్పటికీ యూపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కన్వర్ యాత్రకు వెళ్తున్నవారు ఫక్తు శాకాహారం ఎక్కడ లభ్యమవుతుందో తెలుసుకునేందుకే ఈ నిబంధన విధించినట్లు చెబుతోంది. హిందూ పేర్లతో ముస్లింలు మాంసాహారాన్ని యాత్రికులకు విక్రయిస్తున్నారని మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ ఆరోపించారు. వైష్ణో ధాబా భండార్, శాకుంభరీ దేవి భోజనాలయ, శుద్ధ్ భోజనాలయ వంటి పేర్లను రాసి మాంసాహారాన్ని విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.కాగా జులై 22 నుంచి కన్వర్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో భాగంగా ఏటా శ్రావణ మాసంలో 15 రోజుల పాటు శివ భక్తులు గంగా నదీజలాలను సేకరిస్తుంటారు. -
హర హర ‘మా’హా దేవా!
హరిద్వార్‌లో ఒక యువ భక్తుడు ఒక భుజాన తల్లిని, మరోభుజాన గంగానది జలం ఉన్న బిందెలను మోసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు గంగాజలాన్ని మోసుకు వస్తారు. దేశంలోని జ్యోతిర్లింగాలకు ఈ పవిత్రమైన నీటితో జలాభిషేకం చేస్తారు. పదకొండు సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ కొందరు పురాణాలలోని శ్రవణకుమారుడిని గుర్తు తెచ్చుకున్నారు. ‘ఈ కాలంలో ఇలాంటి దృశ్యం చూడడం అపురూపంగా ఉంది’ ‘కడుపులో నవ మాసాలు మోసిన తల్లిని భుజాన మోయడం అదృష్టం’... ఇలా రకరకాలుగా స్పందించారు నెటిజనులు. -
కన్నతల్లిని భుజాన మోస్తూ.. శివభక్తుడి సాహసం..
హరిద్వార్: శ్రావణ మాసం ప్రారంభంలో జరిగే కన్వర్ యాత్రలో ఓ శివ భక్తుడు భుజం మీద కావడితో ఒక ఉట్టెలో తన తల్లిని కూర్చోబెట్టి మరో ఉట్టెలో మూడు బిందెల పవిత్ర గంగాజలాన్ని కాలినడకన మోసుకుంటూ హరిద్వార్ నుండి బయలుదేరాడు. కన్వర్ యాత్రలో భాగంగా ప్రతి ఏటా శ్రావణమాసం ఆరంభంలో దేశవ్యాప్తంగా శివభక్తులు హరిద్వార్ నుండి పవిత్ర గంగా జలాన్ని భుజాన మోసుకుంటూ మైళ్లకు మైళ్ళు కాలినడకన తమతో పాటు తమ ఊళ్లలోని శివాలయానికి తీసుకుని వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయడం ఏళ్లుగా వస్తోన్న ఆచారం. ఉత్తరాఖండ్ లోని గోముఖ, గంగోత్రి నుండి బీహార్ లోని సుల్తాన్ గంజ్ నుండి గంగానది నీళ్లను తీసుకెళుతూ ఉంటారు శివభక్తులు. ఈ క్రమంలోనే ఓ శివభక్తుడు తన తల్లి శ్రేయస్సు కోసం ఒక కావడిని భుజాన తగిలించుకుని రెండు ఉట్టెల్లో ఒకదాంట్లో తన కన్నతల్లిని మరో దాంట్లో మూడు బిందెల గంగా జలాన్ని మోసుకుంటూ కన్వర్ యాత్రలో పాల్గొని తల్లిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. Kanwar Yatra 2023: A youth carries his mother on one shoulder and water of the river Ganga on the other shoulder in Haridwar pic.twitter.com/83vuUxVT83 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 4, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో కుంగిన రోడ్డు.. మూడు నెలల్లో మూడోసారి -
యోగి సర్కార్ తీరు సరికాదు: ఒవైసీ
లక్నో: ఉత్తర ప్రదేశ్ సర్కార్‌పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వెల్లగక్కారు. కన్వర్ యాత్ర సందర్భంగా.. కన్వరియాల మీద పూలు జల్లడం కోసం ప్రభుత్వ నిధుల్ని వెచ్చించడాన్ని, భక్తులకు పోలీసుల కాళ్లు నొక్కి, పూలతో స్వాగతం పలుకుతూ సేవలు చేయడానికి అధికారుల్ని సర్కార్ నియమించడాన్ని ఒవైసీ తప్పుబట్టారు. ఒకవైపు యూపీ ప్రభుత్వం కన్వర్ యాత్ర కోసం పూలు జల్లేందుకు అధికారుల్ని నియమిస్తోంది. ఎక్కడ చూసిన అవే కథనాలు కనిపిస్తున్నాయి. సంతోషం. అదే సమయంలో ముస్లింల ఇళ్లను కూల్చడానికి బుల్డోజర్లను అదే అధికారులతో పంపిస్తోంది. ముస్లింలు తమ మీద పూలు చల్లమని కోరుకోవడం లేదు.. కనీసం బుల్డోజర్లను తమవైపు పంపించొద్దని కోరుకుంటున్నారు. कांवड़ियों के जज़्बात इतने मुतज़लज़ल हैं कि वे किसी मुसलमान पुलिस अहलकार का नाम भी बर्दाश्त नहीं कर सकते। यह भेद-भाव क्यों? यकसानियत नहीं होनी चाहिए? एक से नफ़रत और दूसरों से मोहब्बत क्यों? एक मज़हब के लिए ट्रैफिक डाइवर्ट और दूसरे के लिए बुलडोज़र क्यों? 3/n pic.twitter.com/DPZwC02iNF — Asaduddin Owaisi (@asadowaisi) July 26, 2022 బహిరంగ ప్రాంతాల్లో కొన్ని నిమిషాలపాటు ముస్లింలు నమాజ్ చేస్తే.. నానా రభస చేస్తున్నారు. అదొక రచ్చ అవుతోంది. పోలీస్ కేసులు, బుల్లెట్లు, ఘర్షణలకు కారణం అవుతోంది. ఎన్ఎస్ఏ, యూఏపీఏ, మూకదాడులు-హత్యలు ఇవన్నీ ముస్లింలకేనా? అని ప్రశ్నించారు ఒవైసీ. లూలూ మాల్ వ్యవహారం తర్వాత యూపీలో చాలా చోట్ల బహిరంగ ప్రదేశాల్లో నమాజ్‌లు చేసేవాళ్లను అరెస్ట్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ తరుణంలోనే ఎంపీ ఒవైసీ ఇలా అసహనం వ్యక్తం చేశారు. కన్వరియాల మనోభావాలు చాలా బలంగా ఉంటాయి. వారు ముస్లిం పోలీసు అధికారి పేరును కూడా సహించలేరు. ఎందుకు ఈ భేదం? ఒకరిని ద్వేషించి మరొకరిని ఎందుకు ప్రేమించాలి? ఒక మతం కోసం ట్రాఫిక్‌ను మళ్లించి, మరో మతానికి బుల్డోజర్లను ఎందుకు మళ్లించారు అంటూ ట్విటర్లో పోస్టులు చేశారు ఒవైసీ. ఇదీ చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు -
కన్వర్ యాత్ర భక్తులకు కలెక్టర్, పోలీసుల సేవలు.. కాళ్లు నొక్కి..
ఈ ఏడాది కన్వర్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. అయితే, శ్రావణ మాసంలో శివ భక్తులు (కన్వరిలు) భక్తి శ్రద్ధలతో గంగా నది ఒడ్డుకు వెళ్లి ప్రవిత గంగా జలాలను తమ ఇళ్లలో, దేవాలయాల్లోకి నీటిని తీసుకుని వెళ్తారు. ఈ క్రమంలో గంగా నది నీటి కోసం ఉత్తరాఖండ్, యూపీ, హరిద్వార్, రిషికేశ్, గౌముఖ్, తదితర ప్రాంతాలకు కాలినడకన బయలుదేరుతారు. ఇదిలా ఉండగా.. కన్వర్ యాత్రికుల కోసం ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. భక్తులు కాలినడకన వస్తుండటంతో తీవ్రంగా అలిసిపోతున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ప్రజలు వారికి సాయం అందిస్తున్నారు. తాజాగా యూపీలో కొందరు పోలీసు అధికారులు వారికి తమ వంతు సాయం అందించారు. యూపీలోని అమ్రోహాలో ఎస్ఐ రాజేంద్ర పుందిర్.. కన్వరిల కాళ్లకు పేయిన్ రిలీఫ్ స్ప్రే కొట్టి.. మసాజ్ చేశారు. హపూర్ క్యాంపులో సైతం సీఐ సోమ్‌వీర్ సింగ్.. కన్వరియాల కాళ్లు నొక్కారు. దీంతో కన్వరియాలకు కొంత ఉపశమనం కలిగింది. అంతకు ముందు.. అమ్రోహ కలెక్టర్, ఎస్పీ.. ఓ భక్తురాలి కాళ్లు కడిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Haridwar: Helicopter showers flower petals on thousands of Kanwariyas at Har Ki Pauri I Watch pic.twitter.com/sn0ZiJ6qgA — Hindustan Times (@htTweets) July 24, 2022 ఇక, హరిద్వార్ కన్వర్ యాత్రికులపై ప్రభుత్వం.. హెలికాప్టర్ల సాయంతో పూల వర్షం కురిపించింది. కొన్ని చోట్ల మతాలకు అతీతంగా ముస్లింలు కూడా కన్వరియాలకు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. కాగా, జూలై 14న ప్రారంభమైన కన్వర్ యాత్ర.. జూలై 26తో ముగియనుంది. Visuals from Amroha, UP. A sub-inspector Rajendra Pundir seen applying ointment on the leg of Kanwariyas resting in a makeshift camp. pic.twitter.com/YaFkd6lCoQ — Piyush Rai (@Benarasiyaa) July 24, 2022 मुजफ्फरनगर : कमिश्नर और DIG ने कावड़ियों पर की पुष्पवर्षा ◆मौसम की खराबी के चलते पुष्पवर्षा के लिए नहीं आ सका Helicopter pic.twitter.com/TTxRn6M308 — News24 (@news24tvchannel) July 24, 2022 Amroha Collector And SP Washed Feet Of Kanwariyas Returning From Haridwar ANN https://t.co/gsdrMAtFzh — TIMES18 (@TIMES18News) July 24, 2022 -
మీరు రద్దు చేస్తారా? మేము చేయాలా?
న్యూఢిల్లీ : కరోనా మూడో వేవ్ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన కావడ్ యాత్రపై పునరాలోచించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సోమవారం వరకు గడువు ఇచ్చింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మతపరమైన కార్యక్రమాలు ముఖ్యం కాదని జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ బిఆర్ గవాయ్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మనందరం భారత పౌరులం. ఆర్టికల్ 21 జీవించే హక్కు అందరికీ వర్తిస్తుంది. యూపీ సర్కార్ ఇలాంటి యాత్రలని 100శాతం నిర్వహించకూడదు’’అని వ్యాఖ్యానించింది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాల కంటే మనోభావాలు ఎక్కువ కాదని స్పష్టం చేసింది. ‘‘మీకు మరో అవకాశం ఇస్తున్నాం. యాత్రని ఆపేస్తారా, లేదంటే ఆపేయాలనే మేమే ఆదేశాలివ్వాలా?’’అని సూటిగా ప్రశ్నించింది. శ్రావణమాసంలో శివభక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ నుంచి గంగా జలాలను తమ ఊళ్లకి తీసుకువచ్చి శివుడికి అభిషేకం చేసే ఈ కావడ్ యాత్రకు కోట్లాదిగా భక్తులు హాజరవుతారు. కరోనా నేపథ్యంలో ఉత్తరాఖండ్ దీనిని రద్దు చేసినా, యూపీ సర్కార్ ఆంక్షల మధ్య అనుమతులిచ్చింది. దీంతో దీనిని సూమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు కేంద్రం, యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. -
ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం
-
ముక్తేశ్వర ఘాట్‌లో మద్యపానం : వీడియో వైరల్
లక్నో: గంగానది ఒడ్డున దేవాలయ పరిసరాల్లో కొందరు యాత్రికులు అర్థనగ్నంగా మద్యం సేవిస్తున్న వీడియో వైరలవుతోంది. వీరు కన్వర్ యాత్రికులుగా భావిస్తున్నారు. వివరాల్లోకెళితే.. గంగా నది ప్రవహిస్తున్న ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో నదీముఖంగా ఉన్న శివాలయాలను దర్శించడానికి ఈ రోజుల్లో యాత్రికులు దేశం నలుమూలల నుంచి వస్తారు. దీనినే కన్వర్ యాత్ర అంటారు. ఈ నేపథ్యంలో కొందరు యాత్రికులు యూపీలోని హాపూర్‌లో గల ముక్తేశ్వర్ ఘాట్‌లో మద్యం సేవిస్తున్న వీడియో బయటపడింది. హిందువులు పవిత్రంగా భావించే ఇలాంటి ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషిద్ధం. అంతేకాక నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంపై హాపూర్ ఎసిపి సర్వేశ్ మిశ్రా ఎఎన్ఐతో మాట్లాడుతూ.. ప్రజలు పవిత్రంగా భావించే ప్రదేశాల్లో ఇలా చేయడం చట్టరీత్యా నేరం. వీడియోలో ఉన్న వ్యక్తులను ఇప్పటికే గుర్తించాం. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
కన్వార్ యాత్రలో బంగారం బాబా
-
నడిచొచ్చే బంగారం ఈ బాబా
లక్నో: సుధీర్ మక్కర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ ‘గోల్డెన్ బాబా’ అనగానే టక్కున గుర్తుకు వస్తాడు. గత కొన్నేళ్లుగా కన్వార్ యాత్రలో ఈ గోల్డెన్ బాబా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ గోల్డెన్ బాబాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ సందర్భంగా బాబా మాట్లాడుతూ.. ‘ఇది నా 26వ కన్వార్ యాత్ర. గత ఏడాదితో 25 కన్వార్ యాత్రలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గత ఏడాది మేం సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా జరుపుకున్నాం. ఈ ఏడాది జూలై 21న కన్వార్ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభించాం. అయితే తొలుత ఈ ఏడాది కన్వార్ యాత్రకు దూరంగా ఉందామనుకున్నాను. కానీ నా అనుచరులు, అభిమానులు ఒత్తిడి చేయడంతో సరేనని ఒప్పుకున్నాను. పరమ శివుని అనుగ్రహంతో ఈ ఏడాది కూడా విజయవంతంగా కన్వార్ యాత్ర పూర్తి చేసుకున్నాను’ అని తెలిపారు. ‘ఇక నా ఒంటి మీద ఉన్న బంగారం నాకు ప్రత్యేక గుర్తింపు ఇస్తుందనడంలో సందేహం లేదు. బంగారం ధరించడం అంటే నాకు చాలా ఇష్టం. తొలుత 2-3గ్రాముల బంగారం ధరించేవాడిని. రాను రాను దాని బరువు పెంచుతూ పోయాను. ఈ ఏడాది 16కిలోల బంగారం ధరించి వచ్చాను. గతేడాదితో పోలిస్తే.. ఈ సారి 4కిలోల బంగారం తక్కువ ధరించాను. అయితే ఈ బంగారం అంతా నేను సొంతంగా సంపాదించుకున్నదే. ఎవరి దగ్గరి నుంచి విరాళాలు, డబ్బు స్వీకరించి కొన్న బంగారం కాదు’ అన్నారు. ఈ బాబా ధరించే ఆభరణాల్లో గొలుసులు, దేవతల లాకెట్లు, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఉంటాయి. ప్రతి ఏడాది 250-300మంది అనుచరులతో బాబా కన్వార్ యాత్రలో పాల్గొంటారు. వారందరికి అవసరమైన ఆహారం, నీరు, అత్యవసర మందులతో పాటు సొంత అంబులెన్స్‌ను కూడా ఆయనే సమకూర్చుకుంటారు. -
అంతటి కోపం కన్వారీలకు ఎందుకు?
సాక్షి, న్యూఢిల్లీ : స్వరం మారుతోంది. వారి తీరు మారుతోంది. ఒకప్పుడు సాధుశీలురైన కన్వారీలు (శివభక్తులు) ఆధ్యాత్మిక చింతనతో ముఖాలపై చిద్విలాసం చెదరకుండా, పరిసరాలను అంతగా పట్టించుకోకుండా తమ మానాన తాము వెళ్లేవారు. ఇప్పుడు వారిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఆధ్యాత్మిక చింతనేమోగానీ ముఖాన చిటపటలు కనిపిస్తున్నాయి. వారిలో అసహనం పెరిగిపోతోంది. తమ బాటకు అడ్డొచ్చిన వారిపై చేయి చేసుకుంటున్నారు, చితక బాదుతున్నారు. బుధవారం పశ్చిమ ఢిల్లీలోని మోతీనగర్‌లో కారు నడుపుతున్న ఓ మహిళను అడ్డగించి ఆమె భర్తపై చేయి చేసుకున్నారు. కారును ధ్వంసం చేశారు. ఓ సైక్లిస్టును చితక బాదారు. ఆ మరునాడు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్ షహర్లో ఓ అత్యవసర పోలీసు వాహనాన్నే ధ్వంసం చేశారు. పోలీసులను తరిమికొట్టారు. దీనికంతటికి కారణం తాము ఓ యాత్రగా వెళుతున్నప్పుడు తమను గౌరవించి సాదరంగా దారివ్వలేదనే కోపం, ఆక్రోశం కావచ్చు. ఢిల్లీలో తాము రోడ్డు దాటుతుంటే కారును వేగంగా నడిపిందన్న కారణంగా, తమ యాత్రికుల మధ్యకు సైక్లిస్టు వచ్చారన్న కారణంగా, ఉత్తరప్రదేశ్‌లో తమను అతిక్రమించి ముందుకు దూసుకెళుతుందన్న కారణంగా కన్వారీలు ఈ దాడులకు దిగారు. కొన్ని చోట్ల వారు మామూలు కర్రలతో కనిపించగా, కొన్ని చోట్ల క్రికెట్ బ్యాట్లతోని, సుత్తెలతోని దౌర్జన్యానికి దిగుతూ వీడియోల్లో కనిపించారు. యూపీలో పోలీసు వ్యాన్‌పై దాడి చేయడానికి ముందు ఆ రాష్ట్ర అడిషనల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ ప్రత్యేక హెలికాప్టర్ మీది నుంచి కన్వారీలపై సాదర స్వాగతంలా పూరెమ్మలు కురిపించారు. అలా చేసినా, పోలీసుల వ్యాన్‌పైనే కన్వారీలు ఎందుకు దాడి చేశారని ప్రశ్నించగా, రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగితే సర్ది చెప్పడానికి వెళ్లినప్పుడు దాడి జరిగిందంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. నేడు హిందువులకు ప్రమాదం పొంచి ఉందంటూ అసందర్భంగా మాట్లాడారు. గత నాలుగు సంవత్సరాల నుంచే కన్వారీలు ఇలా దౌర్జన్యానికి దిగుతున్నారని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. నిందితులపై కేసులు దాఖలైన దాఖలాలు లేవు. ఢిల్లీలో మాత్రం బుధవారం కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని విడుదల చేసినట్లు తెల్సింది. ఇంతకు కన్వారీలు ఎవరు? కావడి కుండలను మోయడం వల్ల వారికి ఆ పేరు వచ్చింది. శివభక్తులైన వీరు ప్రతి శ్రావణ మాసంలో (తెలుగు క్యాలెండర్ ప్రకారం ఐదవ నెల, ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం జూలై–ఆగస్టు) ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రి పుణ్యక్షేత్రాలను, బీహార్‌లోని సుల్తాన్ గంజ్‌ని సందర్శించి అక్కడ గంగా జలాలను తీసుకొని తమ ఊర్లకు వచ్చి ఊరిలోని శివలింగానికి అభిషేకం చేస్తారు. గంగా జలాల కోసం వారు ఇంటి నుంచి ఇరువైపుల కుండలు కలిగిన కావడిని తీసుకొని చెప్పులు లేకుండా నగ్న పాదాలతో వెళతారు. 1980లో ఈ యాత్ర పూర్తిగా సాధువులు, సన్యాసులకే పరిమితం అయింది. వారు నిష్టంగా తమ ఊరి నుంచి గంగా జలం వరకు, అక్కడి నుంచి మళ్లీ ఊరి వరకు కాలి నడకన కావడి కుండలను మోసుకొచ్చేవారు. ద్విచక్ర వాహనాలపై జాతీయ జెండాలతో కన్వారీలు కాలక్రమంలో కాషాయ వస్త్రాలు ధరించిన యువకులు కూడా ఈ యాత్రలో పాల్గొనడం మొదలయింది. వారిలో కొందరు సాధారణ దుస్తులు వేసుకొని కూడా యాత్రలో పాల్గొంటున్నారు. మరి కొందరు వాహనాలపై కూడా వెళుతున్నారు, వస్తున్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో యాత్రలో యువకులు పాల్గొనడం ఎక్కువైంది. ఇప్పుడు ఇంకొందరు తమ వాహనాలకు జాతీయ జెండాలను కట్టుకొని ‘భారత మాతా జిందాబాద్’ అని నినాదాలిస్తూ వెళుతున్నారు. 1980లో ఏటా దాదాపు ఓ లక్ష మంది సాధువులు ఈ యాత్రలో పొల్గొంటే గతేడాది 14 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారని అధికారిక లెక్కలే తెలియజేస్తున్నాయి. వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. వారి కోపానికి కారణాలేమిటీ? యాత్రలో యువకులు పాల్గొనడం, వారిలో సహజ సిద్ధంగానే కోపోద్రేకాలు ఎక్కువ ఉండడం ఓ కారణమైతే, పెళ్లాం, పిల్లలను వదిలేసి రావడం, మహిళా భక్తులకు ప్రమేయం లేని యాత్ర అవడం వల్ల కూడా వారిలో ఒకలాంటి విసుగు ఎక్కువ అవుతుందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. తాము ఇంతటి భక్తులమైనప్పటికీ తమను గౌరవించి దారి ఇవ్వాల్సిన ప్రజలు పట్టించుకోవడం లేదన్న అహంభావం కూడా కారణమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు వ్యాఖ్యానించారు. నిజమైన భక్తి లేకుండా భక్తిని ప్రదర్శించుకోవడానికి మాత్రమే కొంత మంది యువకులు యాత్రలో పాల్గొంటుండం వల్ల, ఆరెస్సెస్ శక్తులు ప్రవేశించడం వల్లనే దౌర్జన్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మార్క్సిస్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి మాత్రమే కన్వారీలు ఈ యాత్రలు నిర్వహిస్తున్నారు.