లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టకోవాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
తాజాగా కేంద్ర మంత్రి, ఎన్డీయే మిత్రపక్షం రాష్ట్రీయా లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) చీఫ్ నేత జయంత్ చౌదరీ ఈ వ్యవహారంపై స్పందించారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలా అనిపిస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్డీయే మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి ఇలా వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.
‘‘ కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాదుల పేర్లబోర్డులు స్పష్టంగా కనిపించేలా పెట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వటం సరికాదు. ఇది పూర్తిగా ఆలోచించి, సహేతుకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏ నిర్ణయమైనా సమజ శ్రేయస్సు, సామరస్య భావానికి హాని కలిగించదు. కన్వర్ యాత్ర చేపట్టేవారు.. వారికి సేవచేవారు అందరూ ఒక్కటే. ఇటువంటి సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది.
కన్వర్ యాత్ర చేపట్టినవారికి సేవ చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సేవ చేసేవారిని మతం,కులం ఆధారంగా ఎవరూ గుర్తించరు. ప్రభుత్వం ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవటం లేదా వాటి అమలుపై తప్పనిసరి చేయటంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది’’ అని అన్నారు.
శనివారం యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ మిత్రపక్షనేత, కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ సమర్థించారు. ఇతర పార్టీల అభిప్రాయల గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. కానీ, యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment