Jayant Chaudhary
-
కన్వర్ యాత్ర నేమ్‌ప్లేట్ వ్యవహారం.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
లక్నో: కన్వర్ యాత్ర మార్గంలో ఉన్న దుకాణాల యజమానులు తమ పేర్లు కనిపించేలా బోర్డులు పెట్టకోవాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం రాజకీయంగా దుమారం రేపుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి, ఎన్డీయే మిత్రపక్షం రాష్ట్రీయా లోక్‌దళ్ (ఆర్ఎల్డీ) చీఫ్ నేత జయంత్ చౌదరీ ఈ వ్యవహారంపై స్పందించారు. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయంలా అనిపిస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్డీయే మిత్రపక్షం నేత, కేంద్రమంత్రి ఇలా వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా మారింది.‘‘ కన్వర్ యాత్ర మార్గంలో దుకాణాదుల పేర్లబోర్డులు స్పష్టంగా కనిపించేలా పెట్టుకోవాలని ఆదేశాలు ఇవ్వటం సరికాదు. ఇది పూర్తిగా ఆలోచించి, సహేతుకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఏ నిర్ణయమైనా సమజ శ్రేయస్సు, సామరస్య భావానికి హాని కలిగించదు. కన్వర్ యాత్ర చేపట్టేవారు.. వారికి సేవచేవారు అందరూ ఒక్కటే. ఇటువంటి సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తోంది. కన్వర్ యాత్ర చేపట్టినవారికి సేవ చేసేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సేవ చేసేవారిని మతం,కులం ఆధారంగా ఎవరూ గుర్తించరు. ప్రభుత్వం ఈ ఆదేశాలు వెనక్కి తీసుకోవటం లేదా వాటి అమలుపై తప్పనిసరి చేయటంపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకా సమయం ఉంది’’ అని అన్నారు.శనివారం యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ మిత్రపక్షనేత, కేంద్రమంత్రి జితన్ రామ్ మాంఝీ సమర్థించారు. ఇతర పార్టీల అభిప్రాయల గురించి తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను. కానీ, యూపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదని పేర్కొన్నారు. -
వేదికపై చోటు దక్కని ఆర్ఎల్డీ
న్యూఢిల్లీ: పాత పార్లమెంట్(సంవిధాన్ సదన్)లో శుక్రవారం ఎన్డీఏ భేటీ సందర్భంగా రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) చీఫ్ జయంత్ చౌదరిని వేదికపైకి ఆహా్వనించకుండా ఎంపీల మధ్య కూర్చోబెట్టి బీజేపీ అవమానించిందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టలు ఆరోపించాయి. ‘‘ ఒక్క సీటు సాధించిన పారీ్టలకూ వేదికపై బీజేపీ చోటిచి్చంది. ఇద్దరు ఎంపీలున్న ఆర్ఎల్డీని పట్టించుకోలేదు. ఆత్మాభిమానముంటే వెంటనే ఎన్డీఏను వీడండి. మిమ్మల్ని అవమానిస్తే సహించకండి’ అని జయంత్‌కు ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ హితవు పలికారు. కుర్చీలను బట్టి గౌరవం మారదని, అదేమంత పెద్ద విషయం కాదని ఆర్ఎల్డీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ బదులిచ్చారు. -
అందుకే రాజీనామా చేశాను.. ఆర్ఎల్డీ కీలక నేత ట్వీట్ వైరల్
న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాలా పార్టీలు ముందడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జయంత్ చౌధరి సారధ్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు 'షాహిద్ సిద్ధిఖి' పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అయన పదవికి రాజీనామా చేశారు. సిద్ధిఖి తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. ఇందులో భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతున్న సమయంలో చూస్తూ మౌనంగా ఉండలేను. అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆదివారం పార్టీ జాతీయ అధ్యక్షులు జయంత్ చౌదరికి పంపినట్లు వెల్లడించారు. జయంత్ చౌదరిని ఉద్దేశించి.. మేము 6 సంవత్సరాలు కలిసి పని చేసాము, ఒకరినొకరు గౌరవించుకున్నాము. నేను.. నిన్ను సహోద్యోగి కంటే కూడా తమ్ముడిగానే భావించాను. ముఖ్యమైన సమస్యలను సోదరభావంతో పరిష్కరించుకున్నాము. మీ దివంగత తాత, భారత రత్న చరణ్ సింగ్, మీ దివంగత తండ్రి అజిత్ సింగ్ అందరూ కూడా పార్టీ విలువల కోసం నిలబడ్డారు అని షాహిద్ సిద్ధిఖి అన్నారు. లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జరగనున్నాయి. గరిష్టంగా 80 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలతో, ఆర్ఎల్డీ, ఎస్బీఎస్పీ, అప్నా దళ్ (ఎస్), నిషాద్ పార్టీ వంటి వాటిని కలుపుకొని బీజేపీ బలమైన కూటమికి నాయకత్వం వహిస్తోంది. Respected Jayantji, We have worked together for 6 long years and have respect for each other. I, for one, look upon you more as a younger brother than a colleague. We have stood shoulder to shoulder on significant issues and at creating an atmosphere of brotherhood and respect… — shahid siddiqui (@shahid_siddiqui) April 1, 2024 -
RLD chief Jayant Choudhary: ఎన్డీఏలోకి ఆరెల్డీ
లఖ్నో: చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్సింగ్ అన్నారు. ‘దిల్ జీత్ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్‌పత్, బిజ్నోర్ లోక్‌సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్ నిర్ణయంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. -
మీకేమైనా డౌటా..? ఇండియా కూటమికి ఇంకో షాక్
లక్నో: రాష్ట్రీయా లోక్ దళ్ పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి చేరుతారని ప్రచారం జరుగుతన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్న పురస్కారాలు ఆర్ఎల్డీ పార్టీ బీజేపీలో చేరిందనడానికి బలం చేకూర్చాయి కూడా. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీనరసింహారావు, చౌదరీ చరణ్ సింగ్‌తో పాటు వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథ్కు భారత రత్న ప్రకటించింది. అయితే చరణ్ సింగ్.. మనవడే ప్రస్తుత ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరీ. తన తాతకు భారత రత్న ప్రకటించటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమిలో చేరికకు సంబంధించిన ప్రచారాన్ని ధ్రువీకరించారు. గత ప్రభుత్వాలు చాలా ఏళ్ల నుంచి చేయని పనిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో ఈ రోజు మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారత రత్న ప్రకటించారని ఆనందం వ్యక్తంచేశారు. వెలుగులోకి రాని వ్యక్తులకు ప్రధాన స్రవంతిలోకి తీసువచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇదే సమయంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరుతారన్న ప్రశ్నకు... ‘మీకేమైనా అనుమానం ఉందా? నేను ఈ రోజు ఎలా తిరస్కరించగలను’ అని అన్నారు. దీంతో జయంత్ చౌదరీ ఎన్డీయే కూటమి చేరిపోతారని సంకేతాలు అందించినట్లు అయింది. సామాజ్‌వాదీ పార్టీకి మిత్ర పక్షంగా ఉన్న ఆర్ఎల్డీ.. బీజేపీ ఎన్డీయే కూటమిలో చేరుతుందని తెగప్రచారం జరగుతున్న నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ గురువారం మీడియాతో మాట్లాడారు. పార్టీలను ఎలా విడగొట్టాలో బీజేపీకి బాగా తెలుసని, ప్రత్యర్థులపై ఎలా దాడి చేయాలో కూడా బీజేపీ తెలుసని మండిపడ్డారు. పార్టీల్లో, నాయకల్లో చీలికలు తీసుకురావడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు అయిన ఈడీ, సీబీఐ, ఐటీను ఎలా వాడుకోవాలో బీజేపీ వాళ్లకు తెలుసని ఆరోపంచారు. ఎలా మోసం చేయాలో మొన్నటి చంఢీఘర్ మేయర్ ఎన్నికల పోలింగ్‌తో అర్థం అవుతుందని అన్నారు. ఎవరిని ఎలా కొనుగోలు చేయాలో కూడా బాగా తెలుసని.. విధానాల్లోనే బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తోందని ధ్వజమెత్తారు. గత 2019లో లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎస్పీ, బీఎస్పీ కూటమిలో భాగంగా ఆర్ఎల్డీ బరిలోకి దిగినప్పటికీ పోటీ చేసిన మూడు స్థానాల్లో (మథుర, బాగ్పట్, ముజఫర్ నగర్) ఓటమి పాలుకావటం గమనార్హం. జాట్ వర్గంలో ఆర్ఎల్డీకి మంచిపట్టు ఉండటం విశేషం. చదవండి: భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..! -
ఆసక్తికర దృశ్యం: సలాం.. రామ్ రామ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పరస్పర అభివాద సన్నివేశం గురువారం ఆవిష్కృతమైంది. బులంద్‌శహర్‌లో జయంత్ చౌదరితో కలిసి అఖిలేశ్ ప్రచారం నిర్వహిస్తుండగా... ప్రియాంక కూడా తన వాహనశ్రేణితో అటువైపు వచ్చారు. దీంతో ముగ్గురు నేతలు పరస్పరం అభివాదం చేసుకున్నారు. అక్కడే ఉన్న సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు జెండాలు ఊపుతూ ఆనందోత్సాహాలతో ఈలలు వేశారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోను అఖిలేశ్.. వీడియోను ప్రియాంక ట్విటర్లో షేర్ చేశారు. एक दुआ-सलाम ~ तहज़ीब के नाम pic.twitter.com/dutvvEkz5W — Akhilesh Yadav (@yadavakhilesh) February 3, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తోంది. రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ)తో కలిసి సమాజ్‌వాదీ పార్టీ బరిలోకి దిగింది. అధికార బీజేపీకి, ఈ కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మొత్తం తన భుజాన వేసుకుని ప్రియాంక గాంధీ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్, ప్రియాంక ప్రధానంగా బీజేపీ లక్ష్యంగా చేసుకున్నారు. (క్లిక్: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం) हमारी भी आपको राम राम @jayantrld @yadavakhilesh pic.twitter.com/RyUmXS4Z8B — Priyanka Gandhi Vadra (@priyankagandhi) February 3, 2022 అయితే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల కూటమి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఏడింటిని మాత్రమే గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 47 సీట్లతో సరిపెట్టుకుంది. 2012లో అఖిలేశ్ పార్టీ 224 సీట్లు సాధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని అఖిలేశ్ యాదవ్ ముందుగానే ప్రకటించారు. (క్లిక్: ఉత్తరప్రదేశ్‌లో తరతరాలుగా వీరిదే అధికారం!)