లఖ్నో: చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్‌సింగ్ అన్నారు. ‘దిల్ జీత్ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు.
‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్‌పత్, బిజ్నోర్ లోక్‌సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్ నిర్ణయంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment