alliance with BJP
-
పెద్ద శాఖలు ఇవ్వలేం!
న్యూఢిల్లీ: ఎన్డీఏ నేతగా నరేంద్ర మోదీని ఎన్నుకున్న తర్వాత మంత్రివర్గ కూర్పుపై బీజేపీ దృష్టిసారించింది. మిత్రపక్షాల నుంచి కీలకశాఖలు కావాలనే డిమాండ్లు వచి్చన నేపథ్యంలో గురువారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఇతర సీనియర్ నేతలు సమావేశమయ్యారు. ప్రాథమికంగా జరిగిన చర్చల్లో కీలకమైన రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల శాఖలను తమ వద్దే అట్టిపెట్టుకోవాలని బీజేపీ నేతల నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీజేపీకి సొంతంగా 240 సీట్లు (ఎన్డీఏకు 293) మాత్రమే వచి్చనందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ (16 సీట్లు), జేడీయూ (12 సీట్లూ)లపై పూర్తిగా ఆధారాపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పారీ్టలు నలుగురు ఎంపీలకు ఒక కేబినెట్ మంత్రి పదవిని అడుగుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన టీడీపీకి నాలుగు, జేడీయూకు మూడు కేబినెట్ బెర్తులు ఇవ్వాల్సి ఉంటుంది. టీడీపీ స్పీకర్ పదవిని కూడా అడుగుతోంది. ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను కూడా కోరుతోంది. ఏడుగురు ఏంపీలున్న శివసేన (షిండే), ఐదుగురు ఎంపీలున్న ఎల్జేపీ (ఆర్వీ) కూడా రెండేసి మంత్రిపదవులు అడుగుతున్నాయి. గత రెండు ప్రభుత్వాల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును దాటినందువల్ల మిత్రపక్షాలకు ముఖ్యమైన శాఖలు దక్కలేదు. ఎంపీల సంఖ్య ఆధారంగా మంత్రిపదవులు కేటాయించాల్సిన పరిస్థితిని ప్రస్తుతం బీజేపీ ఎదుర్కొంటోంది. కాబట్టి ఈసారి మిత్రపక్షాలకు మరింత ఎక్కువగా మంత్రిపదవులు దక్కనున్నాయి. మిత్రపక్షాల నుంచి ఎంత ఒత్తిళ్లు వచి్చనా అత్యంత కీలకమైన శాఖలపై బీజేపీ రాజీపడకపోవచ్చని సమాచారం. రక్షణ, ఆర్థిక, హోంశాఖ, విదేశీ వ్యవహారాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధితో ముడిపడిన శాఖలను కూడా తమ వద్దే ఉంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అలాగే సంక్షేమం, యువజన వ్యవహారాలు, వ్యవసాయం తదితర శాఖలను అంత సులువుగా వదులుకునేలా లేదు. పేదలు, మహిళలు, యువకులు, రైతుల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఈ శాఖలను తామే ఉంచుకోవాలని బీజేపీ ఆశిస్తోంది. రైల్వేలు, రహదారుల విషయంలోనూ గడిచిన పదేళ్లలో తాము భారీ సంస్కరణలు తెచ్చామని.. ఈ వేగం మందగించకూడదంటే ఈ శాఖలు తమ వద్దే ఉండాలని పేర్కొంటోంది. సంకీర్ణ ప్రభుత్వాల్లో రైల్వే శాఖ సాధారణంగా మిత్రపక్షాల చేతుల్లో ఉంటూ వచి్చంది. కానీ బీజేపీ గట్టి ప్రయత్నంలో రైల్వే శాఖను తమ ఆ«దీనంలోకి తెచ్చుకుంది. జేడీయూకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ఇచ్చేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. భారీ పరిశ్రమల శాఖను ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు ఆఫర్ చేస్తోంది. అయితే ఆర్థిక, రక్షణ తదితర కీలకశాఖల్లో మిత్రపక్షాలకు సహాయమంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉందని చర్చలకు సంబంధించిన విషయాలపై సమాచారం ఉన్న విశ్వసనీయవర్గాలు తెలిపాయి. పర్యాటక, ఎంఎస్ఎంఈ, నైపుణ్యాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, సామాజిక న్యాయ శాఖలను మిత్రపక్షాలకు ఇచ్చే అవకాశముందని సమాచారం. చంద్రబాబు నాయుడు లోక్‌సభ స్పీకర్ పదవిపై పట్టుబడితే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వజూపి ఆయన్ను ఒప్పించే ప్రయత్నం చేయవచ్చునంటున్నారు. బీజేపీ సంఖ్యాబలం లేనందున టీడీపీ, జేడీయూలు తమ డిమాండ్లపై పట్టుబడితే.. బీజేపీ ఎంతవరకు తలొగ్గుతుంది, ఎలా బుజ్జగిస్తుందనేది చూడాలి. -
రెండో రోజూ మార్కెట్ ర్యాలీ
ముంబై: అనిశి్చతికి తెరదించుతూ మూడోసారి బీజేపీ కూటమి అధికారాన్ని చేపట్టనుండటంతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల దౌడు తీశాయి. సెన్సెక్స్ 692 పాయింట్లు జంప్‌చేసింది. 75,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 75,075 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 201 పాయింట్లు ఎగసి 22,821 వద్ద నిలిచింది. తొలుత ఒక దశలో గరిష్టంగా సెన్సెక్స్ 75,298కు చేరగా.. నిఫ్టీ 22,910ను తాకింది. వెరసి సెన్సెక్స్ 915 పాయింట్లు, నిఫ్టీ 290 పాయింట్లు చొప్పున దూసుకెళ్లాయి. దీంతో బీజేపీకి మెజారిటీ లభించకపోవడంతో మంగళవారం నమోదైన రూ. 31 లక్షల కోట్ల మార్కెట్ విలువ నష్టంలో చాలావరకూ రికవరైంది. గత రెండు రోజుల్లో బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 21 లక్షల కోట్లకుపైగా బలపడింది. ఫలి తంగా బీఎస్ఈ మార్కెట్ క్యాప్ దాదాపు రూ. 416 లక్షల కోట్లకు(4.98 ట్రిలియన్ డాలర్లు) చేరింది. నేటి ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై దృష్టినేడు(శుక్రవారం) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో ఇకపై ఇన్వెస్టర్ల దృష్టి వడ్డీ రేట్లవైపు మళ్లనున్నట్లు మార్కెట్ నిపుణులు వివరించారు. కాగా.. రియలీ్ట, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, ఆయిల్, మెటల్ రంగాలు 5–1.5 శాతం మధ్య లాభపడ్డాయి. మరోవైపు హిందాల్కో, హీరోమోటో కార్ప్, ఏషియన్ పెయింట్స్, ఎంఅండ్ఎం, నెస్లే, ఇండస్ఇండ్, సిప్లా, బ్రిటానియా 2.4–1% మధ్య నీరసించాయి.కాగా, బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 2,981 లాభపడితే.. కేవలం 878 నష్టపోయాయి. నగదు విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరోసారి అమ్మకాలకే ప్రాధాన్యమిచ్చారు. రూ. 6,868 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. దేశీ ఫండ్స్ మాత్రం రూ. 3,718 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. గత 2 రోజుల్లో ఎఫ్‌పీఐలు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసు కున్నారు.బీహెచ్ఈఎల్ 9% జంప్ అదానీ పవర్ రూ. 3,500 కోట్ల భారీ ఆర్డర్ నేపథ్యంలో బీహెచ్ఈఎల్ షేరు తాజాగా 9 శాతం జంప్‌చేసింది. రూ. 278 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 15% దూసుకెళ్లి రూ. 292ను అధిగమించింది. మార్కెట్ విలువ రూ. 7,974 కోట్లు బలపడి రూ. 96,854 కోట్లకు చేరింది. అదానీ షేర్లు జూమ్ వరుసగా రెండో రోజు అదానీ గ్రూప్ కౌంటర్లకు డిమాండ్ నెలకొంది. గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీలలో అదానీ పోర్ట్స్ స్వల్ప వెనకడుగు వేయగా.. ఎనర్జీ సొల్యూషన్స్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ, పవర్, విల్మర్, ఏసీసీ, ఎంటర్ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, అంబుజా 5– 2 శాతం మధ్య ఎగశాయి. గ్రూప్ మార్కెట్ విలువ రూ. 17 లక్షల కోట్లను అధి గమించింది. -
బీజేపీతో పొత్తు డౌటేనా?.. నేడు ఢిల్లీకి బాబు, పవన్
సాక్షి, ఢిల్లీ: బీజేపీ, టీడీపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం గందరగోళం మారింది. నిన్న అర్థరాత్రి బీజేపీ హైకమాండ్‌తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురంధేశ్వరి.. ఈరోజు మరోసారి హై కమాండ్‌తో సమావేశమవుతామని వెల్లడించారు. ఇక, ఆమె వ్యాఖ్యలతో టీడీపీ-బీజేపీ పొత్తుపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, టీడీపీ మాత్రం మరో విధంగా వ్యవహరిస్తోంది. బీజేపీతో పొత్తులో భాగంగా ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ లీకులు ఇస్తోంది. అటు బీజేపీ మాత్రం.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను బీజేపీ తయారు చేస్తుంది. ఈ క్రమంలో నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అర కొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే తప్ప, బీజేపీకి లాభం చేసేందుకు టీడీపీ పొత్తు పెట్టుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. కాగా, చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. ఇక, టీడీపీని బీజేపీ చీదరించుకుంటున్నా చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. బీజేపీని చంద్రబాబు, పవన్ బతిమాలే పరిస్థితికి వచ్చారు. మరోవైపు, చంద్రబాబును ఢిల్లీకి బీజేపీ ఆహ్వానించిందంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చుతోంది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చారు. -
RLD chief Jayant Choudhary: ఎన్డీఏలోకి ఆరెల్డీ
లఖ్నో: చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్సింగ్ అన్నారు. ‘దిల్ జీత్ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్‌పత్, బిజ్నోర్ లోక్‌సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్ నిర్ణయంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి షాక్ తగిలింది. -
పొత్తులకు బీజేపీ సిద్ధమే: మోదీ
చెన్నై: తమిళనాడులోని రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనీ, పాత మిత్రులను తాము గుర్తుపెట్టుకున్నామని ప్రధాని మోదీ గురువారం అన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఎదురుచూస్తోందని మోదీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. అరక్కోణం, కడలూరు, కృష్ణగిరి, ఈరోడ్, ధర్మపురి జిల్లాల బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే, డీఎంకే లేదా రజినీకాంత్ పెట్టే పార్టీల్లో దేనితో పొత్తు పెట్టుకుంటుందని ఓ కార్యకర్త అడగ్గా, ‘వాజ్‌పేయి 1990ల్లో విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు. ఇప్పుడు కూడా మిత్రుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని సమాధానమిచ్చారు. ‘ప్రాంతీయ పార్టీలకు, ఆకాంక్షలకు అటల్జీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ వెళ్తోంది. వాజ్‌పేయి ఏం చేశారో దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్ చేసింది. అధికారంలో ఉండేందుకు తమకు ఒక్కరికే హక్కు ఉందని ఆ పార్టీ భావించింది’ అని విమర్శించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులోని ఐదు చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. 39 స్థానాల్లోనూ పోటీ చేయగా ఈ కూటమి రెండే సీట్లు (బీజేపీ, పీఎంకే చెరొకటి) గెలిచింది. తర్వాత ఈ 5 పార్టీలూ బీజేపీతో తమ సంబంధాలను తెంచుకున్నాయి. -
బీజేపీతో పొత్తుపై బాబు అప్పుడలా.. ఇప్పుడిలా..
-
పొత్తులు... ఎత్తులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: శాసనసభ ముందస్తు ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ పన్నిన రాజకీయ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు విపక్ష పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీయేతర పక్షాలు ఏకమై మహాకూటమిగా పోటీ చేయాలనే యోచనతో కసరత్తు సాగిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే విషయాన్ని ఖరారు చేయనుండగా, జిల్లాల్లో ఏ పార్టీ ఏ నియోజకవర్గం నుంచి బరిలో నిలవనుందనే అంశాలపై ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్‌తో పాటు తెలుగుదేశం, టీజేఎస్, సీపీఐ పార్టీలు తమకు బలమున్న నియోజకవర్గాల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశాయి. అయితే కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలు ఒక్కో సీటు నుంచి పోటీ చేయడమే గగనంగా మారిన పరిస్థితుల్లో బలమున్న సీట్లను కూడా స్క్రూటినీ చేసినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పొత్తుల చర్చలు రాష్ట్ర స్థాయిలో జరుగనున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఏయే సీట్లలో ఏ పార్టీ పోటీ చేస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది. మిత్ర పక్షాలకు రెండు లేదా మూడు.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషించనుంది. ఒకప్పుడు జిల్లాను శాసించిన తెలుగుదేశం ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక్కసీటు నుంచైనా పోటీ చేసి విజయం సాధించాలనే ఆలోచనతో ఉంది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఈ జిల్లా నుంచి పోటీ చేస్తారని భావించినా, మీమాంస నెలకొంది. వామపక్ష భావాలు అధికంగా ఉన్న ఉమ్మడి జిల్లాలో సీపీఐ కూడా తప్పనిసరిగా ఓ సీటు నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉంది. అదే సమయంలో ఉమ్మడి జిల్లాలోని పది సీట్లలో టికెట్ల కోసం కాంగ్రెస్ నేతల మధ్యనే తీవ్ర పోటీ నెలకొని ఉండడం గమనార్హం. మంచిర్యాల కోరుతున్న సీపీఐ... ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మూడుసార్లు గెలిచిన సీపీఐ 2009లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత కొత్తగా ఏర్పాటైన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి తరుపున మరోసారి విజయం సాధించింది. ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి సీపీఐ తరుపున పోటీ చేసి గెలిచిన నాయకుడు గుండా మల్లేష్ ఒక్కరే. 2014లో ఆయన దుర్గం చిన్నయ్య చేతిలో 50వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బెల్లంపల్లిలో పార్టీ బలహీనపడిందనే కారణంతో సీపీఐ ఈసారి మంచిర్యాల మీద కన్నేసింది. ఈ మేరకు పొత్తుల్లో భాగంగా పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల జాబితాను తయారు చేసిన సీపీఐ రాష్ట్ర కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాలను ఎంపిక చేసింది. మంచిర్యాల జిల్లా పార్టీ కార్యదర్శి కలవేన శంకర్‌ను అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలిసింది. విద్యార్థి నాయకుడి నుంచి జిల్లా కార్యదర్శిగా ఎదిగిన శంకర్ ఈసారి పార్టీ నుంచి పోటీ చేస్తానన్న ధీమాతో ఉన్నారు. కోదండరాం మంచిర్యాల కోరితే... తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల. బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం జోగాపూర్‌కు చెందిన ఆయన వచ్చే ఎన్నికల్లో మంచి ర్యాల నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరిగిం ది. అయితే ఇక్కడ టీజేఎస్ పార్టీ అంతగా వేళ్లూనుకోకపోవడం, సంస్థాగతంగా నాయకులు, కార్యకర్తలు లేక బలహీనంగా ఉండడం వంటి కారణాలతో ఆయన జనగామ లేదా టీజేఏసీ బలంగా ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులే చెపుతున్నారు. అయితే సొంత జిల్లా కాబట్టి కోదండరాం ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావిస్తే మాత్రం కాంగ్రెస్, సీపీఐ కూడా వెనక్కు వెళ్లాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. బెల్లంపల్లిపై టీడీపీ పట్టు తెలుగుదేశం పార్టీలో వెలుగు వెలిగిన నాయకులంతా టీఆర్ఎస్ గూటికి చేరడంతో అనేక నియోజకవర్గాల్లో పేరున్న పార్టీ నాయకుడు లేకుండా పోయాడు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో కార్యకర్తలు తప్ప నాయకులు లేని పరిస్థితి ఉంది. మంచిర్యాల, కుమురంభీం జిల్లాల్లోనే పార్టీ జెండాలు పట్టుకునే నాయకులు అక్కడక్కడ కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు పొడిస్తే... మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి సీటునుæ దక్కించుకోవాలని భావిస్తోం ది. జిల్లా పార్టీ అధ్యక్షుడు శరత్‌బాబు ఇక్కడి నుం చి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు. సిర్పూర్ సీటు కూడా పార్టీ కోరుతున్నప్పటికీ, కాంగ్రెస్ ఆ సీటును వదులుకొనేందుకు సిద్ధంగా లేదు. బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఉండడంతో టీడీపీ ఆ సీటు నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తమ ప్రాధాన్యతా నియోజకవర్గాల జాబితాలో బెల్లంపల్లిని కూడా చేర్చినట్లు సమాచారం. మంచిర్యాలలో కాంగ్రెస్ పటిష్టం మంచిర్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఒకవైపు సీపీఐ, మరోవైపు టీజేఎస్ దృష్టి పెట్టినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం వదులుకునేందు కు సిద్ధంగా లేదు. బలమైన యంత్రాంగం ఉన్న ఈ నియోజకవర్గంలో పోటీకి రెండు దిగ్గజాలు సిద్ధంగా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి టికెట్టు రేసులో ఉన్నారు. కాగా ప్రేంసాగర్‌రావు ఇప్పటికే నియోజకవర్గంలో చీరల పంపిణీ, పేదలకు లబ్ధి చేకూర్చే పలు కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకు వెళుతున్నారు. ప్రేంసాగర్‌రావుతో పాటు అరవింద్‌రెడ్డి కూడా ఎవరికి వారే తమకు టికెట్టు ఖాయమన్న ధీమాతో ఉన్నారు. -
బీజేపీతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు
సాక్షి, టీ.నగర్: అన్నాడీఎంకే, బీజేపీ సంబంధాలపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో కలకలానికి దారితీసింది. భారతీయ జనతా పార్టీతో జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే 1998లో పొత్తు కుదుర్చుకుని గెలుపొందింది. అయితే కొన్ని నెలల్లోనే బీజేపీ కూటమి నుంచి జయలలిత వైదొలగారు. ఆ తర్వాత అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఏర్పడలేదు. జయలలిత 2001, 2011, 2016లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకున్న స్థితిలో బీజేపీ నేతలతో సుముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు. సుమారు 20 ఏళ్లుగా ఆమె నాయకత్వంలోని అన్నాడీఎంకే బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకోలేదు. 2014లో కేంద్రంలో గెలుపొంది ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వర్గంలో అన్నాడీఎంకేకు ముఖ్య స్థానం కల్పిస్తానని తెలిపినప్పటికీ పొత్తుకు జయలలిత అంగీకరించలేదు. అయితే జయలలిత మృతి తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అన్నాడీఎంకే సన్నిహిత సంబంధాలు అధికమయ్యాయి. అన్నాడీఎంకేలో చీలిక, అభిప్రాయభేదాలు ఏర్పడిన స్థితిలో ప్రధాని మోదీ చలవతో ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలు తొలగిపోయాయి. అభిప్రాయభేదాలు: బీజేపీతో కూటమిపై అన్నాడీఎంకే సీనియర్ నేతల మధ్య ఇప్పుడే అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. అన్నాడీఎంకేలో ఒక వర్గం బీజేపీ పొత్తుతోనే గట్టెక్కగలమని భావిస్తున్నారు. అయితే మరో వర్గం ఈ వ్యవహారంలో జయలలిత ఎటువంటి వైఖరి అవలంభించారో దాన్నే కొనసాగించాలంటున్నారు. సహకారశాఖ మంత్రి సెల్లూర్రాజు దీనిగురించి మాట్లాడుతూ.. బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండరాదని జయలలిత ఇదివరకే గట్టి నిర్ణయం తీసుకున్నారని, బీజేపీ మతతత్వ పార్టీ అయినందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీన్నే తాము అనుసరించాలనుకుంటున్నట్టు తెలిపారు. మంత్రి రాజేంద్రబాలాజీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఓటమికి బీజేపీతో సయోధ్యే కారణమని చెప్పలేమని, ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వైఫల్యం అనేది యాక్సిడెంటల్ అని, అది విజయానికి మెట్టుగా మారవచ్చన్నారు. అందువల్ల బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం తప్పుకాదన్నారు. బీజేపీతో కూటమి గురించి మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో గందరగోళం సృష్టించింది. -
బాబోయ్.. బాబు!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘రోజుకో మాట.. పూటకో డ్రామా. ఈ రోజు ఒకటి చెబితే.. రేపు మరొకటి చెబుతున్నారు. నాయకులు, కార్యకర్తలను బాబు చెడుగుడు ఆడుకుంటున్నారు. పార్టీని పూర్తిగా కార్పొరేట్ సంస్థను చేసేశారు. గెలుపు కోసం పాకులాడుతున్నారు.’’ ఈ మాటలన్నది మరెవరో కాదు.. సాక్షాత్తు తెలుగుతమ్ముళ్లే. జిల్లా పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం టీడీపీ నేతలు పలువురు ఇలా ఆవేదన వ్యక్తం చేయడం కనిపించింది. బీజేపీతో పొత్తు వ్యవహారంలో అధినేత తీరుపై శ్రేణులు రగిలిపోతున్నాయి. పొత్తు నుంచి వైదొలుగుతున్నట్లు గురువారం చంద్రబాబు ప్రకటించడంతో కర్నూలు, ఆదోని, నంద్యాల, పాణ్యం, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ తదితర నియోజకవర్గాల్లో బీజేపీ నేతలు నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. కోడుమూరు నుంచి టీడీపీ నాయకులు కూడా పోటీలో నిలవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇంతలో బాబు నిర్ణయం మారడంతో రెండు పార్టీల నేతలు గుర్రుమంటున్నారు. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌కు సైతం బాబు హ్యాండిచ్చారు. అయినప్పటికీ ప్రభాకర్ గురువారం కర్నూలు పార్లమెంట్‌కు నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో తన వర్గీయులను టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో దింపేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయన వర్గీయులు శనివారం నామినేషన్ దాఖలు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు కేఈ ప్రభాకర్‌తో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు.. కేఈ ప్రభాకర్, ఆలూరు ఎమ్మెల్యే నీరజారెడ్డి, మంత్రాలయం మాధవరం రామిరెడ్డి, నందికొట్కూరు విక్టర్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. వీరి చర్చలు ఓ కొలిక్కి వస్తే జై సమైక్యాంధ్ర తరఫున వారంతా నామినేషన్ వేసే అవకాశం ఉంది. లేదంటే కేఈ ప్రభాకర్, విక్టర్, మాధవరం రామిరెడ్డి టీడీపీ రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలవొచ్చని వారి సన్నిహితులు చెబుతున్నారు. గందరగోళంలో తమ్ముళ్లు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన పాపం కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలదేననే విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ నేతలు అష్టకష్టాలు పడుతుండగా.. అధినేత బాబు రోజుకో డ్రామాకు తెరతీస్తుండటంతో జిల్లాలోని తమ్ముళ్లు గందరగోళానికి లోనవుతున్నారు. ‘‘వద్దు వద్దంటున్నా కాంగ్రెస్ నేతలను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకొని టికెట్లు కట్టబెట్టారు.. తొమ్మిదేళ్లు జెండాను మోసిన వారిని పక్కనపెట్టారు.. బీజేపీతో పొత్తు వద్దంటే విన్నారు కాదని’’ శ్రేణులు బాబు తీరుపై గగ్గోలు పెడుతున్నారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం కలిగిన నేత వ్యవహరించే తీరిదేనా అన్న సంశయం టీడీపీ నాయకులకు కలుగుతోంది. తమ పరిస్థితే ఇలా ఉంటే.. ప్రజల ఆలోచన ఎలా ఉంటుందోనని తమ్ముళ్లు మదనపడుతున్నారు. అధినేత తీరు తమ పుట్టి ముంచుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాగే పార్టీ తీరు ఉంటే జనంలో గ్రాఫ్ మరింత దిగజారిపోయే ప్రమాదం ఉందని కలవరపడుతున్నారు. -
బిజెపితో పొత్తుకోసం బాబు తహతహ: బాలినేని
ఒంగోలు: బీజేపీతో పొత్తుకోసం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తహతహలాడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. నిజాయతీగా సమైక్య ఉద్యమం చేస్తున్న వైఎస్ఆర్ సీపీపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోనని ధైర్యంగా ప్రకటించే దమ్ము బాబుకు ఉందా? అని బాలినేని ప్రశ్నించారు. బిజెపితో పొత్తుపెట్టుకొని తెలంగాణలో సీట్లు గెలుసుకోవాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బిజెపి ఆసరాతో నిలబడే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపధ్యంలో బిజెపితో పొత్తుకోసం బాబు ఆరాటపడుతున్నట్లు బాలినేని విమర్శించారు.