సాక్షి, ఢిల్లీ: బీజేపీ, టీడీపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం గందరగోళం మారింది. నిన్న అర్థరాత్రి బీజేపీ హైకమాండ్‌తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు.
పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురంధేశ్వరి.. ఈరోజు మరోసారి హై కమాండ్‌తో సమావేశమవుతామని వెల్లడించారు. ఇక, ఆమె వ్యాఖ్యలతో టీడీపీ-బీజేపీ పొత్తుపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, టీడీపీ మాత్రం మరో విధంగా వ్యవహరిస్తోంది. బీజేపీతో పొత్తులో భాగంగా ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ లీకులు ఇస్తోంది. అటు బీజేపీ మాత్రం.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను బీజేపీ తయారు చేస్తుంది.
ఈ క్రమంలో నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అర కొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కోసమే తప్ప, బీజేపీకి లాభం చేసేందుకు టీడీపీ పొత్తు పెట్టుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. కాగా, చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.
ఇక, టీడీపీని బీజేపీ చీదరించుకుంటున్నా చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. బీజేపీని చంద్రబాబు, పవన్ బతిమాలే పరిస్థితికి వచ్చారు. మరోవైపు, చంద్రబాబును ఢిల్లీకి బీజేపీ ఆహ్వానించిందంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చుతోంది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment