purandeswari
-
అయిపాయే.. చేతులెత్తేసిన చంద్రబాబు! (ఫొటోలు)
-
అమిత్ షా అన్నదొకటి చిన్నమ్మ చెప్పిందొకటి
-
‘చంద్రబాబు విధ్వంసం.. పురందేశ్వరికి కనబడలేదా?’
సాక్షి, తాడేపల్లి: పురందేశ్వరి (Purandeswari) కేవలం చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ(Kottu Satyanarayana) మండిపడ్డారు. మంగళవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, చంద్రబాబు వలన హైందవ ధర్మానికి కల్గిన నష్టాల గురించి ఆమె ఎందుకు మాట్లాడటం లేదంటూ ప్రశ్నించారు.చంద్రబాబు వలన గోదావరి పుష్కరాలలో 29 మంది హిందూ భక్తులు చనిపోయినా ఆమె పట్టించుకోలేదు. విజయవాడలో చంద్రబాబు 50 ఆలయాలను కూల్చేసినా ఆమెకి కనపడలేదు. కానీ వైఎస్ జగన్ పాలనపై మాత్రం అనవసర ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆలయాలను నిర్మించారు. ఆలయాల్లో ఉన్న అర్చకులకు వేతనాలను పెంచారు. అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేసింది కూడా జగనే. వంశపారంపర్య హక్కులను జగన్ తీసుకువచ్చారు’’ అని కొట్టు సత్యనారాయణ వివరించారు.కాణిపాకం, కాళహస్తి, శ్రీశైలం, అమరావతి, ద్రాక్షారామం, కనకదుర్గమ్మ గుడి, సింహాచలం, అరసవిల్లి, శ్రీకూర్మం, వాడపల్లి, అంతర్వేది, అయినవల్లి.. ఇలా అనేక ఆలయాల్లో అభివృద్ధి చేశారు. విజయవాడ గుడికి మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 49 ఆలయాల్లో ఏకకాలంలో కుంభాభిషేకాన్ని జగన్ నిర్వహించారు. కంచి పీఠాధిపతి సైతం దీన్ని మెచ్చుకున్నారు. శ్రీ వాణి ట్రస్టు ద్వారా 3 వేల ఆలయాలను కొత్తగా జగన్ హయాంలో నిర్మించారు. ఇలా చేసిన అనేక మంచి కార్యక్రమాలు పురందేశ్వరికి కనపడలేదు.ఇదీ చదవండి: సీజ్ ద షిప్.. సర్వం లాస్!కేవలం చంద్రబాబు దగ్గర మార్కులు పొందటానికే గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హైందవ శంఖారావంలో రాజకీయాలు మాట్లాడటం పురంధేశ్వరికే చెల్లింది. చంద్రబాబు కోసమే ఆమె పని చేస్తున్నారు. సెక్షన్ 83 ని సవరణ చేసి ఆలయ భూముల లీజులు వసూలు చేయటం, అన్యాక్రాంతమైన భూములను కాపాడారు. ఈ చట్ట సవరణను ఇతర రాష్ట్రాలు సైతం అనుసరించాయి. తిరుమల లడ్డూని అనవసరం వివాదం చేశారు.దీని వలన హిందూ సమాజానికి ఏమైనా మేలు జరిగిందా?. హైందవ శంఖారావంలో పీఠాధిపతులు చెప్పినవన్నీ జగన్ చేసి చూపించారు. దాన్ని కొనసాగేలా ఇప్పటి ప్రభుత్వం చూడాలి. అంతేతప్ప ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు చేయొద్దు’’ అని కొట్టు సత్యనారాయణ హితవు పలికారు. -
పురందేశ్వరి పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
-
పాపుల ఆటకట్టించిన సుప్రీంకోర్టు.. వణికిపోతున్న లడ్డు దొంగలు
-
పల్టీలు కొట్టే.. పరువు పాయే!
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యి వాడారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపడితే, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం సుప్రీంకోర్టును తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టిన తీరు గమనించారా? తాను అర్ధవంతంగా మాట్లాడడం లేదని ఆమెకు తెలుసు. అందుకే కొంత తడబాటుగా, మరికొంత పొడి, పొడిగా మాట్లాడారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సమర్థించడానికి ఆమె తంటాలు పడ్డారు. నిజానికి ఇలాంటి సందర్భాలలో నిజాయితీగా మాట్లాడితే వారి విలువ పెరుగుతుంది. ఎంత మిత్రపక్షమైనా, వారు ఏమి చేసినా సమర్థిచే దశకు వెళితే ఆ మరక వీరికి కూడా అంటుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు.ఇప్పటికే కూటమిలో మరో భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను ఎక్కడ వెనుకబడి పోతానో అని ఏదో దీక్ష అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి గబ్బు అయ్యారు. చివరికి తాను లడ్డూ కల్తీ గురించి తిరుమల యాత్ర చేయలేదని, గత ఐదేళ్లలో పాపాలు జరిగాయని అందుకు ప్రాయశ్చితంగా వెళ్లానని చెప్పవలసి వచ్చింది. పవన్ కళ్యాణ్‌కు అబద్దాలు ఆడడం, మాట మార్చడం కొత్తకాదు. కాని ఈసారి మరీ గట్టిగా బుక్ అయ్యారు. చంద్రబాబును గుడ్డిగా బలపరచబోయి పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ లు అప్రతిష్టపాలయ్యారు.తిరుమలలో శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అయిన లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ సంచలన వ్యాఖ్య చేసి, దానికి ఆధారాలు చూపించలేక, పల్టీలు కొట్టిన చంద్రబాబు దేశవ్యాప్తంగా పరువు పోగొట్టుకున్నారు. హిందువుల దృష్టిలో ఆయన దేవుడి పట్ల తీరని అపచారం చేశారు. అలాంటి వ్యక్తిని సమర్థించిన వీరిద్దరూ కూడా అపచారం చేసినట్లే అవుతుంది. తిరుమల లడ్డూపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి, రాజ్యసభ సభ్యుడు, మాజీ టీడీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలు వేసిన పిటిషన్ పై విచారణ చేస్తున్న సందర్భంలో పలు ప్రశ్నలను న్యాయమూర్తులు సంధించారు.ఇదీ చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టులడ్డూ కల్తీ అయిందనడానికి ఆధారాలు ఏమిటి? లడ్డూని ఎందుకు పరీక్షకు పంపించలేదు. ఎన్.డి.డి.బి రిపోర్టు వచ్చిన రెండు నెలల తర్వాత ఎందుకు వెల్లడి చేశారు. అందులో ఎక్కడా నిర్దిష్టంగా జంతు కొవ్వు కలిసిందని లేదే? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతినేలా మాట్లాడవచ్చా? దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి అంటూ పలు వ్యాఖ్యలను గౌరవ న్యాయమూర్తులు చేశారు. ఈ వ్యాఖ్యలపై బిన్నాభిప్రాయం ఉంటే ఉండవచ్చు. అవి అర్ధవంతంగా ఉండాలి. అంతే తప్ప, కోర్టు ధిక్కార ధోరణిలోనో, న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించే రీతిలో ఉండకూడదు. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబే ఇంతవరకు స్పందించలేకపోయారు! దానికి కారణం కేవలం తాను తప్పు చేశానన్న సంగతి తెలుసు కనుక. జంతుకొవ్వు లడ్డూలో కలిసిందని తప్పుడు ఆరోపణ చేసి దొరికిపోయానన్న విషయం తెలుసు కనుక.ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!అంతేకాదు.. సెప్టెంబర్ ఇరవై ఒక్కటో తేదీన తనతో శ్రీవెంకటేశ్వరస్వామే నిజాలు చెప్పిస్తున్నారంటూ ప్రసాదం లడ్డూపై అబద్దాలు ఆడారని తేలిపోయింది. చంద్రబాబు ఎన్డీఏ సమావేశంలో లడ్డూలో జంతునెయ్యి కలిసిందని చెప్పగానే, అలా మాట్లాడడం తప్పు అని పురందేశ్వరి ఆయనను వారించి ఉంటే మంచి పేరు వచ్చేది. ముఖ్యమంత్రి రాజ్యాంగపరంగా అధినేత స్థానంలో ఉన్నారని అంటున్నారు. అయితే రాజ్యాంగానికి అతీతంగా అబద్దాలు చెప్పవచ్చా అన్నదానికి ఆమె సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి పోస్టు రాజ్యాంగ పదవి అయితే, న్యాయమూర్తుల పదవులు రాజ్యాంగ పదవులు కావా? సీఎంకు ఉన్న పరిస్థితులు సమీక్షించుకుని మాట్లాడాలా? వద్దా అనేది ఆయన ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందని పురందేశ్వరి అంటున్నారు.ఎంత సీఎం అయినా ఇష్టం వచ్చినట్లు స్పీచ్ ఇవ్వవచ్చా?. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీయవచ్చా?. గతంలో కూడా పలు సందర్భాలలో న్యాయస్థానాలు పలువురి ప్రకటనలు రాజ్యాంగ స్పూర్తిగా విరుద్దంగా ఉంటే తప్పు పట్టాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరిగా అమలు అవుతుందా?లేదా అనేది కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని ఏదో అర్థం లేని మాట చెప్పారు. ఇందులో నిర్ణయం ఏముంది? ఒక అబద్దం చెప్పడానికి సీఎంకు అధికారం ఉంటుందని ఆమె వాదించదలిచారా?. ఈ మధ్యనే ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కొంత అతిగా స్పందించారు. వెంటనే న్యాయమూర్తులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆ మీదట రేవంత్ కోర్టువారిని క్షమాపణ కోరారు.అయినా చంద్రబాబు ఇలాంటివాటన్నిటికి అతీతుడని పురందేశ్వరి అనుకుంటే ఎవరూ ఏమి చేయలేరు. ముఖ్యమంత్రి గారు.. మీరు ఎందుకు మాట్లాడారు అనే అధికారం కోర్టుకు ఉందా అనేది ఆలోచించాలి అని ముక్తాయించారు. విద్యాధికురాలైన ఆమెకు, సుమారు తొమ్మిదేళ్లపాటు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆమెకు కోర్టుకు ఉన్న అధికారం ఏమిటో తెలియదా?. గతంలో ముఖ్యమంత్రి హోదాలో నేదురుమల్లి జనార్దనరెడ్డి పన్నెండు వైద్య కాలేజీలను మంజూరు చేశారు. అందులో అక్రమాలు జరిగాయని కొందరు కేసు వేశారు. ఆ క్రమంలో ఆయనపై సుప్రీంకోర్టు కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలను తొలగించాలని నేదురుమల్లి కోర్టును కోరినా అందుకు అంగీకరించలేదు.చంద్రబాబుతో నిజానికి గతంలో దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబానికి అంత సత్సంబంధాలు ఏవీ లేదు. 2014లో కూడా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. అప్పట్లో ఒంగోలు లేదా మరో సేఫ్ సీటును ఆమె ఆశించారు. కాని కుట్రపూరితంగా ఆమె గెలవలేని రాజంపేట లోక్ సభ స్థానాన్ని చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కలిసి కేటాయించారని అనేవారు. తన భర్త, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పి, ఆ తర్వాత ఎగవేయడంతో సహా పలుమార్లు చంద్రబాబు తీవ్రంగా అవమానించారనే బాధ పురందేశ్వరికి ఉండేది. ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు రాగానే ఆమె వేదికపైనుంచి దిగి వెళ్లిపోయారు. పలు చేదు అనుభవాలు ఉన్నప్పటికీ ఎక్కడ రాజీ కుదిరిందో కాని ఆమె పూర్తిగా మద్దతురాలైపోయారు.తన చెల్లి కళ్లల్లో ఆనందం చూడడానికి గాను పురందేశ్వరి తన పరపతిని తగ్గించుకున్నట్లయిందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన న్యాయ వ్యవస్థ నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నారో అందరికి తెలుసు. కొందరు న్యాయమూర్తులు తమ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసేవారు. ఒక జడ్జి అయితే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నంతగా తనకు సంబంధం లేని అంశాలపై కామెంట్లు చేశారు. అయినా అప్పట్లో పురందేశ్వరికి కోర్టులు అలా మాట్లాడవచ్చా అన్న సందేహం రాలేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో పాటు ఈమె కూడా ఆనందం చెందారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే మొత్తం మాట మార్చేశారు. నాలుక మడతేశారు. తను ఎందుకు దీక్ష చేసింది తొలుత చెప్పినదానికి, ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చినదానికి సంబంధం లేదు. ఆపసోపాలు పడుతూ పవన్ కళ్యాణ్ కాలినడకను తిరుమల వెళ్లినా, చంద్రబాబు పాపంలో ఆయనకు కూడా వాటా ఉండక తప్పదని చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
బాబే సుప్రీం అట.. బీజేపీ కొంపముంచిన పురంధేశ్వరి
-
పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఆగ్రహం
-
‘బావ కళ్లలో ఆనందం కోసం కాదు’..పురందేశ్వరిపై ఆర్కే రోజా ఫైర్
సాక్షి,అమరావతి : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కంటే.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలని సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు ఏదైనా మాట్లాడొచ్చని అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. రోడ్లమీద మాట్లాడే బాబు,లోకేష్, పవన్ సుప్రీం కోర్టులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వ తరుపు లాయర్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదని రోజా ప్రశ్నించారు. తిరుపతి లడ్డూపై ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడిన మీరు అత్యున్నత న్యాయం స్థానం అడిగిన ప్రశ్నలు బదులు ఇవ్వచ్చు కదా? అని రోజా అన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏమన్నారంటే?తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబును తూర్పారబట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, సుప్రీం కోర్టు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ‘‘సీఎం(చంద్రబాబును ఉద్దేశిస్తూ)రాజ్యంగం పరంగా రాష్ట్రాదినేత. సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు. అంతేకానీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా? లేదా? అని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు ఉందంటూ’’ పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నమిలిన సిదార్థ్ లూథ్రాగత సోమవారం (సెప్టెంబర్ 30న)సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. గురువారం (అక్టోబర్ 3న) తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. -
పురందేశ్వరిపై YSRCP ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
-
చంద్రబాబు ఏదైనా అనొచ్చంట.. పురందేశ్వరికి విజయసాయి కౌంటర్
సాక్షి,అమరావతి : మీ వైఖరి కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే ఎక్కువ అన్నట్లుగా ఉందంటూ ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వెఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు రాజకీయాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యల్ని తప్పుబట్టిన పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ‘రాజ్యాంగ పదవిలో ఉన్న ఆయన రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపై అయినా మాట్లాడుతారు. లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు. చంద్రబాబు అలా మాట్లాడకుండా ఉండాల్సిందని ధర్మాసనం కామెంట్స్ చేయడం సరికాదు’ అంటూ పురందేశ్వరి వ్యాఖ్యానించారు.ఆ వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘‘పురందేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డు ప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి...పురందేశ్వరి మొత్తం మీద సుప్రీంకోర్టుదే తప్పు అని తేల్చేశారు. చంద్రబాబు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు ఏదైనా అనొచ్చంట. ఏమమ్మా! మరి న్యాయవ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థే కదా! తమరికి తెలియదా? అంత చిన్న విషయానికే న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తారా అని చిరాకు పడిపోయారు పురంధేశ్వరి.ఆమెది బావా’తీతమైన ఆవేదన అనుకోవాలి మరి! కోర్టులు, దేవుడి కంటే చంద్రబాబే గొప్పవాడు అన్నట్లుంది ఈమె వైఖరి. ఈ వందేళ్లలో తిరుమల ఆలయానికి నారా, నందమూరి చేసిన డ్యామేజి మరి ఎవరూ చేయలేదు. ఇంకెన్ని ఘోరాలు చూడాలో గోవిందా...గోవిందా. చంద్రబాబు హిందువుల మనోభావాలను లడ్డుప్రసాదాల విషయంలో దెబ్బయటమే కాకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు’ అంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా మండిపడ్డారు. 1) పురంధేశ్వరి కనీస ఇంగితజ్ఞానం లేకుండా అత్యున్నత న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులను అగౌరవపరుస్తూ, కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలను తిరుమల లడ్డుప్రసాదాల విషయంలో తప్పుపడుతూ వారి ప్రతిష్టకు భంగం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం, కోర్ట్ ధిక్కారం. ఆమెపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి. 2)… pic.twitter.com/ZWBfEhRFtW— Vijayasai Reddy V (@VSReddy_MP) October 2, 2024 -
పురందేశ్వరి వ్యాఖ్యలకు తలారి కౌంటర్
-
మాకేం సంబంధం లేదు.. చంద్రబాబు హామీలు గాల్లో దీపం
-
Political Corridor: పురందేశ్వరికి బిగ్ షాక్..
-
లోక్‌సభ స్పీకర్ రేసులో ఆ ఇద్దరు?!
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎంపికపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ, మిత్రపక్షాల కేంద్రమంత్రులు భేటీ కానున్నారు. 2014, 2019 ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని దక్కించుకోవడంతో బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది. ఆ పార్టీ ఎంపీలే స్పీకర్లుగా బాధ్యతలు చేపట్టారు. 16వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ సుమిత్రా మహాజన్ (2014), 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా (2019) సేవలందించగా, ఏఐఏడీఎంకే నేత ఎం.తంబిదురై డిప్యూటీ స్పీకర్లుగా పనిచేశారు.అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పేలవ ప్రదర్శనతో కేవలం 240 స్థానాల్ని దక్కించుకుంది. ఇతర పార్టీలైన జేడీయూ, టీడీపీల పొత్తుతో మూడో దఫా అధికారం చేపట్టింది. దీంతో లోక్‌సభ స్పీకర్ పదవి తమకూ కావాలంటూ జేడీయూ, టీడీపీలు పోటీ పడుతుండగా.. కమలం అగ్రనాయకత్వం మాత్రం ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలనే స్పీకర్లుగా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.రేసులో ఆ ఇద్దరులోక్సభ ఎన్నికల ముందు ఒడిశా నుంచి బీజేపీలో చేరిన కటక్ ఎంపీ ఎంపీ భర్తృహరి మహతాబ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా.. ఓం బిర్లానే మరోసారి లోక్‌సభ స్పీకర్‌గా నియమించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ప్రొటెం స్పీకర్గారాజ్యాంగ నిబంధనలు ప్రకారం.. కొత్త లోక్‌సభ మొదటి సారి సమావేశానికి ముందు స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. కొత్త ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించడానికి సీనియర్ సభ్యుడ్ని ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి నియమిస్తారు. ప్రొటెం స్పీకర్ రేసులో కాంగ్రెస్ సీనియర్ నేత కొడికున్నిల్ సురేశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రొటెం స్పీకర్,స్పీకర్,డిప్యూటీ స్పీకర్ ఎవరనేది ఈ రోజు సాయంత్ర ఎన్డీయే, దాని మిత్రపక్ష పార్టీల కేంద్రమంత్రుల సమావేశం అనంతరం స్పష్టత రానుంది. -
BJLP నేత ఎవరు..?
-
రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
దేశంలో ప్రతిష్ఠాత్మక మూల స్తంభాలలో ఒకటైన ఎన్నికల కమిషన్ తన స్ఫూర్తిని కోల్పోతోందా? ‘ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్’ (స్వేచ్ఛగా, పారదర్శకంగా) ఎన్నికలు నిర్వహించటం భారత ఎన్నికల సంఘం కర్తవ్యం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అత్యంత అవశ్యం. కానీ ఆ కర్తవ్యం గాడి తప్పితే? ఆ స్ఫూర్తి మసకబారితే? ఫలితం ఏమవుతుంది?ప్రస్తుత ఎన్నికల కమిషన్ పోకడలు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సంస్థల లాగే ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందని వినవస్తున్న విమర్శలకు అనేక సంఘటనలు ఊతమిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న వేళ విపక్షాల నుంచి కుప్పల కొద్దీ సాక్షాధారాలతో సహా ఫిర్యాదులు అందుతున్నా ఈసీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అప్పుడప్పుడు ఈసీ పేపర్ టైగర్‌లా గాండ్రించడమే తప్ప కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో పలుచోట్ల జరిగిన అల్లర్లను ఉదాహరణగా చెప్పవచ్చు. ఆశ్చర్యం ఏమిటంటే, అల్లర్లు జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ కమిషన్ శుద్ధపూసలంటూ ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు ఉన్న ప్రాంతాలే కావడం గమనార్హం! కూటమి, అందులో భాగస్వామురాలైన బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇచ్చిన అధికార్ల చిట్టాను కించిత్తు వెరపు లేకుండా ఈసీ స్వీకరించి తదనుగుణంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య వాదులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. రౌడీ మూకలు రెచ్చిపోతుంటే పోలీసులే నిర్లిప్తంగా వ్యవహరించటం, సాక్షాత్తూ్త పోలీసులే ఎమ్మెల్యే ఇంటిలోకి చొరబడి సీసీ కెమెరాలు పగలగొట్టడం, అటు పోలీసు వ్యవస్థ ప్రతిçష్ఠను, ఇటు ఈసీ వ్యవస్థను దిగజార్చిందని చెప్పాలి. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం, పాక్షిక దృష్టితో కొంతమంది కేసుల్లో పది రోజులు దాటిన తర్వాత క్రొంగొత్త సెక్షన్లను పొందుపరచడం గమనార్హం. ఎవరి ఆదేశాల మేరకు ఈసీ ఈ పనిచేస్తుందో చెప్పాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో టీఎన్ శేషన్ ఎన్నికల సంస్కరణలకు తెర తీసి తన నిక్కచ్చితత్వంతో చరిత్రలో మిగిలిపోయారు. 1977 పోస్ట్ ఎమర్జెన్సీ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరుకి యావత్ భారతదేశం జేజేలు పలికింది. వాజ్‌పేయి అనంతరం సరిగ్గా 25 ఏళ్ల తర్వాత 2014లో బీజేపీ మోదీ నేతృత్వంలో అధికారాన్ని కైవసం చేసుకున్నాక ఈసీ ప్రతిష్ఠ క్రమంగా మసకబారుతూ వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. గతంలో బ్యాలెట్ బాక్స్‌లు ఉపయోగంలో ఉన్నప్పుడు కొన్ని సున్నిత ప్రాంతాల్లో పోలింగ్ బూత్‌ల స్వాధీనం, బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోయడం, బాక్స్‌లు ఎత్తు్తకెళ్ళిపోవడం వంటి సంఘటనలు జరిగేవి. అయితే ఈవీఎంలు వచ్చిన తరువాత ఈ అక్రమాలకు తెరపడ్డాయని చెబుతున్నా... ఎన్నికలు సజావుగా నిర్వహించవలసిన ఎన్నికల కమిషన్, సిబ్బంది, అందులో ప్రధానంగా పోలీసు వ్యవస్థ పక్షపాతంగా వ్యవహరిస్తే ఇక ఎన్నికలు సజావుగా ఎలా జరుగుతాయన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజా స్వామ్యవాదులను కలవరపెడుతున్నాయి. ఏకంగా బహిరంగంగా పోలీసులు, బాబు కూటమి కలసి తెగబడి అల్లర్లు ఆందోళనలు సృష్టిస్తే ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం దారుణం. ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేస్తే తప్ప కనీస మాత్రం స్పందన లేదంటే వీళ్ళ చిత్తశుద్ధి ఎలాంటిదో గమనించవచ్చు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 171 ప్రకారం ఓటర్లను ప్రలోభ పెట్టడం, భయపెట్టడం శిక్షార్హం. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 123 ప్రకారం భయపెట్టినా, ఓటర్లను ప్రలోభపెట్టినా కూడా శిక్షార్హమే! అయినా జాతీయస్థాయిలో అధికార పార్టీ అండ చూసుకొని అనేక చోట్ల ఈ శక్తులు పెట్రేగిపోతున్నాయి. అరాచకాలను గమనించిన భారత అత్యున్నత న్యాయస్థానం శాసన సభ, పార్లమెంటు సభ్యులపై నమోదయ్యే కేసులను సత్వరం విచారించి శిక్షించడానికి ప్రత్యేక కోర్టులు ఉండాలని ఆదేశించింది. ఫలితంగా తెలంగాణలో ఏర్పాటైన ప్రత్యేక కోర్టుకి 395 కేసులు బదిలీ అయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే... ఇందులో కేవలం 14 కేసులకు మాత్రమే నామమాత్రపు శిక్ష పడింది. మిగతా వాటికి సాక్ష్యాధారాలు సరిగా లేవని కొట్టివేయడమైనది. అదీ పవర్ పాలిటిక్స్ అంటే! ఎన్నికల కమిషన్ ప్రకటనలు అయితే చాలా ఆర్భాటంగా ఉంటాయి. ఈసారి గతంలోలా కాదు చాలా కఠినంగా వ్యవహరిస్తాం... నిష్పాక్షికంగా వ్యవహరిస్తాం అంటూ ప్రకటనలు అయితే ఇస్తారు. అంతేనా? ఏకంగా ప్రజలను కూడా అంటే ఓటర్లను కూడా నిఘా వ్యవస్థలో భాగస్వాములను చేస్తాం అంటూ ఘనంగా ‘సీ విజిల్ యాప్’ రూపొందించారు. దీని ప్రకారం, ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్టు ఓటర్ ఫిర్యాదు చేస్తే ఫ్లయింగ్ స్క్వాడ్ 100 నిమిషాల్లో ఆ నియోజకవర్గ పరిధిలోని అధికారులకు సూచనలు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటుంది. ఇది వినడానికి అయితే అద్భుతంగా ఉంది కానీ వాస్తవంలో జరిగిందేమిటి? అనేక చోట్ల ఎస్సీ, ఎస్టీ మహిళలు ఓట్ వేయడానికి వెళితే వాళ్ళని బెదిరించి, పరిగెత్తించడం పోలీసుల సమక్షంలో గూండాలు వ్యవహరించిన తీరు వీడియోల్లో రికార్డ్ అయింది. ఫిర్యాదులు చేసి రోజులు గడుస్తున్నా చర్యలు శూన్యం. వాస్తవానికి ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం పక్షపాతంగా వ్యవహరించే పోలీసులకు విధుల్లో కొనసాగే హక్కు లేదని, ఓటర్లను భయపెట్టే నేతలపై అనర్హత వేటు వేయాలన్న ‘లా కమిషన్’ సిఫార్సులు అమలు చేయాలి. కానీ కనుచూపు మేరలో అలాంటిదేమీ కనిపించడం లేదు. సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ సూచించిన విధంగా మచ్చ లేనివారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించాలి. కానీ ఇవన్నీ జరిగేదెప్పుడు? సగటు ఓటరుకు రక్షణ ఎప్పుడు? అయితే ఒకటి మాత్రం నిజం. భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల రణక్షేత్రంలో వీరులు సగటు ఓటరులే! వారి తీర్పుకు తిరుగులేదు. వారి పైన ఆంక్షలు తాత్కాలిక చంద్ర గ్రహణాల వంటివి. అంతిమంగా పున్నమి వెలుగులు జగన్మోహనంగా విస్తరించక మానవు. పి. విజయబాబు రాజ్యాంగ న్యాయశాస్త్ర పట్టభద్రుడు -
చిన్నమ్మ స్వార్ధానికి మునిగిపోతున్న బీజేపీ..
-
అయోమయంలో పురందేశ్వరి భవితవ్యం
పురందేశ్వరి కుట్ర రాజకీయాలు ఆమెకు ఎసరు తెచ్చిపెట్టనున్నాయా.. ఎన్నికల సమయంలో చిన్నమ్మ రాజకీయాలతోనే ఏపీలో బీజేపీ మరింత బలహీనపడిన పడిందని భావిస్తున్న సీనియర్లు ఆమె నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా.. ఏపీ బీజేపీలో ఇపుడు గ్రూపు రాజకీయాలకి పురందేశ్వరి వైఖరే కారణమని సీనియర్లు గుర్రుగా ఉన్నారు.. ఎన్నికల వేళ పార్టీని ఏకతాటిపై నడిపించాల్సిన సమయంలో ఆమె వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు పార్టీని బలి చేశారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది. పురందేశ్వరి ఓడితే ఆమె రాజకీయ భవిష్యత్‌కి బ్రేక్ పడినట్లేనా...ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజకీయ భవితవ్యం అయోమయంగా ఉంది. ఎన్నికల ఏడాదిలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి తన వైఖరితో పార్టీలో గ్రూపు రాజకీయాలకి ఆజ్యం పోశారు. అప్పటివరకు సోము వీర్రాజు నాయకత్వంలో ఏకతాటిపై నడిచిన పార్టీని రెండు గ్రూపులుగా మార్చేసారు. ఏపీలో గడిచిన మూడేళ్లగా సోము వీర్రాజు నాయకత్వంలో బీజేపీ క్షేత్రస్ధాయిలో బలోపేతంపై దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకునేలా నిత్యం ప్రజలలో ఉంటూ కార్యక్రమాలు నిర్వహించేవారు.అయితే పురందేశ్వరి గత ఏడాది ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదట నుంచి బీజేపీలో ఉన్న నేతలపై గురి పెట్టారు. సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాల అధ్యక్షులని కావాలని మార్పు చేశారు. దీంతో పాటు రాష్ట్ర కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలని తొలగించి మరీ తన సొంత టీంని నియమించుకున్నారు. అక్కడ నుంచి ప్రారంభమైన గ్రూపు రాజకీయాలు ఎన్నికల సమయానికి తారాస్ధాయికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు వరకు ఏపీలో బీజేపీ, జనసేనతో మాత్రమే కలిసి పోటీ చేస్తుందని భావించిన నేతలు. .ఆ దిశగానే ప్రయత్నించారు.జనసేన.. టీడీపీతో కలిసిన తర్వాత ఒంటరి పోరు వైపే మెజార్టీ నేతలు మొగ్గుచూపారు. ఏపీలో బీజేపీకి భవిష్యత్ ఉండాలనే దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని.. అందు కోసం ఒంటరిపోరే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతర పరిణామాలలో చంద్రబాబు బీజేపీ అగ్రనేతలను కలుసుకుని ఎన్డీఎలో చేరడం వెనుక పురందేశ్వరి చక్రం తిప్పారని బీజేపీ నేతలు చెబుతుంటారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి సొంతపార్టీ కంటే సొంత బంధువర్గానికి ప్రాదాన్యతనిచ్చారనేది జరిగిన పరిణామాలే చెబుతున్నాయి.చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్‌ని ఢిల్లీకి తీసుకెళ్లి హోంమంత్రి అమిత్ షాని కలిపించడం వెనుక పురందేశ్వరే ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత టీడీపీతో బీజేపీ జత కట్టడం.. టిక్కెట్లు ఖరారు ఇవన్నీ బీజేపీ కనుసన్నల్లో కంటే చంద్రబాబు చెప్పినట్లుగానే జరిగాయని విమర్శలున్నాయి. గత నాలుగన్నరేళ్లగా క్షేత్రస్ధాయిలో బీజేపీ బలోపేతంగా ఉన్న స్థానాలను తీసుకోవాల్సిన సమయంలో పురందేశ్వరి మాట్లాడకపోవడం ఏపీ బీజేపీకి మైనస్‌గా మారింది. ఎన్నికల వేళ ఏపీలో బీజేపీ కనీసం 25 అసెంబ్లీ స్ధానాలు, ఎనిమిది పార్లమెంట్ స్దానాలలో పోటీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు ఆశించారు. ఇందుకోసం టీడీపీతో గట్టిగా సంప్రదింపులు చేయాలని సీనియర్లు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు.అయితే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే మైకంలో ఉన్న బీజేపీ పెద్దలకి ఏపీ బీజేపీలో పరిస్ధితులని పట్టించుకోలేదు. .ఇదే సమయంలో టీడీపీతో పొత్తులో భాగంగా పురందేశ్వరి చంద్రబాబు ఆశించినట్టుగా వ్యవహరించి కేవలం ఆరు ఎంపీలు, పది అసెంబ్లీ స్ధానాలకి పరిమితం చేశారు. ఆ తర్వాతైనా బీజేపీ పట్టున్న స్ధానాలను కోరుకుందా అది కూడా లేదు.. బీజేపీ ఓడిపోయే స్ధానాలను బిజెపికి అండగట్టినా కూడా ఎపి బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి పెదవి విప్పలేదు... సరికదా తనకు ఎంపి టిక్కెట్ వస్తే చాలని ఊరుకున్నారు.దీనికి తోడు బిజెపితో పొత్తుకు ముందే కొన్ని స్ధానాలను టిడిపి ప్రకటించడం కూడా ఎపి బిజెపిలో మొదట నుంచి నేతలకి నచ్చలేదు.. బిజెపిలో మొదటి నుంచి సీనియర్లకి అవకాశం ఇవ్వాలని...బిజెపి గెలిచే స్ధానాలను తీసుకోవాలని సీనియర్లు నెత్తీ నోరూ బాదుకున్నా కూడా పురందేశ్వరి తన మరిది చంద్రబాబుతో కలిసి చేసిన కుట్రలు ఎపి బిజెపి భవితవ్యాన్ని పూర్తిగా చిదిమేశాయివిశాఖపట్టణం ఎంపీ స్ధానం కోసం రాజ్యసభ సభ్యులు జివిఎల్ నరసింహరావు చివరి వరకు ప్రయత్నించారు.బిజెపి జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు విశాఖలో ఇల్లు కొనుక్కుని ఆ పార్లమెంట్ పరిధిలో బిజెపి బలోపేతం కావడానికి మూడేళ్లకి పైగా కృషి చేసిన జివిఎల్ ఆ స్ధానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.అయితే పురందేశ్వరి కనీసం టిడిపి, బిజెపి ఉమ్మడి చర్చలలో విశాక సీటుని కనీసం ప్రస్తావించలేదని తెలుస్తోంది. విశాఖలో పార్టీ బలంగా ఉందని..ఆ సీటు బిజెపికి ఇవ్వాలని పురందేశ్వరి గట్టిగా పట్టుపట్టకపోవడంతోనే ఆ సీటు టిడిపి తీసుకుందని చెబుతున్నారు.కేవలం తన సోదరుడు బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యాసంస్ధల చైర్మన్ భరత్ కోసమే జివిఎల్ కి టిక్కెట్ రాకుండా చేశారని చెబుతున్నారు.ఆ తర్వాత విజయనగరం లేదా అనకాపల్లి కోసం జివిఎల్ ప్రయత్నించినా కూడా అవి కూడా దక్కలేదు.దీంతో జివిఎల్ పురందేశ్వరి వైఖరిపై అలిగి ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు.ఇక అనకాలపల్లి ఎంపి స్ధానంపై మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ ఆశలు పెట్టుకుంటే ఆయనని కాదని కడప నుంచి సిఎం రమేష్ కి టిక్కెట్ ఇప్పించారు.ఇది కూడా చంద్రబాబు డైరక్టన్ లో జరిగిందని బిజెపి సీనియర్లు విమర్శిస్తున్నారు.ఉత్తరాంద్రలో ఉన్న బిసి నేతలకి అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్ కి టిక్కెట్ ఇవ్వడం ఉత్తరాంద్ర బిజెపిలో వివాదం రాజేసింది. బిజెపిలో ఉంటూ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సిఎం రమేష్ అభ్యర్ధిత్వాన్ని ఉత్తరాంద్ర బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోయారు.ఇక రాజమండ్రి స్ధానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు భావించారు. రాజమండ్రిలోనే పుట్టి నాలుగన్నర దశాబ్ధాలగా బిజెపిలో ఉన్న సోము వీర్రాజు రాజమండ్రి ఎంపి టిక్కెట్ ఆశిస్తే పురందేశ్వరి చక్రం తిప్పి టిక్కెట్ ఆమె దక్కించుకున్నారు.ఇక సోము వీర్రాజుని అనపర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని సూచించినా ఓడిపోయే స్ధానంలో పోటీచేయలేనని తిరస్కరించారు.ఇక ఏలూరు స్ధానం కోసం దశాబ్ధకాలంగా బిజెపిలో పనిచేస్తున్న తపనా చౌదరికి కూడా టిక్కెట్ ఇప్పించడంలో పురందేశ్వరి విఫలమయ్యారు.ఈ సీటుని బిజెపికి ఇవ్వకుండా టిడిపి తీసేసుకుని కడప జిల్లాకి చెందిన యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ ని రంగంలోకి దింపారు. ఇక హిందూపూర్ ఎంపి కానీ కదిరి అసెంబ్లీ కానీ ఆశించిన విష్ణువర్ధన్ రెడ్డికి కూడా టిక్కెట్ దక్కలేదు.ఇలా వరుసగా పార్టీనే నమ్ముకుని దశాబ్ధాలగా రాజకీయాలు చేసిన సీనియర్లెవరకి కూడా టిక్కెట్లు దక్కలేదు కానీ టిడిపి నుంచి బిజెపిలో చేరిన సిఎం రమేష్, సుజనా చౌదరి లాంటి నేతలకి టిక్కెట్లు దక్కడం సీనియర్లకి తీవ్ర నిరాశ కలిగించింది.దీంతో పాటు అనపర్తి టిక్కెట్ విషయంలో మాజీ సైనికుడికి అన్యాయం చేస్తూ రాత్రికి రాత్రి టిడిపి ఇన్ చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని బిజెపిలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వడం...బద్వేలులో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేసిన బిజెపి నేతని పక్కన పెట్టి టిడిపి ఇన్ చార్జి రోషన్ ని ముందు రోజు బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇవ్వడం బిజెపిలో తీవ్ర వివాదాస్పదమైంది.అలాగే ఎన్నికలకి ముందు వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే వరప్రసాద్ ని బిజెపిలో చేర్చుకుని తిరుపతి ఎంపి టిక్కెట్ ఇవ్వడం కూడా పార్టీలో వ్యతిరేకత తెచ్చింది.ఇలా ఉద్దేశపూర్వకంగా బిజెపిలో మొదట నుంచి పనిచేసిన నేతలని పక్కనపెట్టి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకి టిక్కెట్లు ఇవ్వడం వెనుక పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించారని సీనియర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.టిడిపి నుంచి బిజెపిలో చేర్చుకుని టిక్కెట్లు ఇచ్చే బదులు ఆ సీట్ల స్ధానంలో బిజెపి వేరే సీట్లని తీసుకోవాలని... దీని వల్ల బిజెపి నష్టపోతోందంటూ మాజీ సిఎం బిజెపి సీనియర్ నేత ఐవిఆర్ కృష్ణరావు పలుమార్లు ట్విట్లర్ వేదికగా ప్రశ్నించారు. ఇలా పురందేశ్వరి పెట్టిన చిచ్చుతో ఎన్నికల సమయంలో ఎపి బిజెపి రెండుగా చీలిపోయింది.ఎన్నికల ప్రచారంలో సీనియర్లు ఎవరూ కూడా ప్రచారంలో పాల్గొనకపోవడానికి పురందేశ్వరి వైఖరే ప్రధానకారణంగా తెలుస్తోంది.ఇక రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాదిరిగానే అక్కడా సొంత టీం నే ఏర్పాటు చేసుకున్నారు.స్ధానికుడైన సీనియర్ నేత సోము వీర్రాజుని పురందేశ్వరి ఎక్కడా కలుపుకుపోలేదు. నామినేషన్ రోజున మాత్రం సోము వీర్రాజుతో కలిసి ర్యాలీగా వెళ్లి పురందేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.ఆ తర్వాత సోము వీర్రాజు ఎక్కడా ప్రచారంలో కనిపించకపోవడానికి పురందేశ్వరి వైఖరే కారణమని తెలుస్తోంది. సోము వీర్రాజు స్ధానంలో రాజమండ్రి టిక్కెట్ దక్కించుకున్న పురందేశ్వరి మర్యాదపూర్వకంగా కూడా కనీసం సోము వీర్రాజు ఇంటికి వెళ్లకపోవడం...ఎన్నికల ప్రచారానికి ఆయనను పిలవకపోవడంతోనే ఆయన ప్రచారంలో పాల్గొలేదని తెలుస్తోంది. దీనికి తోడు రాజమండ్రిలో సోము వీర్రాజు హయాంలో కట్టిన బీజేపీ కార్యాలయాన్ని కాదని ఎన్నికల వేళ పురందేశ్వరి ప్రత్యేకంగా వేరే చోట ఎన్నికల కార్యాయాల్ని ప్రారంభించడం కూడా సోము వీర్రాజుకి తీవ్ర మనస్తాపం కలిగించినట్లు తెలుస్తోంది. బీజేపీ కార్యాయాలన్ని కాకుండా ప్రైవేట్‌గా వేరేచోట ఎన్నికల కార్యాలయం ఏర్పాటు చేయడం కూడా ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలను రాజేసింది. ఇలా సొంత పార్టీ కార్యాలయాన్ని.. సొంత పార్టీ నేతలను నమ్మకుండా టీడీపీ నేతలను పురందేశ్వరి నమ్మడం కూడా ఆమెకు మైనస్‌గా మారిందంటున్నారు.ఇలా వరుస తప్పిదాలతో ఏపీ బీజేపీ రెండుగా చీలిపోయిందంటున్నారు. ఒకవర్గం పురందేశ్వరి అనుకూలంగా ఉంటే...మరొక వర్గం పురందేశ్వరిని వ్యతిరేకిస్తోందంటున్నారు.ఇలాంటి పరిణామాలు గతంలో ఎపుడూ ఏపీ బీజేపీలో చోటుచేసుకోలేదని.. కేవలం పురందేశ్వరి వైఖరి కారణంగానే బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఏర్పడ్డాయని అంటున్నారు.ఇపుడా గ్రూపు రాజకీయాలే పురందేశ్వరికి ఎసరు తెచ్చేలా కన్పిస్తున్నాయంటున్నారు.రాజమండ్రితో పాటు బిజెపి పోటీ చేసిన మొత్తం ఆరు ఎంపి స్ధానాలు, పది అసెంబ్లీ స్ధానాలలో కనీసం సగం సీట్లైనా బిజెపి గెలిస్తేనే పురందేశ్వరి రాజకీయ భవితవ్యానికి ఇబ్బంధి ఉండకపోవచ్చునంటున్నారు. కానీ బిజెపి గెలుపొందే స్ధానాలను కాకుండా ఓడిపోయే స్ధానాలను తీసుకునే ఓటమిని ముందే డిసైట్ చేసుకున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ గెలుపు మాట తర్వాత కనీసం పురందేశ్వరి అయిన రాజమండ్రిలో గెలుస్తోందో లేదోనేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ రాజమండ్రిలో పురందేశ్వరి ఓడిపోతే ఆమె రాజకీయ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఆమె ఓడిపోతే ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమెకు శాపంగా మారి బీజేపీ అధ్యక్షరాలి పదవి నుంచి తొలగించే అవకాశాలు లేకపోలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.ఇప్పటికే ఎన్నికల సమయంలో పురందేశ్వరి కుట్ర రాజకీయాలపై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారంటున్నారు. ఇలా వరుస ఫిర్యాదుల నేపధ్యంలో ఆమె ఓడిపోతే శాశ్వతంగా పురందేశ్వరి చేజేతులా రాజకీయ భవిష్యత్‌ని నాశనం చేసుకున్నట్లేనని చెబుతున్నారు. కాంగ్రెస్‌లో దశాబ్ధకాలం పాటు ఎంపిగా.. కేంద్ర మంత్రిగా పనిచేయడానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ హవా ఆమెకు కలిసివచ్చిందని.. ఇపుడు మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె భవితవ్యాన్ని సమాది చేస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత ఏపీ బీజేపీ గప్ చుప్‌గా ఉంది.. నేతలెవరూ కూడా ఎన్నికల తర్వాత పెదవి విప్పడానికి సాహసించడం లేదు.. గెలుపుపై నమ్మకం లేక ఏ నేతా కూడా మీడియా ముందుకురావడానికి ఇష్టపడకపోవడం ఏపీ బీజేపీలో గ్రూపు రాజకీయాలు.. తాజా పరిస్థితులను తెలియజేస్తున్నాయంటున్నారు. -
దొంగ ఓట్ల కోసం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ చేసిన కుట్ర..
-
మార్చినచోటే మారణకాండ
సత్తెనపల్లి: రాష్ట్రంలో పలుచోట్ల పోలింగ్ బూత్‌లను స్వా«దీనం చేసుకుని ఈవీఎంలను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో టీడీపీ దాడులకు తెగబడిందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బూత్ నంబర్లతో సహా ఈ వివరాలను వెల్లడించి రీ పోలింగ్ నిర్వహించాలని కోరితే అవసరం లేదని ఎన్నికల కమిషన్ చెబుతోందన్నారు. ఈ దారుణానికి కారకులెవరో నిగ్గు తేల్చాలని సిట్‌ను, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.రాజకీయ ఒత్తిళ్లతో పోలీసు ఉన్నతాధికారులను మార్చిన ప్రాంతాల్లోనే హింస చెలరేగిందన్నారు. చంద్రబాబు ప్రోద్భలంతో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఫిర్యాదు మేరకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను ఎన్నికలకు ముందు ఈసీ బదిలీ చేసిందని గుర్తు చేశారు. పల్నాడుతోపాటు అనంతపురం, తాడిపత్రిలో చెలరేగిన హింసను నియంత్రించలేక పోలీసులు చేతులు ఎత్తేశారన్నారు.మంత్రి అంబటి ఆదివారం నరసరావుపేటలో ‘సిట్’ అధికారులను కలసి ఎన్నికల హింస, కొందరు పోలీసు అధికారుల పక్షపాత వైఖరిపై ఫిర్యాదు చేశారు. అనంతరం గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణతో కలసి సత్తెనపల్లిలో మంత్రి అంబటి మీడియాతో మాట్లాడారు. చరిత్రలో చూడని విచిత్రం రాయలసీమ, పల్నాడులో గతంలో ఇంత హింస చెలరేగిన సందర్భాలు లేవు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు బాధ్యతలు చేపట్టాక టీడీపీ మూకలు విధ్వంసం సృష్టించాయి. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశాయి. పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్ సీపీ చాలా బలంగా ఉంది. గత ఎన్నికల్లో ఏడుకు ఏడు సీట్లు గెలవడం, ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉన్నందున దాడులకు తెగబడ్డారు. తాము నియమించిన ఐపీఎస్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహించారని ఈసీ సస్పెన్షన్ వేటు వేయడం చరిత్రలో ఎప్పుడూ చూడని విచిత్రం.సత్తెనపల్లి రూరల్ సీఐపై ఫిర్యాదు నరసరావుపేటలో సిట్ అధికారుల బృందాన్ని కలిసి వాస్తవాలను తెలియచేశా. రుజువులు, ఆధారాలు నివేదిక రూపంలో సమర్పించాం. పోలీసులే కౌంటర్ కేసులు పెట్టిస్తున్నారు. తప్పుడు కేసులతో బాధితులనే బెదిరిస్తున్నారు. సత్తెనపల్లి రూరల్ సీఐ మీసాల రాంబాబుపై ఫిర్యాదు చేశా. కొందరు పోలీసులు టీడీపీ నేతలకు డబ్బులకు అమ్ముడు పోయారు. కన్నా లక్ష్మీనారాయణ, ఆయన కుమారుడు ఇచ్చిన డబ్బులకు లొంగిపోయినట్లు మా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంది. విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరా. తొండపిలో గ్రామాన్ని వీడిన ముస్లిం మైనార్టీలు పల్నాడు జిల్లా తొండపి గ్రామంలో శాంతిభద్రతలు పునరుద్ధరించాలని కొత్త ఎస్పీని కోరుతున్నా. ముస్లింల ఇళ్లు, బైకులు తగలబెట్టారు. ముస్లిం మైనార్టీలు ప్రాణ భయంతో ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. వారికి పార్టీ తరపున అండగా ఉంటాం. వైఎస్సార్ సీపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుంది. వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారు.యథేచ్ఛగా విధ్వంసం.. పోలింగ్ రోజు తలలు పగిలి పోతున్నా పోలీసులు రాలేదు. అల్లరి మూకలు అలసిపోయే వరకు యథేచ్ఛగా మారణకాండకు తెగబడ్డాయి. నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వి కార్లు ధ్వంసం చేశారు. నార్నెపాడులో ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్న నా అల్లుడు ఉపేష్ కారును సైతం ధ్వంసం చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, పెదకూరపాడులో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఫిర్యాదు తీసుకోవాలని కోరినా స్పందించలేదు. ఓటమి భయంతో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరించారు. అధికారం దక్కదని పసిగట్టిన ప్రతి సందర్భంలోనూ ఆయన హింసను నమ్ముకున్నట్లు చరిత్ర చెబుతోంది. -
వదినమ్మ బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
వదిన మరిది బండారం బయటపెట్టిన లక్ష్మీపార్వతి
-
ఏపీ పోలీస్ అబ్జర్వర్ పై మెరుగు నాగార్జున ఫైర్
-
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
-
ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
-
పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలకు చురకలంటించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. బీజేపీ పురంధేశ్వరి కావాలనే సోము వీర్రాజును పక్కనబెట్టారు. అలాగే, ఎల్లో మీడియా పెద్దలు ఓటమి భయంతో రాత్రి పూట నిద్రపోవడంలేదని ఎద్దేవా చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం మొదటి నుంచి పార్టీలో ఉన్న కేడర్‌ను నమ్మకుండా అవమానించడమేనని అంటున్నారు. ఏమాటకామాట! బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు గారు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి గారు కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు గారి మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024 ఎన్నికలలో టీడీపీ (తప్పుడు)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ ఆఖరి పోరాటంలో బాబుకు ఓటమి తప్పదనే ‘కమురు వాసన’ అక్కడివరకు వ్యాపించడం వారిని కలవరపాటుకి గురిచేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఎన్నికలలో టీడీపీ (దుష్)ప్రచారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకటో రెండో రోడ్డు షోలు, సభలతో అలిసిపోయి విశ్రాంతి వాహనంలోకి వెళ్లిపోతున్నాడు చంద్రబాబు. అక్కడ హైదరాబాద్ నుంచి పత్రికలు, టీవీ చానళ్ళ ద్వారా ఆయనకు కొమ్ముకాస్తున్న ఎల్లో మీడియా పెద్దలకు మాత్రం రాత్రి పూట నిద్ర పట్టడం లేదంట. ఈ…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 6, 2024 -
కూటమి కక్కిన విషం.. నలుగురు వృద్ధులు మృతి
వరుసబెట్టి పదేపదే ఫిర్యాదులతో..మేం 2024 మార్చి 30న ఇచ్చిన ఆదేశాల ప్రకారం బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు డీబీటీ (నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాలో జమ) విధానంలో ఫింఛన్ల పంపిణీకే పాధాన్యం ఇవ్వండి. లేదంటేనే శాశ్వత ఉద్యోగుల ద్వారా పంపిణీ చేపట్టండి. – ఏప్రిల్ 26న సీఎస్‌కు ఈసీ జారీ చేసిన ఆదేశాల సారాంశం. (ఏప్రిల్‌లో దివ్యాంగులకు ఇళ్ల వద్ద, మిగిలిన వారికి సచివాలయాల వద్ద పెన్షన్ల పంపిణీపై టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు గత 20 రోజులుగా ఫిర్యాదులు చేయడంతో ఈసీ తమ ఆదేశాలను పాటించాలంటూ మరోసారి ఉత్తర్వులిచ్చిది) విలన్ నంబర్–1 పింఛను లబ్ధిదారుల్లో బ్యాంకు అకౌంట్ ఉన్నవారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులకు చెప్పి వస్తున్నాం. బ్యాంకు అకౌంట్లు లేని వారికి సచివాలయం వద్ద పింఛను డబ్బులు తీసుకునే అవకాశం కల్పించాలని చెప్పాం. దివ్యాంగులకు మాత్రం మినహాయింపు ఇవ్వొచ్చు. – 20 రోజుల క్రితం సచివాలయంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసిన అనంతరం మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలివీ. (ఇతను చంద్రబాబు ఏజెంట్‌గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే.)విలన్ నంబర్ 2 కేంద్ర ప్రభుత్వం అన్ని పథకాల లబ్ధిని డీబీటీ(నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ) రూపంలో అందజేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పింఛన్ డబ్బులను అలా ఎందుకు పంపిణీ చేయదు? – 10–15 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్(ఎన్డీఏ కూటమిలో బీజేపీ ఉన్న సంగతి తెలిసిందే.) సహాయ పాత్రధారులు బ్యాంకు అకౌంట్లు ఉన్న వారికి ఖాతాల్లోనే పెన్షన్ వేయాలి. మిగిలిన వారికి ఇళ్లకే వెళ్లి ఇస్తే సిబ్బందికి శ్రమ తగ్గుతుంది. ఏప్రిల్ 28న ఏపీ బీజేపీ నేతల సూచనసాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి ఐదేళ్లుగా ప్రతి నెలా ఠంచన్‌గా ఇంటివద్దే చేతికి ఇస్తున్న పెన్షన్లకు అడ్డుపడి రచ్చ చేసిన పచ్చ బృందం సచివాలయాల్లో అందిస్తున్నా శాంతించలేదు! మండుటెండల్లో తిరగలేక పండుటాకుల ప్రాణాలు విలవిల్లాడే పరిస్థితికి తెచ్చిది. అవ్వాతాతల ఉసురు మూటగట్టుకుంటూ పెద్ద ప్రాణాలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాసేలా వికృత రాజకీయాలకు బాబు బృందం తెర తీసింది! అవ్వాతాతల ఫించన్ల కష్టాలకు చంద్రబాబు, ఆయన సన్నిహితులు, మిత్ర పార్టీల నిర్వాకాలే కారణం. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటూ ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, దగ్గుబాటి పురందేశ్వరి, కొందరు ఏపీ బీజేపీ నాయకులు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లోనే పింఛను డబ్బులు జమ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చారు. పింఛన్‌దారులకు ఇళ్ల వద్ద కాకుండా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు జమ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఈసీకి తానే చెప్పానంటూ ఫిర్యాదు చేసి బయటకు వచ్చిన అనంతరం నిమ్మగడ్డ ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఇలా ఈసీకి వరుస ఫిర్యాదులతోపాటు ఉన్నతాధికారులను బెదిరించేలా ఎల్లో మీడియాలో కథనాలు వెలువరించేలా చంద్రబాబు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. మరోవైపు ఇంటి వద్దే ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఐదేళ్ల తరువాత మళ్లీ అవే అవస్థలుఐదేళ్ల తర్వాత మళ్లీ అవ్వాతాతలు పింఛన్ల కోసం అవస్థ పడుతూ ఊరు దాటారు! తెల్లవారుజామునే బ్యాంకుల వద్దకు చేరుకుని చాంతాడంత క్యూలో నిలబడి నానా అగచాట్లు పడ్డారు. గత 58 నెలలుగా ప్రతి నెలా ఏ కష్టం లేకుండా కరోనాలో సైతం ఠంఛన్‌గా ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పింఛన్ మొత్తాన్ని అందుకున్న లక్షలాది మంది పింఛన్‌దారులు ఈసారి కొత్తగా బ్యాంకు ఖాతాలో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 65.49 లక్షల మంది పింఛనుదారుల్లో ఎక్కువ మంది ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా అందే ఆ డబ్బులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఖాతాల్లో జమ అయిన డబ్బులను తీసుకునేందుకు ఒక్కసారిగా బ్యాంకుల వద్దకు చేరుకోవడంతో గురువారం రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల బ్యాంకులు పింఛన్ లబ్ధిదారులతో నిండిపోయాయి. ఎండ తీవ్రత కారణంగా ఎక్కువ మంది అవ్వాతాతలు బ్యాంకులు తెరవక ముందే ఉదయం 9 గంటల నుంచే చేరుకుని ఎదురు చూస్తూ ఉండిపోయారు. బ్యాంకు అందుబాటులో లేని గ్రామాలకు చెందిన వారు పనులు మానుకుని 10 కి.మీ. దూరంలోని ప్రాంతాలకు తరలి వచ్చారు. పలుచోట్ల ఊళ్లకు ఊళ్లే తరలిరాగా పింఛను డబ్బులు పడ్డ బ్యాంకు ఖాతాలు చాలా కాలంగా వినియోగంలో లేని కారణంగా ఇన్ యాక్టివ్‌లో ఉన్నట్లు తెలుసుకుని ఉసూరుమన్నారు. బ్యాంకు అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు ఒకేసారి వందల మంది రావడంతో బ్యాంకు సిబ్బంది సైతం సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. బాబు సేవలో వీర విధేయులు.. పింఛను డబ్బులు బ్యాంకుల్లో జమ చేయాలంటూ ఈసీని కలిసి ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన నిమ్మగడ్డ రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారు. 2020లో మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీలకు నోటిఫికేషన్లు జారీ చేయగా ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు ఏకగ్రీవంగా గెలుస్తున్న పరిస్థితి ఉండడంతో చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎన్నికల ప్రక్రియను అర్థాంతరంగా నిలిపివేశారు. చంద్రబాబు కుటుంబ బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పొత్తులో దక్కిన సీట్లను 20–30 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి కాకుండా చంద్రబాబు వీర విధేయులుగా ముద్రపడ్డ బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకు ఇచ్చారు. దీనికిపై సొంత పార్టీ నుంచే ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. పింఛన్ల పంపిణీపై ఈసీకి ఫిర్యాదు చేయడంలోనూ నిమ్మగడ్డ, పురందేశ్వరి లాంటి వారిని ముందు పెట్టి చంద్రబాబు రాజకీయ డ్రామాలకు తెర తీశారు.మొదలు పెట్టిందే టీడీపీరాష్ట్రంలో నాలుగున్నరేళ్లకు పైగా వలంటీర్ల ఆధ్వర్యంలో ప్రతి నెలా ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇంటి వద్దే చిన్న అవాంతరం కూడా లేకుండా పింఛన్ల పంపిణీ కొనసాగగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే దీన్ని అడ్డుకుంటూ చంద్రబాబు సన్నిహితులంతా వరుసపెట్టి ఈసీకి ఫిర్యాదులు చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి స్వయంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు సామాజికవర్గం పరంగా, రాజకీయ ప్రయోజనాల పరంగా వివిధ సందర్భాల్లో అనుకూలంగా వ్యవహరించిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఫింఛన్ల పంపిణీకి వలంటీర్లను దూరంగా ఉంచాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 23, 25వ తేదీల్లో రెండు విడతలుగా ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి వరకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇళ్ల వద్దనే వలంటీర్ల ద్వారా జరిగిన పింఛన్ల పంపిణీకి బ్రేక్‌లు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చిది. టీడీపీ నేతలు, చంద్రబాబు సన్నిహితుల ఫిర్యాదుల మేరకే వలంటీర్లు పింఛన్ల పంపిణీ తదితర కార్యక్రమాలకు వినియోగించే మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఫలితంగా ఏప్రిల్‌లో పింఛను డబ్బుల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు చేపట్టారు. దివ్యాంగులు, కదలలేని స్థితిలో ఉన్న అవ్వాతాతలకు ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ చేసి మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందించేలా నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఐదేళ్ల పాటు ఏ కష్టం లేకుండా పింఛను తీసుకున్న వారికి ఈ నిర్ణయం కాస్త కష్టంగా అనిపించినా కేవలం ఐదు రోజులోనే అందరికీ సజావుగా డబ్బులు చేతికి అందాయి. అయినా సరే ఆగకుండా టీడీపీ – జనసేన – బీజేపీ నాయకులు ఉమ్మడిగా గత నెల రోజులుగా దాదాపు రోజు మార్చి రోజు పింఛన్ల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. మరోపక్క తమ అనుకూల మీడియాలో రాష్ట్ర ఉన్నతాధికారులను బ్లాక్మెయిల్ చేసేలా నిత్యం కథనాలు వెలువరించి ఒత్తిడి తెచ్చి ఇప్పుడు బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చారు. తిరిగి రాష్ట్ర ప్రభుత్వం, అధికారులపై నెపం వేస్తూ చంద్రబాబు, టీడీపీ నాయకులు బురద చల్లుతున్నారు.చంద్రబాబు మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు పది కిలోమీటర్ల దూరం నుంచి పింఛన్ సొమ్ము తీసుకునేందుకు జంగారెడ్డిగూడెం వచ్చా. ఉదయం 9 గంటలకే ఇక్కడకొచ్చిన నేను పింఛన్ సొమ్ము తీసుకుని ఇంటికి చేరుకునేసరికి మధ్యాహ్నం రెండు గంటలైంది. మండుటెండలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిది. చంద్రబాబు ఎన్నికల ప్రయోజనం కోసం మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. దాని పర్యావసానాలు చంద్రబాబు అనుభవించాల్సిందే. – రాయల మునేశ్వరరావు, పింఛన్ లబ్ధిదారుడు, కేతవరం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా ముసలివాళ్లపైనా మీ ప్రతాపం ప్రతినెలా 1వ తేదీన వలంటీర్ వచ్చి పింఛన్ ఇచ్చేవారు. గత నెల సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకున్నాం. ఈ నెల బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చిది. మండుటెండలో ఎలా వెళ్లగలం. చంద్రబాబు, ఆయన మనుషులు చేసిన ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు అందకుండా పోయాయి. ముసలివాళ్లపై ఇలా అక్కసు చూపడం తగదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారికి ఉసురు తగులుతుంది. – పెసర పోలమ్మ, పాలమెట్ట, వీరఘట్టం మండలం, పార్వతీపురం మన్యం జిల్లానా అకౌంట్ రన్నింగ్‌లో లేదంటున్నారు సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా వలంటీర్‌ను మా ఇంటికి పంపించి పింఛన్ డబ్బులు ఇచ్చేవాడు. వలంటీర్లను ఇంటికి రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈ నెల పింఛన్ డబ్బు బ్యాంకులో వేశారని చెప్పారు. ఇండియన్ బ్యాంకుకు వెళ్లి అడిగితే నా అకౌంట్ రన్నింగ్‌లో లేదని చెప్పారు. ఎండలోనే వెళ్లి ఎండలోనే ఇంటికి తిరిగివచ్చా. ప్రతినెల మందులు వాడుతున్నా. ఇప్పుడు పింఛన్ డబ్బులు రాలేదు. ఏం చేయాలో తెలియడం లేదు. – షేక్ గాలిబ్‌సాహెబ్, పింఛన్‌దారుడు, పెండ్యాల, కంచికచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లాచంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో నా వయసు 70 ఏళ్లు పైనే. పింఛన్ తీసుకోలేకపోతున్నా. ఈ నెల పింఛన్ బ్యాంకులో జమ చేసినారంట. అక్కడికెళ్లాలంటే.. రెండు కిలోమీటర్లు నడిసి హైవే కాడికి పోవాల. ఆటి నుంచి బస్సో, ఆటోనో ఎక్కి మళ్లీ 5 కిలోమీటర్ల దూరంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి పోవాల. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరం బస్సులో డోన్‌కి పోవాల. అక్కడ బ్యాంకులో పింఛన్ జమ చేసి ఉంటే సరి. లేదంటే నేను ఎన్ని తిప్పలు పడాలో. ఎన్నికల సమయంలో మళ్లీ ఆ చంద్రబాబు ఏం కిరికిరి చేసినాడో ఏమో పింఛన్ తీసుకోవడానికి ఈ ఎండల్లో సచ్చి బతుకుతున్నాం – సుబ్బయ్య, అల్లుగుండు గ్రామం, వెల్దుర్తి మండలం, కర్నూలు జిల్లామా ఉసురు తగలకపోదు నా వయసు 70 సంవత్సరాలు. గతంలో 1వ తారీఖు తెల్లవారుజామునే తలుపుతట్టి వలంటీర్లు పింఛన్లు ఇచ్చేవారు. చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించాడంటగా.. మాకు ఇంటి దగ్గరకొచ్చి పింఛన్ ఇవ్వడం లేదు. పింఛన్ కోసం ఎండలో వచ్చి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్నా. గంటల కొద్దీ లైన్లో నిలబడాలంటే వయసు సహకరించడం లేదు. ముసలోళ్లపై కక్ష గట్టిన చంద్రబాబుకు మా ఉసురు తగలకపోదు. – దిబ్బమ్మ, నాగెళ్లముడుపు, తర్లుపాడు మండలం, ప్రకాశం జిల్లాపింఛన్ కోసం తిరగలేక అల్లాడుతున్నాం వృద్ధాప్య పింఛన్‌ను ప్రతి నెలా ఇంటికే వచ్చి ఇచ్చేవారు. అయితే చంద్రబాబు కుట్ర ఫలితంగా ఇప్పుడు ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పింఛన్ కోసం సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు.. బ్యాంకులో జమవుతుందన్నారు. దుత్తలూరులోని యూనియన్ బ్యాంక్‌కు వెళ్తే నగదు జమ కాలేదని తెలిపారు. ఈ రోజంతా ఇలానే గడిచిపోయింది. ఎండలో అవస్థలు పడాల్సి వచ్చిది. ముసలోళ్లను ఇంత ఇబ్బందికి గురిచేసిన వారికి తగిన బుద్ధి చెప్తాం. – దుగ్గినబోయిన పెద్దగురవయ్య, చింతలగుంట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా -
చిన్నమ్మ.. వెన్నుపోటులో పెద్దమ్మ..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: చిన్నమ్మ..తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారికి ఈ పేరు సుపరిచితమే. ఎన్టీఆర్ కుమార్తెగా, రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఓ గుర్తింపు పొందారు పురందేశ్వరి. మెట్టినిల్లు దగ్గుబాటి ఇంట అడుగిడి రాజకీయ అరంగేట్రం చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. వీటితోపాటు తాజాగా ఆమె ఘనతలో మరోసారి ‘వెన్నుపోటుదారు’అనే అలంకారం చేరింది. అదికూడా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న బీజేపీ నుంచే కావడంతో చిన్నమ్మ మరింత చిన్నబోయారు. నాడు–నేడు బాబుకే చేదోడు సీఎం పీఠం కోసం అవమానకరంగా ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుణ్ని చేసిన నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటుదారునిగా అందరి నోళ్లలో నిత్యం నానుతూనే ఉన్నారు. ఈ వెన్నుపోటు వ్యవహారంలో పురందేశ్వరి భర్త, బాబుకు తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనవంతు పాత్ర పోషించినట్లు పలు సందర్భాలలో బహిరంగంగానే పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచిన అంకంలో భర్తను గట్టిగా ప్రోత్సహించి, మరిది బాబుకు చేదోడువాదోడుగా నిలిచారని పురందేశ్వరి గురించి అయినవారంతా చెప్పుకుంటారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పొత్తుల ముసుగులో తన పార్టీకన్నా టీడీపీకే మద్దతిస్తున్నారని కమలం నేతలు గుర్రుగా ఉన్నారు. అధ్యక్షురాలిగా ఈ స్థాయిలో పార్టీకి వెన్నుపోటు పొడవటాన్ని అంతర్గత సమావేశాల్లో నాయకులు ప్రశ్నిస్తున్నారని సమాచారం. 5 ఎన్నికలు... 4 స్థానాలు పురందేశ్వరి రాజకీయ ప్రస్థానం గమనిస్తే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తన తండ్రి టీడీపీని స్థాపించి అధికారంలోకి వస్తే.. ఈమె హస్తం పంచన చేరి, 2004 ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. బాబు తమ కుటుంబానికి చేసిన మోసం వల్లే కాంగ్రెస్‌లో చేరినట్లు సమరి్ధంచుకున్నారు. అదే వాస్తవమైతే ఇప్పుడు చంద్రబాబుకు అంతలా వత్తాసు ఎలా పలుకుతున్నారన్నది విశ్లేషకుల ప్రశ్న. బాపట్ల రిజర్వుడు స్థానం కావడంతో 2009లో విశాఖ నుంచి పోటీచేశారు. రెండుసార్లూ దివంగత మహానేత వైఎస్సార్ హవా తన విజయానికి బాటలు వేసింది.కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. రాష్ట్ర విభజన సాకుతో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన బీజేపీలో చేరారు. 2014లో రాజంపేట నుంచి ఎన్డీయే అభ్యర్థిగా కమలం గుర్తుపై పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి చేతిలో దారుణ ఓటమి చవిచూశారు. 2019లో విశాఖ నుంచి బీజేపీ అభ్యర్ధిగా 33,892 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్డీయే అభ్యర్ధిగా బీజేపీ తరఫున రాజమండ్రి ఎంపీ స్థానంలో పోటీకి దిగారు. స్వార్థమే పరమావధిగా... 2019లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరు అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేయగా పురందేశ్వరి విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున బరిలో ఉండటం అప్పట్లో చర్చనీయాంశమైంది. డాక్టర్ దగ్గుబాటికి నాయకునిగా ప్రత్యేక గుర్తింపు లేకపోలేదు. గత ఎన్నికల తరువాత ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరమయ్యారు. చిన్నమ్మ కోసం పరోక్ష రాజకీయాలు చేస్తూ తెరమరుగవ్వాల్సి వచ్చిందని ఆయన వీరాభిమానులు వాపోతున్నారు. ఆయన మాత్రం తనకు రాజకీయాలంటే విముఖతని చెప్తూనే.. పురందేశ్వరి కోసం తాజాగా రాజమండ్రిలో తిష్ట వేయడం గమనార్హం. ఎన్టీఆర్‌ను మించిన నటి చిన్నమ్మ: నందమూరి లక్ష్మీపార్వతి ‘అవును, నేను చెబుతున్నది యదార్థం. ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనిపించి మహానటుడిగా వినుతికెక్కారు. చిన్నమ్మ తెరవెనుక నటనలో మహానటిని మించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు వ్యవహారంలో కుటుంబపరంగా పురందేశ్వరి పాత్రను తెలుసుకున్న ఎన్టీఆర్ అభిప్రాయమిది. ఆ సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందునే ఈ మాటలు చెప్పగలుగుతున్నానని’ నందమూరి లక్ష్మీపార్వతి ’సాక్షి’కి తెలిపారు. ‘చంద్రబాబు, రామోజీల వెన్నుపోటు కుట్ర గురించి దగ్గుబాటికి తొలుత తెలియదు.బాబుకు సహకరించే క్రమంలో పురందేశ్వరే కుటుంబ సభ్యులను కూటమి కట్టేలా చేసింది. భర్తను దగ్గరుండి వైశ్రాయ్ హోటల్‌కు పంపింది. ఆ వెంటనే ఎన్టీఆర్ వద్దకు వచ్చి పక్కన కూర్చుంద’న్నారు. చిన్నమ్మ నాటకాలు ఆ సమయంలో గుర్తించలేకపోయినా ఆ తరువాత వెన్నుపోటుకు సంబంధించిన వాస్తవాలన్నీ తెలిశాయని, నటనలో తనను కూతురు మించిపోయిందని ఎన్టీఆర్ పలు సందర్భాలలో ప్రస్తావించారని లక్ష్మీపార్వతి వివరించారు. బీజేపీకి భారీ వెన్నుపోటుటీడీపీ, జనసేనతో జట్టు కట్టిన బీజేపీ ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తుండగా, ఆయా స్థానాల ఎంపిక, అభ్యర్థుల మార్పులు చేర్పుల్లో మరిది బాబుతో కలిసి చిన్నమ్మ ఆడిన డ్రామాలను ప్రజలు గమనించకపోలేదు. అనపర్తిలో మాజీ సైనికుడు శివకృష్ణరాజును కాదని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కట్టబెట్టారు. కడప జిల్లా బద్వేలు అభ్యర్థి రోశన్న టీడీపీ కండువా తీసేసిన మరునాడే బీజేపీ టికెట్ దక్కింది. సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డి, ఎన్.ఈశ్వరరావులు ఏ పార్టీ వారో అందరికీ తెలుసు.వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయించారు. అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేస్తున్న సీఎం రమేశ్ చంద్రబాబు జేబులో మనిషి. కాపులకు బీజేపీ నుంచి ఒక్క టిక్కెట్ కూడా దక్కకపోవడానికి పురందేశ్వరే కారణమని ఆ వర్గం బాహాటంగానే ఆరోపిస్తోంది. తన కళ్ల ముందు ప్రధాని మోదీ ఫ్లెక్సీలను కొందరు టీడీపీ కార్యకర్తలు చింపుతున్నా, కనీసం వారించకుండా మౌనం వహించిన చిన్నమ్మ వైఖరి బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి రేపుతోంది. -
ఏపీ బీజేపీని ముంచేసిన పురందేశ్వరి
ఏపీ బీజేపీని పూర్తిగా ముంచారు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి. బీజేపీ తరపున టికెట్ కావాలంటే వారు టీడీపీ నుంచి వచ్చిన వారైనా అయి ఉండాలి లేదంటే మనోళ్లు అయినా అయి ఉండాలి. ఈ రెండూ కాకపోతే మాత్రం టికెట్‌పై ఆశలు పెట్టుకోవలసిన అవసరం లేదు. చంద్రబాబు పార్టీకి బీజేపీని బ్రాంచి కార్యాలయంగా మార్చేశారని పురందేశ్వరిపై బీజేపీ వర్గాల్లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా చంద్రబాబు ఆదేశించడమే ఆలస్యం బీజేపీ నేతకు కేటాయించిన సీటును కూడా వెనక్కి తీసుకున్నారు పురందేశ్వరి. దీనిపై నిన్నటిదాకా ప్రచారం చేసిన నాయకుని అనుచరులు నిప్పులు చెరుగుతున్నారు. పురందేశ్వరి తీరుతో ఏపీ బీజేపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని పార్టీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా ట్వీట్ చేశారు. మరో నేత ఐవైఆర్ కృష్ణారావు కూడా ఇదేం పొత్తుల ధర్మం అంటూ ట్వీట్ చేశారు.ఏపీ బీజేపీలో మొదట్నుంచీ ఉన్న సీనియర్ నాయకులు జీవిఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి, మాధవ్ వంటి వారికి టికెట్లు ఇవ్వకుండా ఘోరంగా అవమానించారు పురందేశ్వరి. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ స్థానంలోనూ చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకు ఒరిజినల్ బీజేపీ నేతకు ఇచ్చిన టికెట్ వెనక్కి తీసుకుని.. ఆ సీటును చంద్రబాబు నాయుడి పార్టీకి చెందిన నేతలకు కట్టబెట్టారు.అనపర్తి నియోజక వర్గంలో టీడీపీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణకు టికెట్ ఇవ్వకుండా ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. దీనిపై నల్లమిల్లి వర్గం నిప్పులు చెరిగింది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వతంత్ర అభ్యర్ధిగా అయినా పోటీ చేయాల్సిందే అని నల్లమిల్లిని ఆయన అనుచరులు పట్టుబట్టారు.తమకి కేటాయించిన ఈ సీటులో బీజేపీ నాయకత్వం మాజీ సైనికుడు బీజేపీకి మొదట్నుంచీ విధేయుడు అయిన శివరామ కృష్ణంరాజుకు కేటాయించారు. అప్పట్నుంచీ శివరామకృష్ణంరాజు నియోజక వర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. నల్లమిల్లి రామకృష్ణ వర్గం తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు కంగారు పడ్డారు. నల్లమిల్లిని దూరం చేసుకోవడం ఎందుకనుకున్న చంద్రబాబు బీజేపీకి కేటాయించిన అనపర్తి సీటులోనూ తమ అభ్యర్ధినే బరిలో దింపాలని అనుకున్నారు. అంతే పురందేశ్వరితో మంతనాలు జరిపి అనపర్తి సీటులో టీడీపీ నాయకుడైన నల్లమిల్లికి బీజేపీ కండువా కప్పి టికెట్ కేటాయించాల్సిందిగా సూచించారు.చంద్రబాబు నాయుడి కోసమే ఏపీ బీజేపీ పనిచేయాలని అనుకుంటోన్న పురందేశ్వరి మరో ఆలోచనే చేయకుండా నల్లమిల్లికి టికెట్ ఇవ్వడానికి సై అన్నారు. ప్రచారం చేసుకుంటోన్న బీజేపీ నాయకుడు శివరామ కృష్ణం రాజును ఇక ప్రచారం చేయద్దని ఆదేశించారు.రాజమండ్రి రూరల్ సీటు విషయంలోనూ ఇంతే. నిజానికి అక్కడ బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజుకు టికెట్ ఇవ్వాలి. అయితే ఆయన బీజేపీ చీఫ్‌గా ఉండగా నిత్యం చంద్రబాబును విమర్శించేవారు. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వద్దని పురందేశ్వరిని ఆదేశించారు చంద్రబాబు. ఆ సీటును ముందుగా జనసేనకు కేటాయించిన చంద్రబాబు.. జనసేనకు కూడా వెన్నుపోటు పొడిచి ఆ సీటును తమ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కేటాయించారు.హిందూపురం సీటు ఆశించిన పరిపూర్ణానంద స్వామికి కూడా చివరి నిముషంలో చుక్కెదురైంది. ఆయన్ను పక్కన పెట్టి ఆ సీటును టీడీపీకి వదులు కున్నారు పురందేశ్వరి. దీంతో కుత కుతలాడిపోతోన్న పరిపూర్ణానంద స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలని డిసైడ్ అయ్యారు. విశాఖ ఎంపీ స్థానాన్ని ఆశించిన జీవీఎల్ నరసింహారావుకు మొండి చెయ్యి చూపించి తమ బంధువు, తన తమ్ముడి అల్లుడు అయిన గీతం భరత్‌కు కేటాయించారు పురందేశ్వరి. రాయలసీమలో విష్ణువర్ధన్‌రెడ్డికి కూడా ఇలానే మోసం చేశారు. సంప్రదాయ బీజేపీ నేతలు ఎవరికీ టికెట్లు కేటాయించలేదు పురందేశ్వరి.పురందేశ్వరి వైఖరితో ఏపీ బీజేపీ భూస్థాపితం అయ్యేలా కనిపిస్తోందని పార్టీలో సీనియర్లు మండి పడుతున్నారు. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖ బ్రాంచి కార్యాలయంగా మారిపోయిందని.. చంద్రబాబే ఏపీ బీజేపీకి అనధికార సిఇఓగా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి. -
పురందేశ్వరిపై ఫైర్ ఐన పరిపూర్ణానంద స్వామి
-
శివరామరాజుకు బీజేపీ వెన్ను పోటు..
-
పొత్తు చిత్తే! బీజేపీ, జనసేన శ్రేణులు టీడీపీ సభలకు దూరం
► చంద్రబాబు కాళ్లబేరం.. బీజేపీ నేతలతో తిట్లు తిని పవన్ కళ్యాణ్‌లు కుదుర్చుకున్న పొత్తు కింది స్థాయిలో ఎక్కడా పొసగడం లేదు. వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక కలిసిన మూడు పార్టీలకు జనంలోనే కాదు ఆయా పార్టీల్లోనూ నిరాదరణే ఎదురవుతోంది. ఆ పార్టీల అగ్ర నేతల హడావుడే తప్ప, కింది స్థాయిలో ఎక్కడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి పని చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ► సీట్లు దక్కని నేతలు తమ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పని చేసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. చంద్రబాబు సభలు పెట్టినా, వారు ఆ ఛాయలక్కూడా వెళ్లడం లేదు. ఆయన విశాఖలో ఎన్నికల ప్రచారం నిర్వహించినా మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. తెనాలిలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభకు అక్కడి టీడీపీ ఇన్చార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టారు. ►చంద్రబాబు సభల్లో చాలా చోట్ల బీజేపీ,జనసేన నాయకులను వేదికపైకి రానివ్వడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులు ఉన్నచోట మొక్కుబడిగా పిలుస్తున్నా మిగిలిన నియోజకవర్గాల్లో వారిని దరిదాపుల్లోకి సైతం రానీయడం లేదు.టీడీపీ అభ్యర్థులున్న చోట్ల బీజేపీ, జనసేన నాయకులను పట్టించుకోవడంలేదు. ►అనంతపురం జిల్లాలో బాలకృష్ణ చేపట్టిన యాత్రలో జనసేన, బీజేపీ జాడే కనిపించడం లేదు. మరోవైపు చంద్రబాబు ఒక్కడే నిర్వహిస్తున్న సభలతోపాటు పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న కూటమి సభలు కూడా అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయి. ఆ సభలకు జనం రావడం గగనమవుతోంది. దీంతో చంద్రబాబు ఒక్కడే వచ్చింనా, కూటమిగా వచ్చింనా ప్రయోజనం మాత్రం శూన్యమేనని ఇట్టే తెలుస్తోంది. ►నాయకులే కలవనప్పుడు ఇక ఆ పారీ్టల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందన్నది విశ్లేషకులు ప్రశ్న. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. పేరుకు మాత్రమే ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పటికీ.. నేతలు, కార్యకర్తల మధ్య ఏ దశలోనూ పొసగడం లేదు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నా, టీడీపీ పూర్తిగా సహకరించడం లేదు. అక్కడ టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ.. క్యాడర్ ఎవరూ జనసేనకు సహకరించకుండా కట్టడి చేసి తానొక్కడే పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతూ ఆయన కోసం పని చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. కింది స్థాయిలో టీడీపీ క్యాడర్ కూడా జనసేన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంది. తమ సీటును తాడూ బొంగరం లేని పార్టీ ఎగరేసుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీటును అన్యాయంగా జనసేనకు వదిలేసి సిగ్గు లేకుండా తిరుగుతున్నారని ఇటీవల వర్మను ఒక గ్రామంలో టీడీపీ కార్యకర్తలు నిలదీసి వెళ్లగొట్టారు. కోనసీమ జిల్లాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు పి.గన్నవరం, అమలాపురంలో సంయుక్తంగా నిర్వహించిన సభలకు జనం రాలేదు. రావులపాలెంలో నిర్వహించిన సభకు 3 వేల మంది కూడా రాలేదు. కూటమి తొలి సభే తుస్సు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి 28న జరిగిన కూటమి తొలి సభే తుస్సుమంది. ఆ సభకు 6 లక్షల మంది జనం వస్తారని హంగామా చేసినా, వచ్చింది వేలల్లోనే. కార్యకర్తల కోసం కేటాయించిన గ్యాలరీల్లో సభ ప్రారంభం నుంచి చివరి వరకు సగం పైగా ఖాళీగానే ఉండిపోయాయి. ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లులో చంద్రబాబు నిర్వహించిన కూటమి సభలు పేలవంగా జరిగాయి. పాలకొల్లు సభలో చంద్రబాబు జనసేన రాష్ట్ర నేత బన్నీ వాసును ప్రచార రథం ఎక్కనీయక పోవడంతో ఆయన అలిగి వెళ్లిపోయారు. తణుకులో బాబు, పవన్‌ల నిలదీత ఈ నెల 10వ తేదీన తణుకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను జనసేన పార్టీల నేతలు అడ్డుకుని నిలదీశారు. ఆశించిన స్థాయిలో జనం రాకపోగా, నిలదీతతో ఇద్దరు నేతలు ఖంగుతిన్నారు. తనకు ప్రకటించిన సీటును టీడీపీకి వదిలేశారని ఆగ్రహంతో ఉన్న జనసేన ఇన్‌ఛార్జి ఇన్చార్జి విడివాడ రామచంద్రరావు సభకు గైర్హాజరవ్వగా ఆయన అనుచరులు సభా వేదిక వద్దకు చేరుకుని ఫ్లకార్డులతో నిరసన తెలిపారు. అక్కడే టీడీపీ, జనసేన కార్యకర్తలు తోపులాటకు దిగారు. గుంటూరు జిల్లా తాడికొండలో చంద్రబాబు నిర్వహిచిన సభలో జనసేన నాయకులను ప్రచార వాహనంపైకి ఎక్కంచి బీజేపీ నేతలను పక్కకు తోసివేశారు. తెనాలిలో పవన్‌కళ్యాణ్ సభకు అక్కడి టీడీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి ఆలపాటి రాజా డుమ్మా కొట్టి నాదెండ్ల మనోహర్ కోసం తాను పని చేసేది లేదని చెప్పకనే చెప్పారు. ప్రధాని మోడీ వచ్చింన సభే విఫలం గత నెల 17వ తేదీన చిలకలూరిపేటలో ప్రధాని మోడీ హాజరైన కూటమి సభ విఫలమవడం పొత్తు పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఎంత ప్రయత్నించినా జనం అనుకున్న స్థాయిలో రాకపోగా సభను నిర్వహించడంలో టీడీపీ నేతలు విఫలమవడంతో అడుగడుగునా అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో మోడీ.. టీడీపీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ఈ నెల 6న చంద్రబాబు క్రోసూరు, సత్తెనపల్లిలో చేపట్టిన ప్రజాగళం సభల్లో జనసేన, బీజేపీ నేతలు కనిపించలేదు. సత్తెనపల్లి సభ జనం లేక అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. టీడీపీ తీరుపై జనసేన, బీజేపీ నేతల ఆగ్రహం బాపట్ల జిల్లాలో ఇప్పటి వరకు మూడు ప్రజాగళం సభలు జరగ్గా ఒక్కటీ విజయవంతం కాలేదు. బాపట్ల, వేమూరు, రేపల్లెలో జరిగిన సభలకు జనం కరువయ్యారు. ఆ సభలకు జనసేన, బీజేపీ నేతలు ఒకరిద్దరిని ప్రచార వాహనంపైకి పిలవడమే తప్ప కార్యకర్తలు ఎక్కడా కనిపించ లేదు. టీడీపీ తమకు సభల గురించి చెప్పడం లేదని, అస్సలు తమను పట్టించు కోవడంలేదని జనసేన, బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో గత నెల 31న జరిగిన చంద్రబాబు సభలో పెట్టిన ఫ్లెక్సీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు లేకపోవడంతో ఆ పార్టీ నేతలు గొడవకు దిగారు. అంతటా అదే తీరు ► ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాకలో ఈ నెల 14న చంద్రబాబు నిర్వహించిన సభకు బీజేపీ నేతలు హాజరు కాలేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మేడపాటి రవీంద్రరెడ్డి సహా జిల్లా నాయకులెవ్వరూ హాజరవకపోడం చర్చనీయాంశమైంది. కూటమి పార్టీల నాయకుల జాడ కూడా కనిపించలేదు. చంద్రబాబు పర్యటనకు పెందుర్తి సీటు దక్కని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి దూరంగా ఉన్నారు. చివర్లో చంద్రబాబు ఆయన్ను పిలిపించుకుని మాట్లాడినా బండారు శాంతించలేదు. ►తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు సభలు ఆశించిన స్థాయిలో జరగలేదని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరులో జరిగిన సభలో కూటమి నాయకులు కనిపించలేదు. గోపాలపురం నియోజకవర్గం నల్లజర్లలో జరిగిన సభకు బీజేపీ, జనసేన నేతలు వెళ్లలేదు. ఈ నెల 10వ తేదీన నిడదవోలులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరైన సభకు జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌ను ప్రచార వాహనంపైకి పిలిచి ఆ సీటును త్యాగం చేసిన టీడీపీ నేత బూరుగుపల్లి శేషారావును మాత్రం పట్టించుకోలేదు. దీంతో శేషారావు అనుచరులు గొడవకు దిగారు. ►నెల్లూరు జిల్లా కావలిలో గత నెల 29న చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. జనం లేకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరగాల్సిన సభ నాలుగు గంటలు ఆలస్యంగా జరిగింది. అప్పటి వరకు చంద్రబాబు బస్సులోనే ఉండిపోయారు. ఈ నెల 29న ఉదయగిరిలో జరిగిన సభకు ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు గైర్హాజరాయ్యారు. ►కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గత నెల 31న చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభకు టీడీపీ అభ్యర్థి జయ నాగేశ్వరరెడ్డి.. బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు ఎవ్వరినీ ఆహ్వనించ లేదు. కర్నూలులోనూ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్.. కూటమి పార్టీలను పట్టించుకోకుండా ఒంటరిగానే ప్రచారం నిర్వహిస్తున్నారు. ►ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూటమి సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయి. స్వయంగా చంద్రబాబు, బాలకృష్ణ ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నా.. బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎక్కడా కనిపించడం లేదు. గత నెల 28న చంద్రబాబు రాప్తాడులో నిర్వహించిన సభలో బీజేపీ ఊసే లేదు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం సభలోనూ బీజేపీ వాళ్లు ఎవరూ లేరు. తమకు ఆహ్వనం లేదని స్థానిక జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి, సభకు దూరంగా ఉన్నారు. -
నారా.. దగ్గుబాటి మధ్య రాజీ కుదిర్చింది రామోజీయేనా?
కప్పుకునేది కాషాయం కండువా చేసేది పసుపు రాజకీయం. ఇదీ ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలి. సంక్షోభంలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని బతికించుకోడానికి.. చంద్రబాబుకు మద్దతుగా ఉండేందుకు పురందేశ్వరి పడని పాట్లు లేవు. ఏపీలో బీజేపీని బలోపేతం చేయవమ్మా అని అధ్యక్ష పదవి కట్టబెడితే.. బీజేపీని నిండా ముంచి మరిది చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎందాకైనా వెళ్తానంటున్నారు పురందేశ్వరి. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడవాలని డిసైడ్ అయినపుడు పురందేశ్వరి దంపతులే మంచి కత్తి ఒకటి చంద్రబాబుకు కానుకగా ఇచ్చారని అప్పట్లో వైస్రాయ్ కోళ్లు ఆగ్రహంగా కూశాయి. వైస్రాయ్ ఎపిసోడ్లో.. తన తండ్రిని ముఖ్యమంత్రి పీఠం నుండి నిర్దాక్షిణ్యంగా దించేసిన కుట్రలో ఎన్టీయార్ తనయ దగ్గుబాటి పురందేశ్వరి..ఆమె భర్త వెంకటేశ్వరరావులు భాగస్వాములన్నది బహిరంగ రహస్యం. వెన్నుపోటులో తనకు అండగా ఉంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చంద్రబాబు ఆఫర్ ఇచ్చారని అంటారు. తీరా వెన్నుపోటు పొడిచేసి కత్తికంటిన నెత్తుటిని తుడిచేసి చంద్రబాబు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న తర్వాత దగ్గుబాటి విషయాన్ని పక్కన పెట్టేశారు చంద్రబాబు. ఇవాళో రేపో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని దగ్గుబాటి కొద్ది రోజులు వెయిట్ చేశారు. అయితే ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దాని వల్ల ప్రయోజనం ఉండదని చంద్రబాబు మనసా వాచా కర్మేణా నమ్మడం వల్ల వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సిఎం పదవి రాలేదు. అప్పటికి కానీ తాము మోసపోయామని దగ్గుబాటి దంపతులు గ్రహించలేకపోయారు. తెలిసిన తర్వాత ఉక్రోషంతో టిడిపి నుండి బయటకు వచ్చి చంద్రబాబుపై కారాలూ మిరియాలను మిక్సీలో వేసి రుబ్బారు. కొంతకాలం బిజెపిలో మరి కొంతకాలం కాంగ్రెస్ లో కాలక్షేపం చేసిన వెంకటేశ్వరరావు ఖాళీ సమయంలో ఓ ఆత్మకథ రాసి అందులో చంద్రబాబును నిర్మా వాషింగ్ పౌడర్ తో ఉతికి ఆరేశారు. ఆ కోపం చాలా ఏళ్ల పాటు చంద్రబాబులో ఉండిపోయింది. అందుకే 2014లో టిడిపి-బిజెపిలు పొత్తు పెట్టుకున్నా.. రాజంపేట నుండి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసిన పురందేశ్వరిని దగ్గరుండి మరీ ఓడించారు చంద్రబాబు.ఎన్నికల ఫలితాల రోజున పురందేశ్వరి ఓడారని తెలిసిన తర్వాతనే చంద్రబాబు సంతృప్తిగా నవ్వారని టీడీపీ వర్గాలంటాయి. రెండు దశాబ్దాలకు పైగా నారా-దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం అలానే కొనసాగింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చెందడం ఆ తర్వాత వరుసగా అన్ని స్థానిక ఎన్నికల్లోనూ టీడీపీ అడ్రస్ గల్లంతు కావడం జరిగిపోయాయి. 2024 ఎన్నికల్లోనూ టీడీపీ లేచి నిలబడే పరిస్థితి లేదని తేలిపోయింది. ఈ సమయంలోనే దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండె సంబంధ సమస్య వచ్చి ఆసుపత్రిలో చేరితే పరామర్శ పేరిట చంద్రబాబు వెళ్లారు. అలా వెళ్లడానికి రామోజీ సలహాయే కారణమంటారు. విడిపోయిన నారా-దగ్గుబాటి కుటుంబాలు మళ్లీ కలవకపోతే వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఎదుర్కోలేమని రామోజీరావే రెండు కుటుంబాలకూ నూరిపోశారని కృష్ణా జిల్లా కోళ్లు మొహమాటంగా కూశాయి. అలా రాజగురువు ఇచ్చిన టిప్‌తో ఆసుపత్రిలో దగ్గుబాటి దంపతులు కాళ్లమీద పడిపోయిన చంద్రబాబు వెన్నుపోటు ఘటన అనంతరం తాను చేసిన ద్రోహాన్ని ఒప్పుకుని క్షమించమన్నారట. దాంతో దగ్గుబాటి దంపతులు చంద్రబాబును క్షమించేసి ఇకనుంచి కలిసుందాం రా అన్నారట. ఆ క్రమంలోనే ఎన్టీయార్ నాణెం విడుదల చేసినపుడు పురందేశ్వరే ప్రణాళిక రచించి చంద్రబాబును ఎన్టీయార్ నాణెం విడుదల కార్యక్రమానికి కుటుంబ సభ్యుల ముసుగులో ఆహ్వానించారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో వన్ టూ వన్ మాట్లాడుకునే వీలూ కల్పించారు. బిజెపితో తిరిగి పొత్తుకు ఆ క్షణానే చంద్రబాబు నడ్డాను మోహించినట్లు నటించారు. ఆ తర్వాత 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్న స్కిల్ స్కాంలో చంద్రబాబు నాయుణ్ని కోర్టు ఆదేశాలతో అరెస్ట్ చేసి జైలుకు పంపగానే.. టీడీపీ నేతలు, చంద్రబాబు కుటుంబ సభ్యులకన్నా కూడా ముందుగా స్పందించింది పురందేశ్వరే. చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అక్రమం అని ఆమె ముందస్తుగా ఖండించేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో ఆ ప్రయత్నాల కోసం నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతలకు కూడా చెప్పకుండా అర్జంట్ గా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కి హస్తినలో దిగి అక్కడ తన చెల్లెలి కొడుకు నారా లోకేష్‌ను తీసుకుని పార్టీ అగ్రనేత కేంద్రమంత్రి అమిత్ షా నివాసంలో ఆయనతో భేటీ కుదిర్చి తన వంతు సాయం అందించారు. ఇక ఎన్నికలు దగ్గర పడే సమయంలో టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం అనాసక్తిగా ఉండడంతో పురందేశ్వరే జోక్యం చేసుకుని టీడీపీతో పొత్తు కుదిరేలా అగ్రనేతల దగ్గర మంత్రాంగం నడిపారని అంటారు. మొత్తం మీద టీడీపీ-బీజేపీల మధ్య పొత్తు కుదిర్చారు. ఆ తర్వాత ఏపీ బీజేపీలో చంద్రబాబు అనుకూల నేతలకు టికెట్లు ఇప్పించారు. చంద్రబాబు అవినీతిని అను నిత్యం ఎండగట్టిన సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావులకు టికెట్ దక్కకుండా పక్కన పెట్టారు పురందేశ్వరి. అలా చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాల కోసం తాను ఏమైనా చేస్తానని చాటుకున్నారు. తాజాగా టీడీపీ నేతల అవినీతి విషయంలో చట్ట ప్రకారం నడుచుకుంటూ స్ట్రిక్ట్‌గా వ్యవహరిస్తోన్న ఐపీఎస్ అధికారులపై వేటు వేయాలంటూ ఏకంగా ఈసీకే లేఖ రాసి బరితెగించేశారు పురందేశ్వరి. ఫలానా అధికారులు ఉంటే అన్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేయడం వేరు.. వారిని తప్పిస్తే ఆ స్థానాల్లో ఎవరిని వేయాలో కూడా పురందేశ్వరే సిఫారసు చేస్తూ జాబితా పంపడం వివాదస్పదం అయ్యింది. ఈ ఎన్నికల్లో కూడా తన తండ్రి స్థాపించిన టీడీపీ గెలిచి అధికారంలోకి రాలేకపోతే ఇక పార్టీ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని పురందేశ్వరి భయపడుతున్నారు. తన తండ్రి పెట్టిన పార్టీని గుంజుకుని.. తన తండ్రి ఆశాయలకు తూట్లు పొడిచిన చంద్రబాబు నాయుడి రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి జారుకోకూడదని పాపం పురందేశ్వరి విపరీతంగా కష్టపడుతున్నారు. అయితే ఏవీ వర్కవువ్ కావంటున్నారు రాజకీయ పండితులు. -సి.ఎన్.ఎస్.యాజులు, సీనియర్ జర్నలిస్ట్ -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం -బొత్స
-
ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారంట..!
-
"ఎంపీ పదవి కోసం..నాడు చంద్రబాబు చేసిన మోసం మర్చిపోయి.."
-
కూటమిలో క్రోధాగ్ని నిరసనల భగభగలు
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు. సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు. ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు. సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు. తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది. అనపర్తి ఎమ్మెల్యే టికెట్‌ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి. -
ఆమె భ్రమ.. గ్రౌండ్ రియాలిటీ తెలియడం లేదు..!
-
బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీపట్ల తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరు.. ఇందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారశైలితో కమలనాథులు తీవ్రంగా రగిలిపోతున్నారు. చంద్రబాబు తమ పార్టీని ఇష్టానుసారం ఆడిస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల టీడీపీకి వత్తాసు పలికేలా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 2014లోనూ టీడీపీ అధినేత పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ పోటీచేసిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి దొంగదెబ్బ తీశారని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన వదినతో కలిసి ఇలాంటి డ్రామానే ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా వారు అనపర్తి నియోజకవర్గాన్ని ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలు అడుతుంటే, ఆ నియోజకవర్గం ఉన్న రాజమండ్రి లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పోటీచేస్తూ కూడా అక్కడి పరిణామాలపై కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీని వెన్నుపోటు పొడవడమేనని వారు స్పష్టంచేస్తున్నారు. పురందేశ్వరి ప్రేక్షకపాత్ర.. ఇక ఈ సీట్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను బీజేపీ రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఏమాత్రం పట్టించుకోవడంలేదని కమలనాథుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి.. పురందేశ్వరి రాజమండ్రి లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి కన్నా చంద్రబాబు తొలుత ప్రకటించిన టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే పురందేశ్వరికి అక్కడ ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి టీడీపీ నాయకత్వం ఆమెను ఒప్పించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీకి, పారీ్టనే నమ్ముకున్న నాయకులకు టీడీపీవల్ల అన్యాయం జరుగుతున్నా ఆమె మౌనంగా ఉంటున్నారని వారంటున్నారు. అవసరమైతే, బీజేపీ ఆ స్థానాన్ని వదులుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్లు ఆ పారీ్టలో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అప్పట్లో మోదీపై బాబు విమర్శలను ఖండించడంవల్లే.. వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని, ప్రధాని మోదీని చంద్రబాబు టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిని అప్పట్లో ప్రస్తుత అనపర్తి బీజేపీ అభ్యర్థి ఎం. శివరామకృష్ణంరాజు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీయన అభ్యర్థిగా కొనసాగితే టీడీపీ ఓట్లు బదలాయించడం కష్టమని కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను వదిలేసి వాటిని ఖండించినందుకు శివరామకృష్ణంరాజును బలిపశువును చేయాలని టీడీపీ ప్రయతి్నస్తోందని.. కానీ, పురందేశ్వరి టీడీపీ కుట్రను ఏమాత్రం అడ్డుకోకపోవడం ద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడాన్ని కమలం శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. 2014లో మాదిరిగానే ఇప్పుడూ వెన్నుపోటు మరోవైపు.. చంద్రబాబు–పురందేశ్వరి తమ రాజకీయ డ్రామాను రక్తికట్టించేందుకు శివరామకృష్ణంరాజు బలమైన అభ్యర్థి కాదని ఇంకో కొత్త ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇలాంటి ప్రచారాలే చేసి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు పురందేశ్వరి ఆయనకు తోడైందని వారంటున్నారు. అప్పట్లో బీజేపీకి ఐదు లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ముందు చెప్పి ఆ తర్వాత నాలుగు లోక్‌సభ 14 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు. ఆ అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు బలమైన వారు కాదంటూ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు పోటీగా టీడీపీ వారికి సైతం బి–ఫారాలిచ్చారు. ఆ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు కూడా బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో పురందేశ్వరి భాగస్వామ్యం కావడంపట్ల కమల దళంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు–పురందేశ్వరి కలిసి నాటకం బీజేపీతో పొత్తు కుదరక ముందే గత ఫిబ్రవరి 24న చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత మార్చిలో పొత్తులు ఖరారయ్యాక టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎం. శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. రెండ్రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన నాయకుల సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిచారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా అనపర్తి టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీచేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుండడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. పురందేశ్వరి ఈ పరిణామాలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు–పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఈ డ్రామాను ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
ఒక అత్యాశ...ఒక అసూయ
-
ఒక అత్యాశ... ఒక అసూయ... ఒక మాయావి!
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ ఏపీ శాఖకు అధ్యక్షురాలు. ఎన్టీ రామారావు కూతురు అనే అర్హత ఆమెకు రాజకీయ ఆశ్రయాన్ని కల్పించింది. తాజా హోదాకు కూడా కారణమైంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు, రామోజీల తర్వాత ఈమె పాత్రే ముఖ్యమైనదని లక్ష్మీపార్వతి ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. తండ్రి షాజహాన్‌కూ, పెద్దన్న దారాషికోకూ వెన్ను పోటు పొడిచిన ఔరంగజేబుతో చంద్రబాబును ఎన్టీఆర్ పోల్చారు. చంద్రబాబు ఔరంగజేబయితే లక్ష్మీపార్వతి లెక్క ప్రకారం పురందేశ్వరిది రోషనారా పాత్ర అవుతుంది. అంతఃపుర కలహాల్లో చిన్నక్క రోషనారా చేసిన సాయానికి గుర్తుగా తాను రాజైన పిదప ఔరంగజేబు ఆమెను అందలాలెక్కించి కృతజ్ఞతను ప్రకటించుకున్నాడు. ఎన్టీఆర్ కుటుంబం ‘చిన్నమ్మ’గా పిలుచు కునే పురందేశ్వరి పట్ల చంద్రబాబు అటువంటి కృతజ్ఞత ప్రకటించుకోలేదని ఆమె క్యాంపు కినుకతో ఉండేది. చంద్రబాబు మోసంపై పురందేశ్వరి భర్త ఓ పుస్తకం కూడా రాశాడు. షర్మిల మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి. మూడేళ్ల కింద తండ్రి పేరుతో తెలంగాణలో ఒక పార్టీ పెట్టారు. పార్టీ ఎందుకు పెట్టారన్నది ఎవరికీ అర్థం కాలేదు. ఏపీలో అన్న ముఖ్యమంత్రి అయ్యారు కనుక తెలంగాణలో తానెందుకు కాకూడదన్న ఆరాటం తప్ప మరో హేతు బద్ధమైన కారణం కనిపించలేదు. కనుకనే ఆ ప్రాంతంలో వైఎస్ అభిమానులు లక్షల సంఖ్యలో ఉన్నా పార్టీలో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడంలోని ఔచిత్యాన్ని వారు ప్రశ్నించారు. అటువంటి వారికి షర్మిల ఘాటు గానే సమాధానం చెప్పారు. తెలంగాణ తాను మెట్టినిల్లనీ, తనకిక్కడ సర్వహక్కులున్నాయనీ ఢంకా భజాయించారు. అయితే తాను మెట్టినవారి ఇంటి పేరు మొరుసుపల్లిని మాత్రం ఆమె స్వీకరించలేదు. స్వీకరించాలనే రూల్ కూడా ఏమీ లేదు. తాను ఏ ఇంటి పేరు స్వీకరించాలో నిర్ణయించుకునే అధికారం ప్రతి మహిళకూ ఉంటుంది. కాకపోతే మెట్టినింటి ఆధారాలతో పొలిటికల్ క్లెయిమ్ పెట్టినప్పుడు ఇటువంటి ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. తలెత్తాయి. చంద్రబాబు నాయుడు వయోభారం మీద పడింది. ఈసారి గెలిస్తేనే పార్టీ బతుకు తుంది. కొడుకు రాజకీయ భవిష్యత్తు నిలబడుతుంది. కానీ క్షేత్ర నాడి బలహీనంగా కొట్టుకుంటున్నది. ఆయన దగ్గర ఎన్నికల ఎజెండా లేదు. ఎజెండాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించేశారు. ‘నా పరిపాలన వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి. మీ ఊరికి మంచి జరిగిందనుకుంటేనే నాకు స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడండ’ని జగన్మోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు. చరిత్రలో ఇంత సూటిగా, ఇంత నిక్కచ్చిగా చెప్పగలి గిన నేత వైఎస్ జగన్ మాత్రమే. ఐదేళ్ల పారదర్శక పాలన ఇచ్చిన ఆత్మవిశ్వాసం అది. ఈ ఛాలెంజ్‌ను చంద్రబాబు స్వీకరించలేక పోతున్నారు. తాను పాలించిన ఐదేళ్లలో మంచి జరిగితేనే ఓటేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఛాలెంజ్ స్వీకరించకపోతే తాను చేసిన మంచి ఇసుమంతైనా లేదని అంగీకరించినట్టే! అందుకే ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఎజెండాల మీద చర్చలు జరగవద్దు. పొత్తులతో నెట్టుకుని రావాలి. దుష్ప్రచారంతో పబ్బం గడుపుకోవాలి. యెల్లో ముఠా ముందున్న ఆప్షన్లు ఇవే! పురందేశ్వరి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని నంజు కోవడం కుదరలేదు. లక్ష్మీపార్వతిని అడ్డు తొలగిస్తే కుదురుతుందని చంద్రబాబు, రామోజీ నమ్మబలికారు. ఎన్టీ రామారావును గద్దె దింపకుండా లక్ష్మీపార్వతి అడ్డును తొలగించలేమని తీర్మా నించారు. సోదర సోదరీమణులందరిలోకీ తెలివైనదిగా పేరున్న పురందేశ్వరికి కూడా ఈ తీర్మానంలో నిజాయితీ కనిపించింది. ఆపరేషన్ వైస్రాయ్‌కు తోబుట్టువులను సిద్ధం చేసింది ఆమేననే ప్రచారం ఉన్నది. వ్రతం చెడింది కానీ ఫలం దక్కలేదు. ఈసారి తాను మారిన మనిషినని బంధువర్గ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రకటించారట! పులి ముసలిదైపోయింది. శాకా హారిగా మారిపోయింది. బంగారు కడియాన్ని కూడా నమల్లేక పోతున్నది. మనం కలిసుంటే పిల్లలు సంయుక్తంగా నములు కుంటారని ప్రతిపాదించారట! తాము మిస్సయిన బస్సు తమ వారసుడికి దొరికితే దగ్గుబాటి కుటుంబానికి ఇంకేమి కావాలి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారో తెలి యదు కానీ డీల్ కుదిరింది. పురందేశ్వరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడానికి చంద్రబాబు – రామోజీలు కలిసి ఆరెస్సెస్‌లో కదపాల్సిన పావులన్నీ కదిపి చివరికి కృతకృత్యులయ్యారని సమాచారం. ఎన్నికలు పూర్తయ్యేలోగా ఆమె నిర్వహించవలసిన పాత్రకు సంబంధించిన స్క్రిప్టు పుస్తకాన్ని ఆమె చేతిలో పెట్టారు. షర్మిల తాను పాదయాత్ర చేస్తే ఓట్లు జలజలా రాలతాయనే మూఢ నమ్మకం ఏదో షర్మిలకు ఉండేదట! ఆ నమ్మకాన్ని యెల్లో మీడియా పెద్దలు మరింత ఎగదోశారు. తెలంగాణలో ఆ నమ్మకం వమ్మయింది. వైఎస్సార్, వైఎస్ జగన్‌లలో ఉన్న ‘మాట తప్పని – మడమ తిప్పని’ లక్షణం షర్మిలలో ఏ కోశానా కనిపించలేదు. తెలంగాణలోనే ఆమె పలుమార్లు నాలుక మడ తేశారు. దీంతో ఉన్న కొద్దిపాటి అనుచరుల్లోనూ భ్రమలు పటా పంచలైపోయాయి. ‘చావైనా బతుకైనా తెలంగాణ’తోనే అంటూ ఆమె చేసిన ప్రకటన హాస్యాస్పదంగా మిగిలిపోయింది. ‘ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను, 119 సీట్లలో ఒంటరిగా పోటీ చేస్తాన’ని పలుమార్లు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా చూడటం తమ పనికాదని చెప్పారు. అదే నోటితో వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తుకోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఏడాది తిరక్కుండానే కాంగ్రెస్ పిలుపు కోసం తహతహలాడారు. రేవంత్‌రెడ్డిని తిట్టని తిట్టు లేదు. ఆయన సీఎం కావడమే తరువాయి, ఆమె స్వరంలో చిత్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆమె నిలకడలేనితనంపై అప్పటికే అవగాహన ఉన్నందువల్ల ఆమె స్వర విన్యాసాలను ఎవరూ పట్టించుకోలేదు. ఈ దశలో యెల్లో పెద్దలు మళ్లీ రంగంలోకి దిగారు. చంద్రబాబుకు రెండు అవసరాలున్నాయి కదా! బీజేపీతో పొత్తు – పొత్తు ద్వారా కలిగే ప్రయోజనాలు పొందడం మొదటిది. ఇందుకోసం పురందేశ్వరి డీల్. రెండోది జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం. యెల్లో మీడియా దిగంబర ప్రదర్శన జనంలో వెగటు పుట్టిస్తున్నది. కొత్త గొంతుకతో యెల్లో పలుకులు పలకాలి. ఆ గొంతుక జగన్ ఇంటి నుంచే వస్తే ఇంకేం కావాలి? చకచకా ఏర్పాట్లు జరిగాయి. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి షర్మిలను వరించేట్టుగా శకుని పాచికలు విసిరాడు. తల బీజేపీలో, మొండెం టీడీపీలో ఉండే సీఎం రమేశ్‌కు చెందిన ప్రైవేట్ విమానాలు అటూ ఇటూ పరుగులు తీశాయి. కొస మెరుపు ఏమిటంటే మొన్న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడు దల చేయడానికి కూడా సదరు బీజేపీ నాయకుడి విమానంలోనే షర్మిల కడపకు వెళ్లారు. తన ఉపన్యాసాల్లో మాటిమాటికీ రాజశేఖరరెడ్డి బిడ్డనని చెప్పుకునే షర్మిల ఆయన మరణానంతరం అవినీతి కేసులో ఆయన పేరు చేర్చిన కాంగ్రెస్‌లో చేరడంపై ఇప్పటికీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అలా చేర్చినట్టు సోనియాకూ, రాహుల్‌కూ తెలియదట! ‘ఈ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పార’ని షర్మిల చెప్పారు. క్విడ్ ప్రో కో కేసుల్లో విధాన నిర్ణయాలపై ప్రభుత్వాధి నేత పేరు లేకుండా బయటి వ్యక్తిపై కేసు ఎట్లా పెడతారు? సోనియాకు, రాహుల్‌కు తెలియదనడం చెవుల్లో పూలు పెట్టడంకాదా! చంద్రబాబునాయుడు అన్నిరకాల పొత్తుల్నీ జాగ్రత్తగానే అల్లుకుంటూ వచ్చాడు. ఇంటి ముందు ‘ఎన్డీఏ’ బోర్డు పెట్టుకున్నాడు. దొడ్లో ఇండియా కూటమిని కట్టేసుకున్నాడు. ఒక్క వైసీపీ తప్ప ఎవ్వరూ వ్యతిరేకం కాదు. అయినా గ్రాఫ్ వేగంగా పడిపోతున్నది. గుండె లయ తప్పుతున్నది. మాటలు తడబడుతున్నవి. దుష్ప్రచారాన్ని ఇప్పటికే ఆరున్నొక్క రాగంతో హైపిచ్‌కు తీసుకెళ్లారు. అయినా ఏదో వెలితి. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖల అధ్యక్షురాళ్లతో సమన్వయం కుదిరినా కూటమిలో కళ లేదు, కలవరం తప్ప! రెండు జాతీయ పార్టీల రాష్ట్ర శాఖలను ఇద్దరు మహిళలే నడిపి స్తున్నందుకు గర్వపడాలో, ఒక ప్రాంతీయ పార్టీకి ఆ రెండు పార్టీల ఆఫీసులు సబ్–స్టేషన్లుగా మారినందుకు క్షోభ పడాలో తెలియని పరిస్థితి రాష్ట్ర ప్రజలది! యెల్లో కార్డ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా నియుక్తురాలైనప్పటి నుంచి టీడీపీ ప్రయోజనాలకే పురందేశ్వరి పెద్దపీట వేస్తున్నారని బీజేపీ కాషాయ టీమ్ వాపోతున్నది. టిక్కెట్ల పంపిణీలోనూ యెల్లో టీమ్‌కే పెద్దపీట వేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పోటీ చేస్తున్నదే 10 అసెంబ్లీ సీట్లకు! కానీ 22 మంది ఉన్నతాధి కారులను తొలగించాలని, వారి స్థానంలో ఫలానా వారిని నియ మించాలని బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఆమె ఎన్నికల సంఘా నికి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు – రామోజీల డ్రాఫ్టు కింద ఆమె సంతకం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక షర్మిల కూడా యెల్లో కూటమి ప్రయోజనాలకు అను గుణంగానే ప్రచారాన్ని ప్రారంభించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ప్రభుత్వాన్ని నిందించడం, ముస్లిం, మైనారిటీ ఓట్లను దూరం చేయడం అనే డబుల్ యాక్షన్ ప్రోగ్రామ్‌ను షర్మిలకు అప్పగించారు. ఈ కర్తవ్యంలో ఆమె టీడీపీ నేతలను కూడా మించిపోయి మాట్లాడుతున్నారు. మణిపుర్లో అల్లర్లు జరిగితే జగన్ ఖండించలేదట. మణిపుర్ అల్లర్ల నేపథ్యమేమిటి? దానికి మతం రంగు పులమాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కొండ ప్రాంతంలోని ప్రజలకూ, మైదాన ప్రాంత ప్రజలకూ మధ్యన చెలరేగుతున్న భూసమస్య. తెగల సమస్య. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రం స్పందించాల్సిన సమస్య. భారత్‌లోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడిని కూడా ఖండించవచ్చు. కానీ ప్రయోజనముంటుందా? ఉక్రోషం ఎక్కువైతే చేసే విమర్శల్లో పస ఉండదు. బీజేపీకి జగన్ బానిసగా మారాడట! ఒక ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన వైఖరితో కేంద్రంతో సఖ్యంగా ఉంటే బానిసగా మారడమా? కేంద్రంలో జనతా పార్టీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఎంజీఆర్ సఖ్యంగానే ఉండేవారు. ఆయన బానిసగా మారినట్టా? ఇప్పుడు నవీన్ పట్నాయక్ కూడా అదే వైఖరి అవలంబిస్తున్నారు. ఒడిషాకు ఈ విధానం వల్ల ప్రయోజనం కలుగుతున్నది. కేంద్ర – రాష్ట్ర సంబంధాలు అనేవి ఒక విధాన పరమైన నిర్ణయం. దీనికి పార్టీల ఐడియాలజీలతో సంబంధం లేదు. బీజేపీకి జగన్ బానిసగా మారితే ఎన్డీఏలోనే చేరేవాడు కదా! వైసీపీ సిద్ధాంతాలకూ, బీజేపీ సిద్ధాంతాలకు పొసగదు కనుకనే జగన్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్నది. ఇక వివేకా హత్యపై యెల్లో కూటమి చేస్తున్న ఆరోపణలను మరింత బలంగా షర్మిల వినిపిస్తున్నారు. ఆమెకు చంద్రబాబు అప్పగించిన బాధ్యత కూడా అదే కదా! ఈ హత్యపై వివిధ కోణాల్లో తలెత్తుతున్న సందేహాలన్నీ షర్మిల పక్కన తిరుగుతున్న సునీత కుటుంబంవైపే వేలెత్తి చూపుతున్నాయి. అయినా విచారణ పూర్తి కాలేదు కనుక బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఎవరినీ హంతకులని సంబోధించడం లేదు. అటువంటి నాగరికమైన కట్టుబాటును కూడా షర్మిల గిరాటేశారు. చట్టాన్నీ, ఎన్నికల నియమావళిని కూడా ఉల్లంఘించారు. అవినాశ్‌రెడ్డిని పదేపదే హంతకుడని సంబోధించారు. ఈ వైఖరిని ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అవి నాశ్ హుందాగా స్పందించారు. రెడ్‌కార్డ్ చంద్రబాబు, యెల్లో కూటముల కథ ముగిసింది. ఎన్ని కుప్పిగంతులు వేసినా ఈ రెండు నెలలే. యెల్లో కూటమితో ఊరేగుతున్న ఉపగ్రహాలన్నీ పునరాలోచించుకోవాలి. కూటమి క్షుద్రవిద్యల కారణంగా, కుయుక్తుల కారణంగా జనంలో వారి పట్ల ఏవగింపు కలుగుతున్నది. క్షేత్ర సమాచారం ప్రకారం వైసీపీ ఓటింగ్ బలం 55 శాతానికి చేరుకున్నది. కూటమి ఉమ్మడి మద్దతు 41 శాతం. ఈ తేడా మరింత పెరగనున్నది. రాబోయే ఘోర పరాజయం తర్వాత యెల్లో కూటమి బతికి బట్టకట్టడం జరిగితే అదొక ప్రపంచ వింతే! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
ఎన్టీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టింది నువ్వే..
-
"నేను సైతం మరిది కోసం.." మరీ ఇంత బరితెగింపా !
-
‘ఈనాడు’ తప్పుడు రాతలు.. సీఎస్ జవహర్‌రెడ్డి సీరియస్
సాక్షి, విజయవాడ: ఈనాడు తప్పుడు రాతలపై సీఎస్ జవహర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీళ్లా ఎస్పీలు’ అంటూ కొత్త ఎస్పీల బదిలీలపై ఈనాడు రాసిన అబద్ధపు రాతలపై సీఎస్ ఖండన లేఖను విడుదల చేశారు. తన ఖండన ఈనాడు మొదటి పేజీలో ప్రచురించాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని సీఎస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం చేసిన బదిలీలను ఎలా తప్పు పడతారంటూ సీఎస్ ప్రశ్నించారు. ఐపీఎస్ అధికారులు ఏసీఆర్లు, సీనియారిటీ, అనుభవం పరిశీలించాకే నియమించాం. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను ఈసీఐ పరిశీలించి ఉత్తర్వులు ఇచ్చిందని సీఎస్ పేర్కొన్నారు. ఈసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాష్ట్ర ప్రభుత్వం పంపిన అధికారుల ప్యానెల్‌పై అభ్యంతరాలుంటే ఈసీఐ కొత్త ప్యానెల్ కోరుతోంది. అధికారుల బదిలీలు, నియమకాలపై సర్వాధికారాలు ఈసీఐకి ఉంటాయి. అధికారుల ప్రతిష్ట దెబ్బతీసేలా వార్తలు రాయడం అనైతికం. ప్రతి అధికారి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నారు. అలాంటి వారిపై ఇలా తప్పుడు, నిరాధార వార్తలు రాయడం సమంజసం కాదు. తక్షణమే ఈనాడు మొదటి పేజీలో నా ఖండన ప్రచురించాలి. లేదంటే లీగల్ చర్యలు తీసుకుంటా’’ అని సీఎస్ జవహర్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్‌ల సంఘం ఆగ్రహం పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతిపై ఐపీఎస్‌ల సంఘం మండిపడింది. ఈ ముగ్గురిపై క్రిమినల్ చర్యలకు దిగాలని నిర్ణయించింది. తమపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించమని ఐపీఎస్‌ల సంఘం తేల్చి చెప్పింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఈసీకి పురేందశ్వరి ఫిర్యాదు చేయడాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు ఐపీఎస్ అధికారుల సంఘం వెల్లడించింది. ఇదీ చదవండి: ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా చంద్రబాబూ.. -
తండ్రిని చంపినవాళ్లకు ఇది ఒక లెక్కనా: లక్ష్మీపార్వతి
-
బెదిరింపు ధోరణిలో పురందేశ్వరి లేఖ
-
పురందేశ్వరి తహతహ
-
పురందేశ్వరి తెగింపు..ఈసీకి లేఖ
-
బీజేపీని బాబు జనతా పార్టీగా చేశావ్..అమ్మా
-
పురందేశ్వరి బరితెగింపు!
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ... తన మరిది చంద్రబాబు నాయుడి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బరితెగించేశారు. ఒకేసారి ఏకంగా 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాయటమే కాక... ఆ 22 మంది స్థానంలో ఎవరెవరిని నియమించాలో పేర్లతో సహా సూచించారు. ఒకరకంగా అనధికారిక సిఫారసు చేశారు. నిజానికిలా ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటమనేది అనూహ్యం. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం... తాను ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతుండటం వల్లే ఆమె ఇంతకు బరితెగించారని..ఒకరకంగా రాజ్యాగం వ్యవస్థలను బ్లాక్మెయిల్ చెయ్యటానికి దిగారని బీజేపీ వర్గాలే పేర్కొంటున్నాయి. ‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని రాజకీయంగా ప్రభావితం చేయటం... రాష్ట్రంలో ఇతర అధికారులందరినీ బెదిరించడం అనే ధోరణి ఈ లేఖలో కనిపిస్తోంది’’ అని బీజేపీలో మొదటి నుంచీ ఉంటున్న సీనియర్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. తన మరిది, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి ప్రయోజనాలే పరమావధిగా ఆమె పనిచేస్తున్నారని, ఈ క్రమంలో తన పదవిని దుర్వినియోగం చేస్తున్నారని మరో సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. నిజానికి ఈ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఆరు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది. కానీ తాము అసలు పోటీలోనే లేని అనంతపురం, ðనెల్లూరు, చిత్తూరు, నంద్యాల , పల్నాడు, ప్రకాశం జిల్లాల ఎస్పీలను కూడా బదిలీ చేయాలంటూ పురంధేశ్వరి లేఖ రాయటంతో... ఇది బీజేపీ ప్రయోజనాల కోసం కాదనేది స్పష్టంగా తేలిపోయింది. బీజేపీకున్న అధికార బలాన్ని తాకట్టు పెట్టయినా తెలుగుదేశానికి మేలు చేయాలనే దృఢ చిత్తంతో ఆమె పనిచేస్తున్నారని, చంద్రబాబు ప్రయోజనాల కోసం పూర్తిగా దిగజారిపోయారనేది కూడా స్పష్టమవుతోంది. 2019 ఎన్నికల సమయంలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)తో పాటు డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసినందున... ఇప్పుడు కూడా అలా చేయాలని ఒత్తిడి తెచ్చేందుకే చంద్రబాబు పురందేశ్వరితో ఈ లేఖ రాయించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోలీసు అధికారులను బదిలీ చేయించటం ద్వారా మిగిలిన వారిని భయపెట్టి తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలన్నది వీరి ఎత్తుగడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెదిరింపు ధోరణి సాధారణంగా ఎవరిపైనైనా ఫిర్యాదు చేస్తే.. వారివల్ల తామెదుర్కొంటున్న ఇబ్బందులు తెలుపుతూ వినతిపత్రాలు ఇస్తూ ఉంటారు. కానీ దగ్గుబాటి పురందేశ్వరి 22 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ కోరుతూ.. ఆయా స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశారంటే... బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకొని పురందేశ్వరి– చంద్రబాబులు అధికారులను ఎలా బెదిరించాలని ఆలోచన చేస్తున్నారో అర్ధమైపోతుందని అటు రాజకీయ, ఇటు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. సాధారణ ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి సంబంధం ఉండని డిజాస్టర్ మేనేజ్మెంట్ (విపత్తుల నివారణ ) డీజీ, సీఐడీ ఏడీజీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐజీ అధికారులను సైతం బదిలీ చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారంటే... తమకు నచ్చని, తాము బెదిరించాలని అనుకున్న అ«ధికారులకు వ్యతిరేకంగా ఈ ఫిర్యాదు చేసినట్టు స్పష్టంగా తెలిసిపోతోంది. చంద్రబాబు అవినీతి కేసులపై విచారణ జరుపుతున్న సీఐడీ ఏడీజీకి, ఎన్నికల ప్రక్రియకు సంబంధం లేకపోయినా పురందేశ్వరి అతనిపైనా ఫిర్యాదు చేయడం... ఎన్నికలు సజావుగా జరగాలన్న ఆలోచన కన్నా ఇతర దురుద్దేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి నుంచీ సొంత రాజకీయ అజెండాతోనే పది నెలల కిత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పురందేశ్వరి తన కుటుంబ, బంధువుల ప్రయోజనాల కోసమే సొంత అజెండాతో పనిచేస్తున్నారని బీజేపీ నాయకులే విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోనూ, దేశ వ్యాప్తంగా చాలా మంది ఆయా కేసుల్లో బెయిల్‌పై కొనసాగుతుండగా.. పురందేశ్వరి మాత్రం బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాయడాన్ని ఇప్పుడు పలువురు గుర్తు చేస్తున్నారు. బీజేపీ– టీడీపీ పొత్తు లేని సమయంలో కూడా ఏళ్ల తరబడి చంద్రబాబు చేస్తున్న రాజకీయ డిమాండ్‌కు అనుగుణంగా ఆమె అప్పట్లో సీజేకి లేఖ రాశారని కమలం పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ సాగింది. అంతకు ముందు నాలుగేళ్ల పాటు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ చేస్తున్న ఆరోపణలనే పురందేశ్వరి వల్లె వేస్తూ కేంద్ర దర్యాపు సంస్థలతో విచారణలు జరపాలంటూ కేంద్ర హోంమంత్రికి సైతం లేఖలు రాసిన రాశారంటే... మొదట నుంచీ చంద్రబాబు– పురందేశ్వరిల రాజకీయ సంబంధాలు ఎలా ఉండేవో అర్ధమవుతుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
పురందేశ్వరిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కొత్త పన్నాగం
-
పండుటాకులు విలవిల
సాక్షి నెట్వర్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిల కుట్రలతో అవ్వాతాతలు విలవిలలాడుతున్నారు. ఎన్నికల సంఘంపై తమ అనుకూలురుతో ఒత్తిడి తెచ్చి పింఛన్ల పంపిణీ చేయనీయకుండా వలంటీర్లను ఈ ముగ్గురు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో అవ్వాతాతలు, ఇతర పింఛన్ లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలంటీర్ల ద్వారా ప్రతినెలా 1నే లబ్దిదారులు ఇళ్ల వద్దే ప్రభుత్వం పింఛన్ అందిస్తుండగా ఈసారి టీడీపీ, జనసేన కుతంత్రాలతో సచివాలయాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం ఎండా కాలం కావడంతో వేసవి తాపానికి వడదెబ్బ కొట్టి మృత్యువాత పడుతున్నారు. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 20 మంది పింఛన్ లబ్దిదారులు మృత్యువాత పడటం విషాదాన్ని నింపింది. మృతుల కుటుంబీకులు చంద్రబాబు వ్యవహార శైలిపై మండిపడ్డారు. ఆయన వల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉసురు చంద్రబాబుకు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. చేయాల్సిందంతా చేసి టీడీపీ నేతలు ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని నిప్పులు చెరిగారు. ఒక్కరోజే 20 మంది మృత్యువాత అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన ఎన్.రాజమ్మ (85) సచివాలయం వద్దకు నడిచి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో రాయి కాలుకు తగిలి ముందుకుపడి మృతి చెందింది. శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గొల్లవాండ్లపల్లిలో టీడీపీ కుట్రలతో ఆందోళనకు గురైన దుగ్గిలమ్మ(70) అనే వృద్ధురాలు మృతిచెందింది. అలాగే గుండెపోటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం మద్దులచెర్వులో చోటు చేసుకుంది. అదేవిధంగా కొండకమర్ల పంచాయతీ పోలేవాండ్లకొత్తపల్లిలో సన్నాయప్ప (73) తన భార్య పింఛన్ కోసం ఎండలో నడుచుకుంటూ వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత వడదెబ్బకు గురై మృతి చెందాడు. సూళ్లూరుపేట సాయినగర్‌లో ఈశ్వరవాక లలితమ్మ (58) వితంతు పింఛను కోసం గాండ్లవీధి సచివాలయం వద్ద క్యూలో నిలబడి ముందుకు పడిపోయి ప్రాణాలు విడిచింది. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం ఎరికంబట్టు దళితవాడకు చెందిన అప్పాస్వామి(75) పెన్షన్ కోసం ఇంటి బయటే మంచంపై ఎదురు చూస్తూ ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై మరణించాడు. అలాగే చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాళెం మండలం నెరబైలుకు చెందిన నన్నేసాహెబ్ (76) పింఛన్ కోసం వెళ్లి సచివాలయం వద్ద కుర్చిలో కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సచివాలయం వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు నన్నేసాహెబ్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఘడియపూడి పునరావాస కాలనీలో బొమ్మల శేషయ్య (70) పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లి ఇంటికి చేరుకుని భోజనం చేసి నీరసంగా పడుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో కుటుంబ సభ్యులు లేపడానికి ప్రయత్నించగా విగత జీవుడై ఉన్నాడు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్ళపల్లికి చెందిన బుర్ర శామ్యూలు (71) గుండెపోటుకు గురై మృత్యువాత పడ్డాడు. అలాగే గుంటూరు జిల్లా కొల్లిపరలో దొప్పలపూడి బాబూరావు (62) వ్యవసాయ కూలీ. ఈ క్రమంలో పింఛన్ కోసం సచివాలయానికి వెళ్లిన బాబూరావు తిరిగొస్తూ ఇంటికి సమీపంలో కుప్పకూలిపోయి మరణించాడు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరుకు చెందిన సయ్యద్ ఖాదర్‌బాషా బోదకాలుతో బాధ పడుతున్నాడు. ఈసారి సచివాలయం వద్ద ఇస్తారని తెలిసి కుమారుడి బైక్‌పై అక్కడకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చాక అస్వస్థతకు గురై మృతిచెందాడు. కాకినాడ జిల్లా తూరంగి పగడాలపేటకు చెందిన అడపా వీర్రాజు (67) పింఛన్ కోసం సచివాలయం వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తూ మార్గమధ్యంలో కళ్లు తిరగడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే స్థానికులు వీర్రాజును ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. అలాగే ఏటిమొగ ప్రాంతానికి చెందిన పట్టా అప్పారావు(61) సమీపంలోని సచివాలయానికి వెళ్లాడు. ఎండ తీవ్రతతో సచివాలయం దగ్గరే స్పృహ తప్పాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఏటిమొగలోని రాజీవ్ గృహకల్ప సముదాయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం కురుమద్దాలికి చెందిన పిల్లి నాగేశ్వరమ్మ (75) కిలోమీటరుకు పైగా దూరంలో ఉన్న సచివాలయానికి కాలినడకన బయలుదేరింది. కొంత దూరం నడిచి ఆయాసంతో పడిపోయి మృత్యువాత పడింది. పల్నాడు జిల్లా దుర్గి మండల పరిధిలోని నెహ్రూనగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయి (70) పెన్షన్ కోసం ముటుకూరు 2 సచివాలయానికి ఆటోలో వెళ్తుండగా దారి మధ్యలో సొమ్మసిల్లి కుప్పకూలింది. ఆమెను ముటుకూరు పీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లె పంచాయతీ దిగువతొట్లివారిపల్లె గ్రామానికి చెందిన టి. మంగమ్మ(68) ఇంట్లోనే ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలిపోయి మృతి చెందింది. పింఛన్ కోసం ఎండలో వెళ్లి వడదెబ్బకు గురై ఇద్దరు మృతి చెందారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన దివ్యాంగుడు రాజుబాబు (48) పింఛన్ కోసం పంచాయతీ కార్యాలయానికి ఎండలో వెళ్లాడు. దీంతో వడదెబ్బకు గురికావడంతో ఇంటికి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోనై మృతి చెందినట్లు ఆయన భార్య సీత తెలిపింది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ వేలమామడికి చెందిన పాడి సొములు(65) పింఛన్ కోసం పెదకోట సచివాలయానికి నడుచుకుని వెళుతుండగా జాలడ గ్రామ సమీపంలో ఆయాసం రావడంతో కూర్చొన్నాడు. అదే సమయంలో సొమ్మసిల్లిపోవడంతో మృత్యువాత పడ్డాడు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన పింఛన్ లబ్దిదారుడు పాతకోకిల పెద్దిరాజు (63) పింఛన్ ఇస్తున్నారని తెలిసి సచివాలయానికి బయలుదేరాడు. తీవ్ర ఉద్వేగానికి గురైన పెద్దిరాజు ఇల్లు దాటి వెళుతుండగా కొద్దిదూరంలో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. చేతులు విరిగి.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొర్లకుంట సచివాలయానికి పింఛన్ తీసుకునేందుకు వెళ్లిన పోలి తులసమ్మ అనే వృద్ధురాలు తిరిగి వస్తూ కింద పడటంతో చేయివిరిగింది. ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం వేంపాడుకు చెందిన గ్రంధి మరియమ్మ (71) పింఛను నగదు కోసం ముండ్లమూరు సచివాలయానికి వెళ్లింది. మండుటెండలో ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ సెంటరుకు వచ్చింది. ఆటో ఎక్కే క్రమంలో ఎండధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయింది. ఈ క్రమంలో ఆమె మూతికి, పెదాలకు తీవ్రగాయాలయ్యాయి. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డకు చెందిన పరుచూరి కృష్ణకుమారి (74) గుండెపోటుకు గురయ్యారు. చల్లపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొన్న సుబ్బారావు అనే వృద్ధుడు పింఛను కోసం గ్రామ సచివాలయానికి వెళుతూ మార్గమధ్యంలో స్పృహ తప్పి పడిపోయారు. పింఛన్ తీసుకోవాలంటే 30 కి.మీ వెళ్లాల్సిందే టీడీపీ నేతల నిర్వాకంతో వలంటీర్లు ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో గిరిజనులు అల్లాడుతున్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం చెన్నపాలెం గ్రామం గారపెంట పంచాయతీలో ఉండగా దాని సచివాలయం పుల్లలచెరువులో ఉంటుంది. పుల్లలచెరువు నుంచి చెన్నపాలెం గిరిజనగూడెం వెళ్లాలంటే రానుపోను కలిపి 30 కి.మీ దూరం. ఇప్పటి వరకు వలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ ఇస్తున్నారు. ఈనెల వలంటీర్లు రాకపోవడంతో కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులు, వికలాంగులు కూడా సచివాలయానికి వెళ్లి పింఛన్ తీసుకోవాల్సి వచ్చింది. మండుటెండలో అంతదూరం వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కల్పించారంటూ వృద్ధులు, వికలాంగులు టీడీపీ నేతలపై మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల డ్రామాలు ఎక్కడ వ్యతిరేకత వస్తుందోనని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డ్రామాలు మొదలుపెట్టారు. బుధవారం పట్టణంలోని సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీ వల్ల ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి వృద్ధులను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. ఇలా ఎందుకు కూర్చోబెట్టారు అంటూ సచివాలయ ఉద్యోగులను ప్రశ్నించారు. సచివాలయం బయటకు వచ్చి పింఛన్‌దారులతో మాట్లాడుతూ ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు కానీ టీడీపీ వల్లే పింఛన్లు ఇంటికి రావడం లేదని అంటున్నారన్నారు. ఎమ్మెల్యే నిమ్మల వెళ్లిపోయిన తర్వాత అక్కడున్న పింఛన్‌దారులంతా ఇంటికి పింఛన్లు రాకుండా ఈ టీడీపీ నాయకులే అడ్డుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వైఖరిపై పింఛన్‌దారుల ధర్నా పింఛను పంపిణీ విధానంపై చంద్రబాబు వైఖరి పట్ల లబ్దిదారులు నిరసన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో సచివాలయం వద్ద పింఛనుదారులు బుధవారం ధర్నా నిర్వహించారు. ప్రతి నెల వలంటీర్ల ద్వారా ఇంటికి వచ్చి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమాన్ని అడ్డుకున్న చంద్రబాబు వైఖరి నశించాలని నినాదాలు చేశారు. పాత పద్ధతిలో వలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గంగూరులో ‘బోడె’ శవ రాజకీయం టీడీపీ, జనసేన కుట్రలతో ఈసారి పింఛన్ ఇవ్వటానికి వలంటీర్ లేకపోవటంతో కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో వెంపటి వజ్రమ్మ (80)గుండెపోటుకు గురై మరణించింది. గంగూరు ఏఆర్ నగర్ కాలనీలో ఉంటున్న వజ్రమ్మ గంగూరు 2 సచివాలయానికి పింఛన్ సొమ్ము కోసం వెళ్లగా బ్యాంకు నుంచి సొమ్ము రావాలని, సాయంత్రం పింఛన్ ఇస్తామని చెప్పడంతో తిరిగి ఇంటికి వచ్చింది. సచివాలయం నుంచి ఇంటికి వచ్చిన కొద్ది క్షణాలకే గుండెపోటుకు గురై మృత్యువాత పడింది. మరోవైపు చేయాల్సిందంతా చేసి డ్రామాలకు టీడీపీ నేతలు తెరలేపారు. వజ్రమ్మ మృతిని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు యత్నించగా స్థానిక మహిళలు తీవ్ర అభ్యంతరం తెలిపి తిప్పికొట్టారు. వజ్రమ్మ మృతి సమాచారం తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి, పెనమలూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి జోగి రమేష్ బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వజ్రమ్మకు నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. కాగా.. మంత్రి అక్కడ ఉన్న సమయంలోనే టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ కూడా తన అనుచరులతో రావటంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ అభ్యర్థి బోడెప్రసాద్, అతని అనుచరులు కల్పించుకుని జగన్ పింఛన్ ఇవ్వకపోవటంతోనే వజ్రమ్మ మరణించిందంటూ ఆరోపించారు. బోడె ప్రసాద్ వ్యాఖ్యల పట్ల మహిళలు అభ్యంతరం తెలిపారు. వజ్రమ్మ మరణాన్ని శవ రాజకీయం చేయాలని టీడీపీ నేతలు చేసిన యత్నాన్ని లబ్ధిదారులే తిప్పికొట్టారు. వలంటీర్లు పింఛను ఇస్తే చంద్రబాబుకు బాధ ఏంటని బోడె ప్రసాద్‌ను మహిళలు, పింఛన్ లబ్ధిదారులు ప్రశ్నించారు. జగనన్న పాలనలో ప్రతి నెల వేకువజామునే వలంటీర్లు ఇళ్లకు వచ్చి పింఛన్ ఇస్తుంటే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని మండిపడ్డారు. వజ్రమ్మ అన్యాయంగా చనిపోయిందని, ఇప్పుడు పరామర్శించడానికి వచ్చారా అని నిలదీశారు. ఒక్కసారిగా మహిళలు తిరగబడటంతో టీడీపీ నేతలు వెనక్కి తగ్గారు. -
వైజాగ్ లో వెలుపెట్టిన పురందేశ్వరి...కూటమిలో కుంపటి
-
ఆ పార్టీల ఆట ముగిసింది!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జాతీయ పార్టీల పాత్ర ఏమిటి? అంటే, శూన్యమనే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అవును. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఎన్ని ఉన్నా, రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర రాజకీయాలు రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు వైసీపీ–టీడీపీల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో మూడో పార్టీగా పుట్టు కొచ్చిన జనసేన... స్థిరత్వం లేని చిల్లర పార్టీగానే మిగిలిపోయింది. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఉనికిని కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి. రాష్ట్ర విభజన తదనంతరం జరిగిన 2014 ఎన్నిక ల్లోనే హస్తం పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తు పుణ్యాన ఒకటో రెండో సీట్లతో ఉనికి చాటుకున్న బీజేపీ 2019 ఎన్ని కలలో ఒంటరిగా బరిలో దిగి కాంగ్రెస్ సరసన చేరింది. నిజానికి కాంగ్రెస్ కంటే, మరో మెట్టు కిందకు చేరింది. చివరకు ‘నోటా’తోనూ పోటీ పడ లేకపోయింది. వామపక్ష పార్టీలు, సీపీఐ, సీపీఎం పార్టీల సంగతి పక్కన పెడితే... ఏపీలో కాంగ్రెస్, బీజేపీల దీనస్థితికి కారణాలు ఏమిటని చూస్తే, ఇరు పార్టీల జాతీయ నాయకత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అని చెప్పవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ చావుకు చాలానే కారణాలు కనిపిస్తాయి. నిజానికి, అడ్డగోలుగా రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఒక ప్రధాన కారణంగా కనిపించినా, అంతకు ముందే ఆ పార్టీ అధిష్టానం స్వహస్తాలతోనే స్వీయ మరణ శాసనాన్ని సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలో ఒకటికి రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతోపాటుగా, కేంద్రంలో పదేళ్ళ విరామం తర్వాత, 2004లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో, అలాగే తిరిగి 2009లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరోమారు అధికా రంలోకి తీసుకురావడంలోనూ కీలక పాత్రను పోషించిన వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న తప్పుడు నిర్ణయం తెలుగు నాట కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేసింది. ఇప్పుడు ఆ వివరాలలోకి వెళ్ళవలసిన అవసరం అంతగా లేకపోయినా, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు ల్లోకెల్లా అతి పెద్ద తప్పు, మహానేత వైఎస్ వారసుడిగా ఎదిగివస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్‌ను మొగ్గలోనే తుంచేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన కుట్రపూరిత రాజకీయం ఆ పార్టీని తిరిగి కోలుకోలేని స్థాయిలో దెబ్బ తీసింది. వైఎస్సార్ మరణ వార్తను జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలిన అభిమానులను ఓదార్చేందుకు కూడా జగన్‌ని అనుమతించక పోవడం కాంగ్రెస్ అధిష్టానం చేసిన ఇంకో తప్పు. పొమ్మనకుండా పొగబెట్టి, జగన్ వదిలి పోయేలా చేయడం, కాంగ్రెస్ పెద్దలు చేసిన తప్పుల పరంపరలలో మరొకటి. ఇప్పుడు వైఎస్ కుటుంబాన్ని చీల్చి వైఎస్సార్ ఆత్మ క్షోభించేలా చేసింది కాంగ్రెస్. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పరిస్థితి కూడా అంతే. నిజానికి, ఓట్ల పరంగా చూస్తే, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంటే, బీజేపీ మరింత అధ్వాన్న స్థితిలో వుంది. అయితే, కేంద్రంలో అధికా రంలో ఉండడం వల్లనైతే నేమి, బీజేపీ జాతీయ నాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ ఆధిపత్య ధోరణి కారణంగా అయితేనేమి, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. అందుకే టీడీపీ–జనసేనలు దానితో పొత్తు పెట్టుకున్నాయి. నిజానికి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి త్రయానికి, మినహా మూడు పార్టీల్లోని నాయ కులు, కార్యకర్తలు ఎవరికీ ఈ పొత్తు అంతగా ఇష్టం లేదు. ఆ యా పార్టీ కార్యకర్తల సోషల్ మీడియా పోస్ట్‌లు, టిక్కెట్ దక్కని నాయకుల వీరంగాలూ ఇందుకు నిదర్శనాలు. చంద్రబాబు మోదీ పట్ల చేసిన విమర్శలు గుర్తుకొచ్చిన బీజేపీ కార్యకర్తలకు పొత్తు మింగుడుపడటం లేదు. ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని, హత్యలు ఉండవు’ అంటారు. ఈ పార్టీలు చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తూ ఉండడంతో అవి ఆత్మ హత్యలవైపు ప్రయాణిస్తున్నాయని చెప్పవచ్చు. – రాజనాల బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 99852 29722 -
బాబుకు చేజారిపోతున్న కుప్పం...పురందేశ్వరికి ఒరిజినల్ లీడర్స్ టెన్షన్
-
పొత్తుకు వ్యతిరేకంగా కుల సంఘాల ప్రచారం
-
చంద్రబాబు మాస్టర్ ప్లాన్...పురందేశ్వరి ఓటమి ఖాయం
-
పురందేశ్వరి చిచ్చు..మేం పని చేయలేం..తేల్చేసిన బీజేపీ నేతలు
-
సీట్లు బీజేపీవి..పెత్తనం బాబుది..పురందేశ్వరి ప్లాన్ సక్సెస్
-
ఆలూరు సీటు తీసుకునేందుకు సిద్ధమైన బీజేపీ
-
రెండుగా చీలిపోయిన ఏపీ బీజేపీ?!
-
పురందేశ్వరికి రూ.3 కోట్లిస్తే టీడీపీకి బీజేపీ టికెట్?
-
చంద్రబాబు, పురందేశ్వరి స్కెచ్.. ‘కళా’ కుటుంబంలో కుంపటి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళావెంకటరావు కుటుంబంలో చంద్రబాబు చిచ్చు రగిల్చారు. సొంత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆడుతున్న రాజకీయ ఆటలో కళా వెంకటరావు పావుగా మారారు. తూర్పు కాపు (బీసీ) సామాజికవర్గం నుంచి ఉత్తరాంధ్రలో వేగంగా ఎదిగిన ఆయన ఇప్పుడు టికెట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన దుస్థితి. గంటా శ్రీనివాసరావు వద్దు వద్దంటున్న చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లాలని వెంకటరావుకు చంద్రబాబు ఆఫర్ ఇస్తూనే, మరోవైపు అక్కడ టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కళా సోదరుడి కుమారుడైన కిమిడి నాగార్జున ఆశలపై నీళ్లు చల్లారు. విదేశాల్లో ఉద్యోగం వదులుకొని వచ్చి 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, మళ్లీ చీపురుపల్లిలో పార్టీని బతికించేందుకు ఐదేళ్లుగా కృషి చేస్తే తుదకు కరివేపాకులా తీసిపారేస్తున్నారంటూ నాగార్జున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం లోక్‌సభ ఆశ చూపించి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కళా వెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గాన్నే నమ్ముకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి గెలిచి మంత్రిగా పనిచేశారు. సహచర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నారా లోకేశ్‌కు సన్నిహితుడిగా ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. అయితే, ఆయన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పనికిరాడంటూ టీడీపీ అధిష్ఠానమే ఇప్పుడు ముద్ర వేస్తోంది. ఇందుకు ఐవీఆర్ఎస్ సర్వే కారణం చూపిస్తోంది. చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తారంటూ లీకులు ఇచ్చింది. అక్కడ వెంకటరావు సోదరుడు, ప్రస్తుత నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి కిమిడి నాగార్జున టికెట్ ఆశిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు చీపురుపల్లికి వెంకటరావును పేరును తేవడంతో కిమిడి కుటుంబంలో అగ్గిరాజుకుంది. తీవ్ర అసంతృప్తికి లోనైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నెల కిందటి వరకు నాగార్జున, మూడు రోజుల కిందటి వరకు గంటా శ్రీనివాసరావు, తాజాగా కళా వెంకటరావు.. ఇలా రోజుకో పేరును టీడీపీ అధిష్టానం తెరమీదకు తెస్తుండడంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారు. దీన్ని చక్కదిద్దడానికి కళా వెంకటరావు పేరు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్టు తాజాగా లీకులు ఇస్తున్నారు. ఫలించిన పురందేశ్వరి స్కెచ్ నడికుదిటి ఈశ్వరరావు (ఎన్ఈఆర్) ఇటీవలి వరకూ ఎచ్చెర్లలో గ్రామస్థాయి నాయకుడు. చంద్రబాబు సొంత సామాజికవర్గం నేత కావడంతో 2014–19 మధ్య కాస్త హవా చూపించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానంపై కన్నేసిన ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొని, పురందేశ్వరి పంచన చేరారు. ఆమె చలువతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవీ దక్కించుకున్నారు. ఇక్కడ బలమైన కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన రెడ్డి పావనిని తప్పించి మరీ ఈశ్వరరావుని జిల్లా అధ్యక్షుడిని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎచ్చెర్ల టికెట్ నేరుగా ఎన్‌ఈఆర్‌కు ప్రకటించకుండా నెమ్మదిగా స్కెచ్ అమలుచేశారు. తొలుత శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కోటాలో చూపించారు. అక్కడ గుండ లక్ష్మీదేవి కుటుంబం ఆందోళన చేయడంతో అది టీడీపీకే ఇచ్చేసి పొరుగున ఉన్న ఎచ్చెర్ల బీజేపీ కోటాలో వేసేశారు. తద్వారా ఎచ్చెర్ల టికెట్ తనదేనని ధీమాగా ఉన్న కిమిడి కళావెంకటరావు ఆశలపై నీళ్లు చల్లేశారు. ఇప్పుడు ఎన్ఈఆర్ను రంగంలోకి తెస్తున్నారు. బాబు పితలాటకంతో నాగార్జున బలి చంద్రబాబు, పురందేశ్వరి పెట్టిన పితలాటకంతో చీపురుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున బలవుతున్నారు. ఆయన తల్లి కిమిడి మృణాళిని 2014లో చీపురుపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండేళ్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ సమయంలో విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటున్న నాగార్జున రాజకీయాలపై ఆసక్తితో ఇక్కడకు వచ్చి టీడీపీలో చేరారు. 2019లో ఓడిపోయారు. అయినప్పటికీ నాగార్జునకు భవిష్యత్ ఉందని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. తీరా ఎన్నికలు వచ్చే సరికి నాగార్జున పనికిరాడంటూ చంద్రబాబు ముద్ర వేసేశారు. -
వదిన, మరిది కలిసి.. ఒరిజినల్ బీజేపీ లీడర్లకు షాక్..
-
ఎన్నికల టైమ్..అడ్డంగా దొరికిపోయాం
-
కమలనాథుల చెవిలో పువ్వులు పెట్టిన చంద్రన్న, పురందేశ్వరి
-
విశాఖ డ్రగ్ లింకులు.. లోకేష్ తోడల్లుడు, పురందేశ్వరి కుమారుడు
-
టికెట్ల లొల్లి.. ఏపీ బీజేపీలో అయోమయం
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఆ పార్టీ సీట్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపికపై బీజేపీలో అయోమయం నెలకొంది. బీజేపీకి కేటాయించిన కొన్ని సీట్లలో మార్పులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఓడిపోయే సీట్లని బీజేపీకి ఇచ్చారంటూ ఇప్పటికే అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గెలిచే సీట్లే ఇవ్వాలంటూ సీనియర్లు పట్టుబడుతున్నారు. సీనియర్ల ఫిర్యాదు నేపథ్యంలో ఏపీ బీజేపీ నేతలతో రెండు రోజుల క్రితం కోర్ కమిటీ చర్చించింది. బీజేపీ గెలిచే సీట్లు ఇవ్వాలంటూ కొన్ని స్ధానాలలో బీజేపీ మార్పులు కోరింది. బీజేపీ కోరిన సీట్ల కోసం హైదరాబాద్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు మరోసారి సమావేశమయ్యారు. బీజేపీ తాజా ప్రతిపాదనలు, సీట్ల మార్పులపై చర్చించారు. రేపు సాయంత్రం ఢిల్లీలో జరిగే బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఏపీ అభ్యర్ధులపై చర్చించే అవకాశం ఉంది. ఎల్లుండి కొన్ని స్ధానాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏపీ విపక్ష కూటమిలో తేలని సీట్ల పంచాయతీ ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజమండ్రి సీటు పురంధేశ్వరి, సోమువీర్రాజు కోరుతుండగా, వైజాగ్‌లో జీవీఎల్ పోటీ చేస్తానంటున్నారు. సీఎం రమేష్ అనకాపల్లి సీటు కావాలంటున్నారు. రాజంపేట సీటు కోసం కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అరకు టికెట్‌ను కొత్తపల్లి గీత ఆశిస్తున్నారు. ఏలూరు నుంచి పోటీ చేయాలని ఆంజనేయ చౌదరి భావిస్తున్నారు. తిరుపతి సీటు కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ ప్రయత్నాలు సాగిస్తుండగా, విజయనగరం సీటు కేటాయించాలని మాధవ్ కోరుతున్నారు. ఇదీ చదవండి: పవన్‌పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్‌గా పోటీ? -
బీజేపీ నేతల ఫిర్యాదుతో చిన్నమ్మకు క్లాస్ పీకిన కేంద్రం
-
చంద్రబాబుతో కలిసి పురంధేశ్వరి కుట్ర.. బీజేపీ నేతలు ఫిర్యాదు
-
ఏపీ బీజేపీలో ముసలం.. సీనియర్ల ‘రహస్య’ భేటీ
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీలో ముసలం ఏర్పడింది. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అరకుకి కొత్తపల్లి గీత, రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు ఇస్తుండగా, ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతలు రహస్య సమావేశం నిర్వహించినట్లు సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం పట్ల సీనియర్లు మండిపడుతున్నారు. జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై సీనియర్లు చర్చిస్తున్నారు. చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై కూడా చర్చిస్తున్నారు. పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలని సీనియర్లు అంటున్నారు. ఇదీ చదవండి: బాబు కన్నింగ్.. ఏపీ బీజేపీ గగ్గోలు ! -
విశాఖ ఎంపీ సీటుపై వదిన–మరిది డ్రామా!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఎంపీ సీటు విషయంలో అటు టీడీపీ ఇటు బీజేపీ పెద్ద డ్రామానే నడిపిస్తున్నాయి. పొత్తులు కడుతూనే వెనకాల నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు పోటీచేయాలో నిర్ణయిస్తూ చక్రం తిప్పుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి తమ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారని బీజేపీ నేతలు వాపోతున్నారు. అలాగే, విశాఖ ఎంపీ సీటు కోసం గత రెండేళ్లుగా పనిచేస్తున్న జీవీఎల్‌కు చెక్‌పెడుతూ పూర్వాశ్రమంలో టీడీపీలో పనిచేసిన సీఎం రమేష్‌కు ఆ స్థానం కేటాయించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పట్టుబట్టడం ఆ పార్టీలో చర్చనీయాంశమవుతోంది. మరోవైపు.. చంద్రబాబు కుటుంబానికే చెందిన భరత్ కాస్తా తనకు సీటు ఇవ్వకపోతే ఏమైనా చేసుకుంటానని.. దానికి మీదే బాధ్యత అని హెచ్చరించడంతో సీఎం రమేష్‌కు అనకాపల్లి సీటును కేటాయించేలా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో గతంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించి అప్పట్లో తనకు అనుకూలంగా ఉన్న వారికే ఇప్పుడు బీజేపీ సీట్లను కేటాయించేలా చక్రం తిప్పడంలో వదినకు మరిది (చంద్రబాబు) కూడా మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తనకు విశాఖ ఎంపీ సీటు కేటాయించకపోతే ఏ అఘాయిత్యానికి పాల్పడినా అందుకు మీరే బాధ్యులవుతారంటూ టీడీపీ నేత, లోకేశ్ తోడల్లుడు భరత్ స్పష్టంగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్‌కు కేటాయించేందుకు వీలుగా.. అందుకు జనసేన త్యాగం చేసేలా వదిన, మరిది చక్రం తిప్పుతున్నట్లు బీజేపీ శ్రేణులే అనుమానిస్తున్నాయి. మరోవైపు.. జనసేన నేతలు కూడా తమ పార్టీకి మొదట్లో ఇచ్చిన అరకొర సీట్లను సైతం అధినేత పవన్ వదలుకోవడాన్ని వారు తీవ్రంగా తప్పుపడుతున్నారు. మళ్లీ పాత రోజులే! మరోవైపు.. బీజేపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గతంలో పార్టీలో ఉన్న ఒక వృద్ధ నేత రాజకీయాలకు దూరంగా ఉండడంతో రాష్ట్రంలో బీజేపీ స్వయంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని భావించామని.. కానీ, ఇప్పుడు పురందేశ్వరి రూపంలో మళ్లీ పార్టీని బొందలో పెట్టే కార్యక్రమం నడుస్తోందని ఆ పార్టీ శ్రేణులు బహిరంగంగానే పార్టీ కార్యాలయంలో వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా వలస నేతలకు సీట్లను కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పేందుకు కొద్దిమంది సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలను అలాంటి వారికి అప్పగిస్తే తిరిగి పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారనే విషయాన్ని వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు వీరు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు లేఖ కూడా రాశారు. జీవీఎల్‌కు పురందేశ్వరి చెక్! ఇక విశాఖపట్నం ఎంపీ సీటు కోసం రెండేళ్లుగా జీవీఎల్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఇక్కడ పలు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ సమస్యల పరిష్కారం కోసం తన వంతు యత్నించారు. స్థానికంగా ఆయా వర్గాల్లో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు స్టీలు ప్లాంటు ప్రైవేటీకరణపై కేంద్రం ముందడుగులు వేస్తుంటే.. కార్మికుల్లో వ్యతిరేకత రాకుండా వారితో చర్చలు జరిపి.. మధ్యేమార్గాలను సూచించాలంటూ సమావేశాలను నిర్వహించారు. ఈ పరిస్థితుల్లో జీవీఎల్‌కు సీటు రాకుండా పురందేశ్వరి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. వెనుకనుండి కథ మొత్తం చంద్రబాబు నడిపించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు జీవీఎల్ వైజాగ్‌లో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా తమ అనుకూల మీడియాలో రాకుండా టీడీపీ నేతలు జాగ్రత్తపడ్డారు. అంతేకాక.. జీవీఎల్‌కు వ్యతిరేకంగా కథనాలను కూడా ప్రచురించారు. ఇప్పుడు ఏకంగా సీటు రాకుండా చేయడంతో జీవీఎల్ వర్గం కూడా మండిపడుతోంది. -
‘కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు..’
సాక్షి, కృష్ణా జిల్లా: కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్.. సీఎం జగన్‌ను ఏమీ చేయలేరన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు, పవన్, షర్మిల, పురందేశ్వరి తీరును ఎండగట్టారు. మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?. ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా?. పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా?. నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు’’ అని కొడాలి నాని గుర్తు చేశారు. రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయిందని మీరంతా కలిశారు. ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?. రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు. సీఎం జగన్‌ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం. పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు. పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా?. ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు. జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు. షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు. ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది. మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్‌కు ఏం సంబంధం?. తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా?. పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా?. రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా?. బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు. నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా?’ అంటూ కొడాలి ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు?. తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు. చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు. ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు. ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది. ఆ పార్టీని హుస్సేన్ సాగర్‌లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్‌ని సాధించాలని చూస్తోంది. కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. .ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ. డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా..’’ అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి: లోలోన కుమిలిపోతూనే.. పవర్ లెస్‌గా పవన్ కల్యాణ్ -
బీజేపీతో పొత్తు డౌటేనా?.. నేడు ఢిల్లీకి బాబు, పవన్
సాక్షి, ఢిల్లీ: బీజేపీ, టీడీపీ పొత్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం గందరగోళం మారింది. నిన్న అర్థరాత్రి బీజేపీ హైకమాండ్‌తో అభ్యర్థులు ఎంపికపై ఏపీ బీజేపీ నేతలు చర్చలు జరిపారు. పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రకటించిన పురంధేశ్వరి.. ఈరోజు మరోసారి హై కమాండ్‌తో సమావేశమవుతామని వెల్లడించారు. ఇక, ఆమె వ్యాఖ్యలతో టీడీపీ-బీజేపీ పొత్తుపై మరోసారి చర్చ మొదలైంది. అయితే, టీడీపీ మాత్రం మరో విధంగా వ్యవహరిస్తోంది. బీజేపీతో పొత్తులో భాగంగా ఐదు ఎంపీ సీట్లు, 11 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు రెడీ అంటూ లీకులు ఇస్తోంది. అటు బీజేపీ మాత్రం.. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లకు అభ్యర్థులను బీజేపీ తయారు చేస్తుంది. ఈ క్రమంలో నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. నేడు పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అర కొర సీట్లతో పొత్తుల వల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసమే తప్ప, బీజేపీకి లాభం చేసేందుకు టీడీపీ పొత్తు పెట్టుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. కాగా, చంద్రబాబు మార్కు రాజకీయాలు అన్నీ తెలిసిన బీజేపీ అధిష్టానం పొత్తులపై ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం. ఇక, టీడీపీని బీజేపీ చీదరించుకుంటున్నా చంద్రబాబు పొత్తుల కోసం పాకులాడుతున్నారు. బీజేపీని చంద్రబాబు, పవన్ బతిమాలే పరిస్థితికి వచ్చారు. మరోవైపు, చంద్రబాబును ఢిల్లీకి బీజేపీ ఆహ్వానించిందంటూ ఎల్లో మీడియా కథనాలు వండి వార్చుతోంది. బీజేపీతో టీడీపీ-జనసేన కూటమి పొత్తు వ్యవహారం ఢిల్లీకి చేరడంతో బీజేపీతో పొత్తు సంగతి తేలిన తర్వాతే టీడీపీ -జనసేన సెకండ్ లిస్ట్ విడుదల చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయానికి వచ్చారు. -
ప్రతిపాదిత అభ్యర్థుల జాబితా ఢిల్లీకి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ తరఫున పోటీచేసే ప్రతిపాదిత అభ్యర్థుల జాబితాలను శని, ఆదివారం జరిగిన సమావేశాల్లో సిద్ధంచేశామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. జాతీయ పార్టీ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ జిల్లాల వారీగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు, కన్వినర్లు, ఇతర ముఖ్యనేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. శనివారం 14 లోక్‌సభ స్థానాల పరిధిలో జిల్లా నాయకుల సమావేశాలు జరగ్గా.. ఆదివారం మిగిలిన 11 లోక్‌సభ స్థానాల సమావేశాలు జరిగాయి. అనంతరం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాలకు సంబంధించి ఆయా జిల్లాల నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాం. నియోజకవర్గాల వారీగా సామాజిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి.. అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందన్న వివరాలు అడిగి తెలుసుకున్నాం. ఈ జాబితాలను జాతీయ నాయకత్వానికి పంపుతాం. రాష్ట్రవ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసేందుకు రెండు వేలమందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండ్రోజుల సమావేశాల్లో అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. నిబంధనల ప్రకారం.. మేం ఇచ్చే జాబితాపై పార్టీ పార్లమెంటరీ బోర్డులో చర్చ జరుగుతుంది. అప్పుడు కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకులను పిలిచి అభ్యర్థుల తుది ఎంపికపై చర్చిస్తుంది. పొత్తుపై చర్చ జరగలేదు.. ఈ సమావేశాల్లో పొత్తుల గురించి ఎలాంటి చర్చ జరగలేదు. కేవలం అభ్యర్థుల ఎంపికకు సంబంధించే జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకున్నాం. పొత్తులపై జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ జాతీయ పార్టీ పొత్తులపై నిర్ణయం తీసుకునే పక్షంలో ఆ నిర్ణయాలకు అనుకూలంగా మేం మరోసారి సమీక్ష చేసుకుంటాం అని అన్నారు. -
టీడీపీతో బీజేపీ పొత్తు !..రాజ్ నాథ్ సింగ్ తో పురందేశ్వరి భేటీ
-
దత్త పుత్రుడా కదలి రా,వదినమ్మ కదలి రా.. కొత్తగా మరొకరు..!
-
పురందేశ్వరిపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫైర్
-
చంద్రబాబు,పురందేశ్వరికు దేవులపల్లి అమర్ కౌంటర్