సాక్షి, అమరావతి: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరిపై వైఎస్సార్ సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ‘‘పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్ అటెన్షన్’ లక్షణమే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో కూడా పోటీ చేసే పరిస్థితి లేదని విజయసాయిరెడ్డి ట్విటర్‌లో పేర్కొన్నారు.
పురందేశ్వరి గారు ‘సెలెక్టివ్ అటెన్షన్’ అనే మానసిక భ్రాంతిలో ఉన్నారు. తనకు కావాల్సిన వాటినే నమ్ముతారు. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా పట్టించుకోరు. దృష్టంతా ‘బావ’సారూప్య పార్టీకి, తమ కుటుంబానికి మేలు చేయడం పైనే. పచ్చపార్టీ ఆరోపణలను నిర్దారించుకోకుండా రిపీట్ చేయడం ‘సెలెక్టివ్…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023
అనుకుల మీడియా పెద్దలు, సొంత సామాజిక వర్గ హితులు, ఇతర పార్టీల్లోని స్లీపర్ సెల్స్ ప్రయోజనాల కోసమే తెలంగాణాలో టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది. దీన్ని ‘జెండా పీకేయడం’ అని ఎందుకు అనకూడదో బాకా మీడియా క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కూడా మిత్ర పక్షాలకు సీట్లు ఇవ్వాలి కాబట్టి టీడీపి 100 స్థానాల్లో…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 12, 2023
Comments
Please login to add a commentAdd a comment