
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వటర్ వేదికగా టీడిపీ అధినేత చంద్రబాబు పై మండిపడ్డారు. ఆయన తన ట్వీట్‌లో.. అగ్గి ఎక్కడ ఉందో అక్కడ నీళ్లు చల్లాలి. ఢిల్లీ వైపు చూసే ధైర్యం లేక రాష్ట్రంలో నీళ్లు కుమ్మరిస్తే జారి పడతావ్ బాబు. ఇప్పటికే మోకాళ్లు విరగ్గొట్టుకుని నడవలేక పాకుతున్నావు కనుక మంచం పాలు కాకుండా చూసుకోమని హితవు పలికారు. ప్రజలకు చంద్రబాబు మీద విశ్వసనీయత కోల్పోయిందని ఇక ఎన్ని గారడీలు చేసినా, నాటకాలాడినా వృథా ప్రయాస అవుతుందని పేర్కొన్నారు.
( చదవండి: ‘రఘురామను అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు’ )