
సాక్షి, అమరావతి: ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రోజున ట్విటర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్‌లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టే నీచ సంస్కృతిని గిన్నిస్ బుక్ రికార్డులకు తీసుకెళ్లిన ఘనత ప్రతిపక్షనేత చంద్రబాబుకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నంద్యాల బై ఎలక్షన్‌లో ఓటర్లకు డబ్బును పంచడం పరాకాష్టకు చేరిందని తెలిపారు.
తిరుపతిలో జరిగిన ఉపఎన్నికలో కేవలం అభివృద్ధిని మాత్రమే చూసి ఓటు వేయండని అడిగిన ఘనత సీఎం జగన్‌కే చెల్లుతుందని అన్నారు. డబ్బు ప్రబావం లేని ఎన్నికలకు సీఎం జగన్ నాంది పలికారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. కాగా, తిరుపతి ఉపఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17న జరిగిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక ఫలితాలు మే 2న వెలువడనున్నాయి.
చదవండి: టీడీపీలో సస్పెన్షన్ల కలకలం..