సాక్షి, తాడేపల్లి: ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘రాష్ట్రంలో పోలీసుల ప్రాధాన్యతలు మారిపోయాయి. మహిళలపై అఘాయిత్యాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీ పోలీసులు తమ వనరులను టీడీపీ రాజకీయ ఎజెండాకు మళ్లిస్తున్నారు. 680 మంది వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు నోటీసులు అందించారు. 147 కేసులు నమోదు చేసి, 49 మందిని అరెస్టు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను పక్కన పెట్టారు’ అని ఘాటు విమర్శలు చేశారు.
The priorities of the AP Police are misplaced. Amid rising crimes against women and increasing cybercrimes, the AP police is diverting significant resources to further TDP’s political agenda—serving notices to 680 YCP social media activists, filing 147 cases, and arresting 49…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 14, 2024
Comments
Please login to add a commentAdd a comment