
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలన తీరుపై మండిపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. సీఎం చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే.. అని కామెంట్స్ చేశారు. చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!. విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ.. ఆదాయాలు తెచ్చిపెట్టే మిగిలిన నగరాలపై లేకపోవడం చంద్రబాబు చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు.
చంద్రబాబుకి అమరావతి మీద ఉన్న ప్రేమ ఉత్తరాంధ్ర మీద లేకపాయే!
విశాఖ అభివృద్ధి గురించి చంద్రబాబు చెప్పే మాటాలు ఉత్త డాబు అని తెలిపోయింది.. విశాఖ నగరానికి కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు బడ్జెట్లో తగిన కేటాయింపులు లేకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అమరావతి మీద ఉన్న ప్రేమ... ఆదాయాలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) November 13, 2024
Comments
Please login to add a commentAdd a comment