![YSRCP MP Vijaya Sai Reddy Key Comments Over CBN An TDP Leaders](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/15/VSR.jpg.webp?itok=OC2rHRSk)
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కొందరు పచ్చ నేతలు పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు.. ప్రజలను వంచించడమే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వీర విధేయుల్లో' కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం. దాచేస్తే దాగని, మార్చలేని సత్యం! వీరు 1994-96 కాలంలో ఫిరాయింపుదారులు. ప్రజలకు మీడియాకు గుర్తుండదనుకోవడం వారి అజ్ఞానం. తాము పుట్టుకతోనే చంద్రబాబుకు విధేయులమని చెప్పుకోవడం సిగ్గుచేటు మరి ప్రజలని వంచించడమే.
వీళ్ళలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాడి వీరభద్రరావు, మాకినేని పెదరత్తయ్య, కె.ప్రతిభా భారతి, కిమిడి కళావెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, చిక్కాల రామచంద్రరావు, పరిటాల రవి, గాదె లింగప్ప, ముక్కు కాశి రెడ్డి, గౌతు శివాజీ, గద్దె బాబు రావు. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటుపొడిచి బహిష్కరణకు గురియైన వాళ్లలో చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, అశోకగజపతి రాజు ఉన్నారు. ఈ నేతల్లో 90 శాతానికి పైగా ఎన్టీఆర్ మరణించాక 1996 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ (ఎల్‌పీ) ఒక్క సీటూ దక్కించుకోకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు పార్టీలో చేరి 1997–2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ మంత్రివర్గం సభ్యులుగా, కొందరు ఎంపీలుగా, మరి కొందరు పార్టీ పదవులు పొందారు. మాయని మచ్చ-చరిత్ర క్షమించదు’ అంటూ కామెంట్స్ చేశారు.
నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వీర విధేయుల్లో' కొందరు 30 ఏళ్ల నాటి ఎన్టీఆర్–లక్ష్మీ పార్వతికి అత్యంత సన్నిహితులనేది వాస్తవం, చారిత్రక పరిణామం. దాచేస్తే దాగని, మార్చలేని సత్యం! వీరు 1994-96 కాలంలో ఫిరాయింపుదారులు. ప్రజలకు మీడియాకు గుర్తుండదనుకోవడం వారి అజ్ఞానం. తాము పుట్టుకతోనే…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 15, 2024
Comments
Please login to add a commentAdd a comment