సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో మద్యం అక్రమాలపై ట్విటర్(ఎక్స్) వేదికగా వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏకిపారేశారు. ‘‘మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు. రూ.1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. కళ్లద్దాల వల్ల పురందేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు. పున్నమ్మా.. దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా?’’ అంటూ ట్వీట్ చేశారు.
మద్యం ప్రివిలేజి ఫీజు తొలగించి చంద్రబాబు గారు, కొల్లు రవీంద్ర 1300 కోట్లు కొల్లగొట్టారు. 1500 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. పచ్చ కళ్లద్దాల వల్ల పురంధేశ్వరి గారికి ఇలాంటివి కనిపించవు. పున్నమ్మా! దాన్ని ఇప్పటి ప్రభుత్వానికి అంటగట్టేయత్నం చేయడం అన్యాయం అనిపించడం లేదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023
‘‘చంద్రబాబు.. బీజేపీలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టీడీపీ భజన చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టీడీపీ జిల్లా నాయకులను పురందేశ్వరి సలహా మేరకు రాష్ట్ర బీజేపీ నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది. 'బావ’సారూప్యం అంటే ఇదేనేమో!’’ అంటూ మరో ట్వీట్లో చురకలు అంటించారు.
చదవండి: సంతకం సాక్షిగా.. మద్యంలో ముడుపులు!
చంద్రబాబు గారు బిజెపిలోకి పంపించిన కోవర్టులంతా ఆ పార్టీని గాలికొదిలి టిడిపి భజన చేస్తున్నారు. క్రిమినల్ కేసుల్లో అరెస్టయి కడప జైలులో ఉన్న టిడిపి జిల్లా నాయకులను పురందేశ్వరి గారి సలహా మేరకు రాష్ట్ర బిజెపి నాయకులు పరామర్శించి సానుభూతి ఒలకబోయడం ఢిల్లీ పెద్దల దృష్టికి వెళ్లింది.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 25, 2023
Comments
Please login to add a commentAdd a comment