చంద్రబాబుకి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ
సాక్షి, అమరావతి: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక హితవు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కరపత్రాల రూపంలో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది.
దీనికి సంబంధించిన వివరాలను కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, కో–కన్వీనర్లు పంచాది రంగారావు, ఎన్.వి.రామారావు మీడియాకు విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment