Kapu associations
-
బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు
సాక్షి, అమరావతి: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దని చంద్రబాబుకు కాపు ఐక్యవేదిక హితవు పలికింది. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు చంద్రబాబుకు సోమవారం బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖను మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇంటింటికి కరపత్రాల రూపంలో పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను కాపు ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిపల్లి అయ్యప్ప, కన్వీనర్ పెద్దిరెడ్డి మహేష్, కో–కన్వీనర్లు పంచాది రంగారావు, ఎన్.వి.రామారావు మీడియాకు విడుదల చేశారు. మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి అవలంభిస్తున్నారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని గుర్తుచేశారు. కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు ఐదుశాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారని పేర్కొన్నారు. -
పవన్‌కు షాకిచ్చిన ఏపీ కాపు నేతలు
సాక్షి, కాకినాడ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించడంపై ఏపీ కాపు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని, లేదంటే పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కాకినాడలో జరిగిన కాపుల చర్చా గోష్టిలో నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నామని కాపు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ టీడీపీ పొత్తుతో మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతాడని అన్నారు. చంద్రబాబు ఒక దొంగ.. ఆయన మాటల్ని తాము నమ్మలేమని చెప్పారు. టీడీపీతో పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలని కోరుతున్నట్లు కాపు నేతలు చెప్పారు. అలా పోటీ చేస్తేనే కాపుల మద్దత్తు పవన్ కు ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చా గోష్టిలో కాపు నేతలు, న్యాయవాదులు,చిరంజీవి.. పవన్ అభిమానులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు కేసులో అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థలే -
బాబుతో దోస్తీ.. కాపులకు న్యాయమేది? పవన్‌ను ప్రశ్నించిన కాపు ఐక్యవేదిక
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): జనవాణి కార్యక్రమంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ వైఖరినే ప్రశ్నిస్తూ కాపు ఐక్యవేదిక వినతిపత్రం అందజేసింది. కాపు రిజర్వేషన్ల అంశం సహా కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలకు సంబంధించి పలు డిమాండ్లపై పార్టీ తరఫున బహిరంగ ప్రకటన చేయాలని అందులో డిమాండ్ చేసింది. 2014లో చంద్రబాబును గెలిపించడంలో కీలకపాత్ర పోషించిన పవన్.. కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని, అప్పట్లో టీడీపీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 6 నెలల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయలేదని ఐక్యవేదిక గుర్తుచేసింది. కాపు యువతకు టీడీపీ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయించలేకపోయావంటూ కూడా తప్పుపట్టింది. వినతిపత్రం అందజేసిన తర్వాత కాపు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ రావి శ్రీనివాస్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు. చదవండి👇 మా ఫ్లెక్సీలు తొలగిస్తావా? మళ్లీ కూసిన గువ్వ -
కాపు ఉద్యోగులపై ఇంత కక్షా?
కాపు సంఘాల విమర్శ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కాపు ఉద్యోగులపై వ్యతిరేక చర్యలు మానుకోవాలని కాపు జాగృతి చైర్మన్ చందూ జనార్ధన్, కాపునాడు రాష్ట్ర నాయకుడు గాళ్ల సుబ్రమణ్యం ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. కొందరు కాపు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆరోపించారు. కోస్తా జిల్లాల్లోని కాపు ఉద్యోగులు ముద్రగడ దీక్షకు మద్దతు పలికారన్న అక్కసుతో పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ విభాగాల్లోని కొందర్ని సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు. నిజాయితీ పరుడైన విజయనగరం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్యముర ళికి తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోమవారం ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. -
‘హామీలను విస్మరిస్తే మళ్లీ ఉద్యమిస్తాం’
సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే, మళ్లీ ఉద్యమిస్తామని కాపు సంఘాలు హెచ్చరించాయి. 50 ఏళ్లుగా కాపులు మోసపోతూనే ఉన్నార ని, గత అనుభవా ల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత కాపు సంఘం అధ్యక్ష, కా ర్యదర్శులు ఎంహెచ్రావ్, అద్దేపల్లి శ్రీధర్ సోమవారం పిలుపునిచ్చారు. పద్మనాభం దీక్ష విరమించడాన్ని హర్షిస్తూనే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని కోరారు. ఇదే అభిప్రాయాన్ని జంట నగరాల కాపు సం ఘాల కన్వీనర్ కఠారి అప్పారావు, కాపు రిజర్వేషన్ల పోరాట కమిటీ నేత నిమ్మకాయల వీర రాఘవులు నాయుడు, కాపు జాగృతి నాయకులు అభిప్రాయపడ్డారు.