సాక్షి, హైదరాబాద్: కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దీక్ష విరమణ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తే, మళ్లీ ఉద్యమిస్తామని కాపు సంఘాలు హెచ్చరించాయి. 50 ఏళ్లుగా కాపులు మోసపోతూనే ఉన్నార ని, గత అనుభవా ల దృష్ట్యా మరింత అప్రమత్తంగా ఉండాలని అఖిల భారత కాపు సంఘం అధ్యక్ష, కా ర్యదర్శులు ఎంహెచ్‌రావ్, అద్దేపల్లి శ్రీధర్ సోమవారం పిలుపునిచ్చారు.
పద్మనాభం దీక్ష విరమించడాన్ని హర్షిస్తూనే ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండాలని కోరారు. ఇదే అభిప్రాయాన్ని జంట నగరాల కాపు సం ఘాల కన్వీనర్ కఠారి అప్పారావు, కాపు రిజర్వేషన్ల పోరాట కమిటీ నేత నిమ్మకాయల వీర రాఘవులు నాయుడు, కాపు జాగృతి నాయకులు అభిప్రాయపడ్డారు.
‘హామీలను విస్మరిస్తే మళ్లీ ఉద్యమిస్తాం’
Published Tue, Feb 9 2016 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 PM
Advertisement