నేనొక్కడినే సంఘ విద్రోహ శక్తినా?: ముద్రగడ
నేనొక్కడినే సంఘ విద్రోహ శక్తినా?: ముద్రగడ
Published Tue, Aug 15 2017 1:30 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM
కిర్లంపూడి: మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి నుంచినిర్వహించ తలపెట్టిన పాదయాత్రను పోలీసులు సోమవారం కూడా అడ్డుకున్నారు. దీంతో ముద్రగడ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో నేనొక్కడినే సంఘ విద్రోహ శక్తినా, ఎవరికీ లేని ఆంక్షలను నాకెందుకు పెడుతున్నారు. నాకోసం పాదయాత్ర చేసి వస్తున్న వారిని అనుమతిస్తున్నారు, వారికి ఏ అనుమతులూ లేవు, చాలా గౌరవం ఇచ్చారు, సంతోషించాను. అదే పాదయాత్ర నేను చేస్తానంటే నాకెందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
చంద్రబాబుకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కావాలి: సినీనటి హేమ
చంద్రబాబుకి తగిన గుణపాఠం చెప్పేందుకు కాపుజాతి యావత్తు సిద్ధంగా ఉండాలని సినీ నటి హేమ పిలుపునిచ్చారు. సోమవారం ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడిలోని ఆయన ఇంటిలో కలిసి పాదయాత్రకు సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
Advertisement
Advertisement