సాక్షి, కాకినాడ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించడంపై ఏపీ కాపు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని, లేదంటే పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కాకినాడలో జరిగిన కాపుల చర్చా గోష్టిలో నిర్ణయం తీసుకున్నారు.
జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నామని కాపు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ టీడీపీ పొత్తుతో మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతాడని అన్నారు. చంద్రబాబు ఒక దొంగ.. ఆయన మాటల్ని తాము నమ్మలేమని చెప్పారు.
టీడీపీతో పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలని కోరుతున్నట్లు కాపు నేతలు చెప్పారు. అలా పోటీ చేస్తేనే కాపుల మద్దత్తు పవన్ కు ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చా గోష్టిలో కాపు నేతలు, న్యాయవాదులు,చిరంజీవి.. పవన్ అభిమానులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: చంద్రబాబు కేసులో అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థలే
Comments
Please login to add a commentAdd a comment