కాపు సంఘాల విమర్శ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కాపు ఉద్యోగులపై వ్యతిరేక చర్యలు మానుకోవాలని కాపు జాగృతి చైర్మన్ చందూ జనార్ధన్, కాపునాడు రాష్ట్ర నాయకుడు గాళ్ల సుబ్రమణ్యం ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. కొందరు కాపు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని బదిలీలు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆరోపించారు. కోస్తా జిల్లాల్లోని కాపు ఉద్యోగులు ముద్రగడ దీక్షకు మద్దతు పలికారన్న అక్కసుతో పోలీసు, ఎక్సైజ్, రెవెన్యూ విభాగాల్లోని కొందర్ని సుదూర ప్రాంతాలకు బదిలీ చేశారన్నారు.
నిజాయితీ పరుడైన విజయనగరం జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్యముర ళికి తక్షణమే పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోమవారం ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నంలలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కాపు ఉద్యోగులపై ఇంత కక్షా?
Published Mon, Jun 27 2016 3:25 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement