
సాక్షి, విశాఖపట్నం: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరీ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై పురంధేశ్వరికి అవగాహన లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఎంత అవసరమో అంతే నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చే ప్రతి రూపాయికీ లెక్క ఉంటుందని చెప్పారు.
తాము ప్రజలకు జవాబుదారీ అని పేర్కొన్న మంత్రి.. కొన్ని అప్పులు చేసినా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసమేనని తెలిపారు. పురంధేశ్వరి మరిది చంద్రబాబు హయాంలోనూ అప్పలు చేశారని, మరి నాడు బాబును ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు.
గత ప్రభుత్వ అప్పులపై బీజేపీ ఇలాగే మాట్లాడితే బాగుంటుందని చురకలంటించారు. టీడీపీ హయాంలో నిధుల దుర్వినియోగంపై పురంధేశ్వరికి తెలియదా?. దీనిపై ఆమె మాట్లాడరా? అని నిలదీశారు.
చదవండి: పోలవరంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది: అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment