సాక్షి, విశాఖపట్నం: టీడీపీ(TDP) సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath). పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని అమర్నాథ్ ఆరోపించారు.
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్(nara Lokesh) తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముచ్చర్లలో 1400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం. లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది. ముచ్చర్లలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. గ్రామంలో వైఎఎస్సార్‌సీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీలు లేవా?.
ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ పదవులను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 1350 ఓట్లకు గాను టీడీపీకి వైఎస్సార్‌సీపీకి మధ్య ఓట్ల తేడా 150 ఓట్లు మాత్రమే ఉంది. భీమిలీలో వైఎస్సార్‌సీపీకి బలమైన కేడర్ ఉంది. 100 శాతం సభ్యత్వం జరిగిందని లోకేష్ ముచ్చెర్ల గ్రామానికి ఎలా వస్తారు?. సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదు. కొన్ని చోట్ల బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారు. పక్క రాష్ట్రాల వారికి సభ్యత్వం ఇస్తున్నారు. సంక్షేమ పథకాలిస్తాం.. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు. గత ఏడు నెలల ప్రవచనాలు చెబుతున్న అనితా గురించి టీడీపీ గెజిట్ పేపర్ ఈనాడులో వచ్చింది. టీటీడీ లెటర్ అమ్ముకునే స్థితికి హోం మంత్రి అనిత పేషీ చేరుకుంది. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు టీటీడీ లెటర్ గురించి ఏం చెబుతారు మరి?. టీటీడీ లడ్డు గురించి రాద్ధాంతం చేసిన నేతలు ఏం చేస్తున్నారు?. మంత్రులు నెల వారీగా వసూళ్లు చేస్తున్నారు అని కామెంట్స్ చేశారు.
విశాఖలోని ముచ్చర్లలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment